ప్రకృతి ఒడిలో పాఠాలు నేర్పిన తల్లి
ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బుక్, రెండు రెళ్లు నాలుగు.. ఇదే అనాదిగా తరతరాలుగా దేశమంతా పాఠశాలలు పిల్లలకు విద్యాభ్యాస ఆరంభ ప్రక్రియ. ఎన్ని అనుకున్నా, ఎంత చర్చించినా ఈ విద్యావిధానం మారలేదు. మారాల్సిన అవసరం ఉందని చాలామంది విజ్ఞలు, విద్యాశాస్త్రవేత్తలు, పండితులూ మొత్తుకుంటున్నా ఈ బ్రహ్మసూత్రాన్ని దాటి ఏ గ్రామం కూడా గీత దాటడం లేదు. ఇటీ వలి కాలంలో ఈ అత్యాధునిక కాలంలో రవ్వంత మార్పుకి అవకాశం కనపడుతోంది. ఇప్పుడిప్పుడే ప్లే స్కూల్స్ పేరిట కొత్తద నాన్ని ప్రవేశపెట్టి పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఉత్సాహపరుస్తున్నాయి కొన్ని కార్పోరేట్ పాఠశాలలు. కానీ హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన అంకీష్ అనే మహిళ చాలా కొత్తగా ఆలోచించింది. తన పిల్లవాడికి క్లాస్‌రూమ్, ఆన్ లైన్ క్లాసులు కాకుండా సహజసిద్ధ విద్యా విధానాన్ని.. అంటూ పూర్వం రుషుల బోధనా విధానంలోకి ఆలోచన చేసింది.
అంకీష్ కి తన ఏడేళ్ల పిల్లవాడు ప్రాంష్ అలా ఆన్ లైన్ క్లాసులతో ఇబ్బంది పడటం బొత్తిగా నచ్చలేదు. వాడికి అసలు ప్రకృతి చెప్పే పాఠాలు, సహజసిద్ధంగా లోకాన్ని తెలుసుకోవడం అంటే పుస్తకాల్లో కాకుండా వాస్తవంగా చూపాలని, తెలిసేలా చేయాలని సంకల్పించారు. అంతే వెంటే స్కూలు నుంచీ బయటికి తీసుకువచ్చేశారు. వాడికి చుట్టపక్కల ప్రదేశాలు చూపడం, చెట్లు ఎలా పెరుగుతాయి, ఎండ వేడిమి, గాలి, పక్షుల కిలకిలారావం, ఏర్లు పారడం, పొంగడం, జంతువుల గురించి అన్నీ స్వయంగా చూపు తూ వాటిని వివరిస్తూ వాడిని పెంచడం మీద ఎంతో దృష్టిపెట్టారామె.
తరగతి గదిలో ఉండడం కాకుండా బయట తిరగాలని, దేశమంతా తిరిగి అనేక ప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తున్నారు, వారి జీవన శైలి గురించి పిల్లడికి తెలియాలని ఆ తల్లి భావించింది. బంధువులు, స్నేహితులూ ఇదేం పిచ్చి అన్నారు. కానీ ఆమె చిర్నవ్వుతోనే సమాధానం చెప్పిందే కానీ వారితో వాదించలేదు. పైగా 2020లో లాక్‌డౌన్ సమయం ఆమెకు బాగా కలిసి వచ్చింది. చాలామంది పిల్లలు చదువుకి దూరమయినా తన పిల్లవాడిని మాత్రం ఈ కొత్తమార్గంలోకి నడిపింది. కరోనా కారణంగా ఆఫీసుకు వెళ్లలేక పిల్లాడిని చూసుకోవాలని ఐటి ఉద్యోగాన్ని ఆమె 2020లో వదిలేశారు. 2021 ఏప్రిల్‌లో పిల్లవాడికి నాలుగేళ్ల వయసులోనే ఆమె తన పిల్లాడిలో ప్రకృతి పట్ల ఆకర్షణను గుర్తించారు. అలా పెద్దవుతున్న కొద్దీ ఆ ఆసక్తి కూడా రెండింతలయింది. ప్రయాణాలకు వీలయిన సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో అనేక ప్రాంతాలు తిప్పారట. తండ్రి క్యాంప్‌లకు వెళ్లినపుడు ఆయన కూడా తనతో పిల్లవాడిని తీసికెళ్లేవారట.
అలా రోడ్డు ప్రయాణమే ఎక్కువగా చేయడంతో అనేక రకాల మను షులు, వారి తీరుతెన్నులు, వ్యవహారశైలి, జంతువులు, చెట్లూ చేమా చెరువులు, కాలవలు, రాళ్ల గుట్టలు, కొండలు, పర్వతాల గురించి ఆమె వాడికి చూపించడమే కాకుండా వివరిస్తూ ఎంతో జ్ఞానాన్నిపంచింది. అలా అన్నింటిని చూసి తెలుసుకోవడంతో ఆ పిల్లవాడు ఇప్పుడు అన్నీ ఎంతో బాగా గుర్తు పెట్టుకు న్నాడు. ఎన్నోవాటి గురించి గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నాడట. అనేక ప్రాంతాల్లో కలిసిన వాళ్లను, వారు పెట్టిన పదా ర్ధాల రుచులు ఎంతో ఇష్టపడ్డాడు. చిన్న వయసులోనే స్పిటీ, లడక్ వంటి అత్యంత చలి ప్రాంతాల్లో తిరిగాడని , అక్కడ మట్టి ఇళ్ల నిర్మాణం చూశాడని, వాటిలో రెండు రోజులు తండ్రితో పాటు ఉన్నాడని ఆ తల్లి ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. తల్లి దండ్రులతో మహారాష్ట్రా కోంకణ్ తీర ప్రాంతంలో, అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యాణాలలో 1600 కిలోమీటర్లు తిరి గాడు. ఎన్నో తెలుసు కున్నాడు.