రేపు చంద్రబాబుతో పవన్ భేటీ
posted on Jan 8, 2024 @ 11:17AM
ఎపిలో రానున్న ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత క్రియాశీల రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు. టిడిపి, జనసేన పొత్తు ఖరారు కావడంతో విజయం లక్ష్యంగా పావులు కదలపాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం (జనవరి 8) జనసేనాని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా మంగళ గిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చారు. మంగళ గిరిలో పవన్ కళ్యాణ్ కు భారీ స్వాగతం లభించింది ఈరోజు, రేపు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటారు. ఈరోజు, రేపు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతలతో చర్చించనున్నారు. రేపు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఎపిలో వోటర్ల నమోదు కార్యక్రమంలో భారీ అవకతవకలు జరిగాయి. జగన్ ప్రభుత్వం బోగస్ వోటర్లను నమోదు చేయడం, ఒకే ఇంటి నెంబర్ మీద బోగస్ వోటర్లు నమోదయ్యారు. ఈ విషయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ చర్చించనున్నారు. తర్వాత వీరిరువురు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఆయన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు.