వైకాపా ఫినిష్.. జగన్ అధికారం ఇక వంద రోజులే.. రఘురామకృష్ణం రాజు

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ఓటమి ఆ పార్టీ అధినేత జగన్ కు కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ ఓటమిని అధిగమించి పార్టీని గెలుపు మార్గం పట్టించేందుకు ఆయన చేపట్టిన సిట్టింగుల నియోజకవర్గాల మార్పు కార్యక్రమం పార్టీ పరిస్థితిని పతనం నుంచి పాతాళానికి దిగజారిపోయేలా చేస్తోంది. ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అదే చెబుతున్నారు. శ్రీకాకులం నుంచి అనంతపురం వరకూ వైసీపీ గెలిచే స్థానాలు 18 నుంచి 20 మాత్రమేనని రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు.  ఇక పోటాపోటీగా ఉండే ఓ పాతిక స్థానాలలో ఓ 15 అటూ ఇటై గెలిచినా వచ్చే ఎన్నికలలో వైసీపీకి 35 స్థానాలకు మించి దక్కు పరిస్థితి లేదని ఆయన కుండబద్దలు కొట్టేశారు. అయితే ఇప్పుడు నెల్లూరు కు చెందిన పెద్దా రెడ్లు, గుంటూరు కు చెందిన మంచి వ్యక్తులు తెలుగుదేశం కూటమి వైపు చూస్తున్నారనీ, వారు కూడా జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తు ఇక జగన్ కు గెలుపు ఆశ  అనేది దేవదాసు సినిమాలోని కలయిదని... అనే పాట చందమేనని అన్నారు.  ఆ పాటను  వైసీపీ నాయకులు ప్రాక్టీస్ చేస్తే మంచిదని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. శనివారం(డిసెంబర్ 6) రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన  తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.  ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని, ఆయన దాన గుణాన్ని, ప్రజల్ని ప్రేమించే విధానాన్ని ఆరు రోజుల్లోనే  తెలుసుకొని  భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మరో వారం,  పది రోజుల వ్యవధిలో ఆయన తెదేపా, జనసేన పార్టీలలో  ఏదో ఒక పార్టీలో చేరే అవకాశాలున్నాయని క్రికెట్ అభిమానులు భావిస్తురన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి నాకు ఆరు నెలల సమయం పడితే, అంబటి రాయుడు ఆరు రోజులనే అర్థం చేసుకొని  పార్టీని వీడారన్నారు. బ్యాటింగ్ చేసి రెండు వందల పరుగులు చేస్తాడనుకున్న రాయుడు, హిట్ వికెట్ అయ్యారని కొంతమంది కామెంట్లు చేయవచ్చు. రాబోయే రోజుల్లో మునిగిపోయే నావ వంటి వైకాపాను  వీడాలని  అంబటి రాయుడు తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలిస్తే, క్రికెట్ లో ఎంత వేగంగా అయితే పరుగులు చేస్తారో అంతే  వేగంగా నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించాల్సిందేనని రఘు రామ కృష్ణంరాజు అన్నారు.  నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ శాసనసభ్యులు  ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఇప్పటికే  ఆ పార్టీని వీడి  తెదేపాలో చేరిన విషయం తెలిసిందేనని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఇప్పుడు మరో ఇద్దరు  సనామదేయులు రానున్న రెండు మూడు రోజులలో తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలున్నాయని చెప్పారు.  ఇక జగన్ సమీప బంధువు బాలినేని రాజకీయాల్లో ఉన్నంతవరకు  వైసీపీలోనే కొనసాగుతానని చెప్పినప్పటికీ,  తిట్టమంటే తిట్టలేను, కొట్టమంటే కొట్టలేనని చెప్పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బయటపడిపోయారు. కృష్ణదేవరాయలను గుంటూరుకు వెళ్ళమంటే, నిర్మొహమాటంగా నో అనేశారు. అమరావతి రైతులకు అంతగా అన్యాయం చేశాక మెడ మీద తలకాయ ఉన్న ఎవరైనా అక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. గుంటూరు  స్థానం  నుంచి వైకాపా తరఫున బుద్ధి ఉన్నవారెవరూ పోటీ చేయరని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఒకవేళ పోటీ చేసినా దారుణంగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎవరైనా విజయవకాశాలు మెండుగా ఉన్న తెలుగుదేశం  తరఫున పోటీ చేయాలని భావిస్తారు.ఎందుకంటే  ఆ ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం నాయకత్వం ఎన్నో ప్రణాళికలను అమలు చేసింది. తెలుగుదేశం తరుపున పోటీ చేసే వారు నూటికి నూరు పాళ్ళు విజయం సాధించే అవకాశం ఉందని చెప్పారు . గుంటూరులో ఇంత  నెగిటివిటీ ఉందని అంబటి రాయుడు అర్థం చేసుకున్నారు కనుకనే పార్టీని వీడారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆ కారణంతోనే అక్కడ నుంచి పోటీకి కృష్ణదేవరాయలు నిరాకరించారని రఘురామకృష్ణం రాజు  అన్నారు.  ఇక  పన్నెండు గంటలు ఎదురు చూసినా కాపురామచంద్రారెడ్డికి 12ఎదురు చూసినా జగన్ మోహన్ రెడ్డి దర్శన భాగ్యం దక్కలేదనీ చెప్పిన రఘురామకృష్ణం రాజు,  దీంతో ఆయన ఇంత కాలం భగవత్ స్వరూపుడిగా భావించి, కీర్తించిన జగన్ పై ఆగ్రహించిన   మీడియా సమక్షంలోనే తాడేపల్లి ప్యాలెస్ కు ఓ దండం అంటూ నిష్క్రమించారని గుర్తు చేశారు. పూతలపట్టు శాసనసభ్యుడు ఎమ్మెస్ బాబును బెదిరించడంతో ఆయనతో వైకాపాలోనే  కొనసాగుతానని చెప్పినట్లు తెలిసింది. అయితే ఇంకొన్ని వారాలపాటు  భయపెడితే భయపెట్టవచ్చు. కానీ ఆ తరువాత వారు నిజాలని బయట పెడుతారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.  ఇక గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి అయితే రెంటికి చెడ్డ రేవడిలా  తయారైందని రఘురామకృష్ణం రాజు అన్నారు. వైకాపాను వీడి గుడివాడ అమర్నాథ్ జనసేనలో చేరలేని పరిస్థితి  నెలకొంది. గుడివాడ అమర్నాథ్ పరిస్థితి చూసి తన మనసు  నొచ్చుకుందన్నారు. అమర్నాథ్ కు మరొకచోట సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తానే సెల్ఫీ ఫోటో ఇచ్చానని చెప్పుకున్న అమర్నాథ్, పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అయినా ఆయన చేత అన్యాయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి అనుచిత విమర్శలు చేయించారు. జగన్మోహన్ రెడ్డినే నమ్ముకున్న అమర్నాథ్ ను ఇలా మోసగించడం దారుణమన్నారు. ఎమ్మెస్ బాబు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి  తరహాలోనే అమర్నాథ్ కూడా  తాను టికెట్ ఇచ్చినా... ఇవ్వకపోయినా  వైకాపాలోనే కొనసాగుతానని చెబితే చెప్పవచ్చు. కానీ అమర్నాథ్ కే ఇలా జరిగిందంటే నమ్ముకున్న నాయకుడికి   క్రెడిబిలిటీ  ఎలా ఉంటుంది. ఏముంటుందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అమర్నాథ్ పరిస్థితే ఇలా ఉంటే... జోగి రమేష్ ను ఏం చేస్తారో తెలియదు. స్పీకర్ స్థాయి పక్కనపెట్టి  జగన్ కోసం వందిమాగధుడి   స్థాయికి దిగజారిన   తమ్మినేని సీతారాంకు కూడా షాక్ ఇచ్చారు. స్థాయిని మరిచి దిగి వచ్చిన తరువాత కూడా టికెట్ లేదని జగన్ తమ్మినేనికి మొండి చేయి చూపడంతో   ఆయన అనారోగ్యం పాలయ్యారని రఘురామకృష్ణం రాజు అన్నారు. అనంతపురం నుంచి మొదలుకొని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు తో పాటు ఉభయ గోదావరి జిల్లాలలోనూ ఇదే తరహాలో శాసన సభ్యులకు  మింగుడు పడని నిర్ణయాలను జగన్ తీసుకున్నారనీ,  శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని  సీతారాం , విశాఖపట్నంలో మంత్రి అమర్నాథ్ షాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఒక వేళ ఎమ్మెల్యేలు తప్పు చేశారనుకుంటే ఇంత మంది ఎమ్మెల్యేలు   ఒకేసారి  తప్పు చేస్తారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి పైన కోపం ఉన్నది. ఆ కోపాన్ని  జగన్ ఎమ్మెల్యేలపైకి  తోసేస్తున్నారు. స్పీకర్ గా  తమ్మినేని సీతారాం శాసనసభలో అడ్డగోలుగా సహకరించినందుకు ప్రజలకు కోపగించుకున్నారంటే అర్థం ఉంది. అంతేకానీ ఆయన తన నియోజకవర్గ ప్రజలకు  చేసిన అన్యాయం ఏముంది?, న్యాయం ఉందో లేదో పక్కన పెడితే, కోపగించుకోవడానికి ఆయన చేసిన అన్యాయం ఏమైనా ఉందా? అంటూ నిలదీశారు.    పాలకులు తెలుగు భాషకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, అటువంటి పాలకులకు బుద్ధి చెప్పాలన్న  జగన్మోహన్ రెడ్డి సాహసానికి  సెల్యూట్ చేస్తున్నానని రఘురామకృష్ణం రాజు  తెలిపారు.  రాజమండ్రిలోని చైతన్య రాజు కాలేజీలో  తెలుగు మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్, స్వామి స్వరూపానంద తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా జగన్మోహన్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు  పరిశీలిస్తే తెలుగు భాషకు అన్యాయం చేసింది ఎవరో  అందరికీ తెలుస్తుంది. మూడవ తరగతి విద్యార్థులకు కూడా టోపెల్ పరీక్షలు నిర్వహిస్తానని, అమ్మ, నాన్న అని పిలువ వద్దు... మమ్మీ డాడీ అని పిలవాలని, ఇంగ్లీష్ భాషలో మీడియంలో బోధిస్తామంటే తనపైనే నిందలు వేస్తున్నారని  విద్యార్థుల తల్లిదండ్రులను రెచ్చగొడుతున్నది  ఎవరని  రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మాతృభాషను ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాలి. తెలుగులో స్పష్టంగా మాటలు పలికే విధంగా ఉండాలి. ప్రపంచ భాషలలో కూడా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా  తెలుగు భాష గుర్తింపు పొందింది. తెలుగు భాషను పాలకులు చంపే ప్రయత్నాన్ని చేస్తుంటే, 2019 నవంబర్లో  విభేదించి మాట్లాడినందుకే  జగన్మోహన్ రెడ్డికి, నాకు మధ్య తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష ఔన్నత్యాన్ని  తెలుసుకొని, భాషా పరిరక్షణ కోసం కృషి చేయాలి. ఇంగ్లీష్ మీడియం వద్దని ఎవరూ అనడం లేదు. తెలుగు మీడియంలో  కొన్ని క్లాసుల వరకు చదువుకునే వారికోసం చదువుకునే  వెసులుబాటును కల్పించాలి. మాతృభాషలో  ఏదైనా విషయాన్ని సులువుగా ఆకలింపు చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడే ఏమి కొత్తగా ప్రవేశపెట్టలేదు. గత ముఖ్యమంత్రుల హయాంలో కూడా  ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు బోధన జరిగింది. మాతృభాషను గౌరవించని వారు, మనల్ని గౌరవిస్తారని అనుకోవడం  అత్యాశే అవుతుంది. తల్లిని గౌరవించలేనివాడు తల్లి భాషను గౌరవిస్తారా? అని రఘురామ నిలదీశారు.  తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు మాతృభాష నేర్చుకునే విధంగా కృషి చేయాలన్నారు.  మాతృభాష నేర్చుకున్న తర్వాత, ఇంగ్లీష్ భాషను నేర్చుకుందామని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరిట ఆర్భాటంగా ప్రారంభించిన  కార్యక్రమం మూడవ రోజు అడ్రస్ లేకుండా పోయిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. తొలిరోజు  క్రీడా  శాఖ మంత్రి రోజాకు ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  క్రికెట్ పాఠాలను నేర్పించి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక జగన్ ఆర్భాటంగా మొదలు పెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మూడో రోజుకే అడ్రస్ లేకుండా పోయిందన్నారు.  రాష్ట్రంలో రాజకీయ ఆటలు తప్ప ఆడుదాం ఆంధ్ర ఆటలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఆడుదాం ఆంధ్ర కంటే ఎక్కువగా  అంగన్వాడీల ఆటలు, పాటలు వినిపిస్తున్నాయి. ఆడుదాం ఆంధ్ర కోసం కేటాయించిన 100 కోట్ల రూపాయల నిధులు అవుట్ అని  అర్ధం చేసుకోవాలన్నారు. వ్యక్తిగత పబ్లిసిటీ పిచ్చితో  అన్నింటిపై బొమ్మలను వేసుకొన్నారు. రాజమండ్రిలో మూత్రశాలల వద్ద కూడా ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి, స్థానిక శాసన సభ్యుడు జక్కంపూడి రాజాల ఫోటోలను ముద్రించినట్లుగా మీడియాలో చూశానని చెప్పారు.   కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల ని ఉద్దేశించి వైసీపీ చెందిన ఒక మహిళా ప్రతినిధి, విదేశీ ప్రతినిధి తో పాటు  పలువురు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు జుగుస్సా కరంగా  ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు . మీ ఇంటి మహిళకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదా అని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఏ ఇంటి మహిళను కూడా ఇంతలా కించపరచకూడదు. తన రాజకీయ అవసరాల కోసం వైఎస్ షర్మిలను కాళ్లు అరిగేలా తిప్పి, ఆమెకు ఏ పదవి లేకుండా చేసి, ఇప్పుడు ఆమె తన దారి తాను చూసుకుంటే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కొమ్ముకాసే పెయిడ్ ఆర్టిస్టులు  కొంతమంది  చేత  షర్మిల, కేఏ పాల్ కు ఎక్కువ, కమ్యూనిస్టులకు తక్కువ అని ఏక వచనంతో  అపహస్యం చేయించడం దారుణమని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఎవరు కే ఏ పాల్ కు ఎక్కువో, కమ్యూనిస్టులకు తక్కువనో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న 100 రోజుల్లో వైకాపాకు పడనున్న డెంట్ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవడానికి గేట్ రెడీ అని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసిన వైఎస్ షర్మిల కుటుంబ ఆపేక్షలన్నింటినీ పక్కనపెట్టి వైకాపా ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించేది లేదని పేర్కొన్నారు. ఏపీలో జరగబోయే మహాసంగ్రామానికి వైఎస్ షర్మిల కార్యోన్ముఖురాలు కావడంతో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి  కలత చెంది, తన కుమారుడు భార్గవ రాముడు   పర్యవేక్షిస్తున్న సోషల్ మీడియాను  విభాగం ద్వారా షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేయించడం దారుణమని రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు . తమ వేతనాలు పెంచాలని ఆందోళనలు చేస్తున్న  అంగన్వాడీలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  ఎస్మా చట్టాన్ని  ప్రయోగించినట్లుగా  రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అంగన్వాడీల పై ఎస్మా చట్ట ప్రయోగం చెల్లుతుందా?, చెల్లదా?  అన్నదానిపై స్పష్టమైన అవగాహన  లేదన్నారు. గౌరవ వేతనంతో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలనుకోవడం దారుణం. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన దాఖలాలు లేవు. వారేమి ప్రభుత్వ సిబ్బంది కాదు.  ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీని మాత్రమే  అమలు చేయమని వారు కోరుతున్నారు. ఒకవేళ వారి కోరిక సమంజసం కాకపోతే పిలిపించి మాట్లాడాలి. వారి డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, నిర్లక్ష్యంగా నియంత లాగా, రాచరిక వ్యవస్థలో వ్యవహరించినట్లుగా  వ్యవహరించడం అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో  ఏమాత్రం సరికాదన్నారు. సచివాలయానికి నిత్యం వెళ్లకుండా ఏదో మంత్రి వర్గ సమావేశానికి మాత్రమే హాజరయిన ముఖ్యమంత్రిని ఇప్పటివరకు  చూడలేదనీ,  ఇంట్లోనే కూర్చొని, అప్పుడప్పుడు బటను నొక్కే కార్యక్రమం పేరిట హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తూ, ప్రజలను, మంత్రులను, శాసన సభ్యులను  కలవకపోవడం సిగ్గుచేటన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని  గత నాలుగున్న ఏళ్లు గా మొదలు పెడతామని చెప్పిఇప్పటి వరకూ ఆరంభించలేదు.   ప్రజలు ఎవరినైనా సరే  అందుబాటులో ఉండి అన్ని సేవలను అందిస్తారని ఉద్దేశంతోనే ఎన్నుకుంటారు కానీ, ప్యాలెస్ లలో కూర్చుని ప్రజాసమస్యలు పట్టిచుకోని వ్యక్తిని కాదన్నారు. ఇక జగన్ అడ్డోలు నిర్ణయాలకు న్యాయస్థానాలలో  రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తప్పడం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .  జనవరి 13న తన నియోజకవర్గానికి వెడుతున్నానని రఘురామకృష్ణం రాజు చెప్పారు. దాదాపు నాలుగేళ్ల తరువాత తాను తన సొంత నియోజకవర్గంలో అడుగుపెడుతున్నానని చెప్పిన ఆయన  ఈ నాలుగేళ్లుగా నియోజకవర్గానికి ఎందుకు దూరంగా ఉన్నానో, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటున్నాను. వారితో మాట్లాడుతూనే ఉన్నాను. అయినా, మతం ముసుగులో కొంతమందికి డబ్బులు ఇచ్చి నన్ను ప్రశ్నించేందుకు వైకాపా నాయకత్వం మనుషులను పంపనుంది. నన్ను ప్రశ్నిస్తే... అన్ని విషయాలు బయట పెడతాను. ఇవన్నీ మళ్లీ చెప్పించాలనుకుంటే,   పంపండి అని సవాల్ చేశారు. ఇక  పోలీసులు తమ పని తాము చేసుకుంటే మంచిదనీ,  రాబోయే రోజుల్లో పోబోయే ఈ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పారని చెత్త కేసులు పెట్టి, పిచ్చి పనులు చేయకుండా సంయమనం పాటించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి కార్యక్రమాన్ని చేపడితే, ప్రతిరోజు నేను  వారి ఇండ్లలోనే ఉంటున్నానని  రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రాన్ని తిరిగి బతికించడానికి  తెదేపా అధినేత  చంద్రబాబు నాయుడు ఇచ్చిన రా కదిలి రా పిలుపునందుకొని  కనిగిరి నియోజకవర్గ సభను  ప్రజలు బ్రహ్మాండంగావిజయవంతం చేశారని రఘురామకృష్ణం రాజు చెప్పారు. 

