నందమూరి తారకరామారావు అనే నేను.. 41 ఏళ్ల కిందట ఇదే రోజు సీఎంగా ఎన్టీఆర్ తొలి సారి ప్రమాణ స్వీకారం

సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. తారకరామడి పేరు తలుచుకోగానే  ఎవరికైనా చటుక్కున గుర్తుకు వచ్చేది ఆయన జగదేక సుందర రూపం. ఆయన ఒక నవ నవోన్మేష చైతన్య స్వరూపం . ఇటు సినీ జగత్తులోనూ, అటు రాజకీయ రణరంగంలోనూ అనితరసాధ్యమైన కీర్తి బావుటాను ఎగరేసిన ప్రతిభామూర్తి.  వెండితెరపై   అగ్రగామిగా నిలిచిన ఆయన రాజకీయాలలోనే తనకు తానే సాటి అని రుజువు చేసుకున్నారు.  నాయకుడిగా, మహానాయకుడిగా, ముఖ్యమంత్రిగా,  ప్రతిపక్ష నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజాజీవితంలో ప్రజలతో పెనవేసుకుపోయారు.  అయన రాజకీయ ప్రవేశమే ఒక ప్రభంజనం. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయన సొంతం. అప్పటి వరకూ రాష్ట్రంలో ఓటమి అనేదే ఎరుగని కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి, తిరుగులేని ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. సరిగ్గా 41 ఏళ్ల కిందట ఇదే రోజున ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  1983 జనవరి 9 తెలుగు కీర్తిపతాక ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడిన రోజు.  రాజకీయం జనం చెంతకు చేరిన రోజు.   తెలుగువాడి  తెలిసిన రోజు. తెలుగు జాతికి పండుగ రోజు. తెలుగు నేల పులకించిన రోజు. 35 ఏళ్ల అప్రతిహాత కాంగ్రెస్  అధికార పెత్తనానికి, తెలుగువారిని చిన్న చూపు చూసిన కాంగ్రస్ పాలనకు చరమగీతం పాడిన రోజు. ఔను సరిగ్గా 41 ఏళ్ల కిందట నందమూరి తారకరామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలి సారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు.   పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఎన్టీఆర్ అచ్చమైన ప్రజల మనిషి. అందుకే ఆయన  రాజభవన్ ఇరుకు గోడల మధ్య కాకుండా, ప్రజా సమక్షంలో   లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రజల సమక్షంలో బహిరంగ మైదానంలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం అదే ప్రథమం. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు.  హైదరాబాద్ నగరం ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొంది. అప్పటి గవర్నర్   కె.సి. అబ్రహం   ఏపీలో తొలి కాంగ్రెసేతర  ముఖ్యమంత్రి గా రామారావు  చేత పదవీస్వీకార ప్రమాణం చేయించారు. అచ్చ తెలుగులో ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం చారిత్రాత్మకం.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ ప్రజల కోసమే పని చేస్తానని చాటారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తానని చెప్పారు. ప్రజాసేవే తన అభిమతమని చాటారు.  అన్నట్లుగానే అవిశ్రాంతంగా  ప్రజాసంక్షేమం కోసమే పాటుపడ్డారు. అప్పటి దాకా అధికారమంటే  విలాసం, పెత్తనం అని భావించిన నేతలకు అధికారం అంటే బాధ్యత అని తెలిసొచ్చేలా చేశారు.  తనను సినీరంగంలో మకుటం లేని మహారాజుగా నిలబెట్టిన క్రమశిక్షణ,క్రమవర్తన,సమయపాలనలను ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోనూ కొనసాగించారు.  నిరాడంబరతకు ఆయన నిలువెత్తు రూపు. ముఖ్యమంత్రిగా అత్యంత విలాసవంతమైన భవనంలోకి మారే అవకాశం ఉన్నా, అందుకు ఆయన అంగీకరించలేదు. ఆబిడ్స్ లోని తన నివాసంలోనే ఉన్నారు. సీఎంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు.  ఖరీదైన కార్ల జోలికి పోలేదు. అంబాసిడర్ కారునే ఆయన సీఎంగా ఉన్న సమయంలోనూ వినియోగించారు. ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నో సౌకర్యాలను ఆయన తృణప్రాయంగా వద్దనేశారు.  అయితే ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఎన్నో కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. కిలో రెండు రూపాయలకే బియ్యం ఆయన ప్రారంభించిన పథకమే. ఇప్పుడు అదే పథకం దేశం మొత్తం ఆచరణలోకి వచ్చింది. బడుగుబలహీన వర్గాలకు పాలనలో, అధకారంలో భాగస్వామ్యం కల్పించిన ఎన్టీఆర్ వల్లే సామాన్యులలో సైతం రాజకీయ చైతన్యం వచ్చింది. ప్రశ్నించే ధైర్యం ఇచ్చింది.  చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగువారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్.. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల సంక్షేమం,  మహిళల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్  అహరహం తపించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, పేదల పాలిట పెన్నిధి అయ్యారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారు అయ్యారు. అందుకే ఎన్టీఆర్ తెలగు కీర్తి, తెలుగుఠీవి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా ఎప్పటికీ జనం గుండెల్లో కొలువై ఉంటారు. 

ఎన్టీఆర్ స్మారక నాణెం.. విక్రయాల సునామీ.. ఇప్పుడు ఏపీలో కూడా!

ఎన్టీఆర్ స్మారక  నాణెం ఏపీలోనూ అందుబాటులోనికి  రానుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ మింట్ కాంపౌండులోనే లభ్యమైన ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెలు.. ఇకపై విజయవాడ, విశాఖ  నగరాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక కౌంటర్లు ద్వారా వీటిని ఏపీలోకి అందుబాటులోకి తీసుకువస్తున్నారు.   ఏపీలో అమ్మకానికి మరో 12 వేల నాణేల ముద్రణకు కేంద్రం అనుమతించింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ముఖచిత్రంతో 100 రూపాయల నాణెంను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కాయిన్‍ను  ఆగస్ట్ 28  ఢిల్లీలోని రాష్ట్రపతి కల్చరల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి నందమూరి కుటుంబీకులు బాలకృష్ణ, జయకృష్ణతోపాటు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.  ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగువారు దైవసమానంగా భావించే హీరో, శక పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు. సినీ, రాజకీయ రంగాలలో ఎన్టీఆర్ అధిరోహించని ఎత్తులు లేవు. ఆయనను అభిమానించని తెలుగువాడు ఉండడు. అటువంటి ఎన్టీఆర్  గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగుజాతి ఉన్నన్నాళ్ళు ఆయన నామం చిరస్మరణీయం. అందుకే ఆయనకు సంబంధించి ఏ చిన్న అంశమైనా తెలుగు వారంతా తమ సొంతంగా భావిస్తారు. ఆయనకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం ఎవరు  చేపట్టినా తెలుగు జాతి ఉమ్మడిగా కదిలి వస్తుందనడానికి ఎన్టీఆర్ స్మారక నాణేం విక్రయాలే ఉదాహరణ. ఆగస్టు 28న  విడుదలైన ఈ నాణేన్ని అదే నెల 29  నుంచి ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో విక్రయానికి అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ లోని సైఫాబాద్, చర్లపల్లిలోని మింట్ లో అమ్మకాలు చేపట్టగా తొలిరోజే విశేష స్పందన లభించింది. ఆ రెండు కేంద్రాల్లో కలిపి తొలిరోజు ఐదు వేల వరకు నాణేల  విక్రయాలు జరిగాయి. కొద్ది నిమిషాల్లోనే ముద్రించిన నాణేలన్నీ విక్రయాలు జరిగిపోగా.. మరోవైపు ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించిన కొద్ది గంటలకే వెబ్‌సైట్‌లో అవుటాఫ్ స్టాక్ బోర్డు పెట్టారు.  సాధారణంగా  స్మారక నాణేలకు పెద్దగా డిమాండ్ ఉండదు. అందుకు భిన్నంగా ఎన్టీఆర్ నాణేలకు విపరీతమైన డిమాండ్ ఉండటం ఆయన పట్ల తెలుగువారి అభిమానానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏ స్మారక నాణేనికి లేని డిమాండ్ ఎన్టీఆర్ నాణేనికి ఉందని మింట్ ఫైనాన్స్ జాయింట్ జనరల్ మేనేజర్ గుండపునీడి శ్రీనివాస్ అప్పట్లోనే చెప్పారు.  ఇప్పటి వరకూ విడుదల చేసిన నాణేలేవీ  పదివేలకు మించి ముద్రించలేదని, ఎన్టీఆర్ నాణేనికి డిమాండ్ ఉంటుందని భావించి ముందుగానే 12వేలు ముద్రించామని, అయితే అవి తొలిరోజే అమ్ముడవడం విశేషమని శ్రీనివాస్ చెప్పారు.  ఆ తరువాత మరో రెండు విడతలుగా 13 వేల ఎన్టీఆర్ స్మారణ నాణేలను ముద్రించగా అవీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. స్మారణ నాణేల విక్రయాలలో ఎన్టీఆర్ స్మారక వందరూపాయల నాణెం గత రికార్డులనన్నిటినీ అధిగమించేసింది. ఎన్టీఆర్ నాణేనికి ముందు వరకూ స్మారక నాణేల విక్రయాల రికార్డు 12వేలు మాత్రమే. అయితే ముద్రణ అయిన రెండు నెలలలోనే పాతిక వేల ఎన్టీఆర్ స్మారణ నాణేల విక్రయం జరిగింది. ఇప్పుడు ఏఫీలో అందుబాటులోకి తీసుకురావడానికి మరో 12 వేణ నాణేలను ముద్రిస్తున్నారు.  

హవ్వ.. జగన్ బలం ఇదా? గాలి తీసేసిన సజ్జల భార్గవ్!

జగన్ మోహన్ రెడ్డి పాలనపై మీడియా విమర్శలు చేస్తే.. అలా విమర్శించే మీడియాను  వైసీపీ నేతలు   ఎల్లో మీడియాగా వక్రీకరిస్తారు.  ప్రజలు తమ ఆవేదనను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో వినిపించినా అలా వినిపించే వారంతా పెయిడ్ ఆర్టిస్టులని ముద్ర వేస్తారు.  ఇక ప్రతిపక్షాలు ఏకమైనా జగన్ మోహన్ రెడ్డిని ఏం చేయలేరని వైసీపీ బ్యాచ్ సెలవిస్తుంటుంది. ప్రజల అండ జగన్ మోహన్ రెడ్డికి పుష్కలంగా ఉందని.. ప్రజల ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి ఉండగా ఎవరూ ఏమీ చేయలేరని ప్రకటనలు కుమ్మేస్తుంటారు. అయితే, ఇదంతా నిజమా.. ఏపీ ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డిపై అంత మంచి అభిప్రాయంతో ఉన్నారా అంటే అది ఎంత మాత్రం నిజం కాదు. జగన్ సభల నుంచి పారిపోతున్న జనమే అందుకు నిదర్శనం. అన్ని వర్గాల ప్రజల నుంచీ వస్తున్న వ్యతిరేకతే తార్కాణం. అయితే మరి   వైసీపీ ధైర్యం ఏమిటి? అందరూ, అన్ని వర్గాలూ దూరమౌతున్నా.. మా ఓటర్లు వేరు. మా బలం వేరు అంటూ ధీమాగా ఎలా చెప్పుకుంటోంది.   ఒక వైపు జనం మా నమ్మకం నువ్వు కాదు జగన్ అని ముఖం మీద చెప్పేస్తున్నా మా ఓటర్లు మీరు కాదు, మా బలం మీరు కాదు అని వైసీపీ చెప్పుకుంటోంది. వైసీపీ ఓటర్లు వేరు అంటే ఏమిటో ఇప్పటికే అర్ధమైపోయింది. పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్ల తొలగింపుతో ఎన్నికల గండం గట్టెక్కేయగలమన్న ధైర్యంతోనే ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు వేరు అని ధైర్యంగా చెప్పగలిగారు. అయితే తెలుగుదేశం అలర్ట్ గా ఉండి ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడంతో ఆ పప్పులు ఉడికే పరిస్థితి లేకపోయింది.  ఇక ఇప్పుడు అదే సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడు, వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జ్ అయిన సజ్జల భార్గవరెడ్డి వైసీపీ బలం ఏమిటో, ఎవరో చెప్పేశారు. జగన్ జనాలను నమ్ముకోలేదనీ, ఆయన బలం, బలగం వేరే అని స్వయంగా వెల్లడించారు. తమ పార్టీ నమ్మకున్నది ప్రజా బలాన్ని కాదనీ, గొబెల్స్ ప్రచారాన్ని మాత్రమేననీ కుండబద్దలు కొట్టేశారు.  ఉన్నది లేనట్లుగా.. అబద్దాన్ని కూడా నిజమే అనిపించేలా  నమ్మించగలిగే  సోషల్ మీడియాయే తమ బలం అని దాపరికం లేకుండా చెప్పేశారు.  సోషల్ మీడియా ద్వారా జగన్ లాంటి నాయకుడు ఇక దొరకరని, అసలు జగన్ మోహన్ రెడ్డి లాంటి నేత దొరకడం ఏపీ ప్రజల అదృష్టమని ప్రజలను నమ్మించగలమనీ, అదే తమ బలం అని సజ్జల భార్గవరెడ్డి ఉవాచ.  ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం  బాగా విస్తృతమైన సంగతి తెలిసిందే. అయితే, ఏదైనా ఒక విషయాన్ని పదేపదే చూసినా.. పదేపదే చదివినా ప్రజలు నమ్మేస్తారని.. ఎక్కువసార్లు చర్చ జరిగిన అంశం పట్ల ప్రజలలో సానుకూలత పెరుగుతుందని చెప్పిన సజ్జల భార్గవరెడ్డి,  వైసీపీ ఇప్పుడు 15 వెబ్ సైట్స్, 40 యూట్యూబ్ చానెల్స్, 200 ఇంస్టాగ్రామ్ పేజెస్ ని పోషిస్తున్నదని వెల్లడించారు.   వీటి ద్వారా జగన్ పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, ఎన్నడూలేని విధంగా జగన్ పరిపాలన సాగిందని, మరోసారి ప్రజలంతా జగన్ కు అండగా ఉండాలని, మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని భజన చేసి ప్రజలను నమ్మించేస్తామనీ, నమ్మించేయగలమనీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  నిజానికి భార్గవ్ చెప్పిన సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ సంఖ్య చాలా తక్కువని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది కాలంగా  వైసీపీ వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానెల్స్ ను కొనేసింది. వందల సంఖ్యలో సోషల్ మీడియా ఖాతాలను సొంతం చేసుకుంది. వీటి కోసం వందల కోట్లు ఖర్చు చేసింది. కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయగల సోషల్ మీడియా సెలబ్రిటీలు, వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్స్ నడిపే వారికి కూడా వైసీపీ భారీ స్థాయిలో డబ్బు ఆశ జూపి గాలమేసి లాగేసింది. వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ వీటిని కొనేసి వాటి ద్వారా టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేసింది. మరో వైపు ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల యాడ్స్ వచ్చేలా ప్రకటనలు కుమ్మేస్తున్నది. వందల కోట్లు ఖర్చు చేసి సాక్షాత్తు యూట్యూబ్ లాంటి సంస్థలతోనే ఒప్పందాలు చేసుకొని ఈ ప్రకటనలు ఇస్తున్నది.  దీనిని బట్టి చూస్తే రానున్న ఎన్నికల కోసం వైసీపీ ఈ డిజిటల్ ప్రచారంపైనే ఆధారపడిందని, దానినే నమ్ముకున్నదని స్పష్టంగా అర్ధమవుతున్నది. ఏపీ ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఏ సర్వే ఫలితాలు చూసినా జగన్ పార్టీకి ఘోర ఓటమి తప్పదని తేల్చి చెప్పేస్తున్నాయి. తమ పాలనపై తమకే కాదు, జనానికీ నమ్మకం లేదని తేలిపోవడంతో..   వైసీపీ ఇప్పుడు పూర్తిగా డిజిటల్ ప్రచారాన్ని నమ్ముకున్నట్లు తెలిసిపోతున్నది. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఇన్ చార్జ్ సజ్జల భార్గవ్ ఇదే విషయాన్ని ఓ పార్టీ కార్యక్రమంలో వెల్లడించారు. తమకు ఇన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఇంత బలం ఉందంటూ సజ్జల చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు అదే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తండ్రి సజ్జల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సమయంలో తమ ఓటర్లు వేరే ఉన్నారంటూ వ్యాఖ్యలు చేయగా.. కుమారుడు సజ్జల తమ బలం వేరే ఉందంటూ వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

కేశినేని శ్వేత రాజీనామా.. కుమార్తె రాజకీయ జీవితాన్ని నాశనం చేయొద్దంటూ నానికి హితవు!

గత వారం రోజులుగా తెలుగుదేశం బెజవాడ రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్‌ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నానీకి ఈసారి టికెట్ లేదని టీడీపీ అధిష్ఠానం తేల్చేయడంతో పాటు ఇకపై నియోజకవర్గ రాజకీయాల్లో కూడా ఎక్కువ జోక్యం చేసుకోవద్దని సూచించింది. దీంతో ఆయన పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటనకు కూడా చేయగా..  లోక్‌సభ స్పీకర్ అపాయింట్‌మెంట్‌ దొరికితే ఢిల్లీ వెళ్లి తన రాజీనామా సమర్పించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇప్పటి వరకూ నానీ రాజీనామా చేయనున్నట్లు, తెలుగుదేశం పార్టీని వీడనున్నట్లు ప్రకటించారే కానీ ఆ పని ఇంకా చేయలేదు. కానీ, కేశినేని నాని కుమార్తె శ్వేత మాత్రం తండ్రి కంటే ముందే ఆ పని చేశారు. శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. మేయర్ భాగ్యలక్ష్మికి తన రాజీనామా లేఖ సమర్పించారు. అక్కడ అమోదం పొందిన తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. యధావిధిగా తండ్రి బాటలోనే కుమార్తె కూడా రాజీనామా అనంతరం తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.  అయితే, నానీ రాజీనామా వార్తపై పెద్దగా తెలుగు దేశం శ్రేణులు స్పందించలేదు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా నానీ పనిచేస్తున్నారని, ఎంపీగా పార్లమెంట్ పరిధిలోని, ఎమ్మెల్యేలు, ఇన్ చార్జీలకు సహకరించడం లేదని చాలాకాలంగా ఆయనపై విమర్శలు ఉన్నాయి.  ఆ కారణంతోనే నానీతో తెలుగుదేశం అధిష్టానంకు సఖ్యత కొరవడిందని కూడా తెలుగుదేశం వర్గాలే బహిరంగంగా చెప్పాయి. ఈ కారణంగానే తెలుగుదేశం అధిష్టానం ఈసారి కేశినేని నానీ స్థానంలో ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. నిజానికి ఈ స్థానంపై తెలుగుదేశం ఎన్నో కసరత్తులు చేసింది. పలుమార్లు నానీని హెచ్చరించింది. అయితే నానీ మాత్రం బహిరంగంగానే తన అహంకార ధోరణిని చూపించారు. క్రమశిక్షణకు పెద్ద పీట వేసే తెలుగుదేశంలో ఉండి కూడా నానీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. పర్యవసానంగా పార్టీ అతన్ని పక్కకి పెట్టి తమ్ముడిని లైన్లో పెట్టింది. దీంతో నానీ ఇప్పుడు పార్టీని వీడివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే తెలుగు దేశం శ్రేణులు కూడా నానీ రాజీనామాను లైట్ తీసుకున్నాయి. కానీ, నానీ కుమార్తె శ్వేత రాజీనామాపై మాత్రం తెలుగుదేశం శ్రేణులు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. శ్వేతా రాజీనామా ప్రకటన చేసిన సోషల్ మీడియాలోనే కుమార్తె విషయంలో నాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. ఇంత తెలిసిన నానీ తన కుమార్తె రాజకీయ జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారని నెటిజన్లు, టీడీపీ సానుభూతిపరులు విరుచుకుపడుతున్నారు. బోలెడంత భవిష్యత్తు ఉన్న శ్వేత రాజకీయ జీవితాన్ని నానీ చేజేతులా చెడగొట్టేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. బెజవాడ రాజకీయాలలో చురుకైన యువనేతగా ఉన్న శ్వేత తెలుగుదేశంలో ఉంటే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని.. కానీ నానీ తన పంతం, పట్టుదల, అహంకారంతో ఆమె రాజకీయ జీవితాన్ని ఫణంగా పెడుతున్నారని తీవ్రంగా మండిపడుతున్నారు. నానీ తన పొలిటికల్ కెరీర్ ను తానే నాశనం చేసుకొని.. ఇప్పుడు తన కుమార్తె కెరీర్ ను కూడా తానే పక్కన ఉండి నాశనం చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి నానీ ఈ స్థాయికి చేరుకోవడం వెనక చాలా శ్రమ ఉంది. ఒకప్పుడు విజయవాడ ఆటో నగర్ లో తన జీవితాన్ని ప్రారంభించిన నానీ.. ట్రావెల్స్ లో ఒక బ్రాండ్ సృష్టించుకొని అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాలలోకి వచ్చారు. తెలుగు దేశం పార్టీలో చేరి పదేళ్లు ఎంపీగా పనిచేశారు. అధికారంలో ఐదేళ్లు, ప్రతిపక్షంలో ఐదేళ్లు పనిచేశారు. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మంచి గుర్తింపు కూడా దక్కించుకున్నారు. అయితే, ఇప్పుడు ఉన్నట్లుండి ఆయన రాజకీయ జీవితం అగాధంలో పడింది. దీనికి నాని స్వయంకృతాపరాధమే అని చెప్పక తప్పదు. ఇంత జర్నీలో నానీ ఎంతో శ్రమ పడి ఈ స్థాయికి చేరుకున్నా.. కేవలం ఒకే ఒక్క తప్పుతో శూన్యంలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. తనతో పాటు తన కుమార్తెను కూడా జీరో స్థాయికి దిగజారేలా తోడు తీసుకెళ్లడం బాధాకరంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి నానీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో.. కుమార్తె రాజకీయ ప్రయాణం కోసం నానీ ఏమైనా కొత్త మార్గాలు అన్వేషిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

ఆ రెండూ కాదు మెట్రోభవన్ ఫైనల్ ... సిఎం కార్యాలయం ఇదే 

ప్రగతి భవన్ కాస్తా ప్రజా భవన్ గా నామకరణం చేసిన తర్వాత  ఇక్కడే నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కార్యాలయం అని ముందుగా అనుకున్నప్పటికీ తాజాగా బేగంపేట మెట్రోభవన్ అని వార్తలందుతున్నాయి. ప్రజా భవన్ డిప్యూటి సిఎం నివాసంగా మార్చిన తర్వాత ఎంసిఆర్ హెచ్ ఆర్ డి,నానక్ రాంగూడలోని గ్రోత్ కారిడార్ అని వార్తలు వెలువడినప్పటికీ తాజాగా  బేగంపేటలోని మెట్రోభవన్ సిఎం క్యాంపు కార్యాలయం అని విశ్వసనీయ సమాచారం.  సీఎం క్యాంపు కార్యాలయం కోసం బేగంపేట్‌లోని మెట్రో భవనాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రెండు మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ అవి ట్రాఫి క్‌, సెక్యూరిటీపరంగా అనుకూలంగా లేక చివరికి మెట్రో భవన్‌ అయితే అనుకూలంగా ఉం టుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న ప్రగతిభవన్‌ను ఇతర అవసరాలకు వినియోగిస్తుండటంతో కొత్తగా సీఎం కోసం క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం సీఎం స్వయంగా ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనాన్ని పరిశీలించి అక్కడే ఖాళీ స్థలంలో క్యాంపు కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో ఉద్యోగులు, అధికారులకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్కడినుంచి సచివాలయం వరకు ఉండే రోడ్డు అత్యంత ట్రాఫిక్‌ రద్దీతో ఉంటుంది. దీంతో క్యాంపు కార్యాలయానికి వచ్చిపోయే సందర్శకులతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ సందడిగా మారే అవకాశం ఉండటంతో మరోచోట క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంసిఆర్ హెచ్ ఆర్డీలోని ఖాళీ స్థలంలో ఆఫీస్ నిర్మించాలనుకున్నా.. ఆ ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. అలాగే నానక్‌రామ్‌గూడలోని గ్రోత్‌ కారిడార్‌ బిల్డింగ్‌ను సీఎం క్యాంప్ ఆఫీసుగా మార్చే అంశంపై పరిశీలనలు జరిగినా అదీ వర్క్‌ ఔట్ కాలేదని తెలిసింది. తాజాగా బేగంపేట్‌లోని మెట్రో భవనాన్ని సీఎం క్యాంప్ ఆఫీసుగా ఖరారు చేసినట్టు సమాచారం. రెండుమూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ ట్రాఫిక్‌, సెక్యూరిటీపరంగా అనుకూలంగా లేక చివరికి బేగంపేట్‌ మెట్రో భవన్‌ అయితే అన్నింటికీ అనుకూలంగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

ఆర్జీవీ జగన్ భజనకు పరాభవం?.. బెడిసికొట్టిన వ్యూహం?

నిత్యం వివాదాలతో  సహవాసం చేసే రామగోపాల్ వర్మకు ఇప్పుడు తత్వం బోధపడినట్లుగా కనిపిస్తుంది. ఎవరేమంటే నాకేం.. నా దారి నాది.. నా తీరు నాది అన్నట్లుగా సామాజిక మాధ్యమంలో చెలరేగిపోయే రామ్ గోపాల్ వర్మ తాజాగా తన x ఖాతాలో పెట్టిన పోస్టు నిర్వేదం , నిస్తేజం , తీవ్ర వేదనలో ఆయన ఉన్నట్లుగా కనిపిస్తుంది.  ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తూ , సెటైర్లు వేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే వర్మ  తాజా ట్వీట్ లో మాత్రం తీవ్ర దుఖ సాగరంలో మునిగిపోయి, ఆ  బాధను వెళ్ళగక్కుకుంటూ చేసిన ట్వీట్‌  ఆయన గురించి తెలిసినన వారందరినీ విస్తుపోయేలా చేసింది. ఒక్కసారి వర్షం ఆగితే గొడుగు భారం అవుతుంది... ప్రయోజనాలు ఆగిపోయినప్పుడు విధేయత ముగుస్తుంది. ఇది అన్ని రాజకీయాల వెనుక ఉన్న వన్‌ లైన్‌ స్టోరీ’ అంటూ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున రామ్ గోపాల్ వర్మను ట్రోల్ చేస్తున్నారు. వ్యూహం సినిమా రిలీజ్ విషయంలో అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు. దీంతో  ఏపీ సీఎం జగన్ ఆయనకు గట్టిగా క్లాస్ పీకి, పక్కన పెట్టేసి ఉంటారనీ, దాంతో తత్వం బోధపడి రామ్ గోపాల్ వర్మ తీవ్ర నిరాశలో మునిగిపోయి, సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారని నెటిజన్లు అంటున్నారు. నిన్నటి వరకూ జగన్ భజన చేయడంలో తరించిపోయిన ఆర్జీవీ ఇప్పుడు ఆ జగన్ నుంచే తీవ్ర పరాభవం ఎదుర్కొని ఉంటారనీ అదే ఆ ట్వీట్ సారాంశమనీ అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ లో నేరుగా జగన్ పేరు కానీ, వైపీపీ పార్టీ ప్రస్తావన కానీ తీసుకురాకపోయినా..  ఆట్వీట్ ద్వారా ఆయన వ్యక్తం చేసిన ఆవేదన, బాధ చూస్తే మాత్రం జగన్ ను నుంచి గట్టి పరాభవమే ఎదురై ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.   ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ, వైసీపీ. గత ఎన్నికల నుంచి రామ్‌గోపాల్‌వర్మ వైసీపీని సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. 2019 ఎలక్షన్స్‌ ముందు ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనే సినిమా తీసి వార్తల్లో నిలిచాడు.  తాజాగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా  ‘వ్యూహం’ అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ కావాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ హైకోర్టు దాన్ని నిలిపివేసింది.  ఈ నెల 11 వరకు ‘వ్యూహం’ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ను సస్పెండ్ చేసింది.  ఈ  నేపథ్యంలోనే రామ్‌గోపాల్‌వర్మ తన  x ఖాతా ద్వారా వ్యక్తం చేసిన ఆవేదన వెనుక జగన్ దగానే ఉండి ఉంటుందని రాజకీయ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ   స్పందించలేదు. వ్యూహం విడుదల విషయంలో ఎదురైనా ఆటంకాలో, మరో కారణమో కానీ జగన్ ఆర్జీవీని కూడా పూచికపుల్లలా తీసి అవతల పారేసి ఉంటారనీ, దీంతో తత్వం బోధపడి ఇప్పుడు మెట్ట వేదాంతంలోకి దిగారని, వర్మ ట్వీట్ సారాంశమదేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

ఏపీలో జగన్ ఓటమి ఖాయమని చెప్పిన రైజ్ సర్వే!

ఏపీలో ఎన్నికలకు ఇంకా గట్టిగా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో సర్వే సంస్థలు కూడా ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో  సంస్థలు ఏపీలో  సర్వే చేసి ఫలితాలను వెల్లడించాయి. ఒకటీ  అరా  మినహా దాదాపు అన్ని సంస్థలు ఏపీలో ఈసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. తాజాగా మరో సర్వే కూడా ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కూటమి ఏపీలో  అధికారం దక్కించుకోవడం ఖాయమని చెప్పింది.    ఏపీలో ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే  ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న దానిపై రైజ్ (RISE) అనే సంస్థ సర్వే నిర్వహించింది. లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈ సర్వే నిర్వహించారు.  ఏపీలో మొత్తం పాతిక లోక్‌సభ స్థానాలుండగా.. తెలుగుదేశం, జనసేన కూటమి 15 స్థానాలు కైవసం చేసుకోవడం గ్యారంటీ అని రైజ్ సర్వే తేల్చేసింది. ఆలాగే వైసీపీ కేవలం 5 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితమౌతుందని పేర్కొంది.   ఇక మిగిలిన ఐదు పార్లమెంట్ స్థానాలలో వైసీపీ, తెలుగుదేశం మధ్య తీవ్ర పోటీ ఉంటుందని.. ఇందులో మూడు స్థానాలలో టీడీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనీ పేర్కొంది.  ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలుండగా అందులో తెలుగుదేశం,జనసేనలు 15 స్థానాలు గెలుచుకుంటామని రైజ్ సర్వే ఫలితాలలో పేర్కొన్నారు. ఇందులో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో ఎక్కువ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే.. ఉభయ గోదావరి జిల్లాలలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం స్థానాలలో  తెలుగుదేశం, జనసేన కూటమి గెలుస్తుందని సర్వే పేర్కొంది.  కోస్తాంధ్రలో గుంటూరు, విజయవాడ, నెల్లూరు స్థానాలను, అలాగే రాయలసీమలో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురంలో నూ తెలుగుదేశం,జనసేన  కూటమి విజయం తథ్యమని పేర్కొంది.  వైసీపీ అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి స్థానాలలో టీడీపీ-జనసేన స్థానాలను గెలుచుకోనుంది. ఇక వైసీపీ విషయానికి వస్తే..  ఆ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా   తీసుకున్న ఉత్తరాంధ్రలో కేవలం ఒక్క అరకు పార్లమెంట్ స్థానంలో మాత్రమే వైసీపీకి గెలిచే అవకాశాలున్నాయని రైజ్ సర్వే ఫలితం పేర్కొంంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే..  కడప, రాజంపేట, నంద్యాలలో మాత్రం వైసీపీకి గెలుపు అవకాశాలున్నాయని,  ఇక కోస్తాంధ్రలో వైసీపీ కేవలం ఒంగోలు ఒక్కటే గెలిచే ఛాన్స్ ఉందని రైజ్ సర్వే పేర్కొంది. ఇక అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర పోటీ ఉండే స్థానాల విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, కోస్తాంధ్రలో నరసరావుపేట, మచిలీపట్నం, బాపట్ల, రాయలసీమలో తిరుపతి పార్లమెంట్ స్థానాలలో గట్టిపోటీ అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే వీటిలో అసెంబ్లీ స్థానాల ప్రభావాన్ని బట్టి బాపట్ల, తిరుపతి, విశాఖపట్నం స్థానాలలో టీడీపీ-జనసేన పార్టీలకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ప్రభావం కూడా ఈ  పోటీ లో గెలుపు ఎవరిదన్న సంగతి తెలుతుందని పేర్కొంది.  తెలుగుదేశం, జనసేన పొత్తు ప్రభావం బలంగా పనిచేస్తే కనుక మచిలీపట్నం, విశాఖ స్థానాలు కూడా  తెలుగుదేశం కూటమి ఖాతాలో పడే అవకాశం ఉన్నట్లు రైజ్ సర్వే వివరించింది. అలాగే కోస్తాంధ్రలో ఒంగోలు వంటి స్థానాలు కూడా అసెంబ్లీ స్థానాలలో ఫలితాల ఆధారంగానే  కూటమిఖాతాలోకే వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తంగా చూస్తే తెలుగుదేశం, జనసేన కూటమి రాష్ట్రంలో అత్యధిక  పార్లమెంట్ స్థానాలలో  విజయకేతనం ఎగురవేస్తుందనీ,  అధికార వైసీపీకి ఘోరంగా పరాజయం తప్పదనీ తమ సర్వేలో తేలిందని రైజ్ పేర్కొంది.  కేవలం పార్లమెంట్ స్థానాలపై జరిగిన ఈసర్వేలో వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకి ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులను మార్చేస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులను మార్చినా ఫలితం ఉండదని, దాదాపు 60 శాతం పార్లమెంట్ స్థానాలలో తెలుగుదేశం కూటమి ప్రభావం చూపే అవకాశం ఉందని సర్వే కుండబద్దలు కొట్టినట్లు తెలిపింది. మరో  ఇరవై శాతం స్థానాలలో గట్టిపోటీ కనిపిస్తున్నప్పటికీ, ఇక్కడ కూడా  కూడా తెలుగుదేశం కూటమివైపే మొగ్గు ఉంటుందని  తమ సర్వే చెబుతోందని రైజ్ పేర్కొంది.  ఇప్పటికే ఎన్నో సంస్థలు ఇదే తరహా ఫలితాలు వెల్లడించగా.. ఇప్పుడు వెల్లడైన ఈ ఫలితాలతో టీడీపీ-జనసేన విజయం ఖాయమని మరోసారి నిర్ధారణ అయ్యింది. 

ఇది కదా యూ టర్న్ అంటే?!

మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ తన నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్నిసార్లు మడమ తిప్పారో, ఎన్ని సార్లు మాట తప్పారో, రాష్ట్రంలో సామాన్య ప్రజలను అడిగినా చెప్పేస్తారు. అయితే  పార్టీలో ఇప్పటి వరకూ ఎవరూ కూడా జగన్ కు ఆ విషయాన్ని చెప్పే ధైర్యం చేయలేదనుకోండి అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట.. వేరే ఓవరో చెప్పాల్సిన అవసరం లేకుండానే ఆయనకు విషయం బోధపడినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఇక మాట తప్పడం, మడమ తిప్పడం వంటి సంశయాలు ఎందుకని ఏకంగా యూటర్నే తీసుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ జగన్ చెబుతూ వస్తున్న మాట ఏదైనా ఉందంటే.. తన ఫొటో ఉంటే చాలు ఎవరైనా గెలిచేస్తారని, ఇంత కాలం ఆ విషయాన్ని తాను స్వయంగా నమ్మడమే కాకుండా, పార్టీ నేతలను, క్యాడర్ ను కూడా నమ్మిస్తూ వచ్చిన   జగన్ ఎన్నికల ముంగిట ఆ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తోంది. తన ఫొటో ఉంటే చాలు గెలిచేస్తారన్న నమ్మకం పోయి, మీ సీటు మీరే గెలుచుకోవాలి అంటూ చెప్పుకొస్తున్నారు. అలా అని సిట్టింగుల మీద భరోసా పెట్టి నిశ్చింతగా కూడా ఉండలేకపోతున్నారు. నియోజకవర్గంలో మీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని కనుక మిమ్మల్ని మార్చేసి మరొకరికి అవకాశం ఇస్తున్నానని చెబుతున్నారు. అయితే మార్పు అనే వేటు పడిన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమ అధినేత పూర్తిగా యూటర్న్ తీసుకున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిశీలకులు సైతం ఇంతకు మించి యూటర్న్ ఉండదని అంటున్నారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలలో పని లేకుండా చేసి.. మీరేం చేయక్కర్లేదు గడపడగపకు వెళ్లి నేను చేసింది చెప్పండి చాలు నా ఫొటోయే మిమ్మల్ని గెలిపిస్తుంది అన్నట్లుగా ఇంత కాలం వ్యవహరించిన జగన్ ఇప్పుడు హఠాత్తుగా  మీకు మీమీ నియోజకవర్గాలలో గెలుపు అవకాశాలు లేవు, అందుకే గెలుపు గుర్రాలను తీసుకువస్తున్నాననడం ఏమిటని నిలదీస్తున్నారు.   తన ఫేస్ వాల్యూ పడిపోయిందని జగన్ అందరి ఫేస్ వేల్యూ తీసేయడానికే నిర్ణయించుకున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ముందుండి గెలిపించలేనని చేతులెత్తేసిన నేత వెనుక ఎందుకు ఉండాలని తిరుగుబాటు చేస్తున్నారు. ఇంత కాలం అధినేత మాటే శిరోధార్యం అన్నట్లుగా ఉన్న ఒక్కొక్కరూ ధిక్కరించి మాట్లాడుతున్నారు. ఎందుకు మారుస్తున్నారంటూ నిలదీస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ముందే ధర్నాలకు దిగుతున్నారు.  టికెట్ దక్కని వారు ఒకందుకు బాధపడుతుంటే.. నియోజకవర్గం కాదని మరో చోట పోటీకి అవకాశం దక్కిన వారు అందుకు రెండింతలు బాధపడుతున్నారు. తమను అవినీతి పరులుగా, ప్రజా ద్రోహులుగా చిత్రీకరించి మరీ నియోజకవర్గం మార్చేస్తున్నారని ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కోర్టులో కేసు ఓడిపోయిన వారు కోర్టు ప్రాంగణంలో ఏడిస్తే.. గెలిచిన వారు ఇంటికి వెళ్లి ఏడ్చారన్నట్లు వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ టికెట్ నిరాకరించి పక్కన పెట్టేసిన వారు జగన్ దగా చేశారని బాధపడుతుంటే.. సొంత నియోజకవర్గంలో మీరు గెలిచే చాన్స్ లేదు.. అంటూ మరో నియోజకవర్గానికి జగన్ బదిలీ చేసిన వారు బయటకు చెప్పుకోలేక, అవమాన భారంతో మౌనంగా రోదిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత సాకు చూపి మార్చేయడమంటే..తమ మీద అవినీతి ముద్ర వేయడమేనని రగిలిపోతున్నారు. ఇలా మార్చేసిన వారిలో మంత్రులు కూడా ఉండటం కొసమెరుపు. సొంత కేబినెట్ సహచరులే నియోజకవర్గంలో పట్టు సాధించడంలోనూ, ప్రజా మన్నన పొందడంలోనూ విఫలమయ్యారని స్వయంగా జగన్ చెబుతుండటంతో నియోజకవర్గం మారితే మాత్రం అక్కడ పార్టీ కేడర్ సహకరించే అవకాశం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సొంత నియోజకవర్గంలోనే పనికిరానివారిగా పార్టీ అధినేత ముద్ర వేసి మరో నియోజకవర్గానికి పంపిస్తే, అక్కడి పార్టీ క్యాడర్, జనం పనికి రాని, పని చేయని వారు మాకెందుకని దూరంపెట్టరా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాలు మారిన ఎమ్మెల్యేలు తమ ఓటమి ఖరారైందన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఎలాగా ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇక ప్రచారానికి సొమ్ములు తగలేసుకోవడం ఎందుకు అన్న నిర్వేదంలో పడుతున్నారు. కొందరైతే మీరు టికెట్ ఇవ్వకపోయినా ఫరవాలేదు.. మేం మొత్తంగా పోటీకే దూరంగా ఉంటాం కానీ నియోజకవర్గం మాత్రం మారమని నిర్మొహమాటంగా జగన్ కే ముఖం మీద చెప్పేస్తున్నారు. దీంతో టికెట్ దక్కి నియోజకవర్గం మారిన వారు, టికెట్ దక్కని వారూ.. ఆశించి భంగపడ్డవారు ఇలా అందరిలోనూ పార్టీ పట్ల, అధినేత జగన్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో  జగన్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగే వారెవరూ కూడా ఆస్త్రశస్త్రాలు (అంటే క్యాడర్, పార్టీ నేతల సహకారం ఉండదని నిర్ణయించుకునే) లేకుండా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యత నాదే అంటూ చెప్పుకున్న జగన్  ఆ బాధ్యత నుంచి చేతులెత్తేసి యూటర్న్ తీసుకుని నమ్ముకున్నవారిని నట్టేట ముంచేశారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. 

రేపు చంద్రబాబుతో పవన్ భేటీ 

ఎపిలో రానున్న ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత క్రియాశీల రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు. టిడిపి, జనసేన పొత్తు ఖరారు కావడంతో విజయం లక్ష్యంగా పావులు కదలపాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం (జనవరి 8) జనసేనాని   ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుండి  రోడ్డు మార్గం గుండా మంగళ గిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చారు. మంగళ గిరిలో పవన్ కళ్యాణ్ కు భారీ స్వాగతం లభించింది ఈరోజు, రేపు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటారు.  ఈరోజు, రేపు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతలతో చర్చించనున్నారు. రేపు  టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఎపిలో వోటర్ల నమోదు కార్యక్రమంలో  భారీ అవకతవకలు జరిగాయి. జగన్ ప్రభుత్వం బోగస్ వోటర్లను నమోదు చేయడం, ఒకే ఇంటి నెంబర్ మీద బోగస్ వోటర్లు నమోదయ్యారు. ఈ విషయాలపై   టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో  పవన్ చర్చించనున్నారు. తర్వాత వీరిరువురు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఆయన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. 

వైసీపీ నేతల్లో అభద్రతా భావం.. జగన్ లో ఓటమి భయం!

