సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు సునీల్ కనుగోలు సేవలు లేనట్లే?!

కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా వ్యవహరించిన వ్యూహకర్త సునీల్ కనుగోలు లోక్ సభ ఎన్నికలలో పార్టీ వ్యూహకర్తగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టడం లేదా? సార్వత్రిక ఎన్నికలకు ఆయన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించరా అంటే పార్టీ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది.  ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ను పటిష్టం, బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించిందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.  వాస్తవానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్నది సూనీల్ కనోగోలే. అలాగే అసలు విజయం అన్న ఊహ కూడా లేని స్థితి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారం చేజిక్కించుకునేలా చేయడం వెనుక ఉన్నవి కూడా సునీల్ కనుగోలు వ్యూహాలే. అటువంటి సునీల్ కనుగోలే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం కోసం వ్యూహకర్తగా వ్యవహరిస్తారనీ, ఎన్నికల ప్రచారం, సోషల్ మీడియా క్యాంపెయిన్ వంటి వ్యవహారాల పూర్తి బాధ్యత ఆయనే తీసుకుంటారనీ తొలుత వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన బాధ్యతలను కుదించి హర్యనా, మహారాష్ట్రలకు పరిమితం చేస్తూ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుందన్న వార్తలు పార్టీ శ్రేణుల్లో ఒకింత నిరుత్సాహాన్ని నింపాయి.  కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏదైనా, ఈ నిర్ణయం సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు ఒకింత ఇబ్బంది కలిగించేదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనలూ, ప్రణాళికలూ వేరుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సునీల్ కనుగోలుకు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను, అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ గెలుపు బాధ్యతలను అప్పగించడం వల్ల భవిష్యత్ లో కాంగ్రెస్ కు మేలు చేస్తుందనీ, ఆ మేలు దీర్ఘ కాలం ఉంటుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.    సునీల్ కనుగోలు వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టిన కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టని  మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలైన సంగతి విదితమే.  ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ వ్యూహకర్తగా పని చేసేందుకు సునీల్ కనోగోలు సిద్ధపడినప్పటికీ, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్‌లు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో ఆయన ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ క్యాంపెయిన్ కు దూరంగా ఉన్నారు.    ఇక  ఇప్పుడు లోక్ సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి  ఇండియా కూటమిలో మిత్ర పార్టీల సీట్ల పంపకాలు, కూటమికి నేతృత్వవం వంటి అనేక సమస్యలు ఉండటంతో  ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ సునీల్ కనుగోలు సేవలను అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం చేయాలని భావించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సునీల్ కనుగోలు సేవలు లేకున్నా.. రాష్ట్రాల్లో బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలనే  ఉద్దేశంతోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీ సునీల్ కనుగోలు సేవలను సార్వత్రిక ఎన్నికలలో ఉపయోగించుకోవడం లేదని అంటున్నారు. ప్రస్తుతం  కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే బీజేపీ 12 రాష్ట్రాల్లో ఉన్నది. కాంగ్రెస్ రాష్ట్రాలలో పార్టీకి గట్టి పునాదులు వేసుకుని అధికారంలోకి రావాలన్న దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సునీల్ కనోగోలు సేవలను రాష్ట్రాలకు పరిమితం చేయాలని భావిస్తున్నది.  

ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర.. రూ.75 కోట్లు కేటాయించిన సర్కార్

తెలంగాణ మహా కుంభమేలాగా గుర్తింపుపొందిన వనదేవతల జాతర సమ్మక్క సారలమ్మ. మేడారం జాతరగా పిలువబడే ఈ జాతర వచ్చే నెల 21 నుంచి ఆరంభం కానుంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి సీతక్క ప్రకటించారు.  జాతర ఏర్పాట్ల పర్యవేక్షణకు మేడారంలో పర్యటించని మంత్రి సీతక్క ఈ సందర్భంగా  అధికారులతో సమీక్షా  నిర్వహించారు.   అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె జాతర నిర్వహణకు 75కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేసినట్లు చెప్పారు.  జాతర నిర్వహణ కోసం వెంటనే నిధులను విడుదల చేసినట్లు చెప్పారు. ఇంత పెద్ద జాతరకు 75 కోట్లేనా అన్న సంశయాలు వద్దని చెప్పిన సీతక్క, జాతర సందర్భంగా ఎవరీకీ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటామనీ, అందకు సంబంధించి ప్రణాళికలు రూపొందించామనీ చెప్పారు.  జాతర పనులు శాశ్వత ప్రాతిపదికన చేస్తామనీ, శానిటేషన్, ట్రాఫిక్, ఆర్టీసీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలపై దృష్టి సారించామనీ వివరించారు. జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి పంపించామనీ, అలాగే  నిధుల కోసం ప్రతిపాదనలు కూడా పంపించామనీ సీతక్క వివరించారు.  ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుందని ఆశిస్తున్నట్లు సీతక్క చెప్పారు.  రెండేళ్లకోసారి జరిగే ఈ వనదేవతల జాతరకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తారు. అడవి తల్లులను దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందన్న నమ్మకం గిరిజనులలో బలంగా ఉంది. ఈ జాతర విశిష్టత ఏమిటంటే..  ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఈ మేడారం గిరిజన జాతర.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో  జరుగుతుంది.  ములుగులో మనుగడలో ఉన్న అతిపెద్ద అటవీ ప్రాంతం అయిన దండకారణ్యంలో భాగమైన ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలోని మారుమూల ప్రాంతం మేడారం. 1988కి ముందు వరకూ ఈ జాతరకు కేవలం ఎడ్లబండ్ల మీద మాత్రమే వెళ్లాల్సి వచ్చేయి. అయితే 1998లో  అప్పటి రాష్ట్ర  ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా వేడుకగా ప్రకటించింది. రహదారి సౌకర్యం కల్పించింది. ప్రకటించింది మరియు మోటారు రహదారిని ఏర్పాటు చేసింది.

