కొడాలి నాని నోరు మూసుకో..

ఎపి ఎన్నికల సంఘం ప్రతిష్టకు భంగం కలిగించేలా పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షాకిచ్చారు . రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు అంటే.. ఈ నెల 21వ తేదీ వరకు మీడియా సమావేశాల్లో కానీ, అలాగే బృందాలతో కానీ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఆదేశాలను అమలు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌, ఎస్సీ, విజయవాడ పోలీసు కమిషనర్‌లను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను విద్వేషపూరిత ప్రసంగం గా ఎస్‌ఈసీ పరిగణించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు నిమ్మగడ్డ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా.. నిన్న మంత్రి కొడాలి నాని తాడేపల్లిలో విలేకరుల సమావేశం పెట్టి నిమ్మగడ్డను, చంద్రబాబును తీవ్ర పదజాలంతో తిట్టిపోశారు. ఈ విమర్శలపై స్పందించిన ఎస్‌ఈసీ.. ఆయనకు షోకాజ్‌ నోటీసు పంపించింది. దీంతో సాయంత్రానికి మంత్రి తన వివరణను తన న్యాయవాది ద్వారా పంపించారు. ఎస్‌ఈసీ అంటే తనకు గౌరవమే అని అయన వివరణ ఇచ్చారు. అయితే మంత్రి వివరణతో ఎస్‌ఈసీ సంతృప్తి చెందలేదు. అంతేకాకుండా ప్రెస్‌మీట్‌లో చేసిన ఆరోపణలు, విమర్శలను మంత్రి వెనక్కి తీసుకోకపోవడాన్ని ఎస్ఈసీ తీవ్రంగా పరిగణించింది. మంత్రి కోడలి నాని గత నాలుగైదు నెలలుగా ఎన్నికల సంఘంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, అయినప్పటికీ తాము సంయమనం పాటించమని నిమ్మగడ్డ వివరించారు. అయితే, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం వల్ల ఎన్నికల సంఘంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని, దీంతో మంత్రిపై చర్యలు తీసుకున్నట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు.  

ఏపీ నీ అబ్బా జాగీరు కాదు.. 

ఏపీలో ఒక వైపు ఎన్నికలు , మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ రెండు విషయాలపై ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ పై నిరంతరం శివకాశి టపాసుల బ్లాస్ట్ అవుతేనే ఉన్నారు.. అధికార పార్టీ లో మాత్రం స్టీల్ ప్లాంట్ కదలిక లేదు. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.  అధికార పార్టీ నాయకుల పై విమర్శలు చేశారు..  వైసిపి నాయకులు మాత్రం సిగ్గులేకుండా స్టీల్ ప్లాంట్ విషయం మాకు తెలీదని మాట్లాడుతున్నారని  అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును ఆయన శుక్రవారం కలిసి సంఘీభావం తెలుపుతూ. అచ్చన్న మాట్లాడుతూ ‘ఢిల్లీకి పదులసార్లు వెళ్లిన సీఎం రాష్ట్ర ప్రయోజనాల గురించి, స్టీల్‌ప్లాంట్‌ గురించి ఏనాడైనా మాట్లాడారా? ఏపీ రాష్ట్రాన్ని  తన పై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికి, సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నారని.. ఏపీ ప్రజల మనోభావాలతో ఆటలు ఆడుతున్నడని.. అలా చెయ్యడానికి ఏపీ  నీ అయ్య, తాత జాగీరు కాదని జగన్ పై  అచ్ఛనాయిడు విరుచుకుపడ్డారు.. స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి జగన్ లేఖ రాశానంటున్నారని, ఆ లేఖ ఢిల్లీలో ఎవరు చూస్తారో తెలియదని వ్యంగ్యంగా మాట్లాడారు  విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయడానికి పూనుకున్న దుర్మార్గమైన ముఖ్యమంత్రిని నిలదీయాలని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జగన్‌ ప్రభుత్వం కనుసన్నల్లోనే జరిగిందని. 3 లక్షల కోట్ల విలువైన స్టీల్‌ప్లాంట్‌ను రూ.20 వేల కోట్లకు కొట్టేసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు.  2019లో సీఎం వద్దకు విజయసాయిరెడ్డి పోస్కో ప్రతినిధులను తీసుకువెళ్లిన మాట వాస్తవమా? కాదా? స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.  ‘దొంగ విజయసాయిరెడ్డికి విశాఖతో ఏం పని.? ఈ ప్రాంతంలో నాయకులు లేరా..? విశాఖను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి వెంట ఎమ్మెల్యేలు, మంత్రులు పరుగులు పెడుతున్నారు. చేతకాని, దద్దమ్మ మంత్రి తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై నెపం పెడుతున్నాడు’ అని విమర్శించారు.   