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో ఇప్పుడు తీవ్ర అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ సిట్టింగుల మార్పుతో గెలుపు మంత్రాన్ని కనుగొన్నానని భావించారు. అయితే ఆ గెలుపు మంత్రం వికటించి ఇప్పుడు పార్టీయే ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అయినా తనకు మాత్రమే సాధ్యమైన మొండితనంతో జగన్ వరుసగా సిట్టింగుల మార్పు జాబితాలను విడుదల చేస్తూ ముందుకు వెడుతున్నారు. ఆయన ధైర్యం ఏమిటంటే.. సిట్టింగులందరి చేతా దాదాపుగా విపక్ష నేతలను ఇష్టారీతిగా తిట్టించడం ద్వారా వారికి ఆయా పార్టీలలోకి ఎంట్రీ గేట్ లు మూతపడేలా చేశాను, కనుక సీటిచ్చినా, ఇవ్వకున్నా, స్థానం మార్చేసినా ఎవరూ కూడా తనను కాదని వెళ్లలేరన్నదే. అయితే షర్మిల కాంగ్రెస్ ఎంట్రీతో జగన్ లో ఆ ధైర్యం ఇంకెంత మాత్రం ఉండే అవకాశం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఇప్పటికే షర్మిల వెంటే తన నడక అని ప్రకటించేశారు. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం అదే దారిలో నడుస్తున్నారు. ఇక జగన్ కో దండం అంటే బయటకు వెళ్లిపోతున్నట్లు ప్రకటించిన కాపు రామచంద్రారెడ్డి సైతం షర్మిల పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా జగన్ పూచికపుల్లల్లా తీసి పారేసిన సిట్టింగులకు షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ ధైర్యాన్నిస్తే.. జగన్ లోని  ధైర్యాన్ని దిగజార్చేసింది కూడా షర్మిల కాంగ్రెస్ ఎంట్రీయే.  సరే అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ మరో 15 మంది సిట్టింగుల మార్పు జాబితాతో రెడీ అయిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ జాబితాలో మంత్రులు సైతం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ సిట్టింగులలో పార్టీ హైకమాండ్ నుంచి.. అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా అన్న టెన్షన్ పట్టుకుందంటున్నారు. అదే సమయంలో ఈ మూడో జాబితా విడుదల చేస్తే.. వీరిలో ఎంత మంది  తనను ధిక్కరించి పార్టీ వీడుతారా అన్న బెరుకు జగన్ లో వ్యక్తం అవుతోందని అంటున్నారు.   ఇక మూడో జాబితాలో మంత్రి తానేటి వనితకు స్థాన చలనం తప్పదని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే మొదటి లిస్టులో 11 మందిని, రెండో లిస్టులో 27 మందిని, మొత్తంగా 38 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. చాలా చోట్ల సిట్టింగులకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. అలా జగన్ పక్కన పెట్టేసిన వారిలో మల్లాది విష్ణు, గోరంట్ల మాధవ్, పర్వత ప్రసాద్, మద్దాళి గిరి, మంత్రి గుడివాడ అమర్నాథ్  వంటి వారు ఉన్నారు.  ఈ రెండు జాబితాల తరువాత పార్టీలో అసమ్మతి భగ్గుమన్నా.. జగన్ ఇప్పుడు మూడో జాబితాతో సిద్ధమైపోయారంటున్నారు. ఈ జాబితాలో కూడా కొందరు మంత్రులకు షాక్ తప్పదని అంటున్నారు.  అయితే మంత్రి బొత్స సత్యనారాయణ  పల్నాడు, గుంటూరు, కృష్ణాలో మినహా ఇతర జిల్లాలో అభ్యర్థులను మార్చరని చెబుతున్నా, తాడేపల్లి ప్యాలెస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు  తాడేపల్లి నుంచి  ఫోన్ కాల్ అంటే భయపడుతున్నారు. అదే సమయంలో జాబితా విడుదల చేయాలంటే జగన్ వెనుకాడుతున్నారంటేనా పార్టీలో ఎంతటి అయోమయ పరిస్థితులు నెలకొన్నాయో ఇట్టే అవగతమౌతుంది.  విశ్వసనీయ సమాచారం మేరకు నందికొట్కూరు, ఆలూరు, కర్నూలు, శింగనమల, గూడూరు, చోడవరం, చింతలపూడి, పెందుర్తి, గోపాలపురం, కొవ్వూరు  అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది. నందికొట్కూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ను మార్చే అవకాశం ఉంది. అక్కడ కస్టమ్స్ ఆపీసర్ వేల్పుల ఆనంద్ కుమార్, డాక్టర్ సుధీర్ లపేర్లు విన్పిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కు స్థాన చలనమా? లేక మొండిచేయా అన్న విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత అయితే లేదు కానీ, ఆయన సీటు మార్పు మాత్రం ఖాయమని అంటున్నారు.   అలాగే ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంకు కూడా జగన్ షాక్ ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఆలూరు నుంచి  కప్పట్రాళ్ల బొజ్జమ్మ, చిప్పగిరి జెడ్పీటీసీ విరుపాక్షి, దివంగత మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజా రెడ్డి కుమార్తె హిమవర్షి రెడ్డి, శశికళ పేర్లు విన్పిస్తున్నాయి. అదే విధంగా కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు కూడా మొండిచేయి తప్పదని పార్టీ వర్గాల సమాచారం. అక్కడ ఇంతియాజ్ భాష, పూల బషీర్, కేడీసీసీ చైర్ పర్సన్ విజయ మనోహరి, ఎస్వీ మోహన్ రెడ్డిలలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. . శింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి కూడా షాక్ తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ శమంతకమణి, శ్రీనివాస మూర్తి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. చింతలపూడి నుంచి విజయరాజుకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలిషా వర్గం ఇప్పటికే తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నారు.   కొవ్వూరు ఎమ్మెల్యే, మంత్రి తానేటి వనితకు స్థాన చలనం తప్పదని అంటున్నారు.   ఆమెను గోపాలపురం లేదా చింతలపూడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని  చెబుతున్నారు. ఇక కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావు పేరు గట్టిగా వినిపిస్తోంది.  మొత్తంగా సిట్టింగుల మార్పు ప్రయోగంతో జగన్ పార్టీ నేతల్లో అభద్రతా భావాన్ని నింపడమే కాకుండా.. తనలోని భయాన్ని కూడా ప్రస్ఫుటంగా చాటుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ ధైర్యంపై షర్మిల చావుదెబ్బ!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయహీట్ పీక్స్ కు వెడుతోంది. ఏడాది మారి ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టగానే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో రాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపు చోటు చేసుకున్నట్లైంది. నిజానికి షర్మిల తెలంగాణలో పార్టీ ప్రారంభించిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లైతే ఇంత ఎఫెక్ట్ కనిపించేది లేదు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు షర్మిల కాంగ్రెస్ లో చేరడం, అదీ ఏపీలో రాజకీయం మొదలు పెట్టనుండడం  ఆసక్తిని పెంచింది. కా రణం.. షర్మిల కాంగ్రెస్ లో చేరిక కచ్చితంగా తన అన్న జగన్ మోహన్ రెడ్డి నష్టం చేసేదే కావడం. నిజానికి ఈసారి తనకు ఓటమి తప్పదని జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడో నిర్ణయించుకున్నారు. రకరకాల మార్గాల ద్వారా సర్వేలు చేయించుకున్న జగన్..  ఓటమి తథ్యమనే తెలడంతో నష్ట నివారణకు ఉన్న ఏ అవకాశాన్నీ వదలకుండా తన ప్రయత్నాలు తాను సాగించారు. ముందుగా టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిస్తే తనకు నష్టమని భావించిన జగన్.. ఆ పొత్తు పొడవకుండా విచ్ఛిన్నం చేయడానికి చేయగలిగినంతా చేశారు.   కానీ  ఆ పప్పులేం ఉకడకపోవడంతో   కనీసం తమ అభ్యర్థులను మార్చేసి వైసీపీ క్యాడర్ లో అసంతృప్తి తగ్గించాలని ఆశపడ్డారు. తెలుగుదేశంతో జనసేన పొత్తులో భాగంగా ఇప్పటికే చాలా సీట్ల సర్దుబాటు విషయంలో ఆ పార్టీలు దాదాపుగా ఒక అవగాహనకు వచ్చేశాయి. సీనియర్లు, జూనియర్లు, కొత్తవారు, పాతవారు, సామజిక కోణం ఇలా అన్నీ లెక్కలేసుకొని రెండు పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఆరంభించేశాయి కూడా. దీంతో ఈ రెండు పార్టీలలో ఉన్న అభ్యర్థులనే అడ్జెస్ట్ చేసుకొని పోటీకి దిగాల్సిన పరిస్థితి ఉంది.  దీంతో ఇతర పార్టీల నుండి వచ్చే వారికి ఇక్కడ స్కోప్ లేకుండా పోయింది. టికెట్ దక్కదని తెలిసి కూడా వైసీపీ నుంచి ఆ పార్టీలలోకి వెళ్లినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదని భావించిన జగన్ మోహన్ రెడ్డి   ఆ ధైర్యంతో నే వైసీపీలో సిట్టింగులను మార్చేసేందుకు సిద్ధమయ్యారు.తెలుగుదేశం,జనసేనలో తన పార్టీ నుంచి గోడదూకే వారికి చోటు ఉండదన్న ఒకే ఒక ధైర్యంతో  జగన్  సిట్టింగుల మార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీటు ఇవ్వకపోయినా చాలామంది ఎమ్మెల్యేలు గత్యంతరం లేక పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారని జగన్ బావించారు. కానీ జగన్ ధైర్యంపై, ఆశలపై  షర్మిల చావుదెబ్బ కొట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఏ ధైర్యంతో జగన్ సిట్టింగుల మార్పుకు శ్రీకారం చుట్టారో ఆ ధైర్యాన్ని షర్మిల తన ఎంట్రీతో దెబ్బ తీశారు.   వైసీపీలో అసంతృప్తులకు  తెలుగుదేశం, జనసేనలో చోటులేకపోయినా.. షర్మిల రెడ్ కార్పెట్ వేసి  కాంగ్రెస్ లోకి వెల్కమ్ చెప్పడం గ్యారంటీ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  షర్మిల ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకోగానే అలా వైసీపీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలతో ఫోన్ సంభాషించినట్లు వార్తలొచ్చాయి. ముందు ముందు వైసీపీ అసంతృప్త నేతలందరితో కాంగ్రెస్ పార్టీ షర్మిల ద్వారా టచ్ లోకి వెళ్లడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటు లాంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో నడక ప్రారంభించారు. షర్మిల చేతుల మీదగా కాంగ్రెస్ కండువా కప్పుకొనే తొలి ఎమ్మెల్యే తానేనని ప్రకటించేశారు. కాగా, ఇప్పటి వరకూ సిట్టింగులను మారుస్తూ జగన్ విడుదల చేసిన రెండు జాబితాలలో సీటు మారి, అసలు సీటే దక్కని  అసంతృప్త నేతలలో  పలువురు  జగన్ కు బైబై చెప్పేందుకు సిద్ధమవుతుండగా.. వారందరినీ కాంగ్రెస్ గాలమేసి పట్టుకొనేందుకు రెడీ అవుతోంది. టికెట్ లేకపోయినా వైసీపీ గెలుపు కోసం పనిచేస్తామంటూ గంభీర ప్రకటనలు చేసిన ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.  వైసీపీలో ఎలాగు టికెట్ దక్కలేదు.. ఒకవేళ టికెట్ ఇచ్చినా అది తమకి కొత్త నియోజకవర్గం కనుక అక్కడ జగన్ మోహన్ రెడ్డిని చూసి ఓటేసే పరిస్థితి లేదు అని భావిస్తున్న  వైసీపీ సిట్టింగులందరికీ ఇప్పుడు  షర్మిల   అండా దండగా కనిపిస్తుంది.  ఒకవేళ కాంగ్రెస్ లో చేరి ఓడినా పోరుగున తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీదే అధికారం కనుక కనీసం వ్యాపారం చేసుకొని బ్రతికేయొచ్చు. ఎలాగూ వైసీపీకి అధికారం దక్కే పరిస్థితి లేదని తెలిసినపుడు ఇప్పుడు ఎవరి గెలుపు కోసమో పనిచేసి ఐదేళ్ల పాటు ప్రతిపక్షంగానే మిగిలిపోవడం కన్నా.. గెలిచినా ఓడినా కాస్త గౌరవంగా ఉండే కాంగ్రెస్ పార్టీయే బెటర్ అని వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఎంతో దైర్యంగా సిట్టింగుల మార్పు అంటూ  జగన్ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించినా.. చెల్లెలు షర్మిల వచ్చి ఆ ధైర్యాన్ని కూడా దెబ్బతీసేసిందని, ఇప్పుడు జగన్ ఓటమి కోసం ఎదురు చూడటం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 కేశినేని నాని కూతురు శ్వేత రాజీనామా 

 విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఎంపీ పదవికి, టిడిపికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన   కూతురు శ్వేత టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనుందని కేశినేని నాని ట్వీట్ చేశారు. సోమవారం ఉదయం పదిన్నరకు శ్వేత కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని శ్వేత కార్పోరేటర్ పదవికి రాజీనామాకు ముందే  తన ట్వీట్ లో పేర్కొన్నారు. కేశినేని శ్వేత ప్రస్తుతం విజయవాడ 11వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు తన కుమార్తె శ్వేత మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో తన రాజీనామా అందజేశారు. అంతకు ముందు తనను కార్పొరేటర్ గా గెలవడానికి సహకరించిన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికి వెళ్లి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.  ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీవెళ్లి స్పీకర్ ఫార్మాట్ లో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ తరువాత టీడీపీ సభ్యత్వానికికూడా రాజీనామా చేస్తానని కేశినేని నాని ఇప్పటికే  ప్రకటించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో తిరువూరులో జరిగిన ‘రా కదిలిరా’ కార్యక్రమానికి దూరంగా ఉండాలని తనను పార్టీ ఆదేశించినట్లు కేశినేని నాని ఇటీవల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా వేరేవ్యక్తిని చూస్తున్నట్లు పార్టీ అధిష్టానం తనతో చెప్పినట్లు ప్రకటించిన కేశినేని నాని, విజయవాడలోని కేశినేని భవన్ దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాలనుసైతం తొలగించారు.

జగన్ దృష్టిలో దేవినేని అవినాష్ కూడా కరివేపాకేనా?

ఎన్నికల సమయం దగ్గరకొచ్చేసిరికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసలు స్వరూపం బయటపడుతున్నది. వైసీపీ పార్టీ పుట్టాక ఎన్నడూలేని విధంగా ఈసారి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో ప్రపంపనలు రేపుతున్నాయి. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.  ఎందుకుంటే ఆయన ఇచ్చిన మాటలు, ప్రకటించిన హామీలు ఇలా అన్నిటికీ నిళ్లొదిలేశారు. ఈ క్రమంలో ఇచ్చిన మాటలు, ప్రకటించిన హామీలు అన్నిటికీ నీళ్ళొదిలేశారు. గతంలో తన గెలుపునకు సహకరించిన అందరినీ.. ఐ ప్యాక్ సర్వేల పేరు చెప్పి దూరం పెట్టేస్తున్నారు.  ఎలాంటి మొహమాటాలకు తావు లేకుండా అభ్యర్థులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. జగన్ ఇప్పుడు ప్రకటించే అభ్యర్థులు గెలవడం, గెలవకపోవడం అన్నిది పక్కన పెడితే.. ప్రస్తుతం ఆయా స్థానాలలో ఉన్న సిట్టింగులకు గెలిచే అవకాశం ఇసుమంతైనా లేదన్న అభిప్రాయానికి జగన్ వచ్చేశారు. మీకు ప్రజాదరణ లేదు.. మీకు టికెట్ ఇచ్చినా గెలవలేరు అని ముఖంమీదే చెప్పేస్తూ వారిని పక్కన పెట్టేయడమో, మరో నియోజకవర్గానికి మార్చేయడమో చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటించే వారు అక్కడ క్యాడర్ కు పరిచయం లేకపోయినా తాను తీసుకున్నదే ఫైనల్ నిర్ణయం అంటూ కనీసం చర్చలకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. గతంలో తాను స్వయంగా హామీలిచ్చిన వారికి సైతం గెలిస్తే అంతకు మించి అవకాశం ఇస్తామని చెప్పాలని బుజ్జగింపులు కోసం తాను నియమించుకున్న కమిటీకి జగన్ సూచిస్తున్నారు. దీంతో ఎన్నో ఆశలతో వైసీపీలోకి వచ్చిన వారు, పార్టీ కోసం ఎంతో శ్రమించి క్యాడర్ ను కాపాడుకున్న వారు జగన్ నిర్ణయాలతో ప్రజల మధ్యకి వచ్చే పరిస్థితి లేకుండా పోతున్నది. ఇప్పుడు దేవినేని అవినాష్ కు కూడా రిక్తహస్తమేనంటున్నారు జగన్. తెలుగుదేశం పార్టీకి కంచుకోట విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇప్పుడు కూడా బ‌లంగానే ఉన్నారు. గత ఎన్నికలలో  ఫ్యాన్ గాలిని   తట్టుకొని నిలబడ్డ గద్దెకి రాబోయే ఎన్నికలలో భారీ మెజార్టీ ఖాయంగా సర్వేలు తేల్చి చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశంలో  అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు కాస్త ఇబ్బందిగా మారాయి. చాలా కాలంగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానీ నుండి గద్దెకి సహకారం అందడం లేదు. ఇప్పుడు కేశినేని నానీ తమ్ముడు కేశినేని చిన్నికి తెలుగుదేశం ఎంపీ సీటు ఇస్తుందనే ప్రచారం జరుగుతుండగా.. కేశినేని నానీ వర్గం గుర్రుగా ఉంది. అయితే ఎమ్మెల్యే గద్దె అంటే సౌమ్యుడు, అంద‌రినీ క‌లుపుకొని పోయే మ‌న‌స్త‌త్వం ఉన్న వ్యక్తి కావడంతో మూడో సారి కూడా వ‌రుస‌గా ఆయ‌న గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయం అంటున్నారు. దీంతో వైసీపీ ఎలాగైనా ఇక్కడ గద్దెకి చెక్ పెట్టాలని తాపత్రయపడుతున్నది. ఈ క్రమంలోనే దేవినేని అవినాష్ కు మొండి చేయి చూపించేందుకు జగన్ సిద్ధమైపోయారంటున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి గుడివాడలో కొడాలి నానీపై పోటీచేసి ఓడిపోయిన దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్  ఆ తరువాత తెలుగుదేశం పార్టీని వీడి  వీడి వైసీపీలో చేరారు. దీంతో జగన్ అప్పట్లో అవినాష్ ను విజయవాడ తూర్పు అభ్యర్థిగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు.  వచ్చే ఎన్నికలలో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపాలని పార్టీ నాయకులకు సూచించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉంటూ వస్తున్న బలమైన కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకును దెబ్బకొట్టేందుకు అదే సామజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్ అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ అప్పట్లో ఖాయం చేశారు. అప్పటి నుండి అవినాష్ తూర్పు నియోజకవర్గంలో కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నారు. దాదాపు రెండేళ్లుగా  అవినాష్ ఇక్కడ పార్టీ కో్సం పని చేస్తూ తన పట్టు పెంచుకుని ఎన్నికలలో పోటీకి సిద్ధమౌతూ వస్తున్నారు.  ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ఏ కార్యక్రమం చేపట్టినా ముందుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేది దేవినేని అవినాషే అన్నట్లుగా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చే సరికి జగన్ అవినాష్ ను పక్కకి నెట్టేశారు. జ‌గ్గ‌య్యపేట ఎమ్మెల్యే సామినేని ఉద‌య భానును తూర్పు నియోజకవర్గానికి తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉన్నట్లు పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. జ‌గ్గ‌య్య పేటలో ఉన్న సామినేనిని ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చి.. అవినాష్‌ను వేరే నియోజ‌క‌వ‌ర్గానికి పంపించడమో, లేదా ఈ సారికి పార్టీ టికెట్ నిరాకరించడమో జరుగుతుందని వైసీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది ఒక‌వేళ సామినేని విజయవాడ తూర్పుకు వ‌చ్చేందుకు అంగీక‌రించ‌ని ప‌క్షంలో య‌ల‌మంచిలి రవిని ఇక్కడకి తీసుకు వస్తారని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ఎలా చూసుకున్నా అవినాష్ కు మాత్రం జగన్ హ్యాండ్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.  దీంతో ఎన్నో ఆశలతో నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పనిచేసిన అవినాష్ కూడా వైసీపీ కూరలో కరివేపాకేనా అని ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

