ఆ రెండూ కాదు మెట్రోభవన్ ఫైనల్ ... సిఎం కార్యాలయం ఇదే
posted on Jan 8, 2024 @ 3:02PM
ప్రగతి భవన్ కాస్తా ప్రజా భవన్ గా నామకరణం చేసిన తర్వాత ఇక్కడే నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం అని ముందుగా అనుకున్నప్పటికీ తాజాగా బేగంపేట మెట్రోభవన్ అని వార్తలందుతున్నాయి. ప్రజా భవన్ డిప్యూటి సిఎం నివాసంగా మార్చిన తర్వాత ఎంసిఆర్ హెచ్ ఆర్ డి,నానక్ రాంగూడలోని గ్రోత్ కారిడార్ అని వార్తలు వెలువడినప్పటికీ తాజాగా బేగంపేటలోని మెట్రోభవన్ సిఎం క్యాంపు కార్యాలయం అని విశ్వసనీయ సమాచారం. సీఎం క్యాంపు కార్యాలయం కోసం బేగంపేట్‌లోని మెట్రో భవనాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రెండు మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ అవి ట్రాఫి క్, సెక్యూరిటీపరంగా అనుకూలంగా లేక చివరికి మెట్రో భవన్ అయితే అనుకూలంగా ఉం టుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న ప్రగతిభవన్‌ను ఇతర అవసరాలకు వినియోగిస్తుండటంతో కొత్తగా సీఎం కోసం క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం సీఎం స్వయంగా ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనాన్ని పరిశీలించి అక్కడే ఖాళీ స్థలంలో క్యాంపు కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో ఉద్యోగులు, అధికారులకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్కడినుంచి సచివాలయం వరకు ఉండే రోడ్డు అత్యంత ట్రాఫిక్ రద్దీతో ఉంటుంది. దీంతో క్యాంపు కార్యాలయానికి వచ్చిపోయే సందర్శకులతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ సందడిగా మారే అవకాశం ఉండటంతో మరోచోట క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంసిఆర్ హెచ్ ఆర్డీలోని ఖాళీ స్థలంలో ఆఫీస్ నిర్మించాలనుకున్నా.. ఆ ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. అలాగే నానక్‌రామ్‌గూడలోని గ్రోత్ కారిడార్ బిల్డింగ్‌ను సీఎం క్యాంప్ ఆఫీసుగా మార్చే అంశంపై పరిశీలనలు జరిగినా అదీ వర్క్ ఔట్ కాలేదని తెలిసింది. తాజాగా బేగంపేట్‌లోని మెట్రో భవనాన్ని సీఎం క్యాంప్ ఆఫీసుగా ఖరారు చేసినట్టు సమాచారం. రెండుమూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ ట్రాఫిక్, సెక్యూరిటీపరంగా అనుకూలంగా లేక చివరికి బేగంపేట్ మెట్రో భవన్ అయితే అన్నింటికీ అనుకూలంగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.