కారెక్కు..  రాష్ట్ర పదవి పట్టు! బీజేపీకి ఎర్ర శేఖర్ బైబై 

తెలంగాణలో ప్రస్తుతం దూకుడుగా వెళుతోంది బీజేపీ. వరుస విజయాలతో ఆ పార్టీలోకి వలసలు పెరిగిపోయాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు కమలం కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బండి సంజయ్ టీమ్ పావులు కదుపుతోంది. అయితే యమ జోరు మీదున్న బీజేపీకి బ్రేకులు వేసేందుకు గులాబీ బాస్ వ్యూహాలు రెడీ చేస్తున్నారు. అందులో భాగంగానే కమలానికి కౌంటర్ గా ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో చేరితే రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తామని, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని అధికార పార్టీ హామీలు ఇస్తుందట.  కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని, త్వరలో బీజేపీకి షాక్ తగలబోతోందని సమాచారం. మహబూబ్ నగర్  బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై  చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది. జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నా అంటూ ఇటీవ‌ల ఓసారి రాష్ట్ర నాయ‌క‌త్వానికి ఝ‌ల‌క్ ఇచ్చి మ‌ళ్లీ వెన‌క్కి త‌గ్గిన ఎర్ర‌శేఖ‌ర్.. ఈసారి పార్టీ వీడేందుకు బ‌లంగా ఫిక్స్ అయ్యార‌ని చెబుతున్నారు.  పదవిలో కొనసాగలేకపోతున్న.. నా స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వండి.. అంటూ తాజాగా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్‌కు ఎర్ర శేఖర్ సమాచారం చేర‌వేశార‌ని తెలిసింది.  జిల్లా బీజేపీ నేత‌ల‌కు అప్పుడే  రాజీనామా  విష‌యం తెలియ‌కూడ‌ద‌ని ఓ వైపు జాగ్ర‌త్త‌ప‌డుతూనే.. మ‌రోవైపు టీఆర్ఎస్ బడా నేతలతో ఎర్ర శేఖ‌ర్ టచ్‌లోకి వెళ్లిన‌ట్టుగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే వారితో మాటా ముచ్చట జ‌రిగిపోయాయ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మాజీ ఎమ్మెల్యే గులాబీ గూటికి చేర‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. టీఆర్ఎస్‌లో చేరాలంటే త‌న‌కేంటి అని అడ‌గ‌డంతో.. ఓ పెద్ద పోస్టే ఇస్తామని  గులాబీ పార్టీ పెద్ద‌లు హామీ ఇచ్చిన‌ట్టుగా విశ్వసనీయ సమాచారం. అది కూడా ఆర్టీసీ చైర్మ‌న్ పదవి కావాలని ఆయ‌న‌ టిఆర్ఎస్ అధిష్టానం ముందు త‌న కోరిక‌ను వెలిబుచ్చిన‌ట్టుగా తెలిసింది. ఈ నెలలోనే ఓ మంచి ముహూర్తం చూసుకొని ఎర్రశేఖ‌ర్ గులాబి గూటికి జంప్ కావడం ఖాయమని అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ నేతగా ఎర్ర శేఖర్ కు మంచి పట్టుంది. గతంలో టీడీపీలో పని చేసిన శేఖర్ కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేడర్ ఉంది. అందుకే ఎర్ర శేఖర్ కు రాష్ట్ర స్థాయి కీలక పదవిని కేసీఆర్ ఆఫర్ చేశారని తెలుస్తోంది.  గత డిసెంబర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించినప్పుడే ఎర్రశేఖర్ వ్వవహరం వివాదాస్పదమైంది. సంజయ్ జిల్లాలో ఉండగానే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. జిల్లాలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో ఆయన పొసగడం లేదని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. సంజయ్ టూర్ లో  తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని భావించిన శేఖర్.. అప్పటికప్పుడే రాజీనామా ప్రకటన చేశారు. తన రాజీనామాకు కారణం గ్రూప్ రాజకీయాలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. బండి సంజయ్ జోక్యం చేసుకుని మాట్లాడటంతో తన రాజీనామాపై వెనక్కి తగ్గారు శేఖర్. ఇప్పుడు తాజాగా మళ్లీ రాజీనామాకు సిద్ధమయ్యారు.  

తుపాకీ పెట్టి బెదిరించిన సీఐ! వైసీపీ ఎమ్మెల్యే కోసం బరి తెగింపు 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది.మూడి విడత ఎన్నికల నామినేషన్లు ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో ఆ ప్రాంతాల్లో ప్రచారం తారా స్థాయిలో జరుగుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రజా ప్రతినిధుల బెదిరింపులు ఆగడం లేదని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలకు మద్దతుగా పోలీసు అధికారులు.. పోటీలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా  రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత..  సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపిన  సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. సీఐ కృష్ణయ్య తుపాకీ పెట్టి చంపుతానని బెదిరించాడని ఆరోపిస్తూ సీఎం జగన్‌కు రొంపిచెర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్ అంజయ్య సెల్ఫీ వీడియో పంపారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి టీడీపీకి పని చేసిన వారిని గోగులపాడు సర్పంచ్‌గా నిలబెట్టారని... తొలి నుంచి వైసీపీలో ఉన్న తాము కూడా పోటీకి దిగామని తెలిపారు. పోటీ నుంచి తప్పుకోవాలని సీఐ కృష్ణయ్యతో ఎమ్మెల్యే గోపిరెడ్డి వేధించారని వాపోయారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, సీఐ కృష్ణయ్య నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలని వేడుకుంటూ అంజయ్య వీడియోలో సీఎం జగన్‌ను వేడుకున్నారు. గోగులపాడు వైసీపీ సర్పంచ్ రెబల్ అభ్యర్థిగా అంజయ్య  పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో అంజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేనల్లుడు లక్ష్మీ నారాయణ రాజకీయ వత్తిడితో తన భర్తని నరసరావుపేట టూ టౌన్ సీఐ కృష్ణయ్య తీసుకెళ్లారని అంజయ్య భార్య లక్ష్మీ ఆరోపిస్తున్నారు. అయితే సమయం ముగిసినా అంజయ్య ప్రచారం చేయడంతో అదుపులోకి తీసుకున్నామని  రొంపిచర్ల పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అంజయ్య సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. వైసీపీ నేతలను కూడా ఎమ్మెల్యే బెదిరిస్తుండటం నర్సరావుపేట నియోజకవర్గంలో చర్చగా మారింది. 

అరకు లోయలో పడ్డ బస్సు.. 8మంది మృతి

విశాఖ జిల్లా అరకులో  ఘోర ప్రమాదం జరిగింది. ఘాట్‌రోడ్‌ ఐదో నంబరు మలుపు వద్ద టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందారు. హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. పలువురి టూరిస్టులకు గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించారు. బస్సు దూసుకెళ్లిన ప్రాంతంలో చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డుముకు దాటిన తర్వాత మలుపు వద్ద బస్సు లోయలో పడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్‌ షేక్‌పేటకు చెందిన దినేష్ ట్రావెల్స్‌‌దిగా గుర్తించారు  

అత్యాచార ఘటనలో షాకింగ్ ట్విస్ట్..

వైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‌ పరిధిలో ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచార ఘటనలో తాజాగా షాకింగా విషయాలు బయటికొచ్చాయి. అసలు అక్కడ జరిగింది ఒకటైతే.. ఇప్పటివరకు బయటకు వచ్చిన విషయాలు ప్రతిగా వేరని తేలడంతో పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. ఘట్‌కేసర్‌ పరిధిలోని నాగారం చౌరస్తాలో ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో కొన్ని నాటకీయ పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కేసుకు సంబంధించి పోలీసులు యువతిని ప్రశ్నించడంతో ఈ కొత్త కోణం వెలుగు చూసింది. తనను అపహరించి, ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారంటూ ఆ యువతి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు తేలింది. తాజాగ అందుతున్న సమాచారం ప్రకారం ఆ యువతి ఆటోలో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లి అక్కడ ఒక ద్విచక్ర వాహనంపై తన ప్రియుడితో కలిసి వెళ్లింది. అంతేకాకుండా ఆ తర్వాత అతని ఇద్దరు సోదరులతో కలిసి ఆమె గంజాయి తాగింది. ఆ తరువాత ఆమె అనుమతితోనే వారంతా ఆమె పై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. తల్లి ఫోన్ చేసి విసిగిస్తోందని... ఆ యువతి తల్లి తరచూ ఫోన్ చేస్తుండటంతో తనను ఆటో డ్రైవర్లు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని ఆమె ఫోన్ లో చెప్పింది. దీంతో భయపడిన తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో సైరన్లు వినిపించడంతో.. భయపడిన ఆ యువకులు ఆమెను రహదారి పక్కన వదిలేసి పారిపోయారు. దీంతో గస్తీ కాస్తున్న పోలీసులకు ఆ యువతి తారసపడింది. అయితే మత్తులో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో పోలీసులు ఆ యువతిని ప్రశ్నించగా.. ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు.. తరువాత సీసీ కెమెరాలను పరిశీలించగా యువతి ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్లు కనిపించింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. స్నేహితులతో కలిసి యానంపేట పరిసరాల్లోకి వెళ్లానని యువతి ఒప్పుకొన్నట్లు సమాచారం. ఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారం చేశారంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపడంతో ఈ ఘటనను అటు మహిళా సంఘాలు, ఇటు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు కూడా మెరుపు వేగంతో స్పందించారు. తీరా చివరకు పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. లోతుగా దర్యాప్తులోకి దిగే సరికి పోలీసులయూ కూడా దిమ్మతిరిగే విషయాలు తెలియడంతో షాకయ్యారు.  

వైసీపీలోకి గంటా! కలిసిన ఉప్పు నిప్పు.. 

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తానని ప్రకటించారు. అయితే గంటా రాజీనామాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరిగాయి. చాలా కాలంగా అధికార వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న గంటా.. ఇప్పుడు ఇలా లైన్ క్లియర్ చేసుకున్నారనే  గుసగుసలు వినిపించాయి. గంటాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్ తో ఆయనకు పొసగదని.. గంటా వైసీపీలో చేరకపోవచ్చని కొందరు వాదించారు. అయితే తాజాగా విశాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప్ప నిప్పుగా ఉన్న మంత్రి అవంతి - మాజీ మంత్రి గంటాలను విశాఖ ఉక్కు ఉద్యమం ఒకే వేదికపైకి తెచ్చింది.  విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనకుంటున్న కేంద్రం తీరుకు నిరసనగా అఖిలపక్షం ఆద్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారా దీక్షలకు ఇద్దరు నేతలు వచ్చారు.. ఒకరిని  చూసి  ఒకరు నవ్వుకుని పలకరించుకున్నారు... సీపీఐ నారాయణ అక్కడే ఉండి ఏవో సెటైర్లు వేయడంతో ఇద్దరు హ్యాపీగా నవ్వుకున్నారు. చాలా సేపు మంత్రి అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాస రావు కలిసే ఉన్నారు.  తాజా పరిణామంతో గంటా శ్రీనివాస రావు త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.  గంటా- అవంతి ఒకప్పుడు మంచి మిత్రులు. ప్రజారాజ్యం, టీడీపీలో  చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. 2019 ఎన్నికలు వీరిద్దరినీ విడదీశాయి. భీమిలీ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలన్న వివాదం పెద్దదిగా మారి ఇద్దరి మధ్య గ్యాప్ పెంచింది. తరువాత ఇద్దరూ బద్ద శత్రువులుగా మారారు. ఎన్నికలకు ముందు అవంతి వైసీపీలోకి వెళ్లగా.. గంటా టీడీపీలోనే ఉన్నారు.. అవంతి సైకిల్ దిగి వైసీపీ కండువా కప్పుకుని భీమిలి నుంచి పోటీ చేస్తే.. గంటా తన ఆనవాయతీని కొనసాగిస్తూ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇద్దరు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అవంతి మంత్రి అయ్యారు.. గంటా వేరే పార్టీలో చేరే ప్రయత్నాల్లోనే ఉండిపోయారు వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే అవంతి మాత్రం గంటాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ కాక రేపారు. దీంతో  ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి.. సమయం దొరికిన ప్రతిసారి మంత్రి అవంతి.. గంటాపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. గంటా మాత్రం మౌనం వహిస్తూ వచ్చారు. ఇటీవల విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తారనే వార్తలతో గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టివ్ అయ్యారు.తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు.విశాఖ ఉక్కును కాపాడుకోడానికి అంతా రాజీనామాలు చేయాలని పిలుపు ఇచ్చారు. తాజాగా విశాఖ ఉద్యమం ఈ ఇద్దరు పాత మిత్రులను మళ్లీ కలిసింది.  

