గుజరాత్ లో కల్తీ మద్యానికి 36 మంది బలి

ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో కల్తీ మద్యం కాటుకు 36 మంది మరణించారు. గుజరాత్ లో సంపూర్ణ మద్య నిషేధం సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ కల్తీ మద్యం విక్రయాలుయథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం పట్టించు కోకపోవడంతో ఈ ఘోరం జరిగిందని విమర్శలువెల్లువెత్తుతున్నాయి.   కల్తీ మద్యం కాటుకు 36 మంది బలైపోయారు. మరో 50 మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా పలువురి ఆరోగ్యం విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 25నగుజరాత్ లోని బోటాడ్ జిల్లా  రోజిద్ గ్రామంలో పలువురు, అహ్మాదాబాద్ జిల్లాలోని ధందుక ప్రాంతాల్లో కొందరు కల్తీ మద్యం తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మొదట10 మంది చనిపోయారు. ఆ తరువాత  మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.  రోజిద్ సహా పలు గ్రామాల్లో కొందరు అక్రమంగా మిథైల్ ఆల్కహాల్ లో నీటిని కలిపి నాటు సారాగా విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. మిథనాల్ సేవించినట్లు వారి బ్లడ్ శాంపిల్స్ పరీక్షించడంతో  తేలింది. కల్తీ సారా అమ్మిన 14 మందిని అరెస్టు చేశారు. కాగా  ఈ ఘటనలపై గుజరాత్ హోంశాఖ ముగ్గురు సభ్యులతో  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను  ఏర్పాటు చేసింది . సిట్ సమగ్ర దర్యాప్తు జరిపి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా కల్తీ  మద్యం కాటుకు బలైన వారిలో అత్యథికులు రోజువారీ కూలీలేనని పోలీసులు గుర్తించారు.  

వివేకా హత్య కేసు.. సోద‌రి సునీతకు పులివెందుల ఎర.. జగన్ కొత్త ఎత్తుగడ?

ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డిన సంఘ‌ట‌న జ‌రిగితే దానికి దారి తీసిన ప‌రిస్థితులు, అందుకు కార‌కుల‌ను ప‌ట్టుకోవ డం, శిక్షించడం అన్నీ క్షణాల్లో జ‌రిగిపోతుండటం చూస్తుంటా. వాస్తవంలో కాదు.. సినిమాల్లో మాత్రమే. వాస్తవంలో అదేమీ జరగదు, పైగా రాజ‌కీయ‌కోణం ఉన్న హ‌త్య కేసులైతే దోషులను నిర్ధారించడం, పట్టుకోవడం చాలా చాలా ఆలస్యం అవుతుంది. కానీ. వై.ఎస్‌.వివేకా నందరెడ్డి కేసులో మాత్రం ఆ జాప్యానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది.  మ‌రో వంక  ఈ కేసు విషయంలో దోషులను ఎలగైనా పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్న వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీతా రెడ్డిని ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చి, కేసు గురించి మరిచిపోయేలా చేసి త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నానికి ఉప‌యోగించుకోవాల‌న్న కొత్త ఎత్తుగ‌డ ఒకటి జగన్ వేస్తున్నార‌ని తెలుస్తోంది.   వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి మూడున్నరేళ్లు గడుస్తోంది. సరిగ్గా 2019 ఎన్నికల హడావుడిలో ఉండ గా మార్చిలో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇప్ప‌టికీ ఆ కేసు తేల‌లేదు. ప్ర‌తిప‌క్షాలో, వివే కానంద కుమార్తె సునీతో, మ‌రెవ‌ర‌యినానో  ఢిల్లీ వెళ్ల‌డ‌మో, ప్ర‌శ్నించ‌డ‌మోచేస్తేనే  కేసు మ‌ళ్లీ చ‌ర్చ‌కు వ‌స్తోం ది. అంతే త‌ప్ప విచార‌ణలో అడుగు ముందుప‌డ‌టం లేదు.  వివేకానంద రెడ్డి స్వ‌యాన ముఖ్యమంత్రి జ‌గ‌న్‌రెడ్డికి  బాబాయి అయిన‌ప్ప‌టికీ ఈ కేసు నత్త‌న‌డ‌కన సాగడం పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో  అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారే ఈ  ఘాతుకానికి  పాల్పడిందంటూ  జగన్, ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం ఊరూ వాడా ప్రచారం చేశారు. ప్ర‌భుత్వం ఈ కేసు విచార‌ణ విష‌యంలో ఆస క్తి చూప‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. పైగా వివేకానంద హ‌త్య, విచార‌ణ‌లో జాప్యం  అప్ప‌టి రాజ కీ య ప‌రిణామాలు జ‌గ‌న్‌కి బాగా క‌లిసివ‌చ్చాయి. ఈ కార‌ణంగానే   చంద్ర‌బాబుకు ఎంతో న‌ష్టం జ‌రిగింది. సానుభూతి ఓటుతో జ‌గ‌న్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాగానే ముందుగా ఈ కేసు సంగ‌తి తేల్చే స్తార‌ని ఆయ‌న కుటుంబం కూడా భావించింది. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఆయ‌న వ్య‌వహ‌రించారు.   అప్ప‌టివ‌ర‌కూ ఈ కేసుపై సిబిఐ విచార‌ణ‌కు జ‌గ‌న్ డిమాండ్ చేశారు. కానీ  అధికారంలో కి వ‌చ్చాక  దాన్ని మ‌రింత వేగిరం చేయాల్సింది బోయి అస‌లు సీబీఐ ద‌ర్యాప్తే అన‌వ‌సరం  అని తేల్చేరు.  కానీ వివేకా కుమార్తె వదల్లేదు కోర్టును ఆశ్రయించి మరీ వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టేలా చేయగలిగారు.  వివేకానంద రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీతా రెడ్డి  ఈ కేసు విచార‌ణ‌ను వేగి రం చేయాల‌ని, హ‌త్య‌కు పాల్ప‌డిన‌వారిని ప‌ట్టుకోవాల‌ని సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. అంతేగాక సోద రుడు జ‌గ‌న్ హ‌యాంలో విచార‌ణ‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని ఆమె అన్నారు. ఈమేర‌కు సుప్రీం కోర్టు  ఈ కేసును సీబీఐ చేత విచార‌ణ జ‌రిపించాల‌ని ఆదేశించింది. ఇక జగన్ అక్కడ నుంచి సీబీఐ దర్యాప్తునకు అడుగడుగునా అడ్డు తగిలే విధంగానే వ్యవహరించారు.   సీబీఐ అధికా రుల వాహ‌నాల మీద కడపలో దాడి జ‌రిగినా ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. ఈ పరి ణామాలు జ‌గ‌న్ మీద‌నే అనుమా నాలు క‌లిగేలా చేశాయి. ఎందుకంటే సీబీఐ దర్యాప్తు ఈ కేసులో జగన్ సంబంధీకుల వైపే వేలెత్తి చూపేదిగా ఉంది. జగన్ సమీప బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ సహా పలువురు జగన్ అస్మదీయులకు ఈ కేసులో సంబంధం ఉందన్నఅనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా క్రమంగా వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కూడా నత్తతో పోటీపడి నడుస్తుండటంతో  సోద‌రుడు సీఎం అయినా ఈ కేసు విష‌యంలో అడ్డంకులు సృష్టించి దర్యాప్తు ముందుకు సాగకుండా చేస్తున్నారని సునీత ఆరోపిస్తున్నారు.  అస‌లే ఈడీ తో ఇబ్బందులు, రాష్ట్రంలో త‌లెత్తిన రాజ‌కీయ అస్థిర‌త‌తో తలమునకలౌతున్న జ‌గ‌న్    ఈ పరిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు జ‌గ‌న్ కొత్త ఎత్తుగ‌డ‌ వేశారని పరిశీలకులు అంటున్నారు.  వివేకా కుమార్తె, తన సోద‌రి సునీత‌ను శాంత‌ప‌ర‌చ‌డం ద్వారా దీని నుంచి బయటపడాలని ఆయన భావిస్తున్నారు.  అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పులి వెందుల సీటు సునీతకు ఆఫర్ చేశారు. ప్రతిగా వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకు ఇక ప్రయత్నాలు చేయకూడదన్న షరతు విధించారని అంటున్నారు. అందుకు ఆమె అంగీకరిస్తే పులివెందుల టికెట్ ఆమెకు ఇచ్చి తాను జమ్మల మడుగు నుంచి రంగంలోకి దిగడానికి సిద్ధపడ్డారంటున్నారు.    అయితే, త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మిని పార్టీ గౌర‌వ అధ్య‌క్ష‌ప‌ద‌వి నుంచి దించేసి చెల్లి ష‌ర్మిల వ‌ద్ద‌కు పంపిన జ‌గ‌న్ అవ‌స‌రం తీరాక తననూ అలాగే  క‌రివేపాకులా తీసిపడేసే అవకాశం ఉందని డాక్టర్ సునీత భావిస్తుండటంతో జగన్ ప్రతిపాదనకు ఆమె ఓకే చెప్పలేదని పులివెందులలో ఓ స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఈడీ దాడుల భయం.. అందుకేనా కేసీఆర్ ఢిల్లీ పర్యటన?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ ఈడీ దూకుడు చూసి భయపడుతున్నారా? గతంలోనే వాసన పసిగట్టిన ముఖ్యమత్రి, ఇక ఇప్పుడు  ఏ క్షణమైనా ఏదైనా జరవచ్చని ఆందోళన చెందుతున్నారా? ఈడీ దాడుల నుంచి ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించారా?  ఫ్యామిలీ టార్గెట్ గా ఇప్పటికే ఈడీ ఒకడుగు వేసిందా? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో వ్యాపార సంబంధాలున్న  కాసినో నిర్వాహకులు చిక్కోటి ప్రవీణ్, మాధవ రెడ్డి  హైదరాబాద్ నివాసాలు కార్యాలయాలపై ‘ఈడీ’ సోదాలు చేసిందా? గత కొంత కాలంగా, ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఎక్కడా కనిపించక పోవడానికి, ఇదే కారణమా? కవిత విదేశాలకు వెళ్ళారని వినిపిస్తున్న వార్తలలో నిజమెంత? ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు,ఈడీ దాడుల భయమే కారణమా? అంటే.. విభిన్న వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ అన్ని ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోందని అంటున్నారు.  ఇక వివరాలోకి వెళితే .. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. నూతన రాష్టపతి ద్రౌపతి ముర్మును మర్యాదపూర్వకంగా  కలిసి అభినందనలు తెలిపేందుకే ముఖ్యమంత్రి  ఢిల్లీ వెళ్ళారని, పనిలో పనిగా జాతీయ రాజకీయాలు, ఇంకొన్ని కీలక కార్యాలు చక్కబెట్టుకుని, రాష్ట్రానికి వస్తారని  ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది . ముఖ్యమంత్రి ఢిల్లీ బయలు దేరక ముందే ఈ మేరకు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.   అయితే, నిజంగానే, ముఖ్యమంత్రి అందుకే ఢిల్లీ వెళ్ళారా లేక ఇంకా ఏదైనా వుందా అంటే, అసలు ఉన్నదే అదని, అందుకోసమే ఆయన ఢిల్లీ వెళ్ళారని విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది. కొంచెం ఆలస్యంగానే అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన విషయాన్ని గుర్తించారు. రేపో మాపో తమ తలుపు తడుతుందని పసిగట్టారు. ఒకప్పుడు ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులుగా, రాజకీయ అవసరాలకు ఆర్థిక అండదండలు అందించిన కీలక వ్యక్తుల ద్వారా కేంద్ర ప్రభుత్వం, ఈడీ పూర్తి సమాచారాన్ని సేకరించి గుప్పిట్లో పెట్టుకుని దాడులకు సిద్దమవుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి, భయ పడుతున్నది నిజమే అని అంటున్నారు. అంతే కాకుండా, దేశంలో జరుగతున్న పరిణామాలు కూడా  ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవరానికి గురిచేస్తున్నాయని  అంటున్నారు.  ఇప్పటికే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఉప ముఖ్యమంత్రి, విధ్యాశాఖ మంత్రి, మనిష్  సిసోడియా అరెస్థుకు రంగం సిద్దమైంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రివాల్ స్వయంగా, సిసోడియా అరెస్థుకు సంబందించి తమకు ‘విశ్వసనీయ’ సమాచారం ఉందని ప్రకటించారు.  మరోవంక టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్‌ చేసింది. చివరకు అయిన దానికి కాని దానికి కేంద్రం పై కస్సున లేచే బెంగాల్ ముఖ్యమంత్రి మమత  బెనర్జీ కూడా నోరు మెదపలేని విధంగా, ఈడీ పక్కా ఆధారాలు ( నోట్ల కట్టల కుప్పలు) నేరుగా ప్రజల ముందు ఉంచింది.  అందుకే మమత బెనర్జీ,‘పార్థ’  పాపంతో తనకు సంబంధం లేదని, తనని తాను రక్షించుకునే పనిలో  పడి పోయారు.  ఈ నేపధ్యంలోనే, తెలంగాణలోనూ అలాంటి పరిస్థితి రావచ్చనే ముందు చూపుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్  ఢిల్లీలో ‘రహస్య’  మంతనాలు సాగిస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఓ వంక, జరగరానిది జరిగితే, జాతీయ పార్టీ అండ అవసరం అని  భావించే,  ‘ఆత్మ’ ద్వారా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్నారు. మరో వంక బీజేపీ పంచన చేరే ప్రయత్నాలు కూడా  కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు.  నిజానికి ,బీజేపీ, ఆ మాట కొస్తే జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ కూడా కేసీఆర్ ‘విశ్వసనీయత’ను విశ్వసించడం లేదు. అయినా చివరి ప్రయత్నంగా, కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి  తరుణ్ చుగ్’తో  రహస్యంగా సమావేశమైనట్లు  తెలుస్తోంది. ఈ భేటీలో కేసీఆర్, ఖుల్లం ఖుల్లా, తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా, తెరాసకు  ఎక్కువ  సీట్లు వచ్చినా. సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో బీజేపే ప్రభుత్వం ఏర్పాటుకు తెరాస సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అందుకు ప్రతిగా, తమ కుటుంబాన్ని, ఈడీ దాడుల నుంచి రక్షించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడిక్కడే తరుణ్ చుగ్  నో చెప్పి నట్లు తెలుస్తోంది.  గతంలో తమకున్న చేదు అనుభవాలతో పాటుగా, తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాటిచ్చి చేయిచ్చిన అనుభవాన్ని తరుణ్ చుగ్  గుర్తు చేసి, కేసీఆర్ కు  దండం పెట్టారని బీజీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  అదలా ఉంటే, కాసినో నిర్వాహకులు చిక్కోటి ప్రవీణ్, మాధవ రెడ్డి  హైదరాబాద్ నివాసాలపై జరిపిన దాడుల్లో కీలక సమాచరం లభించిందని, ఇందుకు సంబందించి ఫస్ట్ అరెస్ట్ త్వరలోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.అదీగాక, తాజాగా సుప్రీం కోర్టు మనీ లాండరింగ్ కేసుల్లో , విచారణ, అరెస్టులు, ఆస్తుల స్వాధీనం వంటి  అధికారాలు ఈడీకి ఉంటాయని, స్పష్టమైన తీర్పు ఇచ్చిన  నేపధ్యంలో, ఈడీ ముందు ముందు మరింత దూకుడు పెంచినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి, అయన కుటుంబ సభ్యులు ఆందోళన చేడుతున్నారని అంటున్నారు.

కామ‌న్‌వెల్త్ ప‌త‌కం  చేజారిన‌ట్టేనా?

ఒక అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌, ఒక ఘ‌న విజ‌యం త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు దేశ ఆశ‌ల్ని అడియాస‌లే చేస్తాయి. నీర‌జ్ చోప్రా విష‌యంలో ఇదే జ‌రిగింది. ఈమ‌ధ్య‌నే  ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో ర‌జ తం సాధించి దేశానికి ఘ‌న‌కీర్తి తెచ్చిన జావెలిన్ త్రోయ‌ర్ గాయ‌ప‌డ్డాడు. మ‌రి కామ‌న్‌వెల్త్ గేమ్స్ ప‌త‌కం చేజారిన‌ట్టే భావించాలా?   త్వ‌ర‌లో బ‌ర్మింగ్‌హామ్‌లో జ‌రిగే కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో చోప్రా స్వ‌ర్ణం సాధించి దేశానికి మ‌రింత కీర్తి ప్ర‌తిష్ట‌లు తెస్తాడ‌ని దేశ ప్ర‌జ‌లంతా ఆశిం చారు.  కానీ తొడ గాయం కార‌ణంగా కామన్‌వెల్త్‌గేమ్స్‌లో పాల్గొన‌డం లేద‌న్న‌వార్త ఒక్క‌సారిగా అందరిని నీర‌స‌ప‌రిచింది. 24 ఏళ్ల నీర‌జ్‌గాయం కార‌ణంగానే పాల్గొన‌డం లేద‌ని భార‌త ఒలింపిక్ సంఘం ప్ర‌క‌టిం చింది.   అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జావెలిన్‌ విసిరే సమయంలో నీరజ్ తొడ గాయం తో బాధపడ్డాడు. అది మాన‌క‌పోవ‌డంతో  ఇక కామ‌న్‌వెల్త్ గేమ్స్‌కు క‌ష్ట‌మ‌ని  చోప్రా తెలియ‌ జేయ‌డం అంద రినీ నిరాశ‌కు గురిచేసింది.  అతనికి ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేయించారు. అయితే, నెలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారని మెహతా తెలిపాడు. కామన్వెల్త్‌ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాక ధారిగా నీరజ్‌ వ్యవహరించాల్సి ఉంది.  ఇదిలా ఉండ‌గా,  కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళా క్రికెట్‌ జట్టులో కరోనా  కలకలం  రేపింది. ఆంధ్ర కు చెందిన సబ్బినేని మేఘనతో పాటు పూజా వస్త్రాకర్‌ పాజిటివ్‌గా తేలారు. దీంతో వారు స్వదేశం లోనే ఉండిపోవ‌ల‌సి వ‌చ్చింది. హర్మన్‌ప్రీత్ నాయ‌క‌త్వంలోని భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు  ఇంగ్లండ్‌ వెళ్లింది. ముందుగా  ఒక్కరే అనుకున్నప్పటికీ  ఆ తర్వాత పరీక్షలో మరో క్రికెటర్  కూడా పాజిటివ్‌గా తేలిం దని ఐఓఏ  తెలిపింది. ప్రొటోకాల్‌ ప్రకారం ఈ ఇద్దరికి నెగెటివ్‌ రిజల్ట్‌ వచ్చాకే జట్టుతో కలుస్తారు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే భారత్‌ తొలి మ్యాచ్‌లో వీరిద్ద‌రూ ఆడ‌క‌పోవ‌చ్చు. 

జగన్ ఉపయోగించే పెన్ను ఖరీదెంతో తెలిస్తే షాక్!

ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి అని ఓ సినిమాలో పాట. జగన్ సరిగ్గా అందేకే నీతులు చెబుతారు. అవి ఎదుటి వారికి చెప్పేటందుకు మాత్రమే. ఆయన ఆచరించేందుకు ఎంత మాత్రం కాదు. విపక్షంలో ఉండగా  అప్పటి ముఖ్యమంత్రి మినరల్ వాటర్ తాగడమే మహాపాపం అన్నట్లు గగ్గొలు పెట్టారు. ఒక హిమాలయ మినరల్ వాటర్ బాటిల్ ఖరీదు ఏకంగా 60 రూపాయలు.. ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. విపక్ష నేతగా అప్పటి ముఖ్యమంత్రి తన వయసు దృష్ట్యా ఆరోగ్యం కోసం ఓ అరవై రూపాయలు పెట్టి మినరల్ వాటర్ తాగితేనే మిన్నూ మన్నూ ఏకమయ్యేలా గగ్గోలు పెట్టిన జగన్ ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయిన తరువాత అయిన దానికీ కాని దానికీ కుటుంబంతో  విహార యాత్రలకు స్పెషల్ చార్టర్డ్ విమానాలను ఉపయోగిస్తున్నారు. అ ఖర్చేమీ సొంత ఖాతాలోంచి ఇవ్వడం లేదు. ప్రజల ధనాన్నే తన విలాసాలకు ఉపయోగించేస్తున్నారు. అంతెందుకు ఏ పెన్నుతో రాసినా అవే అక్షరాలు కానీ జగన్ మాత్రం చిన్న సంతకం పెట్టడానికి ఉపయోగిస్తున్న పెన్ను ఖరీదెంతో తెలుసా అక్షరాలా అరవై వేల రూపాయలు. ఆరవై రూపాయలు వెచ్చింది మినరల్ వాటర్ తాగినందుకే చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ నాడు గగ్గోలు పెట్టిన జగన్ సీఎంగా 60 వేల రూపాయల పెన్ను ఉపయోగిస్తూ కూడా ప్రజాధనాన్ని వారి సంక్షేమం కోసమే సద్వినియోగం చేస్తున్నానని ఎలా చెప్పగలరు? దావోస్ ఆర్థిక సదస్సులకు సీఎం హోదాలో చంద్రబాబు వెళ్లినప్పుడు ఏం సాధించుకు రావడానికి ప్రజా ధనంతో విదేశీ యాత్రలు అంటూ విమర్శించిన జగనే ఇప్పుడు స్వకార్యం, స్వామి కార్యం కూడా కలిసి వచ్చేలా స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ లో దావోస్ వయా లండన్ సతీ సమేతంగా చేసిన విహార యాత్ర ద్వారా రాష్ట్రానికి ఏం ఒరిగిందో చెప్పగలరా అని నెటిజన్లు నిలదీస్తున్నారు.  

వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు.. ఇది తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నమ్మిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రాతిపదికనే ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇప్పటికీ ఆయన ప్రారంభించిన పార్టీ ఆ సిద్ధాంతాన్ని విడవ లేదు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తూనే ముదుకు సాగుతోంది. తెలుగు ప్రజలకు కష్ట సమయంలో అండగా నిలుస్తోంది. తోడుగా నడుస్తోంది.   ఇప్పుడు కూడా గోదావరికి భారీగా వచ్చిన వరద గ్రామాలకుగ్రామాలను ముంచెత్తి ప్రజలను ఇక్కట్ల పాలు చేసిన సమయంలో   ప్రజలకు అండగా నిలుస్తోంది ఎన్టీఆర్ ట్రస్ట్. ట్రస్ట్ ద్వారా వరద బాదితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ  నారా భువనేశ్వరి తెలిపారు.  వరద బాధిత ప్రాంతాల్లో   ఆహారం, తాగు నీరు, మందులు సహా నిత్యావసర వస్తువుల సరఫరా చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే  బాధితులకు అవసరమైన   సరుకుల్ని ఇప్పటికే ఆయా ప్రాంతాలకు తరలించి సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాల అమలుపై ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సీఈవో రాజేంద్రప్రసాద్ బుధవారం ( జూలై 27) సమీక్షించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయ సహకారాలు అందించడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా నారా భువనేశ్వరి తెలిపారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నదే తమ సిద్దాంతమన్నారు. గోదావరి జిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 8వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మందులు, పిల్లలకు పాలు అందించామన్నారు. అదే స్ఫూర్తితో మిగిలిన వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్కర సమయాల్లో ప్రజలకు   ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుందని నారా భువనేశ్వరి అన్నారు.

ఈ గేదెల‌కే  ఓటుంటే.. నా గ‌తి ఇటుల‌వునా!

ప‌రుగులు తీయాలి.. గిత్త‌లు ఉర‌క‌లు వేయాలి.. అంటూ ఎన్టీఆర్‌, భానుమ‌తి ఎడ్ల‌బండిమీద వెళుతోంటే సినీ ప్రేక్ష‌కులు హాల్లో లేచి వారి వెంట ప‌రిగెట్టినంత హ‌డావుడి చేసేరు. ఈమ‌ధ్య‌నే పి.గ‌న్న‌వ‌రంలో ఆంధ్రా  సీఎం జ‌గ‌న్ రెడ్డి కూడా ఎడ్లబండి కాదుకానీ ట్రాక్టరెక్కి  ఉర‌క‌లు లేకుండా  బ‌హు నెమ్మ‌దిగా వెళ్లి నా ఎవ్వ‌రూ వెంట రాలేదు! పైగా అక్కడున్న ప‌ది గేదెలు ఈయ‌నెందుకు ఇటోచ్చాడ‌న్న అనుమానంతో చూశాయి.   ఇటీవ‌ల గోద‌వారి వ‌ర‌ద‌లు, భారీ వ‌ర్షాల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో పలు గ్రామాలు ముంపు న‌కు గుర‌య్యాయి.  వరద కాస్తంత శాంతించిన త‌ర్వాత సీఎం జ‌గ‌న్ చాలా తాపీగా బాధితుల‌ను ప‌ల‌క‌రిం చ‌కపోతే బాగోద‌న్న‌ట్టుగా ప్ర‌యాణ‌మ‌య్యారు. అలా ఆయ‌న పి.గ‌న్న‌వ‌రం అనే గ్రామానికి వెళ్లిన‌పుడు సారు వారికి కారులో వెళ్ల‌డానికి అవ‌కాశం లేక‌పోయింది. అదంతా ఎడ్ల‌బండి, గేదెలు, చెప్పుల్లేని రైతులు తిరిగే దారి. అందువ‌ల్ల సీఎం త‌న  కారు కాద‌ని త‌ప్ప‌నిస్థితిలో ట్రాక్టర్ ఎక్కారు.  బ‌హుశా ఆయ‌న‌కూ ఎన్టీఓడి  పాట గుర్తొచ్చే ఉంటుంది.  ట్రాక్టర్ నుప‌రుగు పెట్టించాల‌నే అనుకొనుండొ చ్చు. కానీ వెళుతోంది బాధితుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి క‌దా అందువ‌ల్ల గేదెల నిదానాన్ని అంగీక‌రించా ల్సి వ‌చ్చింది. పైగా అది స‌ర‌యిన రోడ్డు  కాదు మ‌రింత ఉత్సాహ‌ప‌డ‌ద్ద‌ని భ‌ద్ర‌తా సిబ్బందీ చెప్పి ఉంటుం ది. అస‌లు అంత‌కంటే ముందే  ఆ దారంతా కాస్తంత శుభ్ర‌పరిచే ఉంటారు.  కానీ దారిలో గేదెలే ఎక్కువ‌గా ఆహ్వానం ప‌లికేయి. అవి మ‌నుషులు అందులోనూ జ‌గ‌న్ వీరాభిమానులు కాదు గ‌నుక భ‌ద్ర‌తాసిబ్బంది అమాంతం వాటి ఉత్సాహాన్ని నిలువ‌రించి కొమ్ములు గ‌ట్టిగా ప‌ట్టుకుని ఆపేరు. వాటికి మ‌నుషులు తెలీదు, జ‌న‌గ‌న‌న్న పాల‌నా తెలీదు, ఎప్పుడ‌న్నా కుమ్మేయ‌చ్చుగ‌దా! కానీ అంత చిత్ర‌మైన ప్ర‌యాణంలోనూ జ‌గ‌న్ త‌న మాట మాత్రం మార్చుకోలేదు. గేదెల‌కీ భాష తెలిస్తే వాటి మేత‌కు గ్రాసం ఏర్పాటు చేసినందుకు తనను వేనేళ్ల పొగిడేవని చెప్పారు.  ప్ర‌చారానికి, భ‌జ‌న‌కీ వేటినీ వ‌ద‌ల‌రు ప్ర‌భువుల వారు. వారికి భుజ‌కీర్తులు ఇపుడు ఎంతో అవ‌స‌రం. వ‌ర‌ద‌బాధితుల ప‌రామ ర్శ‌కు  ట్రాక్ట‌ర్ మీద తిరుగుతున్నా మ‌న‌సు మాత్రం  వీటికీ ఓటు హ‌క్కుంటే ఎంత బాగుండేదో అని  లోలో ప‌ల అనుకుంటోంది!

పశువులు మెచ్చిన ప్రభువు ఎవరో తెలుసా ?

