జగన్ ఉపయోగించే పెన్ను ఖరీదెంతో తెలిస్తే షాక్!
posted on Jul 27, 2022 @ 3:36PM
ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి అని ఓ సినిమాలో పాట. జగన్ సరిగ్గా అందేకే నీతులు చెబుతారు. అవి ఎదుటి వారికి చెప్పేటందుకు మాత్రమే. ఆయన ఆచరించేందుకు ఎంత మాత్రం కాదు. విపక్షంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి మినరల్ వాటర్ తాగడమే మహాపాపం అన్నట్లు గగ్గొలు పెట్టారు. ఒక హిమాలయ మినరల్ వాటర్ బాటిల్ ఖరీదు ఏకంగా 60 రూపాయలు.. ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ నిలదీశారు.
విపక్ష నేతగా అప్పటి ముఖ్యమంత్రి తన వయసు దృష్ట్యా ఆరోగ్యం కోసం ఓ అరవై రూపాయలు పెట్టి మినరల్ వాటర్ తాగితేనే మిన్నూ మన్నూ ఏకమయ్యేలా గగ్గోలు పెట్టిన జగన్ ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయిన తరువాత అయిన దానికీ కాని దానికీ కుటుంబంతో విహార యాత్రలకు స్పెషల్ చార్టర్డ్ విమానాలను ఉపయోగిస్తున్నారు. అ ఖర్చేమీ సొంత ఖాతాలోంచి ఇవ్వడం లేదు. ప్రజల ధనాన్నే తన విలాసాలకు ఉపయోగించేస్తున్నారు.
అంతెందుకు ఏ పెన్నుతో రాసినా అవే అక్షరాలు కానీ జగన్ మాత్రం చిన్న సంతకం పెట్టడానికి ఉపయోగిస్తున్న పెన్ను ఖరీదెంతో తెలుసా అక్షరాలా అరవై వేల రూపాయలు. ఆరవై రూపాయలు వెచ్చింది మినరల్ వాటర్ తాగినందుకే చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ నాడు గగ్గోలు పెట్టిన జగన్ సీఎంగా 60 వేల రూపాయల పెన్ను ఉపయోగిస్తూ కూడా ప్రజాధనాన్ని వారి సంక్షేమం కోసమే సద్వినియోగం చేస్తున్నానని ఎలా చెప్పగలరు?
దావోస్ ఆర్థిక సదస్సులకు సీఎం హోదాలో చంద్రబాబు వెళ్లినప్పుడు ఏం సాధించుకు రావడానికి ప్రజా ధనంతో విదేశీ యాత్రలు అంటూ విమర్శించిన జగనే ఇప్పుడు స్వకార్యం, స్వామి కార్యం కూడా కలిసి వచ్చేలా స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ లో దావోస్ వయా లండన్ సతీ సమేతంగా చేసిన విహార యాత్ర ద్వారా రాష్ట్రానికి ఏం ఒరిగిందో చెప్పగలరా అని నెటిజన్లు నిలదీస్తున్నారు.