వసుధైక కుటుంబానికి నిలువెత్తు నిదర్శనం మంగళగిరి.. లోకేష్

మంగళగిరి నియోజకవర్గాన్ని వసుధైక కుటుంబంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ అభివర్ణించారు. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా విభిన్న కుల,మతాల సమాహారంగా మంగళగిరి నియోజకవర్గం ఉందని పేర్కొన్నారు. అటువంటి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు.  మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ... గతంలో ఏ నాయకుడు చేయని విధంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రముఖులను ఇళ్లవద్దకు వెళ్లి కలుస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన ఆలోచనలు, ప్రణాళికలను వివరిస్తూ మద్దతు కోరుతున్నారు.  అందులో భాగంగానే శుక్రవారం జనవరి 12)  పలువురు ప్రముఖులను వారి ఇళ్లవద్దకు వెళ్లి కలుసుకున్న లోకేష్... మంగళగరిని రాష్ట్రంలోనే నంబర్ వన్ గా అభివృద్ధి చేయడానికి తన ప్రణాళికలను వివరించి మద్దతు కోరారు. ముందుగా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడుకు చెందిన చెంచు సామాజికవర్గ పెద్ద  తిరుపతయ్య నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా లోకేష్ ను సాదరంగా ఆహ్వానించిన తిరుపతయ్య కుటుంబ సభ్యులు చెంచుల సమస్యలను ఆయనకు వివరించారు. పొలాల్లో ఎలుక బుట్టలు పెట్టడం, చేపలవేట ఆధారంగా జీవనం సాగిస్తున్న, సంచారజాతి అయిన తమ సామాజికవర్గీయులకు ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన లోకేష్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెంచుల  సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. అనంతరం పెదవడ్లపూడికి చెందిన లంబాడీ సామాజికవర్గ ప్రముఖుడు జరపాల సాంబశివరావును ఆయన నివాసానికి వెళ్లి కలుసుకుని మద్దతు కోరారు. తరువాత మంగళగిరి 10వవార్డుకు చెందిన ప్రముఖ చేనేత వ్యాపారి, వైష్ణవి టెక్స్ టైల్స్ అధినేత వెనిగళ్ల శంకర్రావును ఆయన నివాసంలో కలిశారు. మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడైన శంకర్రావు  నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన చేనేతలు  వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను  లోకేష్ దృష్టికి తెచ్చారు. ఆ తరువాత మంగళగిరి 15వవార్డుకు చెందిన మరో ప్రముఖుడు కొల్లి నాగేశ్వరరావును,  మంగళగిరి మాజీ శాఎమ్మెల్యే కాండ్రు కమల  ప్రముఖ స్వచ్చంద సంస్థ ఖిద్మత్ టీమ్ సభ్యులను లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  

రామ రామ.. అపచారం.. అపచారం!

వైసీపీ నేతలలో పైత్యం పీక్స్ కు చేరింది. అందుకే వారి కళ్ళకు తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి దైవాంశ సంభూతుడిగా కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు జగన్ అంటే వీరుడు, శూరుడు అంటూ పొగిడిన ఆ నోళ్లు ఇప్పుడు ఏకంగా తమ నాయకుడు దేవుడే అంటున్నారు. అందునా నీతికి, ధర్మానికి, ఇచ్చిన మాటకి కట్టుబడి రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం చేసిన శ్రీరాముడితో జగన్ మోహన్ రెడ్డిని పోలుస్తున్నారు. మాట ఇవ్వడమే కానీ, దానికి కట్టుబడటం అన్నది డిక్షనరీలోనే లేని జగన్ ను శ్రీరామ చంద్రుడిగా చెప్పుకోవడం చూస్తుంటే  వైసీపీ నేతల పిచ్చి ముదిరిపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించి, అనుసరించే జగన్ మోహన్ రెడ్డిని శ్రీరామునితో పోల్చడం అంటే అది హైందవ ధర్మాన్ని కించపరచడమేనని హిందూ వాదులు మండిపడుతున్నారు. గతంలో కూడా వైసీపీ నేతలు అత్యుత్సాహంతో జగన్ మొహాన్ని శ్రీరాముని ఫోటోతో మార్ఫింగ్ చేసి తమ నేతపై భక్తిని చాటుకున్నారు. అప్పుడే శ్రీరాముడి ఫోటోలకు క్రిస్టియన్ అయిన జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేసి హిందు సమాజాన్ని వైసీపీ నేతలు అవమానించారని హిందూ వాదులు, పండితులు తీవ్రంగా మండిపడ్డారు.  గతంలో ఒకసారి గుంటూరు గోరంట్ల వద్ద శ్రీరాముడి ఫోటోలకు జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేసి జగన్ మోహన్ రెడ్డినే రామ లక్ష్మణులుగా ఫ్లెక్సీలు వేసి చూపించారు. అప్పుడే ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసనలు తలెత్తాయి. రాష్ట్రంలో పలుచోట్ల హిందూవాదులు, తెలుగుదేశం నేతలు రామాలయాలలో పూజలు జరిపి జరిగిన అపచారానికి కీడు కలగకుండా క్షమించి రాష్ట్రాన్ని కాపాడమని వేడుకున్నారు. అయితే ఇప్పుడా ఈ పిచ్చిఇంకా ముదిరిపోయింది.  వైసీపీ నేతలు మరోసారి తన నాయకుడు జగన్ని అపర శ్రీరాముడంటూ శ్రీరాముని అంతటి వారంటూ తెగ పొగిడేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ ప్రచారానికి కూడా వైసీపీ నేతలు శ్రీరాముడి పేరును వాడుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో కూడా జగన్ మోహన్ రెడ్డిని శ్రీరాముడితో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఏకంగా శ్రీరాముని అవతారంలో జగన్ ఫోటోలను సృష్టించి వైరల్ చేస్తున్నారు. దీంతో ఇది కాస్తా ఇప్పుడు మరోసారి ఏపీలో చర్చకు దారితీసింది.  అయితే, ఇంతకీ జగన్ శ్రీరాముడంతటి గొప్పవాడా? శ్రీరాముని పాలనా దక్షత, ఆయనలోని దైవత్వం జగన్ లో నిజంగా కనిపిస్తున్నదా? దేవుని అవతారమైన రాముడు హిందువులకు  ఆరాధ్య దైవం. అసలు మనిషి ఎలా బ్రతకాలి అంటే ఎవరైనా శ్రీరాముడినే ఆదర్శంగా చూపిస్తారు.   అలాంటి దేవుడిని  వైసీపీ జగన్ కోసం కించపరచడం ఎంత వరకు సబబు? జగన్ మోహన్ రెడ్డి పుట్టుకతోనే క్రైస్తవుడు. జగన్ తాత క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. తాతలు, తండ్రులు అదే కొనసాగించారు. ఇక ఇప్పుడు జగన్ కు క్రైస్తవ మతంపై అమితమైన ప్రేమ ఉంది. జగన్ హిందువు కాదు అసలు సిసలైన క్రైస్తవుడేనని ఎవరూ దృవీకరించాల్సిన అవసరం లేదు. మరి అలాంటి వ్యక్తిని శ్రీరాముడితో పోల్చడం అంటే ఖచ్చితంగా హిందువులను అవమానించడమే. ఇందులో  ఎలాంటి అనుమానాలకు తావు లేదు. జగన్ ను రామునితో పోల్చడం వైసీపీ హిందు వ్యతిరేక విధానాలకు నిదర్శనం. మరి వైసీపీ నేతలు ఇంతలా దిగజారి జగన్ భజన చేయడం ఏంటి?.  నిజానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో వరుసగా హిందు దేవాలయాల మీద దాడులు జరిగాయి. దేవుని రధాలు తగలబెట్టారు. అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశారు. వాటికి కారణమైన ఏ ఒక్కరినీ ఇంతవరకూ అరెస్ట్ చేయలేదు. జగన్ ప్రభుత్వంలో అన్నీ అరాచకాలేనని నిర్ధారణైపోయింది. ప్రశ్నిస్తే దాడులు.. వ్యతిరేకిస్తే అరెస్టులు. ఎటు చూసినా అప్పులు.. ఇదేమిటని అడిగినవారిపై దౌర్జన్యాలు. మరి ధర్మ పాలకుడైన రాముడితో అరాచక పాలన చేస్తున్న జగన్ ను పోల్చడం ఏమిటి? హిందూ దేవుళ్ళ విగ్రహాల తల నరికి దేవాలయాలు ధ్వంసంచేస్తున్నా పట్టించుకోని జగన్మోహనరెడ్డిని రాముడుతో పోల్చడంకన్నా నీచమైన చర్య ఇంకొకటి ఉండదనడంలో సందేహం లేదు. ఎన్నికల ముందు గంగలో మునిగి హిందూ సమాజాన్ని మోసం చేసిన జగన్..  అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మాన్ని అణచివేయాలని తెరచాటు ప్రయత్నాలు చేశారు. అందుకే దేవాలయాలపై దాడులు జరిగినా పట్టించుకోలేదు. అలాగే హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమలపై కూడా ఇతర మతాల దాడిని పెంచి పోషించారు. అన్యమత ప్రచారానికి తలుపులు బార్లా తెరిచేశారు. టీటీడీ టికెట్లపై అన్య మత ప్రచారం, తిరుమలలో గోడలపై పార్టీ రంగులు వేసినా  చర్యలు తీసుకోలేదు. పైగా తిరుపతిలో పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం.. తిరుమల దేవుడి నిధులను వాడుకోవడానికి కూడా వెనుకాడలేదు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న తరుణంలో జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని రామునితో పోల్చడం అంత దుశ్చర్య మరొకటి ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నానికి ప్రజలే బుద్ధి చెబుతారు.. కేశినేని చిన్ని

తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడమే కాకుండా, ఆయన సతీమణికి జడ్పీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరి టీడీపీపైనా, అధినేత చంద్రబాబుపైనా అసత్య ప్రచారాలు చేయడం ఎంత వరకూ సమంజసం అని తెలుగుదేశం నాయకుడు కేశినేని చిన్ని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ విజయవంతం అయిన సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో నియోజకవర్గ తెలుగుదేం ఇన్ చార్జి శావల దేవదత్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేశినేని చిన్ని పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే  నల్లగట్ల స్వామిదాస్‌ , ఎంపీ కేశినేని నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన సోదరుడు, ఎంపీ నానికి చంద్రబాబు రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇస్తే, ఇప్పుడు ఆయన పార్టీకి, అధినేతకూ అండగా ఉండాల్సింది పోయి వైసీపీలో చేరి ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి నాయకులు ద్రోహం చేశారే కానీ కార్యకర్తలు కాదని చిన్ని అన్నారు. వైసీపీ టికెట్ కోసం వీరిరువురూ పార్టీని వీడి ఇష్టారీతిగా చంద్రబాబుపై విమర్శలు చేయడం దిగజారుడుతనమని దుయ్యబట్టారు. తనకు నాయకుడిగా కంటే కార్యకర్తగా తెలుగుదేశంలో ఉండటమే ఇష్టమని కేశినేని చిన్ని అన్నారు.  పార్టీ అధినేత చంద్రబాబు  ఏ బాధ్యత ఇచ్చినా దానికి కట్టుబడి ఆ బాధ్యతను నెరవేరుస్తానని స్పష్టం చేశారు.  విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసింది టిడిపి అధినేత చంద్రబాబు నాయుడేననీ, కానీ ఆయన దయతో ఎంపీగా గెలిచిన  నాని విజయవాడకి చంద్రబాబు ద్రోహం చేశాడు అనటం దుర్మార్గమని విమర్శించారు.  చంద్రబాబు నాయుడు విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలో ఒక కార్యకర్తని పార్టీ  అభ్యర్థిగా నిలబెట్టినా  లక్షన్నర మెజార్టీతో గెలిపిస్తారని చిన్నిఅన్నారు. చంద్రబాబు దయతో ఎంపీగా గెలిచి ఆయనపైనే విమర్శలు చేస్తున్న కేశినేని నానికి ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని చిన్ని అన్నారు. 

మచిలీ పట్నం ఎంపీ బాలశౌరి వైసిపికి గుడ్ బై ? 

కృష్ణా జిల్లాలో ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు, పెనమలూరు ఎమ్మెల్యే  కొలుసుపార్థసారథి టిడిపిలో చేరుతున్న నేపథ్యంలో అదే జిల్లాలో  వైసీపీ బీటలు వారుతుంది.  కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరికి టికెట్ లేదనే ఖరారు కావడంతో  ఆయన వైసీపీని దాదాపు వీడతారని ప్రచారం జరుగుతుంది.  జనసేనలో చేరవచ్చని వార్తలు అందుతున్నాయి. ఎమ్మెల్యే పేర్నినానితో విభేధాలు తారా స్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పేర్ని నానితో బాటు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు మరో మారు జగన్ దృష్టికి బాలశౌరి గూర్చి ఫిర్యాదు చేశారు. జగన్ అసంతృప్తి నేతలను సముదాయిస్తున్నప్పటికీ బాలశౌరిని వదులుకోవడం వైసీపీ అధినేతను వదులుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలశౌరి వైసీపీని వీడటం పెద్ద నష్టంమనే చెప్పాలి. దాదాపు రెండు సంవత్సరాల నుంచి వైసీపీ అధిష్టానికి జిల్లా నేతలు బాలశౌరికి టికెట్ ఇవ్వొద్దని వత్తిడి తెస్తున్నారు. జగన్ ఫోటో లేకుండానే బందరులో పబ్లిక్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి బాలశౌరి వైసీపీకి స్వస్థి పలికినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. 

ఐపిఎస్ అధికారి నవీన్ కుమార్ తనయుడు అరెస్ట్ 

మాజీ ఐఏఎస్ భన్వర్ కుమార్, ఐపిఎస్ అధికారి మధ్య ఉన్న వివాదంలో శుక్రవారం మరో అరెస్ట్ చోటు చేసుకుంది. ఐపిఎస్ అధికారి నవీన్ కుమార్ తనయుడిని జూబ్లిహిల్స్ లో సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నవీన్ కుమార్‌ను గతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నవీన్ కుమార్ అన్న, వదినలను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు.నవీన్ కుమార్ తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భన్వర్ లాల్ గతంలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలను సృష్టించి కబ్జాకు ప్రయత్నించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ క్రమంలో 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సీసీఎస్ పోలీసులు... నవీన్ కుమార్‌ను విచారించారు. ఈ వివాదం సమయంలోనే నవీన్ కుమార్ తాను ఉంటోన్న భన్వర్ లాల్ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. తాజాగా సాహిత్‌ను అరెస్ట్ చేశారు

రేపు సిఐడి కార్యాలయానికి చంద్రబాబు 

టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ( జనవరి 13) ఏపీ సీఐడీ కార్యాలయానికి వెళుతున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల్లోగా సీఐడీ దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన రేపు పూచీకత్తును సమర్పించనున్నారు. మరోవైపు మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ నరేశ్ కు కూడా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఉన్నారు. ఎన్నికలకు కేడర్ ను సిద్దం చేస్తున్నారు. జనసేనతో కలిసి పొత్తుతో జగన్ ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఈ సమయంలోనే హైకోర్టులో చంద్రబాబుకు బారీ ఊరట దక్కింది. చంద్రబాబు పైన ఏపీ సీఐడీ నమోదు చేసిన స్కిల్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలులో 53 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ ఇవ్వటంతో బయటకు వచ్చారు. ఈ సమయంలోనే చంద్రబాబు పైన సీఐడీ మరో మూడు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్లు దాఖలు చేసారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో ఏ1గా చంద్రబాబును సీఐడీ పేర్కొంది. రింగ్ రోడ్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. దీంతో పాటుగా మద్యం కంపెనీలను నిబంధనలకు విరుద్దంగా అనుమతులు మంజూరు చేసారని మరో కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ3గా నమోదు చేసింది. మరో కేసులో ఇసుక పాలసీ వ్యవహారంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రబుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సీబీఐ కేసు నమోదు చేసింది. వీటి పైన హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పైన  కోర్టు తీర్పు వెలువరించింది.

