న్యాయవ్యవస్థపై వైసీపీ మళ్లీ దాడి- సుప్రీం కోర్టు తీర్పునకే వక్ర భాష్యాలు

కోర్టు తీర్పులను లెక్క చేయకపోవడం, తీర్పులను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా వ్యవహరించడం వైసీపీ సర్కార్ కు  ఒక అలవాటుగా మారిపోయింది. జగన్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల అధికారులు కోర్టు బోనులో నిలబడాల్సి వచ్చిన సందర్భాలు ఏపీలో పలు ఉన్నాయి. అయినా తన ధోరణి తనదే అన్నట్లుగా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఏకంగా సుప్రీం కోర్టు తీర్పునే తప్పుపడుతూ ఆ పార్టీ ఎంపి తీవ్ర వ్యాఖ్యలు  చేశారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ న్యాయ వ్యవస్థకు వివక్షను ఆపాదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం కిందట సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదంటూ ఇచ్చిన తీర్పులు ఉటంకిస్తూ వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పు కారణంగా న్యాయవ్యవస్థలో బీసీల సంఖ్య చాలా తక్కువ అయ్యిందనీ, ఆ కారణంగానే కోర్టు తీర్పులలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందనీ విమర్శలు గుప్పించారు. దుర్భుద్దితోనే సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై  తీర్పు ఇచ్చిందని.. వెంటనే దాన్ని ఎత్తి వేయాలని అన్నారు.   రిజర్వేషన్లపై  సుప్రీం తీర్పు రాజ్యాంగం సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన అధికారాల దుర్వినియోగమేనని విరుచుకు పడ్డారు. న్యాయవ్యవస్థలో తగినంత మంది బీసీలు లేకపోవడం వల్లే వారికి అన్యాయం జరుగుతోందని సంజీవ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు తప్పుడు ఉద్దేశాలను అపాదించడమనే ప్రమాదకర క్రీడకు వైసీపీఎంపీ సంజీవ్ కుమార్ తెరతీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అయితే న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు టార్గెట్ గా వైసీపీ దాడులు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో వైసీపీ   న్యాయవ్యవస్థపై చేయని దాడి లేదు. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పేరు పరిశీలనలో ఉన్న సమయంలో ఏకంగా ఆయనపైనే తప్పుడు ఆరోపణలు చేశారు. రాష్ట్రపతికి స్వయంగా వైసీపీ అధినేత జగన్ జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలతో లేఖ కూడా రాశారు. అయితే ఆ ఫిర్యాదులూ, ఆరోపణలూ అన్నీ తప్పుడువని తేలిపోయాయి. జస్టిస్ ఎన్వీరమణ సీజేఐ అయ్యారు. ఈ నెలలోనే ఎన్వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెలలోనే మళ్లీ న్యాయవ్యవస్థపై వైసీపీ వ్యూహాత్మకంగా దాడి చేస్తోందని న్యాయవర్గాలు అంటున్నాయి. అక్రమాస్తుల కేసుల భయంతోనే జగన్ ఇదంతా చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మునుగోడు టెస్టే మూడు పార్టీలకు కీలకం!

తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది, ఆ విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అయితే, రాష్ట్రంలో నిజంగా బీజేపీ బలం పెరుగుతోందా, అంటే, అంత గట్టిగా జవాబు రాదు. ఇప్పటికీ, రాష్ట్రంలో బీజేపీది కాంగ్రెస్ తర్వాతి స్థానమే,అయినా, పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం, రాష్ట్ర నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉందని, అంటున్నారు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వం విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ మొదలు జాతీయ నేతలు బండిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  నెలరోజుల క్రితం, జూలై మొదటి వారంలో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు  అమిత్ షా, రాజనాథ్ సింగ్, గడ్కరీ,ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సహా అనేక మంది జాతీయ రాష్ట్ర నాయకులు ప్రసంగించారు. అదే సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఒకసారి కాదు రెండు సార్లు భుజం తట్టి మరీ మెచ్చుకున్నారు. సభను సక్సెస్ చేసినందుకు అభినందించారు. రాష్ట పార్టీ నాయకత్వంపై విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.  అలాగే, అంతకు ముందు బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగుడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా బండిని మెచ్చుకున్నారు. కేసీఆర్ ను గద్దెదించేందుకు బండి సంజయ్‌ చాలని, తాను రాష్ట్రానికి రావాలసిన అవసరం లేదని అన్నారు. అలాగే, మోడీ, షా, నడ్డాతో పాటుగా  ఇతర జాతీయ నేతలు రాష్ట్రంలో సంజయ్ నాయకత్వంలో బీజేపీ పనితీరును అనేక సందర్భాలలో మెచ్చుకున్నారు. అందుకే, బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదలా ఉంటే, తాజాగా బీహార్  రాజధాని పాట్నాలో జరిగిన, బీజేపీ మోర్చాల జాతీయ సమ్మేళనంలో ప్రసంగించిన అమిత్ షా తెలంగాణలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు చేస్తున్న పోరాటాల స్ఫూర్తితో మోర్చాల నేతలు పని చేయాలని ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పోరాటాలను అమిత్ షా పలుమార్లు ప్రస్తావించారు.బండి సంజయ్ పాదయాత్రల గురించి ప్రస్తావించారు. అయితే, నిజంగా రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటోందా? లేక వాపును చూసి బలుపును అనుకుంటోందా? అంటే, ఏది ఎలా ఉన్నా, బీజేపీ తెలంగాణను టార్గెట్ చేసింది, అనేది మాత్రం నూటికి నూరు శాతం నిజమని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక వస్తే, ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మాత్రం ఇక ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ కు అయినా కమలానికి అయినా మునుగోడే ... లిట్మస్ టెస్ట్ .. అంటున్నారు. అలాగే, అధికార తెరాస భవిష్యత్’ను కూడా మునుగోడు  డిసైడ్ చేస్తుందని అంటున్నారు.

బండి యాత్ర మొదలు

ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్రంలో ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మూడో విడత ప్రజా సంగ్రామ పాద యాత్ర మంగళవారం (ఆగస్టు 2) ప్రారంభించారు.   యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం నుంచి మొదలైన సంజయ్ పాదయాత్ర 24 రోజుల పాటు, సాగనుంది. ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 328 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. కాగా బండి సంజయ్   (మంగళవారం) యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించి, వంగపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, కిషన్‌ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరావుతారు.  యాదాద్రిలో ప్రారంభమై వరంగల్‌లోని భద్రకాళి ఆలయం వరకు మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. ఈసారి చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. ప్రజల సంస్యలు  వినడం, ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేననే సంకేతాలు పంపడమే యాత్ర లక్ష్యంగా బండి సంజయ్ పాద యాత్ర  సాగుతుందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.  మరోవైపు ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో శ్రేణులు నిమగ్నమయ్యాయి. ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 24 రోజులపాటు సాగనుంది.యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వెళ్లనున్నారు. ఐదు జిల్లాల్లోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, జనగాం, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 26న భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. యాత్ర ముగింపు సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవంక ఈరోజు ( ఆగష్టు 2) సిరిసిల్లలో జరగవలసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిరిసిల్ల పర్యటన వాయిదా పడిన విషయం తెలిందే. వరంగల్ ‘లో రైతు గర్జన సభ సక్సెస్ అయిన నేపధ్యంలో ఆగస్టు 2న సిరిసిల్లలో నిరుద్యోగ గర్జన సభ చేపట్టాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జులై మొదటి వారంలో ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కోసం చేపట్టబోతున్న కార్యాచరణ ను డిక్లరేషన్‌ రూపంలో రాహుల్‌గాంధీ ప్రకటిస్తారని తెలిపారు.  అయితే తాజాగా ఈ సభను వాయిదా వేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈడీ విచారణ, పార్లమెంట్ సమావేశాలు, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరైన సమావేశంలో సిరిసిల్లలో రాహుల్ సభను వాయిదా వేయాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. సిరిసిల్లలో రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి కొత్త తేదీలను కాంగ్రెస్ పార్టీ త్వరలో వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అల్ ఖైదా చీఫ్ ను ఖతం చేశాం: జోబైడన్

అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా సేనలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధృవీకరించారు. ఆప్ఘన్ రాజధాని కాబూల్ లో డ్రోన్ దాడి నిర్వహించి అల్ జవహరిని ఖతం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికాకు హాని తలపెట్టిన వారు ఎవరైనా ఎంతటి వారైనా ఎక్కడ దాగున్నా వదిలే ప్రశక్తే లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. ఎంతకాలమైనా  సరే వెంటాడి, వేటాడి మరీ మట్టుపెడతామని స్పష్టం చేశారు. కాబూల్ లో సీఐఏ జరిపిన డ్రోన్ దాడిలో అల్ జవహరి హతమైనట్లు బైడెన్ ధృవీకరించారు. 9\11 (సెప్టెంబర్ 11 2001)లో అమెరికా ట్విన్ టవర్స్ పై అల్ ఖైదా జరిపిన దాడిలో వేల మంది మరణించిన సంగతి విదితమే. ఆ దాడుల సూత్రధాని ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా ఖతం చేసిన సంగతి విదితమే. ఇప్పుడు నాటి దాడులలో మరో సూత్రధారి అల్జవహరినీ అగ్రరాజ్యంమట్టుబెట్టింది. ఇలా ఉండగా తమ భూభాగంలో అమెరికా డ్రోన్ దాడి జరిపి జవహరిని హతమార్చడాన్ని   తాలిబన్ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. అమెరికా చర్య అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది  రామ‌సేతు  రాయి!

