English | Telugu
మహేశ్ తో బాలయ్య హీరోయిన్.. జక్కన్నతో రీల్ టు రియల్ ఛాన్స్!
Updated : Aug 30, 2023
'బాహుబలి' సిరీస్, 'ఆర్ ఆర్ ఆర్'తో గ్లోబల్ డైరెక్టర్ అయిపోయారు దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి. త్వరలో ఈ స్టార్ కెప్టెన్.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో.. హాలీవుడ్ కి చెందిన కొందరు ప్రముఖ తారలు సందడి చేయనున్నారని బజ్. మహేశ్ తాజా చిత్రం 'గుంటూరు కారం' విడుదలయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో అందాల తార సోనాల్ చౌహాన్ నటించబోతోందని సమాచారం. 'రెయిన్ బో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సోనాల్.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' తో సాలిడ్ హిట్ చూసింది. ఆ తరువాత కొన్ని తెలుగు చిత్రాల్లో సందడి చేసినా ఆ స్థాయి విజయాల్లేవు. మరి.. మహేశ్, జక్కన్న కాంబో మూవీతోనైనా గుర్తుండిపోయే విజయం అందుకుంటుందేమో చూడాలి. అన్నట్టు.. 'రెయిన్ బో' చిత్రంలో రీల్ లైఫ్ హీరోయిన్ గా కథానుసారం రాజమౌళి దర్శకత్వంలో నాయికగా నటించింది సోనాల్. కట్ చేస్తే.. 15 ఏళ్ళ తరువాత రియల్ గానే జక్కన్న మూవీలో ఛాన్స్ అందుకోవడం ఆసక్తికరమైన విషయమే. ఇంతకీ.. సోనాల్ కి రాజమౌళి ఎలాంటి పాత్రని డిజైన్ చేశారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.