ప్రజా భవన్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన 

ప్రతీ వారం  రెండు రోజుల పాటు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది.  తెలంగాణాలోని వివిధ జిల్లాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు శుక్రవారం ప్రజాభవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అధికారులు వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి నెల పదో తేదీ లోపే మెస్ బిల్లులు, వేతనాల చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు రూ.3వేల వేతనం పెంచారని... దీనిని వెంటనే అమలు చేయాలన్నారు. మరోవైపు జీవో 46ను వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగులు ప్రజాభవన్ వద్ద నిరసన తెలిపారు. కాగా, ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. సమస్యల పరిష్కరణకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్‌ వద్ద బారులు తీరారు. ప్రజల నుంచి అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలిస్తున్నారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్నది. రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.

 తొలిసారి ప్రజా భవన్ కు వైఎస్ షర్మిల.. కొడుకు పెళ్లికి రావాలని భట్టికి ఆహ్వానం 

తెలంగాణ  ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి గల కారకులలో  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల  ఒకరు. ఆమె కొడుకు వివాహం వచ్చేనెలలో ఉంది. తాను స్థాపించిన వైఎస్ఆర్ టిపిని కాంగ్రెస్ లో విలీనం చేసే ముందు ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్, బిజెపిలను తీవ్రంగా విమర్శించి కాంగ్రెస్ వోటు బ్యాంకును ఆమె పెంచగలిగారు. ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్య విజయం వెనక వైఎస్ షర్మిల పాత్ర ఎంతైనా ఉంది. తన పార్టీని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసిన తరువాత షర్మిల మొదటి సారిగా ప్రజా భవన్ గతంలో ప్రగతి భవన్ కు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల శుక్రవారం తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. తన కొడుకు వివాహ ఆహ్వాన పత్రికను అందించేందుకు వచ్చిన షర్మిల ఆయనకు కుశల ప్రశ్నలు వేసి... డిప్యూటీ సీఎం అయినందుకు కంగ్రాట్స్ తెలిపారు. మల్లు భట్టిని ఆయన నివాసం ప్రజా భవన్‌లో షర్మిల కలిశారు. 'భట్టి అన్నా... బాగున్నారా? మీరు ఉపముఖ్యమంత్రి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది... కంగ్రాచ్యులేషన్స్' అంటూ ఆమె పలకరించారు. ఆ తర్వాత తన కొడుకు వివాహానికి తప్పకుండా రావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. కాగా, ఈ నెల 18న షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల పలువురు ప్రముఖులకు వరుసగా పెళ్లి పత్రికలను అందిస్తున్నారు.

పిఠాపురం  ఎమ్మెల్యే దొరబాబు వైసీపీకి షాక్ ?

ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  వచ్చే ఎన్నికల్లో ఒడ్డుకు చేరడం కష్టంగా ఉంది. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరూ పక్కపార్టీల వైపు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని ప్రజలకు అర్థం అయినట్టు ఉంది. దీంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో జంపింగ్ జపాంగ్ ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా  పిఠాపురం ఎమ్మెల్యే  జగన్ కు షాక్ ఇవ్వబోతున్నారు. జనసేనలో చేరవచ్చని విశ్వసనీయ సమాచారం.  సర్వేల పేరిట సిట్టింగ్ లకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ టికెట్లను నిరాకరిస్తోంది.ఈ నేపథ్యంలో  దొరబాబుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో దొరబాబు త్వరలో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే శుక్రవారం (జనవరి 12) పెండెం దొరబాబు పుట్టినరోజు కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే పుట్టినరోజు వేడుక‌ల‌ పేరుతో అనుచరులతో దొరబాబు భారీ సమావేశం ఏర్పాటు చేశారు. వేడుక‌ల కోసం ఏర్పాటు చేసిన‌ స్వాగత ఫ్లెక్సీలు, జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల‌ కటౌట్‌ల‌లో ఎక్కడా వైసీపీ జెండా కానీ.. జగన్ ఫోటో కానీ లేకుండా సిద్ధం చేయించిన‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తారా అనే దానిపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. దొరబాబుకు ఎమ్మెల్యే టికెటును నిరాకరించి ఆ స్థానంలో ఇన్‌చార్జిగా కాకినాడ ఎంపీ గీతను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. వైసీపీలో మార్పులు, చేర్పులు ఆ పార్టీ నేతల్లో గుబులు రేపుతున్నాయి. టికెట్ దక్కని పలువురు నేతలు పార్టీకి ఇప్పటికే గుడ్ బై చెప్పారు. మరి కొందరు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. పెండెం దొరబాబు కూడా వైసీపీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు పార్టీ నాయకత్వం టికెట్ ను నిరాకరించడమే దీనికి కారణం. 

గోదావరి తీరంలో రాజకీయ సునామీ!

కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం  మరోసారి ప్రత్యక్ష రాజకీయాలలో యాక్టివ్ కానున్నట్లు కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలు పెట్టారో అప్పటి నుండి  ఏపీ రాజకీయాలలో మళ్ళీ ముద్రగడ పేరు వినిపించడం మొదలైంది. పవన్ యాత్రల సమయంలో ముద్రగడ బహిరంగ లేఖలు, వ్యాఖ్యలు రాజకీయాలలో హీట్ పెంచాయి. కానీ, ఈ మధ్య కాలంలో మళ్ళీ ముద్రగడ ఎక్కడా కనిపించలేదు. అయితే, ముద్రగడ వైసీపీలో చేరనున్నట్లు గట్టి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే వైసీపీ నేతలు ఎంపీ మిధున్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు వంటి నేతలు ముద్రగడను కలిశారు. ఆ తర్వాత స్వయంగా ముద్రగడ గాజువాక వెళ్లి మంత్రి గుడివాడ అమరనాధ్ తో భేటీ కూడా అయ్యారు. అప్పుడే ముద్రగడ వైసీపీలోకి వెళ్లడం ఖాయమని నిర్ధారణయిందని వైసీపీ నేతలు గట్టిగా చెప్పారు. జనవరి 2న ముద్రగడ పద్మనాభం అధికారికంగా వైసీపీలో చేరనున్నట్లు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు.  ముహూర్తం గడువు ముగిసింది కానీ ముద్రగడ మాత్రం వైసీపీ కండువా కప్పుకోలేదు. దీంతో ముద్రగడ రాజకీయ వ్యూహం ఏంటన్న ఆసక్తి మొదలైంది. అయితే, నిన్నటి వరకూ వైసీపీలో చేరేందుకు ప్రణాళికలు రచించుకున్న ముద్రగడ చూపు ఇప్పుడు జనసేన వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. సరిగ్గా కొత్త ఏడాదిలో వైసీపీలో చేరేందుకు పెట్టుకున్న ముహూర్తం రోజునే ఆయన తన అనుచర వర్గంతో కలసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం తర్వాత ఆయన తన నిర్ణయంపై పునరాలోచన చేసినట్లు తెలుస్తుంది. ముద్రగడ వైసీపీలో చేరేందుకు వెనకడుగు వేయడం వెనక బలమైన కారణం కూడా ఉందని అంటున్నారు. ముద్రగడ వైసీపీలో చేరితే ఆయన కుమారుడు చల్లారావుకు వైసీపీ నుండి టికెట్ హామీ దక్కింది. ముద్రగడ చల్లారావును కాకినాడ ఎంపీ లేదా పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించవచ్చని ప్రచారం సాగింది. ముద్రగడ కోడలుకు తుని అసెంబ్లీ సీటు   ఇస్తారన్న మరో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది.  కానీ, ఇప్పుడు ఆయా స్థానాలలో సీట్ల సర్దుబాటు లొల్లి కొనసాగుతున్నది. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు.  వైసీపీ రిలీజ్ చేసిన రెండవ జాబితాలో పిఠాపురం అసెంబ్లీ సీటుకు కాకినాడ ఎంపీ వంగా గీత పేరు ప్రకటించారు. ఇక మిగిలింది కాకినాడ ఎంపీ సీటు, తుని సీటు అని అనుకున్నారు. అయితే తుని నుంచి మంత్రి దాడిశెట్టి రాజా ఉండగా.. ఆయనను ఎంపీగా కాకినాడ నుంచి పోటీ చేయమని వైసీపీ అధినాయకత్వం సూచించినా ఆయన నో చెప్పినట్లు తెలుస్తున్నది. దాంతో దాడిశెట్టి రాజా  తుని నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని వైసీపీ నేతలే చెబుతున్నారు.   అదే విధంగా కాకినాడ ఎంపీ సీటు విషయంలో కూడా వైసీపీ అధినాయకత్వం నుంచి  చలమలశెట్టి సునీల్ కి హామీ దక్కినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ముద్రగడకి హామీ ఇచ్చిన సీట్లకు కూడా వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసేసింది. దాంతో ఇపుడు ముద్రగడ వైసీపీ నుండి జనసేన వైపు చూపి మళ్లించారని అంటున్నారు. ముద్రగడ ఆసక్తి ఆధారంగా ఇటీవల జనసేనకు చెందిన నాయకులు కూడా ముద్రగడ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, తాతాజీ, కాపు జేఏసీ నేతలు ముద్రగడతో సమావేశమై చర్చలు జరిపారని తెలుస్తుంది. దీంతో ముద్రగడ జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. కాగా  తాము ముద్రగడను మర్యాదపూర్వకంగానే కలిశామని నేతలు తెలిపారు. అదలా ఉండగానే మరో రెండు మూడు రోజుల్లో జనసేన ముఖ్యనేతలు కొందరు ముద్రగడను కాలవనున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. కాగా, జనసేన నేతలు తనను కలవడంపై ముద్రగడ మాత్రం ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. ఇప్పటికే కాపు పెద్దలు తనను దూషించినా దీవెనల్లానే స్వీకరిస్తానని, వైసీపీ కుట్రలో కాపు పెద్దలు పావులుగా మారొద్దని, కాపునేతలకు జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పవన్ కల్యాణ్ జనవరి 4న రాసిన ఓ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇది ముద్రగడను ఉద్దేశించే, ముద్రగడ ఆలోచన ఆధారంగానే రాసిన లేఖగా ఇప్పుడు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితులు చూస్తే ముద్రగడ ఆలోచన జనసేన వైపు ఉన్నట్లేనేని అంటున్నారు.

కమలానికి విక్రమ్ గౌడ్ దూరం.. బీజేపీకి రాజీనామా చేసిన బీసీ నేత

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాజయ పరాభవ భారాన్ని పక్కన పెట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ నుంచి అత్యధిక పార్లమెంటు స్థానాలలో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలించి బలమైన బీసీ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఏమీ ఆశించకుండా  నిస్వార్థంగా పార్టీ కోసం పని చేస్తున్న తన వంటి నేతలకు బీజేపీలో గుర్తింపు లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిచేరిన తనవంటి వారిని పార్టీలో అంటరాని వారిగా చూస్తున్నారని పేర్కొంటూ ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపిచారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీలో ఆ క్రమశిక్షణ మచ్చుకైనా కనిపించడం లేదనీ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతే కాకుండా పార్టీలో కీలక నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కినా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉన్న నేతలు చోద్యం చూస్తున్నారని,  బీజేపీలో కొనసాగాలంటే గ్రూపు రాజకీయాలలో ఉండాల్సిందే అన్న పరిస్థితి ఉందనీ విక్రమ్ గౌడ్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి బాధ్యత ఎన్నికల తర్వాత ఓటమికి ఎవరూ బాధ్యత తీసుకోలేదని విక్రమ్ గౌడ్ ఆరోపించారు. లోక్ సభకు పోటీ చేసే అవకాశంపై పార్టీ హైకమాండ్ నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో పార్టీని వీడుతున్నట్లు విక్రమ్ గౌడ్ కిషన్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో  పేర్కొన్నారు. ఇలా ఉండగా హైదరాబాద్ మహానగరంలో బలమైన గౌడ సామాజికవర్గానికి చెందిన నాయకుడు ముఖేష్ గౌడ్ కుమారుడైన విక్రమ్ గౌడ్ రాజీనామా బీజేపీకి  గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ వీడొద్దంటూ బీజేపీ నేతలు బుజ్జగించినప్పటికీ, లోక్ సభ కు పోటీ విషయంలో స్పష్టమైన హామీ రానందున విక్రమ్ గౌడ్ రాజీనామాకే మొగ్గు చూపారని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో  విక్రమ్ గౌడ్ తన భివిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.  

ఫార్ములా ఈ రేస్ కుంభకోణం... కెటీఆర్ జైలుకు ?

తెలంగాణ ప్రభుత్వం  మాజీ మంత్రి , బిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కెటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అనేది చర్చనీయాంశమైంది.   బిఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు  కెటీఆర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ జరిగింది. కెటీఆర్ ఫామ్ హౌజ్ మీద డ్రోన్ కెమెరా ఎగిరిందన్న సాకుతో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించడంలో కెటీఆర్ ముఖ్య భూమిక వహించారు. ఆధారాలు లేకుండానే అప్పట్లో రేవంత్ రెడ్డిని కటకటాల పాలు చేయడంలో  కెటీఆర్ పాత్ర కీలకం. 2023 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. అప్పటి ఫామ్ హౌజ్ ఎపిసోడ్ లో రేవంత్  రెడ్డి బాధితుడు. ప్రస్తుతం ఆ బాధితుడే తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.   ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కెటీఆర్ . ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉన్నాయి.  హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ రద్దు అయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వ సహాయ నిరాకరణ.  ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని నిర్వాహకులు ఇప్పటికే  ప్రకటించారు. అక్టోబర్ 30, 2023న సంతకం చేసిన హోస్ట్ సిటీ ఒప్పందాన్ని నెరవేర్చకూడదని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్  నిర్ణయం తీసుకోవడంతో ఈవెంట్ రద్దయినట్లు వారు చెప్పారు. ఫార్ములా ఈ రేసింగ్ రద్దు కావడంపై స్పందిస్తూకేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన చర్యలకు నిదర్శనం అని విమర్శించారు. ఈ రేస్ లాంటి కార్యక్రమాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి, దేశానికి పెట్టుబడులు, కీర్తి వస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయన్నారు. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించడంతో.. స్పందిస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.తెలంగాణ డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క ఫార్ములా ఈ స్కాం బయటపెట్టారు. ఫార్ములా ఈ రేస్  ట్రై పార్టీ అగ్రిమెంట్. రాష్ట్రానికి మేలు చేకూర్చే అగ్రిమెంట్ కాదు అని పరిశీలకులు అంటున్నారు. ఒక్క రూపాయి రాష్ట్రానికి లాభం లేకుండా చేసుకున్న అగ్రిమెంట్ ఇది. ఫీజు కట్టాల్సిన కంపెనీ టికెట్లు అమ్ముకుని వెళ్లిపోయింది. ఫార్ములా ఈ రేస్ కోసం 110 కోట్ల రూపాయలు కట్టకుండా వెళ్లిపోవడంతో ఆ భారం  రాష్ట్రప్రభుత్వంపై పడింది.  దీనివల్ల ప్రజలకు మేలు చేకూరే ప్రయోజనం శూన్యం. అయినా అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఫార్ములా ఈ రేస్ దోహదపడుతుందని కెటీఆర్ భావన. బిజినెస్ రూల్స్ కు విరుద్దంగా ఈ వ్యవహారం నడిచింది. వ్యక్తుల కోసం వ్యవస్థలను వాడుకున్నారు. ఈ అగ్రిమెంట్  ప్రకారం ఒక విడత  55 కోట్ల రూపాయలు కట్టబెట్టడంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కీలకపాత్ర పోషించారు. మంత్రి కెటీఆర్ ఆదేశం మేరకే తాను 55 కోట్ల రూపాయల ఫండ్ ను రిలీజ్ చేశానని అరవింద్ కుమార్ చెబుతున్నారు. 55 కోట్ల రూపాయల నిధులను  విడుదల చేయాలంటే కెబినెట్ ఆమోదం  కంపల్రరీ.  కెటీఆర్ బామ్మర్దికి లాభం చేకూర్చడానికి, కెటీఆర్ తనయుడు హిమాన్షు ఎంజాయ్ మెంట్ కోసం ఫార్ములా ఈ రేస్ దోహదపడిందని ప్రభుత్వం  గుర్తించింది. లోకసభ ఎన్నికలకు ముందే కెటీఆర్ ను జైలుకు పంపించాలని తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది. 

నేతల వలసల ప్రవాహం.. వైసీపీకి గడ్డు కాలం!

శీతాకాలంలో కూడా ఏపీ రాజకీయాలు రోహిణి కార్తె వేడిని తలపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో ఈ హీట్ ఎడారి వాతావరణాన్ని సృష్టిస్తోంది. వడదెబ్బ తగిలినట్లుగా పార్టీ నీరసించిపోతోంది. నిర్వీర్యమైపోతోంది. ఇందుకు కారణం వైసీపీ అధినేత, సీఎం జగన్ తీసుకొనే నిర్ణయాలు.  జగన్ తీరు, వైఖరి, తీసుకుంటున్న నిర్ణయాలతో   వైసీపీ వరుస షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల మార్పుతో ఎమ్మెల్యేలలో  తీవ్ర అసంతృప్తి నెలకొనగా ఒక్కొక్కరు జగన్ మోహన్ రెడ్డికి  బై బై చెప్పేస్తున్నారు.  టటా వీడుకోలు ఇక సెలవూ అంటూ పార్టీని వీడుతున్నారు. వారిని ఆపడానికి జగన్ నియమించుకున్న బృందం ఎంత ప్రయత్నించినా, స్వయంగా జగన్ వారికి హామీలు గుప్పించినా ఫలితం ఉండటం లేదు. వైసీపీలో నేతల రాజీనామాల పర్వానికి ఫుల్ స్టాప్ పడడం లేదు.   మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో మొదలైన ఈ నేతల రాజీనామాల పరంపర అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతూనే ఉంది. తాజాగా బుధవారం (జనవరి 10) కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇక రేపో మాపో ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి కూడా వైసీపీని వీడడం ఖాయమైంది. సంక్రాంతి లోపే పార్థసారథి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. వీరు చాలరన్నట్లు ఉరుములేని పిడుగులా..  ఉమ్మడి కృష్ణా జిల్లా  తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. రక్షణ నిధి పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ తో చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీని వీడే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. రక్షణనిధి కూడా సంక్రాంతి పండగ లోపే పార్టీకి, పదవికి రాజీనామా చేయడం గ్యారంటీగా చెప్తున్నారు. సొంతపార్టీ నేతల రాజీనామాలు వైసీపీని   చిక్కుల్లోకి నెడుతున్నాయి. ముందుగా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. అదే దారిలో అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా పసుపుకండువా కప్పుకున్నారు. ఇక  మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేసిన సంగతి విదితమే.  ఇప్పుడు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇలా పార్టీని వీడే వారి జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది.  గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, బి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్, దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ లు కూడా అదే దారిలో నడిచేందుకు రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరందరికీ కూడా జగన్ నియోజకవర్గం మార్చడమో, లేదా ఈ సారికి పార్టీ టికెట్ లేదనో చెప్పడమే వీరి ఆగ్రహానికి, అసంతృప్తికీ కారణమని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆ కారణంగానే ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వీరు.. నేడో రేపో పార్టీకి రాజీనామా చేసేసినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా  రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని వీడి అవకాశం ఉందని చెబుతున్నారు.  జగన్ ఏకస్వామ్య, ఏకపక్ష నిర్ణయాల కారణంగానే పార్టీలో వలసల జోరు పెరిగిందని పార్టీ నేతలే చెబుతున్నారు.  అంతా  నా ఇష్టం.. అంతా నా ఇష్టం.. ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అన్నట్లుగా పార్టీలో నన్నడిగేవాడెవరు అన్న తలబిరుసుతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయననే కాకుండా పార్టీని కూడా ముంచేస్తున్నాయని పార్టీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  జగన్ రెడ్డి మొండి వైఖరి కారణంగానే రాజకీయంగా వైసీపీ పతనం దిశగా వేగంగా అడుగులు వేస్తోందన్న అభిప్రాయం పరిశీలకుల నుంచే కాకుండా పార్టీ వర్గాల నుంచి కూడా వ్యక్తం అవుతోంది.  సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్నాను కనుక ప్రజలు తనకే ఓటేస్తారని, తానెవరిని చూపిస్తే వాళ్లనే గెలిపిస్తారన్న   భ్రమలో జగన్.. సర్వేల పేరిట అభ్యర్థులను మార్చేస్తే గెలిచేస్తాననీ, మళ్లీ అధికారం చేపడతాననీ కలలు కంటున్నారు.  అయితే ఇది జరిగే పని కాదని, ఈసారి ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారనీ పార్టీ నేతలే అంటున్నారు. జగన్ తీరు మార్చుకోవాలని అనేక సందర్భాల్లో ఆయనకు చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేదని అంటున్నారు.  అందుకే మా దారి మేం చూసుకుంటున్నామంటూ జగన్ పార్టీకి, జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. 