పిల్లాడికి పోయింద‌నుకున్న కొత్త పెన్సిల్ అల‌మార్లో దొరికింది, మ‌రో పిల్లాడికి ఊహించ‌నివిధంగా లెక్క‌ ల్లో 100కి 80 వ‌చ్చాయి,   చంటిపిల్లాడిని ఏనుగు ర‌క్షించ‌డం, చాలా ఎత్తునుంచి ఒక వ్య‌క్తి పువ్వులు తీసి కెళ్తున ట్రక్కులో ప‌డ‌టం, చిన్న‌వ‌య‌సులోనే అపార జ్ఞాప‌క‌శ‌క్తి క‌లిగి ఉండ‌టం. మొన్నామ‌ధ్య ఉత్త‌ర‌ ప్ర‌దేశ్ అహిమాల్‌పూర్‌లో ఈత‌కెళ్లిన పిల్ల‌ల‌కి నీళ్ల‌తో తేలుతూ ఓ రాయి క‌నిపించింది! నీళ్లమీద అలా తేలుతూ క‌నిపించిన రాయి పిల్ల‌ల్ని భ‌య‌పెట్టిన మాట వాస్త‌వం. ఎందుకంటే రాయి నీటిమీద అలా కాయితం ప‌డవ‌లా తిర‌గుతూ పోదుగ‌దా! పైగా అంతా యింతా కాదు అది సుమారు ఆరు కిలోల బ‌రువుందిట‌. మ‌రో చిత్ర‌మే మంటే దాని మీద రామ్ అని హిందీలో పెద్ద అక్ష‌రాలు చెక్కిన‌ట్టు ఉండ‌డం! ఇది  మెయిన్‌పురి జిల్లాలోని థానా బెవార్ ప్రాంతంలోని అహి మల్‌పూర్  గ్రామ‌స్తులే కాదు, ఈ రాయి వీడియో చూసిన నెట్‌జ‌న్లు కూడా ఇంకా ఆశ్చ‌ర్యంలోంచి తేరుకోలేదు. ఇదెలా సాధ్యం? ఎప్పుడో రామాయ‌ణ కాలంలో రామ‌సేతు నిర్మాణం గురించి విన్నాం, చ‌దువుతున్నాం. అది అప్ప‌టి మాట‌. కానీ ఇంత అత్యా ధునిక కాలంలో ఇలా ఒక రాయి అదీ రామ్ అనే పేరు రాసి ఉన్న‌ది తేలుతూ క‌నిపించ‌డం ఊహించ‌ని వాస్త‌వం.  పిల్లలు ఆ రాయిని గ్రామ పెద్దల వద్దకు తీసుకెళ్లారు. రామాయణ ఇతిహాసంలో రాముడు రావణుడితో యుద్ధానికి వెళుతున్నప్పుడు నిర్మించిన వంతెన - 'రామసేతు'తో ఈ రాయి ముడిపడి ఉందని స్థానికు లు కొందరు అంటున్నారు. అవును, ఇది ఎంతో ప‌విత్ర‌మైన‌ది. ఇంట్లో పెట్టుకున్నాం. ఇది రామే శ్వరుని రాయి అని, దీని నుండి వంతెన నిర్మించబడిందని కొందరు అంటారు. ప్రతి ఒక్కరికి వారి స్వంత అభి ప్రాయాలు ఉంటాయ‌ని గ్రామ అధిపతి నితిన్ పాండే అన్నారు. ఇదిలా ఉండగా, ఈ రాయిని ఆలయా నికి సమీపంలో ప్రతిష్టించి పూజలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

శూలికి స్వ‌ర్ణం, హ‌ర్జింద‌ర్‌కు కాంస్యం

కామన్వెల్త్ గేమ్స్ 2022లో  ఇండియన్ వెయిట్ లిఫ్టర్ల  హవా కొనసాగుతోంది. తాజాగా భారత వెయిట్ లిఫ్టర్ అచింత శూలి స్వర్ణం గెలుచుకుని కామన్వెల్త్‌లో మరో పతకాన్ని భారత్ ఖాతాలో జమ చేశాడు. 20 ఏళ్ల వయసున్న ఈ యువ వెయిట్ లిఫ్టర్ పురుషుల 73 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకున్నాడు. బెంగాల్‌కు చెందిన ఈ యువ వెయిట్ లిఫ్టర్ 313 కేజీల బరువును ఎత్తి సత్తా చాటాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీల్లో అచింత షూలి పసిడి గెలుచుకున్నాడు. మలేషియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ ఎర్రి హిదాయత్ మహ్మద్ అచింతకు గట్టి పోటీ ఇచ్చాడు. హిదాయత్ మహ్మద్ 303 కేజీలను ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు. కెనడాకు చెందిన వెయిట్ లిఫ్టర్ షాద్ దార్సిగ్నీ 298 కేజీలు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. సోమవారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల విభాగంలో దక్షిణాఫ్రికా క్రీడాకారిణి మైఖెలా వైట్‌బూయ్‌తో జరిగిన ఫైనల్లో భారత జూడోకా ఎల్.శుశీలా దేవి ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. గట్టి పోటీలో, శుశీల 4.25 నిమిషాల్లో 'వాజా-అరి' ద్వారా ఫైనల్‌లో ఓడిపోవడానికి ముందు తీవ్రంగా పోరాడింది. భారత్‌కు ఇది రెండో రజత పతకం. ఆమె 2014 గ్లాస్గో గేమ్స్‌లో కూడా రన్నరప్‌గా నిలిచింది. గేమ్స్‌లో నాటకీయ క్లైమాక్స్ తర్వాత మహిళల 71 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో భారత క్రీడాకారిణి హర్జిం దర్ కౌర్ కాంస్య పత కాన్ని కైవసం చేసుకుంది. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మూడు విఫల ప్రయత్నాల తర్వాత నైజీరియా గోల్డ్ మెడల్ ఫేవరెట్ జాయ్ ఈజ్ నాకౌట్ అయిన తర్వాత ఆమె నిల‌వ‌లేక‌పోవ‌డంతో అదృష్టం హర్జిందర్ వైపు ఉంది. కాగా, స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఐదవ స్థానంలో నిలిచారు, బాక్సర్లు అమిత్ పంఘల్, మహ్మద్ హుస్సాముదిన్, ఆశిష్ కుమార్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లోకి ప్రవేశించారు. బ్యాడ్మింటన్‌లో సింగపూర్‌ను 3-0తో చిత్తు చేసి మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత్ తమ సత్తా చాటింది. భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు కూడా నైజీరియాను ఓడించి ఆగస్టు 2న ఫైనల్ ఆడనుంది. కానీ, కళాత్మక జిమ్నాస్టిక్స్ ఈవెంట్‌లో మహిళల వాల్ట్ ఫైనల్‌లో ప్రణతి నాయక్ ఐదో స్థానంలో నిలిచింది. జోష్నా చినప్ప తన పోటీలో ఓడిపోయింది. పురుషుల హాకీలో ఇంగ్లండ్‌తో భారత్‌ 4-4తో డ్రా చేసుకుంది. జూడోలో పురుషులు -60 కేజీలు - సైప్రస్‌కు చెందిన పెట్రోస్ క్రిస్టోడౌలిడెస్‌ను భారత్‌కు చెందిన విజయ్ కుమార్ యాదవ్ ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ప్ర‌స్తుత గేమ్స్‌లో భారత్‌కు ఇది 8వ పతకం.

ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు , రాజకీయ సమీకరణాలు వేగంగా మరి పోతున్నాయా? కొత్త కొత్త మార్పులు  చోటుచేసుకుంటున్నాయా?  ఇంతవరకు ఓ లెక్క ఇక పై ఇంకో లెక్క అన్నరీతిగా రాష్ట్ర రాజకీయాలను కొత్తమలుపు తిప్పే విధంగా ప్రదాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అధికార వైసీపీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సక్షేమ పథకాలపైనే దృష్టిని కేద్రీకరించారు. నీట ముంచినా, పాల ముంచినా, ‘మీటదే’ భారం అన్నవిధంగా ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే, కొంచెం ఆలస్యంగానే అయినా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఒక చేత్తో మీటలు నొక్కుతో మరో చేత్తో రాష్ట్ర అభివృద్ధి పీక నొక్కుతున్నారని  గ్రహించారు. అందుకే, ముఖ్యమంత్రి అలోచనలు, అంచనాలతో సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నారు. మరో వంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం జగన్ రెడ్డి ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధాలను ఎండగడుతూ జనంలోకి దూసుకు పోతోంది, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ ప్రజాందోళనలలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు, ముందుకు పోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్న పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరో వంక  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక అందచేస్తున్నారు.  అలాగే, దసరా పండగ తర్వాత బస్సు యాత్రకు పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు.  ఇక బీజేపీ విషయానికి వస్తే,నిజానికి రాష్ట్రంలో బీజేపీ బలం కాదు కదా కనీసం ఉనికిని చాటుకునే మందం ఓటు కూడా  లేదు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఎంతో కొంత ప్రాధాన్యత ఉందంటే అందుకు  కారణం ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న బలం కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ కు లేని గుర్తింపు గౌరవం బీజేపీకి దక్కుతున్నాయి. అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం రాష్టంలో పాగా వేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక ఇతరత్రా అవసరాల దృష్ట్యా ఇంతవరకు వైసీపీతో బీజేపీ రహస్య ప్రేమను చూపించింది. ఆ విధంగా,ఇంతవరకు జగన్ రెడ్డి ప్రభుత్వం గండ్ల నుంచి బయటపడుతూ వచ్చిందనేది కాదనలేని నిజం.  కాగా, ఇటీవల కాలంలో,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  ముచ్చటగా మూడేళ్ళుగా సాగుతున్న హనీమూన్ ముగింపుకు చేరుకున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరో వంక రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ అన్నిటినీ మించి ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అనుభవం అవసరమనే విషయాన్ని ప్రజలు గుర్తించారు.ఈ నేపధ్యంలో, రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే,  బీజేపీ జాతీయ నాయకత్వం కూడా రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, చంద్రబాబు ‘విజన్’ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే నిర్ణయానికి వచ్చిందని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే, ఇంత కాలం రాజదాని విషయంలో జోక్యం చేసుకోని బీజేపీ ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ముదనష్టపు ఆలోచనకు వ్యతిరకంగా ప్రత్యక్ష కార్యాచరణకు  దిగిందని అంటున్నారు. నిజమే, మొదటి నుంచి కూడా బీజేపీ ‘ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి’ అనే అంటున్నా, జగన్ రెడ్డి మూడు ముక్కలాటను అడ్డుకునే ప్రయత్నం జరగలేదు. పైపైచ్చు రాజధాని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానిదే అని కూడా చెప్పింది. కానీ, ఇప్పడు రాష్ట్ర బీజేపీ అమరావతి పాదయాత్ర చేపట్టింది. జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక తప్పిదాలను ఎత్తి చూపుతూ హెచ్చరికలు చేస్తోంది. ఈ మార్పు మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరిది బలవన్మరణం!

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త ఎన్‌.టి.రామారావు ఇంట విషాదం అలుముకుంది. ఆయ‌న నాలుగ‌వ కుమార్తె  52 ఏళ్ల  ఉమామ‌హేశ్వ‌రి మరణించారు. ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు చెబుతున్నారు.  అనారోగ్య స‌మ‌స్య ల‌తో గత కొంత‌కాలం నుంచి తీవ్ర మాన‌సిక ఒత్తిడిలో ఉన్న ఆమె, ఆ కారణంగానే  ఆత్మ‌హ‌త్య చేసుకున్నారని చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం  జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో    కంఠ‌మ‌నేని ఉమామ‌హేశ్వ‌రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం  జూబ్లీహిల్స్ పోలీసులు ఆ ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఎన్టీఆర్ న‌లుగురు కుమార్తెల్లో ఉమా మ‌హేశ్వ‌రి అంద‌రికంటే చిన్న‌. ఎన్టీఆర్ కు ఆమె ప‌ట్ల ప్ర‌త్యేక ప్రేమా భిమానాలు ఉండేవి. తో డ‌బుట్టిన అక్క‌లు, అన్న‌లూ ఆమె ప‌ట్ల ఎంతో అభిమానం చూపేవారు. గ‌త డిసెం బ‌ర్ లోనే  ఉమామ‌హేశ్వ‌రి చిన్న కుమార్తె  వివాహం జ‌రిగింది.    ఈ వివాహానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉమామ‌హేశ్వ‌రి  మరణవార్త తో ఎన్టీఆర్ కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. నందమూరి, నారా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. బాలకృష్ణ, చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఉమా మహేశ్వరి నివాసానికి చేరుకున్నారు

మోదీ సార్‌.. పెన్సిల్ కొనుక్కునేదెలా?

కృతీ దూబే త‌ల్లి కొట్టింద‌ని రివ్వున గ‌దిలోకి పారిపోయింది. త‌ల్లి తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్లింది. కృతీకి కన్నీళ్లు ఆగ‌డం లేదు. త‌ల్లిమీద కోపం కాదు పెన్సిల్ పోయింద‌ని. ఏ సోనీ గాడో  కొట్టేసుంటాడ‌నే అనుమా న‌మూ పిల్లకి రాక‌పోలేదు. ఇప్ప‌టికే చాలా పోయాయి. మ‌ళ్లీ కొన‌మంటే వీపు విమానం మోత మోగుతుంది. అస‌లు దీనంత‌టికి కార‌ణం పెన్సిలు ధ‌ర పెర‌గ‌డ‌మే!  అంతే  వెంట‌నే నోట్‌బుక్  కాయితం అమాంతం చింపింది. వేళ్లు నొప్పులు పెడుతున్నా పెద్ద‌పెన్సిలు ప‌ట్టి ఉత్త‌రం రాసింది. బుగ్గ‌ల‌మీంచి క‌న్నీళ్లు తుడుచుకుంటూనే ఉత్త‌రం రాయ‌డం ముగించింది. కోపం కాస్తంత త‌గ్గింది. ఉత్త‌రం ఎలా పంపించాల‌న్న ఆలోచ‌న‌తో కాస్తంత మ‌న‌సు శాంతించింది.   ఇంత‌కీ యూపీ  కనౌజ్‌ జిల్లా చిబ్రమౌ పట్టణానికి చెందిన  ఆరేళ్ల కృతి  ఆ ఉత్త‌రాన్ని వాళ్ల డాడీకి రాయ లేదు.. అమ్మ‌ని తిట్ట‌మ‌ని,  అమ్మ‌ని కొట్ట‌మ‌ని అమ్మమ్మకీ రాయ‌లేదు . ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కే  రాసేసింది! అస‌లు ఆలోచ‌న రావ‌డ‌మే  గొప్ప వింత‌. స‌రే ఇంత‌కీ ఏమి రాసిందో తెలుసా ఇలా ప్ర‌తీ వ‌స్తువు ధ‌ర‌లూ పెంచేస్తారేంటి అని! సారూ.. నా పేరు కృతీ దూబే. ఒకటో తరగతి చదువుతున్నాను. మీరు ధరలు బాగా పెంచుతున్నారు. పెన్సిల్‌, ఎరేజర్ కాస్ట్‌లీ అయ్యాయి. వీటిని పోగొట్టుకుంటే అమ్మ నన్ను కొడుతోంది. పెన్సిల్‌, ఎరేజర్‌ను రేప్పొద్దున తరగతి గదిలో ఎవరైనా దొంగిలిస్తే ఏం చేయను?. మ్యాగీ ధర కూడా బాగా పెరిగింది’ అని. లేఖలో చివ‌ర‌గా మ్యాగీ ధ‌ర కూడా ప్ర‌స్థావించ‌డం విశేషం! ఈ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