నవ్వడానికి అయినా నవ్వించడానికి అయినా, కమేడియన్లే కానక్కర లేదు, బ్రహ్మానందమే రానక్కర లేదు. రాజకీయ నాయకులు కూడా ఇంచక్కా, చక్కగా నవ్వించగలరు. నవ్వనూ గలరు. మళ్ళీ మనకు పొలిటికల్ కమేడియన్స్ అనగానే,ఒక కేఏ పాల్ లేదంటే ఆ రేంజ్ నాయకులు ఎవరో గుర్తొస్తారు కానీ, పాల్ ని మించిన కమేడియన్లు ఉన్నారని మనం గుర్తించలేక పోతున్నాం. దటీజ్ అవర్ బాడ్ లక్ ..  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్నే తీసుకోండి, ఆయన ఎంత చక్కగా నవ్వుతారు. నవ్వీ నవ్వనట్లుగా, అదో రకంగా భలేగా నవ్వుతారు. (గిట్టని వాళ్ళు ఆయన నవ్వు ముఖానికి పూసుకున్తున్నట్లు ఉంటుందంటారు అనుకోండి అదివేరే విషయం). నవ్వడంలోనే కాదు, నవ్వించడంలోనూ జగన్ రెడ్డికి జగన్ రెడ్డే సాటి.  అయన భలే భలే జోకులేస్తారు. నిజానికి అయన మాటే ఒక జోకు... అందుకే, నవ్వడంలోనే కాదు, నవ్వించడంలోనూ జగన్ రెడ్డి మంచి మార్కులే వచ్చాయని అంటారు.  మార్కులంటే  గుర్తొచ్చింది. మీరు ఒక పరీక్ష రాసారు, అనుకోండి, మీకు ఆ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయి, ఫస్ట్ క్లాసొచ్చిందా? అసలు పాస్ మార్కులు అయినా వచ్చాయా, పాసయ్యారా?  లేదా, అనేది ఎవరు నిర్ధారించాలి, మీకు ఎవరు మార్కులు వేయాలి  ఆ పరీక్ష పేపర్ దిద్దిన మాష్టారు కదా, కానీ, జగన్ రెడ్డి స్కూల్ లో అలాకాదు. పరీక్ష ఆయనే రాస్తారు. మార్కులు ఆయనే వేసుకుంటారు. ఆయనకు ఆయనే సర్టిఫికేట్  కూడా ఇచ్చుకుంటారు.  ఆ మధ్యన ఆయన మీటలు నొక్కే టెస్టులో నేను ఫస్టు క్లాస్ లో పాసై పోయాను. నాకు ప్రజలు (ఏ ప్రజలు అని అడగకండి) 80 శాతం మార్కులు వేశారు. ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశారు అని ఆయన జబ్బలు ఆయనే చరుచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గోదావరి వరదలను ట్యాకిల్ చేయడంలోనూ, తనకు తానే సాటని మరో మారు జబ్బలు చర్చుకున్నారు. మనుష్యులే కాదు, పశువులు కూడా తనను చూసి తెగ మురిసి పోతున్నాయని చెప్పుకొచ్చారు. పశువులకు నోరు లేక కానీ, లేదంటే, ఓహో జగనన్న .. ఆహ జననన్న.. నువ్వే మా రాజన్న .. అంటూ కీర్తి గీతాలు ఆలపించేవని, తమ కీర్తిని తానే చాటు కున్నారు. చాటింపు వేసుకున్నారు. తమకు వరద సాయం అందలేదని ఒక్కరూ కూడా చెప్పలేదని .. అందర్నీ ప్రభుత్వం ఆదుకుందన్నారు, అంతే కాదు,  కట్టు బట్టలతో మిగిలిపోయిన, ప్రజలు, జగనన్న ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల రూపాయలు ఏమి చేసుకోవాలో తెలియక సంబరాలు చేస్కుంటున్నారనికూడా సంతోషంతో చిందులు వేశారు. అంతే  కాదు, ఇంతవరకు, ఏ ముఖ్యమంత్రి చెప్పని మరో గొప్ప రహస్యాన్ని కూడా శ్రీ జగన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు మాత్రమే ఇవ్వాలి కానీ, జనంలోకి రారాదని. వచ్చినా పరదాల చాటున, పోలీసుల మాటున రావాలే కానీ, కష్టాల్లో ఉన్న ప్రజలను పలకరించడం ముఖ్యమంత్రి చేయవలసిన పని కాదని , చాలా చక్కని సందేశం ఇచ్చారు.  అంటే ఏంటి, నవ్వడానికి అయినా నవ్వించడానికి అయినా, కమేడియన్లే కానక్కర లేదు, బ్రహ్మానందమేరానక్కర లేదు. రాజకీయ నాయకులు కూడా ఇంచక్కా, చక్కగా నవ్వించగలరు. నవ్వనూ గలరు. ఇన్ ఫాక్ట్’ ఇతర రాజకీయ నాయకుల సంగతి ఎలా ఆన్నా, ఏపీ సీఎం జగన్ రెడ్డి లో మాత్రం ఓ మాంచి కమెడియన్ కూడా ఉన్నారు. సరే, ఆయన నవ్వుల సంగతి ఎలా ఉన్నా, అయన నవ్వుల పాలవుతున్నారు.. అంటారా ..అది  మీ ఇష్టం

ఉడ‌త బంధం!

ప్రేమ‌గా ద‌గ్గ‌రికి తీసుకుంటే చిన్న‌జంతువూ స్నేహాన్ని ఆశిస్తుంది. ఇందుకో పెద్ద ఉదాహ‌ర‌ణ రామా య‌ణంలో రాముడు ఉడ‌త‌ను ద‌గ్గ‌రికి తీసుకోవ‌డం, వీపు నిమ‌ర‌డం!  ఇంత కాకున్నా కెల్లీ బ్రాడ్ చిన్న పాటి సాయ‌మే చేశాడు ఓ ఉడ‌త‌కి. ఒక‌రోజు ఇంటి కిటికీ త‌లుపులు శ‌బ్ద‌మైతే  చూశాడు. అక్క‌డ ఒక ఉడ‌త కాలిగాయంతో ఇబ్బందిప‌డుతూ దీనంగా అత‌ని వంక చూసింది. దాన్ని లోప‌లికి తీసుకువ‌చ్చి కాలికి క‌ట్టుగట్టి ఎంతో సేవ‌చేశాడు. భార్య‌కు కాస్తంత ఇబ్బందే అనిపించిని అది చిన్న‌ముండే పెద్ద స‌మ‌స్య ఉండద‌నే అనుకుంది. అది వారిని త‌న వార‌నుకుంది. సర్దుకుని ఊరికి వీలైనంత దూరంగా వెళ్లిపోయారు. ఈ దశలో, జెరెమీకి రెండు సంవత్సరాల వయస్సు అతను వారి కొత్త ఇంటిని ఇష్టపడ్డాడు. ఇంటి చుట్టూ వందలాది ఉడుతలు ఉండే అద్భుతమైన, పచ్చని చెట్లు ఉన్నాయి. జెరెమీకి ఉడుతలంటే మ‌హా యిష్టం.  కానీ అతనిలా  కాకుండా, అతని  తల్లి  ఇష్టపడ లేదు. కెల్లీ బ్రాడ్‌తో కూర్చొని,  ఉడుతలతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కుక్క‌లు చూస్తే వెంటాడ‌తాయ అని అతనికి  వివరించింది.  కౌంటీలో మాంసాహారులు ఉన్నప్పటికీ, ప్రతిదీ బాగానే ఉంటుందని బార్డ్ ఆమెకు హామీ ఇచ్చాడు. కానీ ఒక రాత్రి త‌లుపు తట్టిన శబ్దం  కెల్లీని మేల్కొలిపినప్పుడు  ఎవ‌రో దొంగ వ‌చ్చాడ‌ని భ‌య‌ప‌డ్డారు. బయట చాలా చల్లగా ఉంది. అప్పుడే వాళ్ళ వరండా తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. తెలియని శబ్దంతో కంగారు పడిన బ్రాడ్ తలుపు దగ్గరకు  వెళ్లే ముందు తన బ్యాట్‌ని పట్టు కున్నాడు. కెల్లీ తన సొంత బ్యాట్ ను పట్టుకుని తన భర్తను అనుసరించడానికి సమయాన్ని వృథా చేయలేదు అతను త‌లుపు తీయ‌గానే ఆమె నవ్వింది. ఎదురుగా నేల‌మీద‌  ఒక చిన్న ఉడుత తమ ముందు పడుకో వడం చూసి వారు ఆశ్చర్యపోయారు.  అది వారిపై  చిర్రుబుర్రులాడుతున్నప్పుడు దాని వెనుక కాలు మీద గాయం నుండి రక్తం కారుతోంది. ఆమె సహాయం చేయాలని కెల్లీకి  తెలుసు. వారు గాయపడిన ఉడ‌త‌ను తీసుకొని గాయానికి  మందు వేసి క‌ట్టుగ‌ట్టారు. దానిని వెచ్చగా ఉంచడానికి  ఒక దుప్పటిని తీసుకురావ డం ద్వారా జెరెమీ కూడా సహాయం చేశాడు. సంఘటన తర్వాత, ఇల్లు నిశ్శబ్దమైంది, కానీ కెల్లీకి ఇంకేదో జరిగిందనే భావన కలిగింది. .  ఈ సంఘటన తర్వాత, ఇల్లు నిశ్శబ్దమైంది, కానీ కెల్లీకి  ఇంకేదో జరిగిందనే భావన కలిగింది. ఒక సంవత్స రం తర్వాత‌, వారి కుటుంబంలోని  కొత్త సభ్యురాలు  లిల్లీ  వ‌చ్చింది.  ఆమెకు తన స్వంత కుటుంబం ఉందని తెలుసుకున్న వారు ఆమెను తిరిగి అడవిలో వ‌దిలేశారు. లిల్లీ లేకుండా వారి ఇల్లు ఒంటరిగా అనిపించింది. కానీ ఆమె వెళ్లిపోయిన  కొద్దిసేపటికే, కుటుంబం వాకిలి తలుపు మీద మరిన్ని శ‌బ్దాలు  విన‌ప‌డ్డాయి!  మ‌రిన్ని లిల్లీ లేమో!

తెలుగుదేశం జైత్రయాత్ర ఆరంభం!

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ తన జైత్ర యాత్ర మొదలెట్టింది. అధికార వైసీపీపై ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను ఒక కోపరేటివ్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికలు బట్టబయలు చేశాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఇలాకా కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలనూ తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేయడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టిన చందంగా హోంమంత్రి నియోజకవర్గంలో టీడీపీ   సత్తా చాటింది. దీంతో కొవ్వూరులో టీడీపీ జెండాల రెపరెపలు మొదలయ్యాయి. ఒక్క  ఛాన్స్ అంటూ అధికార పగ్గాలు అందుకున్న  జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని హీన స్థితికి తేవడమే కాకుండా వైసీపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు   అగచాట్లు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు, చెత్త మీద కూడా పన్ను వేయడం లాంటి అనాలోచిత చర్యలతో వైసీపీ సర్కార్ పై జనంలో ఓ రేంజ్ లో అసహనం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో జరిగిన కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగరేయడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఇదే తొలిమెట్టు అంటూ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. నిజానికి 1983 నుంచీ ఇక్కడ టీడీపీ హవాయే కొనసాగుతోంది. ఎన్నిక ఏదైనా గెలుపు మాదే అంటూ కొంత కాలంగా విర్రవీగుతున్న వైసీపీ నేతల అత్యుత్సాహానికి కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికలు బ్రేకులు వేశాయని చెప్పాలి. కొవ్వూరు వైసీపీలో గ్రూపు రాజకీయాల కారణంగానే టీడీపీ విజయం సులువు అయిందని, తమకు ఓటమి ఎదురైందని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని బహిరంగంగా చెబుతుండడం గమనించదగ్గ విషయం. అయితే.. అర్బన్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. జిల్లా సహకార అధికారికి వైసీపీ ఫిర్యాదు చేయడాన్ని చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా.. కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలక వర్గంపై దశాబ్దాలుగా టీడీపీ ఆధిపత్యమే కొనసాగుతోంది. అయితే.. టీడీపీని ఈసారి ఎలాగైనా దెబ్బకొట్టాలనే కుట్రతో వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం విశేషం. నిజానికి వచ్చే ఆగస్టు 4తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగుస్తోంది. దీంతో సొసైటీల మాదిరిగా త్రిసభ్య కమిటీ వేసి అర్బన్ బ్యాంకును చేజిక్కించుకోవాలని అధికార పార్టీ వేసిన ఎత్తుగడను టీడీపీ నేతలు తిప్పికొట్టడం గమనార్హం. 1964 కో ఆపరేటివ్ సొసైటీ చట్టం 43 ప్రకారం ఎన్నికలు నిర్వహించుకుని, ఏకగ్రీవంగా ఎన్నికైన తదుపరి పాలకవర్గాన్ని ప్రకటించారు. కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి హోం మంత్రి తానేటి వనితే కారణం అంటూ ఆ పార్టీ నేత కంఠమణి రమేష్ నిప్పులు చెరుగుతున్నారు. మంత్రిపై మనస్తాపంతో కొవ్వూరు శ్రీరామా ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు. దీంతో కొవ్వూరు నియోజకవర్గంలోని వైసీపీలో లుకలుకలు బట్టబయలయ్యాయి.