వైసీపీ ఎత్తులు.. వినాయక్ ఇంటికి దారేది?

ఏపీలో వైసీపీకి తొలి నుండి సినిమా రంగంతో పాటు ఇతర రంగాల్లో ప్రముఖులైన స్టార్ క్యాంపెయినర్లు లేరు. దీంతో వైసీపీ సినిమా ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లకు, కమెడియన్లను, యాంకర్లకు గాలమేసి కాలం గడుపుకుంటూ వస్తోంది.  అయితే, జగన్ ప్రభుత్వం వచ్చాక వారికి చేకూర్చిన లబ్ది ఏదీ లేకపోవడంతో ఇప్పుడు వారు కూడా వైసీపీతో ఆంటీ ముట్టనట్లే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే గత ఎన్నికలకు ముందు వారిని ఎంత వాడుకోవాలో అంతా వాడేసుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక వాళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు.  థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ లాంటి వారికి పదవి ఇచ్చినట్లే ఇచ్చి అవమానకర రీతిలో వెళ్ల గొట్టేశారు. ఇక కమెడియన్ అలీ లాంటి వారి ఆశలు అడియాశలు అవుతూనే ఉన్నాయి. మాజీ హీరోయిన్లు రోజా లాంటి వారు ఉన్నా.. వారి స్థానాలలో వారికి టికెట్ ఇచ్చినా వృధానే అని వైసీపీ పెద్దలు డిసైడ్ అయిపోయారు. దీంతో ఇప్పుడు ఎలాగయినా కాస్త గ్లామర్ టచ్ ఉన్న క్యాంపెయినర్ల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.  అలాగే వైసీపీకి ఇప్పుడు కాపు సామజిక వర్గ ఓటర్లను ఆకర్శించే వారు కూడా కావాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనతో కాపు సామాజికవర్గాన్ని ఆకర్షిస్తుండగా.. వైసీపీ ఎలాగైనా కాపు ప్రముఖులను ఆకర్షించడమే టార్గెట్ చేసుకొని పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ముందుగా కోస్తాంధ్ర నుండి వంగవీటి మోహన్ రంగా తనయుడు రాధాకృష్ణపై తమ వైపు తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. వైసీపీలోకి వస్తే విజయవాడ సెంట్రల్ స్థానాన్ని కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు కూడా తెలిసింది. ఆ మధ్యన మిధున్ రెడ్డి రాధాకృష్ణతో చర్చలు జరిపినట్లు రాజకీయ వర్గాల సమాచారం. అయితే  రాధాకృష్ణ వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపలేదు.  దీంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ను నియమించారు.   యంగ్ క్రికెటర్ అంబటి రాయుడును వైసీపీలోకి చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానం నుంచి రాయుడును పోటీ చేయించి.. రాష్ట్రమంతా తనతో ప్రచారం చేయించాలని భావించారు. కానీ రాయుడు పార్టీ చేరినంత సమయం కూడా ఆ పార్టీలో ఇమడలేక బయటకు వెళ్లిపోయారు.  మంచి క్రికెటర్ అయిన రాయుడు కనీసం క్రిజ్ లోకి కూడా రాకుండానే డకౌట్ అయిపోయారు. ఇక గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఇక్కడ కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపు ఖరారు అయ్యింది. ఆయన కుమారుడుతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ముద్రగడ చేరికతో కాపు సామాజిక వర్గాన్ని ఎంతోకొంత పవన్ వైపు వెళ్లకుండా నియంత్రించవచ్చని ఆశపడుతున్నారు. అయితే ఆయన పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించలేరన్న అనుమానంతో   సినీ గ్లామర్ ఉన్న కాపు సామాజికవర్గ ప్రముఖుల కోసం వైసీపీ జల్లెడ పడుతున్నది. ఆ క్రమంలోనే సినీ దర్శకుడు వీవీ వినాయక్ కు గాలం వేస్తోంది. . పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వినాయక్ కుటుంబం తొలి నుండి ఆ జిల్లాలో కాంగ్రెస్ లో కీలకంగా ఉండగా.. ప్రస్తుతం వారు వైసీపీలో ఉన్నారు. వినాయక్ సోదరుడు స్థానికంగా వైసీపీ కోసం పనిచేస్తున్నారు కూడా . అయితే ఈసారి వినాయక్ ను డైరెక్ట్ గా రంగంలోకి దింపాలని వైసీపీ పెద్దలు ఆశపడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ముద్రగడతో, పశ్చిమ గోదావరి జిల్లాలో వినాయక్ తో ప్రచారం చేయించాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నది.  నిజానికి గత ఎన్నికల్లోనే నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున వినాయక్ పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. కానీ, ఆయన మాత్రం  ముందుకు రాలేదు. ఇప్పుడు మరోసారి ఏలూరు నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ పార్లమెంటు స్థానానికి కచ్చితంగా పోటీ చేయాలని ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తున్నది. అయితే వినాయక్ స్వతహాగా చిరంజీవి అభిమాని.. మెగా కాంపౌండ్ కు దగ్గరగా ఉండే వ్యక్తి.  నందమూరి కుటుంబంతో కూడా మంచి అనుబంధం ఉంది. రాజకీయంగా ఆయన కుటుంబం వైసీపీలో ఉన్నా.. ఇండస్ట్రీలో ఆయనకున్న స్నేహాలు, పరిచయాల వలన ఆయన వైసీపీ నుండి పోటీచేసి జనసేనకు వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ నేతలు మాత్రం వినాయక్ ఇంటికి దారేది అంటూ వెతుక్కుంటూ వారి ఫ్యామిలీని కాకాపట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తున్నది. మరి వినాయక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

అపురూప శిల్పాలకు ఆదరణ కరువు.. ఈమని శివనాగిరెడ్డి

పోలేపల్లిలోని వెయ్యేళ్లనాటి శిథిలాలయాలు, శిల్పాలను కాపాడాలని పురావస్తు పరిశోధకుడు,  ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వారసత్వ స్థలాలు, కట్టడాలను కాపాడుకోవాలన్న అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆదివారం(జనవరి7) పోలేపల్లి పరిసరాల్లో పర్యటించిన ఆయన వెయ్యేళ్ల నాటి శివాలయం, చెన్నకేశవాలయం, నిలువెత్తు భైరవ, వీరగల్లు శిల్పాలు, కాకతీయుల కాలపు వినాయకుడు, కార్తికేయ, సప్తమాతల శిల్పాలు, భిన్నమైన చెన్నకేశవశిల్పం నిర్లక్ష్యంగా పడి ఉన్నాయన్నారు.  వీరభద్రుని ఆలయం వద్ద క్రీ.శ. 1099, జూలై, 18వ తేదీ, సోమవారం నాటి శాసనం భూమిలో కూరుకుపోయిందని, అందులో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుని సైన్యాధ్యక్షుడైన రుద్ర దండనాయకుడు, స్థానిక రుద్రేశ్వర, కేశవదేవ, ఆదిత్య దేవుల నైవేద్యానికి భూమిని దానం చేసిన వివరాలున్నాయని శివనాగిరెడ్డి తెలిపారు.  పోలేపల్లి చెన్నకేశవ, త్రికూటాలయాల చుట్టూ కంప పెరిగిందనీ, ఆలయాలు శిథిలమైనాయని, పోలేపల్లి గ్రామ చరిత్రకు అద్దం పడుతున్న ఈ వారసత్వ కట్టడాలను పదిల పరచి, చారిత్రక శిల్పాలు, శాసనాన్ని భద్రపరచి కాపాడుకోవాలని గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ వీఆర్వో బిచ్చన్న గౌడ్‌, స్థపతి భీమవరపు వెంకటరెడ్డి, వేయిగండ్ల ప్రణయ్‌ శిల్పి పాల్గొన్నారు.

