English | Telugu
'మ్యాడ్'గా వస్తున్న ఎన్టీఆర్ బావమరిది
Updated : Aug 31, 2023
ఇంతవరకు హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కి గీతా ఆర్ట్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా సితార సంస్థ నార్నే నితిన్ తో చేస్తున్న చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. అలాగే టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు, టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.
కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'మ్యాడ్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర ఈ కొత్త చిత్రంతో నిర్మాతగా పరిచయమవుతుండటం విశేషం. నాగ వంశీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సాయి సౌజన్య, హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారు.
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ చూస్తుంటే యూత్ కి, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్ గా నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్స్ గా షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి వ్యవహరిస్తున్నారు.