అదేం భాష జక్కంపూడీ!

తూర్పుగోదావరిజిల్ల రాజానగరం యం.ఎల్.ఎ జక్కంపూడి రాజా నిన్న జనసేన,వీర మహిళా నాయకులతో మాట్లాడిన మటల తీరు ఇప్పుడు చర్చనీయంశం  అయింది. వరద ప్రభావిత ప్రాంతలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ని కలిసి వరదభాదితులకి  పదివేల రూపాయల చొప్పున సహాయం అందించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు జనసేన నిర్ణయించింది. అయితే వారెవరూ జగన్ ను కలవకుండా పోలీసులు అన్ని ముందు జాగ్రత్త చర్యలూ  తీసుకున్నారు. జనసేన నేతలు కొందరికి ‘ముందస్తు’ హౌస్ అరెస్టులు చేశారు   ఐతే మిలిగిన  నాయకులూ,జనసేన వీర మహిళలు ముఖ్యమంత్రి వెళ్ళాకా గంటి పెదపూడి లో  జక్కంపూడి రాజా వాహనాన్ని అడ్డుకుని  నినాదాలు చేసారు. వరద భాదితులని ఆదుకోవడంలో ప్రభుత్వం  విఫలమైందని నిరసన వ్యక్తం చేసారు. తన వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేయడాన్ని సహించలేకపోయిన జక్కంపూడి నిరసన వ్యక్తం చేస్తున్న మహిళల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అసభ్యంగా మాట్లాడారని మహిళలు ఆరోపిస్తున్నారు.   జక్కంపూడి భాష మార్చుకోవాలని జనసేన వీరమహిళలు హెచ్చరించారు. నిరసనను ఉధృతం చేశారు.   వీరమహిలలని అదుపులోకి తీసుకున్నారు.  అయితే  జక్కంపూడి  భాష పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే జక్కంపూడి ఈ విధమైన దుడుకు వ్యవహారం ఇదే మొదటి సారి కాదని  అంటున్నారు. పోలవరంలో ప్రభుత్వ ఇంజనీర్ పై కూడా చెయ్య చేసుకున్న సంఘటనను గుర్తు చేస్తున్నారు.  

కొడాలికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందా?

మాజీ మంత్రి కొడాలి నానికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందా? చెత్త పన్ను నిరసన సెగకు ఆయన మొహం మాడిపోయిందా? గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఏ గడపకు వెళ్లినా చెత్త పన్నుపై నిరసనలు, విమర్శలు ఎదురౌతున్నాయా?  అంటే ఔననే సమాధానం వస్తోంది. చెత్త పన్నుపై ప్రజాగ్రహాన్ని గమనించిన ఆయన తన నియోజకవర్గంలో చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. అయితే మంత్రిగా ఉండగా ఆయన మాటే శిరోధార్యంగా పరుగులు పెట్టిన అధికారులు మాజీ అయిన తరువాత ఆయన మాటను కాదు కదా.. ఆగ్రహాన్నీ, హుంకరింపునూ కూడా పట్టించుకోవడం లేదు. మీరేమన్నా సరే మా పని మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చెత్త పన్ను వసూలు వద్దని ఆయన ఇచ్చిన మౌఖిక ఆదేశాలను అధికారులు అసలే లెక్క చేయలేదు. పైపెచ్చు ప్రజల ముక్కు పిండి  మరీ వసూలు చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఈ నెల చెత్త పన్ను వసూలు టార్గెట్ ను అధికారులు  ఇప్పటికే దాదాపు పూర్తి చేసేశారు. దీంతో కొడాలి నానికి గడప గడపలోనూ చెత్త పన్ను సెగే తగులుతోంది. తాను చెప్పినా అధికారులు వినకపోవడంతో ఆయనకు ఆగ్రహం వచ్చింది. ప్రజల ఎదురుగానే అధికారులపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసి జనం వద్ద మంచి మార్కులు కొట్టేయాలని ప్రయత్నించారు. అయినా జనం నమ్మడం లేదు. మాజీ అయిన మీ మాట అధికారులు ఎందుకు వింటారు సార్ అని సెటైర్లు వేస్తున్నారు. అదే విధంగా అధికారులు కూడా ఒక ఎమ్మెల్యే మాట విని ప్రభుత్వ ఆదేవాలను నిర్లక్ష్యం చేయలేమని అదే ప్రజల ఎదుటే నానీకి అధికారులు స్పష్టంగా చెప్పేశారు. దీంతో ఈ విషయంలో సీఎంతోనే తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తాను తాడో పేడో తేల్చుకోవలసింది ముఖ్యమంత్రితో అవ్వడంతో తానొక్కడి వల్లా కాదని అనుకున్నారేమో బందర్ మాజీ మంత్రి పేర్ని నాని సహాయం తీసుకోదలిచారు. అందుకు పేర్ని నాని సైతం సై అన్నారని అంటున్నారు. అయితే వీరిద్దరూ అనుకుంటే సరిపోతుందా? పవర్ లేని మాజీలాయె. అసలు సీఎం జగన్ వీరికి అప్పాయింట్ మెంటైనా ఇస్తారా అని గుడివాడలో వైసీపీ శ్రేణులే అంటున్నారు. చెత్త పన్ను విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు సరే సరి.. కానీ పన్నుపై ప్రజాగ్రహం మాత్రం నేరుగా ఎమ్మెల్యేలపైనే వ్యక్తం అవుతోంది. ఇది తెలిసినా జగన్ పట్టించుకోవడం లేదు. మీ బాధలు మీరు పడండి. బటన్ నొక్కి జనం ఖాతాల్లో వేలకు వేలు వేస్తుంటే.. ఆ మాత్రం చెత్త పన్నుపై వారిని కన్విన్స్ చేయలేకపోతే  మీరెందుకు? అని విసుక్కుంటున్నారని, ఇప్పటికే నియోజవర్గంలో ఎదురౌతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళదామని ప్రయత్నించి భంగపడ్డ ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి ఈ మాజీలకు చెత్త పన్ను విషయంలో సీఎం వద్ద ఎలాంటి మర్యాద దక్కుతుందో చూడాలి.   దానికి ఆయనేమన్నారో స్పష్టత లేదు. కానీ చెత్తపన్నుపై మాత్రం నానీల ఉద్యమం ప్రారభమయిందంటున్నారు. చెత్తపన్ను విషయంలో ప్రభుత్వానికి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందో వైసీపీ ప్రజాప్రతినిధులకు బాగా తెలుసు. మామూలుగా అయితే ఇలాంటి పన్నులు చెల్లించిన వారి దగ్గరే తీసుకుంటారు. కానీ ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త వేయండన్న హెచ్చరికలు కూడా ధర్మాన వంటి మంత్రులు చేశారు. ఇవన్నీ సీఎంకు తెలియక కాదు. మరి ఇప్పుడు నానీలు చెప్పినంత మాత్రాన సీఎం జగన్ చెత్తపన్ను రద్దు చేస్తారా అన్నది వైసీపీలో హాట్ టాపిక్ ! 

రావ‌మ్మా మ‌హాల‌క్ష్మీ రావ‌మ్మా..  గొంతు స‌వ‌రించిన జ‌గ‌న్ !

