అత్యాచార ఘటనలో షాకింగ్ ట్విస్ట్..
posted on Feb 12, 2021 @ 5:11PM
వైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ పరిధిలో ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచార ఘటనలో తాజాగా షాకింగా విషయాలు బయటికొచ్చాయి. అసలు అక్కడ జరిగింది ఒకటైతే.. ఇప్పటివరకు బయటకు వచ్చిన విషయాలు ప్రతిగా వేరని తేలడంతో పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు.
ఘట్‌కేసర్ పరిధిలోని నాగారం చౌరస్తాలో ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో కొన్ని నాటకీయ పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కేసుకు సంబంధించి పోలీసులు యువతిని ప్రశ్నించడంతో ఈ కొత్త కోణం వెలుగు చూసింది. తనను అపహరించి, ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారంటూ ఆ యువతి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు తేలింది. తాజాగ అందుతున్న సమాచారం ప్రకారం ఆ యువతి ఆటోలో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లి అక్కడ ఒక ద్విచక్ర వాహనంపై తన ప్రియుడితో కలిసి వెళ్లింది. అంతేకాకుండా ఆ తర్వాత అతని ఇద్దరు సోదరులతో కలిసి ఆమె గంజాయి తాగింది. ఆ తరువాత ఆమె అనుమతితోనే వారంతా ఆమె పై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
తల్లి ఫోన్ చేసి విసిగిస్తోందని...
ఆ యువతి తల్లి తరచూ ఫోన్ చేస్తుండటంతో తనను ఆటో డ్రైవర్లు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని ఆమె ఫోన్ లో చెప్పింది. దీంతో భయపడిన తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో సైరన్లు వినిపించడంతో.. భయపడిన ఆ యువకులు ఆమెను రహదారి పక్కన వదిలేసి పారిపోయారు. దీంతో గస్తీ కాస్తున్న పోలీసులకు ఆ యువతి తారసపడింది. అయితే మత్తులో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో పోలీసులు ఆ యువతిని ప్రశ్నించగా.. ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు.. తరువాత సీసీ కెమెరాలను పరిశీలించగా యువతి ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్లు కనిపించింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. స్నేహితులతో కలిసి యానంపేట పరిసరాల్లోకి వెళ్లానని యువతి ఒప్పుకొన్నట్లు సమాచారం.
ఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారం చేశారంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపడంతో ఈ ఘటనను అటు మహిళా సంఘాలు, ఇటు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు కూడా మెరుపు వేగంతో స్పందించారు. తీరా చివరకు పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. లోతుగా దర్యాప్తులోకి దిగే సరికి పోలీసులయూ కూడా దిమ్మతిరిగే విషయాలు తెలియడంతో షాకయ్యారు.