అఖిలేష్‌తో కేసీఆర్ దోస్తానా!

మహారాజును గ‌ద్దె దింప‌డానికి, రాజ్యం కైవ‌సం చేసుకోవ‌డానికి సైన్యాధిప‌తే కుట్ర‌చేసి ఒక మ‌హామాంత్రి కుడితోనో, ప‌క్క రాజ్యం పాలేరుతోనో జోడీ క‌ట్టి సాధించాలనుకుంటాడు. కానీ అది జ‌ర‌గ‌దు.. అది సినిమా.. ఇక్క‌డ రాజ‌కీయాల్లో అందులో స‌గ భాగ‌మే జ‌రుగుతుంది. శ‌తృవు శ‌తృవుకి మిత్రుడ‌వుతాడు. ఇది ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు బాగా వ‌ర్తిస్తుంది. తెలంగాణా ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌,   ఢిల్లీ యాత్రంలో స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాద‌వ్‌తో స‌మావేశ‌మ‌య్యారు. కేంద్రంలో బీజేపీ నాయ‌క‌త్వంలోని ప్ర‌భ‌త్వం మీద చాలారోజులుగా కారాలుమిరియాలూ నూరుతూనే ఉన్న‌వారు క‌లిసి ప‌నిచేయ‌డం తాడు బ‌ల‌మై కుర్చీలాగేసి ప్ర‌భుత్వాన్ని దించేయ‌వచ్చ‌న్న ఆలోచ‌న‌తో ముంద‌డుగు వేయ‌డం మంచిద‌నుకున్నారు.మోదీ స‌ర్కార్ మీద ఇప్ప‌టికే   మండిప‌డుతున్న వారితో జోడీ క‌ట్టాల‌ని కేసీఆర్ ఆ మ‌ధ్య చేసిన విశ్వ‌య‌త్నాలు దెబ్బ‌తిన్నాయి. కానీ ఆయ‌న ల‌క్ష్యం, పట్టుద‌ల‌లో ఏమాత్రం వేగం త‌గ్గ‌లేదు. కేంద్రం బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ప‌ట్ల ప్ర‌ద‌ర్శిస్తున్న చిన్న‌చూపుతో రాష్ట్రాలు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నాయ‌న్న విశ్లేష‌కుల అభిప్రాయాల‌కూ కేసీఆర్ ఆజ్యం పోస్తున్నారు.  ముంద‌డుగు వేయ‌డానికి ఎస్పీతో క‌ల‌వ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌న్న న‌మ్మ‌కంతో ముంద‌డుగు వేశారు. ఆమ‌ద్య బీజేపీయేత‌ర పార్టీల‌ను క‌లుపుకోని మోదీపై యుద్ధం ప్ర‌క‌టించాల‌న్న ఆతృత‌తో బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని కూడా క‌లిసి చ‌ర్చించారు. కానీ స‌మావేశాలు, వారి ఆలోచ‌న‌ల క‌ల‌యిక బెడిసికొట్టింది. ఆమె విప‌క్షాల‌న్నింటికీ నాయ‌క‌త్వం వ‌హించాల‌న్న ఆతృత బాగా ప్ర‌ద‌ర్శించ‌డం బ‌హుశా విప‌క్ష నేత‌ల మ‌ధ్య దూరం స్ప‌ష్టం చేసి ఉండ‌వ‌చ్చు. ఇదిలా ఉండ‌గా,  టీఆర్‌ఎస్‌, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. సీఎం కేసీఆర్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చారు. కేసీఆర్‌ తుగ్లక్‌ రోడ్‌లోని తన నివాసంలో అఖిలేశ్‌, ఎస్పీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌లకు మధ్యాహ్నం విందును ఏర్పాటు చేశారు.  అయితే వీరిద్ద‌రూ స్నేహపూర్వ‌కంగా క‌లిసిన‌ప్ప‌టికీ కేంద్రంప‌ట్ల వ్య‌వ‌హరించాల్సిన వ్యూహ ర‌చ‌న చేశా ర‌నే అనుమానాలూ రాజ‌కీయ విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు. పార్ల‌మెంటులో కేంద్రంపై ఏ విధంగా విరు చుకుప‌డాల‌న్న అంశాన్ని కీల‌కంగా చ‌ర్చించారు. వారు  జాతీయ రాజకీయాలు, ప్రతిపక్షాల పట్ల కేంద్రం వైఖరి, ఫెడరల్‌ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ సర్కా రు నిర్ణయాలు తదితర అంశాలు చ‌ర్చించార‌ని తెలుస్తోంది.  ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు గంటకు పైనే జరిగాయి. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఇతర ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తున్న విష యాన్ని కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిపక్షాలు కలిసి ఉంటేనే కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చని కేసీఆర్‌, అఖిలేశ్‌ భావించారు. అఖిలేశ్‌తో చర్చల అనంతరం కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌, జాతీయ పెన్షన్‌ పథకం, డిస్కంల  నష్టాలపై కేంద్రానికి పంపాల్సిన సమాచారం గురించి ఆయన అధికారులతో చర్చించినట్లు సమాచారం.

అట్లాంటిక్ దిగువన రంధ్రాలు ...  ఎవరు  చేశారో ?

ప‌క్కింటావిడ ముగ్గుపెడితే బ‌హుచ‌క్క‌గా ఉందే అంటుంది పెద్దావిడ‌. పోనీ ర‌ధం ముగ్గుపెట్ట‌మ‌ని అడుగు తోంది కోడ‌ల్ని. ఆమె బ‌హు సంతోషంగా అదే పెద్ద ప‌నిగా వీల‌యినంత స‌మ‌యం వెచ్చించి బ్ర‌హ్మం డంగా ముగ్గువేసి శ‌భాష్ అనిపించుకుంది.  నీళ్లు ప‌ట్టే బిందెలో న‌ల్ల‌మ‌చ్చ‌ల‌కే చిర్రెక్కుతుంది.. అది స్వ‌యంకృత‌మ‌ని కోడ‌లు బాధ‌ప‌డుతుంది. మ‌రి అట్లాంటిక్ సంద్రంలో ఎవ‌రో వ‌రుస చుక్క‌లు పెట్టిన ట్టు చిన్న‌చిన్న గుంట‌లు ఉన్నాయిట‌! ఇవి ఎలా ఏర్ప‌డ్డాయో తెలీక శాస్త్ర‌వేత్త‌లు చాలారోజులుగా చ‌ర్చించుకుంటున్నారు. సముద్ర పరిశోధకులు అట్లాంటిక్ దిగువన రహస్య రంధ్రాల శ్రేణిని కనుగొన్నారు.  వాటిని ఎవరు తయా రు చేశారో ఎవరికీ తెలియదు.  అట్లాంటిక్ మహాసముద్రంలో లోతైన అగ్నిపర్వత శిఖరం వెంట సముద్రపు అడుగుభాగంలో  కనిపించే రంధ్రాల శ్రేణి శాస్త్ర వేత్తలు సమాధానాల కోసం ఆరాట‌ప‌డుతు న్నారు. 2,540 అడుగుల లోతులో  ఉన్న ఈ రంధ్రాల మూలం ఎవరికీ తెలియదు. సముద్రం అనేది  జీవిత రహస్యాలను మాత్రమే కాకుండా ప్రత్యేకమైన వృక్ష, జంతుజాలాన్ని కూడా దాచిపెడుతుంది, ఇది క్షణాల్లో డైవ‌ర్ల‌ను చంపడానికి తగి నంత ఒత్తిడి  ఉన్న లోతుల్లో శీతల పరిస్థితులలో వృద్ధి చెందుతుంది. మహాసముద్రాల గురించి మనకు తెలి సిన దానికంటే చంద్రుని గురించి మనకు ఎక్కువ తెలుసు, కొత్త రహస్యం సముద్ర శాస్త్ర వేత్తలను అబ్బు రపరుస్తుంది. రంధ్రాలు మానవ నిర్మితంగా కనిపిస్తున్నప్పటికీ, సముద్రపు అడుగుభాగంలో వాటిని గమనించిన బృం దం వాటి చుట్టూ ఉన్న అవక్షేపాల కుప్పలు వాటిని తవ్వినట్లు సూచిస్తున్నాయని చెప్పారు. వాయేజ్ టు ది రిడ్జ్ 2022 యాత్రలో సముద్ర పరిశోధకులు వాటిని పరిశీలించడానికి ప్రయత్నించారు కానీ విజయవం తం కాలేదు. ఈ బృందం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చను ప్రారం భించింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను వారి అభిప్రాయాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఇటీవ‌ల‌ డైవ్‌లో, సముద్రపు అడుగుభాగంలో మేము అనేక సబ్ లీనియర్ రంధ్రాల సెట్‌లను చూశాము. రంధ్రాల మూలాన్ని శాస్త్రవేత్తలు క‌ను గొనడానికి య‌త్నించారు. రంధ్రాలు మానవ నిర్మితంగా కనిపిస్తు న్నాయి,  కానీ వాటి చుట్టూ ఉన్న చిన్న అవక్షేపాల కుప్పలు వాటిని త‌వ్విన‌విగా  సూచిస్తున్నాయి.  మీ ఊహ ఏమిటి?  అని వాళ్ళు అడిగారు. వారు గ్రహాంతరవాసులు,  తెలియని పీత జాతుల వరకు సము ద్రపు అడుగుభాగం నుండి పైకి లేచే వాయువు కూడా  కావ‌చ్చున‌నీ అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రత్యేకమైన రంధ్రాలను కనుగొనడం ఇదే మొదటిసారి కాదని ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ సంస్థ పేర్కొంది. తిరిగి జూలై 2004లో, ఉత్తర మిడ్-అట్లాంటిక్ రిడ్జ్ వెంబడి ఒక యాత్రలో 2,082 మీటర్ల (6, 831 అడుగులు) లోతులో అన్వేషిస్తున్న ప్పుడు, అలాంటి అనేక రంధ్రాల సెట్లు కూడా గుర్తించబడ్డా యి. శాస్త్రవేత్తలు అప్పుడు, ఒక కాగితంలో, ఈ ప్రత్యేకమైన శిల్పాలను హైలైట్ చేసారు.  ఈ అసాధారణ రం ధ్రాలు మధ్య-సముద్ర శిఖరం పర్యావరణ వ్యవస్థల గురించి మన ప్రాథమిక అవగాహనలో ఉన్న అంత రాలను ఎలా సూచిస్తాయి. వారు ఈ రంధ్రాలను లెబెన్స్‌పురెన్  అని పిలి చారు, దీనిని జర్మన్‌లో  జీవిత జాడలని అంటారు. సముద్ర నిపుణులు ఈ రంధ్రాలను ఏమని అంచనా వేస్తారో చూడటం ఆసక్తి కరంగా ఉంటుంది, ఇవి ఉపరితలం క్రింద చాలా పెద్ద లోతులకు తెరుస్తాయా లేదా సముద్ర శాస్త్రాన్ని కొత్త దిశ లోకి తీసి కెళ‌తాయేమో చూడాలి. 