త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో అప్పులు చేసి భ‌య‌ప‌డుతూ జీవించేవాళ్లు ఉంటారు. అప్పుల అప్పారావులూ ఉంటారు. అప్పులు చేయ‌డంలో గొప్ప ఆనందం ఉంద‌ని ప్ర‌చార‌మూ చేస్తుంటారు. పార‌సైట్ల‌లా అప్పుల క‌ట్ట‌ల మీద నిద్ర‌పోవ‌డం బ‌హు ఆనందం. ఈ  రెండో త‌ర‌గ‌తికి చెందిన వారే ఆంధ్ర‌ప్ర‌దేశ్  ప్రభుత్వం వారు. ఇప్పుడు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి పాడుతున్న పాట‌కీ మూలార్ధం ఒక్క‌టే రండి డ‌బ్బుల క‌ట్ట‌తో, ధ‌న వంతులూ కోట్లు కుమ్మ‌రించండి.. మీదే ఈ రాజ్యమ‌ని!  ఎవ‌రు డ‌బ్బుల మూట‌తో వ‌స్తే వారికే దేవ‌ర వారి దర్శ‌నం, అభ్య‌ర్ధ‌న‌ల‌తో, విన‌తుల‌తో వ‌స్తే గుమ్మం నుంచీ వెర్రిన‌వ్వుతో వెళ్ల‌ గొడుతున్నారు.   రాష్ట్ర ఆర్ధిక స్థితి రాను రాను దారుణంగా మారుతుండ‌డంతో ఆదాయ‌మార్గాల కోసం ప్ర‌తీవారినీ స‌ల‌హా అడుగుతున్నారు, ప్ర‌తీ ఆలోచ‌న‌కూ ప‌దును పెడుతున్నారు. కానీ ఏ ప‌దునైన ఆలోచ‌న ఏ స‌ల‌హా దారుల నుంచి రాక జ‌గ‌న్ అద్దంలో మొహం చూసుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.  మరి నెత్తికెత్తుకున్న భారం చిన్న దా. ఏటా యాభై వేల కోట్లు కేవలం సంక్షేమ పధకాలకే పోతుంది. ఉద్యోగుల జీతాలు ఇతర అవసరాలు అన్నీ చూడాలి అంటే ఏటా సర్కార్ కి  సుమారు రెండు లక్షకోట్లు  ఖర్చు అవుతోంది. అయితే ఈ రోజుకు స్టేట్ ఆదాయం ఎనభై వేల కోట్లు గా ఉంది. కేంద్రం నుంచి వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం చూస్తే మరో ముప్పయి వేల కోట్ల దాకా జమ అవుతోంది. అంటే ఎలా చూసుకున్నా లక్షా పది వేలకు మించి ఆదా యం రావడం లేదు. మరి నలభై వేల కోట్లు ప్రతీ ఏటా లోటు క‌న‌ప‌డుతోంది. దాంతో పాటు ఇంకా అదనపు ఖర్చులు తగిలితే తడిసి మోపెడు అవుతోంది. దాంతో అప్పులు చేస్తూనే మరో వైపు ఉన్న ఆదాయ మార్గా లను కూడా పెంచుకునే మార్గం వెతుకుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో  కీలకమైన శాఖల నుంచి వచ్చే ఆదాయం మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా గనుల శాఖ బంగారు బాతుగుడ్డు మాది రిగా ఉందని సర్కార్ భావిస్తోంది. గత మూడేళ్లుగా ఎర్ర చందనం స్టాక్ వేలం వేయకుండా అలాగే మిగిలి ఉంది. దాంతో దాన్ని వేలం వేయడం ద్వారా వందల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కార్  ఆరాటపడుతోంది. అంతేకాకుండా ఎర్ర‌చెంద‌నం వేలం వేయ‌డానికీ  ఆలోచిస్తోంది. అయితే  అందుకు కేంద్రం అనుమతి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కాగా మ‌ద్యం అమ్మ‌కాలతో ఆదాయం గ‌ణ‌నీయంగా  ఉం టుంద‌ని చెబుతూ ఎక్సైజ్ అధికారులు జ‌గ‌న్‌కు కాస్తంత ఊర‌ట క‌లిగిస్తున్నారు. ఇక రిజిస్ట్రేష‌న్ విభాగం నుంచి వ‌చ్చే ఆదాయం పైనా దృష్టిపెట్టాల‌న్నారు. ఎక్క‌డా ఒక్క పైసా కూడా విడ‌వ‌కుండా ప‌ట్టుద‌ల‌తో వ‌సూలు చేప‌ట్టాల‌ని స‌ర్కార్ భావిస్తున్న‌ది. అనేక ఇత‌ర శాఖ‌ల‌కు కూడా ఆదా య అవ‌కాశాలు పెంచాల‌న్న ఆదేశాలే జారీ అయినాయని తెలుస్తున్న‌ది.  అందుబాటులో ఉన్న వారు, ధ‌నిక‌స్నేహితుల‌ను ఏ ఒక్క‌రిని వ‌ద‌ల‌ద్ద‌ని పూర్వం ఒకాయ‌న వెంటాడి మ‌రీ డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్టు ఇపుడు జ‌గ‌న్ స‌ర్కార్ ఏ విభాగాన్ని వ‌ద‌ల‌డం లేదు. అంద‌రికీ త‌న పాట రావ‌మ్మా.. మ‌హాల‌క్ష్మీ.. రావ‌మ్మా.. వినిపించి, పాడ‌మంటున్నారు. ఇక అధికారుల క‌ష్టాలు దేవ‌త‌కే ఎరుక‌.  కానీ ఎలాంటి  న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా పన్నుల వసూళ్లలో పారదర్శకత జవాబు దారీ తనం సమర్థత ఉండేలా చూడాలని అధికారుల ను ఆయన ఆదేశించారు. మొత్తానికి  రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఖ‌జానా నింప‌డానికి చేయాల్సిన వీర య‌త్నాల‌న్నీ చేస్తున్న ది. ఇపుడు ప‌రిస్థితులు మ‌రింత విషమిస్తున్న‌వేళ అధికారుల‌పై పెనుభారం పెట్టింది.  కేంద్రం నుంచి ప్రేమాభిమానాలు, స్నేహ‌సంబంధాలు మెరుగుప‌ర్చుకుంట‌న్న‌ప్ప‌టికీ ఇంతటి అప్పారావు పాల‌ న‌ను కేంద్రం ఎలా స‌మ‌ర్ధిస్తున్న‌ద‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. 

జగన్ పాలనలో అడకత్తెరలో అధికారులు!

జగన్ పాలన అధికారులను బోనులో నిలబెట్టే దిశగా సాగుతోంది. కోర్టు ఆదేశాల ఉల్లంఘన, నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుండటంతో రేపేదైనా తేడా వస్తే అధికారులే ముద్దాయిలుగా బోనులో నిలబడక తప్పని పరిస్థితి ఎదురౌతుంది. అయినా కూడా వారేం చేయలేక ఏలిన వారి ఆదేశాలను పాటించాల్సిన పరిస్థితి. తాజాగా విశాఖ రుషి కొండ తవ్వకాలు, నిర్మాణాల విషయంలో సుప్రీం ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా అక్కడ జరుగుతున్న పనులను గమనిస్తే ఆధికారులను బలిపశువులను చేసే దిశగా జగన్ వారి చేత నిబంధనలు ఉల్లంఘించైనా సరే పనులు చేయాలని ఆదేశాలు ఇచ్చారని అనిపించక మానదు. రిషికొండ నిర్మాణాలపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తోంది. రిషికొండ తవ్వకాలపై ఇప్పిటికే సుప్రీం కోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. కొండ కొత్తగా ఎటువంటి తవ్వకాలూ చేపట్ట వద్దనీ, నిర్మాణాలు కూడా గతంలో నిర్మాణాలు ఉన్న చోటనే చేపట్టాలని విస్పష్ట రూలింగ్ ఇచ్చింది. అయితే సుప్రీం తీర్పును యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రిషి కొండలో తవ్వకాలూ జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త ప్రాంతాలలో నిర్మాణాలూ ఆఘమేఘాల మీద కొనసాగుతున్నాయి. సుప్రీం ఆదేశాలలో ఏక్కడో అక్కడ నిర్మాణాలు చేపట్టవచ్చని ఉంది కనుక మనం ఎక్కడ అనుకుంటే అక్కడే నిర్మాణాలు చేసేద్దామన్న రీతిలో ఇష్టారీతిన నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. అది కూడా వందల మంది కార్మికులను నియమించి వాయు వేగంతో నిర్మాణాలుపూర్తి చేస్తున్నది. భవిష్యత్ లో సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే.. కోర్టును తపపుదోవ పట్టించినందుకు, ఆదేశాలను ఉల్లంఘించినందుకు బోనెక్కాల్సింది ముఖ్యమంత్రి కాదు. దగ్గరుండి పనులు చేయించిన మంత్రులూ కాదు. అధికారులే. అందుకే జగన్ పాలనలో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కగా మారింది. నిబంధనల మేరకే పని చేస్తామంటూ సీఎం ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. కాదంటే కోర్టు బోనెక్కి తప్పు నిబంధనల ఉల్లంఘన నిరూపితమైతే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. తృటిలో శిక్షను తప్పించుకుని సామాజిక సేవ చేయడానికి అంగీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పలువురు అధికారులు కేసుల్లో ఇరుక్కుని జైలు జవితం అనుభవించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ హయాంలో కూడా అదే విధంగా అధికారులు దోషులుగా నిలబెట్టైనా సరే పబ్బం గడుపుకుందామన్న రీతిలో జగన్ తీరు ఉందని పరిశీలకులు చెబుతున్నారు. 

దేశం ఎంపీలతో లావు చెట్టాపట్టాల్!