విత్తమంత్రికి షాక్.. జగన్ పథకాల డొల్ల తనాన్ని విప్పి చెప్పిన మహిళ

గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎంత తిరుగుతున్నా వారికి జనం నుంచి నిరసనలే తప్ప ఆదరణ కానరావడం లేదు. తాజాగా జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక నిరసన సెగ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు గట్టిగా తగిలింది. ఎంతైనా ఆర్థిక మంత్రి కదా.. అడ్డగోలుగా నిబంధనల కళ్లు గప్పి మరీ రాష్ట్రానికి అప్పులు తీసుకువచ్చిన మంత్రి కదా.. అలాగే జనాన్ని కూడా తన గణిత ప్రావీణ్యతతో ప్రజలను నమ్మించేయగలనని భావించారు. కానీ ఆయనకు ఆ గణాంకాలతోనే గట్టి క్లాస్ తీసుకుంది ఓ  మహిళ. వివరాలిలా ఉన్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కర్నూలు జల్లా డోన్ నియోజకవర్గంలో పర్యటించారు. 30వ వార్డులోని ఓ మహిళ ఇంటికి వెళ్లిన ఆయన ఆమెకు ప్రభుత్వ పరంగా అందిన లబ్ధిని అంకెలతో సహా వివరించారు. అయితే ఆమె ప్రభుత్వం చేసిందేముందని, ఇందులో ఘనత ఏముందని ఎదురు ప్రశ్నించింది. దీంతో ఆమెకు మరింత వివరంగా చెప్పేందుకు ప్రయత్నించిన జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా ఆమె కుటుంబానికి 98 లక్షల 140 రూపాయలు ముట్టిందని లెక్కలు వేసి మరీ వివరించారు. దీంతో ఆ మహిళ జగనన్న చేదోడు పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకూ తమకు అది రాలేదని నిలదీశారు. అంతే కాకుండా తన కుటుంబానికి 98140 రూపాయలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రావడంలో ప్రభుత్వం గొప్పేముందని ఎదురు ప్రశ్నించారు. ఇచ్చింది లక్ష లోపు.. పన్నుల రూపంలో వసూలు చేసింది రెండు లక్షల పైమాటేనని ఆమె గణాంకాలతో సహా వివరించారు.  కంగు తిన్న మంత్రి బుగ్గన ధరల పెరుగుదల, పన్నుల వాత తమ ప్రభుత్వం ఒక్కటే కాదనీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఈ పరిస్థితి ఉందనీ వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆమె చెత్త పన్ను, ఈ పన్ను, ఆ పన్నూ ఏమిటంటూ నిలదీశారు. దీంతో బుగ్గన అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి కదిలారు. 

రాజ‌కీయ‌ క్రీనీడ‌లో బ‌డుగుల హాస్ట‌ళ్లు!

ఓ గ‌దిలో ప‌ది మంది పిల్ల‌లు, వీల‌యినంత నీర‌సంతా ఉన్నారు. హ‌ఠాత్తుగా ఒకామె వ‌చ్చి పెద్ద గిన్నెతో అన్నం, నీరు లాంటి ప‌ప్పు తెస్తుంది. మ‌రొక‌డు వ‌చ్చి కంచాల్లాంటివి పిల్ల‌ల‌ ముందు ప‌డేస్తాడు. వారికి ఆమె ఆ తెచ్చిందే వ‌డ్డించి వెళిపోతుంది. వాళ్లు చ‌చ్చేంత ఆక‌లితో ఉండ‌డంతో అమాంతం తినేస్తుంటా రు. ఇదంతా ఓ సినిమా సీన్‌. ఇందుకు పెద్ద‌గా భిన్నంగా ఏమీ ఉండనివి మ‌న తెలుగు రాష్ట్రాల్లోని బిసీ ఎస్టీ ఎస్సీల హాస్ట‌ల్ ప‌రిస్థితులు. ఇపుడు కాస్తంత జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు గ‌నుక, నాయ‌కుల‌నూ నిల‌దీస్తు న్నారు గ‌నుక మ‌రీ దారుణ ప‌రిస్థితి లేద‌ని సంబం ధిత అధికారులు అంటున్నారు. వాస్త‌వాన్ని ఎవ‌రు మాత్రం అంగీక‌రిస్తారు?  ఇవాళిటి పిల్ల‌లే రేప‌టి పౌరులు అనే నినాదం ఆనాదిగా ఉంది. కానీ ఆరోగ్యం మాటేమిటి?  వారి  ఆరోగ్యా న్ని మాత్రం ప్ర‌భుత్వాలు అంత‌గా ప‌ట్టించుకోవు. ఎవరూ ఏ పార్టీ వారూ గ‌ట్టిగా ప‌ట్టించుకోరు. కేవ‌లం సంబంధిత ప్ర‌జాసంఘాల‌వారు ఆగ్ర‌హం వ‌చ్చిన‌పుడ‌ల్లా గొంతు చించుకుని రోడ్ల‌ మీద‌కి వ‌స్తుంటారంతే. అస‌లు ఇలాంటి హాస్ట‌ళ్ల‌లో ఉండేవారు క‌నీసం రెండు పూట‌లా గ‌డ‌వ‌ని కుటుంబాల నుంచి వ‌చ్చిన‌వారే. వారిలో చాలామందికి చ‌దువుకోవాల‌న్న ఆకాంక్ష ఎక్కువ‌గానే ఉంటుంది. మంచి చ‌దువు చ‌దివి ఇంటికి వెళ్లి త‌న‌వారిని పోషించాల‌న్న ఆలోచ‌నా ఉంటుంది. హాస్ట‌లు ఇల్లులా ఉంటుంద‌ని వారికేమీ పెద్ద న‌మ్మ కం ఉండ‌దు. కాకుంటే మ‌రీ  అన్యాయంగా ఉండ‌ద‌నే అనుకుంటారు. చాలాకాలం నుంచి ఎస్సీ ఎస్టీ, బీసీ హాస్ట‌ళ్లు, స్కూలు హాస్ట‌ళ్లు అన‌గానే  అంద‌రికీ వాటి  నిర్వ‌హ‌ణ  మీద పెద్ద న‌మ్మ‌కం లేదు. ఆ విధమైన అభిప్రాయం ఏర్ప‌డ‌డానికి కార‌ణం ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య‌మే అనేది ప్ర‌జా సంఘాల మాట‌. ఎప్పుడూ ఓట్లు రాజ‌కీయ‌మే కాకుండా పిల్ల‌ల ఆరోగ్యం, విద్య‌, వారి హాస్ట‌ళ్ల మౌలిక స‌దుపాయాలు, నిర్వ‌హ‌ణ గురించిన దృష్టి కూడా ఉండాల‌ని వారి నినాదం. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప‌ట్ట‌ణం లో నైనా హాస్ట‌ళ్ల ప‌రిస్థితులు ఇలానే ఉండ‌ట‌మే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. పిల్ల‌లు కాస్తంత మంచి తిండి తిని, చ‌దువు మీద దృష్టిపెట్టి బాగుప‌డ‌తార‌ని పిల్ల‌ల త‌ల్లిదండ్రులు గంపెడాశ‌తో ఇళ్ల‌ద‌గ్గ‌ర  నిమ్మ‌ళంగానే ఉం టారు. కానీ వాస్త‌వ చిత్రం వారికి అంతగా తెలియ‌క కాదు. కానీ అధికారుల‌ను, ప్ర‌బుత్వాన్ని ప్ర‌శ్నించే ధైర్యం చేయ‌లేరు.  సామాజిక కార్య‌క‌ర్త‌లు, ఎస్సీఎస్టీ, బిసీ సంఘాల నాయ‌కులు వారికిమ‌ద్ద‌తుగా ఉద్య‌మాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు, ప్ర‌చారాలు, నినాదాల‌తో ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డం జ‌రుగుతూనే ఉంది. ప్ర‌భుత్వం వారి మాట‌లు, నినాదాలు విన‌డంతోనే స‌రిపెట్టుకుంటోంది. అభ్య‌ర్ధ‌న‌లు, విన‌తులు అన్నీ బుట్ట‌దాఖ‌ల‌వుతూనే ఉన్నా యన్న‌ది ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్న విశ్లేషుకులు అంటున్నారు. అవినీతి తిమింగలాల పై చర్యలు లేక పోగా  ఇంకా వారినే  సంబంధిత అధికారులుగా  కొన‌సా గించడం చూస్తే పిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ కన్నా తమ రాజ‌కీయ స్వార్ధంతో  పిల్లల‌ ఆరోగ్యాన్ని, భ‌విత‌ను గాలికి వ‌దిలేస్తున్నారు. అస‌లు హాస్ట‌ళ్ల‌ను కాంట్రా క్టుకు ఇవ్వ‌డం, అలా అధికారం చెలాయించేవారు త‌మ‌కు తోచిన‌విధంగా వ్య‌వ‌హ‌రిస్తూ ధ‌నార్జ‌న‌కు పాల్ప డడ‌మే త‌ప్ప పిల్ల‌ల ఆరోగ్య‌, విద్య అభివృద్ధిని ప‌ట్టించుకోవ‌డంలేదు. స‌ద‌రు కాంట్రాక్ట‌ర్లు సంబంధిత పార్టీల నాయ‌కులు, ప్ర‌భుత్వ అధికారుల‌తో చెలిమితో తీవ్ర‌స్థాయిలో వ్య‌వ‌హ‌రించ‌డం అప్పుడ‌పుడూ మీడియా ద్వారానే బ‌య‌ట‌ప‌డుతోంది.           ఇటీవ‌ల కొన్ని హాస్ట‌ళ్ల‌లో  ఆహారంలో పురుగులు రావ‌డం గురించిన వార్త‌లు విని చాలామంది భ‌య‌ప‌డ్డా రు. ఒక‌టి రెండు ప్రాంతాల్లో ఏకంగా పిల్ల‌లు ఒక‌రిద్ద‌రు పారిపోయార‌న్న‌వార్త‌లు విన‌వ‌చ్చాయి. అస‌లు హాస్ట‌ళ్ల వాస్త‌వ ప‌రిస్థితుల సంగ‌తి  తల్లి తండ్రులకు చెప్పకపోవడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. కనీసం ఘట న జరిగిన తరువాత అయినా విచారణ జరిపి చర్యలు తీసుకోకపోవడం పై ప్రభుత్వ ప్రై వేట్ వసతి గృహా ల నిర్వాహకుల పట్ల తల్లి తండ్రులు తీవ్ర ఆందోళనకు దిగుతామని  ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.  అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే బాసర ఐ ఐ ఐ టి పరిస్థితి మరీదారుణం గా  ఉండటం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుందని ఇటీవ‌లి సంఘ‌ట‌న‌లు తెలియ‌జేశాయి.  నాసిరకం ఆహారం పెడుతూ,నాణ్యత ప్రమాణాలు పాటించని మెస్ నిర్వాహకుల పుణ్యమా అని పిల్లలు అనారోగ్యం పాలై ఆసుపత్రుల  పాలైనా చనిపోతున్నా తమకేమి పట్టదని అటు ప్రభుత్వం ఇటు మెస్ నిర్వాహకులు నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తే విద్యార్ధులపై దాడులు చేయడం యాజమాన్యం బెదిరింపులకు దిగడం పట్ల సర్వత్ర నిరసనలు వ్యక్త మౌతున్నాయి. విద్యార్ధులకు మద్దతుగా నిలిచిన విద్యార్థి సంఘాల ను అరెస్టు చేయడం విద్యార్ధుల  డిమాండ్ ను అమలు చేయకుండా  కాలయాపన చేయడం చూస్తుంటే విద్యార్ధుల సమస్యల పరిష్కారం లో ప్రభుత్వం చిత్తసుద్ధిని శంకిచాల్సి వస్తుంది. ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే న్యాయ పోరాటం చేసేందు కైనా సిద్ధమని విద్యార్ధి సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అందులో భాగంగానే ఆదివారం (జులై 31) శ్రీనగర్ కాలనీలోన విద్యాశాఖ మంత్రి సబిత ఇంటిని విద్యార్థుల తల్లిదండ్రులు ముట్టడించి ధర్నాకు దిగారు. బాసరలోని త్రిబుల్ ఐటీ హాస్టల్ లో సౌకర్యాల లేమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన సౌకర్యాలు కల్పించలేకుంటే ట్రిపుల్ఐటీనే మూసేయండి కానీ విద్యార్థుల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాలాలు వద్దని హెచ్చరించారు.