విశాఖ ఉక్కు తరువాత ఇక నెక్స్ట్ టార్గెట్ టీటీడీనే.. మాజీ ఎంపీ సంచలనం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేయడం పై ఏపీలో తీవ్ర నిరసనలు, ఆందోళనలు జరుగుతన్న సంగతి తెల్సిందే. తాజాగా ఇదే వరుసలో టిటిడిని కూడా తమ అదుపులోకి తెచ్చుకునేందుకు ఆర్ఎస్ఎస్‌, బీజేపీ కుట్ర చేస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత చింత మోహన్ సంచలన ఆరోపణలు చేసారు . టీటీడీ ఆధీనంలో ఉన్న రూ.10వేల కోట్ల డిపాజిట్లు, వందల కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, లక్షల కోట్ల ఆస్తులపై ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ కన్నేశాయని అయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఈ నెల 7న ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అధ్యక్షతన రహస్య సమావేశం జరిగిందని, ప్రధానంగా టీటీడీని తమ చేతుల్లోకి ఎలా తీసుకోవాలన్న దానిపై లీగల్‌ సలహా తీసుకున్నట్లు తనకు తెలిసిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎలాగైతే ప్రైవేట్‌ పరం చేయాలనుకుంటున్నారో అదేవిధంగా టీటీడీని కూడా ధారాదత్తం చేయాలని కుట్రలు జరుగుతున్నాయన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఈ కుట్రను ఖండిస్తున్నానని, రాబోయే ప్రమాదాన్ని గుర్తించి అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించాలని చింతా మోహన్‌ పిలుపునిచ్చారు.

ఆ ఎమ్మెల్యే ఎప్పుడు మత్తులోనే.. 

ఏపీలో పంచాయితీ ఎన్నికలు వ్యక్తిగత విమర్శలకు, ఆరోపణలకు దారితీస్తున్నాయి.. ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న ఇతర పార్టీ అభ్యర్థులను వైసిపి నేతల నేతలు ఇరుకున పెట్టడం తో పాటు అక్రమ కేసులు పెడుతున్నారని.. అధికారులను కూడా అవమానిస్తున్నారంటూ వైసీపీ నాయకులపై టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు.  జగన్నాధ రథ చేకూరలాకింద  ఎస్ఈసీ నిమ్మగడ్డ నలిగిపోతున్నారంటూ, నిమ్మగడ్డ ఏం పీకుతాడని మంత్రి కొడాలి నాని అన్నారని దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఎప్పుడూ ఎన్ని టైం మందు ( ఏటీఎం ) లో ఉంటాడని బోండా ఉమా అన్నారు. వైసీపీ మద్దతు ప్రకటించే అభ్యర్థులకు ఓటు వేయకపోతే... ప్రభుత్వ పథకాలు రావని జోగి రమేశ్ బెదిరిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేరుగా పోటీ చేసే దమ్ములేక అడ్డదారులు తొక్కుతుందని పేరుకొన్నారు.. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాలపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ఏకగ్రీవాలు  వైసీపీ టార్గెట్ గా పెట్టుకుందని... ఈ క్రమంలోనే అధికార యంత్రాంగాన్ని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, ప్రభుత్వాలకు  వంతుపాడుతూ పోలీసులు కూడా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహిళా అభ్యర్థులపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని. వైసీపీ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలకు వత్తాసు పలికే అధికారులు ఇబ్బందులు పడతారని ఉమ అన్నారు.

సీఎంలనే ఉరికించాం.. ప్రధానినీ వదలం.. మీరెంత?

తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు హాట్ కామెంట్స్ చేస్తూ కాక రేపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కమలం నేతలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  ముఖ్యమంత్రిని  ఇష్టం వచ్చినట్లు  మాటలంటున్నారని ఆరోపించిన కేటీఆర్.. గతంలో మఖ్యమంత్రులనే ఉరికించిన చరిత్ర టిఆర్ఎస్ కు ఉందన్నారు. ఈ  విషయం బీజెపి నేతలు మరిచిపోవద్దని చెప్పారు. తమ జోలికి వస్తే ఎవరిని వదిలి పెట్టబోమని.. మంత్రులు, ప్రధాన మంత్రులు అయినా  సరే ఊరుకోబోమని హెచ్చరించారు. చిన్న చిన్న విజయాలకే బిజెపి నేతలు బాగా మురిసి పోతున్నారని, తగిన సమయంలో వాళ్లకు బుద్ది చెప్తామని  కేటీఆర్ అన్నారు.  తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల  నియోజకవర్గంలో పర్యటించిన కెటిఆర్.. పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన పార్టి కార్యకర్తల సమమావేశంలో ఈ వ్యాఖలు చేశారు. తమ సహనాన్ని అసమర్దతగా భావిస్తే చూస్తూ  ఊరుకోబోమని చెప్పారు కేటీఆర్.  మాటలు మాట్లాడాల్సి  వస్తే మీకంటే ఎక్కువగా మాట్లాడ గలమని అన్నారు. గత 20 ఏండ్లలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నామని.. అయినా రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల  అత్మ గౌరవం నిలబెచ్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. తెలంగాణ బీజెపి, తెలంగాణ కాంగ్రెస్ ఏర్పడ్డాయంటే అది కెసిఆర్ పెట్టిన భిక్షేనని మరిచి పోవద్దని ఘాటుగా చెప్పారు కేటీఆర్.  కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో జరిగిన ప్రగతి చూసి కేంద్ర మంత్రులే ప్రశంసించారని గుర్తు చేశారు కేటీఆర్.  దేశంలో నూటికి నూరు శాతం సాగు, తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గతంలో కాంగ్రెస్ రోజుకు 6 గంటలు కూడ కరెంట్ ఇవ్వలేదని.. రాత్రి వేలల్లో  కరెంటు ఇచ్చి రైతుల ప్రాణాలతో ఆడుకున్నారని చెప్పారు. ప్రస్తుతం  రోజుకు 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు కేటీఆర్.     