అమ్మ భక్తుడు.. కమలం గూటికి?!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత భక్తుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పార్టీ మారనున్నారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీలో పన్నీరు సెల్వం పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారైంది. అన్నా డీఎంకేలో పురుచ్చీ తలైవీ జయలలిత ఫోటోలు తప్ప ఆమె అనుయాయులకు స్థానం లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఆమెకు విదేయులుగా ఉన్న వారిని ఒక పథకం ప్రకారం పక్కన పెట్టేయడానికి కార్యాచరణ ఆరంభమైందని అంటున్నారు. పార్టీని మొత్తం తన కనుసన్నలలో నడిపిన జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఓట్ల కోసం ఆమె ఫొటో మాత్రమే అవసరంగా కనిపిస్తోందనీ, ఆమె ఆశయాలను పక్కన పెట్టేశారనీ పలువురు అంటున్నారు. ఇప్పుడు ఆమె భక్తుడు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా అదే అంటున్నారు. అందుకే తను అన్నాడీఎంకేను వీడనున్నట్లు సంకేతాలు కూడా ఇస్తున్నారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత, అమ్మ భక్తుడిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పన్నీరు సెల్వం త్వరలోనే కాషాయ గూటికి చేరనున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు నిదర్శనంగా కాంచీపురంలో పన్నీరు సెల్వం వర్గీయులు ఏర్పాటు చేసిన ఓ భారీ కటౌట్ లో మోడీ బొమ్మ ఉండడాన్ని చూపుతున్నారు. బీజేపీ గూటికి చేరుతున్నట్లుగా సంకేతాలివ్వడానికే ఆ హోర్డింగ్ ఏర్పాటు చేశారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ హోర్డింగ్ ఏర్పాటు చేసిన సందర్భమేమిటంటే.. చెస్ ఒలింపియాడ్ ప్రారింభించేందుకు ప్రధాని మోడీ చెన్నై వస్తున్నందుకు. చెన్నై వస్తున్న మోడీకి ఆహ్వానం పలుకుతూ పన్నీర్ సెల్వం వర్గీయులు ఆ హోర్డింగ్ ను ఏర్పాటు చేశారు.  అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరులో   మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామిది పై చేయి కావడం, మరో మాజీ సీఎం పన్నీరు సెల్వంకు ఉద్వాసన పలకడం వంటి సంఘటలను విదితమే. ఈ నేపథ్యంలోనే పళని స్వామి కమలం గూటికి చేరనున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

భలే మాంచి చౌక బేరము.. సింహాలను అతి తక్కువ ధరకు అమ్మేస్తున్న పాక్

పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభ తీవ్రతకు అద్దం పట్టే ఉదంతమింది. ఆ దేశంలో నిత్యావసరాలు ఆశాసానికి అంటుతున్నాయి. సామాన్య జనం బతకడానికే రోజూ లాటరీ కొట్టాల్సిన పరిస్థితి ఉందని అంతర్జాతీయ మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురిస్తోంది. ఆ దేశంలో మనుషులకే అంతటి దురవస్థ ఉంటే ఇక జంతువుల పరిస్థితి గురించి చెప్పనే అక్కర్లేదు. అందులోనూ జంతు ప్రదర్శన శాలలను ఎలా నిర్వహిస్తున్నారు. అందులోని వన్య ప్రాణులకు తిండి ఎలా పెడుతున్నారు అన్న సందేహం రాక మానదు. ఆ సందేహానికి వాళ్లేం చేస్తున్నారో తెలిస్తే సమాధానం దొరుకుతుంది. జూలో జంతువులను అయిన కాడికి అమ్మేస్తున్నారు. ఔను ఇది నిజం. పత్రికలలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి మరీ విక్రయాలు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు  వచ్చి జంతువులను కొనుక్కోండొహో అని చాటింపూ వేస్తున్నారు. ఇందుకు లాహోర్ లోని ఓ జూ ఇచ్చిన ప్రకటనే ప్రత్యక్ష సాక్ష్యం లాహోర్ లో లయన్ సఫారీ జూ ఉంది. అది 142 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో దాదాపు 40 సింహాలూ, ఇతర వన్య ప్రాణులూ ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ జూ నిర్వహణ కష్టం అవ్వడంతో జూలో జంతువులు ఆకలితో అలమటించి ప్రాణాలు కొల్పోయే పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ జూ సింహాలను విక్రయానికి పెట్టింది. వాటి విక్రయంతో వచ్చిన సొమ్ముతో కనీసం ఇతర వన్య ప్రాణులనైనా బతికించుకోవచ్చని తలపోసింది. వెంటనే ఆచరణలో పెట్టేసింది. జూలోని మొత్తం సిహాలలో 15 సింహాలను విక్రయించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఒక్కో సింహం ధర 1.5లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఈ ధర పాకిస్థాన్ లో గేదెల ధర కంటే తక్కువ. దీంతో పలువురు సంపన్నులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. 

30ఏళ్ల క్రితం మృతి.. ఇటీవ‌లే పెళ్లి!