దేశంలో మంకీపాక్స్.. కేరళలో తొలి మరణం!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మంకీ పాక్స్ వైరస్ దేశంలో కూడా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.  దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైర కేరళలోనే ఈ వైరస్ కారణంగా తొలి మరణం కూడా నమోదైంది. కేరళలోని త్రిసూర్ జిల్లా చావక్కాడ్ కురంజియార్కు చెందిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ వైరస్ సోకి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దేశంలో మంకీ పాక్స్ వైరస్ కారణంగా సంభవించిన తొలి మరణం. మంకీపాక్స్ కారణంగా ఒకరు మరణించినట్లు ధృవీకరించిన కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  వీనా జార్జ్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ మంకీపాక్స్ వైరస్ కారణంగా ఒక వ్యక్తి మరణించిన సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మృతుడు యూఏఈ నుంచి గత నెల 22న భారత్ కు వచ్చినట్లు పేర్కొన్న ఆమె, అతడికి అక్కడే పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందనీ, అయినా వచ్చిన తరువాత కూడా జాగ్రత్తలు తీసకోకుండా బయట యథేచ్ఛగా తిరిగాడని పేర్కొన్నారు. సరైన చికిత్స తీసుకోకపోవడం వల్లనే తీవ్రమైన జర్వం వచ్చిందనీ, పరిస్థితి విషమించిన అనంతరం ఆసుపత్రిలో చేరాడనీ, చికిత్స పొంందుతూ మరణించాడనీ మంత్రి వివరించారు. మంకీ పాక్స్ వైరస్ ప్రాణాంతకం కాదనీ, కేరళలో మరణించిన వ్యక్తి వైరస్ సోకిందని తెలిసిన తరువాత కూడా చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పరిస్థితి విషమించి మరణించాడని ఆమె వివరించారు. ఆ యువకుడిని కలిసిన వ్యక్తులందరూ ఐసోలేషన్ లో ఉండాలని పేర్కొన్నారు. మరో వైపు మంకీపాక్స్ వైరస్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. 

సింహం జాలి..జింక పిల్లకి భ‌యంతోడి స‌ర‌దా !

చిన్న‌ప్ప‌టి నుంచి పులి, మేక..సింహం, న‌క్క‌..మొస‌లి, కోతి.. క‌థ‌లు చ‌దివే వుంటారు. ఇంట్లో పెద్ద‌వాళ్లు చెబితే విన‌న్నా వినే ఉంటారు. అయితే అడ‌వి మృగాల‌న్నీ ఎల్ల‌వేళ‌లా అంతే క్రూరంగా ఉంటాయ‌నీ అన‌లేం. వాటికి త‌ల్లి, పిల్ల‌ల ప్రేమ తెలుసు. వాటిలోనూ తోటి చిన్న ప్రాణులప‌ట్ల లోలోప‌ల ఎక్క‌డో కాసింత జాలీ ఉంటుంది. అవున‌నే అంటోంది  ఈ జింక పిల్ల‌తోడి సింహం. అడ‌విలో  సింహం అలా తిరుగుతూండ‌గా  హ‌ఠాత్తుగా ఈ చిన్నారి జింక పిల్ల ఎదుర‌యింది. అంతే జింక పిల్ల‌కు చ‌చ్చేంత భ‌యం వేసింది. వేగంగా ప‌రిగెత్త‌లేదు, దాన్నించి త‌ప్పించుకోనూ లేదు. సింహాంగారికి టిఫిన్ అవుతున్నాన‌ని త‌ల్లిని ఒక్క‌సారి త‌ల‌చుకుని క‌ళ్లు మూసుకుంది. కానీ చిత్ర‌మేమంటే  అది భ‌య ప‌డినంత‌గా ఏమీ జ‌ర‌గ‌లేదు. సింహం మాత్రం జింక పిల్ల త‌ల్లి గ‌తంలో త‌ప్పించుకుపోయింద‌న్న ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించ‌లేదు. దీన్ని తినేసి దాన్ని బాధ‌పెట్టేయాల‌ని సినిమాటిక్‌గానూ ఆలోచించ‌లేదు. ద‌గ్గ‌రికి వెళ్లి ఆ చిన్నారి భ‌యం పోగొ ట్టింది. జింక పిల్ల మాత్రం త‌న ఒణుకుని వ‌దిలించుకుని సింహం పంజానే చూస్తూ కూచుండి పోయింది.  కానీ జింక పిల్ల మాత్రం కాసింత భ‌యంతోనే ఒదిగికూచుంది. ఏ క్ష‌ణాన ఏ న‌క్క‌బావో వ‌చ్చి ఏ అద్బుత ఆలోచ‌నో సింహం చెవిలో ప‌డేస్తే తానేమైపోతానా అని భ‌య‌ప‌డుతూనే ఉంది. కానీ ఆ సాయిత్రం చీక‌టి ప‌డేవ‌ర‌కూ కూడా అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. సాయిత్రం చీక‌టిప‌డేవేళ్ల‌కి మాత్రం సింహానికి త‌న పిల్ల‌లు గుర్తొచ్చిన‌ట్టుంది. ఠ‌క్కున లేచి ఒక్క‌సారి దూరంగా ఎటో చూసింది. అప్ప‌టిదాకా కాళ్ల‌ద‌గ్గ‌రే భ‌యంతో ప‌డున్న జింక పిల్ల మొహాన్ని పెద్దగా ముద్దాడి మ‌ళ్ల క‌లుద్దామ‌ని  చాలా హుందాగా వెళిపోయింది.  సిం హం క‌నుమ‌రుగైన కొద్దిసేప‌టికి ఈ చిన్నారి లేచి ధైర్యం కూడ‌గ‌ట్టుకుని నిటారుగా నిల‌బ‌డి నేను సింహాం తో ఇప్పుడే స‌ర‌దాగా నాలుగు మాట‌లు మాటాడి వ‌స్తున్నాన‌ని త‌ల్లికి  చెప్పేంత ధైర్యం ప్ర‌ద‌ర్శిస్తూ తాను ఇంటికి వెళ్లింది!