వాహనదారులకు, మందుబాబులకు పండగే..

మన దేశంలో గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ స్పీడ్ తో ఆకాశాన్నంటుతున్నాయి. వీటి స్పీడ్ గమనిస్తే అతి త్వరలో సెంచరీ కొడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.   త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్ననేపధ్యంలో అసోం ప్రభుత్వం తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ పెట్రోలుపై లీటరుకు 5 రూపాయలు తగ్గిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇదే సమయంలో మద్యంపై కూడా టాక్స్ ను 25 శాతం తగ్గించినట్లు అస్సాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన కొత్త రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిస్వాస్ అసెంబ్లీలో ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌, మద్యంపై అదనపు సెస్ విధించామని.. అయితే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గడంతో పాటు రోగుల సంఖ్య కూడా బాగా తగ్గిందని బిశ్వాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ధరలతో పాటు సుంకాన్ని తగ్గించినట్లు అయన చెప్పారు. అసోం ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్ధిక మంత్రి తెలిపారు.  ఇది ఇలా ఉండగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఇది కేవలం ఒక గిమ్మిక్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసోంలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి-ఏప్రిల్‌ మధ్యలో జరగనున్నాయి, దీంతో అక్కడి బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు భారీగా కసరత్తు చేస్తోంది.

ఏపీ, ఒడిశా ల మధ్య పంచాయితీ.. 

ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాల వివాదం సుప్రీం కోర్టు చేరింది.. ఆ గ్రామాలు తమవే నంటూ ఒడిశా , కాదు ఆ గ్రామాలు మావేనంటూ ఏపీ.. రెండు రాష్ట్రాలు పట్టుబట్టడంతో సుప్రీమ్ కోర్టు జోక్యం చేసుకుంది.. అయితే, ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ గ్రామాల విషయంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు జరుపుతోందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని చెబుతూ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది ఒడిశా ప్రభుత్వం..  ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలోని కోరాపుట్ జిల్లాకు చెందిన మూడు పంచాయతీలను ఏపీ తనవిగా పేర్కొంటోందని, గంజాయ్ పదవర్ ను గంజాయ్ భద్ర అని, పట్టుసెనరీ ప్రాంతాన్ని పట్టుచెన్నూరుగా, ఫగలుసెనరీ ప్రాంతాన్ని పగులుచినేరుగా మార్చి ఆ ప్రాంతాల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఒడిశా ఆరోపించింది. ఈ మూడు ప్రాంతాల్లో గతంలో తాము పంచాయతీ ఎన్నికలు జరిపామని ఒడిశా తన పిటిషన్ లో  వివరించింది. అందుకు ఆధారాలను కూడా సమర్పించింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని, ఏపీ ఎస్ఈసీ, సీఎస్ ల వివరణ కోరాలని ఒడిశా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ ప్రతిని ఏపీ తరఫు న్యాయవాదికి అందించాలని జస్టిస్ ఎంఏ ఖాన్ విల్కర్ ధర్మాసనం తెలిపింది. ఆ పిటిషన్ పై వారంలోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే శనివారం ఏపీలో జరిగే రెండో విడత ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఇది ఇలా ఉండగా ఓట్ల కోసం పచ్చ కుల నేతలు రెచ్చగొట్టారని, తీరా చూస్తే ఆ గ్రామాలను ఏపీ తీసుకుందంటూ ఒడిశా శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని తెలిపారు. దీనిపై చంద్రబాబు ఏమంటారో అంటూ వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

దిగొచ్చిన మంత్రి కొడాలి నాని ! ఎస్ఈసీ అంటే ఎంతో గౌరవం.. 

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి దిగొచ్చారు. ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీస్‌కు  వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ను గానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గానీ దూషించలేదని పేర్కొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఒకటి రెండు మాటలు అని ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీరుపై ప్రజల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించానే తప్ప.. వ్యక్తగతంగా దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నాని స్పష్టం చేశారు. కావున తాను చేసిన వ్యాఖ్యలు మరోసారి పరిశీలించి షోకాజ్ నోటీసులు వెనక్కితీసుకోవాలని వివరణ లేఖలో ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఎస్ఈసీ ఇచ్చిన నోటీసులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తమవని.. వాటిని ఖండిస్తున్నట్లు కొడాలి నాని చెప్పారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై తనకు నమ్మకం ఉందని.. ముఖ్యంరా ఎన్నికల కమిషన్ అంటే గౌరవముందన్నారు. తన వ్యాఖ్యల్లోని నిజమైన భావాన్ని ఎస్ఈసీ అర్ధం చేసుకోలేదన్న మంత్రి కొడాలి నాని మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రేషన్ డోర్ డెలివరీపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించడానికే మీడియాతో మాట్లాడానే తప్ప ఎస్ఈసీని దూషించడానికి కాదన్నారు మంత్రి కొడాలి నాని.  శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని..  ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మీడియాపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన ఛానెళ్లు, పత్రికల్ని తాము నమ్ముకోలేదని, ఎవరెన్ని చేసినా వైసీపీ విజయాన్ని ఆపలేరన్నారు. జగన్‌ చిటికెనవేలిని కూడా ఏం చేయలేరన్నారు. ఇప్పటికైనా జ్ఞానం, బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. నిమ్మగడ్డ.. జగన్నాధ రథ చక్రాల కింద నలిగిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించింది. కొన్ని గంటల్లోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది. 

కేసీఆర్ కు క్రొకొడైల్ ఫెస్టివల్! 

