ఈ గేదెలకే ఓటుంటే.. నా గతి ఇటులవునా!
posted on Jul 27, 2022 @ 1:42PM
పరుగులు తీయాలి.. గిత్తలు ఉరకలు వేయాలి.. అంటూ ఎన్టీఆర్, భానుమతి ఎడ్లబండిమీద వెళుతోంటే సినీ ప్రేక్షకులు హాల్లో లేచి వారి వెంట పరిగెట్టినంత హడావుడి చేసేరు. ఈమధ్యనే పి.గన్నవరంలో ఆంధ్రా సీఎం జగన్ రెడ్డి కూడా ఎడ్లబండి కాదుకానీ ట్రాక్టరెక్కి ఉరకలు లేకుండా బహు నెమ్మదిగా వెళ్లి నా ఎవ్వరూ వెంట రాలేదు! పైగా అక్కడున్న పది గేదెలు ఈయనెందుకు ఇటోచ్చాడన్న అనుమానంతో చూశాయి.
ఇటీవల గోదవారి వరదలు, భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ ఉభయగోదావరి జిల్లాల్లో పలు గ్రామాలు ముంపు నకు గురయ్యాయి. వరద కాస్తంత శాంతించిన తర్వాత సీఎం జగన్ చాలా తాపీగా బాధితులను పలకరిం చకపోతే బాగోదన్నట్టుగా ప్రయాణమయ్యారు. అలా ఆయన పి.గన్నవరం అనే గ్రామానికి వెళ్లినపుడు సారు వారికి కారులో వెళ్లడానికి అవకాశం లేకపోయింది. అదంతా ఎడ్లబండి, గేదెలు, చెప్పుల్లేని రైతులు తిరిగే దారి. అందువల్ల సీఎం తన కారు కాదని తప్పనిస్థితిలో ట్రాక్టర్ ఎక్కారు.
బహుశా ఆయనకూ ఎన్టీఓడి పాట గుర్తొచ్చే ఉంటుంది. ట్రాక్టర్ నుపరుగు పెట్టించాలనే అనుకొనుండొ చ్చు. కానీ వెళుతోంది బాధితులను పలకరించడానికి కదా అందువల్ల గేదెల నిదానాన్ని అంగీకరించా ల్సి వచ్చింది. పైగా అది సరయిన రోడ్డు కాదు మరింత ఉత్సాహపడద్దని భద్రతా సిబ్బందీ చెప్పి ఉంటుం ది. అసలు అంతకంటే ముందే ఆ దారంతా కాస్తంత శుభ్రపరిచే ఉంటారు. కానీ దారిలో గేదెలే ఎక్కువగా ఆహ్వానం పలికేయి. అవి మనుషులు అందులోనూ జగన్ వీరాభిమానులు కాదు గనుక భద్రతాసిబ్బంది అమాంతం వాటి ఉత్సాహాన్ని నిలువరించి కొమ్ములు గట్టిగా పట్టుకుని ఆపేరు. వాటికి మనుషులు తెలీదు, జనగనన్న పాలనా తెలీదు, ఎప్పుడన్నా కుమ్మేయచ్చుగదా!
కానీ అంత చిత్రమైన ప్రయాణంలోనూ జగన్ తన మాట మాత్రం మార్చుకోలేదు. గేదెలకీ భాష తెలిస్తే వాటి మేతకు గ్రాసం ఏర్పాటు చేసినందుకు తనను వేనేళ్ల పొగిడేవని చెప్పారు. ప్రచారానికి, భజనకీ వేటినీ వదలరు ప్రభువుల వారు. వారికి భుజకీర్తులు ఇపుడు ఎంతో అవసరం. వరదబాధితుల పరామ ర్శకు ట్రాక్టర్ మీద తిరుగుతున్నా మనసు మాత్రం వీటికీ ఓటు హక్కుంటే ఎంత బాగుండేదో అని లోలో పల అనుకుంటోంది!