ఆగష్టు 7 ముహూర్తం ఖరార్

అవును... మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది.   ఆగష్టు 7 వ తేదీన, ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే, అదే రోజున శాసన సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారా, అంటే, ఆ నిర్ణయం ఇంకా జరగలేదని అంటున్నారు. నిజానికి, రాజగోపాల రెడ్డి బీజేపీలో చేరాలనే నిర్ణయం, ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన రోజునే ఖరారైందని, అయితే, అనుచరులతో చర్చించేందుకే, ఆయన కొంత సమయం తీసుకున్నారని అంటున్నారు.  ఇదలాఉంటే, మరోవంక రాజగోపాల రెడ్డి చేయివదలి పోకుండా చూసేందుకు కాంగ్రెస్ నాయకత్వం  అన్ని ప్రయత్నాలు చేసింది. నల్గొండ జిల్లాకే చెందిన మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దూతలుగా రాజగోపాల రెడ్డి ఇంటికి వెళ్లి మరీ బుజ్జగింపు చర్చలు జరిపారు. అయినా రాజగోపాల రెడ్డి, నో’ అన్నారు. కాంగ్రస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, రంగంలోకి దిగారు. మాట్లాడుకుందాం ఢిల్లీకి రమ్మని పిలిచారు.అయినా, రాజగోపాల రెడ్డి ఢిల్లీ వెళ్ళలేదు. ఇలా బుజ్జగింపుల మొదలు పదవుల బేరసారాలవరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పటికే బీజేపీ రాజకీయ,వ్యాపార చక్రబంధంలో చిక్కుకు పోయిన రాజగోపాల రెడ్డి ససేమిరా అన్నారు. పార్టీని వీడేందుకే మొగ్గు చూపారు.ఉపఎన్నికతో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడమే తన ఎజెండా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇక లాభం లేదని  నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నిజానికి, మునుగోడు ఉపఎన్నిక తెరాస, బీజేపీల కంటే కాంగ్రెస్ పార్టీకే కీలకమని కాంగ్రెస్ ముఖ్యనాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓడి పోవడంతో ఈ ఉప ఎన్నికల్లొనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మరో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోలేక పోయిందనే ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ మరింత దెబ్బ తింటుందని అంటున్నారు. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి ఇమేజ్ ని దెబ్బ తీయడమే కాకుండా పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం పై చేయి సాధిస్తుందని అంటున్నారు. అందుకే, కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ముఖ్యనాయకులతో  సోమవారం  ఢిల్లీలో సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిపై సస్పెన్షన్ వేటువేసే విషయంతో పాటుగా, ఉప ఎన్నిక అనివార్యమైతే ఎవరిని బరిలో దించాలనే అంశం సహా  సంబంధిత అంశాలపైనే చర్చ ఉంటుంది  అంటున్నారు. హుజురాబాద్ విషయంలో చివరి వరకు అభ్యర్ధిని ఖరారు చేయక పోవడం వలన  ఘోరాతి ఘోరంగా ఓడి పోయామనే భావనలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం మునుగోడు విషయంలో ముందు చూపుతో అడుగు వేస్తోందని అంటున్నారు. అయితే,  మునుగోదు కాంగ్రెస్ కు పట్టున్న నియోజక వర్గమే అయినా,  ఉప ఎన్నికల్లో విజయం అంత ఈజీ కాదనీ అంటున్నారు.

అనేక స‌మ‌స్య‌లు.. వ్య‌ర్ధ‌మైన‌ అనేకానేక అవ‌కాశాలు!

స‌మ‌స్య‌లు చుట్టుముట్టిన‌పుడు వాటి నుంచి బ‌య‌ట‌ప‌డే మ‌ర్గాన్ని ఆలోచించాలి. కానీ అవి త‌న‌కు సంబంధం లేనివని భావించి స్వ‌లాభాపేక్ష‌తో తిరిగితే అవే స‌మ‌స్య‌లు ఉన్న స్థితిని దిగ‌జారుస్తాయి. చాప‌కింద‌కి నీళ్లు వ‌చ్చిన‌పుడు కాకుండా ముందే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం చెప్ప‌గ‌లిగేవారి ద‌గ్గ‌ర‌కు, సాయం చేసేవారి ద‌గ్గ‌ర‌కు వెళ్లాలి. త‌ప్ప స్నేహ‌పూర్వ‌కంగా నాలుగు మాట‌లు మాట్లాడుకుని కాఫీ తాగి న‌వ్వుతూ తిరిగిరావ‌డం వ‌ల్ల ఏమాత్రం ప్ర‌యోజ‌నం ఉండ‌దు. స‌రిగ్గా ఈ చిత్రాన్నే చూస్తున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి  నుంచి   ఇప్పటి అత్తారిం టికి వెళ్లి నంత దర్జాగా హస్తిన పర్యటనలు చేస్తున్నారు కానీ అక్కడ అల్లుడు మర్యాదలు ఏవీ లభించిన దాఖలాలు లేవు. పైపెచ్చు రాష్ట్రానికి హక్కుగా రావలసిన ఏ ఒక్కదానినీ ఇవ్వకుండా అవమానాలను ఎదురిస్తున్నారు. అయినా జగన్ కిమ్మనడంలేదు. ఇదేమిటి అని ప్రశ్నించడం లేదు. అసలు రాష్ట్రానికి ఇవి కావాలి. ఇది మా హక్కు అని ఒక్కసారైనా కేంద్రాన్ని కోరారా అన్నది కూడా అనుమానమే. ఏమీ సాధించకుండా హస్తిన వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. చిరునవ్వులతో ఫొటోలకు పోజులిస్తున్నారు. అంతే అక్కడ ఏం జరిగింది. భేటీలలో ప్రస్తావనకు వచ్చిన అంశాలేమిటి అన్నది బయటకు పొక్కనీయడం లేదు. పర్యటనలన్నీ ఏదో సొంత వ్యవహారమన్నట్లు సాగించేస్తు న్నారు. అంతులేని రహస్యాన్ని  మెయిన్టైన్ చేస్తున్నారు.  దీనినే విపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రశ్నిస్తు న్నాయి. విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినా జగన్ బేఖాతరు చేస్తున్నారు. రాష్ట్రం ఎదుర్కొం టున్న అనేకానేక విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఈ మూడేళ్లలో వచ్చిన అనేక అవకాశాలను ఆయన వ్యర్థం చేశారు. అడగకుండానే కేంద్ర నిర్ణయాలన్నిటికీ డూడూ బసవన్నలా తలూపేయడానికి కారణమేమిటని విపక్షాలు నిలదీస్తున్నా జగన్ బే ఫర్వాగానే వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పటి మిత్రపక్షం బీజేపీతోనూ.. భాగస్వామ్య పక్షంగా ఉండి కూడా ఎన్డీయే సర్కార్ తోనూ రాష్ట్రానికి న్యాయంగా రావలసిన నిధులు, హోదా ఇవ్వడం లేదనే విభేదించారు. పోట్లాడారు. కోట్లాడారు. నిలదీశారు. ప్రశ్నించారు. ఆ కారణంగానే ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ కూడా దక్కలేదు. ఇప్పుడు జగన్ కేంద్రంలోని ఎన్డీయేలో భాగ స్వామ్య పక్షం కాదు. కనీసం రాష్ట్రంలో బీజేపీతో మైత్రి కూడా లేదు. అయినా సరే రాష్ట్ర హక్కుల కోసం నోరిప్పడం లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తాం అంటే నవ్వుతూ వింటున్నారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టినా మొహం మీద చిర్నవ్వును చెరగనీయడం లేదు. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు మోటార్లు బిగించాలని ఆలోచిస్తున్నాం అని కేంద్రం అనగానే ఇక్కడ బిగించేస్తున్నారు. అంతగా అడుగులకు మడుగులొత్తినా రాష్ట్రానికి ఆయన సాధించు కువచ్చిన ప్రయోజనం శూన్యమే.   తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఆస్తుల విభ‌జ‌న, విభ‌జ‌న అంశాల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని కేంద్ర మంత్రి అమిత్  షాను  క‌లి సిన ప్ర‌తీసారీ జ‌గ‌న్ కోరార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారేగాని,  ఫ‌లితం ద‌క్క‌నే లేదు.  విశాఖ రైల్వే జోన్ విష‌యంలోనూ కేంద్రం చేతులు ఎత్తేసింది. దాని మాట తెర‌మీద‌కి వ‌చ్చిన‌పుడ‌ల్లా రాష్ట్రంలో ఏదో ఒక స‌మ‌స్య‌ను ప్ర‌శ్నించ‌డంతో ఇక్క‌డి బీజేపీ నేత‌లు ఆ సంగ‌తిని మ‌ర్చిపోయేలా చేస్తున్నారు. ఇదంతా ప్ర‌భుత్వం త‌మ బాధ్య‌త‌గా కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేక‌పోవ‌డం వ‌ల్ల త‌లెత్తిన ప‌రిస్థితుల‌ని విశ్లేష‌కులు అంటున్నారు.   కేవ‌లం త‌న రాజ‌కీయ ప‌ర‌ప‌తి, సుస్థిర‌త కోస‌మే కేంద్ర నాయ‌కుల‌ను క‌ల‌వ‌డం త‌ప్ప ఈ స‌మ‌స్య‌ల గురించి వీస‌మెత్తు ధైర్యంగా ప్ర‌శ్నించిన స‌మ‌యమే ఆయనకు చిక్కలేదా అని విశ్లేష‌కులు ప్రశ్ని స్తున్నారు.