పిల్ల‌ల‌కు పెళ్లిచేసి క‌ల‌కాలం సుఖంగా, ఆయురారోగ్యాల‌తో ఉండాల‌నే  స‌మ‌స్తం దీవిస్తారు. ఇదే  మ‌న సంప్రదాయం. అందులో ఆ రెండు కుటుంబాలే కాదు బంధువ‌ర్గం, స్నేహితులూ, హితులూ,  కాస్తంత ప‌రిచ‌యం ఉన్న చుట్టుప‌క్క‌ల‌వారూ  ఒక‌విధంగా  భాగ‌స్వాములే. వారి ఆనందాన్ని క‌ళ్లారా చూడాల‌నే అనుకుంటారు.  అయితే క‌న్న‌డ సంప్ర‌దాయంలో మ‌రో విచిత్ర సంప్ర‌దాయం కూడా ఉంది. అది తెలిస్తే ఆశ్చ‌ర్య‌ పోతారు. వధూవరులిద్దరూ సుమారు 30 సంవత్సరాలక్రితం మరణించారు, అయినప్పటికీ వారి కుటుం బ సభ్యులు వారికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అదీ వారి బంధం! అనిల్ అనే వ్య‌క్తి స్నేహితుడి పిలుపుతో ఒక పెళ్లికి హాజ‌ర‌య్యాడు. తీరా చూస్తే పెళ్లి హ‌డావుడి త‌క్కువ‌గా అనిపించింది. అస‌లు ఘ‌ట్టం ఆరంభానికి ఇంకా స‌మ‌యం ఉంద‌నుకున్నాడు. త‌ర్వాత కొంత‌సేప‌టికి అస‌లు సంగ‌తి తెలిసి ఖంగారుప‌డ్డాడు. ఆ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చ‌నిపోయి 30ఏళ్ల‌యిందిట‌! కానీ వారికి ఇప్ప‌టికీ ఆ పెళ్లిరోజున పెళ్లి తంతు చేయ‌డం ద‌క్షిణ క‌న్న‌డ సంప్ర‌దాయమ‌ని తెలిసి అత‌నికి నోట మాట రాలేదు.  ఇక్కడ మరణించిన వధూవరుల కుటుంబాలు పాల్గొంటాయి.  అయితే పిల్లల్ని మాత్రం అనుమ‌తించ‌రు.   ప్రసవ సమయంలో మరణించిన వారికి, వారు సాధారణంగా ప్రసవ సమయం లో మర ణించిన మరొక బిడ్డకు వివాహం చేస్తారు. అన్ని ఆచారాలు ఏ వివాహమైనట్లే జరుగుతాయి. నిశ్చితార్థం కోసం రెండు కుటుంబాలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్తారు. ఇది వేడుకకు తక్కువ కాదు. ఇది ఒక నిరాడంబ రమైన వ్యవ హారం కాదు. పెళ్లి బ‌రాత్ కూడా పెద్ద స్థాయిలో చేశారు. ఇది నిజ‌మా అబ‌ద్ధ‌మా అంటే ఆ ప్రాంతా నికి వెళ్లి చూస్తే తెలుస్తుంది. కొన్ని సంప్రదాయాలు ఇలా చిత్రంగానే ఉంటాయి.  ఎవ‌రి న‌మ్మ‌కాలు  వారివి.

గోదావరిలో కొట్టుకుపోయిన అమ్మవారి ఆలయం

గోదావరి వరదలకు ఒక ఆలయం కొట్టుకుపోయింది. వరద ఉదృతికి ఆలయం మొత్తం నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి. గతంలో విదేశాలలో వరద ప్రవాహంలో పడవల్లా భవంతులకు భవంతులు కొట్టుకు పోతున్న దృశ్యాలను టీవీలలో చూసి వరద ఇంత పని చేస్తుందా అనుకున్నాం. వరద అంటే ఊళ్లూ పూళ్లూ మునిగిపోవడం, గొడ్డూ గొదా కొట్లుకుపోవడం తెలుసు. ప్రవాహంలో చిక్కుకుని వాహనాలు కొట్టుకు పోవడం, మనుషులూ పశువులూ గల్లంతవడం విన్నాం. ఇలా ఒక ఆలయం నీటిలో కొట్టుకుపోవడాన్ని వినడం, వీడియోల ద్వారా చూడటం దాదాపుగా ఇదే ప్రథమం కావచ్చు. ఈ సంఘటన ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. సీతానగరం మండలం పురుషోత్త పట్నం నది ఒడ్డున ఉన్న ఆలయం వనదుర్గ ఆలయం. ఈ ఆలయాన్ని దాదాపు 15 ఏళ్ల కిందట నిర్మించారు. నిత్య పూజలందుకునే ఈ ఆలయంలో వన దుర్గమ్మ వారు శక్తిమంతమైన దేవతగా అక్కడి వారు విశ్వసిస్తారు.   తొలి శ్రావణ శుక్రవారం కావడంతో ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఇటీవలి వర్షాలకు ఆలయం వరకూ నీరు చేరింది. దీంతో భక్తులు చాలా జాగ్రత్తగా ఆలయానికి వచ్చారు. గోదావరి వరద ఉధృతికి తీరం కోతకు గురి కావడంతో ఆలయం ఒక పక్కకు ఒరిగిపోయింది. దీనిని గమనించిన స్థానికులు మధ్యాహ్నం నుంచే ఆలయంలోనికి ఎవరినీ అనుమతించలేదు. సాయంత్రం అయ్యే సరికి ఆలయం ఒక్కసారిగా నదీలోకి జారిపోయి కొట్టుకుపోయింది. ఆ సమయలో గ్రామస్తులు వీడియోలు తీసుకున్నారు. అవే ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. 

కేఏ పాల్..నవ్యులు పూయించే పొలిటికల్ కమేడియన్!

సినిమాలో బ్రహ్మానందం కనిపించగానే ఆయన డైలాగులతో, నటనతో సంబంధం లేకుండా ప్రేక్షకుడి మొహం ఆనందంతో విప్పారిపోతుంది. అతడి ప్రమేయం లేకుండానే పెదవులు విచ్చుకుని నవ్వు వచ్చేస్తుంది. కమేడియన్ గా బ్రహ్మానందం ప్రక్షకుల్లో సంపాదించుకున్న క్రేజ్ అది. సరిగ్గా అలాంటి క్రేజే రాజకీయాలలో మరో కమేడియన్ కు వచ్చేసింది. బ్రహ్మానందం అంటే ప్రేక్షకుడికి అభిమానం, ప్రేమ, గౌరవం అన్నీ ఉంటాయి. కానీ ఈ రాజకీయ కమేడియన్ మాత్రం కేవలం ప్రగల్భాల లాంటి మాటలతో కితకితలు పెట్టి బలవంతంగా నవ్విస్తాడు. ఆ రాజకీయ కమేడియన్ పేరు కేఏ పాల్. ప్రజా శాంతి పార్టీ అధినేత. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆయనను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, దేశ ప్రధాని ఇలా అన్ని పదవులకూ తనను మించిన అర్హుడు లేడని తొడగొట్టి మరీ చెబుతారు. పనిలో పనిగా మోడీ నుంచి ఆయన నోటికి తెలిసిన నాయకులందరూ తనను త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా ఆశ్రయించారనీ.. కానీ రాజీ పడటం ఇష్టం లేకనే తాను ఎవరితో కలవకుండా ఒంటరిగానే దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేందుకు రంగంలోకి దిగానని చెప్పుకుంటారు. రాజ్యం, సైన్యం లేని మహారాజును తానేనని అంటారు. ఆయన తాజాగా ఏపీ ముఖ్యమంత్రి, విపక్ష నేతలపై కొన్ని విమర్శలు చేశారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో తెగ ట్రోల్ అవుతున్నాయి. పాల్ గారికి అటువంటి ట్రోలింగ్ పై పెద్ద పట్టింపు లేదను కోండి అది వేరే సంగతి. కానీ ప్రజలకు ఆయన ప్రసంగాలు, సామాజిక మాధ్యమంలో ఆయనపై వచ్చే సెటైర్లు మంచి వినోదాన్ని పంచుతాయనడంలో సందేహం లేదు. తాజాగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనను బుజ్జగించేందుకు చాలా ప్రయత్నం చేశారని అన్నారు. తనను కలవాల్సిందిగా చంద్రబాబు కబురు పెట్టారని చెప్పుకున్నారు.  అయితే సీక్రెట్ మీటింగ్ లు ఎందుకు ఏం మాట్లాడుకున్నా జనం ముందే మాట్లాడుకుందామని ఆయనకు తాను చెప్పాననీ, ఆయన కబురు పెట్టినా తాను వెళ్ల లేదనీ పాల్ చెప్పుకున్నారు. ఇక అదే నోటితో జగన్ గురించి కూడా వాకృచ్చారు. చంద్రబాబుతో రహస్య మీటింగ్ వద్దనుకున్నానన్న పాల్ గారు. జగన్ తో మాత్రం అటువంటి సమావేశానికి తహతహలాడిపోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తాను కలవాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా జగన్ అందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. జగన్ కు తనను ఫేస్ చేసే ధైర్యం లేదనీ, ఆయనో పిరికిపంద అనీ అందుకే తనను కలవడం లేదనీ, తనతో భేటీకి రావడం లేదని చెప్పుకుంటున్నారు. సరే ఆయనేం చెప్పుకున్నా అందరికీ వినోదమే కానీ.. ఒకరితో రహస్య మీటింగ్ వద్దన్నాననీ, అదే సమయంలో మరొకరితో రహస్య మీటింగ్ కు అవకాశం రావడం లేదనీ ఆయన తెగ ఫీలైపోతున్నారు ఎందుకనో. అసలు విషయమేమిటంటే ఆయన పాస్ పోర్టు సీజ్ అయ్యింది. ఇప్పుడు ఆయనకు తక్షణ అవసరం ఆయన పాస్ పోర్టు ఆయనకు రావడం ఈ విషయాన్ని కూడా పాల్ స్వయంగా చెప్పారు. అందుకోసమే జగన్ తో రహస్య మీటింగ్ కు తహతహ. ఆయనకు నచ్చుతుందనే చంద్రబాబు పిలుపును తాను లెక్క చేయలేదని చెప్పుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.  

జగన్ పారదర్శకత నేతి బీరకాయలో నేతి చందమేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పాలన అంతా పారదర్శకమని అవకాశం వచ్చినా రాకపోయినా, సందర్భమైనా, అసందర్భమైనా సరే పదే పదే చెబుతూ ఉంటారు. ఎక్కడ ఏ సభలోనైనా, ఆ సభ ఏదైనా, ఆఖరికి అధికారుల సమీక్షల్లోనైనా సరే ఆయన నోటి వెంట తన ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందన్న మాట రాకుండా ఉండదు. అదే సమయంలో విపక్షంపై విమర్శలూ తప్పవు. ఇంత గొప్పగా పారదర్శకత గురించి చెబుతున్న జగన్ తమ ప్రభుత్వం జారీ చేసే జీవోలను ఎవరికీ అందుబాటులో లేకుండా ఎందుకు రహస్యంగా, గుట్టుగా దాచేస్తున్నారన్న ప్రశ్న వైసీపీ శ్రేణుల నుంచి వస్తోంది. అయితే విపక్షాలలా వారు ప్రెస్ మీట్లు పెట్టి అడగలేరు కనుక తమ అధినేత మాటల్లోని డొల్ల తనాన్ని అంతర్గత సంభాషణల్లో చర్చలకే పరిమితం చేస్తున్నారు. నిజంగానే జగన్ సర్కార్ అంత పారదర్శకంగా ఉంటే ధానపరమైన నిర్ణయాలపై జారీచేసే జీవోల్ని కోర్టు మందలించినా, తప్పుపట్టినా లెక్క చేయకుండా ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని వైసీపీ వర్గాలే తమలో తాము చర్చించుకుంటున్నాయి. జీవోఐఆర్ వెబ్సైట్లో జీవోలుఎందుకు పెట్టడం లేదో అర్ధం కావడం లేదనీ, ఇదేనా పారదర్శకత అంటే అని చర్చించుకుంటున్నారు. వైసీపీ పారదర్శకత అంటే ఇదేనా అని విపక్షాలు కూడా నిలదీస్తున్నాయి. అయితే జగన్ కు విమర్శలు వినిపించవు కనుక.. ఈ ప్రశ్నలకు సందేహాలకూ సమాధానం చెప్పే అవకాశం ఆయనకు ఉండదు. ఎంత సేపూ విపక్షం మేనిఫెస్టోను పట్టించుకోలేదు.. తాను మాత్రం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి అందులో పెట్టిన ప్రతి అంశాన్నీ అమలు చేస్తున్నాననీ, ప్రతి హామీనీ నెరవేరుస్తున్నాననీ చెప్పేస్తూ ఉంటారు. సరే హామీల అమలులో డొల్లతనాన్ని అలా ఉంచితే పారదర్శకత అంటూ ఘనంగా చాటుకుంటున్న జగన్ తన ప్రభుత్వం జారీ చేసే జీవోలను ఎందుకు అందరికీ అందుబాటులో ఉంచడం లేదని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఆ జీవోలను అందరికీ అందుబాటులో ఉంచితే మరిన్ని కోర్టు కేసులు ఎదుర్కొన వలసి వస్తుందన్న భయమే కారణమా అని ప్రశ్నిస్తున్నాయి. జీవోలను ఆన్ లైన్లో ఉంచకపోవడానికి కారణమిదేనా అని నిలదీస్తున్నాయి. జగన్ చెబుతున్న పారదర్శకత నేతి బీరకాయలో నేతి చందమేనని విమర్శిస్తున్నాయి.   

చీకోటి కారులో చినజీయర్ స్వామి!

కాసినో స్కాం సూత్రధారి చీకోటి ప్రవీణ్ కారులో చినజీయర్ స్వామా? అవును ఇప్పుడు ఈ వార్తే, ఇందుకు సంబంధించిన ఫొటోలే సంచలనంగా మారాయి. చీకోటి కారులో కూర్చున్న చినజీయర్ స్వామిగారి ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఒకప్పటి ఆధ్యాత్మిక గురువు, ఏపీ సీఎం జగన్ ను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించిన స్వామి త్రిదండి చినజీయర్ స్వామి చీకోటి   కారులో షికారు చేస్తున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.   గతంలో త్రిదండి చినజీయర్ స్వామిని చీకోటి తన కారులో కూర్చోబెట్టుకుని తిప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియోలే చినజీయర్ స్వామిని మరింత ‘పాపులర్’ చేసేశాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యమా బిజీగా ఉండే స్వామివారు కాసినో నిర్వాహకుడి కారులో ఎక్కి షికార్లు చేయడమేమిటని నెటిజన్లు తెగ ట్రోల్ చేసేస్తున్నారు.  అత్యంత నిష్టాగరిష్టుడు, ఎందరో బడా బడా రాజకీయ నాయకులకు ఆధ్మాత్మిక గురువు, సమతామూర్తి విగ్రహివిష్కరణకు ఏకంగా ప్రధానిని రప్పించిన క్రేజీ స్వామి వారు.. ఒక కాసినో నిర్వాహకుడి కారులో తిరగడమేమిటి? అన్నది నెటిజన్ల సందేహం. అసలు త్రిదండి చినజీయర్ స్వామి వారి దర్శనం దొరకడమే సామాన్యులకు దుర్లభం. ఆయనపై పరమ భక్తితో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం నుంచి వచ్చిన వారు కూడా ఆయనను అల్లంత దూరం నుంచి చూసి దణ్ణం పెట్టుకుని వెళ్లాల్సిందే. అసలు సామాన్యులకు స్వామి వారి అపాయింట్‌మెంట్‌ దొరకడమే కష్టం. మామూలు భక్తులు అల్లంత దూరం నుంచి స్వామివారిని మొక్కవలసిందే.అలాంటిది చీకోటి కారులో చీకోటి పక్కన కూర్చుని మరీ షికార్లు చేశారేమిటి చినజీయర్ స్వామివారు... వారికి చీకోటితో ఎలా పరిచయం, ఎలాంటి పరిచయం అంటూ నెటిజన్లు తమ సందేహాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇక్కడే వారు చినజీయర్ స్వామి జగన్ ను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించడాన్ని గుర్తు చేస్తూ.. గుడివాడ కాసినోకు, చిన జీయర్ స్వామి జగన్ ను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించడానికి, చీకోటి కారులో స్వామి వారి షికార్లకు ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ సందేహాలకూ, ప్రశ్నలకూ సమాధానం చెప్పేంత తీరిక స్వామి వారికి ఉంటుందా మరి.

పెంపుడు కుక్కే ప్రాణం తీసేసింది!