జనసేన చాలు.. బీజేపీ వద్దు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బిజెపితో పొత్తు పెట్టుకునే విషయం మీద తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు  పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనబడటం లేదు.   పొత్తులో భాగంగా పవన్‌ కల్యాణ్‌  నాయకత్వంలోని జనసేన తో సీట్ల సర్దుబాటు  దాదాపుగా కొలిక్కి వచ్చింది. జనసేనకు పాతిక అసెంబ్లీ , రెండు లోకసభ స్థానాల కేటాయింపునకు ఒప్పందం కుదిరినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ తరుణలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తాము తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసే ఎన్నికలకు వెడతామని ప్రకటించడం ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపినట్లయ్యింది. తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కూడా దాదాపుగా పూర్తయిన తరువాత పురందేశ్వరి చేసిన ప్రకటనను తెలుగుదేశం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అదీ కాక ఒక వైపు పురందేశ్వరి పొత్తు ఉంటుందని గట్టిగా చెబుతుంటే, కొందరు నేతలు మాత్రం  పొత్తు ప్రతిపాదన తెలుగుదేశం నుంచే రావాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంతే కాకుండా  బీజేపీ నాయకులు కొందరు పొత్తులో భాగంగా అత్యధిక స్థానాలను డిమాండ్ చేస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏపీలో బీజేపీకి ఉన్న బలం కానీ, ఓటు స్టేక్ కానీ దాదాపు శూన్యం అని చెప్పవలసి ఉంటుంది.  ఆ విషయం బీజేపీకి కూడా స్పష్టంగా తెలుసు. ఇక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బీజేపీని క లుపుకుంటే మైనారిటీ ఓట్లు దూరమయ్యే అవకాశాలున్నాయని తెలుగుదేశం భావిస్తోంది. బీజేపీ పొత్తులో లేకుండా విడిగా అన్ని స్థానాలలోనూ పోటీ చేసినా ఆ పార్టీ  ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా చీల్చే అవకాశాలు లేవన్నది పరిశీలకుల విశ్లేషణ. కేవలం కేంద్రంలో అధికారంలో ఉంది, మరో సారి కేంద్రంలో అధికారం చేపట్టే అవకాశాలున్నాయన్న ఏకైక కారణంతో ఆ పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగడం రాష్ట్రంలో తెలుగుదేశంకు కానీ, జనసేనకు కానీ ఏమీ మేలు చేయదు. అందుకే బీజేపీని కలుపుకు పోయే విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని తెలుగుదేశం వర్గాల ద్వారానే తెలుస్తోంది.   తొలుత బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు. సానుకూలంగా ఉన్నారనే కంటే పొత్తు ఉంటే బెటర్ అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారని చెప్పొచ్చు. అందుకే బీజేపీతో తనకు విభేదాలు లేవనీ, గతంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయడానికి విభజన చట్టంలోని హామీల అమలులో జరిగిన తీవ్ర జాప్యమే కారణమని కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు విషయాన్ని పక్కన పెట్టి తెలుగుదేశం, జనసేన కూటమి మరింత బలోపేతం అయ్యి, సమన్వయంతో ఇరు పార్టీల ఓట్ల బదలాయింపు జరిగేలా చూసుకోవడంపైనే దృష్టి పెట్టారు. మరో వైపు జనసేనాని కూడా మోడీ ఆశీస్సులు ఉన్నాయని ఓ వంక అంటూనే ఆ పార్టీ నిర్ణయం వచ్చే వరకూ వేచి ఉండకుండా తెలుగుదేశంతో పొత్తు ప్రకటించడమే కాకుండా సీట్ల సర్దుబాటుకు కూడా రెడీ అయిపోయారు. అంటే వచ్చే ఎన్నికలలో బీజేపీతో పొత్తు లేకుండానే, అంటే ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు లేకుండానే ఎన్నికలకు వెళ్లడానికి తెలుగుదేశం, జనసేన దాదాపుగా నిర్ణయానికి వచ్చేశాయని చెప్పవచ్చు.  అయితే జాతీయ పార్టీ, పైగా కేంద్రంలో అధకారంలో ఉన్నమన్న దర్పంతో బీజేపీ ఒక వైపు పొత్తుకు తహతహలాడుతూనే నేల విడిచి సాము చేసిన చందంగా సీట్లు కోరుతోంది. పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం సీట్ల విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించాలనీ, రాష్ట్రంలో పార్టీ బలానికి తగినట్లుగా ఒకటి రెండు స్థానాలతో సంతృప్తి చెంది అయినా పొత్తు కుదుర్చుకోవాలని అంటున్నారు.  ఈ నేపథ్యంలో నే  జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఇరువురి మధ్యా పొత్తు విషయంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.   పైకి బీజేపీ ఇన్ని స్థానాలు, అన్ని స్థానాలూ అని డాంబికంగా ప్రకటనలు చేస్తున్నా.. లోపాయికారిగా మాత్రం గతంలో  అంటే 2014 ఎన్నికలలో పొత్తులో భాగంగా తెలుగుదేశంబిజెపి కి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాలు ఇస్తే చాలని చెబుతున్నట్లు సమాచారం. అయితే లోక్ సభ స్థానాల విషయంలో మాత్రం ఒకింత గట్టిగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు.  అరకు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి,  రాజంపేట, హిందూపూర్‌ లోకసభ స్థానాలను కేటాయించాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. పది అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించే పరిస్థితి లేదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. 2014 అన్ని స్థానాలు కేటాయించడానికి తెలుగుదేశం అంగీకరించడానికి కారణం అప్పట్లో జనసేన ఎన్నికల బరిలో లేదు. బయట నుంచి మద్దతు ఇచ్చింది. ఇప్పుడలా కాదు. ఆ పార్టీ పొత్తులో భాగస్వామి. పైగా బీజేపీ కంటే ఎన్నో రెట్లు ప్రజాబలమే కాకుండా ఓటు బ్యాంకు కూడా ఉన్న పార్టీ. ఈ పరిస్థితుల్లో కనీసం ఒక శాతం ఓటు స్టేక్ లేని బీజేపీకి పది స్థానాలు కేటాయించే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండదు. అందుకే బీజేపీతో సీట్ల విషయంలో బేరసారాలు ఆడటం కంటే  ఆ పార్టీని పొత్తుకు దూరంగా ఉంచడమే మేలని చంద్రబాబు భావిస్తున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   అన్నిటికీ మించి వైఎస్‌ షర్మిల  కాంగ్రెస్‌లో చేరి ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనుండటం కూడా  బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని అంటున్నారు.  షర్మిల ప్రభావం కాంగ్రెస్ పార్టీని ఏపీలో విజయతీరాలకు చేర్చే అవకాశాలు లేవుగానీ  పెద్ద సంఖ్యలో వైసీపీ ఓట్లను చీలుస్తుందని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీని పొత్తులోకి తీసుకుని కొన్ని సీట్లు వారి కోసం త్యాగం చేయాల్సిన అవసరం పెద్దగా లేదన్నది ఆయన భావనగా కనిపిస్తోంది.  అన్నిటికీ మించి గత నాలుగున్నరేళ్ల కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ రాష్ట్రంలో జగన్ అరాచక, అస్తవ్యస్త పాలనకు అన్ని విధాలుగా అండగా నిలబడి కాపాడుతూ వచ్చిందన్న భావన ప్రజలలో బలంగా ఉందనీ,  ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం అంటూ సానుకూలంగా ఉన్న వాతావరణాన్ని చేజేతులా పాడు చేసుకోవడమే అవుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పలు సర్వేలు కూడా తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీని కలుపుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ అని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు విషయంలో వెనక్కు తగ్గారనీ, పునరాలోచనలో పడ్డారని అంటున్నారు.

