కామన్‌వెల్త్ పతకం చేజారినట్టేనా?
posted on Jul 27, 2022 @ 4:33PM
ఒక అద్భుత ప్రదర్శన, ఒక ఘన విజయం తర్వాత ఊహించని పరిణామాలు దేశ ఆశల్ని అడియాసలే చేస్తాయి. నీరజ్ చోప్రా విషయంలో ఇదే జరిగింది. ఈమధ్యనే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజ తం సాధించి దేశానికి ఘనకీర్తి తెచ్చిన జావెలిన్ త్రోయర్ గాయపడ్డాడు. మరి కామన్‌వెల్త్ గేమ్స్ పతకం చేజారినట్టే భావించాలా?
త్వరలో బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో చోప్రా స్వర్ణం సాధించి దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తెస్తాడని దేశ ప్రజలంతా ఆశిం చారు. కానీ తొడ గాయం కారణంగా కామన్‌వెల్త్‌గేమ్స్‌లో పాల్గొనడం లేదన్నవార్త ఒక్కసారిగా అందరిని నీరసపరిచింది. 24 ఏళ్ల నీరజ్‌గాయం కారణంగానే పాల్గొనడం లేదని భారత ఒలింపిక్ సంఘం ప్రకటిం చింది.
అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో జావెలిన్ విసిరే సమయంలో నీరజ్ తొడ గాయం తో బాధపడ్డాడు. అది మానకపోవడంతో ఇక కామన్‌వెల్త్ గేమ్స్‌కు కష్టమని చోప్రా తెలియ జేయడం అంద రినీ నిరాశకు గురిచేసింది. అతనికి ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ చేయించారు. అయితే, నెలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారని మెహతా తెలిపాడు. కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాక ధారిగా నీరజ్ వ్యవహరించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళా క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. ఆంధ్ర కు చెందిన సబ్బినేని మేఘనతో పాటు పూజా వస్త్రాకర్ పాజిటివ్‌గా తేలారు. దీంతో వారు స్వదేశం లోనే ఉండిపోవలసి వచ్చింది. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్ వెళ్లింది. ముందుగా ఒక్కరే అనుకున్నప్పటికీ ఆ తర్వాత పరీక్షలో మరో క్రికెటర్ కూడా పాజిటివ్‌గా తేలిం దని ఐఓఏ తెలిపింది. ప్రొటోకాల్ ప్రకారం ఈ ఇద్దరికి నెగెటివ్ రిజల్ట్ వచ్చాకే జట్టుతో కలుస్తారు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే భారత్ తొలి మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడకపోవచ్చు.