సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను  జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం సీజేఐ బెంచ్ కు రిఫర్ చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇరువురు న్యాయమూర్తులూ భిన్న తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేశారు.   దీంతో స్కిల్ కేసులో 17-ఏ సెక్షన్ వర్తింపు వ్యవహారం ప్రధాన న్యాయమూర్తి సారధ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. 17-ఏ వర్తింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్‌కి నివేదిస్తున్నామని జస్టిస్ బేలా త్రివేది అన్నారు. స్కిల్ కేసులో  జగన్ సర్కార్ చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ లో ఉన్న  చంద్రబాబు.. తాను ఎటువంటి తప్పూ చేయలేదనీ, తనపై కేసు రాజకీయ ప్రేరేపితమనీ, రాజకీయ కక్ష సాధింపులో భాగమని పేర్కొంటూ క్వాష్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టివేశాయి. దీంతో ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. సుప్రీంలో సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు రిజర్వ చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు మంగళవారం (జనవరి 16)న వెలువడింది. దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఈ కేసు తీర్పు విషయంలో న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వెలువరించడంతో సీజేఐ బెంచ్ కు రిఫర్ చేశారు.  అక్కడ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాదులు, చంద్రబాబు న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు.  ఏపీ  సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ  వాదనలు ఉన్నాయంటున్నారు. అవినీతి జరిగింది. దానిలో  చంద్రబాబు  పాత్ర ఉందా లేదా అన్నది ఆయనను విచారించి  తెలుసుకుంటాం అన్నట్లుగా ముకుల్ రోహత్గీ వాదించారు.  చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పని  సరి  అనీ  చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే  కోర్టుకు తెలిపారు. 17ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని చెబుతూ అందుకు ఉదాహరణగా పలు కేసులలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను ఉటంకించారు. పలు సందర్భాలలో హరీష్ సాల్వే వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించారు. ఒక సందర్భంలో అయితే ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని అనిపిస్తోందని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దీంతో అంతా చంద్రబాబుకు క్వాష్ వర్తిస్తుందంటూ తీర్పు వెలువడుతుందని భావించారు. అయితే   ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు  జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందా? లేదా అన్న విషయంపై తీర్పు వెలువరించకుండా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు.  ఇలా ఉండగా  ద్విసభ్య ధర్మాసనంలో ని ఇరువురు న్యాయమూర్తులలో ముందుగా జస్టిస్ అనిరుధ్ బోస్ తన తీర్పు వెలువరిస్తూ స్కిల్ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందని విస్పష్టంగా తేల్చారు. 17ఏ అమలులోకి రాకముందు జరిగిన దర్యాప్తును ఈ కేసులో చంద్రబాబు అరెస్టుకు వర్తింప చేయడం కూడదని పేర్కొన్నారు. అయితే చంద్రబాబుకు విధించిన రిమాండ్ రిపోర్టును కొట్టివేయలేమని పేర్కొన్నారు.  ఇక మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదని తన తీర్పులో పేర్కొన్నారు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్‌ చేయలేమని తన తీర్పులో పేర్కొన్నారు.   ఇరువురు న్యాయమూర్తులూ భిన్న తీర్పులు వెలువరించడంతో  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. 

బాబూ ఓ రాంబాబు!

తెలుగుదేశం పార్టీని   విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ స్థాపించారు.  జనసేన పార్టీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించారు.  ఆ రెండు పార్టీలలో  కళా వల్లభులు పెద్దగా కనిపించరు. అయతే జగన్ పార్టీ అయిన వైసీపీలో మాత్రం  మహానటుల స్థాయికి ఏ మాత్రం తగ్గనిక ళాకారులంతా  వై గుట్టలుగుట్టలుగా ఉన్నారనే ఓ చర్చ అయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో వైరల్ అవుతోంది.   తాజాగా సంక్రాంతి పండగ వేళ.. భోగి పండగను పురస్కరించుకొని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు   సంబరాల రాంబాబులా మారి  వేసిన స్టెప్స్ కెవ్వు కేక పుట్టించాయని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓ ప్రచారం వీర లెవల్ లో నడుస్తోంది. అలాగే నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలంతా ఈ కార్యక్రమానికి హాజరై.. సంబరాల రాంబాబు డ్యాన్స్ కార్యక్రమాన్ని  కనులారా వీక్షించి ఆనందించేశారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   గతంలో రాజకీయ పార్టీ అధినేతలపై మాత్రమే పాటలు ఉండేవని.. కానీ అంబటి రాంబాబు..తనపై పాట రాయించుకొని మరీ ఇలా డ్యాన్స్ చేయడం పట్ల ప్రజలలోనే కాదు, పరిశీలకులు, రాజకీయ వర్గాలలో సైతంఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు..  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రెస్‌మీట్లు పెట్టి మరీ వ్యంగ్య బాణాలు సంధిస్తారని.. అయితే అదే అంబటి రాంబాబు... ఇలా స్టెప్స్ వేయడమే కాకుండా.. నేను సంబరాల రాంబాబును కూడా అంటూ భోగి మంటల సాక్షిగా ఇచ్చిన క్లారిటీ మాత్రం అదిరిపోయిందని వారు చెబుతున్నారు.     బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందంటే.. పవన్ కల్యాణ్ మళ్లీ పెళ్లి చేసుకొనే సమయానికి అంటూ తన వ్యంగ్య వైభవన్నా చాటిన   అంబటి రాంబాబుకు.. జలవనరుల శాఖను కేటాయించే కంటే.. మరో శాఖ ఏదైనా కేటాయిస్తే బాగుండేదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో.. ఓ హీరోయిన్‌ని కూడా తీసుకు వచ్చి.. ఆమెతో కూడా కాలు కదిపి ఈ అంబటి రాంబాబు కనుక స్టెప్లు వేస్తే.. ఇంకా ఈ సీన్ సూపరో సూపర్‌గా ఉండేదని సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓ వేళ అంబటి రాంబాబు ఓటమి పాలైనా కొరియాగ్రాఫర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం కలిగిందని సత్తెనపల్లి  నియోజకవర్గ ప్రజలు అంబటి రాంబాబు భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తున్నారు.    అయినా.. అంబటి రాంబాబులో చాలా టాలెంట్ ఉందని.. ఆయనలో.. ఆ టాలెంట్‌ను వైసీపీ అధినేత జగన్ గుర్తించారని.. అందుకే   ఆయన్ని వదులు కోలేదని..  కానీ అంబటి రాంబాబు మంత్రి కావడం వల్ల.. ఆయనలో సహజ నటనంతా..మళ్లీ ఇలా సంక్రాంతి పండగ వేళ బయటకు తన్నుకొచ్చిందని.. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో ఆయన నటించారని.. అయితే ఆయన నటనను ప్రజలంతా దాదాపుగా మరిచిపోయారని.. కానీ ఆయనలోని ప్రతిభ పాటవాలు చూసి.. రాబోయే కాలానికి కాబోయే ఓ సహజ నటుడు టాలీవుడ్‌కి.. అది ఇలా సంక్రాంతి పండగ వేళ దొరికాడని.. దీంతో తెలుగు సినీ కళామతల్లి  సైతం సిగ్గు మెగ్గలతో మెలికలు తిరుగుతూ తెగ మురిసిపోతుందని వారు వివరిస్తున్నారు.    జగన్ పార్టీలో కళాకారులకు కొదవే లేదని.. అంబటి రాంబాబుతోపాటు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, ఆర్కే రోజా, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్.. ఇలా ఇలాంటి  డైమండ్ పీస్‌ల సంఖ్య పెద్దదే అయినా  వారిలో అంబటి రాంబాబు అగ్రస్థానంలో నిలుస్తారనడంలో సందేహం లేదంటున్నారు.   గత సంక్రాంతి పండగ వేళ.. ఇదే అంబటి రాంబాబు, ఇదే సత్తినపల్లిలో గ్రూప్ డ్యాన్స్ చేసి చెలరేగిపోయారని.. దీంతో ఫ్యాన్ పార్టీ నాయకుడిగా.. ఎమ్మెల్యేగా... మంత్రిగా ఆయనకు రాని పబ్లిసిటీ.. ఒకే ఒక్క గ్రూప్ డ్యాన్స్‌తో పీక్స్‌కు చేరిందని.. మరోవైపు అంబటి రాంబాబు డ్యాన్స్‌‌పై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తే.. తాను చేసింది ఆనంద తాండవం అంటూ పక్కా క్లారిటీతో వివరించారని ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఏదీ ఏమైనా.. అంబటి రాంబాబులో టాలెంట్ ఉందని.. అది కూడా కెవ్వు కేకంతగా ఉందని.. అందుకే  .. బాబూ ఓ రాంబాబు.. అంటూ ఆయనపై సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే ఛీప్  పబ్లిసిటీ... పండగ నాడు మద్యం, మాంసం పంపిణీ 

పురాణాల దగ్గర నుంచి దానాలు చేయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. మనకున్న వాటిని అవసరంలో ఉన్న ఇతరులకి దానం చేసి సహాయం చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. అందుకే కుడి చేత్తో చేసిన దానం గురించి ఎడమ చేతికి కూడా తెలియకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఎపిలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు సంక్రాంతి కానుకగా ఇచ్చిన ఫుల్ బాటిల్స్, కోడి మాంసం సోషల్ మీడయా వేదికగా తెగ వైరల్ చేసుకున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి తరువాత రోజు జరుపుకునే కనుమ  పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు. పండుగ నాడు కోడి కూర, కిక్కిచ్చే చుక్క ఉంటే కొందరికి పండుగే. దసరా పండుగ నాడు యజమానులు తమ వద్ద పనిచేసే వాళ్లకు బోనస్ లు ఇస్తుంటారు. ఇక రాజకీయ నేతలైతే తమ మద్దతుదారులకు మందు, ముక్క తప్పనిసరిగా ఇస్తారు. ఇలాంటి ఘటననే విశాఖలో చోటుచేసుకుంది. నిరుడు  దసరా పండుగ నాడు విశాఖ దక్షిణ మండల వైసీపీ అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్‌ తమ మద్దతుదారులు, మరికొంత మందికి కోడి, లిక్కర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విశాఖ డాబా గార్డెన్స్‌లోని వైసీపీ ఆఫీసు వద్ద అప్పట్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీ నేత కోడి, మద్యం పంపిణీ చేశారు. గతంలో కేజీ మటన్‌ ఇచ్చామని, ఈ ఏడాది కోడి, క్వార్టర్‌ మందు ఇస్తున్నట్లు ఆయన బహిరంగంగానే చెప్పుకున్నారు. గత ఏడాది వైసీపీ విశాఖ దక్షిణ మండల అధ్యక్షుడు చేసిన ప్రచారాన్ని వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఓర్వ లేకపోయారు. సరిగ్గా సంవత్సరం కాపు కాశారు. సోమవారం నాడు కనుమ పండగను పురస్కరించుకుని ఒక రోజు ముందు అంటే సంక్రాంతినాడే వైసీపీ కార్యకర్తలు, నాయకులకు మద్యం పంపిణీ చేశారు. ఇది చీప్ లిక్కర్ కావడం గమనార్హం. జగన్ పాలనకు దర్పం పట్టే విధంగా వైసీపీ ఎమ్మెల్యే తన కాలేజి క్లాస్ రూమ్లలోనే చీప్ లిక్కర్ పంపిణీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. తరగతి గదిలో విద్యార్థులు కూర్చొనే బెంచీలపై వైసీపీ నేతలను కూర్చోబెట్టి పంపిణీ చేయడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాలేజి ప్రాంగణంలోకి వైసీపీ శ్రేణులు భారీగా తరలి రావడం ఫుల్ బాటిల్స్, కోడి మాంసం తీసుకొని ఇంటికి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి.  మద్యపాన నిషేధం అంటూ ప్రచారం చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మద్యం బాటిల్స్ పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

ఈడీ.. కవిత.. దాగుడుమూతలు!

కారణాలు ఏమైనా ఢిల్లీ మద్యం కుంభకోణంలో  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తనయ, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు వ్యవహారం గత కొంత కాలంగా రాజకీయ ప్రాముఖ్యత కలిగిన అంశంగా మారిపోయింది. ఆమెను ఈడీ విచారణకు పిలవడం, ఆమె కోర్టును ఆశ్రయించడం, ఈడీ వేగం మందగించడం వంటి అంశాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ హాట్ టాపిక్ గానే ఉన్నాయి. కవితను అరెస్టు చేసే విషయంలో ఈడీ ఇదే కేసులో మిగిలిన నిందితుల పట్ల చూపిన చొరవ, దూకుడు చూపలేదన్నది మాత్రం వాస్తవం. సరిగ్గా ఈ అంశమే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య మైత్రిని సామాన్య జనానికి కూడా అర్ధమయ్యేలా చేసింది. అలాగే , బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అన్న ఆరోపణలే వాస్తవమన్న భావన ప్రజలలో కలగడానికి దోహదపడింది. ఫలితంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీలు జమిలిగా నష్టపోయాయి. సరే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడింది. ఈ సారి ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ కు దూరం జరిగితేనే ఏదో మేరకు లబ్ధి పొందుతామన్న ఆలోచనలో ఉంది.  అదే సమయంలో బీఆర్ఎస్ తాము బీజేపీకి దగ్గర అన్న భావన ప్రజలలో కలిగేలా వ్యవహరించడానికి మొగ్గు చూపుతోంది. అందులో భాగమే కవిత హిందుత్వ మంత్రం జపించడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ వైఖరి ఇలాగే కొనసాగితే.. భారీ నష్టం తప్పదన్న భావనలో ఉన్న కమలం.. బీఆర్ఎస్ తమకు ప్రత్యర్థి పార్టీయే అని ప్రజలను నమ్మించడానికి  బీజేపీ శతథా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బీజేపీతో తమకు వైరం లేదని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ తంటాలు పడుతోంది. సరిగ్గా ఈ తరుణంలో  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది.  అయితే ఆ నోటీసులను కవిత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించదు. తనను విచారణకు పిలిచే హక్కు ఈడీకి లేదని పేర్కొంటూ, సుప్రీం కోర్టు రక్షణ తనకు ఉందని ఈడీ నోటీసులకు సమాధానం ఇచ్చి ఊరుకున్నారు. అయినా మద్యం కుంభకోణం తెరమీదకు వచ్చి కవితపై ఆరోపణలు వెల్లువెత్తనప్పటి నుంచీ  కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ విచరణ పేరిట దాగుడు మూతలు ఆడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు అరెస్టు, అదిగో రెండు మూడు రోజుల్లో అరెస్టు అంటూ లీకులు వదులుతూ పొలిటికల్ హీట్ క్రియేట్ చేయడం వినా ఆ రెండు సంస్థలూ కవిత అరెస్టు విషయంలో ముందుకు అడుగేసింది లేదు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈడీ ఏమైనా దూకుడు పెంచుతుందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో ఇలా నోటీసుల మీద నోటీసులు ఇచ్చి కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఈడీ ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడాన్ని చూపుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఎలాగైతే కేజ్రీవాల్ కు రక్షణగా నిలిచిందో.. కవితకు కూడా సుప్రీంలో విచారణలో ఉన్న పిటిషన్ రక్షణగా నిలుస్తుందని అంటున్నారు.   తనను  ఇంటి వద్దే విచారించాలని కవిత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.  విచారణల విషయంలో మహిళలకు చాలా వెసులుబాట్లు ఉండాలని ఆమె తరపు లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. ఆ నేపథ్యంలో అప్పట్లో  కవితను విచారణకు పిలవకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఆమె పిటిసణ్ విచారణను  వాయిదా వేసింది. దాంతో ఆ మధ్యంతర ఉత్తర్వులను చూపుతూ తాను విచారణకు హాజరయ్యేది లేదని కవిత స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఈడీ నోటీసుకు సమాధానంగా పంపారు.  దీంతో ఈడీ తదుపరి ఏ చర్య తీసుకోనుందన్నది ఆసక్తిగా మారింది. కవిత పిటిషన్ విచారణ వేగవంతం చేయాలని సుప్రీం కోర్టును కోరుతుందా చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఈడీ నోటీసుతో తెలంగాణ రాజకీయాలలో మళ్లీ  మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టు అవుతారా? తేదా గతంలోలా దాగుడుమూతలతో సరిపెట్టేస్తారా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో విస్తృతంగా జరుగుతోంది.  

ఫ్యామిలీ ప్యాకేజీ లెక్కన జగన్ టికెట్ల పందేరం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ఆయన పాలన పదే పదే రుజువు చేస్తున్నది. పరిశీలకులు కూడా జగన్ హామీ ఇచ్చారంటే అది నెరవేరదని తేలిపోయినట్లేనంటూ సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. అలాగే ఓ మాట చెప్పారంటే దానికి కట్టుబడి ఉండే తత్వం ఆయనలో లేదని చెబుతున్నారు. గతంలో పలు సందర్భాలలో జగన్ తమ పార్టీలో కుటుంబానికి ఒకటే టికెట్ అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించారు. అయితే ఆచరణలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముంగిట సిట్టింగుల మార్పు అంటూ ఓ వింత ప్రయోగానికి తెరలేపి ఆశావహుల్లో, సిట్టింగుల్లో, నేతల్లో, క్యాడర్ లో నిరాశనూ, నిరుత్సాహాన్నీ, ఆవేదననూ, అయోమయాన్నీ, గందరగోళాన్నీ సృష్టించిన జగన్.. ఇప్పుడు టికెట్ల విషయంలో కూడా గతంలో ఎవరూ చేయని విధంగా కుటుంబ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు 20కి పైగా అసెంబ్లీ స్థానాలను కేవలం ఐదు కుటుంబాలకు అప్పగించేస్తున్నారు. ఇది గతంలో ఆయన ఘనంగా చెప్పిన ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్నదానికి పూర్తి విరుద్ధమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యం అంటూ జగన్ చేస్తున్న విన్యాసాలు, ప్రయోగాలు ఓటమికే దారి చూపుతున్నాయంటూ సొంత పార్టీ నేతలూ, క్యాడర్ గగ్గోలు పెడుతున్నా ఆయన చెవికి ఎక్కడం లేదు. మొత్తం మీద రానున్న ఎన్నికలలో ఆయన పార్టీ అభ్యర్థలను ఫ్యామిలీ ప్యాకేజీల ప్రకటించేస్తున్నారు. ఆయన ఎవరికి టికెట్ ఇస్తున్నారు? ఎవరికి నిరాకరిస్తున్నారు? ఎవరిని నియోజకవర్గం మారుస్తున్నారు అన్న విషయంలో పార్టీ నేతలకే అర్ధం కాని పరిస్థితి ఉంది.  విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఈ సారి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన వారికి కనీసం నాలుగు సీట్లు దక్కే అవకాశం ఉంది. అలాగే మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులకు ఐదు స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉంది. ముందుగా బొత్స ఫ్యామిలీని తీసుకుంటే  ఆయన సోదరులు ఇద్దరు, ఆయన మేనల్లుడు, భార్యకు టిక్కెట్లు ఇవ్వాలని జగన్ ఇప్పటికే డిసైడ్ అయిపోయినట్లు చెబుతున్నారు. అలాగే గత కొద్ది కాలంగా బొత్స తన కుమారుడికి కూడా వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జగన్  వద్ద గట్టిగా పట్టుబడుతున్నారు. అవసరమైతే తాను పోటీ నుంచి వైదొలగి అయినా సరే తన కుమారుడిని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి నిలబెట్టాలని చూస్తున్నారు. అందుకు జగన్ అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒక వేళ అలా కాకుండా బొత్సకూ, ఆయన కుమారుడికీ కూడా పోటీ చేసే అవకాశం ఇచ్చే చాన్సెస్ ను కూడా తీసిపారేయలేమని చెబుతున్నారు. అంటే వచ్చే ఎన్నికలలో కేవలం బొత్స కుటుంబం నుంచే ఐదు నుంచి ఆరుగురు వైసీపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.  ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయానికి వస్తే ఆయన కుటుంబానికి చెందిన వారు నలుగురు వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగనున్నారు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో  నగరి, రిజర్వుడు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాలలోనూ పెద్దరెడ్డి, ఆయన కుటుంబీకులు, ఆయన వర్గీయులే పార్టీ అభ్యర్థులుగా ఉంటారన్న టాక్ అయితే వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది.   వీరే కాకుండా  మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరులు నలుగురు ఎమ్మెల్యేలు. ఈ సారి కూడా వారందరికీ, వారితో పాటు వారి వారసులూ కూడా  పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారసుల సంగతి ఎలా ఉన్నా బాలనాగిరెడ్డితో పాటు వారి సోదరులకూ ఈ సారి పార్టీ టికెట్ ఖాయమేనని చెబుతున్నారు.  ఇక మంత్రి ఆదిమూలం సురేష్ తో పాటు ఆయన సోదరుడికీ జగన్ ఇప్పటికే టిక్కెట్లు ప్రకటించారు. ఇక జగన్   ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అలాగే కారుమూరి కుటుంబాలకు కూడా రెండేసి టికెట్లను ఇప్పటికే జగన్ ఖరారు చేసేశారని అంటున్నారు.   అంటే వైసీపీ నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసే వారిలో అత్యధికులు ఓ నాలుగైదు కుటుంబాలకు చెందిన వారే ఉంటారన్న మాట.   అయితే జగన్ ఈ తీరు పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక విపక్షాలైతే జగన్ పార్టీ తరఫునుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో  అనివార్యంగా ఇలా ఓ నాలుగైదు కుటుంబాలకు చెందిన వారినే అభ్యర్థులుగా దింపాల్సిన పరిస్థితి జగన్ కు వచ్చిందని విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నాయి.   ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి , అలాగే కారుమూరి కుటుంబాలకు కూడా రెండేసి టికెట్లను ఇప్పటికే జగన్ ఖరారు చేసేశారని అంటున్నారు.  

షర్మిలకు లైన్ క్లియర్.. జగన్ కు రోడ్ క్లోజ్?!

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయిపొయింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా చేసేశారు. సరిగ్గా సంక్రాంతి పండుగ వేళ ఆయన మాజీ పీసీసీ చీఫ్ అయిపోయారు. ఇక తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గెకు   పంపించేశారు. ఆయన రాజీనామా  షర్మిల కోసమే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. షర్మిల తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. త్వరలోనే షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ పార్టీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. షర్మిలకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తాను సంతోషంగా తప్పుకుంటానని   ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన రాజీనామా చేసి షర్మిలకు లైన్ క్లియర్ చేసేశారని చెప్పాలి. ఇక ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి వెళ్లడమే తరువాయి.  షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేత.  ప్రస్తుతానికి ఆమెకి పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదు. కానీ  పీసీసీ చీఫ్ షర్మిలనే అని ఖరారై పోవడంతో ఆమె ఇప్పటికే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ మాజీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వైసీపీ నేతలను తిరిగి తమ పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్ గా షర్మిల అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఈ వారంలోనే షర్మిలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. ఇకపై ఏపీలో అన్నా చెల్లెళ్ళ వార్ మొదలవబోతుందని షర్మిల ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారు. అయితే, షర్మిల అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక పార్లమెంటు బరిలో దిగుతారా లేక రాజ్యసభకు వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే  ఏది ఏమైనా ఇకపై ఏపీ రాజకీయాలు మరింత రసకందాయంగా సాగనున్నట్లు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకూ ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి మధ్య పోరు నడుస్తుంది. మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఏమి అద్భుతాలు సాధిస్తుందన్నది ఆసక్తికరంగామారింది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన పని లేదు. కనీసం   ఒక్క శాతం ఓటింగ్ ఉందా అంటే అనుమానమే. నిజం చెప్పాలంటే ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పగ్గాలు ఎవరు అందుకున్నా పార్టీని బతికించడం కష్టం అన్న భావన ఉంది.  అయితే గత ఆరు నెలల ముందు వరకూ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ను అలాగే అనుకున్నా.. ఆరు నెలలలో అధికారం దక్కించునే స్థాయికి ఎదిగింది.  ఏపీలో అధికారం పొందే స్థాయికి కాకపోయినా షర్మిలను ముందు పెట్టి ఎంతో కొంత ఉనికి చాటుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తోంది. మరి కాంగ్రెస్ ఇక్కడ రాజకీయం మొదలు పెడితే నష్టం ఎవరికి అన్నదానిపై సహజంగానే విశ్లేషణలు జరుగుతున్నాయి.  అయితే  ఏపీలో కాంగ్రెస్ అంటూ బలపడితే నష్టపోయేది జగన్ మోహన్ రెడ్డే. ఇప్పుడు వైసీపీలో ఉన్న సీనియర్ నేతలంతా ఇంతకు ముందు కాంగ్రెస్ నేతలే. జగన్ వైపు మళ్లింది కూడా కాంగ్రెస్ క్యాడరే. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ చచ్చి వైసీపీకి ఊపిరి పోసింది. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ బ్రతికి వస్తే అది తీసేది వైసీపీ ఊపిరే అంటున్నారు పరిశీలకులు. అందుకే షర్మిలకు పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది అనగానే జగన్ కు రోడ్ క్లోజ్ అయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  షర్మిల ఎంత త్వరగా పీసీసీ బాధ్యతలు స్వీకరిస్తే అంత వేగంగా జగన్ ఇబ్బందులలో కూరుకుపోతారు. జగన్ సిట్టింగుల మార్పు నిర్ణయంతో వైసీపీలో ఇప్పుడు తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో షర్మిల ఎంట్రీతో  ఏపీ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిరగనున్నాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి లాంటి వారు షర్మిలతో ప్రయాణం మొదలు పెట్టగా.. షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ నుంచి మరిన్ని వలసలు ఖాయమని చెబుతున్నారు..

జగన్ కు బాలినేని రిటార్డ్.. అదిరిపోయిందిగా?

సిట్టింగుల సీట్లు మార్చే ప్రయోగం చేస్తున్న వైసీపీ అధినేత-సీఎం జగన్ ప్రయత్నం బెడిసికొడుతోంది. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో మిస్ ఫైర్ అయ్యిందనే పరిశీలకులు అంటున్నారు.  ఒంగోలులో బాలినేనికి వ్యతిరేకత ఉన్నందున, ఆయనను గిద్దలూరు లేదా మార్కాపురం నియోజకవర్గానికి పంపించాలన్నది పార్టీ అధినేత జగన్ ఆలోచన. కానీ తాను ఒంగోలు తప్ప మరెక్కడా పోటీ చేసేది లేదని బాలినేని కుండబద్దలు కొట్టేశారు. అంతే కాదు ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి తన మిత్రుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డికే టికెట్ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సొంత నియోజకవర్గం నుంచి బాలినేనికి అనూహ్య మద్దతు లభించింది. వైసీపీ మేయర్, కార్పొరేటర్లు అంతా బాలినేని వెంటే నిలిచారు.  బాలినేనికి ఒంగోలు సీటు విషయంలో. ఒంగోలు మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు, కీలక నేతలు హైదరాబాద్‌లో ఉన్న బాలినేనికి బాసటగా నిలిచారు.   జగన్ కంటే తమకు బాలినేనే ముఖ్యమని స్పష్టం చేశారు.  పార్టీ ఏదైనా సరే తాను  వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేయడమే కాకుండా ఆ విషయాన్ని   జగన్, విజయసాయిరెడ్డికి స్పష్టం చేశారు. విజయవాడలో రోజుల తరబడి మకాం వేసినా బాలినేనికి జగన్ అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో ఆయన ఒక ఓపెన్ అయిపోయారు. జగన్ ను కలిసేదే లేదని తెగేసి చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఒక వేళ మనసు మార్చుకుని ఒంగోలు నుంచి బాలినేనికి అవకాశం ఇచ్చినా కూడా బాలినేని ఇప్పుడు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి దాకా పార్టీ తరఫున పోటీ చేయాలంటే కోట్లలో సొమ్ము డిపాజిట్ చేయాలని జగన్ ఆశావహులకు షరతు పెడుతున్నారు. ఈ విషయంలో బాలినేనే జగన్ కు తాను పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే 170 కోట్ల తనకు డిపాజిట్ చేయాలని రిటార్డ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒంగోలులో పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తరువాతే తాను వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి రంగంలోకి దిగుతానని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జీల నియామకాలు కూడా తాను సూచించిన మేరకే జరగాలని బాలినేని జగన్ కు అల్టిమేటమ్ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. అంతే కాకుండా మాగుంట శ్రీనివాుల రెడ్డికే ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఇవ్వాలని కూడా బాలినేషని షరతు పెట్టారని అంటున్నారు. గతంలో చెప్పినట్లుగానే పార్టీతో సంబంధం లేకుండా ఇద్దరమూ కూడా ఒంగోలు నుంచే రంగంలోకి దిగుతామనీ, మాగుంట లోక్ సభకు, తాను అసెంబ్లీకి ఒంగోలు నుంచే పోటీ చేస్తామని బాలినేని జగన్ కు తెగేసి చెప్పినట్లు సమాచారం.  

జగన్ కు ‘కాపు’ కాయం.. తేల్చి చెప్పేసిన వంగవీటి రాధాకృష్ణ!

జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో విజయం కోసం పేక మేడలు కడుతున్నారు. వాటినే కోటలుగా భావిస్తూ ఇష్టారీతిన  సిట్టింగ్ అభ్యర్థులను మార్చేస్తున్నారు. దీంతో వైసీపీలో పరిస్థితి ఇప్పుడు చిన్న పాటి గాలి వీస్తే కుప్పకూలిపోయేలా మారిపోయింది. దీంతో పార్టీ నేతలలో, కేడర్ లో భయం, ఆందోళన, గందరగోళం ఏర్పడింది.   ఉండేవాళ్ళు ఉండండి, వెళ్లే వాళ్లు వెళ్లండి   అనే ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నారు.   ఆ విషయం  పక్కన పెడితే జగన్ కు ఒక విషయంలో మాత్రం ఆందోళన వెంటాడుతోంది. అదే రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా ఉండే కాపు సామాజికవర్గాన్ని తన వైపు తిప్పుకోవడం. దీని కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ బెడిసికొడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీకి కాపు సామజిక వర్గ ఓటర్లను ఆకర్శించే ఒక ఐకాన్ కావాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనతో కాపు సామాజికవర్గాన్ని ఆకర్షిస్తుండగా.. వైసీపీ ఎలాగైనా దానిని అడ్డుకోవాలని టార్గెట్ చేసుకొని పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే జగన్ ఎన్నో ఎత్తులు వేశారు. ముందుగా జనసేనను తెలుగుదేశంతో కలవనీయకుడదన్న ఉద్దేశంతో ఎన్నెన్నో కుట్రలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అది కుదరకు చీల్చేందకు వ్యూహాలు పన్నారు.  కానీ అవేమీ వర్కౌట్ కాలేదు.  దీంతో కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభంను ఫోకస్ లోకి తీసుకొచ్చారు. ముద్రగడను పార్టీలోకి చేర్చుకొని కాపు సామాజిక వర్గాన్ని ఎంతోకొంత పవన్ వైపు వెళ్లకుండా నియంత్రించవచ్చని ఆశపపడ్డారు. కానీ  ఇప్పుడు ముద్రగడ కూడా జనసేన నేతలలో టచ్ లో ఉన్నారు. ఇక యంగ్ క్రికెటర్ అంబటి రాయుడును వైసీపీలోకి చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానం నుంచి రాయుడును పోటీ చేయించి..  రాష్ట్రమంతా ఆయనతో ప్రచారం చేయించాలని భావించారు. కానీ రాయుడు ఇలా చేరినట్లే చేరి అలా రాజీనామా చేసి జనసేన గూటికి చేరారు. ఆ తర్వాత సినీ దర్శకుడు వీవీ వినాయక్ ను రంగంలోకి దింపాలని శతవిధాలా ప్రయత్నించారు. గోదావరి జిల్లాలో వినాయక్ తో ప్రచారం చేయించాలని కలలు కన్నారు. కానీ, వినాయక్ కూడా ససేమీరా అన్నట్లు తెలిసింది.  దీంతో వంగవీటి మోహన్ రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణను తమ వైపు తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. నిజానికి రెండు మూడేళ్లుగా వైసీపీ నేతలు వంగవీటి రాధా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అవకాశం ఉన్న వరకూ ఈ ప్రయత్నాలు సాగాయి. ప్రస్తుతం రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.  రాధా వైసీపీలోకి వస్తే కనుక విజయవాడ సెంట్రల్ స్థానాన్ని కేటాయిస్తామని వైసీపీ ఆఫర్ ఇచ్చినట్లు కూడా తెలిసింది. రాధను వైసీపీలోకి తెచ్చుకునేందుకు ఆ మధ్యన మిధున్ రెడ్డి చర్చలు జరిపి రాయబారం నడిపారు. రాధాతో కాస్త అనుకూలంగా ఉండే మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో..  టీడీపీ నుండి వెళ్లిన ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీల‌తో కూడా వైసీపీ రాయబారం నడిపింది.  రాధా ఇటీవల త‌న తండ్రి రంగా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని కాశీకి వెళ్లి పిండ ప్ర‌దానం చేశారు. రాధా వెంట కొడాలి నాని కూడా తోడు వెళ్లారు. దీంతో రాధా వైసీపీలోకి వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు.    కానీ, రాధా ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. త‌న‌కు పార్టీ మారాల్సిన అవ‌స‌రం లేద‌ని  తేల్చి చెప్పేశారు. అలాగే విజ‌య‌వాడ వైసీపీ ఇంచార్జ్ బొప్ప‌న భ‌వ‌కుమార్‌ను కూడా టీడీపీలోకి రావాలని రాధా ఆహ్వానించిన‌ట్టు ప్ర‌చారం జరుగుతున్నది. మొత్తంగా  తాను మాత్రం టీడీపీని వీడ‌డం లేద‌న్న రాధా స్పష్టంగా చెప్పేశారు.  దీంతో ఇప్పుడు జగన్ కాపు కల నెరవేరే పరిస్థితి లేదని తేలిపోయింది. రాధా కోసం ఇన్నాళ్లుగా వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని స్పష్టమైపోయింది. రాధాను వైసీపీ గూటికి చేర్చే ప్రయత్నాలలో భాగంగా కొడాలి నానీ కాశీ వరకూ వెళ్లినా అది శుష్క ప్రయత్నంగానే మిగిలిపోయింది. తెలుగుదేశం, జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ కాపు సామజిక వర్గానికి బిగ్ ఐకాన్ గా ఉండగా.. తెలుగుదేశం నుండి వంగవీటి రాధా ప్రభావం కూడా అదే స్థాయిలో ఉండనుంది. ఇక అంబటి రాయుడు కూటమికి మరో అడ్వాంటేజ్ అయ్యారు. అలాగే ముద్రగడ కూడా జనసేనలోకి వస్తే ఇక కంప్లీట్ కాపు సామజిక వర్గాన్ని జగన్ మర్చిపోవాల్సిందే. ఉత్తరాంధ్ర నుండి కోస్తాంధ్ర వరకూ.. గోదావరి నుండి రాయలసీమ వరకూ ఎటు చూసినా కాపు సామజిక వర్గం జగన్ కు దూరమైనట్లే.  ఇది జగన్ మోహన్ రెడ్డికి తీరని నష్టమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

18 అసెంబ్లీ, 2 పార్లమెంట్.. జనసేన పోటీ చేసే స్థానాలివే?

తెలుగుదేశం, జనసేన  మధ్య పొత్తు ఖరారై చాలా కాలమైంది. కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడమూ ఖాయమైపోయింది. అయితే పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే సీట్లెన్ని అన్న విషయంలో ఇప్పటి దాకా స్సష్టత రాలేదు. చాలా చాలా విశ్లేషణలు వినిపించాయి.  అయితే ఇతమిథ్థండగా పొత్తులో భాగంగా  జనసేన ఇన్ని స్థానాలలో పోటీ చేస్తుంది అన్న విషయం మాత్రం ఇప్పటికీ అధికారికంగా తెలుగుదేశం, జనసేనల నుంచి ఎటువంటి స్పష్టతా రాలేదు. మరో వైపు  అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే 51 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేసింది. దీంతో విపక్ష   టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటన ఎప్పుడా అన్న ఆసక్తి పరిశీలకులలోనే కాదు, జనబాహుల్యంలో కూడా వ్యక్తం అవుతోంది.   ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన పోటీ చేసే స్థానాల విషయంలో ఇరు పార్టీలూ ఒక అంగీకారానికి వచ్చినట్లు ఆ పార్టీల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం.  భోగి పండుగకు ముందు రోజు అంటే శనివారం (జనవరి 13) తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు  అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ఈ భేటీలో తెలుగుదేశంతో పొత్తులో భాగంగా  జనసేన పోటీ చేసే స్థానాలపై ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలేంటి, ఎన్ని అన్నది  అధికారికంగా ఇరు పార్టీల నుండి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ,  జనసేన పోటీ చేసే స్థానాలివే  అంటూ ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  పొత్తులో భాగంగా   జనసేన  18 అసెంబ్లీ స్థానాలలో రంగంలో ఉంటుందని తెలుగుదేశం, జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సీట్ల ఒప్పందంపైనే తాజా భేటీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించి ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.  అయితే, దీనిపై అటు జనసేన గానీ, ఇటు తెలుగుదేశం గానీ ఇంకా స్పందించలేదు.. అలాగని ఖండించనూ లేదు.  వైరల్ అవుతున్న జాబితా ప్రకారం చూస్తే జనసేన పిఠాపురం, విజ‌య‌వాడ వెస్ట్‌, చీరాల‌, ద‌ర్శి, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రూర‌ల్‌, తిరుపతి, మాడుగుల‌, పోల‌వ‌రం, పెడ‌న‌, నంద్యాల‌, అనంత‌పురం రూర‌ల్‌, ధ‌ర్మ‌వ‌రం, క‌ళ్యాణ‌దుర్గం, పూత‌ల‌ప‌ట్టు, విశాఖ, మచిలీపట్నం స్థానాలలో పోటీ చేస్తుందని అంటున్నారు.  విశాఖ‌ప‌ట్నానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ‌యాద‌వ్ తాజాగా జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయ‌న‌కు జనసేనలో టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించగా.. వైసీపీ ఎంపీ బాల‌శౌరి త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీలో చేరనుండగా.. ఆయనకు మచిలీ పట్నం టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.  ఇక పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల విషయానికి వస్తే రెండు పార్లమెంట్ స్థానాలలో ఒకటి మ‌చిలీప‌ట్నం కాగా..  కసరత్తులు తర్వాత మ‌రో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ఎమిటన్నది ఖరారౌతుందని అంటున్నారు. కాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేయనున్నారన్నది రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఎంతో ఆసక్తి రేకెత్తించే ప్రశ్న. కాగా, పవన్ భీమవరం, గాజువాకలలో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఇప్పుడు కేటాయించిన స్థానాలలో అవి రెండూ లేవు.  దీంతో పవన్ కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురంలలో ఏదో ఒక స్థానం నుంచి   పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, ఒక లోక్ సభ స్థానం నుండి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయనున్నట్లు గతంలోనే పార్టీ వర్గాలు పేర్కొనగా ఇప్పుడు కేటాయింపులలో దక్కిన మచిలీపట్నం స్థానం నుండే నాగబాబు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక మరో పార్లమెంట్ స్థానం ఏదీ అనేది మరో వారం రోజులలో ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తున్నది.  కాగా, తెలుగుదేశం, జనసేన అభ్యర్థులతో కలిపి తొలి జాబితా అభర్ధులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇందుకోసం జనసేన కూడా బలమైన అభ్యర్థులతో ఒకటీ రెండు రోజులలోనే తొలి జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇక టికెట్ల వివాదాలు రాకుండా,  నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకుని అడుగులు వేయాల‌ని ఇరు పార్టీల అధినేత‌లు నిర్ణ‌యించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు తగిన జాగ్రత్తలు కూడా మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పొత్తులు దెబ్బ‌తిన‌కుండా చూసుకొనేందుకు. ఇరు పార్టీల క్యాడర్ కలిసి పనిచేసేందుకు ఏం చేయాలన్నదానిపై చర్చలు ఒక  కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. అలాగే క‌మ్యూనిస్టుల‌ను క‌లుపుకొని వెళ్లేందుకు కూడా అంగీకారం జరిగినట్లు తెలుస్తున్నది.  

జగన్ పాలన.. నాటి పాలెగాళ్ల రాజ్యం!