కుక్కలు విశ్వాసానికి మారుపేరు. తమ ఇంట్లో కుక్కలను పెంచుకునే వారు వాటిని సొంత మనుషుల్లా ప్రేమగా సాకడం చూస్తుంటాం. అయితే అలాంటి పెంపుడు కుక్కే ఓ ఇంట విషాదాన్ని నింపింది.  ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కే యజమానురాలిపై దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది. పెట్​ డాగ్​ లవర్స్​కి ఇది కాస్త బాధాకరమైన వార్తే.. ప్రేమగా పెంచుకున్న ఓ పెంపుడు కుక్క దాడి చేయడంతో ఉత్తరప్రదేశ్​లోని లక్నోలో ఓ మహిళ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మృతురాలి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం..  మృతురాలు ఒక రిటైర్డ్ టీచర్, ఆమె కొడుకు జిమ్ ట్రైనర్​గా పనిచేస్తున్నాడు. అతనికి రెండు పెంపుడు కుక్కలున్నాయి. వాటిలో ఒకటి పిట్‌బుల్. మూడేళ్లుగా ఇంట్లో మనిషిగా అందరి ప్రేమనూ చూరగొన్న ఆ పిట్ బుల్  ఉన్నట్టుండి తన తల్లిపై అటాక్​ చేసిందని చెప్పాడు. ఆ దాడిలో తన తల్లి తీవ్రంగా గాయపడి మరణించిందన్నాడు. దాడి తరువాత    లక్నో మునిసిపల్ కార్పొరేషన్ ఆ కుక్కను నాగర్ నిగమ్ జంతు జనన నియంత్రణ కేంద్రానికి తరలించింది. అక్కడ దాని ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. 

సముద్రంలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. అనకాపల్లి జిల్లాలో విషాదం

 అనకాపల్లి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పూడిమడక సముద్ర తీరానికి సరదాగా పిక్నిక్ కోసం వెళ్లిన విద్యార్థుల్లో ఏడుగురు గల్లంతయ్యారు. అనకాపల్లిలోని ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న 15 మంది విద్యార్థులు శుక్రవారం పూడి మడక సీషోర్ కు వెళ్లరు. సముద్రంలో ఈతకు దిగిన వారిలో ఏడుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరిని స్థానికులు రక్షించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ఐదుగురి కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి.  పూడిమడక సముద్ర అలల ఉధృతి అధికంగా ఉంటుందని ఇక్కడ సముద్రంలో ఈత కొట్టడం ప్రమాదకరమని స్థానికులు చెబుతున్నారు.  గల్లంతైన వారిలో గోపాలపట్నం ప్రాంతానికి చెందిన జగదీష్‌, నర్సీపట్నంకు చెందిన జశ్వంత్‌, గుంటూరుకు చెందిన సతీష్‌, చూచుకొండకు చెందిన గణేష్‌, యలమంచలికి చెందిన చందులు ఉన్నారు.  గల్లంతైన విద్యార్ధుల గాలింపు కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు.   మరో వైపు మెరైన్‌, కోస్ట్‌ గార్డు సిబ్బందితో పాటు మరికొంత మంది రక్షణ సిబ్బంది సముద్రంలో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే పూడిమడక సముద్రతీరంలో తమ పిల్లలు గల్లంతయ్యారన్న విషయం తెలుసుకున్న ఆయా కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు  శోకసంద్రంలో మునిగిపోయారు.   తమ సహచర విద్యార్ధులు మృత్యుబాట పట్టారని తెలుసుకున్న సహచర విద్యార్ధులు పెద్ద ఎత్తున పూడిమడక ప్రాంతానికి చేరుకున్నారు. 

నేల త‌వ్వితే.. నోట్లు బ‌య‌ట‌ప‌డ్డాయి!

తాత‌గారో, తండ్రో క‌ల‌లో క‌నిపించి ఆభ‌ర‌ణాల పెట్టె ఎక్క‌డుందో చెప్ప‌డం హీరో బావిలోకో, చెరువులోకో దూకి దాన్ని సాధించ‌డం పాత సినిమాల్లో చూసి అమితాశ్చ‌ర్యప‌డ‌టం దాదాపు అంద‌రికీ అనుభ‌వ‌మే. కానీ దాదాపు అలాంటి సంఘ‌ట‌నే ఈ రోజుల్లోనూ జ‌రిగింది. తొంభ‌య్యేళ్ల‌నాటి నోట్ల క‌ట్ట‌ల మిస్ట‌రీని ఓ జంట ఛేదించి సంబ‌ర‌ప‌డిపోతోంది.  న్యూజెర్సీ రాష్ట్రానికి చెందిన రిచర్డ్, సుజేన్ గిల్సన్ దంపతులు నాలుగేళ్ల క్రితం వైల్డ్‌వుడ్ ప్రాంతంలో ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. అది 1920ల్లో నిర్మించిన కాటేజీ. 1930ల్లో ఆ ఇల్లు.. జేమ్స్ డెంప్సీ అనే వ్యక్తి చేతుల్లోకి వెళ్లింది. రిచర్డ్, సుజేన్ దంప తులు ఆ ఇంటిని కొనుగోలు చేశాక..తమకు నచ్చిన విధంగా ఇంటికి కొన్ని మార్పులు చేశారు. ఈ క్రమంలో ఓ రోజు రిచర్డ్.. చెట్లు పాతేందుకు ఇంటి ముందు నేల తవ్వుతుండగా.. నోట్ల కట్టలు బయటపడ్డాయి. రిచర్డ్ కి క‌నిపించిన ఆ నోట్ల‌మీద 1934 అని ముద్రించి ఉంది. లెక్కపెట్టి చూడగా.. అవి మొత్తం 2 వేల డాలర్లని తేలింది. దీంతో.. రిచర్డ్ ఒక్కసారిగా షాకైపోయాడు. 90 ఏళ్ల నాటి కరెన్సీ నోట్లు చూసి అతడికి నోటమాట రాలేదు. నేటి లెక్కల ప్రకారం వాటి విలువ దాదాపు 40 వేల డాలర్లు. అయితే..రిచర్డ్  అవ‌న్నీ దాచేసుకుని ఆనక క్యాష్ చేసుకుందామ‌ని కామెడీగా ఏమీ ఆలోచించ లేదు. వెంట‌నే త‌న భార్య‌కి ఈ సంగ‌తి చెప్పాడు. ఆ న‌గ‌దు భూమిలో ఎందుకు పెట్టారు, ఎవ‌రిది అనేది ఇంకా తేల‌వ‌ల‌సి ఉంది.  చాలాకాలం అది మిస్ట‌రీగానే ఉండిపోయింది. ఇటీవల ఆ జంట జేమ్స్ డెంప్సీ  మనవరాలిని కలుసుకోవడంతో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆ డబ్బుని నేలలో పాతిపెట్టమని తన తాత అప్పట్లో తన తల్లికి చెప్పినట్టు జేమ్స్ మనవరాలు పేర్కొంది. ఆ తరువాత.. తన కుటుంబం ఆ డబ్బు కోసం ఎంత వెతికినా ఉపయోగం లేకపోయిందని చెప్పింది. ఇన్నాళ్ల తరువాత ఆ సంపద రిచర్డ్ దంపతులకు దొరికినందుకు ఆశ్చర్యపోయింది. అయితే.. ఈ డబ్బును తాను అస్సలు ఖర్చు చేయనని రిచర్డ్ మీడియాకు తెలిపారు.  ఆ నోట్ల వెనకున్న చరిత్ర చాలా ఆసక్తికరమైనది. తొంభై ఏళ్ల నాడు ఓ వ్యక్తి చేసిన పనికి ఇది సాక్ష్యం. ఆ డబ్బులను ఏం చేస్తావని నిత్యం అనేక మంది  అడుగుతుంటార‌ని, ఆ డ‌బ్బును తాను ఖ‌ర్చుపెట్ట‌న‌నీ  రిచర్డ్ చెప్పారు.   

మోదీకి మ‌ద్ద‌తు తెలిపింది.. మొగుడు త‌లాక్ తలాక్ తలాక్ అన్నాడు!

కొంద‌రికి సినీ స్టార్ల పిచ్చి ఉంటుంది, మ‌రికొంద‌రికి క్రికెట‌ర్ల పిచ్చ‌, ఇంకొంద‌రికి రాజ‌కీయ‌నాయ‌కుల పిచ్చ‌. పోనీ దీన్నే వీరాభి మానం అందాం. ఈ వీరాభిమానం మ‌రీ ర‌క్తంలోకి ఎక్కించుకుంటేనే ఇబ్బంది. ఆ స్టార్ సినిమా చూడ‌క‌పోతే నిద్ర‌ప‌ట్ట‌ద‌ని,  ఆ క్రికెట్ స్టార్ క‌నీసం హాఫ్ సెంచ‌రీ కొట్ట‌క‌పోతే తిండిమానేస్తాన‌నడం, త‌మ నాయ‌కుడు గెల‌వ‌క‌పోతే కిరోసిన్ పోసుకుంటాన‌ని గోల చేయ‌డం వంటివి వీరాభిమానానికి మించిన అభిమానం. అయితే దీనికి ప‌రిమితి ఉంటుంద‌నే న‌మ్మ‌క‌మూ లేదు. ఈ అప‌రిమిత వీరాభిమానం ఒక్కోసారి జీవితాల్ని స‌మ‌స్య‌ల సుడిగుండంలోకి తోసేస్తుంది. కానీ ఆల‌స్యంగా దాని ప్ర‌భావం తెలుస్తుంది. ఒక నాయ‌కుడంటే అభిమానం ఉండ‌డంలో త‌ప్పులేదు. కానీ వాస్త‌వ ప‌రిస్థితుల అనుస‌రించి దాన్ని కొంత ప‌రిమితిలో ఉంచుకోవాలి. పాపం ష‌రా ఇరం కి ఈ సంగ‌తి తెలియ‌లేదు. ఆమె చేసిన త‌ప్పు ప్ర‌ధాని మోదీకి, యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య నాథ్‌కూ త‌న మ‌ద్ద‌తు తెలియ‌జేయ‌డం. అందులో త‌ప్పేమిటో ఆమె భ‌ర్తకే తెలియాలి. ఒక‌రి అభిప్రాయాల‌కు మరొకరు గౌర‌వం ఇవ్వ‌న పుడు కాపురం స‌క్ర‌మంగా సాగ‌దు. ప్ర‌తీ విష‌యాన్ని త‌న ఆలోచ‌నా అద్దాల‌తో చూస్తే విభేదాలు తార‌స్థాయికి వెళ‌తాయి. ఇలాం టిదే ఆమెకు అనుభ‌వం అయింది. మోడీకి మద్దతు తెలిపిన ఫ‌లితంగా ఆమెకు భ‌ర్త  త్రిబుల్ త‌లాక్ చెప్పేశాడు.  ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. పీఎం మోడీ, సీఎం ఆదిత్యనాథ్‌కి ఓటు వేయడం తో భర్త, అత్తింటి వాళ్లు వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మార్చి 3న ఎఫ్‌ఐఆర్ నమోద య్యిందని పోలీసులు తెలిపారు. మొరదాబాద్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయిందని, దర్యాప్తు జరుపుతున్నా మని వెల్లడించారు. బాధితురాలి పేరు షనా ఇరం. కాగా ఈమెను డిసెంబర్ 2019లో మొహమ్మద్ నదీమ్‌ పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు. తాను మోదీకి మద్దతిస్తున్న విషయాన్ని పెళ్లైన తర్వాత తెలుసుకుని ఈ హింసకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. త్రిపుల్ తలాక్ చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని తనకు చెప్పాడని ఫిర్యాదులో వెల్లడించింది. భర్త తోబుట్టవులు కొన్ని రోజు లుగా తనను హింసిస్తున్నారని పేర్కొంది. దీంతో ఐపీసీ 376, 511 సెక్షన్ల కింది నిందితులపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిలేష్ భదోరియా వెల్లడించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు.

మునుగోడు తెర‌ మీద బీజేపీ ఆశ‌ల చిత్రం!

తెలంగాణాలో ఎలాగ‌యినా కేసీఆర్‌ను గ‌ద్దె దించేయాల‌న్న బీజేపీ ప‌ట్టుద‌లతో ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డిని పార్టీలోకి లాక్కోవా ల‌న్న ఆతృత బాగానే ప్ర‌ద‌ర్శిస్తోంది. తెలంగాణా కాంగ్రెస్‌లో ఇమ‌డ‌లేని రాజ‌గోపాల్ కారణంగా  మునుగోడు రంగ‌స్థ‌లం మీద అనేక మ‌లుపుల డ్రామా కొన‌సాగుతూనే ఉంది. ఆ య‌న పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేసేసి బీజేపీ తీర్ధం పుచ్చుకుంటార‌ని భారీ ప్ర‌చారాలు చేస్తున్న బీజేపీ శ్రేణులు ఒక వైపు, ఆయ‌న‌ను వ‌దిలే ప్ర‌స‌క్తేలేద‌ని అంటున్న కాంగ్రెస్ నాయ‌కులు మరో వైపు, వీరిరువురి మధ్యా త‌న నిర్ణ‌యం ఇద‌మిద్ధం తేల్చ‌ని రాజ‌గోపాల్‌. అంద‌రూ తెలంగాణా ఓట‌ర్ను సందిగ్ధంలో ప‌డేశారు.  సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్ని కపై బీజేపీ  కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు ఎవరి కోణంలో వారు చూస్తున్నారు.  చిత్ర‌మేమిటంటే ఇంత హ‌డావుడి జ‌రుగుతున్నా కాంగ్రెస్ మాత్రం నిదానం ప్ర‌ధానం ప‌ద్ద‌తినే ప్ర‌ద‌ర్శిస్తోంది. సీనియ‌ర్ నాయ కుడిని  ఉన్న‌ప‌ళాన వ‌ద‌లుకోలేని స్థితి వారిది. తాను ఏమాత్రం ఉండ‌లేన‌ని రాజ‌గోపాల్ ప‌ట్టుద‌ల వెర‌సి మునుగోడు అంశాన్ని తెర‌మీద ర‌క్తిక‌ట్టిస్తున్నార‌నాలి. పార్టీ మార్పుపై స్పష్టతతో ఉన్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా, పోటీపై రాజగోపాల్‌రెడ్డి డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాను ఎన్నటికీ మునుగోడును వదిలి వెళ్లనని ప్రకటించిన ఆయన.. కార్య కర్తలను కాపాడుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి ఏ మాత్రం పట్టులేదు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో కదలిక తెచ్చేందుకు వ్యూహాత్మకంగానే రాజగోపాల్‌రెడ్డిని బీజేపీ ఎంచుకుందన్న ప్రచారం జరుగుతోంది.  ఇదిలా ఉండ‌గా, ఉప ఎన్నిక ఖాయమని టీఆర్‌ఎస్‌ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇస్తుండడంతో ఆశావహులు పెద్ద సంఖ్య లో పోటీ పడుతున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారు. సర్వేల్లో తమ పేర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టుకునేందుకు యత్నిస్తున్నారు. రాత్రివేళ విందు సమావేశాలు జోరుగా నడుపుతున్నారు. ఉప ఎన్నిక వస్తే దళిత బంధు, ఆసరా పెన్షన్‌, రోడ్లు వంటివి పెద్ద సంఖ్యలో మంజూరు కావడమే కాకుండా ఓటుకు పెద్ద సంఖ్యలో రేటు పలికే అవకాశం ఉంటుందని కుల సంఘాలు నేతలు, ఓటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు జోరుగా చర్చించుకుంటున్నారు.