బాబుతో పెనుమలూరు ఎమ్మెల్యే భేటీ... తెలుగు దేశం గూటికేనా ? 

వైకాపా ఎమ్మెల్యే  కొలుసు పార్థ సారథి ఒకటి రెండు రోజుల్లో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కేబినెట్ లో పని చేసిన కొలుసు పార్థ సారథి  2014 నుంచి వైకాపాలో కొనసాగుతున్నారు. ఇటీవలి కాలంలో వైకాపా నుంచి జంప్ అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది.  హైదరాబాద్ లో  టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుని కలిసిన కొలుసు పార్థసారథి ఈ నెల 7,8 తేదీల్లో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.  కొలుసు పార్థసారథి  ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన పెనమలూరు శాసససభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా కొనసాగుతున్నారు 2004, 2009, 2019  వరుసగా  మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు.  2004 లో మొదటిసారి వుయ్యూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. తరువాత 2009, 2019 లో పెనమలూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.  ఆయన కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా)అధ్యక్షునిగా కూడా ఉన్నారు.  వై.ఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక మంత్రిగా పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి. పార్థసారథికి తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్,పోర్ట్‌ఫోలియోను కేటాయించారు.జగన్ నియంతృత్వ పోకడలను గతకొంత కాలంగా వ్యతిరేకిస్తున్న పార్థసారథి టిడిపిలో చేరితే కృష్ణా జిల్లాలోని వైకాపా కేడర్ అంతా గంపగుత్తగా ఖాళీ అయ్యే  అవకాశం ఉంది. 

