సీఎంలనే ఉరికించాం.. ప్రధానినీ వదలం.. మీరెంత?
posted on Feb 12, 2021 @ 3:54PM
తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు హాట్ కామెంట్స్ చేస్తూ కాక రేపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కమలం నేతలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాటలంటున్నారని ఆరోపించిన కేటీఆర్.. గతంలో మఖ్యమంత్రులనే ఉరికించిన చరిత్ర టిఆర్ఎస్ కు ఉందన్నారు. ఈ విషయం బీజెపి నేతలు మరిచిపోవద్దని చెప్పారు. తమ జోలికి వస్తే ఎవరిని వదిలి పెట్టబోమని.. మంత్రులు, ప్రధాన మంత్రులు అయినా సరే ఊరుకోబోమని హెచ్చరించారు. చిన్న చిన్న విజయాలకే బిజెపి నేతలు బాగా మురిసి పోతున్నారని, తగిన సమయంలో వాళ్లకు బుద్ది చెప్తామని కేటీఆర్ అన్నారు.
తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన కెటిఆర్.. పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన పార్టి కార్యకర్తల సమమావేశంలో ఈ వ్యాఖలు చేశారు. తమ సహనాన్ని అసమర్దతగా భావిస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు కేటీఆర్. మాటలు మాట్లాడాల్సి వస్తే మీకంటే ఎక్కువగా మాట్లాడ గలమని అన్నారు. గత 20 ఏండ్లలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నామని.. అయినా రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల అత్మ గౌరవం నిలబెచ్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. తెలంగాణ బీజెపి, తెలంగాణ కాంగ్రెస్ ఏర్పడ్డాయంటే అది కెసిఆర్ పెట్టిన భిక్షేనని మరిచి పోవద్దని ఘాటుగా చెప్పారు కేటీఆర్.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో జరిగిన ప్రగతి చూసి కేంద్ర మంత్రులే ప్రశంసించారని గుర్తు చేశారు కేటీఆర్. దేశంలో నూటికి నూరు శాతం సాగు, తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గతంలో కాంగ్రెస్ రోజుకు 6 గంటలు కూడ కరెంట్ ఇవ్వలేదని.. రాత్రి వేలల్లో కరెంటు ఇచ్చి రైతుల ప్రాణాలతో ఆడుకున్నారని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు కేటీఆర్.