English | Telugu
నరేష్ రెండో భార్య చేసిన ఆరోపణలపై స్పందించిన నరేష్ తనయుడు నవీన్!
Updated : Aug 31, 2023
సీనియర్ నరేష్ తనయుడు నవీన్ హీరోగా కొన్ని సినిమాల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. సీనియర్ నటి పవిత్ర లోకేష్‌ను నరేష్ నాలుగో పెళ్ళి చేసుకోవడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. నరేష్, పవిత్ర ఉన్న హోటల్‌కి వెళ్ళి ఆయన రెండో భార్య చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. కృష్ణ చనిపోయినప్పుడు రమ్య రఘుపతి ఓ వీడియో విడుదల చేసింది. అందులో రమ్య చేసిన ఆరోపణలపై నవీన్ క్లారిటీ ఇచ్చారు. కృష్ణ మృతదేహాన్ని అనాథగా వదిలేశారని ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, మేమంతా ఉన్నాం కదా అని చెప్పారు. విజయనిర్మలగారితో తనకు ఎంతో అనుబంధం వుందని, ఆమె మరణించిన తర్వాత ఆ బాధ నుంచి బయట పడడానికి సంవత్సరం పట్టిందని అన్నారు. అలాంటిది 40 సంవత్సరాల పాటు కృష్ణగారు, విజయనిర్మలగారు కలిసి ఉన్నారని, ఆ జ్ఞాపకాల నుంచి ఆయన బయటపడలేకపోయారని, ఎంతో కృంగిపోయారని చెప్పారు. మేం ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళాలని ఎంతో ప్రయత్నించాం. కానీ, విజయనిర్మలగారి జ్ఞాపకాల వల్ల, ఆ ఇంటితో తనకున్న అనుబంధం వల్ల వదిలి రాలేకపోయారని అన్నారు. తమ ఫ్యామిలీ అందరికీ అటాచ్ మెంట్స్ ఎక్కువని, విజయనిర్మలగారు పోయాక కూడా అందరం మీట్ అయ్యే వాళ్లమని, కృష్ణ గారు కూడా పోయాకా... మహేశ్ బాబు ఇప్పటికీ మాట్లాడుకుంటామన్నారు.