English | Telugu

‘బలగం’ టీమ్‌లో విషాద ఛాయలు!


ఎలాంటి హైప్ లేకుండా సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బలగం మూవీ గురించి మనందరికీ తెలుసు. ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను ఈ మూవీ సొంతం చేసుకుంది. మంచి కంటెంట్ తో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. జబర్దస్త్ కమెడియన్ వేణు తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఐతే ఈ మూవీలో నటించిన ఒక నటుడు ఇటీవల మృతి చెందారు. డైరెక్టర్ వేణు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకుని ఎమోషల్ అయ్యారు. బలగం మూవీలో సర్పంచ్ పాత్రలో నటించిన నర్సింగం మరణించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పారు డైరెక్టర్ వేణు.

"మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకుని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి.. బలగం కథ కోసం .. రీసెర్చ్ చేస్తున్నప్పుడు... మొదటగా నర్సింగం బాపునే కలిసాను" అని వేణు అక్కడ కామెంట్ పెట్టారు. ఐతే ఈ నటుడు అనారోగ్య కారణం చేత చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన మృతి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బలగం మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి నిర్మించారు. సుధాకర్ రెడ్డి కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో దాదాపుగా ఆ షూటింగ్ చేసిన ఊరి వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే నర్సింగంకు కూడా పాత్ర ఇచ్చి వేణు నటింపజేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తీసే మూవీ కాబట్టి అక్కడి వాళ్ళే ఆ ఎమోషన్స్ ని బాగా పండిస్తారని వేణు ఒక సందర్భంలో అన్నారు. ఆయన ఆ నటుడి మృతితో వారి ఊరిలో విషాదఛాయలు అలుముకున్నాయి.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.