కామన్వెల్త్‌ గేమ్స్‌-2022 .. భార‌త్ శుభారంభం

కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి రోజు భారత క్రీడాకారుల ఆధిపత్యంలో దూసుకుపోతున్నారు. మిక్స్‌డ్ టీం గ్రూప్-ఎ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు 3-0తో విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత్, మిక్స్‌డ్ డబుల్స్ జట్టు తమ మ్యాచ్ లను గెలిచి ఇండియాను 2-0 ఆధిక్యంలో తీసుకెళ్లారు.  ఘనాతో జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సంపూర్ణ ఆధిపత్యం సాధించి 5-0తో విజయం సాధించింది. అలాగే, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్ సెమీస్‌కు అర్హత సాధించాడు. ఇండియన్ బాక్సర్ శివ థాపా 63 కేజీల విభాగంలో పాకిస్థాన్ బాక్సర్ సులేమాన్ బలోచ్‌‌ను 5-0తో విజయం సాధించారు. మహిళల టీటీ జట్టు దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది  స్విమ్మింగ్ లో తొలి రోజు భారత్ శుభారంభం చేసింది. వంద‌ మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్‌లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్  సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. కాగా పాకిస్థాన్‌ బాక్సర్ సులేమాన్ బలోచ్‌తో జరిగిన 63 కేజీల బౌట్‌లో భారత బాక్సర్ శివథాపా 5-0 తో ఓడించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. భారత మహిళల టీటీ జట్టు గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది.  శ్రీజ ఆకుల-రీత్ టెన్నిసన్‌తో కూడిన డబుల్స్ జట్టు లైలా ఎడ్వర్డ్స్-డేనిషా జయవంత్ పటేల్‌‌తో కూడిన జట్టును వరుస సెట్లలో ఓడించింది. శ్రీజ అకుల, రీత్ టెన్నిసన్ డబుల్స్ జట్టు లైలా ఎడ్వర్డ్స్ , డానీషా జయవంత్ పటేల్‌లను వరుస గేమ్‌లలో ఓడిం చింది. స్టార్ టీటీ ప్లేయర్ మనీకా బాత్రా.. ముష్ఫిక్ కలామ్‌ను 11-5, 11-3, 11-2తో మట్టికరిపించింది. ఆ తర్వాత డేనిష్ జయవంత్‌ను శ్రీజ ఆకుల ఓడించింది. అయితే, భారత్‌కు తొలి రోజు కొన్ని పరాజయాలు కూడా తప్పలేదు. స్విమ్మింగ్‌ (50 మీటర్ల బటర్‌ఫ్లై, 400 మీటర్ల ఫ్రీ స్టైల్), సైక్లింగ్ ఈవెంట్స్‌లో పరాజయాలు మూటగట్టుకుంది.  ఇదిలా ఉండ‌గా, భారత మహిళలతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. భారత్ నిర్దేశించిన 155 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మరో ఓవర్ మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది.  భారత బౌలర్ రేణుక సింగ్  ఆసీస్‌ టాపార్డర్‌ను కూల్చినప్పటికీ చివరి వరుస బ్యాటర్లు ఆష్లీ గార్డెనర్, గ్రేస్ హారిస్ భార‌త్  బౌలర్లపై ఎదురుదాడికి దిగి జట్టుకు విజయాన్ని అందించారు. గార్డెనర్ 35 బంతుల్లో 9 ఫోర్లతో52, గ్రేస్ హారిస్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశారు.  అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ 52 సెంచరీ సాధించగా, షెఫాలీ వర్మ 48 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో అర్ధ సెంచరీ మిస్సైంది. ఆసీస్ బౌలర్లలో జొనాసెన్ 4 వికెట్లు పడగొట్టింది. భారత జట్టు తన రెండో మ్యాచ్‌ను ఈ నెల 31న పాకిస్థాన్‌తో ఆడనుంది.

సుభిక్ష‌పాల‌న‌కు బ‌ట‌న్ నొక్క‌లేదేమి?

చిటికేస్తే యువ‌రాణి పావురం అయిపోయి ఎగిరిపోతుంది, ఈల వేస్తే బ‌స్సాగి పోయి వ‌ర్షం వ‌స్తుంది.. ఇవన్నీ సినిమాల్లో జ‌రిగే మాయా మంత్రాలు. అన్నీ అలా చిటికెలో, బ‌ట‌న్ నొక్కేస్తే అయిపోయేట్ల‌యితే దేశంలో ఎప్పుడో దారిద్య్రం, అవినీతి, దోపిడీలు పోయి ఉండేవి. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు. ఎవ‌రికీ అలాంటి అతీత‌ శ‌క్తులు లేవు. ఈ అత్యాధునిక కంప్యూట‌ర్ కాలంలో కీబోర్డు బ‌ట‌న్‌లు త‌ప్ప హ‌ఠాత్తుగా అన్నీ జ‌రిగిపోయే మంత్ర‌శ‌క్తి ఉన్న బ‌ట‌న్ ఎక్క‌డా ఎవ‌రికీ క‌న‌ప‌డ‌టం లేదు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కి మాత్రం ఇట్టే అయిపోయే ప‌ద్ద‌తి తెలిసిపోయింది. డీబీటీ పేరుతో బ‌ట‌న్ నొక్కితే ల‌బ్దిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జ‌మ అయిపోతాయ‌ని సెల‌విచ్చారు. కానీ అలా జ‌రుగుతుందా.. అంటే సీఎం గారి దృష్టిలో అవుతుంది. కానీ వాస్త‌వ ప్ర‌గ‌తి, ప్ర‌జా సంక్షేమానికి మాత్రం ఆ బ‌ట‌న్స్ ఏవీ ప‌నిచేయ‌డం లేదని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.  ప్ర‌చారాలు, ఆర్భాటాల  ప‌టాటోపం త‌ప్ప అభివృద్ధి, ప్ర‌జా సంక్షేమం జాడ‌లు రాష్టంలో ఎక్క‌డా క‌న‌ప‌డ‌టం లేద‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు. చాలాకాలం నుంచి ఉన్న అమ‌రావ‌తిని అభివృద్ధి చేసి, మిగ‌తా ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయాల‌ని  ఏపీ సీసీ అధ్య‌క్షులు ఎస్‌.శైల‌జానాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల తాకిడితో ప్ర‌జ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటే సీఎం మాత్రం బ‌ట‌న్ నొక్కితే అన్నీ అయిపోతాయ‌న్న భ్ర‌మ‌లోనే ఉన్నార‌ని ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తు న్నాయి. డీబీటీతో రాష్ట్ర అభివృద్ధి చేసిన‌ట్ల‌వుతుందా అని శైల‌జానాథ్ ప్ర‌శ్నించారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం నెరవేర్చక పోయినా..జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

తెలంగాణా సాధ‌న‌కు బీజేపీ చ‌ద‌రంగం

ప‌క్క‌రాజ్యం మీదకి యుద్ధానికి వెళితే ఏమేర‌కు గెలుస్తాము, వారి సైన్యం ఎంత  సామర్థ్యం తెలుసుకోవ‌డానికో రాజులు వేగుల్ని రంగంలోకి దింపేవారు. స‌రిగ్గా అదే పంధాను ఇప్ప‌డు బీజేపీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు రానున్న ఎన్నికలకు  అనుస‌రిస్తున్నార‌నిపిస్తోంది. వారికి తెలంగాణాలో దొరికిన గొప్ప తెలివిమంతుడు, స్వ‌ర పేటికా బాగా ఉన్న‌వాడు, అన్నింటికీ మించిన వేగుచుక్క బండిసంజ‌య్. తెలంగాణాలో రాజ‌కీయ ప‌రిస్థితులే గాకుండా పార్టీల‌ వారీగా బ‌ల‌మైన నేత‌ల జాబితాను కూడా త‌యారుచేసి మ‌రీ నివేదిక‌తో పాటు పంపిన‌ట్టు తెలు స్తోంది. బీజేపీ అధిష్టానం తెలంగాణాలో కూడా గోవా మోడ‌ల్ అమ‌లు చేయాల‌న్న దృష్టిలో ఉంద‌ని, గెలుపు గుర్రాలనే గుర్తించి చెప్ప‌మ‌ని బండి వారిని బీజేపీ అధిష్టానం కోరిందట. పనిలో పనిగా  రాష్ట్రంలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్రత్యర్థి పార్టీలలోని ద్వితీయ‌శ్రేణి నాయ‌కుల్లో చురుకైన‌వారినీ గుర్తించ మ‌ని తెలంగాణా బీజేపీ అధ్య‌క్షుడికి బాధ్య‌త‌ను కమలం టాప్ బ్రాస్ అప్పగించిందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అంటే కేంద్రం తెలంగాణా మీద ఎంత దృష్టి కేంద్రీక‌రించిందో అర్ధ‌మ వుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్తగా పావులు క‌దిపే ప‌నిలో ఉంది.  తెలంగాణాలో అధికారం చేజిక్కించుకోవాల‌ని బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం ఎంతో ప‌క‌డ్బందీగా వ్యూహ‌ర‌చ‌న చేస్తోంద‌నే అనాలి. మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌వ‌ర్గాల‌ను నాలుగు క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించి ప్ర‌తీ నాలుగు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక కేంద్ర మంత్రిని ఇన్‌ఛార్జ్‌గా నియ‌మించారు.  ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ లకుఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా,  హైదరాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, భువనగిరి ఇన్‌చార్జ్‌గా ప్రహ్లాద్ జోషి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ ఇన్‌చార్జ్‌గా మహేంద్రనాథ్ పాండే, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి బీఎల్ వర్మను నియమించారు. వీరితో పాటు ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక కేంద్రమంత్రిని నియమించారు. ఆదిలాబాద్, పెద్దపల్లికి పురుషోత్తం రూపాల, జహీరాబాద్‌కు నిర్మలా సీతారామన్, మెదక్‌కు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, చేవెళ్ల, మల్కాజ్ గిరికి ప్రహ్లాద్ జోషి, భువనగిరికి దేవీసింగ్ చౌహాన్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్‌కు మహేంద్రనాథ్ పాండే, నల్లగొండకు కైలాశ్ చౌదరి, వరంగల్‌కు ఇంద్రజిత్ సింగ్,  హైదరాబాద్‌కు జ్యోతిరాధిత్య సింధియా, మహబూబాబాద్, ఖమ్మం‌కు బీఎల్ వర్మను నియమించారు.తెలంగాణ నుంచి పార్లమెంట్ ప్రవాసీ కన్వీనర్‌గా ప్రేమేందర్ రెడ్డి, కోకన్వీనర్లుగా ఉమారాణి, జయశ్రీని నియమించారు.