ఏపీలో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? జగన్ హయంలో ఏపీ ప్రజలు ఎలా ఉన్నారు? వైసీపీ భజన బృందం చెబుతున్నట్లుగా రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారా? అంటే నూటికి నూరు శాతం లేదనే చెప్పాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు జగన్ హయంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని చెప్పక తప్పదు. అందుకే ఇప్పుడు పరిశీలకులు ఏపీలో జగన్ పాలనను పూర్వం ఇదే ఆంధ్ర రాష్ట్రంలోని పాలెగాళ్ళ పాలనతో పోల్చి తూర్పార పడుతున్నారు. ఆంధ్ర ప్రాంతంలో 600 సంత్సరాల క్రితం రాచ వేమారెడ్డి అనే ఓ రాజు అరాచక పాలన సాగింది.  సకల శుభాలతో వర్ధిల్లిన కొండవీటి రాజ్యాన్ని ఈ వేమారెడ్డి పతనం చేశారు. కొండవీడు ఆఖరి రాజు అయిన రాచ వేమారెడ్డి  దుర్మార్గపు పాలన అత్యంత చెత్త పాలనగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. రకరకాల వింత పన్నులను విధిస్తూ ప్రజలను పీడించి పిప్పి చేశాడు. అప్పుడే పుట్టిన బిడ్డపై పురిటి పన్ను, రైతులకు సాగు నీరుకు తూము పన్నులు వంటివి విధించాడు.  ఒక వైపు కరువు కాటకాలతో సతమతమౌతున్న  ప్రజలపై మోయలేని పన్నుల భారాలను మోపి వేధించారు. రకరకాల పన్నులు, చెత్త పాలనతో రాజ్యంలోని ప్రజలు విసిగిపోయారు. రాజు చుట్టూ ఉండే అనుచరులు, సంస్థానంలోని సేవకులకు కూడా వేమారెడ్డి అంటే విరక్తి వచ్చేసింది. అందుకే వేమారెడ్డి వద్ద పనిచేసే ఓ వ్యక్తి అతన్ని హత్య చేసి రాజ్యంలోని ప్రజలకు విముక్తి కలిగించాడు. వేమారెడ్డితోనే ఆ వంశం అంతమైపోగా.. ఆ తరువాత కొండవీడు రాజ్యం గజపతులు, విజయనగర సామ్రాజ్యం ఏలుబడిలోకి వెళ్లిపోవడంతో మళ్ళీ కొన్నాళ్ళకు సాధారణ పరిస్థితికి వచ్చింది. అలాగే సుమారు 200 సంవత్సరాల క్రితం రాయలసీమలో అనాగరిక గ్రామీణ ముఠా కక్షలు మొదలయ్యాయి. ఈ సాంప్రదాయాన్ని పాలెగాళ్లు, పెత్తందార్లు అని పిలవగా.. బ్రిటిష్ పాలకులు ఫ్యాక్షనిస్టులుగా పిలిచేవారు. సామాజిక, ప్రజా ప్రయోజనాలు అనేవి లేకుండా రాజకీయాల కోసం, సారాయి వ్యాపారం, సివిల్ కాంట్రాక్టులు, నాపరాయి గనుల కోసం ఈ ఫ్యాక్షన్ పుట్టుకొచ్చి రాయలసీమలో బాంబుల మోత మోగిపోయింది.  ఈ పాలెగాళ్ళ లక్ష్యం, ఆలోచన, తీరు ఒక్కటే. ప్రజలపై తోచినంత పన్నులు విధించి తాలిబన్ తరహా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోని శాంతి భద్రతలను గుప్పెట్లో పెట్టుకోవడం, విభజించు పాలించు సిద్ధాంతంతో ప్రజలను రెండు వర్గాలుగా చీల్చి వారిని ఒకరిపై ఒకరికి పగలు, ప్రతీకారాలు పెంచి పాలెగాళ్ళు పెత్తనం చేసేవారు. ఈ పాలెగాళ్ళు తమని తాము హీరోలుగా భావించుకుంటూ ప్రజలను బిచ్చగాళ్లను చేసి ఆడించారు. రాజకీయంగా ఎదుగుదల కోసం నిసిగ్గుగా రాజకీయాలను రక్తసిక్తం చేసిన ఘనులు ఈ పాలెగాళ్ళు. ఆ తర్వాత 19వ శతాబ్దం తొలినాళ్లలో రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ ఆధిపత్యంలోకి రాగా.. రాయలసీమ మొదటి కలెక్టర్ థామస్ మన్రో 1800లో 80 మంది పాలెగాళ్ళను గుర్తించారు. వారిలో 37 మంది పులివెందుల చుట్టుపక్కల వారే కావడం విశేషం. ఈ పాలెగాళ్ళంతా ఒక పెద్ద పాలెగాడి అండతో పెత్తనం సాగించేవారు. ఆ పెద్ద పాలెగాడు రాజుకు లోబడి ఉండేవాడు. ప్రతి పాలిగాడికి ఒక సైన్యం ఉండేది. ఈ సైనికులు యుద్ధాల సమయంలో గ్రామాలను లూటీ చేసి దోచుకుని సంపద పోగేసుకొనేవారు. ఈ పాలెగాళ్లలో కొందరు బ్రిటిష్ సైన్యంతో చేతిలో హతమవ్వగా.. మరికొందరిని ఉరి తీయించారు. మిగిలిన వారికి అధికారం తొలగించి పెన్షన్ ఇచ్చారు. కాగా  స్వాతంత్య్రం వచ్చాక ఫ్యాక్షన్ కొత్త రూపు సంతరించుకుంది. ప్రజా స్వామ్యంలో కూడా ఈ ఫ్యాక్షన్ లీడర్లు ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రజల నిత్య అవసరాలకు కూడా ముఠా నాయకుడి దయాదాక్షిణ్యలపై ఆధారపడేలా చేసుకున్నారు. ఒకరిపై మరొకరు ఆధిపత్యపోరులో ఊళ్ళ మీద బాంబులు పడ్డాయి.. హత్యలు జరిగాయి.. పొలాలు బీడు వారాయి. ఆ తర్వాత ఈ బీడు భూమిని తవ్వి మైనింగ్ సొమ్ముతో ఫ్యాక్షనిస్టులు సంపద గుట్టలు పోగేసుకున్నారు. ముఠా తత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సొంతం చేసుకున్నారు. ఈ ఫ్యాక్షన్ కుటుంబాలలో ఇప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబం కూడా ఒకటి.  జగన్ తాత రాజారెడ్డి కూడా ఒక ఫ్యాక్షనిస్టు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు జగన్ పాలనలో కూడా అదే మార్క్ దౌర్జన్యాలు, అరాచకాలు మనం ఎన్నో చూశాం. చూస్తున్నాం.  తనను ఎదిరిస్తే అక్రమ అరెస్టులు చేసి వేధించడం చూశాం.  ప్రశ్నిస్తే నామరూపాల్లేకుండా చేయడం చూశాం. ఈ దౌర్జన్యాలు, ఆధిపత్య పోరు జగన్ కు వెన్నతో పెట్టిన విద్యని ఇప్పటికే నిర్ధారణైపోయింది.  దౌర్జన్యకారుల ఏలుబడిలో ప్రజల జీవన వసతులు పెరుగు పడతాయనుకుంటే అది పొరపాటే. అలాగే అభివృద్ధి పథకాలు అమలవుతాయనుకుంటే అమాయకత్వమే. ఒక ప్రాంతం అభివృద్ధి కాలేదు అంటే అక్కడ నాయకులు అసమర్థులని అర్ధం. అదే ఒక రాష్ట్రం అభివృద్ధి కాలేదంటే సమర్ధతలేని సీఎం కారణం. అలాగే తమకు కావాల్సిన అధికారం సాధించుకోవడం కోసం ఎన్ని కుట్రలైనా చేయడం, ఎన్ని హత్యలైనా చేయడం ఈ దౌర్జన్యకారుల పని. ఈ లక్షణాలన్నీ ఈ నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో కనిపించాయి. అందుకే ఇప్పటి ఈ ఏపీలో ఆనాటి పాలెగాళ్ళ పాలన సాగుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే.  ఆ విషయాన్ని ఇప్పటికే గుర్తించిన జనం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. పాలెగాళ్ల పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నారు. 

ఎన్నికలకు ముందే జగన్ కు పరాభవం తప్పదా?

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే  జగన్ పార్టీకి బ్యాడ్ టైమ్..  తెలుగుదేశం పార్టీకి గుడ్ టైమ్ స్టార్ట్ అయిపోయింది.  మరో రెండు మూడు నెలల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలే అందుకు వేదిక కానున్నాయని అంటున్నారు. ఏపీ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. మామూలుగా అయితే అంటే అసెంబ్లీలో పార్టీల బలాబలాలను బట్టి చూస్తే ఆ మూడూ కూడా జగన్ పార్టీకే దక్కాల్సి ఉంది. అయితే ఇప్పుడు జగన్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీకే ఓటు వేస్తారన్న నమ్మకం ఆ పార్టీ నేతలకే లేదు. ఇందుకు కారణం  పెద్ద సంఖ్యలో సిట్టింగులను మార్చేస్తూ తీసుకుంటున్న నిర్ణయమే కారణం. ఇప్పటికే పలువురు సిట్టింగులు జగన్ కు గుడ్ బై చెప్పేశారు. మరింత మంది అదే దారిలో ఉన్నారు.  టీడీపీకి అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో వైసీపీ గూటికి ఎప్పుడో చేరిపోయారు. అయితే గత ఏడాది జరిగిన ఎమ్మెల్యే కోటా  ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి  పంచుమర్తి అనురాధ బరిలో నిలిచి విజయం సాధించారు. దీంతో అప్పట్లో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని చెబుతూ జగన్ ఆ నలుగురినీ పార్టీ నుంచి బహిష్కరించారు.  ఇప్పుడా నలుగురూ తెలుగుదేశంకు చేరువయ్యారు.  దీంతో అసెంబ్లీలో  టీడీపీ బలం 23కి చెరింది. ఇక జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నా.. ఇప్పుడాయన వైసీపీలో ఉన్నారు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే  రాజ్యసభకు ఎంపిక కావాలంటే.. 40 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి.  అది జగన్ పార్టీకి సంపూర్ణంగా ఉంది. అంటే.. 151 మంది ఎమ్మెల్యేల ఉన్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..  జగన్  నిర్ణయాలు, వైఖరి కారణంగా  కారణంగా.. పార్టీలో అసంతృప్తి భగ్గుమంటోది. దీంతో ఆ పార్టీలో అసంతృప్తి ఎమ్మెలంతా.. గంపగుత్తగా తెలుగుదేశం బరిలో దింపిన రాజ్యసభ అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలో పంచుమర్తి విజయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దీంతో వచ్చే రాజ్యసభ ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థులు బరిలో నిలిస్తే వారికి జాక్ పాట్ తగిలినట్లేననీ, విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు.  అసెంబ్లీ ఎన్నికలకు జస్ట్ రోజుల ముందు జరిగే రాజ్యసభ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందితే మాత్రం.. సినిమా రిలీజ్‌కు ముందే ట్రైలర్ విడుదలై.. సూపర్ డూపర్ హిట్ కొట్టినట్లేననడంలో సందేహం లేదు. జగన్ అధికారంలో ఉండగానే.. ప్రభుత్వంపై వ్యతిరేకతతో.. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కోటాలో జరిగిన ఎన్నికల్లో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు గెలుపొందారు.   అలాగే పార్టీలోని అసంతృప్తి కారణంగా.. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.  అదే విధంగా త్వరలో జరగనున్న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో జగన్ పై అసంతృప్తితో వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ అభ్యర్థులు జాక్ పాట్ కొట్టడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

భోగిమంటల్లో ఇప్పుడు జగన్ జీవోలు.. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్!

తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రాజధాని గ్రామం మందడంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలు కొత్త వెలుగులను సంతరించుకున్నాయి. నాలుగున్నరేళ్ల పోరాటం గెలుపు వాకిట నిలబడిందన్న ఆనందం అందరిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎందుకంటే మందడంలో జరిగిన భోగి వేడుకల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.   అమరావతి జేఏసీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో  తెలుగుజాతికి స్వర్ణ యుగం సంక్రాంతి సంకల్పం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజా వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పిల్లలు, పెద్దలు పోటీపడ్డారు. సంప్రదాయ దుస్తుల్లో చంద్రబాబు, పవన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా నాలుగున్నరేళ్ల నుంచీ చేస్తున్న పోరాటం ఫలించి తమ కల సాకారమౌతున్నదన్న ఆనందం రాజధాని రైతుల్లో స్పష్టంగా కనిపించింది. అంతకు ముందు భోగికి ముందు రోజు అంటే జనవరి 13న జనసేనాని పవన్ కల్యాణ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి డిన్నర్ కు వెళ్లారు. ఆ సందర్భంగా ఇరువురు నేతలూ ఉమ్మడి మానిఫెస్టో అమలు, పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు, ఏ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేయాలి, అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తైందని అంటున్నారు.   ఇప్పటికే తెలుగుదేశం, జనసేన శ్రేణులు క్షేత్ర స్థాయిలో కలిసి పని చేస్తున్నాయి. వైసీపీ సర్కార్ కు జగన్ విధానాలు, వ్యవహార శైలిపై ప్రజలలో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు, అలాగే సిట్టింగ్ ల మార్పు పేర జగన్ చేసిన, చేస్తున్న ప్రయత్నం కారణంగా వైసీపీలో మొదలైన చిచ్చు ఆ పార్టీ విజయావకాశాలను దాదాపు మృగ్యం చేసేశాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న సానుకూల వాతావరణాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కార్యాచరణ రూపొందించారు.  వచ్చే రెండు నెలల్లో తెలుగుదేశం, జనసేన అధినేతలు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.  ఇప్పటికే ఇన్ చార్జ్ ల మార్పు కారణంగా వైసీపీలో ఎగసిపడుతున్న నిరసనాగ్ని జ్వాలలు తెలుగుదేశం, జనసేనల ఉమ్మడి కార్యాచరణతో మరింత ప్రజ్వరిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ పట్ల ఆగ్రహం, వ్యతిరేకతతో వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో పోటీకి అవకాశం, హోదా వంటి డిమాండ్లేవీ లేకుండానే బేషరతుగా తెలుగుదేశం, జనసేన కూటమి గూటికి చేరడం ఖాయమని చెబుతున్నారు.  మందడంలో భోగిమంటల్లో ఇప్పుడు జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఉత్తర్వులు, జీవోలు దగ్ధం చేసిన ప్రజా చైతన్యం వచ్చే ఎన్నికలలో వైసీపీకి అధికారాన్ని దూరం చేయడం తథ్యమని అంటున్నారు.  ఇక మందడంలో జరిగిన భోగి వేడుకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి పాల్గొన్న చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. సైకో పాలన అంతానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ఇక ఈ రోజు నుంచి 87 రోజులలో జగన్ పాలన అంతం అవుతుందన్నారు. అంతే కాదు రాజధాని ఇక్కడే ఉంటుందనీ, ఎక్కడకూ వెళ్లదని ఈ విషయంలో తెలుగుదేశం, జనసేన భరోసా ఇస్తున్నాయనీ చెప్పారు.   గత నాలుగున్నరేళ్లుగా ప్రజలకు సంక్రాంతి పండుగ సంబరాలు లేకుండా చేసిన సైకో పాలనకు త్వరలోనే జనం చరమగీతం పాడటం ఖాయమని అన్నారు. అంగన్ వాడీలు, నిరుద్యోగ యువత ఇలా ప్రతి ఒక్కరికీ తెలుగుదేశం, జనసేన పార్టీలు అండగా నిలుస్తాయని చెప్పారు. ఇప్పుడు  చీకటి జీవోలను మంటల్లో వేశామని వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని పిలుపు నిచ్చారు. ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ కు శివుడు భస్మాసురుడికి వరం ఇచ్చినట్లుగా జనం  ఓటేశారన్నారు.   ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి   పోలీసులు రాక్షసుల్లా వ్యవహరించారన్నారు. ఇదే పోలీసులు మీకు జిందాబాద్ కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. అలాగే పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడను మంటల్లో తగులబెట్టామనీ, వచ్చే సంక్రాంతిని తెలుగుదేశం, జనసేన సర్కార్ హయాంలో ఘనంగా జరుపుకుంటామని చెప్పారు. తెలుగుదేశం, జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదని ఎన్నో కుట్రలు పన్నారని విమర్శించారు. మరో సారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లడం ఖాయమనీ, అలా జరగకుండా ఉండాలన్న సంకల్పంతోనే భోగిమంటలు వెలిగించామని అన్నారు.  

స్కిల్ కేసులో బాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు 17న

స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తరువాత ప్రభుత్వ తీరు, ఆ కేసులో ప్రభుత్వ న్యాయవాదుల వాదనలు గమనించిన ఎవరికైనా సరే కోర్టు ప్రొసీడింగ్స్ ను సాధ్యమైనంతగా జాప్యం అయ్యేలా చేసి వీలైనన్ని ఎక్కువ రోజులు చంద్రబాబును జైలులో ఉంచాలన్న వ్యూహమే కనిపించింది. ఏసీబీ, హైకోర్టులలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తరువాత సహజంగానే చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. అక్కడ వాదనలలో చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు సూటిగా, సుత్తి లేకుండా ఉంటే.. ప్రభుత్వ తరఫు న్యాయవాది మాత్రం సాధ్యమైనంతగా కాలయాపన చేయడమే లక్ష్యంగా తన వాదనలు వినిపించారు. దీంతో  విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. కోర్టులో వాదనల తీరు గమనించిన న్యాయనిపుణులు సౌతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికిలోనే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు పూర్తై తీర్పు వెలువడుతుందని అంతా భావించారు.  అయితే ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాత్రం సుదీర్ఘంగా తన పాత వాదనలనే వినిపించారు. ఆయన వాదిస్తున్న సమయంలో పలుమార్లు న్యాయమూర్తులు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ  చంద్రబాబుకు 17ఏ వర్తించదని వాదించిన ప్రతి సందర్భంలోనూ  సుప్రీం కోర్టు ధర్మాసనం పలు  ప్రశ్నలు సంధించింది. ఈ కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని ఒక సందర్భంలో  ధర్మాసనం వ్యాఖ్యానించింది.  ఇరు పక్షాల వాదనలూ విన్న అనంతరం   జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.  ఇక స్కిల్ కేసు విషయానికి వస్తే ఏపీ సీఎంగా చంద్రబాబు  ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టింది. మొదట ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినప్పటికీ అర్థరాత్రి అరెస్టు చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు నమోదు చేశారు. తర్వాత మరో నాలుగు కేసులు పెట్టారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించింది. ఆ కేసులోనూ చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్, ఇసుక, మద్యం విధానాలపై మూడు కేసుల్లో చంద్రబాబుకు ఇటీవలే ముందస్తు బెయిల్ వచ్చింది.   స్కిల్ కేసులోసైతం   బెయిల్ లభించింది. ఆ బెయిల్ తీర్పులో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసులు చంద్రబాబుకు వ్యతిరేకంగా చిన్న ఆధారం కూడా సీఐడీ చూపించలేదని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు  క్వాష్ పిటిషన్ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే.. ఆయన పై పెట్టి నకేసులన్నీ అక్రమం అని తేలుతాయి.   అయనను అక్రమంగా అరెస్టు చేసినట్లుగా తేలిపోతుంది. ఒక వేళ చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు చెబితే మాత్రం విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు రిజర్వ్ చేసిన తీర్పును మంగళవారం (జనవరి 17)న వెలువరించనుంది. న్యాయనిపుణుల అంచనా మేరకు ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగానే తీర్పు రావడానికి అవకాశాలున్నాయి.  

జగన్ పై ప్రకాశం వైసీపీ నేతల దండయాత్ర?

