English | Telugu
ప్రముఖ హీరోయిన్ ఇంట చోరీ.. వారి పనేనా!
Updated : Sep 8, 2023
ఇటీవల సినీ సెలబ్రిటీల ఇళ్ళలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఐశ్వర్య రజనీకాంత్, శోభన, సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట చోరీ ఘటనలు మరువకముందే మరో సెలబ్రిటీ ఇంట దొంగతనం జరిగింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు చోరీకి గురయ్యాయంటూ సీనియర్ నటి నిరోషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐశ్వర్య , శోభన ఇళ్ళలో చోరీకి కారణం అక్కడ పనిచేసే సిబ్బందే అని ఇప్పటికే పోలీసులు తేల్చేశారు. విజయ్ ఏసుదాస్ ఇంట జరిగిన చోరీ కేసు మాత్రం దర్యాప్తు జరుపుతోంది. ఇక నిరోషా ఇంట బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాల చోరీ వెనక ఎవరున్నారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
'ఘర్షణ'తో నటిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన నిరోషా.. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో 'నారీ నారీ నడుమ మురారి', 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్', 'కొబ్బరి బొండాం' వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.