గులాబీ పార్టీలో ఎన్నికల గుబులు. వరుస ఓటమిలతో కారు పార్టీలో కలకలం.  దుబ్బాకలో  అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ ప్రభావం గ్రేటర్ పై స్పష్టంగా కనిపించింది. బల్డియా బరిలో గెలిచినా.. ఓడినంత పనైంది. అధికారికంగా మేయర్ పీఠం దక్కినా.. 47 మంది కార్పొరేటర్లతో బీజేపీదే అసలైన బలం. ఎంఐఎం సపోర్టుతో గ్రేటర్ పై గులాబీ జెండా ఎగరేసినా.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోవడానికి లేకుండా పోయింది. అధికార పార్టీని నాగార్జున సాగర్ బై పోల్ టెన్షన్ కు గురి చేస్తుంటే.. ఆ ఎన్నిక కంటే ముందే వస్తున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరింత కలవరపాటు కలిగిస్తోంది.  రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ పట్టభధ్రుల నియోజకవర్గంతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు ఎమ్మెల్సీ నగారా మోగింది. ప్రచారంలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు జోరు మీదుంటే.. టీఆర్ఎస్ కేండిడేట్స్ ఓటర్ల నుంచి వ్యతిరేకతతో బేజారు అవుతున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులే ప్రధాన ఓటర్లు కావడం అధికారిక పార్టీకి మైనస్. పీఆర్సీ విషయంలో ఎంప్లాయిస్ ప్రభుత్వంపై ఫుల్ సీరియస్ గా ఉన్నారు. ఎన్నికలకు ముందే ఎంతో కొంత ఫిట్ మెంట్ ప్రకటించి వారిని ప్రసన్నం చేసుకుందామనుకున్న ప్రభుత్వ ఆలోచన బూమరాంగ్ లా బెడిసికొట్టింది. పీఆర్సీ పర్సెంటేజ్ పై సర్కారుపై గుర్రుగా ఉన్న  ఉద్యోగులు..  ఎమ్మెల్యే ఎన్నికల్లో గులాబీ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమంటున్నాయి విపక్షాలు.   నిరుద్యోగులదీ అదే తీరు. ప్రత్యేక తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు ఏవంటూ ఏళ్లుగా నిరుద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎన్నికల హామీ అయినా నిరుద్యోగ భృతి ఏదంటూ.. ఇంకెప్పుడు ఇస్తారంటూ  నిలదీస్తున్నారు. సర్కారుపై ఉన్న కసిని.. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూపిస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. అందుకే  కీలక సమయంలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలతో అధికార పార్టీలో అంతులేని హైరానా. ఒకవేళ రెండిటికి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఓడిపోతే.. ఆ ఎఫెక్ట్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై తప్పకుండా పడుతుంది. అందుకే హాలియా బహిరంగ సభలో .. కేసీఆర్ లో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపించిందని చెబుతున్నారు.   ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అలవాటు గులాబీ బాస్ కు లేదు. అది తన స్థాయి కాదనుకుంటారు. హోరాహోరీగా సాగిన దుబ్బాక బై పోల్ లోనూ కేసీఆర్ ప్రచారానికి వెళ్లలేదు. అలాంటిది.. ఇంకా నొటిషికేషనే రాలేదు.. అభ్యర్థులు ఎవరో తేలలేదు.. అంతలోనే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సభ పెట్టడం కేసీఆర్ లోని అభద్రతా భావానికి నిదర్శనమంటున్నారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ లో పరువు పోయాక.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ ది. అయితే  ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీ పార్టీకి గెలుపు అంత సులువేమీ కాదు. బలమైన నాయకుడు జానారెడ్డిని ఢీ కొట్టడం కష్టమే. దుబ్బాక జోష్ తో బీజేపీ సైతం సాగర్ లో సత్తా చాటేందుకు సై సై అంటోంది.  దుబ్బాక, గ్రేటర్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ బండి యమ వేగంగా దూసుకుపోతోంది. అటు, రేవంత్ రెడ్డి సైతం పాదయాత్రతో దుమ్మురేపుతున్నారు. ఇలాంటి రాజకీయ విపత్కర సమయంలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ, ఒక అసెంబ్లీ ఎన్నికలతో గులాబీ పార్టీ బలమెంతో తేలిపోనుంది. మునసటిలా కారు జోరు మీదుందా? లేక, డొక్కు, తుక్కు కారుగా మారిందా? అనే దానిపై ఈ ఎన్నికలతో ఓ క్లారిటీ వచ్చేస్తోంది. అందుకే, కేసీఆర్ ఈ ఎలక్షన్ ను ఛాలెంజ్ గా తీసుకున్నారు. గతానికి భిన్నంగా ఉప ఎన్నికల ప్రచారంలోనూ ప్రతిపక్షాలను ఉతికి ఆరేస్తున్నారు. ఇదంతా ఆయనలోని అసహనమేనని.. ఓటమి భయమేనని అంటున్నాయి విపక్షాలు. ముందుముందు అధికార పార్టీకి ముసళ్ల పండుగే అంటున్నారు. 

టీడీపీ అభ్యర్థికి వైసీపీ ఎంపీ సపోర్ట్  

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలను అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ ప్రయత్నిస్తుండగా.. టీడీపీ అడ్డుకుంటోంది. దీంతో చాలా ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి.  పోటీలో ఉన్న ఇతర పార్టీల తరపు అభ్యర్థులను.. వైసీపీ ప్రజా ప్రతినిధులు  బెదిరించిన వీడియో, ఆడియోలు లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. బెదిరింపులకు సంబంధించి విశాఖ జిల్లా యలమంచలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుపై కేసు కూడా నమోదైంది.                      ఏకగ్రీవ ఎన్నికల కోసం అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తుండగా.. కర్నూల్ జిల్లాలో మాత్రం ఊహించని ఘటన జరిగింది. అధికార పార్టీకి షాక్ తగిలింది. వైసీపీ ఎంపీనే టీడీపీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఏకగ్రీవం చేశారు.  సొంతపార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాల్సిన చోట.. ప్రత్యర్థి పార్టీ మద్దతిచ్చిన వ్యక్తిని వైసీపీ ఎంపీ ఏకగ్రీవం చేయడం ఆసక్తిగా మారింది. టీడీపీ సర్పంచ్ అభ్యర్థిని ఏగ్రీవం చేసిన ఆ ఎంపీ అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.  ఎంపీ గోరంట్ల మాధవ్ సొంతూరు ర్నూలు జిల్లా రుద్రవరం. రుద్రవరం సర్పంచ్ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ దగ్గరి బంధువు ఎం.కే మధు టీడీపీ మద్దతుతో బరిలో దిగారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మధుకి మద్దతివ్వాల్సి వచ్చింది. సొంత పార్టీ నేతలను ఒప్పించి మరీ టీడీపీ ఏకగ్రీవానికి పరోక్షంగా సహకరించారు గోరంట్ల మాధవ్. ఐతే మాధవ్ తీరుపై వైసీపీ శ్రేణుళ్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. సొంతపార్టీని కాదని బంధువుకు మద్దతిచ్చారంటూ స్థానిక నేతలు, కార్యకర్తలు మాధవ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.

ట్విట్టర్ కి షాక్.. 

  సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక వ్యక్తి గత స్వేచ్ఛ రెక్కలు వచ్చిందా.. సోషల్ మీడియాలో ఎవరు ఎవర్ని అయినా ప్రశ్నించొచ్చా.. సోషల్ మీడియా కి ప్రాంతాలతో సంబంధం లేదు.. ప్రపంచంలో ఎక్కడైనా.. ఎవరినైనా నేరుగా విమర్శించొచ్చు..ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడి చేతిలో స్వేచ్ఛ ఆయుధం సోషల్ మీడియా.. కానీ కొందరు ఈ స్వేచ్ఛ ఆయుధాన్ని పిచ్చి వాడి చేతిలో రాయిలా కూడా పరిగణిస్తున్నారు... సోషల్ మీడియా వచ్చాక ఎవరి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారని.. కొంత మంది హైలెట్ అవ్వడం కోసం.. ఫేక్ ఖాతాలు క్రీయేట్ చేసి ప్రముఖుల నాయకుల ఫేక్ న్యూస్ లు రాస్తూ..ద్వేషపూరిత వ్యాఖ్యలు, దేశద్రోహ, అసభ్య పోస్టులు పెడుతున్నారు..     ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. ఫేక్ న్యూస్ కట్టడికి తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ఆదేశించింది. ట్విట్టర్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ద్వేషపూరిత వ్యాఖ్యలు, దేశద్రోహ, అసభ్య పోస్టుల కట్టడి కోసం ఏ రకమైన వ్యవస్థలు ఏర్పాటు చేశారో చెప్పాలంటూ శుక్రవారం నోటీసులిచ్చింది. నకిలీ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే సందేశాలను ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేస్తున్నారని, దానికి అడ్డుకట్ట వేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ నేత వినీత్ గోయెంకా.. గత ఏడాది మేలో సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో వందలాది నకిలీ ఖాతాలున్నాయని, వాటి ద్వారా ప్రముఖ రాజకీయ నాయకుల పేరు ప్రఖ్యాతులను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే, తాజాగా ట్విట్టర్ , కేంద్రానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న ఈ సమయంలోనే సుప్రీం కోర్టు ఈ వ్యాజ్యాన్ని విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, సోషల్ మీడియా నియంత్రణకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టింది. డిజిటల్ న్యూస్, ప్రసార మాధ్యమాలపై పలు ఆంక్షలను విధించింది. సమస్యాత్మక కంటెంట్ ఉంటే వెంటనే తీసేసేలా ఓ వ్యవస్థనూ ఏర్పాటు చేసింది.  

వైసీపీకి ఉక్కు పాతరే..నా?