ఏపీ రాజకీయాలు కాక మీదున్న సంగతి తెలిసిందే. వైసీపీలో అసెంబ్లీ ఇంచార్జిల మార్పు వ్యవహారం ఇప్పుడు మొత్తం రాష్ట్ర రాజకీయాలలో వేడి రగిలిస్తున్నది. మరీ ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొలిటికల్‌ హీట్ తారాస్థాయికి చేరింది. ఆ జిల్లా వైసీపీలో ప్రకాశం కనిపించడం లేదు. ,చీకట్లు కమ్ముకున్నాయి. వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒకటి తలిస్తే ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు మరొకటి తలచారు. దీంతో ఈ జిల్లా వైసీపీలో ముసలం పుట్టింది. అధిష్టానం నిర్ణయాలను పూచిక పుల్ల కింద జమకట్టేస్తున్న ఈ జిల్లా వైసీపీ నేతలు జగన్ కు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని సృష్టించి దెబ్బకొడుతున్నారు. ఇన్ చార్జిల మార్పుకు ససేమీరా అంటున్న ఈ జిల్లా నేతలు ఎవరొచ్చి చెప్పినా మా నిర్ణయం ఇదేనంటూ అధిష్టానం పంపిన దూతలను కూడా లెక్క చేయడం లేదు. దీంతో ఇప్పుడు రాష్ట్రమంతా ఉమ్మడి ప్రకాశం జిల్లా వైపు చూస్తుంది. అసలు ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతోంది? జగన్ నిర్ణయాలను ఇక్కడి నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు చివరికి జగన్ వెనక్కి తగ్గుతారా లేకా ప్రకాశం వైసీపీ నేతలే ఎవరి దారి వారు చూసుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది.  గురువారం(జనవరి 12) వైసీపీ ఇన్ చార్జ్ ల మార్పు మూడో జాబితా  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలోనూ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ఖరారు కాలేదు. మాగుంట కోసం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని మొదటి నుండి పట్టుబడుతున్నారు. తన సీటుతో పాటు మాగుంట సీటు బాధ్యత కూడా బాలినేనే తీసుకున్నారు. ఇదే విషయంపై బాలినేని ఆ మధ్యే సీఎంవోకు వెళ్లి, ఐప్యాక్‌ టీమ్‌ను కలిసి కూడా చర్చించారు. ఆ తర్వాత బాలినేని ఒంగోలు అసెంబ్లీ, మాగుంటకు ఒంగోలు ఎంపీ సీటు ఫైనల్‌ అని ప్రచారం సాగింది. కానీ, మూడవ జాబితాలో మాగుంట పేరు లేదు. అలాగే బాలినేని స్థానం కూడా అనుమానమేనని అర్ధమైంది. పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ జగన్ తో భేటీ అయ్యారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని రవిశంకర్‌కు జగన్ సూచించినట్లు ప్రచారం మొదలైంది. మరోవైపు హైదరాబాద్‌లో బాలినేనితో తిరుపతి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు. తాను ఒంగోలు ఎంపీగా పోటీకి చేస్తానని  మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. దీంతో బాలినేని మరోసారి జగన్ పై గరం గరం అవుతున్నారు.  అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని కంచుకోటగా మలచుకున్న మాజీ మంత్రి, సీనియర్ నేత మానుగుంట మహీధర్ రెడ్డికి కూడా ఈసారి టికెట్ లేనట్లేని ప్రచారం జరుగుతున్నది. కందుకూరు ఎమ్మెల్యే సీటును బీసీ నేత రామారావు యాదవ్‌కు ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా జగన్ ను రామారావు యాదవ్ కలవడం, కందుకూరులో రామారావు అనుచరులు పని మొదలు పెట్టడంతో మహీధర్ రెడ్డికి ఈసారి మొండి చేయనని నిర్ధారణ అయిపోయింది. అయితే, మహీధర్ రెడ్డి తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. ఆయన మీడియా సమావేశం పెట్టి టికెట్ దక్కకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. అలాగే తెలుగుదేశంలో చేరతానన్న ప్రచారాన్ని ఖండించ లేదు. ఒక్క ఒంగోలు, కందుకూరు మాత్రమే కాదు.. మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలోనే అధిష్టానానికి తీవ్ర వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తున్నాయి.  తాజాగా శుక్రవారం ఒంగోలులోని విష్ణుప్రియా కళ్యాణ మండలంలో సంతనూతలపాడు నియోజవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా పట్టించుకోలేదు. ఇక, జిల్లాలో అన్నీ తానై నడిపించే బాలినేని కనిపించలేదు. అలాగే ఆయన వర్గం నేతలు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యేలు మానుగుంట మహీధర్ రెడ్డి, కరణం బలరాం, అన్నా రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. అలాగే యర్రగొండపాలెం నియోజకవర్గానికి నూతనంగా వచ్చిన ఇన్ చార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్ మార్కాపురంలోని ఓ హోటల్లో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. కానీ, ముఖ్య నాయకులు ఎవరూ హాజరుకాలేదు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, మంత్రి ఆదిములపు సురేష్ లేకుండానే ఈ సమావేశం నిర్వహించగా.. ఆయన వర్గం ఈ సమావేశాన్ని బాయికాట్ చేశారు. మంత్రి ఆదిమూలపు కొండెపికి పరిచయ కార్యకమంలో కూడా చెప్పుకోదగ్గ పేరున్న నేతలెవరూ కనిపించలేదు. మొత్తంగా జిల్లా పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు, జగన్ నిర్ణయాలతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలినేని.. తన తనయుడుతో కలిసి హైదరాబాద్ వెళ్లి  ఓ థియేటర్లో పాప్ కార్న్ తింటూ 'గుంటూరు కారం' సినిమాను వీక్షిస్తున్న దృ శ్యాలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు విజయసాయి రెడ్డి లాంటి వారు జిల్లాలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటే.. ఎమ్మెల్యేలు మాత్రం సొంత పనులలో బిజీగా ఉన్నారు. బాలినేని లాంటి వారు జగన్ తో సంప్రదింపులు జరపాలని రెండు రోజుల పాటు సీఎంఓ చుట్టూ తిరిగినా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో అందరూ మూకుమ్మడిగా అధిష్టానంపై దండయాత్రకు దిగినట్లు కనిపిస్తున్నది. అయితే జగన్ మాత్రం నచ్చింది చేసుకుపోతూ కొత్త ఇన్ చార్జిలను నియోజకవర్గాలకు పంపుతూ తన మార్క్ మొండి వైఖరిని చాటుకుంటున్నారు. జగన్ ఈ వైఖరి కారణంగా ప్రకాశం జిల్లాలో వైసీపీ భారీ ముల్యం చెల్లించుకోక తప్పదని పరిశీలకులు అంటున్నారు.  

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని రాజీనామా.. జగన్ పొమ్మన్నారా? గెంటేశారా?

సరిగ్గా ఎన్నికల వేళ జగన్ కుఅత్యంత ఆప్తులుగా గుర్తింపు పొందిన వారు,   ఆయన్నో దేవుడిగా అభివర్ణిస్తూ భజన చేసిన వారు, దగ్గర బంధువులు ఇలా  ఒక్కరొక్కరుగా  ఆయనకు దూరం అవుతున్నారు.  అలా అని వారంతట వారు స్వచ్ఛందంగా దూరం అవుతున్నారని చెప్పడానికి వీళ్లేదు. జగన్ స్వయంగా మెడబట్టి గెంటేయడమో, లేదా.. వారిపట్ల అవమానకరంగా ప్రవర్తించడం వల్లో.. లేదా నా భక్తులే కదా ఏం చేసినా చేయకపోయినా పంచన పడి ఉంటారన్న భావనతో చులకనగా చూడడమో తట్లుకోలేక దూరం అవుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలు పెడితే ఈ జాబితా రోజురోజుకూ పెరుగుతూ ఉంది. అయితే రాజకీయాలకు సంబంధం లేకుండా.. టికెట్ల కేటాయింపు, సీట్ల మార్పు వంటి వాటితో ఏం సంబంధం లేని, నమ్మిన బంటు లాంటి కొమ్మినేని ఉరుములేని పిడుగులా రాజీనామాస్త్రం సంధించడంపై సర్వత్రా విస్మచం వ్యక్తం అవుతోంది. జర్నలిజం విలువలకు తిలోదకాలిచ్చి మరీ జగన్ పూజ, భజన చేసిన సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, జగన్ మెచ్చి ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు. ఔను ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అంతే కాదు తన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని కూడా చెప్పేశారు. అంటే ఆయన ఇలా రాజీనామా చేయగానే.. జగన్ అలా ఆమోదించేశారన్నమాట.   కొమ్మినేని వంటి వ్యక్తి ప్రభుత్వ విధానాలు నచ్చకో, జగన్ వైఖరి పట్ల అసహనంతోనో  రాజీనామా చేశారంటే నమ్మశక్యంగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జర్నలిస్టుగా ఆయన ప్రస్థానం గురించి తెలిసిన వారు కూడా ఆయన మెడపట్టుకు గెంటేసినా చూరుపట్టుకు వేళాడే రకమని, అటువంటి వ్యక్తి వ్యక్తిగత కారణాలంటూ రాజీనామా చేశారంటే నమ్మడం కష్టమేనని చెబుతున్నారు. జగన్ కు ఆయన రాజీనామా చేసిన విషయాన్ని వెల్లడిస్తూ కేబినెట్ హోదాతో కూడిన ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించిన జగన్ కు కొమ్మినేని చెప్పిన కృతజ్ణతలు కూడా మొక్కుబడిగా ఉన్నాయే తప్ప మనస్ఫూర్తిగా చెప్పినట్లు లేవని అంటున్నారు. మొత్తం మీద కొమ్మినేని రాజీనామాకు కారణాలు ఇవీ అని ఇతమిథ్థంగా తెలియకపోయినప్పటికీ.. జగన్ ఆయనను తప్పుకోమని ఆదేశించి ఉంటారనీ, అందుకే రాజీనామా అంటూ కొమ్మినేని ప్రకటించారని చెబుతున్నారు.  

ఓడిపోలేదు..ఓడించారు.. కేటీఆర్ వింత వాదం!

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు  ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాట, తీరు అంతా కూడా బీఆర్ఎస్ అధికారం కోల్పోవడాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేదనేలాగే ఉంది. ఓటమికి కారణాలు విశ్లేషించుకోవడానికీ, వాస్తవాలు అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేరని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచీ అధికారంలో ఉన్న బీఆర్ ఎష్ కు విపక్ష  పాత్ర పోషించడం ఎలా అన్నది తెలియడం లేదని, కింద పడ్డా పైచేయి మాదేనన్నట్లుగా ఆ పార్టీ అగ్రనేతల తీరు ఉందని అంటున్నారు. ఓసారి యూట్యూబర్లని, మరోసారి సాధించిన ప్రగతిని, అందించిన సంక్షేమాన్ని ప్రచారం చేసుకోవడంలో విఫలం అయ్యామనీ చెబుతున్నారే తప్ప ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ప్రజలు తమను తిరస్కరించారని అంగీకరించలేకపోయారు. ఓటమి కారణాలను సరిగ్గా తెలుసుకోగలిగితేనే, ప్రజల ముందు పొరపాట్లను అంగీకరించి తదుపరి ఎన్నికలలోనైనా మరో అవకాశం ఇవ్వండి అని కోరడానికి చాన్స్ ఉంటుంది.  అందుకు భిన్నంగా కాంగ్రెస్‌ అబద్ధపు ప్రచారాలు చేసిందని, అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించడం వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఎన్నిక ఏదైనా, ఎక్కడైనా విజయం మాదే అంటూ అధికారంలో ఉన్న సమయంలో చెప్పిన మాటలు, కాంగ్రెస్ ఉనికే లేదంటూ చేసిన విమర్శలను ఇంత త్వరగా ప్రజలు మర్చిపోతారని కేటీఆర్ భావించడం అహంకారం అహంభావం వినా మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు.  అసలు కేటీఆర్ రాజకీయ అరంగేట్రం తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు జరిగింది. అంతకు ముందు ఆయనకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. అందుకే ఇలా రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. అలా ఎన్నికలలో గెలిచి మంత్రి అయిపోయారు. అందుకే ఆయనకు ఎన్నికలలో అపజయాలు ఉంటాయన్న విషయమే ఎరుకలేదు. రాజకీయం అంటే అధికారమే అన్న భ్రమలోనే ఇప్పటికీ ఉన్నారు. అందుకే  ఓటమి రియాలిటీని ఆయన గుర్తించడం లేదు. కానీ విజయం సాధించినప్పుడు విజయం ఎందుకు అన్నది  పెద్దదగా పట్టించుకోవలసిన అవసరం లేదు కానీ.. అపజయం విషయంలో మాత్రం ఆత్మ విమర్శ, కారణాలపై సమీక్ష అనివార్యం.  అధికారంలో ఉండగా  మేం చెబుతాం.. మీరు వినండి అన్న వైఖరిని అవలంబించి కేటీఆర్.. ఇప్పుడు పరాజయం పాలైన తరువాత కూడా అదే వైఖరిని అనుసరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి పూర్తిగా నెలరోజులు అయ్యిందో లేదో హామీలను అమలు చేయలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వ్యవధి తీసుకుంటామని ఎన్నికల సమయంలోనే స్పష్టంగా చెప్పింది. ఆ గడువు ముగియకుండానే వాగ్దానాల అమలులో విఫలం అంటూ నిందలు వేస్తే.. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ అమలు చేయని వాగ్దానాలు ఇవీ అంటే ప్రజలే  కొండవీటి చాంతాడంత జాబితాను చదువుతున్నారు.   వాస్తవానికి సాధ్యాసాధ్యాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా హామీల వర్షం కురిపించేసి, తరువాత వాటి ఊసే ఎత్తకుండా తొమ్మిదేళ్ల పాటు అధికార బండిని లాగించేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోలిస్తే వాగ్దానాల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకింత చిత్తశుద్ధినే ప్రదర్శిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమి,, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళిత నేత వంటి  కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఆయన అధాకరంలో ఉన్నంత కాలం అమలు కోసం ఇసుమంతైనా ప్రయత్నం కూడా చేయలేదు. ఆ హామీల అమలుపై జనం ప్రశ్నించకుండా, మరిన్ని హామీలు, కొత్త పథకాల ప్రచారాన్ని ఆర్భాటంగా ప్రారంభించేస్తూ తమ్మిదేళ్ల పాటు ప్రచారం, ఆర్భాటమే పాలనగా సాగించిన ఫలతమే ఇప్పుడీ పరాజయం అన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇప్పటికైనా ఓటమిపై సమీక్ష జరుపుకుని , ఆత్మ విమర్శ చేసుకోకుండా ఇప్పటికీ ఎదురుదాడే  మా విధానం అన్నట్లుగా వ్యవహరిస్తే  మరో పరాజయ పరాభవానికి బీఆర్ఎస్ సిద్ధం కావాల్సి ఉటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబుతో షర్మిల భేటీ.. జగన్ పుణ్యమేగా?