కస్తూరిబా టీచర్లను ఉద్యోగాల నుండీ తొలగించిన ఏపీ ప్రభుత్వం

ఎపిలో అంగన్ వాడీ కార్మికులపై ఎస్మా ఉక్కుపాదంతో అణిచి వేసిన జగన్ సర్కార్  అదే రోజు కస్తూర్బా ఉపాధ్యాయులను ఏకంగా  విధుల నుంచి తొలగించింది. దీంతో ఉపాధ్యాయులు  ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు.  కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల (కేజీబీవీ)లో పని చేసే ఉపాధ్యాయులను తొలగించాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆదేశాలు జారీచేసింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు సమ్మెకు దిగడంతో వారిపై సర్కారు కన్నెర్రజేసింది. సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులందరినీ తొలగించాలని ఆదేశాలు జారీచే నట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. కేజీబీవీ టీచర్లను వెంటనే విధుల్లో చేరాలని సూచించాలని, చేరని వారిని పూర్తిగా విధుల నుంచి తొలగించాలని జిల్లాల అధికారులకు సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు అమలుచేస్తే ఒకేసారి దాదాపు వెయ్యి మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఒకటి రెండు రోజుల్లో తొలగింపు ఉత్తర్వులు జారీ చేసేందుకు జిల్లాల్లో అధికారులు సన్నద్ధమవుతున్నారు.అయితే ప్రభుత్వం ఎన్నిబెదిరింపులకు దిగినా సమ్మె విరమించేది లేదని సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో శుక్రవారం ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయాన్ని ముట్టడిస్తామని జేఏసీ చైర్మన్ కాంతారావు తెలిపారు. సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, లేనిపక్షంలో మినిమం టైమ్ స్కేలయినా అమలుకు డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబరు 20 నుంచి సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.   

అంగన్ వాడీలపై  జగన్ సర్కార్ ఎస్మా ప్రయోగం

రెండు వారాలుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీలను జగన్ సర్కార్ ఉక్కు పాదంతో అణచి వేయాలని చూస్తోంది. అందులో భాగంగా అంగన్ వాడీలపై  జగన్ సర్కారు ఎస్మా ప్రయోగించడంతో  తీవ్ర నిరసన వ్యక్తమౌతుంది.  అక్కాచెల్లెళ్లమ్మలు అన్నావు...తెలంగాణ కన్న ఎక్కువ జీతమిస్తాను అన్నావు...ఇవేనా నీ హామీలు...అని ప్రశ్నిస్తున్నారు అంగన్వాడీల కార్యకర్తలు. మాట తప్పను...మడమ తిప్పను అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి..అంగన్వాడీలకిచ్చిన మాట తప్పాడు. వారి హామీల అమలులో మడమ తిప్పాడని ధ్వజమెత్తుతున్నారు. 2 వారాలుగా హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి...ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పడం చాలా దారుణ చర్య అని ఆక్రోశిస్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు అంగన్వాడీలు. మాకు అన్ని చేసిందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. అవేంటో మాకు చెప్పాలని అంగన్ వాడీలు కోరుతున్నారు. ఇలానే జగన్‌ సర్కార్‌ మెుండి వైఖరితో ఉంటే ఉద్యమం ఉధృతం చేస్తామంటున్నారు. మరి రానున్న రోజుల్లో అంగన్వాడీల కార్యకర్తల నిరసనలు తీవ్ర రూపం దాల్చి జగన్ ఓటమికి దారి తీస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రెండు వారాల నుంచి సమ్మె చేస్తున్న అంగన్ వాడీలను సముదాయించేదిపోయి ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వారిపై ఎస్మా ప్రయోగించారు.  అంగన్ వాడీ కార్మికుల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి గాని, ప్రభుత్వ పెద్దలు ముందుకు రాకపోవడంతో అంగన్ వాడీలు నిరసనగా కొండముచ్చుకు వినతిపత్రం ఇవ్వడం చూస్తే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేవలం పదకొండు వేల రూపాయలను జగన్ సర్కార్ అంగన్ వాడీలకు ఇస్తుంది. పనికి దగ్గ వేతనం ఇవ్వాలని అంగన్ వాడీలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు లక్షా 40 వేల మంది అంగన్ వాడీలు చాలీ చాలని జీతాలతో బ్రతుకులీడుస్తున్నారు.  అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఎం తెలుస్తుంది?  అని అంగన్ వాడీలు ప్రశ్నిస్తున్నారు. పేదల పక్షపాతి అని చెప్పే జగన్  అంగన్ వాడీలను రోడ్డున పడేశారు.  పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా?  అని ప్రజాస్వామిక వాదులు అక్రోశిస్తున్నారు. అంగన్వాడీ ఉద్యమం పై సైకో సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణమంటున్నారు.  అంగన్వాడీల పై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం జగన్ నియంత పోకడలకు పరాకాష్ట  అని నినదిస్తున్నారు. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జిఓ నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. జగన్ అహంకారానికి...అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదేనని రుజువు కానుంది. 

మోదుగులకు జగన్ పిలుపు ...నరసారావ్ పేట ఎంపీ టికెట్  ?

నరసారావు పేట  ప్రస్తుత ఎంపి క‌ృష్ణ దేవరాయలకు ఈసారి  గుంటూరు నుంచి పోటీ చేయాలని  జగన్ ఆదేశించడంతో ఆయన ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో చేసేదేమి లేక జగన్ మోదుగులను ఆహ్వానించారు . కృష్ణ దేవరాయలను  గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదేశించిన మరుసటి రోజే వైకాపా నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని  సీఎం క్యాంపు కార్యాలయానికి రావాలని  జగన్ ఆహ్వానించారు. తనకు నరసారావు పేట మారే ఉద్దేశ్యం లేదని ఇప్పటికే కృష్ణ దేవరాయలు తేల్చి చెప్పడంతో బాటు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.   నాకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. నా ఆలోచన వేరు పార్టీ ఆలోచన వేరు అని ఆయన అంటున్నారు. కాని జగన్ తన మాటే నెగ్గాలన్న ఉద్దేశ్యంతో మోదుగులకు కబురు పంపారు. నరసారావ్ పేట నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.   మోదుగుల 2019 వరకు టీడీపీలో కొనసాగారు.  ఆయన 2009లో టిడిపి నుంచి  నరసారావ్ పేట ఎంపీగా  గెలిచారు. తర్వాత వైకాపాలో చేరారు. అయితే ప్రస్తుతమున్న  సిట్టింగ్ ల మార్పు వల్ల  వైసీపీలో  అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం వేదికగా జరుగుతున్న జగన్ కార్యకలాపాలు తీవ్ర అసంతృప్తి రాజేస్తున్నాయి. నరసారావ్ పేట ఎంపీ కృష్ణ దేవరాయలు వైకాపాను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జగన్ మెలో డ్రామా.. సెంటిమెంట్ పండించే యత్నం!?

అందరూ ఊహించినట్లే  షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే ఆమె ఏపీ రాజకీయాలలో కీలకం కానున్నట్లు క్లియర్ అయిపొయింది. దాదాపుగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి అప్పగించడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే షర్మిల నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. అన్న జగన్ ను ఎదుర్కొనేందుకు షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్నను విమర్శించేందుకు ఏయే అంశాలను ఎంచుకోనున్నారు అన్నది ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది. షర్మిల వైఎస్ఆర్టీపీలో ఉంటూ తెలంగాణలో ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వంపై చురకలంటించారు. వైసీపీలో జగన్ తర్వాత నంబర్ 2గా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిపై నేరుగానే విమర్శలు చేశారు. అన్న జగన్ కి అయినా నా సమాధానం ఇదే అంటూ హెచ్చరించారు. అలాంటిది ఇప్పుడు షర్మిల నేరుగా ఏపీకి రాబోతుండడంతో వైసీపీపై షర్మిల విమర్శలకు పదును పెట్టడం గ్యారంటీగా కనిపిస్తుంది. అలాగే అన్న జగన్ ను సూటిగా అటాక్ చేయడానికి ఆమె ఇసుమంతైనా వెనుకాడే అవకాశాలు లేవంటున్నారు. మరి షర్మిల వైఖరిపై వైసీపీ సమాధానం ఏంటి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఉత్కంఠభరిత అంశంగా మారింది. ఎందుకంటే గతంలో షర్మిల ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసినా వైసీపీ నేతలు నోరు మెదపలేదు.. బాబాయ్ వివేకా హత్యకేసుకు సంబంధించి షర్మిల ఢిల్లీ వెళ్లి వాంగ్మూలం ఇచ్చినా.. సొంత వారే చిన్నాన్నను కడతేర్చారని షర్మిల బహిరంగంగా చెప్పినా వైసీపీ నేతలలో ఉలుకూపలుకూ లేదు. ముందు మీది మీరు చూసుకోండని సూటిగా సజ్జల లాంటి వారికి కౌంటర్లు ఇచ్చినా వైసీపీ నుంచి కనీసం స్పందన కూడా లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు షర్మిల ఏకంగా ఏపీ వచ్చి వైసీపీపై, జగన్ పై విమర్శలు చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో  వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఒకరిద్దరు నేతలు స్పందించినా.. షర్మిల వచ్చినా తమకు ఎలాంటి నష్టం లేదన్న పొడి పొడి మాటలే వినిపించాయి తప్ప..  హీట్  పెరిగేలాంటి కామెంట్లు, విమర్శలు లేవు. అయితే, ఇప్పటికిప్పుడు వైసీపీలో షర్మిలను టార్గెట్ చేసి విమర్శలు చేసే అవకాశం లేదనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరికను జగన్ తనపై ప్రజలలో సానుభూతి కలిగేలా మార్చుకోవాలని ఆరాటపడుతున్నట్లు వైసీపీ వర్గాలలోనే వినిపిస్తోంది.  తన కుటుంబంలో చీలిక తెచ్చి తన వాళ్లనే తనపైకి ఉసిగొల్పుతున్నారంటూ విపక్షంపై ఎటాక్ చేస్తూ అదే సమయంలో తన పట్ల సానుభూతి పెరిగేలా చిన్న పాటి మెలో డ్రామాను పండించే ప్రయత్నం చేసే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు సైతం అంటున్నారు.  ఒక్కొక్కరుగా తనను ఎదుర్కోలేక.. అందరూ కలిసినా సరిపోక.. ఇప్పుడు తాను ప్రాణంగా చూసుకున్న తన చెల్లితోనే తనను దెబ్బ తీసేందుకు చూస్తున్నారని ఎమోషనల్ డ్రామా పండించేందుకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.   ఇందుకోసమే ఇప్పటికే మాజీ మంత్రి కొడాలి నాని లాంటి వారు మీడియా ముందుకొచ్చి ఈ ఎమోషనల్ కోణాన్ని బయటపెట్టి వెళ్లారు. షర్మిల కాంగ్రెస్ చేరికపై స్పందించిన కొడాలి షర్మిలను పల్లెత్తు మాట అనలేదు. కానీ, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలో భాగమే అనేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ షర్మిల కాంగ్రెస్ చేరికను కూడా తనపై సానుభూతి కలిగేందుకు ఒక అంశంగా వాడేసుకోవడానికి రెడీ అవుతోందని అవగతమౌతోంది. కుటుంబ పరంగా షర్మిలకు అన్యాయం జరిగింది. అన్న కోసం వెట్టి చాకిరీ చేసిన షర్మిలను అధికారంలోకి వచ్చాక కూరలో కరివేపాకులా, పూచిక పుల్లగా తీసి అవతల పారేశారు. సహజంగానే షర్మిల అన్నతో గట్టిగా విభేదించి బయటకు వచ్చారు. షర్మిలకు జగన్ అన్యాయం చేశారని నమ్మడం వల్లే  తల్లి విజయమ్మ   ఆమెకు అండగా నిలిచారు.  ఈ నేపథ్యంలోనే షర్మిలపై వైసీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడితే..  అది వైసీపీకి మరింత నష్టం చేకూర్చనుంది. అందుకే షర్మిలను అడ్డం పెట్టుకొని ఆమె తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరడం ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరించాలన్నది జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ గా కనిపిస్తుంది. అయితే, అన్నా చెల్లెళ్ళ మధ్య ఏం జరిగిందో.. ఏం జరుగుతున్నదో అందరికీ కనిపిస్తూనే ఉంది. కనుక ఇలాంటి సమయంలో జగన్ దీనిని ప్రతిపక్షాలకు ఆపాదిస్తే నమ్మే పరిస్థితి ఉండదు. కానీ, వైసీపీకి అంతకు మించి చెప్పుకొనేందుకు మరో అవకాశం లేదు. అందుకే అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అన్నట్లు అంతా చంద్రబాబే చేస్తున్నారంటూ ప్రచారం చేయడమే జగన్ ఎంచుకున్న నినాదంగా, విధానంగా కనిపిస్తున్నది.

తమ్మినేని అనుకున్నదొకటి.. అయినది మరొకటి.. జగన్ తో అంతే!

సీనియర్ రాజకీయ నాయకుడు తమ్మినేని సీతారాంకు ఇప్పుడు తత్వం బోధపడింది.  జగన్ ప్రాపకం కోసం విలువలకు వలువలు ఒదిలేని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని విమర్శల పేర తిట్టడమే పనిగా పెట్టుకున్న తమ్మినేని సీతారాంకు జగన్ మొండి చేయి చూపారు.  రాజ్యాంగబద్దమైన పదవి ఔన్నత్యాన్ని కూడా కించపరిచి స్పీకర్ హోదాలో  ఇష్టారీతిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ్మినేని సీతారాంకు జగన్ చక్కటి బహుమానం ఇచ్చారు.  ఆముదాల వలస నియోజకవరం టికెట్ ను మాజీ ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాల్ రావు కుటుంబం నుంచి బొడ్డేపల్లి పద్మజ కు ఇచ్చేశారు.   నిజానికి తమ్మినేని సీతారాం ఈ సారి తాను పోటీ చేయనని తన కుమారుడికి చాన్సివ్వాలని చాలా కాలంగా జగన్ ను అడుగుతూ వస్తున్నారు. అయితే చూద్దాం చేద్దాం  దాటేసిన జగన్.. చివరికి తనదైన శైలిలో కనీస సమాచారం కూడా ఇవ్వకుండా  ఆముదాల వలస నుంచి తమ్మినేనిని, తమ్మినేని కుటుంబాన్ని పక్కన పెట్టేశారు. తమ్మినేని తన సీరియారిటీని గుర్తించి ఓ సారి మంత్రిని చేస్తే ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగన్ ను కోరుతూ వస్తున్నారు.   మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు తనను స్పీకర్ గా తప్పించి మంత్రిని చేయాలని జగన్ ను కోరారు. అందుకోశం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అందుకు జగన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందో ఏమో కానీ.. స్పీకర్ చెయిర్ లో కూర్చున్నాన్న స్ఫృహ కూడా కోల్పోయి ఆయన ఫక్తు వైసీపీ ఎమ్మెల్యేలా వ్యవహరించారు. ఒక సందర్భంలో  అచ్చెన్నాయుడుతో ..   మంత్రిని అయి కిందకు వచ్చి మీ సంగతి తేలుస్తానని సవాల్  చేశారు. అయితే జగన్ మాత్రం తమ్మినేనిని లైట్ తీసుకున్నారు. తమ్మినేనికి స్పీకర్ పదవి ఇవ్వడమే గొప్ప, అందుకు ఆయన చేయాల్సిన పని విపక్ష నేతనూ, విపక్ష పార్టీనీ తిట్లతో కంట్రోల్ చేయడమేనని భావించినట్లున్నారు. అందుకే తమ్మినేని అభ్యర్థనలను కనీసం పరిగణనలోనికి కూడా తీసుకోలేదు. ఇక ఇప్పుడు ఎన్నికల వేళ తమ్మినేనిని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో తమ్మినేని పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ గెలిస్తే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రిని చేస్తామని తమ్మినేనికి జగన్ సజ్జల ద్వారా ఓ హామీ అయితే పారేసినట్లు చెబుతున్నారు. ఇలా తానిచ్చే  హామీలకు జగన్ ఏ పాటి విలువ ఇస్తారో వేరే చెప్పనవసరం లేదు.  ఇక తమ్మినేని సంగతే పాపం దారుణంగా మారిపోయింది. ఏదో ఆశించి, తన విలువను తగ్గించుకుని ప్రతిష్టను మంటగలుపుకుని మరీ జగన్ కోసం పని చే స్తే.. ఇప్పుడు బోడిమల్లయ్య సామెతగా ఆయన పరిస్థితి మారిపోయింది. 

కేశినేని నాని రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరం!?

తెలుగుదేశంతో కేశినేని నాని పొలిటికల్ జర్నీకి ఫుల్ స్టాప్ పడింది. తాను ఎంపీ పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తానని స్వయంగా ప్రకటించినా, ఆయన రాజీనామా చేసినట్లు కాదు, తెలుగుదేశం పార్టీయే ఇక  మీ అవసరం లేదని మర్యాదగా తప్పించిందనే చెప్పాలి. తాను రాజీనామా చేయబోతున్నట్లుగా చేసిన ట్వీట్ లో కేశినేని నాని కూడా ఇదే విషయాన్ని చెప్పారు. చంద్రబాబే స్వయంగా పార్టీకి తన అవసరం లేదని చెప్పిన తరువాత తాను ఇంకా ఆ పార్టీలో ఉండటం కరెక్ట్ కాదనీ అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నాననీ చెప్పారు. అయితే కేశినేని నాని ఇంకా రాజీనామా చేయలేదు. త్వరలో హస్తినకేగి అక్కడ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇందులో లాజిక్ ఏమిటన్నది ఆయనకే తెలియాలి కానీ, పరిశీలకులు మాత్రం స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా.. అన్నట్లు నాని విజయవాడ నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నిక కావడం ఆయన బలం కాదు, తెలుగుదేశం బలమని అందరికీ తెలిసిదే.. 2019లో నాని విజయం తరువాత ఆయన స్వరంలో మార్పు రావడానికి ఆ ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలై విపక్షానికి పరిమితం కావడమేననడంలో సందేహం లేదు. దీంతో ఆయన తెలుగుదేశం కంటే తానే మిన్న అన్న భావనలో కొంత కాలం ఆయన ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసినా, అధికార పార్టీ నేతలతో అంటకాగినా.. ఆ తరువాత తత్వం బోధపడింది. అయితే అప్పటికే ఆలస్యమైంది. తెలుగుదేశం పార్టీ కేశినేని నాని విషయంలో ఒక డెసిషన్ తీసేసుకుంది. పార్టీ లైన్ ను లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న ఆయనకు మూడో చాన్స్ ఇచ్చేదే లేదన్న నిర్ణయానికి వచ్చేసింది. ఆ విషయాన్ని ఆయనకు స్పష్టంగా తెలియజేసింది కూడా. కేశినేని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని విజయవాడ నుంచి లోక్ సభకు పోటీలోకి దింపాలని నిర్ణయించుకోవడమే కాదు, ఆ విషయాన్ని సోదరులిరువురికీ స్పష్టంగా తెలిసేలా చేసింది. అప్పటి నుంచి కేశినేని నాని ప్రతి ప్రయత్నం మళ్లీ పార్టీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికే అన్నట్లుగా వ్యవహరించారు. వ్యవహరిస్తూ వస్తున్నారు. సోదరుడు చిన్నితో ఉన్న విభేదాలు కుటుంబపరమైనవి కావడంతో నాని వైఖరిలో వచ్చిన మార్పు వారిరువురి మధ్యా సఖ్యత కు మాత్రం దోహదపడలేదు. చిన్నిని పక్కన పెడితే చాలు పార్టీకి పూర్తిస్థాయిలో విధేయుడినై ఉంటానన్నట్లుగానే కేశినేని నాని వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తిరువూరు గొడవ తరువాత ఇకెంత మాత్రం నాని విషయంలో ఉపేక్షించరాదన్న నిర్ణయానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వచ్చేశారు. అందుకే తన సహజ తీరుకు భిన్నంగా విస్ఫష్టంగా నానికి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ పార్టీ ప్రతినిథుల ద్వారా సమాచారం అందించారు.  దీంతో కంగుతిన్న కేశినేని నాని విషయం జీర్ణించుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. ఒక ఫ్లైట్ కాకపోతే మరో ఫ్లైట్ అంటూ చెప్పినా, రాజీనామా ప్రకటన చేసినా భవిష్యత్ కార్యాచరణ విషయంలో ఒక నిర్ణయానికి రాలేక సతమతమౌతున్నారని పిస్తుంది.   ఇక ఆయనకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఏదో ఒక దానిలో చేరడం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఆయన వైసీపీ గూటికి చేరడం ఆత్మహత్యాసదృశమే అవుతుంది.  ఏపీ వ్యాప్తంగా జగన్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆ పార్టీ వారే బయటకు రావడానికి దారులు వెతుక్కుంటున్నారు.  ఇక కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీలో చేరడం వల్ల నానికి ఒరిగేదేమీ ఉండదని పరిశీలకులు అంటున్నారు.  షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందన్న సూచనలు కనిపిస్తున్నా, అవేమీ ఆ పార్టీ మెజారిటీ సీట్లలో గెలిచి అధికారంలోకి వస్తుందన్నంత స్థాయిలో లేవు. ఈ రెండూ కాకుండా ఆయనకున్న మరో ఆప్షన్ ఏమిటంటే.. మౌనంగా తెలుగుదేశంలో కొనసాగుతూ.. తన వ్యాపారాలు చూసుకుంటూ మాజీ ఎంపీ హోదాను అనుభవించడమే.  