వైసీపీ నుంచి వలసల వెల్లువ.. దేశం గూటికి కొలుసు

కొలుసు సైకిల్ సవారీ.. ముహూర్తం కన్ ఫర్మ్ ఫలించని బుజ్జగింపులు.. పార్టీ వీడేందుకే మొగ్గు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తలలు పట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏదో సినిమాలో  సూపర్ స్టార్ రజనీకాంత్  దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటించాడు.  అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.  అది సినిమా కనుక డైలాగ్ బాగా పేలి హిట్ అయ్యింది. అయితే జగన్ ఇప్పుడు నిన్నటి దాకా తానే  దేవుడిని, తన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరించి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడేసరికి కొంచం మాట మార్చాడు. సినిమా డైలాగ్ ను తలపించేలా ఐప్యాక్  శాసించింది.. నేను పాటిస్తున్నాను అంటూ చెబుతున్నారు. అలా చెబుతూ కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తన పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు.   దీంతో వారిలో చాలా మంది ఒక్కొక్కరూ ఒక్కో రఘురామకృష్ణంరాజుగా మారిపోతున్నారు. అంటే పార్టీలో రెబల్స్ గా మారిపోతున్నారు.  అంతే కాదు.. పార్టీ వీడడానికి రెడీ అయిపోతున్నారు. తాము ఏ పార్టీలో చేరినా, అక్కడ అంటే ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు టికెట్ లభించినా, లభించకపోయినా, వైసీపీ ఓటమే లక్ష్యంగా పని చేయడానికి రెడీ అయిపోతున్నారు. తాజాగా ఈ వరుసలో   ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పార్ధసారథి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారు. పార్ధసారథి టీడీపీలో చేరనున్నట్లు గత వారం రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. వైసీపీ పెద్దలు బుజ్జగింపులు పర్వం కూడా సాగింది. మంగళ, బుధవారాలలో వైసీపీ పెద్దలు సారథిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.  వైసీపీ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి సారథితో సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు.  అయినా పార్ధసారథి పార్టీ తీరుపైన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసి గుడ్ బై చెప్పడానికే రెడీ అయ్యారని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పార్థసారథితో వైసీపీ బుజ్జగింపులు ఫలించలేదు. వైసీపీలో ఇక కొనసాగలేనని పార్టీ నేతలకు కూడా  పార్థసారథి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇప్పటికే వైసీపీ పెద్దలు మూడు దఫాలుగా సారథితో సమావేశమయ్యారు. ధనుంజయ రెడ్డి, ముత్యాల రాజు లతో భేటీ అనంతరం సారథి సీఎంవోకి వెళ్లి జగన్ ను కూడా కలిశారంటున్నారు. అయితే ఆయనకు జగన్ ను కలిసే అవకాశం లభించలేదన్న సమాచారం కూడా వస్తోంది. ఏం జరిగిందీ అన్ననది.. అంటే జగన్ తో కొలను పార్థసారథి భేటీ అయ్యారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఆయన తాడేపల్లి ప్యాలస్ కు వెళ్లారు. ఆ తరువాత మరింత గట్టిగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.  అలాగే టీడీపీలో చేరడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.  విజయవాడలోని తన కార్యాలయంలో టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావులు పార్థసారథితో భేటీ కావడం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది.  ఈ నెల 18న గుడివాడలో చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న రా కదలి రా బహిరంగ సభలో  కొలుసు పార్థసారథి తెలుగుదేశం కండువా కప్పుకుంటారని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి.   ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి పార్టీని వీడడం నిస్సందేహంగా వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అమరావతి రాజధాని ప్రభావంతో ఈ జిల్లా ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో పార్థసారథి లాంటి సీనియర్లు  పార్టీని వీడితే ఈ జిల్లాలో వైసీపీకి కోలుకోవడం అసాధ్యమే అవుతుందంటున్నారు.  యాదవ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి కమ్మ సామజిక వర్గం అధిక ప్రభావం చూపే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక బీసీ నేతగా ఉన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్, ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మంత్రిగా  పనిచేసిన అనుభవం, రాజకీయాలలో విస్తృత స్నేహాలు ఉన్న కొలుసు పార్థ సారథి జిల్లా రాజకీయాలలో తనదైన ప్రభావాన్ని చూపగలరు. అధిష్ఠానం ఇష్టారీతిగా వ్యవహరిస్తే సహించేది లేదని ఇటీవలే    వైసీపీకి స్పష్టమైన హెచ్చరిక కూడా చేశారు.  ఇటీవల పోరంకిలో వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర సందర్భంగా జరిగిన సభలో ఆయన  పార్టీ టిక్కెట్టు రాకుంటే పెనమలూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చాటారు.  అంటే టికెట్ ఇవ్వకుంటే వైసీపీతో తెగతెంపులు చేసుకుంటానన్న సంకేతాన్ని ఆయన ఎప్పుడో పార్టీకి ఇచ్చారు. ఇప్పుడు అదే చేస్తున్నారు.  టీడీపీ ఆహ్వానం పలకడంతో ఆయన టీడీపీతో కలిసి నడిచేందుకు రెడీ అవుతున్నారు.   ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రమే కాదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా వైసీపీ నేతల చూపు ఇప్పుడు తెలుగుదేశం వైపు ఉంది. అసలే ప్రభుత్వ  వ్యతిరేకత, రాజధానిపై జగన్ నిర్ణయం, ఇప్పుడు ఈ ఇన్ చార్జీల మార్పుతో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అవ్వడమేబెటర్ అన్న భావన వ్యక్తం అవుతోంది.    పార్టీలలో అవకాశాల వేటలో ఉన్న ఈ నేతలలో ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేరిపోవడానికి రెడీ అయిపోతున్నారు. తెలుగుదేశం, జనసేన పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో అవకాశం ఉండదని భావించిన వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.  ఇటీవలే అంటే రెండు మూడు రోజుల నుంచే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్న తరువాత నుంచే  ఏపీలో కాంగ్రెస్ రాజకీయం మొదలు  అయ్యింది.  అంతే వెంటనే ఆ పార్టీలోకి కూడా భారీగా చేరికలు జరిగాయి. బుధవారం (జనవరి 10) విజయవాడ  కాంగ్రెస్ కార్యాలయంలో  పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి.   మరో రెండు వారాలలో కాంగ్రెస్ గేట్లు కూడా చేరికల కోసం పూర్తిగా ఎత్తేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  