వైసీపీ ఎంపీల్లో సగం మంది ఔట్!

ఏపీలో వైసీపీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా పడిపోతోందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నేతలు, జిల్లాలు, ప్రాంతీయ ఇన్ చార్జిలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఆ భేటీల్లో తాను స్వయంగా చేయించిన సర్వేల్లో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన రిపోర్టులపై గుస్సా అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా  పార్టీ మరోసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని, అందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై జగన్ లో  అసహనం ఓ రేంజ్ లో పెరిగిపోతున్నట్లు ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు సరిగా లేకపోవడం వల్లే పార్టీకి గడ్డుకాలం ఎదురయ్య పరిస్థితి రాబోతోందని జగన్ వైసీపీ నేతల విషయంలో సలసల కాగిపోతున్నారంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ తన పార్టీలోని ప్రస్తుత ఎంపీల్లో సగం మందికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారనే వార్త ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సగం మంది ఎంపీల పనితీ రు సరిగా లేదని తాను చేయించుకున్న సర్వేల ఫలితాలు చెప్పడంతో జగన్ వారిని తప్పించి కొత్త వ్యక్తులను ఈ సారి బరిలో దింపాలనే నిర్ణయం తీసుకున్నారంటున్నారు. అలా ఈ సారి సీట్లు వచ్చే ఛాన్స్ లేని ప్రస్తుత వైసీపీ ఎంపీల జాబితాలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత ఉన్నారన్న గుసగుసలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. ఇక నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎలాగూ రెబెల్ గా మారారు కనుక ఆయన వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో ఉండరు. కనుక టికెట్ ఇచ్చే ప్రశ్నే తలెత్తదు. విజయవాడ ఎంపీ స్థానం నుంచి పి.వరప్రసాద్ మరోసారి టికెట్ ఆశిస్తున్నా కానీ.. ఆయనకు కాకుండా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు ఇస్తే బాగుంటుందని జగన్ యోచిస్తున్నట్లు వైసీపీ నాయకులు అంటున్నారు. అలాగే కడప ఎంపీ, తన కజిన్ అయిన వైఎస్ అవినాశ్ రెడ్డిని ఈ సారి ఎన్నికల్లో ఆ స్థానం నుంచి తప్పించి, పి. మిథుర్ రెడ్డి సిట్టింగ్ స్థానం రాజంపేట నుంచి బరిలో దింపే అవకాశాలను జగన్ పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కడప నుంచి ఈ సారి వైఎస్ కుటుంబానికే చెందిన మరొరికి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారన చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. వారిలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగరేసి, ప్రతి రోజూ వైసీపీని, వైఎస్ జగన్ ను, ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి తదితరులపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతూనే ఉన్నారు. దాంతో నర్సాపురం పార్లమెంటరీ స్థానం నుంచి ఈ సారి మాజీ ఎంపీ, బీజేపీ నేత గోకరాజు గంగరాజు కుమారుడ్ని బరిలో దింపాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ సారి ఎంపీ టికెట్ వచ్చే ఛాన్స్ లేని వారిలో బాపట్ల ప్రస్తుత ఎంపీ నందిగం సురేష్ పేరు ప్రధానంగా వినిపిస్తోందంటున్నారు. తాడికొండ అసెంబ్లీ స్థానం నుంచి ఈ సారి నందిగం సురేష్ ను బరిలో దింపొచ్చంటున్నారు. ఎంపీగా సురేష్ ఉంటే.. ఆ లోక్ సభా నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని జగన్ అంచనాకు వచ్చారట. సొంత పార్టీ నేతలే పలువురు సురేష్ పట్ల గుర్రుగా ఉన్నారట. దీంతో సురేష్ ను మార్చేయడం తథ్యం అంటున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను వైసీపీ అధిష్టానం ఇప్పటికే పక్కకు పెట్టేసింది. దీంతో శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారంటున్నారు. అమరావతి రాజధానికి శ్రీకృష్ణ దేవరాయలు అనుకూలంగా ఉన్నారనేది వైసీపీ అధిష్టానం నమ్మకమట. అందుకే ఆయన పట్ల చిన్నచూపు చూపుతోందంటున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు జెల్ల కొట్టి ఈ సారి అక్కడ ఓ బీసీ నేతను బరిలోకి దింపాలనేది జగన్ యోచనగా ఉందంటున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు కూడా ఈ సారి టికెట్ తుస్సే అని తెలుస్తోంది. పార్టీలో భరత్ కు సఖ్యత లేకపోవడం వల్లే ఈ సారి భరత్ కు భంగపాటు తప్పదంటున్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పనితీరు అస్సలు బాగోలేదు. అయితే.. ఈ సారి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆమె యత్నిస్తున్నారట. కాకినాడ ప్రస్తుత ఎంపీ వంగా గీత విద్యాధికురాలే కానీ.. పార్టీ అధిష్టానం ఆశించినంత మేరకు ఆమె దూకుడుగా వ్యవహరించడంలేదనే భావన బలంగా ఉందంటున్నారు. అందుకే ఈ సారి గీత రాత మారిపోతుందంటున్నారు. మొత్తానికి ప్రస్తుత వైసీపీ ఎంపీల్లో సగం మంది వరకు ఈ సారి టిక్కెట్లు లభించే అవకాశాలు లేవనే ఊహాగానాలు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతుండడం గమనార్హం.