లోక్ సభ ఎన్నికలకు ముందే ఆ హామీల అమలు.. రేవంత్ సర్కార్ కసరత్తు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆరు గ్యారంటీలలో రెండింటిని ఇప్పటికే అమలు చేసిన రేవంత్ సర్కార్.. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కు ముందే మరో మూడు గ్యారంటీలను అమలు చేయాలని యోచిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించేసింది. అధకారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని పదిలక్షలకు పెంపు హామీలను అమలు చేసేసింది. ఇప్పుడు మరో మూడు హామీలపై దృష్టి పెట్టింది.    గృహలక్ష్మి ‌పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు,  మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, అలాగే చేయూత  కింద పింఛన్లను రూ.4 వేలకు పెంపు హామీలను అమలు చేయడానికి రెడీ అవుతోంది. వచ్చే నెలలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ లోపుగానే ఈ హామీలను అమలు చేయాలని పట్టుదలతో ఉంది. ఇందు కోసం కసరత్తు ప్రారంభించేసింది. వీటిలో రెండు వందల యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్  అమలుకు మార్గదర్శకాల రూపకల్పనలో నిమగ్నమైంది. ఇక చేయూత పించన్ పథకం ఇప్పటికే అమలులో ఉంది, దానికి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. వాటిలో అవసరమైన మార్పులు, సవరణలు చేయడంతో పాటు  నాలుగు వేల రూపాయలకు పెంచడంపై కసరత్తు ప్రారంభించేసింది. ఇప్పటికే ఈ విషయంలో ఆయా శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,   మంత్రులు సమీక్ష కూడా నిర్వహించారు. ఈ పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్, ప్రభుత్వంపై పడే భారం తదితర అంశాలపై చర్చించారు.  అధికారం చేపట్టీ చేపట్టగానే రెండు హామీలను అమలు చేసిన సర్కార్ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోగా మరో మూడింటిని కూడా అమలులోకి తీసుకువచ్చి.. ఆ విషయాన్ని ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలని భావిస్తోంది. కేవలం ఎన్నికల లబ్థి కోసమే కాకుండా.. తమది పని చేసే ప్రభుత్వమనీ, హామీల అమలులో చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వమనీ చాటుకోవడానికి రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది.  

ఇలా చేరి అలా రాజీనామా.. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై

వైసీపీకి భవిష్యత్ లేదా? ఈ విషయం పార్టీలో దగాకు గురైన వారే కాదు.. నిన్న మొన్న వచ్చి చేరిన వారికి కూడా అర్ధమైపోతోందా? పరిశీలకులు ఔననే అంటున్నారు. తాజాగా నిన్న కాకమొన్న వైసీపీ కండువా కప్పుకుని జగన్ పై ప్రశంలస వర్షం కురిపించిన అంబటి రాయుడు పార్టీకి గుడ్ బై  చెప్పారు. వైసీపీ మునిగే నావలా ఉందనడానికి అంబటి రాయుడు చేరిన రోజుల వ్యవధిలోనే రాజీనామా చేయడం తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంబటి రాయుడు క్లుప్తంగా తన ఎక్స్ వేదక ద్వారా వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నారని, త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాననీ వెల్లడించారు. గత నెల 28న ఆర్భాటంగా జగన్ సమక్షంలో వైసీపీలో చేరి ఆ పార్టీ కండువా కప్పుకున్న అంబటి రాయుడు అంతలోనే ఇలా తాత్కాలిక విరామం అంటూ వైసీపీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అంబటి రాయుడు గుంటూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని పార్టీ వర్గాల అప్పట్లో చెప్పాయి. అంతలోనే ఆయన వైసీపీలో చేరిన పది రోజుల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేశారు.   మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గత కొంత కాలంగా వైసీపీపై, జగన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ వచ్చారు. అలాగే గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటనలు కూడా చేశారు. ఆయన వైసీపీ గూటికి చేరి గుంటూరు లోక్ సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. అందుకు అనుగుణంగానే అంబటి గత ఏడాది డిసెంబర్ 28న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అంతలో ఏమైందో ఏమో పార్టీకి రాజీనామా చేశారు. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. గుంటూరు నుంచి వైసీపీ టికెట్ లభించే అవకాశం లేదని జగన్ స్పష్టం చేయడంతోనే అంబటి ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న అనుమానాలను పరిశీలకుల  వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా చేరి అలా రాజీనామా చేయడం వల్ల అంబటి రాయుడుకి వచ్చిన నష్టం ఏమీ ఉండదు కానీ, వైసీపీకి, జగన్ ఇమేజ్ కి ఈ పరిణామం భారీ నష్టం చేస్తుందనడంలో సందేహం లేదు. 

వైసీపీలో ఒకరి తర్వాత ఒకరు.. జగన్ పై తిరుగుబాటు!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ల కసరత్తు మొదటికే మోసం తెస్తోందా? అంటే సొంత పార్టీ నుంచే అవునన్న సమాధానం వస్తోంది. సిట్టింగుల మార్పు, తొలగింపు అంటూ ఆయన చేస్తున్న చర్యలు పార్టీ ఉనికిని, అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒక్కరొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అలా చెప్పి మౌనంగా వెళ్లి పోవడం లేదు. జగన్ దగా చేశారనీ, ఆయన పార్టీ కో దండం, ఆయనకు పది దండాలు అంటూ శాపనార్థాలు పెట్టి మరీ వెడుతున్నారు. అలా వెళుతున్నవారు మామూలు నేతలకు కాదు. హార్డ్ కోర్ జగన్ భక్తులు, విధేయులు. జగన్ కు నమ్మిన బంట్లుగా ఇంత కాలం ఉన్న వారు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వెడుతున్నారంటే రానున్న రోజులలో ఇంకెంత మంది ఆ బాట పట్టనున్నారో అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా టికెట్ దక్కకపోవడం, స్థానాన్ని మార్చడం కంటే.. ఆ క్రమంలో జగన్ తమ పట్ల అనుసరించిన వైఖరి, ఇచ్చిన ట్రీట్ మెంట్, చేసిన అవమానం భరించలేకే జగన్ కు నిన్నటి వరకూ భజన చేసిన నేతలు ఇప్పుడు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారు. తాజాగా రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జగన్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్ గొంతు కోశారనీ, దగా చేశారనీ మండి పడ్డారు. జగన్ కో దండం అంటూ తన అసహనాన్ని, ఆవేదనను, ఆక్రోశాన్నీ, ఆగ్రహాన్నీ వ్యక్తం చేశారు. తనకు టికెట్ లేదనడానికి జగన్ ఎవరని నిలదీశారు. వైసీపీ, జగన్ అండ అవసరం లేదనీ, ఇండిపెండెంట్ గానైనా గెలిచే సత్తా తనకు ఉందనీ పోటీ చేసి గెలిచి చూపిస్తాననీ సవాల్ చేశారు.   తాను రాయదుర్గం నుంచి, తన భార్య కల్యాణ దుర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తామని, ఒక వేళ మరే పార్టీ అయినా సీటిస్తే ఆ పార్టీ టికెట్ పై పోటీ చేస్తామని చెప్పారు. ఇండిపెండెంట్ గానైనా గెలిచే సత్తా, సమర్ధత, ప్రజా మద్దతు తమకు ఉన్నాయన్నారు. తాను రాయదుర్గం నుంచి.. తన బార్య కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఏదైనా పార్టీలో టిక్కెట్ ఇస్తే ఆ పార్టీల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు.  కాపు రామచంద్రారెడ్డి.. ఏదో గాలి వాటం నేత కాదు. జగన్ కు అత్యంత ఆప్తుడు, వ్యాపార భాగస్వామి అయిన గాలి జనార్ధన్ రెడ్డికి ఈ కాపు రామచంద్రారెడ్డి వ్యాపార భాగస్వామి. అయితే అది ఒకప్పుడు. ఇటీవలి కాలంలో కాపు రామచంద్రారెడ్డికి గాలి జనార్ధన్ రెడ్డితో విభేదాలు, వివాదాలు తలెత్తాయి. ఆ ప్రభావమే ఇప్పుడు జనగ్ కాపు రామచంద్రారెడ్డికి రిక్తహస్తం చూపారని పార్టీ శ్రేణులలో ఓ చర్చ జోరుగా సాగుతున్నది. అదీ కాక కాపు రామచంద్రారెడ్డి అల్లుడు  ప్రభుత్వ పని కాంట్రాక్టులు చేస్తూ బిల్లులు రాక తీవ్రంగా నష్టపోయారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక  ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు కూడా కాపు రామచంద్రారెడ్డి జగన్ ను పల్లెత్తు మాట అనలేదు.  అన్ని విధాలుగా, చివరికి ప్రభుత్వ నిర్వాకం వల్ల  సొంత అల్లుడు ఆత్మహత్య చేసుకున్నా కాపు రామచంద్రారెడ్డి జగన్ విధేయతను వీడలేదు. అటువంటి తనను జగన్ ఇంత దారుణంగా మోసం చేయడంతో తట్టుకోలేక బ్రేక్ అయ్యారు. తన తడాఖా చూపిస్తానంటూ జగన్ కే సవాల్ విసిరారు.   జగన్ కు అత్యంత విధేయుల తిరుగుబాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలైంది. జగన్ టికెట్ల కసరత్తుతో చినుకుగా మొదలైన తిరుగుబాటు పర్వం గాలివానగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చివరకు మంత్రులు కూడా తమ సీట్ల మార్పు విషయంలో అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్న పరిస్థితి.  గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా జగన్ పైనే సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తుంటే.. జగన్ సరే, పార్టీలోని ఎవరూ కూడా వారించడం కానీ ప్రతి విమర్శలు కానీ చేయడం లేదంటే.. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చ. పార్టీలోని ప్రతి ఒక్కరూ అభద్రతా భావంతో ఉన్నారు. నిన్న ఆళ్ల, నేడు కాపు.. రేపు నేనేనేమో అన్న భావన పార్టీలోని అందరిలో వ్యక్తం అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేశినేని నాని విజయవాడ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ ? 