వాన్ పిక్ కేసును కోర్టు నిజంగానే కొట్టేసిందా?

వాన్ పిక్ కేసు కోర్టు కొట్టివేసిందంటూ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతుంటే అదే నిజమైపోతుందా? ఆవును కొనుక్కు తీసుకు వెళుతున్న వ్యక్తికి నలుగురు దొంగలు ఒకరి తరువాత ఒకరు అది ఆవు కాదు కుక్క అంటూ చెప్పేసరికి నిజమని నమ్మినా ఆయన దానికి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడని ఓ కథ ఉంది. ఇప్పుడు వాన్ పిక్ విషయంలో సాంకేతిక కారణంపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మొత్తం వాన్ పిక్ కేసునే కోర్టు కొట్టివేసిందని మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చినంత మాత్రాన ఆ కేసు కొట్టేసినట్లు అవుతుందా? ఇక వాన్ పిక్ క్విడ్ ప్రొకో కేసు విచారణ కోర్టులో జరగదా? అన్న సందేహాలు ఎవరికైనా వచ్చి తీరుతాయి. నిజానికి వాన్ పిక్ కేసులో కోర్టు ఇచ్చిన ఉత్వర్వులు దేనికి సంబంధించిని అంటే ఆ కేసు నుంచి వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన కంపెనీ పేరును తొలగింపునకు సంబంధించి మత్రమే. అంతే కాని వాన్ పిక్ క్విడ్ ప్రొకో కేసు అలాగే ఉంది. ఆ కేసులో నిందితులు నిమ్మగడ్డ ప్రసాద్ కి కానీ ఇతరులకు కానీ ఎటువంటి ఊరటా లభించేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వ లేదు. క్విడ్ ప్రొకో కేసులో వాన్ పిక్ చైర్మన్ నిందితుడుగా ఉన్నంత మాత్రాన ఆ కంపెనీని నిందుతుల జాబితాలో ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అందుకే కంపెనీ పేరు తొలగించాలంటూ వాన్ పిక్ వేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ  హైకోర్టు అనుమంతి ఆ కంపెనీ పేరును నిందితుల జాబితా నుంచి తొలగించింది. వాన్ పిక్ కంపెనీ పేరును నిందితుల జాబితా నుంచి తొలగించినంత మాత్రాన కేసు మొత్తం కొట్టివేసినట్లు అవ్వదు. ఈ కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులపై విచారణ కొనసాగుతుంది.    అంతే కానీ కేసు మొత్తాన్ని కొట్టి వేయలేదు. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ సీఎం జగనమోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ సహా వాన్ పిక్ స్కాంలో ఉన్న వారందరిపై విచారణ కొనసాగుతుంది. 

బాలినేని ఉలికిపాటు ఎందుకో తెలుసా ?

బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి,. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబినెట్ లో అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రపదేశ్ వైఎస్సార్, రోశయ్య మంత్రి వర్గాల్లోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎన్నికయ్యారు. 1999 నుంచి అదే నియోజక వర్గం నుంచి  ఆరు సార్లు పోటీ చేసి ఒక్క సారి మాత్రమే ఓడి పోయారు. ఉమ్మడి ఒంగోలు జిల్లా రాజకీయాల్లోనే కాదు, ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లోనూ, ఆయన కీలక పాత్రను పోషించారు. ముఖ్యంగా క్యాష్ డీల్స్ లో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుందని అంటారు.  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలే కాకుండా బధుత్వం కూడా ఉన్న బాలినేని ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రికి కొంత దూరమయ్యారు. అసంతృప్తి స్వరాలకు వేదిక అయ్యారు. అదలా ఉంటే, ఇప్పుదు ఆయనకు మరో సమస్య వచ్చిపడింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో వెలుగు చూసిన చీకోటి ప్రవీణ్ కేసినో , హవాలాలో కేసులో ఆయనకు సంబంధం వుందో లేదో కానీ, ఆయనకు సంబంధాలే కాదు, అయన రోల్ కీలకమనే ప్రచారం అయితే జరిగింది.జరుగుతోంది.  ఎక్కడ ఏ  నేరం జరిగిన పాత నేరస్తులు ఉలిక్కి పడడం సహజమే, కానే మాజీ మంత్రి, అధికార వైసీపీ ఎమ్మెల్యే బాలినేని ఈ విషయంలో ఎందకు ఉల్లిక్కి పడ్డారు? ఎందుకు మీడియా ముందు వచ్చి, కేసినో నిర్వాగకుడు చీకోటి ప్రవీణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని  ఎందుకు చెప్పుకున్నారు? అంటే, ఏదో ఉండి అందుకే, ముందుగానే సంజాయషీ ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే, ఏ సంబంధం లేక పోతే మాజే మంత్రి ఎందుకు, బుజాలు తడుము కుంటున్నారు, అని ప్రశ్నిస్తున్నారు.  అయితే, బాలినేని మాత్రం, ‘నేను పేకాట ఆడతాను. అప్పుడప్పుడూ కేసినోకీ పోయివస్తూంటాను’ అని ఒప్పుకుంటూనే, అంత మాత్రాన చీకోటి ప్రవీణ్ కేసినోతో కానీ ఆయన హవాలా దండాతో  కానీ తనకు సంబంధం ఉన్నట్లు కాదన్నారు. అయితే, బాలినేనిపై ఇలాంటి  కేసినో, హవాల ఆరోపణలు రావడం ఇదే మొదటి సారి, కాదు. ఆయమ మంత్రిగా ఉన్న రోజుల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పేకాట, కేసినో వ్యసనపరుడని టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. అప్పట్లో అయన ఆ ఆరోపణలను ఖండించినా, ఇప్పడు మాత్రం ’అవును .. నాకు పేకాట, కేసినోకు పోయివచ్చే అలవాటు ఉందన అంగీకరించారు. దీంతో అనుమనాలు ఇంకా ఎక్కవ అయ్యాయని అంటున్నారు.  గతంలో అయన మంత్రిగా ఉన్నరోజుల్లోనే, ఒంగోలు నుంచి చెన్నైకు తరలిస్తున్న రూ. ఐదు కోట్ల నగదును తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో ఆ నగదు అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి హవాలా రూపంలో పంపుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఇమేజ్ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కేసినోలు.. హవాలా కేసుల గురించి చర్చ వచ్చినా ఆయన పేరు ప్రచారంలోకి వస్తోంది. నిజానిజాలు ఎలా ఉన్నా కేసినో, హవాల మచ్చలు మాత్రం బాలినేని, పుట్టుమచ్చల్లా, వదలడం లేదు.