130 ఏళ్ల మొసలికి స్మారకచిహ్నం!
posted on Jul 31, 2022 @ 1:04PM
నిమ్మీ, మిన్నీ, బబ్లూ అని ఇంట్లోవారంతా ప్రేమగా పిల్లల్ని అలా పిలుచుకుంటారు. అలానే ప్రేమగా పెద్దయినా పిలుస్తుంటారు. అలాగే పెంచుకున్న జంతువులనీ విచిత్రమైన పేర్లు పెట్టి పెంచుకుంటారు. ఛత్తీస్‌గడ్‌కి చెందిన బసవనన్ తన స్నేహితుడయిన మొసలికి గంగారామ్ అని పేరెట్టుకున్నాడు. 130ఏళ్ల గంగారామ్ చనిపోతే ఏకంగా స్మారకచిహ్నం కూడా నిర్మించాడు. అది స్నేహం విలువ!
ఛత్తీస్‌గఢ్ బెమెతర జిల్లాలోని బావా మొహతారా గ్రామానికి చెందిన బసవన్ తోటి పిల్లలతో కలిసి చెరువులో ఈతకొడుతూ ఆడుతూండేవాడు. అక్కడ కాస్తంత దూరంలో వాళ్ల పెద్దవాళ్లు బట్టలూ ఉతుకుతుంటారు. ఈతకొట్టే చెరువులో మధ్యలో నాలుగయిదు చిన్న మొసళ్లుండేవి. కానీ వాటికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా పిల్లలు ఆడుతూండేవారు. హఠాత్తుగా ఒకరోజు వాటిలో ఒక మొసలి కూడా వారితో ఆటకి దిగింది. అన్ని మొసళ్లు ప్రమాదకారి కాదు, మనుషులతో స్నేహంగానూ ఉంటాయ న్నది అది అలా నిరూపించిందన్నమాట! ఆ గ్రామం చెరువులో ఉండే ఈ స్నేహితుడికి గంగారామ్ అని పేరు పెట్టుకున్నారు పిల్లలంతా. 2019లో తన 139ఏట గంగారామ్ మరణించింది. దాన్ని ఆ గ్రామస్తులు అలా వదిలేయలేదు. తమ బంధువుని కోల్పోయినం తగా బాధపడి, ప్రాణంలేని ఆ జీవిని అలా ఒడ్డుకి తీసుకువచ్చి ఒక మంచిచోటు చూసి దానికి స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. దాని అంతిమసంస్కారానికి ఏకంగా 500 మంది వచ్చారట. ఆ రోజు ఎవ్వరూ ఇంట వంట చేయకుండా దిగులుగా ఉండిపోయారు ఒక మంచి మిత్రుడిని కోల్పోయామన్న బాధతో గడిపారు.
ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు ప్రతీ గ్రామంలోని చెరువులోనూ ఇలాంటి మొసళ్లు చాలా కనపడతాయని నేచర్ కన్జర్వె న్సీ అనే స్వచ్ఛంద సంస్థవారు తెలిపారు. జనసంద్రం ఎక్కువగా ఉండే గ్రామాల్లో ఇలా మొసళ్లు ఉండడం సాధారణంగా భయాన కమే. అయినప్పటికీ చాలామటుకు వారెవ్వరూ వాట జోటికి వెళ్లరు గనుక అవి వారి జోలికి వెళ్లవు అని నిపుణుల మాట. అవి ఉన్న పెద్ద పెద్ద చెరువుల్లోనే గ్రామస్తులు తమ పశువులను శుభ్రం చేయడం, దుస్తులు ఉతకడం వంటి పనులు చేస్తూంటారు. కానీ మొసళ్లు తమ పిల్లలతోనూ చెరువు గట్టున ఎండకి సేద తీరుతుండడం కూడా గ్రామీణులు చూసి ఆనందిస్తుంటారు. అంతా ఒకే గ్రామంలో ఉన్నాంగనుక అంతా స్నేహితులమే అన్న భావన వాటిలోనూ ఉంటుందా.. ఏమో!