English | Telugu
‘కల్కి’ వీడియో లీక్డ్..!
Updated : Sep 5, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్నభారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898 AD’. అశ్వినీదత్ ఈ సినిమాను అసలు కాంప్రమైజ్ కాకుండా రూపొందించే పనిలోఉన్నారు. ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే హాలీవుడ్ తరహాలో సినిమా తెరకెక్కుతుందని, రాక్షసులు సృష్టించే మారణ హోమాన్ని ప్రభాస్ ఎలా ఆపారనే కథాంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో పకడ్బందీగా నిర్మిస్తోన్న ఈ చిత్రం నుంచి ఓ వీడియో లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. 23 సెకనుల నిడివి ఉన్న ఈ వీడియోలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, ప్రభాస్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు ఉంది. అసలు ఆమె ప్రభాస్‌ను అరెస్ట్ చేయటమేంటనేది ఇప్పుడు అందరిలోనూ క్యూరియాసిటీని కలిగిస్తోన్న అంశం.
‘కల్కి 2898 AD’ నుంచి వీడియో లీక్ కావటం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ అండ్ టీం ఇకపై లీకులు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ప్రభాస్, దీపికా పదుకొనె హీరో హీరోయిన్లుగా నటిస్తుంటే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తుండటం విశేషం. ఇక యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇందులో ప్రతినాయకుడిగా మెప్పించబోతున్నారు. త్వరలోనే ఆయనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది.
సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ విష్ణు మూర్తి అవతారంలో కనిపించబోతున్నారు. సినిమా రెండు భాగాలుగా రానుందని కూడా న్యూస్ హల్ చల్ చేస్తుంది మరి.