 కొత్త వేరియంట్లకు పరిష్కారం ఇంట్రానాసల్ వాక్సిన్ 

యుఎస్ శాస్త్రవేత్తల బృందం మెరుగైన , ఇంట్రా నాసల్ వాక్సిన్ ను కనుగొంది. వైరస్ ప్రవేశించే ప్రదేశంలో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి మరింత మెరుగుపడుతుంది. ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల దీర్ఘకాలికంగా వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపర్చడానికి మార్గం సుగుమం అవుతుంది. వైరస్ శరీరంలో ప్రవేశించిన మరుక్షణమే ప్రభావం చూపిస్తుంది. ఇంజెక్షన్ కంటే ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ఎన్నో రెట్లు మేలు అని వేరే చెప్పక్కర్లేదు. మెమోరీ లాస్ ను తగ్గించగలదు . బూస్టర్ షాట్ అవసరాన్ని తగ్గిస్తుంది.  వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ శాతం  బాగా పడిపోతుంది. వైరస్ పురోగతిని నిరోధించగలదు.   మా గణాంకాల ప్రకారం సబ్ క్యూటానస్ వాక్సిన్ తో పోలిస్తే ఇంట్రానాసల్ వ్యాక్సిన్ శ్రేష్టమైనది. వ్యాధినిరోధక కణాలు మరింత చురుకుగా పనిచేసేలా దోహదపడుతుంది. వాడుక భాషలో ఈ కణాలను టి సెల్స్ అని వ్యవహారిస్తారు. ఈ టీ సెల్స్ ప్రభావం అంతా ఇంతా కాదు. వ్యాధి తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత అశ్లే సెయింట్ జాన్ చెప్పారు. ఆయన డ్యూక్  నూస్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అత్యవసర వ్యాధి సంక్రమణ విభాగంలో క్రియాశీలంగా ఉన్నారు.  ఇవే కాదు  ఇంట్రానాసల్ వ్యాక్సిన్ కేంద్ర మెమొరీ సెల్స్ పురోగతికి  ఎంతో దోహదపడుతుంది. దీర్ఘకాలికంగా ఈ కణాలు మనుగడ సాగించగలవు. టి సెంట్రల్ మెమొరీ  సెల్స్ మన శరీర పరిరక్షణకు ముఖ్య భూమిక వహిస్తాయి. కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు ఇంట్రాసల్ వ్యాక్సిన్ ఒక పరిష్కారాన్ని చూపగలదు. జెఎన్ 1 వేరియంట్ వల్ల ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం వైరస్ వేగంగా ప్రబలడమే. వైరస్ కణాలు గుణాత్మకం చెంది వైద్యులనే ఆశ్యర్యపరిచిన దశలో ఇంట్రానాసల్ వాక్సిన్ పరిష్కార మార్గాన్ని వెతికింది. 

రేవంత్, సీతక్కలను చూసి నేర్చుకోండి.. కేశినేని నానికి తమ్ముడు చిన్ని హితవు

కేశినేని నాని, కేశినేని చిన్ని ఇద్దరూ అన్నదమ్ములు. ఒకరిది అహంకారం, ఆభిజాత్యం. మరొకరిది వినయం, ఒబ్డిడితనం. ఇద్దరి మధ్యా చాలా స్పష్టమైన తేడా ఉంది. కేశినేని నాని తెలుగుదేశం అభ్యర్థిగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు. 2019లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం ఓడిపోయింది. ఒకే ఒక్క స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహనరావు విజయం సాధించారు. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి తన నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు సహకారం, సహాయం అందింస్తారు. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల విజయం, మెజారిటీపైనే లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి విజయం, మెజారిటీ ఆధారపడి ఉంటుంది. అలా చూసుకుంటే.. 2019 సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ  లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని నుంచి ఆ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులకు ఎటువంటి సహకారం అందలేదు సరికదా కేశినేని నాని విజయానికి ఆయన లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి విజయం సాధించిన గద్దె రామ్మోహనరావు వల్లే దక్కిందని చెప్పాలి. ఔను ఆ ఎన్నికలలో కేశినేని నానికి వచ్చిన మెజారిటీ కేవలం 8726 ఓట్లు మాత్రమే.  అంత తక్కువ మెజారిటీతో అయినా కేశినేని నాని గెలుపునకు, లోక్ సభ అభ్యర్థి సహాయ సహకారాలతో సంబంధం లేకుండా కేవలం తనకున్న ప్రజా బలంతో, పార్టీ దన్నుతో విజయం సాధించిన గద్దె రామ్మోహనరావు సెగ్మెంట్ లో నానికి అత్యధిక ఓట్లు పోల్ కావడమే కారణం అని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అదలా ఉంచితే..  2019 ఎన్నికల అనంతరం కేశినేని నాని తీరు పార్టీకీ తీవ్ర నష్టం చేసిందనడంలో సందేహం లేదు. పార్టీ కంటే తానే అధికుడినన్నట్లుగా ఆయన వ్యవహరించిన తీరు, పార్టీ అధినేతపైనే పలు సందర్భాలలో చేసిన విమర్శలు, పార్టీ కార్యక్రమాలకు ఉద్దేశపూర్వకంగా దూరం ఉండటం ఇలా ఎలా చూసినా కేశినేని నాని అవసరం లేదని తెలుగుదేశం భావించడానికి ఆయనే పూర్తిగా కారణం.   అన్నిటికీ మించి అమరావతి ఉద్యమానికి కేశినేని దూరంగా ఉండటం, అదే సమయంలో అధికార పార్టీ నాయకులతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడంతోనే పార్టీ విజయవాడ లోక్ సభ కు నాని వద్దు మరో అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. పూర్తిగా నాని వైఖరి వల్లే పార్టీ ఆ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఆ విషయాన్నే పార్టీ అధినేత చంద్రబాబు ముగ్గురు సీనియర్ నాయకులను నాని ఇంటికి పంపి తెలియజేశారు. దాంతోనే తెలుగుదేశంతో నాని రాజకీయ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పడింది. ఇన్నేళ్ల పాటు పార్టీలో ఉన్న నానికి తెలుగుదేశం అధినాయత్వం బర్త్ రఫ్ చేయకుండా ఆయనంతట ఆయనే వెళ్లిపోయే వెసులుబాటు కల్పించింది.   మరో వైపు ఇదే కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని మౌనంగా తన పని తాను చేసుకుంటున్నారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం ఇన్ చార్జీలతో సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. అంతే కాకుండా నియోజకవర్గ పరిధిలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, వైద్య శిబిరాల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ముందుండటం వంటి కార్యక్రమాలతో ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే  స్వయానా తన అన్న కేశినేని నాని ఎన్నిరకాలుగా తనను ఇబ్బందులు పెట్టినా, పోలీసు కేసులు పెట్టి వేధించినా, రెచ్చగొట్టేలా ఎన్ని విమర్శలు చేసినా ఎప్పుడూ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. అన్నను పన్నెత్తు మాట అనలేదు.  అయితే కేశినేని నాని జగన్ ను కలిసిన తరువాత మీడియా ఎదుట తెలుగుదేశంపై చేసిన విమర్శలకు మాత్రం సుతిమెత్తగా అయినా చాలా ఘాటుగా జవాబిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ రాష్ట్ర మంత్రి సీతక్కలను ఉదహరిస్తూ పార్టీ వీడిన తరువాత వ్యవహరించాల్సిన తీరు ఎలా ఉండాలో అన్నకు హితవు పలికారు.   రేవంత్ రెడ్డి, సీతక్కా ఇరువురూ కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించిన వారే. అయితే తరువాత పార్టీ మారారు అయినా ఎక్కడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కానీ, పార్టీ అధినేత చంద్రబాబుకు కానీ వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట అనలేదు. హుందాగా రాజకీయాలు చేశారు. వారిద్దరినీ ఉదాహరణగా చూపుతూ కేశినేని నాని కూడా హుందాతనంలో రాజకీయం చేయాలని కేశినేని శివ హితవు చెప్పారు.