ఎవరికి ఎవరు.. చివరికి ఎవరు?!
posted on Jul 27, 2022 @ 11:24AM
ఇద్దరిని విడగొట్టి తరవాత చూస్తాలేనన్నాట్ట.. అలా ఉంది కేంద్రం తంతు. తెలుగు రాష్ట్రాలకు ఆర్ధిక మద్దతు విషయంలో తెలంగాణాకు రుణ నిబంధనల చట్రంలో బిగించి, ఆంధ్రప్రదేశ్‌కు ఈ విషయం లో కాస్తం త ఇబ్బందులు సడలించి ఇరు రాష్ట్రాల మధ్య లేని విభేదాలకూ దారితీయిస్తున్నట్టే కనపడు తోంది. పాలనాపర సమస్యలు లేకపోయినా రాష్ట్రం ఆర్ధికపర సమస్యల్ని అధిగమించేందుకు రుణాలు తెచ్చు కోను ఉన్న పరిమితి అధిగమించలేదు. అయినా కేంద్రం రుణం విషయంలో అడ్డంకులు చెబుతూ కేసీఆర్ ప్రభుత్వం ఒక్కడుగు ముందుకు వేయడానికి వీలు కల్పించకపోవడమే ఆశ్చర్యపరు స్తున్న అంశం. ఈ కారణంగా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై విపరీత ప్రభావం పడవచ్చన్న ఆం దోళనా ఎక్కువయింది. కేసీఆర్ ఢిల్లీ యాత్రలో అక్కడి రాష్ట్ర అధికారులతో సమా లోచన జరిపారు. సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్య దర్శి రజత్‌కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసే రుణాలను కూడా రాష్ట్రాల అప్పుల కిందే పరిగణిస్తామని, ఒక ఏడాది ఎఫ్ ఆర్ బీఎం పరిమితిని ఉల్లంఘిస్తే ఆ మొత్తాన్ని తర్వాత ఏడాది రుణ పరిమితిలో సర్దుబాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభత్వం ఆ పరిమితిని ఉల్లంఘించి తమ స్వంత పథకాల అమలుకే వినియోగించింది. కానీ అదనపు రుణసాయం కోసం చేస్తు న్న అభ్యర్ధనలను కేంద్రం తోసిపుచ్చింది. కేంద్రం రుణాల మీద పరిమితి విధిస్తే ప్రాజెక్టులు ఆలస్యమ వుతాయేగాని రాష్ట్రానికి పెద్ద నష్టమేమీ ఉండదని అధికారులు వివ రించారు. అంతేగా ఇప్పుడు ఆరు వేల కోట్ల రాబడం వచ్చినందువల్ల ఆదాయం విషయంలో ఖంగారుపడ వలసిన అవసరం లేదని తెలం గాణా ముఖ్యమంత్రికి ధైర్యం నూరిపోశారు. కానీ పార్లమెంటులో విపక్షాల తో స్నేహంగా ఉండి రాష్ట్ర ప్రయోజనా లను కాపాడేలా వ్యవహరించాలని కేసీఆర్ ఎంపీలను సూచిం చారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన సెక్కూరిటీల వేలంలో పాల్గొన్న జగన్ సర్కారు రూ.2 వేల కోట్లు అప్పు తెచ్చకుంది. ఇందులో వెయ్యికోట్లపై 7.79 శాతం, ఇంకో వెయ్యి కోట్లపై 8.04 శాతం వడ్డీ అమలైంది. దీంతో ఏప్రిల్ నుంచి జూలై 26వ తేదీ వరకు సర్కార్‌చేసిన అప్పులు 39,603 కోట్లకు చేరాయి. ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నాటికి కేంద్రం రాష్ట్ర ప్రబుత్వాలకు అప్పులకు అనుమతివ్వకున్నప్పటికీ ఏపీ రూ.4,390 కోట్లు అప్పు తెచ్చింది. దీని సారాంశమేమి గురువర్యా.. అంటే శిష్యా పెద్దవాడు అతిగా ప్రేమిస్తే ఏది ఎలాగైనా సాధించుకోవచ్చు.. అనేది ఏపీ ప్రభు త్వం రుజువు చేసిం ది. కేంద్రంతో చెలిమికి ఇంతకంటే సాక్ష్యం మరోటి అవసరం లేదు. మొదటి ఏపీకి రూ.28వేల కోట్లకు అనుమతించింది. ఆ తర్వాత ఊహాతీతంగా దాన్ని రూ.44,574 కోట్లకు పెంచింది. దీనికి ముందే ఏపీ సర్కార్ అనేక మార్గాల్లో పరిమితికి మించి అప్పులు చేసింది కానీ కొత్త పరిమితి మాత్రం మినహాయించ లేదు. కేవలం రూ.771కోట్ల మాత్రమే మినహాయించి, పరిమితిని రూ.43,803 కోట్లుగా నిర్ణయించింది. ఇలా జగన్ ప్రభుత్వం పట్ల మోదీ ప్రభుత్వం అపార ప్రేమ ను ప్రకటించు కుంది. ఏపీ సర్కార్ ఇంతటితో సరిపెట్టుకోలేదు మరో రెండువేల కోట్లు నాబార్డు నుంచి తెచ్చుకునేం దుకు ప్రత్యేకంగా అనుమతిచ్చారు. దీని రహస్యమేమిటో కేంద్రానికే తెలియాలి. నాబార్డు రుణాలు కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలోకే వస్తాయి. అయినా సరే, కేంద్రం ఆ మొత్తానికి అదనపు అనుమతి ఇవ్వడం గమనార్హం.
మొత్తానికి కేంద్రం రెండు రాష్ట్రాల అప్పులు, మద్దతు విషయాల్లో దొంగాట ఆడుతూ రాజకీయ, ఆర్ధికపర విరోధ ఆలోచనలకు బీజం వేస్తోందనే అనుకోవాలి. రానున్నకాలం దీనికి సమాధానం చెప్పాలనే ఇరు రాష్ట్ర ప్రజలూ భావిస్తున్నారు.