వైకాపా ఫినిష్.. జగన్ అధికారం ఇక వంద రోజులే.. రఘురామకృష్ణం రాజు

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ఓటమి ఆ పార్టీ అధినేత జగన్ కు కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ ఓటమిని అధిగమించి పార్టీని గెలుపు మార్గం పట్టించేందుకు ఆయన చేపట్టిన సిట్టింగుల నియోజకవర్గాల మార్పు కార్యక్రమం పార్టీ పరిస్థితిని పతనం నుంచి పాతాళానికి దిగజారిపోయేలా చేస్తోంది. ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అదే చెబుతున్నారు. శ్రీకాకులం నుంచి అనంతపురం వరకూ వైసీపీ గెలిచే స్థానాలు 18 నుంచి 20 మాత్రమేనని రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు.  ఇక పోటాపోటీగా ఉండే ఓ పాతిక స్థానాలలో ఓ 15 అటూ ఇటై గెలిచినా వచ్చే ఎన్నికలలో వైసీపీకి 35 స్థానాలకు మించి దక్కు పరిస్థితి లేదని ఆయన కుండబద్దలు కొట్టేశారు. అయితే ఇప్పుడు నెల్లూరు కు చెందిన పెద్దా రెడ్లు, గుంటూరు కు చెందిన మంచి వ్యక్తులు తెలుగుదేశం కూటమి వైపు చూస్తున్నారనీ, వారు కూడా జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తు ఇక జగన్ కు గెలుపు ఆశ  అనేది దేవదాసు సినిమాలోని కలయిదని... అనే పాట చందమేనని అన్నారు.  ఆ పాటను  వైసీపీ నాయకులు ప్రాక్టీస్ చేస్తే మంచిదని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. శనివారం(డిసెంబర్ 6) రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన  తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.  ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని, ఆయన దాన గుణాన్ని, ప్రజల్ని ప్రేమించే విధానాన్ని ఆరు రోజుల్లోనే  తెలుసుకొని  భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మరో వారం,  పది రోజుల వ్యవధిలో ఆయన తెదేపా, జనసేన పార్టీలలో  ఏదో ఒక పార్టీలో చేరే అవకాశాలున్నాయని క్రికెట్ అభిమానులు భావిస్తురన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి నాకు ఆరు నెలల సమయం పడితే, అంబటి రాయుడు ఆరు రోజులనే అర్థం చేసుకొని  పార్టీని వీడారన్నారు. బ్యాటింగ్ చేసి రెండు వందల పరుగులు చేస్తాడనుకున్న రాయుడు, హిట్ వికెట్ అయ్యారని కొంతమంది కామెంట్లు చేయవచ్చు. రాబోయే రోజుల్లో మునిగిపోయే నావ వంటి వైకాపాను  వీడాలని  అంబటి రాయుడు తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలిస్తే, క్రికెట్ లో ఎంత వేగంగా అయితే పరుగులు చేస్తారో అంతే  వేగంగా నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించాల్సిందేనని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.  నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ శాసనసభ్యులు  ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఇప్పటికే  ఆ పార్టీని వీడి  తెదేపాలో చేరిన విషయం తెలిసిందేనని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఇప్పుడు మరో ఇద్దరు  సనామదేయులు రానున్న రెండు మూడు రోజులలో తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలున్నాయని చెప్పారు.  ఇక జగన్ సమీప బంధువు బాలినేని రాజకీయాల్లో ఉన్నంతవరకు  వైసీపీలోనే కొనసాగుతానని చెప్పినప్పటికీ,  తిట్టమంటే తిట్టలేను, కొట్టమంటే కొట్టలేనని చెప్పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బయటపడిపోయారు. కృష్ణదేవరాయలను గుంటూరుకు వెళ్ళమంటే, నిర్మొహమాటంగా నో అనేశారు. అమరావతి రైతులకు అంతగా అన్యాయం చేశాక మెడ మీద తలకాయ ఉన్న ఎవరైనా అక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. గుంటూరు  స్థానం  నుంచి వైకాపా తరఫున బుద్ధి ఉన్నవారెవరూ పోటీ చేయరని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఒకవేళ పోటీ చేసినా దారుణంగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎవరైనా విజయవకాశాలు మెండుగా ఉన్న తెలుగుదేశం  తరఫున పోటీ చేయాలని భావిస్తారు.ఎందుకంటే  ఆ ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం నాయకత్వం ఎన్నో ప్రణాళికలను అమలు చేసింది. తెలుగుదేశం తరుపున పోటీ చేసే వారు నూటికి నూరు పాళ్ళు విజయం సాధించే అవకాశం ఉందని చెప్పారు . గుంటూరులో ఇంత  నెగిటివిటీ ఉందని అంబటి రాయుడు అర్థం చేసుకున్నారు కనుకనే పార్టీని వీడారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆ కారణంతోనే అక్కడ నుంచి పోటీకి కృష్ణదేవరాయలు నిరాకరించారని రఘురామకృష్ణం రాజు  అన్నారు.  ఇక  పన్నెండు గంటలు ఎదురు చూసినా కాపురామచంద్రారెడ్డికి 12ఎదురు చూసినా జగన్ మోహన్ రెడ్డి దర్శన భాగ్యం దక్కలేదనీ చెప్పిన రఘురామకృష్ణం రాజు,  దీంతో ఆయన ఇంత కాలం భగవత్ స్వరూపుడిగా భావించి, కీర్తించిన జగన్ పై ఆగ్రహించిన   మీడియా సమక్షంలోనే తాడేపల్లి ప్యాలెస్ కు ఓ దండం అంటూ నిష్క్రమించారని గుర్తు చేశారు. పూతలపట్టు శాసనసభ్యుడు ఎమ్మెస్ బాబును బెదిరించడంతో ఆయనతో వైకాపాలోనే  కొనసాగుతానని చెప్పినట్లు తెలిసింది. అయితే ఇంకొన్ని వారాలపాటు  భయపెడితే భయపెట్టవచ్చు. కానీ ఆ తరువాత వారు నిజాలని బయట పెడుతారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.  ఇక గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి అయితే రెంటికి చెడ్డ రేవడిలా  తయారైందని రఘురామకృష్ణం రాజు అన్నారు. వైకాపాను వీడి గుడివాడ అమర్నాథ్ జనసేనలో చేరలేని పరిస్థితి  నెలకొంది. గుడివాడ అమర్నాథ్ పరిస్థితి చూసి తన మనసు  నొచ్చుకుందన్నారు. అమర్నాథ్ కు మరొకచోట సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తానే సెల్ఫీ ఫోటో ఇచ్చానని చెప్పుకున్న అమర్నాథ్, పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అయినా ఆయన చేత అన్యాయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి అనుచిత విమర్శలు చేయించారు. జగన్మోహన్ రెడ్డినే నమ్ముకున్న అమర్నాథ్ ను ఇలా మోసగించడం దారుణమన్నారు. ఎమ్మెస్ బాబు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి  తరహాలోనే అమర్నాథ్ కూడా  తాను టికెట్ ఇచ్చినా... ఇవ్వకపోయినా  వైకాపాలోనే కొనసాగుతానని చెబితే చెప్పవచ్చు. కానీ అమర్నాథ్ కే ఇలా జరిగిందంటే నమ్ముకున్న నాయకుడికి   క్రెడిబిలిటీ  ఎలా ఉంటుంది. ఏముంటుందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అమర్నాథ్ పరిస్థితే ఇలా ఉంటే... జోగి రమేష్ ను ఏం చేస్తారో తెలియదు. స్పీకర్ స్థాయి పక్కనపెట్టి  జగన్ కోసం వందిమాగధుడి   స్థాయికి దిగజారిన   తమ్మినేని సీతారాంకు కూడా షాక్ ఇచ్చారు. స్థాయిని మరిచి దిగి వచ్చిన తరువాత కూడా టికెట్ లేదని జగన్ తమ్మినేనికి మొండి చేయి చూపడంతో   ఆయన అనారోగ్యం పాలయ్యారని రఘురామకృష్ణం రాజు అన్నారు. అనంతపురం నుంచి మొదలుకొని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు తో పాటు ఉభయ గోదావరి జిల్లాలలోనూ ఇదే తరహాలో శాసన సభ్యులకు  మింగుడు పడని నిర్ణయాలను జగన్ తీసుకున్నారనీ,  శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని  సీతారాం , విశాఖపట్నంలో మంత్రి అమర్నాథ్ షాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఒక వేళ ఎమ్మెల్యేలు తప్పు చేశారనుకుంటే ఇంత మంది ఎమ్మెల్యేలు   ఒకేసారి  తప్పు చేస్తారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి పైన కోపం ఉన్నది. ఆ కోపాన్ని  జగన్ ఎమ్మెల్యేలపైకి  తోసేస్తున్నారు. స్పీకర్ గా  తమ్మినేని సీతారాం శాసనసభలో అడ్డగోలుగా సహకరించినందుకు ప్రజలకు కోపగించుకున్నారంటే అర్థం ఉంది. అంతేకానీ ఆయన తన నియోజకవర్గ ప్రజలకు  చేసిన అన్యాయం ఏముంది?, న్యాయం ఉందో లేదో పక్కన పెడితే, కోపగించుకోవడానికి ఆయన చేసిన అన్యాయం ఏమైనా ఉందా? అంటూ నిలదీశారు.    పాలకులు తెలుగు భాషకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, అటువంటి పాలకులకు బుద్ధి చెప్పాలన్న  జగన్మోహన్ రెడ్డి సాహసానికి  సెల్యూట్ చేస్తున్నానని రఘురామకృష్ణం రాజు  తెలిపారు.  రాజమండ్రిలోని చైతన్య రాజు కాలేజీలో  తెలుగు మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్, స్వామి స్వరూపానంద తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా జగన్మోహన్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు  పరిశీలిస్తే తెలుగు భాషకు అన్యాయం చేసింది ఎవరో  అందరికీ తెలుస్తుంది. మూడవ తరగతి విద్యార్థులకు కూడా టోపెల్ పరీక్షలు నిర్వహిస్తానని, అమ్మ, నాన్న అని పిలువ వద్దు... మమ్మీ డాడీ అని పిలవాలని, ఇంగ్లీష్ భాషలో మీడియంలో బోధిస్తామంటే తనపైనే నిందలు వేస్తున్నారని  విద్యార్థుల తల్లిదండ్రులను రెచ్చగొడుతున్నది  ఎవరని  రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మాతృభాషను ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాలి. తెలుగులో స్పష్టంగా మాటలు పలికే విధంగా ఉండాలి. ప్రపంచ భాషలలో కూడా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా  తెలుగు భాష గుర్తింపు పొందింది. తెలుగు భాషను పాలకులు చంపే ప్రయత్నాన్ని చేస్తుంటే, 2019 నవంబర్లో  విభేదించి మాట్లాడినందుకే  జగన్మోహన్ రెడ్డికి, నాకు మధ్య తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష ఔన్నత్యాన్ని  తెలుసుకొని, భాషా పరిరక్షణ కోసం కృషి చేయాలి. ఇంగ్లీష్ మీడియం వద్దని ఎవరూ అనడం లేదు. తెలుగు మీడియంలో  కొన్ని క్లాసుల వరకు చదువుకునే వారికోసం చదువుకునే  వెసులుబాటును కల్పించాలి. మాతృభాషలో  ఏదైనా విషయాన్ని సులువుగా ఆకలింపు చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడే ఏమి కొత్తగా ప్రవేశపెట్టలేదు. గత ముఖ్యమంత్రుల హయాంలో కూడా  ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు బోధన జరిగింది. మాతృభాషను గౌరవించని వారు, మనల్ని గౌరవిస్తారని అనుకోవడం  అత్యాశే అవుతుంది. తల్లిని గౌరవించలేనివాడు తల్లి భాషను గౌరవిస్తారా? అని రఘురామ నిలదీశారు.  తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు మాతృభాష నేర్చుకునే విధంగా కృషి చేయాలన్నారు.  మాతృభాష నేర్చుకున్న తర్వాత, ఇంగ్లీష్ భాషను నేర్చుకుందామని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరిట ఆర్భాటంగా ప్రారంభించిన  కార్యక్రమం మూడవ రోజు అడ్రస్ లేకుండా పోయిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. తొలిరోజు  క్రీడా  శాఖ మంత్రి రోజాకు ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  క్రికెట్ పాఠాలను నేర్పించి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక జగన్ ఆర్భాటంగా మొదలు పెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మూడో రోజుకే అడ్రస్ లేకుండా పోయిందన్నారు.  రాష్ట్రంలో రాజకీయ ఆటలు తప్ప ఆడుదాం ఆంధ్ర ఆటలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఆడుదాం ఆంధ్ర కంటే ఎక్కువగా  అంగన్వాడీల ఆటలు, పాటలు వినిపిస్తున్నాయి. ఆడుదాం ఆంధ్ర కోసం కేటాయించిన 100 కోట్ల రూపాయల నిధులు అవుట్ అని  అర్ధం చేసుకోవాలన్నారు. వ్యక్తిగత పబ్లిసిటీ పిచ్చితో  అన్నింటిపై బొమ్మలను వేసుకొన్నారు. రాజమండ్రిలో మూత్రశాలల వద్ద కూడా ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి, స్థానిక శాసన సభ్యుడు జక్కంపూడి రాజాల ఫోటోలను ముద్రించినట్లుగా మీడియాలో చూశానని చెప్పారు.   కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల ని ఉద్దేశించి వైసీపీ చెందిన ఒక మహిళా ప్రతినిధి, విదేశీ ప్రతినిధి తో పాటు  పలువురు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు జుగుస్సా కరంగా  ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు . మీ ఇంటి మహిళకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదా అని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఏ ఇంటి మహిళను కూడా ఇంతలా కించపరచకూడదు. తన రాజకీయ అవసరాల కోసం వైఎస్ షర్మిలను కాళ్లు అరిగేలా తిప్పి, ఆమెకు ఏ పదవి లేకుండా చేసి, ఇప్పుడు ఆమె తన దారి తాను చూసుకుంటే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కొమ్ముకాసే పెయిడ్ ఆర్టిస్టులు  కొంతమంది  చేత  షర్మిల, కేఏ పాల్ కు ఎక్కువ, కమ్యూనిస్టులకు తక్కువ అని ఏక వచనంతో  అపహస్యం చేయించడం దారుణమని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఎవరు కే ఏ పాల్ కు ఎక్కువో, కమ్యూనిస్టులకు తక్కువనో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న 100 రోజుల్లో వైకాపాకు పడనున్న డెంట్ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవడానికి గేట్ రెడీ అని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసిన వైఎస్ షర్మిల కుటుంబ ఆపేక్షలన్నింటినీ పక్కనపెట్టి వైకాపా ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించేది లేదని పేర్కొన్నారు. ఏపీలో జరగబోయే మహాసంగ్రామానికి వైఎస్ షర్మిల కార్యోన్ముఖురాలు కావడంతో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి  కలత చెంది, తన కుమారుడు భార్గవ రాముడు   పర్యవేక్షిస్తున్న సోషల్ మీడియాను  విభాగం ద్వారా షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేయించడం దారుణమని రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు . తమ వేతనాలు పెంచాలని ఆందోళనలు చేస్తున్న  అంగన్వాడీలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  ఎస్మా చట్టాన్ని  ప్రయోగించినట్లుగా  రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అంగన్వాడీల పై ఎస్మా చట్ట ప్రయోగం చెల్లుతుందా?, చెల్లదా?  అన్నదానిపై స్పష్టమైన అవగాహన  లేదన్నారు. గౌరవ వేతనంతో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలనుకోవడం దారుణం. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన దాఖలాలు లేవు. వారేమి ప్రభుత్వ సిబ్బంది కాదు.  ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీని మాత్రమే  అమలు చేయమని వారు కోరుతున్నారు. ఒకవేళ వారి కోరిక సమంజసం కాకపోతే పిలిపించి మాట్లాడాలి. వారి డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, నిర్లక్ష్యంగా నియంత లాగా, రాచరిక వ్యవస్థలో వ్యవహరించినట్లుగా  వ్యవహరించడం అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో  ఏమాత్రం సరికాదన్నారు. సచివాలయానికి నిత్యం వెళ్లకుండా ఏదో మంత్రి వర్గ సమావేశానికి మాత్రమే హాజరయిన ముఖ్యమంత్రిని ఇప్పటివరకు  చూడలేదనీ,  ఇంట్లోనే కూర్చొని, అప్పుడప్పుడు బటను నొక్కే కార్యక్రమం పేరిట హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తూ, ప్రజలను, మంత్రులను, శాసన సభ్యులను  కలవకపోవడం సిగ్గుచేటన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని  గత నాలుగున్న ఏళ్లు గా మొదలు పెడతామని చెప్పిఇప్పటి వరకూ ఆరంభించలేదు.   ప్రజలు ఎవరినైనా సరే  అందుబాటులో ఉండి అన్ని సేవలను అందిస్తారని ఉద్దేశంతోనే ఎన్నుకుంటారు కానీ, ప్యాలెస్ లలో కూర్చుని ప్రజాసమస్యలు పట్టిచుకోని వ్యక్తిని కాదన్నారు. ఇక జగన్ అడ్డోలు నిర్ణయాలకు న్యాయస్థానాలలో  రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తప్పడం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .  జనవరి 13న తన నియోజకవర్గానికి వెడుతున్నానని రఘురామకృష్ణం రాజు చెప్పారు. దాదాపు నాలుగేళ్ల తరువాత తాను తన సొంత నియోజకవర్గంలో అడుగుపెడుతున్నానని చెప్పిన ఆయన  ఈ నాలుగేళ్లుగా నియోజకవర్గానికి ఎందుకు దూరంగా ఉన్నానో, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటున్నాను. వారితో మాట్లాడుతూనే ఉన్నాను. అయినా, మతం ముసుగులో కొంతమందికి డబ్బులు ఇచ్చి నన్ను ప్రశ్నించేందుకు వైకాపా నాయకత్వం మనుషులను పంపనుంది. నన్ను ప్రశ్నిస్తే... అన్ని విషయాలు బయట పెడతాను. ఇవన్నీ మళ్లీ చెప్పించాలనుకుంటే,   పంపండి అని సవాల్ చేశారు. ఇక  పోలీసులు తమ పని తాము చేసుకుంటే మంచిదనీ,  రాబోయే రోజుల్లో పోబోయే ఈ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పారని చెత్త కేసులు పెట్టి, పిచ్చి పనులు చేయకుండా సంయమనం పాటించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి కార్యక్రమాన్ని చేపడితే, ప్రతిరోజు నేను  వారి ఇండ్లలోనే ఉంటున్నానని  రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రాన్ని తిరిగి బతికించడానికి  తెదేపా అధినేత  చంద్రబాబు నాయుడు ఇచ్చిన రా కదిలి రా పిలుపునందుకొని  కనిగిరి నియోజకవర్గ సభను  ప్రజలు బ్రహ్మాండంగావిజయవంతం చేశారని రఘురామకృష్ణం రాజు చెప్పారు.