English | Telugu
అట్లీకి అన్ని హిట్లే.. పదేళ్ళలో ఇది మనోడి ట్రాక్ రికార్డ్!
Updated : Sep 8, 2023
అట్లీ.. నిన్నటి వరకు తమిళ్, తెలుగు పరిశ్రమలకే తెలిసిన పేరు. సరిగ్గా పదేళ్ళ క్రితం దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఈ 36 ఏళ్ళ సంచలనం.. కెప్టెన్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన 'జవాన్'తో అయితే బాలీవుడ్ లోనూ మనోడి పేరు మ్రోగిపోతోంది.
ఒకసారి అట్లీ ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే.. 2013 సెప్టెంబర్ లో విడుదలైన 'రాజా రాణి'తో తన దర్శకప్రస్థానం మొదలైంది. మొదటి సినిమాతోనే అద్భుత విజయం సాధించాడు. ఆపై 2016లో 'తెరి' (తెలుగులో 'పోలీస్'), 2017లో 'మెర్సల్' (తెలుగులో 'అదిరింది'), 2019లో 'బిగిల్' (తెలుగులో 'విజిల్').. ఇలా వరుసగా దళపతి విజయ్ తో మూవీస్ చేయడమే కాకుండా సదరు కోలీవుడ్ స్టార్ తో హ్యాట్రిక్ కొట్టేశాడు. అలాగే.. నాలుగు వరుస హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో చేసిన హిందీ మూవీ 'జవాన్'.. తనకి ఐదో సినిమా. ఇది కూడా బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపిస్తూ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవుతోంది. మొత్తమ్మీద.. అన్ని హిట్ బొమ్మలతో అట్లీ.. పదేళ్ళలో ఐదు వరుస విజయాలు అందుకోవడం నిజంగా సంచలనమే. మరి.. ఆరో చిత్రంతోనూ ఇదే జోరు కొనసాగించి డబుల్ హ్యాట్రిక్ కెప్టెన్ గా నిలుస్తాడేమో చూడాలి.