English | Telugu
'పుష్ప-2' సీన్స్, డైలాగ్స్ లీక్.. థియేటర్స్ లో పూనకాలే!
Updated : Aug 30, 2023
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'పుష్ప: ది రూల్' ఒకటి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కట్టిపడేశాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి లీకైన డైలాగ్ లు అంచనాలను అమాంతం పెంచేశాయి.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ అల్లు అర్జున్ పై స్పెషల్ వీడియోని షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో పుష్ప-2 సెట్స్ లో బన్నీ ఉన్న విజువల్స్ కూడా చూపించారు. అందులో దర్శకుడు సుకుమార్ సీన్ పేపర్స్ పట్టుకొని బన్నీతో మాట్లాడటం గమనించవచ్చు. స్క్రీన్ షాట్ తీసి చుస్తే, ఆ సీన్ పేపర్స్ లో ఉన్న అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. "కేశవకి హీరో సారీ చెప్పడం ఇష్టం లేదు.. 'నేను చూసేది పుష్పనేనా' అనుకుంటాడు" అని రాసుంది. మామూలుగా పుష్పరాజ్ ది తగ్గేదేలే అనుకునే స్వభావం. ఎవరికీ సారీ చెప్పే రకం కాదు. అలాంటి పుష్పరాజ్ సారీ చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే పేపర్ స్టార్టింగ్ లో "బాబు నీకు ఇష్టం వచ్చినట్టు చేస్కో.. మళ్ళీ లాస్ట్ లో వచ్చి నువ్వు చెప్పమంటేనే చెప్పాను అని నన్ను అనకు" అంటూ హీరో, హీరోయిన్ మధ్య సంభాషణలను గమనిస్తే.. శ్రీవల్లి కోసమే పుష్ప సారీ చెప్పాడు అనిపిస్తుంది. ఇక ఆ పేపర్ లో ఉన్న చివరి డైలాగ్ అయితే.. సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లేలా ఉంది. "ముందు అయితే నీకు, షెకావత్ కే గొడవ మచ్చా.. కానీ ఇప్పుడు సిండికేట్ కూడా ఇన్వాల్వ్ అయింది." అని పుష్పతో కేశవ అన్నట్లుగా ఉంది. ఈ డైలాగ్ ని బట్టి చూస్తే రెండో భాగంలో పుష్ప కేవలం షెకావత్ తోనే కాదు, సిండికేట్ తో కూడా తలపడబోతున్నాడని అర్థమవుతోంది.