మూడు పార్టీలకే చెమటలు పట్టిస్తున్న కోమటి రెడ్డి

కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి.. ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి దూకేయడానికి సిద్ధపడ్డారని అందరికీ అర్థమైంది. అయితే ఆయన ఎప్పుడు చేరుతారన్న విషయం మాత్రం తెలుగు టీవీ సీరియల్ గా  సా...గుతోంది. ఈ క్రమంలో ఆయన తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకూ చెమటలు పట్టిస్తున్నారన్నది మాత్రం వాస్తవం. మునుగోడు అసెంబ్లీ నియోజవకర్గానికి ఉప ఎన్నిక ఖాయం అన్న వార్త ఖరారు కావాలంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటమి రెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేయాలి. ఇదిగో ఇప్పుడు, అదిగో అప్పుడూ అంటూ ఆయన రాజీనామా ముహూర్తం మాత్రం ఎప్పుడు ఖరారౌతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.   అయితే ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం చెమటలు పట్టిస్తున్నారు. ఎలాగంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికలో విజయంపై ధీమాగా లేదు. అందుకోసం ఎలాగైనా కోటమి రెడ్డి రాజగోపాల రెడ్డిని బుజ్జగించేందుకు శతధా ప్రయత్నం చేస్తోంది.  మరొ వైపు రెండు వరుస ఉప ఎన్నికలలో పరాజయం తరువాత అధికార టీఆర్ఎస్ మరో ఉప ఎన్నికలో పరాజయాన్ని స్వీకరించడానికి రెడీగా లేదు. అందుకే మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా ఉంటే బాగుండునని భావిస్తోంది. ఒక వేళ చేసేసి ఉప ఎన్నికను అనివార్యం చేస్తారేమోనని ఆందోళన పడుతోంది. ఒక విధంగా కోమటి రెడ్డి రాజీనామా వల్ల ఉప ఎన్నికలు వస్తాయన్న భయంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు చెమటలు పట్టడాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఉప ఎన్నిక కావాలని కోరుకుంటున్న బీజేపీకీ కోమటిరెడ్డి తీరు, వైఖరి చెమటలు పట్టిస్తున్నాయి. ఎరక్కపోయి ఆయనను నమ్ముకున్నామని పార్టీ రాష్ట్ర నాయకత్వమే కాదు, అధిష్టానమూ బెంగటిల్లుతోంది. ఎందుకంటే.. రాజీనామా పేరుతో కోమటిరెడ్డి బీజేపీతో చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంత కాలం రాష్ట్రంలో బీజేపీ అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు గట్టి సవాల్ విసురుతూ బలోపేతం కావడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతే కాదు.. తన వల్లే, తన సవాల్ వల్లే కేసీఆర్ ఖంగారు పడుతున్నారనీ, తాను రంగంలో ఉంటే టీఆర్ఎస్ జీరోయే అన్న లెవల్ లో మాట్లడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీతో చెడుగుడు ఆడుకుంటున్నారు. తనను సీఎం స్థాయి అభ్యర్థిగాఫోకస్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు.  కేసీఆర్‌తో బీజేపీ పక్షాన తనే యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పుకుంటున్నారు. తాను బీజేపీలో చేరడం ద్వారా  ఆ పార్టీ కేసీఆర్‌పై చేస్తున్న  యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నానన్న రేంజ్ లో ఆయన మాటలు ఉన్నాయి. దీంతో కమలం పార్టీలో కలకలం ప్రారంభమయింది.  అంతే కాదు.. రాజీనామా చేసి బీజేపీలో చేరాల్సిందిగాబీజేపీ అగ్రనాయకత్వం తనను  ఆహ్వానించాలని కండీషన్ పెట్టినట్లు ఆయన ప్రకటనలు, ప్రసంగాలను బట్టి ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. దీంతో ఎరక్కపోయి కోమటి రెడ్డిని కాంటాక్ట్ చేశామని ఇప్పుడు కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు.

తెలంగాణ బీజేపీలో స్వామి భక్తి పోటా పోటీ!

ప్రభువుల వారిని ఆనంద‌ప‌ర‌చ‌డానికి, శాంత‌ప‌ర‌చ‌డానికి సామంతులు అనేక జిమ్మిక్కులు, కాయ‌క‌ష్ట‌మూ చేయాలి. దేశంలో ప‌రిస్థితుల గురించి వేగుల వ‌లె స‌మాచారం అందించాలి, ప్ర‌తీ ప్రాంత అభివృద్ధితో పాటు అస్మ‌దీయులు, త‌స్మ‌దీయుల వివ‌రాలు చెబుతూండాలి. కొంద‌రు రాజాజ్ఞ‌ను పాటించాలంటూ జ‌నాల్లో తిరుగుతూ హెచ్చ‌రిక‌లూ చేస్తుంటారు. మ‌రికొంద‌రు జాగ్ర‌త్త‌లు చెబుతూంటారు. ఆన‌క యుద్ధ‌మో, మ‌రో శుభ‌కార్య‌మో వస్తే త‌న‌ వారిని ఆహ్వానించ‌డానికి ఇవ‌న్నీ అవ‌స‌రం. ప్ర‌స్తుతం బీజేపీ తెలంగాణా నేత ఈటెల అదే ప‌నిలో ఉన్నారు.  ఇప్ప‌టికే తెలంగాణాలో బండి సంజ‌య్ బీజేపీ వారి దేశ‌ భ‌క్తిని పాటించాలంటూ దాదాపు హెచ్చ‌రిక‌ల్లాంటి భాష‌ణ చేస్తున్నారు. ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జ‌లు ఆగ‌స్టు ప‌దిహేను నాటికి  ఏమేమి చేయాలో  కూడా చెప్పేందుకు పూనుకున్నారు. కాగా,  తెలంగాణా జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు సంజ‌య్ సిద్ధ‌మ‌య్యారు.    మ‌రో వంక కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కూడా అలాంటి  ప్ర‌చారాన్ని చేయ‌డంలోనే మ‌న‌సు పెట్టారు.ఇటీవ‌ల ఆంధ్రా గుంటూరు జిల్లాకి వెళ్లిన‌పుడు కూడా  పింగ‌ళి వెంక‌య్య కుటుంబాన్ని ప‌ల‌క‌రించ‌డంతోపాటు స‌భ లో ప్ర‌జ‌లు దేశ‌భ‌క్తిని ఎలా చూపాల‌న్న‌దీ శెల‌విచ్చారు.  ఇలా ఉండ‌గా, ఈటెల రాజేంద‌ర్, డి.కె ఆరుణ వంటి తెలంగాణా నేత‌లు మాత్రం తెలంగాణాలో బీజేపీలోకి చేరిక‌ల గురించిన వాస్త‌వ నివేదిక‌ను కేంద్రానికి స‌మ‌ర్పించ‌డానికి హస్తిన యానానికి సిద్ధ‌మ‌య్యారు. ఈటెల జాబితాలో చాలామంది కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ నేత‌లూ ఉన్నార‌ని   భారీ ప్ర‌చార మూ చేసుకుంటున్నారు. బీజేపీలో చేరాల‌ని ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్న‌వారు బ‌డి మారిన‌ట్టు అమాంతం వ‌చ్చేయ‌లేరు. వారు ఇబ్బందులు దాటి రావ‌ల‌సి వ‌స్తుంది గ‌నుక అందుకు చేరిక‌ల క‌మిటీ క‌న్వీన‌ర్‌గానూ ఉన్న ఈటెల కొంత స‌మ‌యం ఇవ్వాల్సి ఉంది. కానీ ఖ‌చ్చితంగా పార్టీలోకి  జంప్ అయ్యేవారు మాత్రం త‌న జాబితాలో ఉన్నార‌నే ఆయ‌న అంటున్నారు. ఈ జాబితాతో కేంద్రంలో బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌తో శ‌భాష్ అనిపించుకోవాల‌న్న ఆతృత‌లో ఈటెల‌, డికే అరుణా ఉన్నార‌న్న‌ది స్ప‌ష్టం. కేసీఆర్ పై యుద్ధం చేయ‌డానికి సిద్ధ‌ప‌డిన‌పుడు కేంద్రం నుంచి గ‌ట్టి మ‌ద్ద‌తు అవ‌స‌రం గ‌నుక వారి ఆదేశాల‌ను పాటించడం తో పాటు వారి మెప్పు పొంద‌డానికి జాబితాతో ప్ర‌యాణ‌మ‌య్యారన్న‌ది విశ్లేష‌కుల మాట‌. బీజేపీ జాతీయ నాయ‌కుల అనుమ‌తి పొంది రాష్ట్రంలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను మ‌రింత ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌న్న ఉత్సాహంలో ఈటెల ఉన్నార‌నాలి.