విచిత్ర దరఖాస్తు!
posted on Aug 1, 2022 @ 10:15AM
ఎవరన్నా ఉద్యోగం కావాలని వారి గురించిన వ్యక్తిగత, వృత్తిపర అనుభవాన్ని వివరిస్తూ దరఖాస్తు చేసు కుంటారు. కొత్తవారయితే తాము చేయగల పనిని వివరిస్తూ దరఖాస్తు చేసుకుంటారు. తమ యిష్టాయిష్టా లను అనుసరించి తమకు నచ్చిన వృత్తికి సంబంధించిన సంస్థలకు వెళుతూంటారు. కానీ ఒకతను చాలా చిత్రమైన దరఖాస్తు తో ఒక సంస్థ అధికారులను ఖంగారెత్తించాడు.
తన పేరు దాని తర్వాత అతను చేయగల పనుల జాబితాను రాశాడు. అంతకుముందు ఒక గిడ్డంగిలో పనిచేసేవాడు. తనకు పెద్ద బ్యాగ్‌లకు బోల్ట్‌లు బిగించడం, పెద్ద పెద్ద మేజా బల్లలు తయారు చేయ గలనని అన్నాడు. కొన్నిచోట్ల చాలామందితో కలిసి పనిచేశాడట. అంటే పెద్ద పెద్ద చక్క పెట్టెలు ఎత్తడం, లోడ్ ఎత్తడం వంటివి తెలుసునని పేర్కొన్నాడు. అలాంటి పనులు వాస్తవానికి తాత్కాలికంగా చేస్తూ వచ్చాడు. క్రమేపీ తన పనితనం చూసి పర్మనెంట్ చేశారట ఆ సంస్థవారు.
గిడ్డంగిలో పనితనం తెలుసుకున్న తర్వాత మరోసారి తన అనుభవాన్ని తెలియజేస్తూ మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అక్కడికి అప్పుడప్పుడూ వెళ్లివస్తూండాలన్నాడు. అందుకు సమయం కావాల న్నాడు. తన ఇతర ప్రత్యేకతలను గురించి చెబుతూ ఇళ్లకి పై కప్పులు వేయడం తెలుసునన్నాడు. పాత కప్పు తీసేసి బ్రహ్మాండంగా కొత్తది వేయగలనని వివరించాడు. తన పనితనం చూసి చాలామంది ముగ్ధులయ్యారట.
ఇన్ని ప్రత్యేకతలున్న తనను తక్కువవాడిగా ఇంటర్వ్యూలో చూడవద్దన్నాడు. పైగా తనలాంటి సర్వ విద్యలూ తెలిసివాడు దొరకడం బహు దుర్లభమని చెప్పాడు. పైగా కొన్ని సందర్భాల్లో ఇద్దరు చేసే పనిని ఒక్కడినే చేయగలనన్న ధీమా వ్యక్తం చేశాడు. మీరు తీసుకునేవారంతా సుకుమారంగా ఉండవచ్చేమో గాని పని విషయంలో, ఎలాంటి పని అయినా అయ్యేంతవరకూ దృష్టి మరల్చనని హామీ ఇచ్చాడు.
ఇంతటి చాలా విస్పష్టమైన, హాస్యోక్తితోనూ కూడుకున్న దరఖాస్తు చూసినపుడు ఎవరికైనా వీడెవడో గట్టి వాడే అనిపిస్తుంది. సరిగ్గా సదరు కంపెనీవారూ అనుకున్నారు.. అంతే మారు మాట్లాడనీవకుండా సంస్థలోకి ఆహ్వానించారు. అట్టుంటది మనతో . అనుకున్నాడేమో ఆ ఉద్యోగి!