వైసీపీ అధినేత గుప్పిట మూసి ఉంచాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఈ మూడేళ్లు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అన్నట్లు వైసీపీలో తిరుగుబాట  పడుతున్న నేతల సంఖ్య  రోజురోజుకూ పెరిగిపోతున్నాది. నిన్నటి వరకూ వైసీపీకి పక్కలో బల్లెంగా రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు ఒక్కరే ఉండే వారు. ఆ తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పరిస్థితిలో గణనీయ మార్పు వచ్చింది. అధినేత మాటే శాసనం అన్న పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. గడప గడపకూ మన ప్రభుత్వం విషయంలో అదినేత ఆదేశాలను పాటిస్తున్న వారి సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఆ విషయాన్ని జగనే స్వయంగా సమీక్షల్లో వెల్లడించారు. పదిపదిహేను మంతి ఎమ్మెల్యేలు వినా మిగిలిన వారెవరూ గడప గడపకూను సీరియస్ గా తీసుకోవడం లేదని జగన్ ఫైరైన సంగతి విదితమే. ఇక ఇప్పుడు వైసీపీలో లుకలుకలు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల స్థాయి దాటి హస్తినకు సైతం పాకాయి. వైసీపీలో అసమ్మతి భగ్గు మంటున్నదన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ వైసీపీలో అసమ్మతి, అసంతృప్తి రాష్ట్రం ఎల్లలు దాటి బయటకు కనబడ లేదు. రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇందుకు మినహాయింపు అది వేరే సంగతి. తాజాగా వైసీపీ ఎంపి లావు కృష్ణ దేవరాయలు తన అసంతృప్తిని, ధిక్కారాన్ని కొత్త పద్ధతిలో వెల్లగక్కారు. వైసీపీ అధినేత తీరు పట్ల, ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల తన అసమ్మతిని విపక్ష తెలుగుదేశం ఎంపీలతో చనువుగా మెలగడం ద్వారా తెలియజేశారు.ఈ మూడేళ్ళుగా వైపీసీ ఎంపీలలో రఘురామ కృష్ణం రాజు మినహా మరెవరూ పార్టీ కట్టుబాట్లను దాటిన దాఖలాలు లేవు. ఆ కట్టుబాట్లేమిటంటే తెలుగుదేశం ఎంపీలతో కలవకూడదు. వారితో కలవాలంటే ముందుగా అధినేత జగన్ అనుమతి ఉండాలి. అసలివన్నీ ఎందుకు తెలుగుదేశం వారంటే వ్యక్తిగతంగా శత్రువులే అన్నట్లు వ్యవహరించాలి. ఇది వైసీపీ ఎంపీలకు ఒక లక్మణరేఖ. అది దాటడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కానీ లావు కృష్ణ దేవరాయులు మాత్రం వాటన్నిటినీ బేఖాతరు చేసి తెలుగుదేశం ఎంపీలతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి విందు సమావేశాల్లో పాల్గొంటున్నారు.  లావు శ్రీకృష్ణదేవ‌రాయ‌లు మంగ‌ళ‌వారం టీడీపీ ఎంపీల‌తో క‌లిసి క‌నిపించారు.   టీడీపీ సీనియ‌ర్ నేత‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి  నివాసానికి వెళ్లారు. అక్కడ టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు కేశినేని, గ‌ల్లా జ‌య‌దేవ్‌, కింజ‌రాపు రామ్ మోహ‌న్ నాయుడులతో కలిసి గ్రూప్ ఫొటోకు ఫోజిచ్చారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కొంత మంది యువ ఎంపీలు కూడా ఉన్నారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, వైసీపీ ఎంపీ లావుల‌తో పాటు డీఎంకేకు   ఎంపీ  క‌నిమొళి, త‌మిజాచ్చి తంగ‌పాండియ‌న్‌, క‌థిర్ ఆనంద్‌, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివ‌సేన ఎంపీ ధైర్యశీల్ మానే త‌దిత‌రులు కూడా ఉన్నారు. వారందరికీ కేశినేని నాని విందు ఇచ్చారు. అయితే లావు శ్రీకృష్ణ దేవరాయులుకు వైసీపీలో ఎటువంటి ప్రాధాన్యతా గుర్తింపు లేకపోవడం వల్లనే ఆయన గీత దాటుతున్నారనీ, పక్క చూపులు చూస్తున్నారనీ వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఏది ఏమైనా వైసీపీలో వస్తున్న మార్పునకు శ్రీకృష్ణ దేవరాయులు తెలుగుదేశం ఎంపీలతో సన్నిహితంగా మెలగడం ఒక నిదర్శనంగా చెప్పవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎవ‌రికి ఎవ‌రు.. చివ‌రికి ఎవ‌రు?!

ఇద్ద‌రిని విడ‌గొట్టి త‌ర‌వాత చూస్తాలేన‌న్నాట్ట.. అలా ఉంది కేంద్రం తంతు. తెలుగు  రాష్ట్రాలకు ఆర్ధిక మ‌ద్దతు విష‌యంలో తెలంగాణాకు రుణ నిబంధ‌న‌ల చ‌ట్రంలో బిగించి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఈ విష‌యం లో కాస్తం త ఇబ్బందులు స‌డ‌లించి ఇరు రాష్ట్రాల మ‌ధ్య లేని విభేదాల‌కూ దారితీయిస్తున్న‌ట్టే క‌న‌ప‌డు తోంది.  పాల‌నాప‌ర స‌మ‌స్య‌లు లేక‌పోయినా రాష్ట్రం ఆర్ధిక‌ప‌ర స‌మ‌స్య‌ల్ని అధిగ‌మించేందుకు రుణాలు తెచ్చు కోను ఉన్న ప‌రిమితి అధిగ‌మించ‌లేదు. అయినా కేంద్రం రుణం విష‌యంలో అడ్డంకులు చెబుతూ కేసీఆర్ ప్ర‌భుత్వం ఒక్క‌డుగు ముందుకు వేయ‌డానికి వీలు క‌ల్పించ‌క‌పోవ‌డ‌మే ఆశ్చ‌ర్య‌ప‌రు స్తున్న అంశం. ఈ కార‌ణంగా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై విప‌రీత ప్రభావం ప‌డ‌వ‌చ్చన్న ఆం దోళ‌నా ఎక్కువ‌యింది. కేసీఆర్ ఢిల్లీ యాత్ర‌లో అక్క‌డి రాష్ట్ర‌ అధికారుల‌తో సమా లోచ‌న జ‌రిపారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్య దర్శి రజత్‌కుమార్‌తో పాటు  వివిధ శాఖల అధికారులతో  ఆయన  సుదీర్ఘంగా చర్చించారు.  వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసే రుణాలను కూడా రాష్ట్రాల అప్పుల కిందే పరిగణిస్తామని, ఒక ఏడాది ఎఫ్ ఆర్ బీఎం పరిమితిని ఉల్లంఘిస్తే  ఆ మొత్తాన్ని తర్వాత ఏడాది రుణ పరిమితిలో సర్దుబాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో స్పష్టం చేశారు.  కేసీఆర్ ప్ర‌భ‌త్వం ఆ ప‌రిమితిని ఉల్లంఘించి త‌మ స్వంత ప‌థ‌కాల అమ‌లుకే వినియోగించింది. కానీ అద‌న‌పు రుణ‌సాయం కోసం చేస్తు న్న అభ్య‌ర్ధ‌న‌ల‌ను కేంద్రం తోసిపుచ్చింది. కేంద్రం రుణాల మీద ప‌రిమితి విధిస్తే ప్రాజెక్టులు ఆల‌స్యమ వుతాయేగాని రాష్ట్రానికి పెద్ద న‌ష్ట‌మేమీ ఉండ‌ద‌ని అధికారులు వివ రించారు. అంతేగా ఇప్పుడు ఆరు వేల కోట్ల రాబ‌డం వ‌చ్చినందువ‌ల్ల ఆదాయం విష‌యంలో ఖంగారుప‌డ వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని తెలం గాణా ముఖ్య‌మంత్రికి ధైర్యం నూరిపోశారు. కానీ  పార్ల‌మెంటులో విప‌క్షాల తో స్నేహంగా ఉండి రాష్ట్ర ప్ర‌యోజ‌నా ల‌ను కాపాడేలా వ్య‌వ‌హ‌రించాల‌ని కేసీఆర్ ఎంపీల‌ను సూచిం చారు.  ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే మంగ‌ళ‌వారం ఆర్బీఐ నిర్వ‌హించిన సెక్కూరిటీల వేలంలో పాల్గొన్న జ‌గ‌న్ స‌ర్కారు రూ.2 వేల కోట్లు అప్పు తెచ్చ‌కుంది. ఇందులో  వెయ్యికోట్ల‌పై 7.79 శాతం, ఇంకో వెయ్యి కోట్ల‌పై 8.04 శాతం వడ్డీ అమలైంది. దీంతో ఏప్రిల్‌ నుంచి జూలై 26వ తేదీ వరకు సర్కార్‌చేసిన అప్పులు 39,603 కోట్లకు చేరాయి.  ఈ ఆర్ధిక సంవ‌త్స‌రం ఏప్రిల్ నాటికి కేంద్రం రాష్ట్ర ప్ర‌బుత్వాల‌కు  అప్పుల‌కు అనుమ‌తివ్వ‌కున్న‌ప్ప‌టికీ ఏపీ రూ.4,390 కోట్లు అప్పు తెచ్చింది.  దీని సారాంశ‌మేమి గురువ‌ర్యా.. అంటే శిష్యా పెద్ద‌వాడు అతిగా ప్రేమిస్తే ఏది ఎలాగైనా సాధించుకోవ‌చ్చు.. అనేది ఏపీ ప్ర‌భు త్వం రుజువు చేసిం ది. కేంద్రంతో చెలిమికి ఇంత‌కంటే సాక్ష్యం మ‌రోటి అవ‌స‌రం లేదు. మొద‌టి ఏపీకి  రూ.28వేల  కోట్ల‌కు అనుమ‌తించింది. ఆ త‌ర్వాత ఊహాతీతంగా దాన్ని రూ.44,574 కోట్లకు పెంచింది. దీనికి ముందే  ఏపీ స‌ర్కార్ అనేక మార్గాల్లో ప‌రిమితికి మించి అప్పులు చేసింది కానీ కొత్త ప‌రిమితి మాత్రం మిన‌హాయించ లేదు. కేవ‌లం రూ.771కోట్ల మాత్ర‌మే మినహాయించి, పరిమితిని రూ.43,803 కోట్లుగా నిర్ణయించింది. ఇలా  జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ట్ల మోదీ ప్ర‌భుత్వం అపార ప్రేమ ను ప్ర‌క‌టించు కుంది.  ఏపీ సర్కార్  ఇంత‌టితో స‌రిపెట్టుకోలేదు  మ‌రో రెండువేల‌ కోట్లు నాబార్డు నుంచి తెచ్చుకునేం దుకు ప్రత్యేకంగా అనుమతిచ్చారు. దీని ర‌హ‌స్య‌మేమిటో కేంద్రానికే తెలియాలి. నాబార్డు రుణాలు కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలోకే వస్తాయి. అయినా సరే, కేంద్రం ఆ మొత్తానికి  అదనపు అనుమతి ఇవ్వడం గమనార్హం.  మొత్తానికి కేంద్రం రెండు రాష్ట్రాల అప్పులు, మ‌ద్ద‌తు విష‌యాల్లో దొంగాట ఆడుతూ రాజ‌కీయ‌, ఆర్ధిక‌ప‌ర విరోధ ఆలోచ‌న‌ల‌కు బీజం వేస్తోంద‌నే అనుకోవాలి.  రానున్న‌కాలం దీనికి స‌మాధానం చెప్పాల‌నే ఇరు రాష్ట్ర ప్ర‌జ‌లూ భావిస్తున్నారు.

