చదరంగం నృత్యం..అద్భుత కళావిన్యాసం
posted on Jul 31, 2022 @ 12:27PM
చదరంగం మైండ్ గేమ్. ఎంతో తెలివితేటలు ప్రదర్శించాలి. ఎదుటివారి ఆలోచనలక అడ్డుకట్టవేయగలగాలి. ముందే యుద్ధానికి సన్నద్ధం కావడం వంటిది. యుద్ధ తంత్రమంతా ఇక్కడే ఆరంభమవుతుందని పూర్వం రాజుల కాలం నుంచీ ఉన్నదే. పాచి కలు, గవ్వలాట, వైకుంఠపాళీ,.. ఇవన్నీ దాటిన గొప్ప యుద్ధతంత్రాన్ని ప్రదర్శించేది చెస్. ఆధునిక కాలంలో జాతీయ అంతర్జా తీయ పోటీలు నిర్వహిస్తున్నారు. మాస్టర్, గ్రాండ్ మాస్టర్ టైటిల్స్‌తో విజేతలను భుజానికి ఎత్తుకుంటున్నారు. భారత్ సంప్రదా య బద్ధమైన ఆట తీరు నుంచి అత్యంతాధునిక ఆటలోనూ వన్నె తగ్గని క్రీడాసామర్ధ్యం ప్రదర్శిస్తూనే ఉంది. అందుకో ఉదాహ రణ విశ్వనాథన్ ఆనంద్, ఇప్పటి హంపీ. ఇదంతా ఆటను చూడడం, ప్లేయర్లను ప్రశంసించడంతో ఆనందం పంచుకుం టున్నాం.
కానీ 44వ చెస్ ఒలింపియాడ్‌కి తమిళనాడు ప్రభుత్వం కొత్త తరహాలో చదరంగం అద్బుతాన్ని ప్రదర్మన చేయించి అందరి మన సులూ దోచింది. అద్భుత కొరియోగ్రఫీతో చదరంగ నృత్య ప్రదర్శన! ఇది ఊహించని అద్భుతమని అందరూ ప్రశంసిస్తు న్నారు. బోర్డు మీద ఆటను ఆడటం, చూడడం కంటే ఈ నృత్య ప్రదర్శన ఇచ్చే ఆనందం మరో అద్భుతమని దేశమంతా వేనోళ్ల ప్రశంసి స్తోంది. ఇది నిజానికి చూసి తీరాల్సినదే.
తమిళనాడులో జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్‌లో వివిధ జిల్లాలు ఆటను జరుపుకోవడానికి, ప్రోత్సహించడానికి మార్గా లను రూపొందించాయి. వాటిలో పుదుక్కోట్టై జిల్లా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుం ది. కొరియోగ్రఫీలో క్లాసికల్, జానపద, మార్షల్ఆర్ట్ అంశాలను మిళితం చేసి, వివిధ చదరంగం పిక్కలు ప్రాణం పోసుకోవడం, చదరంగం బోర్డ్‌పై యుద్ధంలో పాల్గొంటున్నట్లు చూపుతుంది.
పుదుక్కోట్టై కలెక్టర్ కవిత రాము నృత్య దర్శకత్వం వహించిన ఈ నృత్య ప్రదర్శన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం ది, అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంది. పనితీరును మెచ్చుకున్న వారిలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ వీడియోను షేర్ చేస్తూ, అద్భుతం. కొరియోగ్రఫీ చేసాను, శ్రీమతి కవిత రాము, కలెక్టర్ పుదుక్కోట్టై ద్వారా తెలిసింది. చదరంగం పావులు మన ఊహల్లో సజీవంగా ఉండేలా చేస్తుంది. అలాగే, ఇది ప్రామాణికతను కలిగి ఉంది, ఈ గేమ్ భారతదేశంలో కనుగొనబడింది. బ్రావో! అని ప్రశంసించారు.
ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రదర్శన క్లిప్‌ను వరుస ట్వీట్లలో వివరాలతో పాటు పంచుకున్నారు. రెండు ట్వీట్లలో, స్టాలిన్ ఇలా వివరించారు, “జిల్లా పరిపాలనని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టాయి. ఈ అందమైన వీడియో పుదుక్కోట్టై జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా అందించబడింది, దీనిలో క్లాసికల్, ఫోక్, మాల్ యుథం , సిలంబం కళా కారు లు అద్భుతంగా మనల్ని సృజనాత్మక ఫాంటసీ ప్రపంచానికి తీసుకువెళ్లారు, ప్రత్యక్ష చెస్ పాత్రలుగా మార్చారు, ఆట సారాం శాన్ని దాని నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తారు.