దిగొచ్చిన మంత్రి కొడాలి నాని ! ఎస్ఈసీ అంటే ఎంతో గౌరవం..
posted on Feb 12, 2021 @ 3:24PM
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి దిగొచ్చారు. ఎస్‌ఈసీ షోకాజ్ నోటీస్‌కు వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ను గానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గానీ దూషించలేదని పేర్కొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఒకటి రెండు మాటలు అని ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీరుపై ప్రజల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించానే తప్ప.. వ్యక్తగతంగా దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నాని స్పష్టం చేశారు. కావున తాను చేసిన వ్యాఖ్యలు మరోసారి పరిశీలించి షోకాజ్ నోటీసులు వెనక్కితీసుకోవాలని వివరణ లేఖలో ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.
ఎస్ఈసీ ఇచ్చిన నోటీసులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తమవని.. వాటిని ఖండిస్తున్నట్లు కొడాలి నాని చెప్పారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై తనకు నమ్మకం ఉందని.. ముఖ్యంరా ఎన్నికల కమిషన్ అంటే గౌరవముందన్నారు. తన వ్యాఖ్యల్లోని నిజమైన భావాన్ని ఎస్ఈసీ అర్ధం చేసుకోలేదన్న మంత్రి కొడాలి నాని మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రేషన్ డోర్ డెలివరీపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించడానికే మీడియాతో మాట్లాడానే తప్ప ఎస్ఈసీని దూషించడానికి కాదన్నారు మంత్రి కొడాలి నాని.
శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని.. ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మీడియాపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన ఛానెళ్లు, పత్రికల్ని తాము నమ్ముకోలేదని, ఎవరెన్ని చేసినా వైసీపీ విజయాన్ని ఆపలేరన్నారు. జగన్ చిటికెనవేలిని కూడా ఏం చేయలేరన్నారు. ఇప్పటికైనా జ్ఞానం, బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. నిమ్మగడ్డ.. జగన్నాధ రథ చక్రాల కింద నలిగిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించింది. కొన్ని గంటల్లోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది.