English | Telugu

‘జవాన్‌’ ధాటికి శెట్టి ద్వయం తట్టుకొని నిలబడగలదా?

సెప్టెంబర్‌ 7న ఏయే సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి అని ఎవరినైనా అడిగితే ఠక్కున వచ్చే సమాధానం ‘జవాన్‌’ అని. ఎందుకంటే ఆ సినిమా కోసం ఆడియన్స్‌ అంతలా ఎదురుచూస్తున్నారు. ఈమధ్యకాలంలో బాలీవుడ్‌ సినిమాకి ఇంత హైప్‌ రాలేదు. దానికి కారణాలు లేకపోలేదు. సౌత్‌లో దర్శకుడిగా మంచి పేరున్న అట్లీ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం, సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా చలామణి అయ్యే నయనతార, టాలెంటెడ్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి నటించడం ఒక స్పెషాలిటీ అయితే, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ సహా మిగతా టెక్నీషియన్స్‌ అంతా సౌత్‌ వారే కావడం. ఇన్ని ప్లస్‌ పాయింట్స్‌ ఉన్న ఈ సినిమాకి సౌత్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఇక అదేరోజు విడుదలవుతున్న స్ట్రెయిట్‌ తెలుగు మూవీ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. ఈ చిత్రానికి సంబంధించి అనుష్క, నవీన్‌ పొలిశెట్టి తప్ప చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు ఏమీ లేవు. పైగా సినిమా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసినప్పటికీ అనుష్క అందుబాటులో లేకపోవడం, నవీన్‌ పొలిశెట్టి ఒక్కడే ప్రమోషన్స్‌ను భుజం మీద వేసుకొని తిరగడం వంటివి సినిమాకి మైనస్‌లుగా కనిపిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీ ‘జవాన్‌’ ముందు ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ వంటి సినిమా తట్టుకొని నిలబడగలదా? అంటే డౌట్‌ అనే చెప్పాలి. అయితే ఏ సినిమా అయినా రిలీజ్‌ అయ్యే వరకు ఎవరూ ఏమీ చెప్పలేరు. కాబట్టి ఈ రెండు సినిమాల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది సెప్టెంబర్‌ 7న తేలిపోతుంది.