ముర్ము విజయోత్సవ సభకు తప్పతాగి వచ్చిన కమలం నేత

క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత అంటూ ఘనంగా చెప్పుకునే బీజేపీ అసలు రంగు ఏమిటన్నది గుజరాత్ సాక్షిగా తేటతెల్లమైపోయింది. భారత రాష్ట్రపతిగా గిరి పుత్రిక ముర్మ పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భాన్నిపురస్కరించుకుని గుజరాత్ లోని గిరిజన ప్రాబల్యం అధికంగా ఉండే చోటౌడేపూర్ లో విజయోత్సవ సభ నిర్వహించింది బీజేపీ. భారత ప్రథమ పౌరురాలిగా గిరిపుత్రికను పీఠం ఎక్కించిన క్రెడిట్ ను పూర్తిగా సొంతం చేసుకునే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే గుజరాత్ లోని చోటౌడ పూర్ లో కూడా బీజేపీ విజయోత్సవ సభ నిర్వహించింది. అంత వరకూ బాగానే ఉంది.   ఆ విజయోత్సవ సభకు హాజరైన గుజరాత్ మంత్రి, బీజేపీ నాయకుడు నిమిషా సుతార్ తప్పతాగి హాజరయ్యారు. అలాగే సభకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రష్మాకాంత్ వాసవ కూడా హాజయర్యారు. ఆయన హాజరవ్వడం విశేషం కాదు కానీ.. తప్పతాగి హాజరు కావడమే ఇప్పడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడానికి కారణమైంది. సభా స్థలికి వచ్చి కారు దిగడమే తూలుతూ వచ్చిన ఆయన సభా వేదికపై కూడా పరిసరాలను గమనించే స్ఫృహ లేని స్థితిలో ఉన్నారు. పక్కను మహిళా మంత్రి ఉన్నారన్న స్ఫృహ కూడా లేనంతగా మత్తులో మునిగిపోయారు. విజయోత్సవ సభ ప్రారంభమైనది మొదలు, ముగిసే వరకూ ఆయన కళ్లు తెరిచింది లేదు. వేదికపై తూగుతూ ఊగుతూనే కూర్చున్నారు. ఇందుకు సంబంధించి  వీడియోలు వైరల్ అయ్యాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతండటంతో గుజరాత్ బీజేపీ ప్రతిష్ట మసక బారింది. దీంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు రష్మీకాంత్ ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం పాలనలో ఉన్న రాష్ట్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడి నిర్వాకం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ సర్కార్ గుజరాత్ లో మద్య నిషేధం అమలు చేస్తున్నామని ఘనంగా చెప్పుకోవడం కాదు.. అది నిజంగా అమలు అవుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సంఘటనపై విపక్షాలు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. బీజేపీ దంతా పేరు గొప్ప ఊరు దిబ్బ చందమే ననడానికి రష్మీకాంత్ ఉదంతమే నిదర్శనమని అంటున్నారు. 

ప్ర‌శ్నిస్తే .. మండిపాటు!

పాల‌న బాగుంటే ప్ర‌జ‌లు  ప్ర‌శ్నించ‌రు. పాల‌న‌లో లోపాల్ని, ప్ర‌జాసంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో లోపాల్ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తారు. దానికి స‌ర‌యిన వివ‌ర‌ణా బాధ్య‌తా ప్ర‌భుత్వానిదే. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి  బొత్స స‌త్యనారాయ‌ణ అందుకు చాలా భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న్ను ఎవ‌రు విద్యావిధానాన్ని ప్ర‌శ్నించినా అది మీకు సంబంధించిన‌ది కాదంటున్నారు. పైగా టీచ‌ర్లు, ట్రాన్స‌ఫ‌ర్ల  విష‌యం ప్ర‌భుత్వానికి సంబంధించిన‌ది  కానీ చీటికీ మాటీకీ దాన్ని గురించి అడ‌గ‌వ‌ద్ద‌ని చిరాకుప‌డ‌టం చూస్తున్నాం. టీచ‌ర్ల‌కు సంబంధించింది టీచ‌ర్లు, వారి యూనియ‌న్‌వారు అడ‌గ‌క పుర‌పా ల‌క ప‌నులు చేసేవారు అడుగుతారా?  ఎన్న‌డూ లేనివిధంగా మంచి సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతున్నామ‌ని, క్లాసుకు విద్యార్ధులు ఉన్న సంఖ్య‌కు త‌గ్గ‌ట్టుగానే ఉపాధ్యాయులు ఉండ‌డం అనాదిగా ఉన్న‌ద‌ని పెద్ద ఉపోద్ఘాత‌మే ఇస్తున్నారు మంత్రి వర్యు లు. పైగా ప్ర‌భుత్వపాఠ‌శాల‌ల‌ను గురించి ప్ర‌శ్నించే బ‌దులు ప్రైవేటు స్కూళ్ల‌ప‌ట్ల  మీ వ్యామోహం దేనిక‌ని ఎదురు ప్ర‌శ్న‌లూ సంధించారు. కానీ  అదే ప్ర‌శ్న ప్ర‌జ‌ల నుంచి వ‌స్తే మాత్రం త‌ప్పించుకునే మార్గాలు స‌వాల‌క్ష వెతుక్కుంటున్న‌ది ప్ర‌భుత్వం.  ప్రభుత్వం సైతం అమ్మ ఒడిని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపచేయడం ద్వారా ఏమి సందేశం ఇస్తోందని కూడా జనాల నుంచి సూటిగానే ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ప్రైవేట్ లో చదువుకున్నా అభ్యంతరం లేదనే కదా. మరి అలాంటపుడు కేవలం టీచర్లనే టార్గెట్ చేస్తూ మంత్రి గారు విమర్శలు చేయడంతో సహేతుకత ఎంతవరకూ ఉంది అని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక టీచర్లు అడిగింది తమ బిడ్డల గురించి కాదు అని మంత్రి గారే అంటున్నారు. ఆ బడుగుల బిడ్డల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది అన్నపుడు వారికి పాఠశాల  విలీనం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కూడా గుర్తించాలి కదా అన్న మాట వస్తోంది. మొత్తానికి చూస్తే బొత్స ఒక మాట అనడం కాదు కానీ ఇపుడు దాని మీద అనేకానేక ప్రశ్నలు వచ్చేశాయి. అన్నింటికీ త‌ల ఆడిస్తూ అన్నీ విన్నాను, అన్నీ చేస్తాం, ప‌రి స్థితులు  తెలిసీ ప్ర‌శ్నించ‌డంలో అర్ధంలేద‌న్న ధోర‌ణినే ప్ర‌భుత్వం అవ‌లంబిస్తోంది. రాను రాను కొర‌క రాని కొయ్య‌లా మారుతున్న ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌లు న‌మ్మ‌కం కోల్పోతున్నారు. ఎంతో కీల‌క‌మైన విద్యా రంగాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌డం జ‌గ‌న్ పాల‌న‌ను విస్ప‌ష్టం చేస్తున్న‌ది. 

‘ఉచితం’ ఉచితమేనా?.. ఆన్నీ ఫ్రీ హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

దేశ భవిష్యత్, రాష్ట్రాల భవిష్యత్ ను పణంగా పెట్టి కేవలం అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కొన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో ‘అన్నీ ఉచితం’ అంటూ గుప్పిస్తున్న హామీలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు ఇచ్చే ‘ఉచిత’ హామీలను అరికట్టే మార్గం లేదా అని ఎన్నికల సంఘాన్ని సూటిగా ప్రశ్నించింది. అందుకు ఎన్నికల సంఘం అది మా చేతిలో లేదని సమాధానం ఇవ్వడంతో కేంద్రాన్ని కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. వాస్తవానికి ‘ఉచిత’ హామీలు ఇవ్వడం ఒక విధంగా క్విడ్ ప్రోకో కిందకే వస్తుందని మేధావులు చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. మాకిది..మీకిది అన్నట్లుగా మాకు ఓటేస్తే.. మీకన్నీ ఉచితమే అనడం ఓటర్లను ప్రలోభ పెట్టడమే ఔతుందన్న మేధావుల మాటలను పార్టీలు పట్టించుకోవడం లేదు. ‘ఉచిత’ హామీలను నెరవేర్చడం కోసం జనంపై పన్నుల వడ్డింపులు, మద్యం విక్రయాల ఆదాయంపైనే ప్రభుత్వాలు ఆధారపడటం వంటి చర్యలతో సామాన్య జనం మనుగడను కష్టాల పాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా సరే ఉచిత హామీలు అధికారానికి అడ్డదారిగా భావిస్తున్న పార్టీలు అవే హామీలను గుప్పిస్తూ అధికారానికి నిచ్చెనలు వేస్తున్నారు. ఈ ఉచిత హామీలకు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉందన్న చర్చ చాలా కాలంగా సాగుతూనే ఉంది. అన్నీ ఉచితం అంటూ  ఖజనా ఖాళీ చేస్తూ దేశ భవిష్యత్ ను అంధకారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటూ  సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు వ్యవహారం తమ చేతుల్లో లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చేసింది. ‘ఉచిత’ హామీలను విశ్వసించి ఓటేయడంలోని ఉచితానుచితాలను తెలుసుకోవలసింది ఓటర్లేనని బదులిచ్చింది.  దాంతో   కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీం  కోరింది.    ఉచిత పథకాలపై రాష్ట్రాలు వెచ్చించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆయా రాష్ట్రాలకు రెవెన్యూ కేటాయింపులను నియంత్రించే అవకాశం ఉందా అని కూడా   సుప్రీం కోర్టు ప్రశించింది. కాగా ఈ విషయంలో ఏం చేయాలన్న దానిపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అభిప్రాయాన్ని కోరింది.  ఉచిత హామీలతో ఎన్నికలకు వెళ్లే పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ వచ్చే నెల 3కు వాయిదా పడింది. ఇటీవల ఓ కార్యక్రమంలో  ప్రధాని నరేంద్ర మోడీ ఉచితాలు అనుచితం  వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం  రాష్ట్రాలకు చెక్ పెట్టేలా  ఆర్ధిక సంఘానికి  సిఫారసు చేస్తే  ఆల్ ఫ్రీ అంటూ అధికారానికి నిచ్చెనలు వేసే పార్టీలకు ఇక కాలం చెల్లినట్లే.