షర్మిల ప్రతి అడుగూ ఆమె  సోదరుడు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పార్టీని ఓటమికి దగ్గర చేస్తోంది. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికలలో అన్న విజయం కోసం శక్తికి మించి కృషి చేసిన షర్మిల ఇప్పుడు అదే అన్న ఓటమి కోసం అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఆమె తన జగనన్న బద్ధ శత్రువులగా భావించే వారిని స్వయంగా కలుస్తున్నారు. కలవబోతున్నారు కూడా. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు గిఫ్ట్ పంపిన షర్మిల.. అంతకు కొద్ది రోజుల ముందే జరిగిన తన జగనన్న జన్మదినానికి కనీసం విషెస్ కూడా చెప్పలేదు. ఇప్పుడు తాజాగా షర్మిల శనివారం (జనవరి 13)  స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.  ఈ భేటీకి కారణం  షర్మిల కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికే అయినా.. వారి మధ్య రాజకీయ చర్చలు జరిగాయనడంలో సందేహం లేదు. కొద్ది రోజుల ముందు షర్మిల తన కుమారుడి మేనమామ అయిన జగన్ కు కూడా తాడేపల్లి నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందించి వచ్చారు. ఆ సమయంలో ఆమె వెంట తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. అయితే ఆ సందర్భంగా అన్నా చెల్లెళ్ల మధ్య ముభావమే రాజ్యమేలిందని విశ్వసనీయ సమాచారం. అన్న కానీ, వదిన కానీ ఆమెను సాదరంగా ఆహ్వానించలేదనీ చెబుతారు. మొత్తం మీద తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి ఆమె తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చి బయటకు వచ్చేయడానికి పాతిక నిముషాల సమయం కూడా పట్టలేదు. ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు కూడా తన సోదరుడు జగన్ హార్ట్ ఫుల్ గా రిసీవ్ చేసుకోలేదన్నట్లుగానే మాట్లాడారు. నేరుగా ఆ విషయం చెప్పకపోయినప్పటికీ లోపల ఏంజరిగిందన్నది చెప్పడానికి పెద్దగా ఇష్టపడలేదు. విజయమ్మ సైతం మౌనంగానే ఉన్నారు. ఇది జరిగిన తరువాత జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్లిన జగన్ పనిలో పనిగా లోటస్ పాండ్ లోని షర్మిల నివాసానికి వెళ్లి తల్లి విజయమ్మను కలిసి వచ్చారు. ఆ సమయంలో షర్మిల హస్తిన పర్యటనలో ఉన్నారు. తల్లితో జగన్ ఏం మాట్లాడారన్నది బయటకు రాకపోయినా.. పరిశీలకులు మాత్రం షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరవద్దని తల్లికి గట్టిగా చెప్పి ఉంటారని విశ్లేషిస్తున్నారు.  మొత్తం మీద జగన్ కు తల్లితో, చెల్లితో సత్సంబంధాలు లేవన్నది మాత్రం గత రెండున్నర మూడేళ్లుగా అందరికీ తెలిసిన విషయమే. ఆ కారణంగానే షర్మిల తొలత తెలంగాణకు వలస వెళ్లి తండ్రి ఆశయసాధన కోసం అంటూ అక్కడ వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తన రాజకీయం తను చేసుకుంటూ పోయారు. కొద్ది రోజులకే తల్లి విజయమ్మ కూడా వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి కూతురి వద్దకు వచ్చేశారు. అప్పటి నుంచీ తల్లీ, చెల్లితో జగన్ అంటీముట్టనట్టుగానే ఉన్నారు. చివరికి ఇడుపుల పాయలో జరిగే వైఎస్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో కూడా ముభావంగానే మెలిగారు. సరే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీలో క్రియాశీలంగా వ్యవహరించడానికి రెడీ అయిపోయిన తరువాత మాత్రం జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పరిశీలకులు అంటున్నారు. బంధువులు, కుటుంబ సన్నిహితుల ద్వారా షర్మిలకు రాయబారాలు, రాయబేరాలు పంపినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని తెగేసి చెప్పారని అంటున్నారు.   ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌లో చేరి ఏపీ రాజకీయాలలోకి ప్రవేశిస్తుండటంతో  జగన్ లో అసహనం తారస్థాయికి చేరిందని.. షర్మిల కాంగ్రెస్ చేరిక వెనుక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలన్న చంద్రబాబు కుట్రలు ఉన్నాయంటూ ఆయన చేసిన విమర్శలే తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒక విధంగా చెప్పాలంటే షర్మిలకు తన కుమారుడి వివాహం జగన్ రెడ్డిని మరింత ఇరుకున పెట్టడానికీ, మరింత అసహనానికి గురి చేయడానికి ఒక అవకాశంగా ఉపయోగపడుతోందని చెప్పవచ్చు. తెలంగాణలో తన వైఎస్సార్టీపీ పార్టీని నడిపించేందుకు అవసరమైన ఆర్థిక, హార్థిక, నైతిక సహాయం అందకుండా అడ్డుపడిన జగన్ కు ఇప్పుడు ఆమె పర్ఫెక్ట్  రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి తన కుమారుడి వివాహ వేడుక అందివచ్చిన అవకాశంగా మారింది. ఇప్పుడు  వైఎస్ షర్మిల తన కుమారుడుని వెంటబెట్టుకొని శ చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి శుభలేఖ అందించారు. చంద్రబాబును కలవడం చాలా చాలా ఆనందంగా ఉందని ఆ వెంటనే మీడియాకు చెప్పారు. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత చంద్రబాబుతో భేటీ కావడం ఇదే తొలిసారి. కనుక సహజంగానే వారిరువురి మధ్యా రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరుగుతుంది.  ముందు ముందు ఆమె  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సైతం భేటీ అవుతారు. ఆయనను కూడా తన కుమారుడి వివాహానికి ఆహ్వానిస్తారు. అప్పుడు కూడా ఆయనతో రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తారు. అందులో సందేహం లేదు.   అందుకే  తన కుటుంబాన్ని చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కానీ నిజానికి తన కుటుంబాన్ని చీల్చుకుని షర్మిలకు కాంగ్రెస్ పంచన చేరడం వినా మార్గం లేకుండా చేసింది స్వయంగా జగనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు షర్మిల చంద్రబాబు నివాసానికి వెళ్లేందుకు దారి చూపింది కూడా జగన్ పుణ్యమేనని ఎద్దేవా చేస్తున్నారు.  

ఇది దేవుడి నిర్ణయం.. అద్వానీ నిర్వేదం

కష్టే ఫలీ అంటారు. కానీ కష్టం అంతా పడి ఫలితం మరొకరి ఖాతాలో పడుతుంటే ఆ కష్టపడిన వారికి బాధ, ఆవేదన సహజం. ప్రస్తుతం మాజీ ఉపప్రధాని, బీజేపీ సీనియర్ నాయకుడు, నాడు రామమందిర నిర్మాణం కోసం దేశం మొత్తాన్నీ తన రథ యాత్రతో కదిలించిన నేత ఎల్ కే అద్వానీ అలాంటి నిర్వేదంలోనే ఉన్నారు.  రామ మందిర నిర్మాణం కోసం రథయాత్ర సాగించి దేశంలో ఇటు రామభక్తిని, అటు బీజేపీ బలాన్నీ పెంచిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ ఇప్పుడు తన కష్టం కారణంగా అంకురార్పణ జరిగి, నిర్మాణం పూర్తి చేసుకున్న అయోధ్య రామమందిర  ప్రారంభోత్సవ వేడుకలలో కేవలం అతిథిగా మాత్రమే అద్వానీ ఉన్నారు.  దీనిపై ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలే ఇది దేవుడి నిర్ణయం మనమేం చేయలేమని నిర్వేదం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకే ఆ రాముడు ఆలయ నిర్మాణ కర్తగా ఎంచుకున్నాడని, తాను కేవలం రథసారథిని మాత్రమేనని అన్నారు.   తాను రామ మందిరం కోసం రథయాత్ర చేశారనీ, అప్పుడే ఏదో ఒక రోజున అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందని తాను భావించాననీ, తన కల, ఆశ, ఆశయం ఇప్పుడు నెరవేరిందని అద్వానీ చెప్పారు.   అయోధ్యలో ఆలయం నిర్మించడం విధి నిర్ణయం. దేవుడి ఆదేశం అన్న అద్వానీ.. తన రాజకీయ జీవితంలో  అయోధ్య రథయాత్ర ఒక బృహత్తర ఘటన అన్నారు.   రాముడిపై భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో  తాను 1990లో ప్రారంభించిన రథయాత్ర ఒక ఉద్యమంలా మారుతుందని, జనం రామమందిర నిర్మాణం కోసం ఉప్పెనలా కదులుతారనీ తాను  అప్పుడు  ఊహించలేదన్నారు. రథయాత్ర సమయంలో మోడీ కూడా తన వెంటే ఉన్నారని చెప్పారు.   అయితే అప్పుడుతనవెన్నంటి ఉండి, అడుగడుగునా ప్రోత్సాహాన్ని, సేహ హస్తాన్నీ అందించిన  మాజీ ప్రధాని వాజ్ పేయి, ఇప్పుడు లేకపోవడం మాత్రం చాలా బాధ కలిగిస్తోందని అద్వానీ పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం తాను చేసిన రాజకీయ యాత్ర  మొత్తం  భావోద్వేగాపూరితంగా జరిగిందన్నారు.  అయోధ్యలో అంటే రామజన్మభూమిలో రామ మందిరం నిర్మాణం ప్రజల బలమైన ఆకాంక్ష అన్న అద్వానీ ఆ ఆకాంక్ష ఇప్పుడు నెరవేరుతుండటం ఆనందంగా ఉందన్నారు.