English | Telugu
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' తొలి రోజు కలెక్షన్స్.. రికవరీ శాతం ఎంతంటే..!
Updated : Sep 8, 2023
లేడీ సూపర్ స్టార్ అనుష్కా శెట్టి, టాలెంటెడ్ స్టార్ నవీన్ పోలిశెట్టి.. టైటిల్ రోల్స్ లో నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి పి. మహేశ్ బాబు దర్శకత్వం వహించారు. గురువారం (సెప్టెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి.. మిశ్రమ స్పందన వచ్చింది. రూ. 13.50 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ ముంగిట నిలిచిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.05 కోట్ల షేర్ ని, ప్రపంచ వ్యాప్తంగా రూ. 2. 70 కోట్ల షేర్ ని ఆర్జించింది. అంటే.. 20 శాతం రికవరీ చూసిందన్నమాట.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ.50 లక్షల షేర్
సీడెడ్ : రూ.10 లక్షల షేర్
ఆంధ్రా: రూ.45 లక్షల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.1.05 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 15 లక్షల షేర్
ఓవర్సీస్: రూ.1.50 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ : రూ.2.70 కోట్ల షేర్