వైసీపీలో విశాఖ టెన్షన్. ప్రజల ఉక్కు పిడికిలిలో పార్టీ పిండిపిండి అవుతుందేమోననే అనుమానం. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం అధికార పార్టీలో అలజడి రేపుతోంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ ప్రతిపక్షాలు ఉద్యమాలతో హోరెత్తిస్తున్నాయి. తూర్పు తీరంలో సునామీలా ఎగుస్తున్న పోరాటంలో ఫ్యాను రెక్కలు విరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ముగియగానే.. గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌-జీవీఎంసీ ఎన్నికలు జరుగుతాయని సమాచారం. ఎలక్షన్ అనగానే వైసీపీ అభ్యర్థుల్లో తెలియని ఆందోళన. కేవలం డివిజన్ అభ్యర్థులే కాదు.. వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి విజయసాయిరెడ్డికి సైతం విశాఖ పేరెత్తితే ముచ్చెమటలు పడుతున్నాయని అంటున్నారు.  పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం అనూహ్యంగా పుంజుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవీఎంసీ ఎలక్షన్స్ జరిగితే వైసీపీకి పరాభవం తప్పకపోవచ్చమో. ఈ విషయం ముందే పసిగట్టిన విజయసాయిరెడ్డి కొంత కాలంగా వైజాగ్ లోనే మకాం వేసి.. వార్డు అభ్యర్థులు, పార్టీ నేతలు, బూత్ కమిటీ సభ్యులతో విసృతంగా  సమావేశాలు జరుపుతున్నారు. ఆయనలో భయం ఏ రేంజ్ లో ఉందంటే.. లేటెస్ట్ గా మద్దిలపాలెంలో మీటింగ్ జరుగుతుండగా.. ఆ మేటర్ ఎక్కడ లీక్ అవుతుందోననే ఆందోళనతో పార్టీ కార్యాలయం షట్టర్ మూసి వేయించారు. డివిజన్ స్థాయి లీడర్లతో సమావేశానికే విజయసాయి అంత టెన్షన్ ఫడటం చూసి పార్టీ శ్రేణులు సైతం కంగారు పడుతున్నారు. విజయసాయిరెడ్డి చేస్తున్న వరుస సమీక్షలపై వారంతా విసుక్కుంటున్నారు. ఆయన హైరానా చూస్తుంటే.. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం కన్ఫామే అన్నట్టుగా ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి.  జీవీఎంసీ ఎన్నికలపై ఒకప్పుడు వైసీపీ అధిక ఆసక్తి కనబరిచింది. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించిన తొలినాళ్లలో వైసీపీ యమా జోరుమీదుంది. రాజధాని నిర్ణయంతో విశాఖతో పాటు ఉత్తరాంధ్రపై తమదే గుత్తాధిపత్యం అని గొప్పలకు పోయింది.  ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని ఆరాటపడింది. అయితే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం ప్రైవేటు పరం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం.. అందుకు తెరవెనుక వైసీపీ పెద్దల మంత్రాంగం ఉన్నట్టు తెలుస్తుండటంతో విశాఖవాసులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఉద్యమంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉక్కు పిడికిలి బిగించారు. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్. ఇప్పట్లో ఎన్నికలు జరగకుండా ఉంటే బాగుండునని కోరుకుంటోంది వైసీపీ. అయితే.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దూకుడు మామూలుగా లేదు. ఏ క్షణంలో జీవీఎంసీ నగారా మోగినా ఆశ్చర్యం లేదు. అందుకే సమయం లేదు అభ్యర్థుల్లారా అంటూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ విశాఖపట్నంలో తెగ హడావుడి చేస్తున్నారు విజయసాయిరెడ్డి.  ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించని వైసీపీ.. చేతులు కాలాక నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రైవేటీకరణ పాపం తమది కాదని.. ఒడిశాదంటూ కుంటి సాకులు చెబుతోంది. ఒడిశాకు చెందిన కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ను దోషిగా చూపించే ప్రయత్నం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖ ఉక్కు పాపాన్ని ఎంతగా కడిగేసుకోవాలని చూస్తున్నా.. అది అంత ఈజీగా వదిలే వ్యవహారం కాదు. పోస్కో ప్రతినిధులు గతేడాదే సీఎం జగన్ ను కలిసి చర్చించడం అందరికీ తెలిసిందే. పైకి ఎంత కాదంటున్నా.. ఆ డీల్ వెనుకు వైసీపీ పెద్దల పాత్ర ఎంతో ఉందని కార్మికులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహజ్వాల ఎగిసిపడుతోంది. ఈ సమయంలో జీవీఎంసీ ఎన్నికలు జరిగితే.. ఓటర్లు వైస్సార్ సీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. అందుకే.. ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జి విజయసాయిరెడ్డిలో అంతటి ఆందోళన. జీవీఎంసీ ఎన్నికలు ఇప్పుడు జరగొద్దని బలంగా కోరుకుంటున్నారు. అయితే.. నిమ్మగడ్డ జోరు చూసి తన కోరిక నెరవేరేలా లేదని అర్థమయ్యే.. వరుస సమీక్షలతో వైసీపీ అభ్యర్థులను సమీక్షలతో ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారని తెలుస్తోంది. మరి, త్వరలోనే ఎలక్షన్ జరిగితే..? వైసీపీకి మూడినట్టేనా?   

కొడాలి నానికి  ఎస్ఈసి షాక్.. 

ఏపీ మంత్రి మాటలకు అంతులేదు .. ఉన్నత అధికారులంటే గౌరవం లేదు.. నోటికి వచ్చిన మాట వెనక్కి వెళ్లగక్కడమే కానీ వెనక్కి తగ్గేది లేదు.. అదే మంత్రి కొడాలి నాని తీరు.. ఎప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా ఉంటారు ఆయన.. కొడాలి నానికి ఎస్ఈసీ షాక్ ఇచ్చింది. శుక్రవారం మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు ఇస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్మగడ్డ ర‌మేశ్ కుమార్ పై ఏపీ మంత్రి కొడాలి నాని మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. మంత్రికి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. తాను చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోగా వ్యక్తిగతంగా గాని, ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన కొడాలి నాని ఎన్నికల సంఘం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జగన్నాథ‌ రథ చక్రాల కింద పడి నలిగిపోతారని అన్నారు. తాము పనికిమాలిన మీడియాను నమ్ముకోలేదని, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా వైసీపీ విజయం సాధిస్తుంద‌ని మంత్రి కొడాలి నాని కామెంట్ చేశారు. ఏపీ సీఎం జగన్‌ చిటికెనవేలిని కూడా ఎవ‌రూ తాక‌లేరంటూ, ఇప్ప‌టికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన అన్నారు.

స్పీకర్ ఫార్మాట్ లో మళ్లీ రాజీనామా.. మిలియన్ మార్చ్ చేయాలన్న గంటా 

మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు నిరసవగా ఇటీవలే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంటా. అయితే ఆయన స్పీకర్ ఫార్మాట్‌లో చేయలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి సరైన ఫార్మాట్ లో మరోసారి రాజీనామాను లేఖను స్పీకర్ పంపారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేశానని చెప్పారు గంటా శ్రీనివాస రావు.  కార్మిక సంఘాలకు అండగా నిలుస్తానని  స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని కలిసి ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేలా పోరాడాలన్నారు గంటా శ్రీనివాస రావు.      విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావాలని గంటా శ్రీనివాసరావు పిలుపు ఇచ్చారు. కేంద్రానికి సీఎం జగన్‌ రాసిన లేఖను స్వాగతిస్తున్నామన్నారు. అయితే లేఖలు రాస్తే ఢిల్లీలో పెద్దల మనసు కరగదన్నారు. అసెంబ్లీ ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర కేబినెట్‌ భేటీ పెట్టాలని, తెలంగాణ తరహా మిలియన్‌ మార్చ్‌ చేయాలని గంటా శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరానికి వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించారు గంటా శ్రీనివాస రావు.