వచ్చేదఫా టికెట్ రాదని తేలిపోవడంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చంద్రబాబుకి తన అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా తాను ఆ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదంటూ ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు. త్వరలో ఢీల్లీ వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత టీడీపీకి కూడా రాజీనామా చేస్తాను అని  కేశినేని నాని  ప్రకటించారు. రాజకీయాలలో పెద్దగా అనుభవం లేని నాని అక్టోబరు 26, 2008న ప్రజారాజ్యం పార్టీలో చేరి  తనరాజకీయ  ప్రస్థానం ప్రారంభించారు.  ఆయన కేవలం 3 నెలలు మాత్రమే  ఆ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు .2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు మరియు 2019లో అదే నియోజకవర్గం నుండి తిరిగి ఎన్నికయ్యారు.లోక్‌సభలో ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడు గా నాని కొనసాగుతున్నారు. కేశినేని ట్రావెల్స్ వ్యాపారంలో ఉన్న నాని 2018లో ఆ వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. కేశినేనినానికి రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ లేనప్పటికీ ఆయన సోదరుడు కేశినేని చిన్నితో ముదిరిన విభేధాల కారణంగానే టిడిపి ని వీడాల్సి వచ్చింది. తన వాహనం నకిలీ స్టిక్కర్ అతికించుకుని చిన్ని విజయవాడ హైద్రాబాద్ మధ్య తిరుగుతోందని గతంలో కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్ని భార్య పేరు మీద ఉన్న ఈ వాహనం మీద  తన  అధికార ఎంపీ వాహనానికి సంబంధించి నకిలీ స్టిక్కర్ తగిలించినట్లు నాని కంప్లైట్. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది.‘‘ కేశినేని  నాని నాకు స్వంత అన్నయ్య. శత్రువు కాదు అని అన్నయ్య గెలుపు కోసం కృషి చేస్తా ’’ అని చెబుతూనే టిడిపి ఆదేశిస్తే విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానని కేశినేని చిన్ని ప్రకటించారు. కేశినేని నాని కూడా అదేతరహా స్టేట్ మెంట్ ఇచ్చినప్పటికీ సడెన్ గా టిడిపికి గుడ్ బై చెప్పడం చర్చనీయాంశమైంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో కేశినేని నానికి  గట్టి పట్టు ఉంది. తనకు ఇతర రాజకీయ పార్టీల నుంచి  బోలెడు ఆఫర్లు  వచ్చినప్పటికీ కష్టాలలో ఉన్నప్పుడు టిడిపిని అంటిపెట్టుకుని ఉన్నానని అన్నారు. ఒక ప్లయిట్ కాకపోతే ఇంకో ఫ్లయిట్ ఎక్కుతాను . ఏ ప్లయిట్ ఎక్కకపోతే  స్వంత జె ట్ ఫ్లయిట్ ఎక్కుతానని  నిన్న మీడియా సమావేశంలో సంకేతాలిచ్చారు. ఆయనను గతంలో సంప్రదించిన పార్టీలను సంప్రదిస్తారా లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా  అనేది తేలాల్సి ఉంది. 

రాహుల్ ను ఆమోదిస్తేనే కూటమి మనుగడ?

కొత్త ఏడాది ఆరంభంతోనే  ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరిలో షెడ్యూల్, మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయన్న అంచనాతో అన్ని పార్టీలూ సమాయత్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు వేడి మొదలైంది. ఈ ఎన్నికల్లో కూడా తాము విజయం సాధించడం ఖాయమని, వరుసగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. స్వయంగా మోడీ కూడా తానే మరోసారి ప్రధానిని అని చెప్పుకుంటున్నారు. అయితే బీజేపీని గద్దెదింపే లక్ష్యంతో  జట్టు కట్టిన విపక్ష కూటమి ఇండియాలో మాత్రం ఎలాంటి సందడీ కనిపించడంలేదు. ఇండియా శిబిరంలో విజయంపై ధీమా కానీ, విజయం సాధించాలన్న పట్టుదల కానీ ఇసుమంతైనా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా గత ఏడాది చివరిలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూటమిలో ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది.  కూటమి ఐక్యతే ప్రశ్నార్థకమౌతుందా అన్న అనుమానాలు కూడా కూటమి భాగస్వామ్య పక్షాలలో వ్యక్తం అవుతున్నాయి.   సీట్ల పంపకం, , ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నలను తప్పించుకోవడానికి ఈ కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ నానా తిప్పలూ పడుతున్నాయి. ఆ ప్రశ్నలకు ఎదుర్కొనేందుకు భయపడే కూటమి పక్షాలు ముఖం చాటుస్తున్నాయా అన్న అనుమానాలూ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   విపక్ష కూటమి నాయకుడిగా ఎవరిని ఎంపిక చేసుకుంటాయి? అసలు ఆ దిశగా కూటమి భాగస్వామ్య పక్షాలలో ఏమైనా చర్చ జరిగిందా? జరుగుతోందా? అన్న ప్రశ్నలకే సమాధానం లేని పరిస్థితి.  దీంతో  ప్రజలలో ఈ కూటమి పట్ల విశ్వాసం వ్యక్తం కావడం లేదు. కావడానికి కూటమిలోని పార్టీలన్నీ వాటి వాటి స్థాయిల్లో బలమైన ప్రజా బలం ఉన్న పార్టీలే అనడంలో సందేహం లేదు. సీట్ల పంపిణీ వీషయంలో కూటమిలో సిగపట్టు ఉండే అవకాశం లేదు. ఏ పార్టీ బలాన్ని బట్టి ఆ పార్టీ వాటికి పట్టున్న రాష్ట్రాలలో సింహభాగం సీట్లను కోరుకుంటుంది. ఆ విధంగా సర్దుబాటు చేసుకోవడంలో పెద్ద ఇబ్బందులేమీ ఉండవు. అయితే కూటమికి నాయకత్వం వహించే పార్టీ ఏది? నాయకుడు ఎవరు అన్న విషయంలోనే పీటముడి పడుతోంది.  స్వప్రయోజనాలు ఏమాత్రం లేని అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడిని ఎన్నుకోవాలనే అన్ని కూటమి భాగస్వామ్య పార్టీలు చెబుతున్నాయి. అయితే ఆ నాయకుడు ఎవరు అన్న విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నిటికీ ఆమోదయోగ్యుడైన నాయకుడిని  ఎన్నుకోవడం వద్ద చర్చలు, ఆలోచనలు ఆగిపోతున్నాయి.  28 పార్టీల ఇండియా కూటమిలో  కూటమికి నాయకత్వం వహించే నేత ఎవరన్న విషయంలో అన్ని పార్టీలూ ఒకటే మంత్రం పఠిస్తున్నాయి. అదే మౌన మంత్రం. ఆ విషయంపై 28 పార్టీలలో ఏ పార్టీ కూడా నోరుమెదపడం లేదు.  గత ఏడాది  డిసెంబర్ 19వ తేదీన ప్రతిపక్ష కూటమి కీలక సమావేశంలో అనూహ్యంగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును  కూటమి నేతగా ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ముందు  వారిరువురూ కూడా ఎవరినీ సంప్రదించలేదు. ఆఖరికి వారు ప్రతిపాదించిన మల్లిఖార్జున్ ఖర్గేతో కూడా వారు మాట్లాడలేదు.    దీంతో కూటమి నేతగా ఖర్గే పేరు ఎంత హఠాత్తుగా తెరమీదకు వచ్చిందో  అంతే హఠాత్తుగా  వెనక్కు వెళ్లి పోయింది. కానీ ఆ ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి తేనెతుట్టెను కదిపింది.  మమత కేజ్రీవాల్ ఖర్గే పేరు ప్రతిపాదించడం వెనుక ముఖ్య ఉద్దేశం కూటమి నేతగా రాహుల్ ను తాము ఎంత మాత్రం ఆమోదించేది లేదని కూటమి భాగస్వామ్య పక్షాలకు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కు తెలియజేయడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే  కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాల అధినేతలు ఇద్దరు చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒక్కరొక్కరుగా గళం విప్పడం ప్రారంభించారు. అయితే ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిరాకరించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దళిత నేత అయిన ఖర్గే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తే దళితులు పార్టీకి దూరం అవుతారన్న భయం, అనుమానం, ఆందోళన కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఖర్గేకు సన్నిహితుడైన కర్నాటక సీఎం  సిద్దరామయ్య తాము రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ విధంగా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్  చేసిన ప్రతిపాదనను తాము ఆమోదించలేమని స్పష్టం చేశారు.  సొంత పార్టీ వారే ఆమోదించని వ్యక్తికి కూటమి నాయకత్వం వహించడం అన్నది జరగని పని. ఇక అన్నిటికీ మించి గాంధీ నెహ్రూ కుటుంబానికి అత్యంత విధేయుడిగా గుర్తింపు తప్ప ఖర్గేకు దళిత వర్గాలలో పెద్దగా పట్టున్న దాఖలాలు లేవు. ఆయన వెంట దళితులు ర్యాలీ అయ్యే అవకాశలూ లేవు. ఈ నేపథ్యంలోనే  మమత, కేజ్రీవాల్ ల ప్రతిపాదన స్వయంగా ఖర్గేను కూడా ఇబ్బందిలోకి నెట్టింది. అందుకే ఆయన విపక్షాల మధ్య ఐక్యతకే తొలి ప్రాధాన్యత, నాయకుడు ఎవరు? ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఎన్నికల తరువాత చర్చించుకోవాలసిన అంశం అని చెప్పారు. అలా చెప్పడం ద్వారా ఖర్గే తాను ప్రధాని రేసులో ఉండననీ, లేననీ స్పష్టం చేశారు.   ఈ పరిణామాల నేపథ్యంలోనే రాహుల్ గాంధీ మరో పాదయాత్ర ప్రారంభించారు. తద్వారా కూటమి నాయకుడిగా సర్వామోదం కోసం ఆయన ప్రయత్నాలు ఆరంభించారని పరిశీలకులు విశ్లేషించారు. భారత న్యాయయాత్ర పేర ఆయన 14 రాష్ట్రాలను కలుపుతూ 6వేల 200 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు.  ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకే కాదు, కూటమికి కూడా రాహుల్ గాంధీయే  ప్రధాన ప్రచార సారథి, ఆయనే ప్రధాని అభ్యర్థి అని ప్రజలకు, అదే సమయంలో కూటమి భాగస్వామ్య పక్షాలకు తేటతెల్లం చేయనున్నారు.   మరి ఈ యాత్ర అనంతరం కూటమి భాగస్వామ్య పక్షాలకు ఆమోదయోగ్యమైన నేతగా రాహుల్ ఆవిర్బవిస్తారా? కూటమి భాగస్వామ్య పక్షాలు రాహుల్ నాయకత్వాన్ని ఆమోదించకపోతే..  కాంగ్రెస్ అడుగులు, ఆలోచనలు ఓంటరి పోరు దిశగా సాగుతాయా? అన్నది వేచి చూడాల్సిందే. 

