English | Telugu
బిడ్డా.. ఆన్తలేదు.. సప్పుడు జర గట్టిగా చేయమను..
Updated : Aug 30, 2023
'భగవంత్ కేసరి' ఫస్ట్ సింగిల్ కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి.. సెప్టెంబర్ 1న ఈ పాట ఆగమనానికి ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. అయితే, ఈ లోపే ప్రోమోని రిలీజ్ చేసేశారు.
గణేశ్ ఉత్సవాల సందర్భంగా వచ్చే ఈ గీతం.. నటసింహం నందమూరి బాలకృష్ణ, శ్రీలీల బృందంపై సాగుతుంది. ఉత్సవం జరుగుతున్న సమయంలో శ్రీలీల చిందేస్తుంటే.. అప్పుడే వచ్చిన బాలయ్య "బిడ్డా.. ఆన్తలేదు.. సప్పుడు జర గట్టిగా చేయమను" అంటూ కంప్లైంట్ చేస్తారు. దానికి బదులుగా "అరె.. తీసి పక్కన పెట్టండ్రా మీ తీన్ మారు.. చిచ్చా వచ్చిండు.. ఎట్లుండాలి.. కొట్టర కొట్టు సౌమారు" అంటూ శ్రీలీల రియాక్ట్ అవుతుంది. మరి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ సాంగ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'భగవంత్ కేసరి'లో బాలయ్యకి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కానుంది.