ఆర్ 5 జోన్ విచారణ ఎన్నికల తర్వాతే...

అమరావతిలో  ఆర్-5 జోన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ ఏప్రిల్‍కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది   వెంటనే  విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టీస్ దీపాంకర్ దత్తా ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ విజ్ఞప్తి చేశారు. అయితే   రాజధానికి సంబంధించిన ప్రధాన పిటిషన్ ఇదేనని, ధర్మాసనం ముందు పెండింగ్‍లో ఉందని  రైతుల తరపు న్యాయవాది దేవదత్ కామత్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.  ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం పేదలకు సెంటు భూమి ఇచ్చి నివాస గృహాలు.. నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలు అడ్డుకున్నారని సింఘ్వీ వాదించారు.  ఏం జరుగుతుందో తమకు అన్నీ తెలుసన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా  సింఘ్వీ విజ్ఞప్తిని తోసిపుచ్చారు.  ఏప్రిల్‍లో నాన్ మిస్లేనియస్ డే రోజు విచారణ జరుపుతామని తెలిపి వాయిదా వేసింది.  అందరికీ ఇళ్లు పథకం కింద అందుబాటులో ఉండే ధ‌ర‌ల‌తో వాటి నిర్మాణాలు చేప‌ట్టడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్ 5 పేరుతో జోన్ ఏర్పాటు చేసింది. అమరావతిలో పరిధిలో కూడా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి ఆర్ 5 జోన్‌ను నోటిఫై చేసింది.దీనిపై రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు.  ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపైనే  రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.  ఏపీ రాజధాని అమరావతి కేసు  సుప్రీంలో  ఏప్రిల్‌కు వాయిదా పడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినపిటిషన్‌పై విచారణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఈ కేసును ఏప్రిల్ కు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సూచించింది. గత ఏడాది జూలైలో డిసెంబర్‌కు వాయిదా వేసింది. అయితే డిసెంబర్ లో విచారణకు రాలేదు. జనవరిలో విచారణకు వచ్చింది కానీ ఏప్రిల్ కు వాయిదా పడటంతో అప్పటికి ఏపీలో ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగిసిపోతుంది. రాజధాని అంశానికి ఓ ముగింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చి రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అయితే చట్టాలు చేయడానికి వీల్లేదని ప్రకటించడం .. తమ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.  అయితే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.ఆరు నెలల ఆలస్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. వేగంగా విచారణ చేయాలని పదే పదే ఏపీ ప్రభుత్వ లాయర్లు సుప్రీంకోర్టును కోరారు.  అయితే విచారణ అంత కంటే ఎక్కువగా ఆలస్యమవుతోంది. గతంలోనే  జూలైకు వాయిదా పడటంతో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. తీర్పుపై స్టే వస్తే రాజధానిని విశాఖ మార్చాలని సీఎం జగన్ అనుకున్నారు. కానీ కేసు విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. 

సిట్టింగ్ ల మార్పు సంకేతం అదేనా.. జగన్ చేతులెత్తేశారా?

ఏపీలో అధికార వైసీపీ ఇప్పుడు ఓటమి భయంతో వణికిపోతోంది. జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్ప మరో మార్గమే లేదని రాజకీయ పరిశీలకులు ఇప్పటికే విశ్లేషణలతో తేల్చేశారు. వ్యూహకర్తలుగా ఉన్న ఐ ప్యాక్ లాంటి సంస్థ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇక ఇప్పుడు ఏం చేసినా ఫలితం లేదని తేల్చేసినట్లు కూడా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది.  దీంతో ఇప్పుడు వైసీపీ పెద్దలకు ఏం చేయాలో తోచని పరిస్థితి. అయితే  సీఎం జగన్ మాత్రం ఇంకా దింపుడు కళ్లం ఆశతో ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చేస్తూ అదే తమ గెలుపు మంత్రంగా కలరింగ్ ఇస్తున్నారు.  తొలి విడతలో 11 నియోజకవర్గాల ఇంచార్జిలను మార్చేసిన జగన్.. రెండో విడతలో మరో 27 మందిని మార్చేశారు. మొత్తంగా 90కి పైగా స్థానాలలో ఈ స్దాన భ్రంశం అనే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే జగన్ ఇదే తన గెలుపు మంత్రం అని చెప్తున్నా..  పార్టీలో గందరగోళం నెలకొని కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయే కానీ, ఎవరిలోనూ విజయంపై విశ్వాసం మాత్రం కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు వైసీపీకి సిట్టింగుల మార్పు అన్నదే పెద్ద సమస్యగా మారిపోయింది.   నిజానికి వైసీపీ ఈ విధంగా అభ్యర్థులను మార్చేసి ప్రజలను నమ్మించాలనుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నది. ఎందుకంటే ప్రజలు అంత సులభంగా ఈసారి వైసీపీని నమ్మి ఓటేసే పరిస్థితి లేదు. కానీ జగన్ మాత్రం సీనియర్లు, జూనియర్లు అని లేకుండా అందరినీ మార్చేస్తున్నారు. కొందరినైతే పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. దీంతో అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా గెలిపించలేని జగన్.. పార్టీ అధ్యక్షుడిగా అవసరమా అనే ప్రశ్నలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. పుల్లను నిలుచోబెట్టి గెలిపిస్తా అన్న జగన్.. ఇప్పుడు సిట్టింగ్ స్థానాలను ఎందుకు మారుస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా తెలుగేదేశం  అధినేత చంద్రబాబు ఈ తరహాలో వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో రాజకీయ వర్గాలలో ఇప్పుడు ఇదే  ప్రధాన చర్చగా మారింది. కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని స్థితికి జగన్ దిగజారిపోయారని.. తనపై, తన పరిపాలనపై ప్రజలలో నెలకొన్న అసంతృప్తి పాపాన్ని ఎమ్మెల్యేలపై రుద్దుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో వైసీపీ తొలి జాబితా విడుదల చేసిన సమయంలో కూడా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసంతృప్తి ఎక్కువగా ఉందనే కారణంతో ఎమ్మెల్యేలను మార్చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి.. సీఎంగా తనపై కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో అసంతృప్తి ఉందని.. మరి సీఎం అభ్యర్థిని కూడా మార్చేస్తారా అనే ప్రశ్నలు వినిపించాయి. సీఎంగా జగన్ కాకుండా ఎవరిని ప్రకటిస్తారని నెటిజన్లు సూటిగా ప్రశ్నించారు.  ఆ ప్రశ్నలపై ఎలా స్పందించాలో వైసీపీ నేతలకు కూడా అర్ధం కాక తలలు పట్టుకున్నారు. ఇక ఇప్పుడు రెండో జాబితా తర్వాత సిట్టింగులను గెలిపించుకోలేని జగన్ పార్టీ అధ్యక్షుడిగా అవసరమా.. అసలు ఎమ్మెల్యేలు అలాంటి పార్టీలో కొనసాగడం అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన బొమ్మతోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారని చెప్పుకొనే జగన్.. ఇప్పుడు సిట్టింగులను కూడా తన బొమ్మతో గెలిపించలేకపోతున్నారా అని పార్టీలోనే చర్చ జరుగుతోంది.  అసలు కనీసం జగన్ అయినా తన స్థానంలో పోటీ చేస్తారా?  లేక తాను కూడా నియోజకవర్గం మారిపోతారా? అని సెటైర్లు కూడా వేసుకుంటున్నారు.  నిజానికి ఈ ప్రశ్నలలో అర్ధం ఉంది. తన నియోజకవర్గంలో గెలవడం ఏ ఎమ్మెల్యే అయినా చేస్తాడు.. కానీ, రాష్ట్రమంతా ప్రభావం చూపి తనతో పాటు మిగతా ఎమ్మెల్యేల గెలుపులో కూడా కీలకం అయ్యేది ఒక్క పార్టీ అధ్యక్షుడే. కానీ, ఇప్పుడు వైసీపీలో పార్టీ అధ్యక్షుడిని చూసి ఓటేసే పరిస్థితి లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకతకు కీలకం సీఎం జగనే కనుక ప్రజలు ఇప్పుడు జగన్ అంటే మండిపడుతున్నారు. దీంతో తన బొమ్మను పక్కకి పెట్టేసి.. స్థానాలను మార్చేసి ప్రజలను బురిడీ కొట్టించాలని జగన్ చూస్తున్నారు. ఆ మాటకొస్తే జగన్ ఇప్పుడు ఈ అభ్యర్థుల మార్పుతో తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు.  తాను ఎమ్మెల్యేలను గెలిపించలేనని, తనను చూసి ఎమ్మెల్యేలకు ఓటేసే పరిస్థితి లేదని తనకు తానే ఒప్పుకున్నట్లు అయింది. ఎమ్మెల్యేలు ఎవరి గెలుపునకు వారే కష్టపడి.. ఎమ్మెల్యేలే తనను కాపాడాలని జగన్ పరోక్షంగా చెప్పేసి చేతులెత్తేసినట్లు  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బీఆర్ఎస్ లో భగ్గుమంటున్న వర్గ పోరు.. సముదాయించేందుకు నేతల సతమతం!

ఎన్నిక ఏదైనా విజయం మాదే అంటూ తరచూ చెప్పుకునే బీఆర్ఎస్ పరిస్థితి ఒక్క ఓటమితో కకావికళమైపోయినట్లు కనిపిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ఆ పార్టీ వర్గ పోరు పార్టీ ఆగ్రనాయకుల ఎదుటే భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని పక్కన పెట్టి రానున్న లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న బీఆర్ఎస్ కు పార్టీలో వర్గపోరు కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. తెలంగాణ భవన్ లో శుక్రవారం (జనవరి 5) జరిగిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహేందర్ రెడ్డి మాట్లాడుతుండగా రోహిత్ రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేయడం, కుర్చీలు విసురుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల వారికీ మాజీ మంత్రి హరీష్ రావు సర్ది చెప్పడానికి చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. దీంతో హరీష్ రావు మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిలతో ప్రత్యేకంగా సమావేశమై సర్ది చెప్పారు. సమావేశాల్లో బహిరంగంగా ఇలా తలపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెడతాయని క్లాస్ పీకారు. అనంతరం ఇరు వర్గాలూ శాంతించారు. ఈ భేటీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు కూడా ఉన్నారు.  పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక విషయంలో కూడా పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అనివార్యంగా పార్టీ అధినేత కేసీఆర్ నే ఏకగ్రీవంగా బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఓటమి తరువాత మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కు పార్టీలో వర్గ విభేదాలు, అసమ్మతి గళాలు అవరోధంగా మారాయని చెప్పక తప్పదు. 

భారతీ సిమెంట్స్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో భారతి సిమెంట్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. భారతీ సిమెంట్స్ ఎఫ్ డీలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పబట్టింది. జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భారతీ సిమెంట్స్ కు చెందిన రూ.150 కోట్లు విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో  సవాలు చేసింది. ఈడీ వాదనలతో జస్టిస్ అభయ్ ఒఖా నేృతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలు తీసుకుని ఎఫ్ డీలు విడుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది.గత తీర్పును మరోసారి పరిశీలించాలని హైకోర్టుకు, సుప్రీంకోర్టు సూచించింది. బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నాక ఎఫ్ డీలు జప్తు చేశారని భారతి సిమెంట్స్ న్యాయవాది పేర్కొన్నారు. ఎఫ్ డీలపై వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలని మరో పిటిషన్ వేసింది భారతీ సిమెంట్స్. భారతీ సిమెంట్స్ అదనపు పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్లపై విచారణ ముగిసినట్లు జస్టిస్ అభయ్ ఒఖా ధర్మాసనం ప్రకటించింది. అభ్యంతరాలుంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు వెల్లడించింది.

అన్నతో యుద్ధం.. మూడు శక్తులతో షర్మిల సిద్ధం!

వైఎస్ఆర్ తనయ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నతో యుద్ధానికి రెడీ అయిపోయారు. అందు కోసం తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసేశారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. త్వరలోనే షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ పార్టీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. షర్మిలకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తాను సంతోషంగా తప్పుకుంటానని ఇప్పటికే ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్వచ్ఛందంగా ప్రకటించేశారు. దీంతో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి వెళ్లడమే తరువాయిగా పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు షర్మిల ఇప్పటికే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ మాజీ నేత ఒకరితో  ఆమె సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.  గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వైసీపీ నేతలను తిరిగి తమ పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్ గా షర్మిల ఏపీలో తొలి అడుగులు పడుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే, షర్మిలకు  ఇంత ధైర్యం ఏమిటి? జగన్ లాంటి జగమొండిని ఢీ కొట్టేందుకు ఎలా సిద్దపడుతున్నారు?  అసలు అన్నతోనే యుద్ధం చేసేందుకు షర్మిల ఎందుకు సిద్ధపడ్డారు. అలా సిద్ధపడటానికి దారి తీసిన   పరిస్థితులు ఏంటి?  ఎవరి అండ, బలం చూసుకొని అన్నను ఢీ కొట్టేందుకు షర్మిల సిద్ధమయ్యారు? తనకు అడ్డొస్తే ఎవరినీ ఉపేక్షించని  మనస్తత్వం జగన్ మోహన్ రెడ్డిది అని చెప్తుంటారు. సొంత వారైనా తనకు ఎదురొస్తే అడ్డు తొలగించుకొనేంత క్రూరత్వం జగన్ మోహన్ రెడ్డిలో చూశామని గతంలో వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న నేతలు చెప్పే మాట. మరి అలాంటి జగన్ మోహన్ రెడ్డితో షర్మిల కయ్యానికి దిగడం అంటే ఆషామాషీ విషయం కాదు. అన్నీ తెలిసిన షర్మిలలో ఇంత తెగింపు ఎలా వచ్చింది? అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో  హాట్ హాట్ చర్చగా నడుస్తోంది. ముఖ్యంగా షర్మిల ఇంత ధైర్యంగా అన్న జగన్ ను  రాజకీయంగా  అటాక్ చేసేందుకు రంగంలోకి దిగడం సంచలనంగా మారుతున్నది. ఈ అన్నా చెల్లెళ్ళ పొలిటికల్ సినిమా భవిష్యత్తులో ఎలా ఉండనుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే, షర్మిల ఇంత ధైర్యంగా అన్నతో యుద్దానికి దిగడం వెనక మూడు శక్తులు బలంగా పనిచేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల అవసరం ఉంది. అలాగే అన్నను ఢీ కొట్టేందుకు షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అండ కావాలి. ఈ క్రమంలోనే షర్మిలకు సహకరిస్తే ఎంతో కొంత కాంగ్రెస్ అనుకున్న కార్యం నెరవేరుతుంది. అందుకే కాంగ్రెస్ షర్మిలకు సంపూర్ణంగా అండగా ఉండేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది.   అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ద్వారా షర్మిలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు  కాంగ్రెస్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తర్వాత షర్మిల ధైర్యం తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్. తల్లి విజయమ్మ తనతో ఉంటే వైఎస్ కుటుంబం మొత్తం షర్మిలతో ఉన్నట్లే. జగన్ ఎంత సీఎం అయినా విజయమ్మ మాటకే మొత్తం కుటుంబంలో విలువ ఉంటుంది. తల్లి మాటను లెక్క చేయకనే జగన్ పరిస్థితి ఇలా మారింది. షర్మిల భవిష్యత్తు కోసం విజయమ్మ ఏం చేసేందుకైనా సిద్దమేనని తాజాగా ఆమె షర్మిలతో జగన్ ఇంటికి వెళ్లిన సీన్ తేల్చేసింది. ఇక షర్మిలకు మరో అండ భర్త అనిల్ కుమార్. అనిల్‌ కుమార్‌ క్రైస్తవ మత బోధకుడిగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడం, క్రిస్టియన్లను వైసీపీ వైపు మళ్లేలా  ప్రభావితం చేయడం వంటి బాధ్యతలను అనిల్‌ చూసుకున్నారు. అయితే  ఇప్పుడు వైఎస్‌ షర్మిల కోసం కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా క్రిస్టియన్లను మలుపు తిప్పేందుకు అనిల్ రంగంలోకి దిగే  అవకాశం ఉంది.  పైగా అనిల్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ కమ్యూనిటీలతో సంబంధాలు ఉన్నాయి. తద్వారా కూడా ఆర్ధికంగా కాంగ్రెస్ పార్టీకి వనరులను ఆయన సమకూర్చే వీలుంది. అలాగే షర్మిల కోరితే సీఎం జగన్, ఎంపీ అవినాష్ తప్ప మిగతా వైఎస్ కుటుంబం మొత్తం అండగా ఉంటారు. ఇప్పటికే కుటుంబంలో జగన్ పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో అదంతా ఇప్పుడు షర్మిలకు పాజిటివ్ గా మారనుంది. ఇన్ని అవకాశాలు ఉండడంతో నే షర్మిల ధైర్యం చేసి అన్నకు బాణం ఎక్కుపెడుతున్నారు. పైగా జగన్ ఎంత మొండి వాడో షర్మిల కూడా అంతే మొండి అని  సన్నిహితులు చెప్తారు.  ఏదైనా తలచుకుంటే అది అయ్యే వరకూ వదిలే ప్రసక్తిలేని మనస్తత్వం షర్మిల సొంతమని చెబుతారు. అందుకే  తన నుంచి రాజకీయంగా ఎంతో లబ్ధి పొంది.. ఆ తరువాత తనను కూరలో కరివేపాకులా తీసిపారేసిన అన్నకు తగిన గుణపాఠం చెప్పాలి, అంతకు అంత బదులు తీర్చుకోవాలన్న లక్ష్యంతోనే జగన్ కు వ్యతిరేకంగా ఏపీలో షర్మిల  రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.