డ్రోన్ సాయంతో జ‌వ‌హ‌రీ అంతం

ఒసామా బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా సారథ్య బాధ్యతలు చేపట్టిన అయిమాన్ అల్ జవహరిని  కూడా అంతమొందించామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్ర‌క‌టించారు. అమెరికా గూడఛార సంస్థ  సీఐఏ సహకారంతో  71 ఏళ్ల జవహరిని అమెరికా సేనలు అత్యంత వ్యూహాత్మ‌కంగా అంతంచేశారు. అమెరికా ఈ  దాడిలో కేవలం ఒక డ్రోన్, రెండు హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణులతో ప్రపంచంలోనే  మోస్ట్ వాంటెడ్  ఉగ్ర వాద నేత ను కడతేర్చింది. దీంతో అమెరికాలో ట్విన్ ట‌వ‌ర్‌పై అల్‌ఖ‌యిదా దాడికి ప్ర‌తిఫ‌లంగా  ప‌గ తీర్చుకున్నట్టుగా అమెరికా ప్ర‌క‌టించింది. అల్‌-జ‌వ‌హ‌రీ అమెరికా పౌరుల‌పై దాడులు, హ‌త్యారోప‌ణ‌లు ఎదుర్కొంటు న్నా డ‌ని బైడ‌న్ తెలిపారు.  కాగా, ఈ దాడిలో వినియోగించిన హెల్ ఫైర్ క్షిపణులు ఎలాంటి పేలుడు లేకుండానే పనిపూర్తిచేశాయి. కాబూల్ లోని తన నివాసంలో బాల్కనీలో ఉన్న జవహరిని గుర్తించగానే, డ్రోన్ నుంచి వెలువడిన హెల్ ఫైర్ క్షిపణులు ఒక్కదుటున దూసుకెళ్లి ఆయన శరీరాన్ని చీల్చివేశాయి. దాంతో అక్కడేమీ పేలుడు లేకుండానే ఆపరేషన్ పూర్తయింది. జ‌వ‌హ‌రి ర‌హ‌స్యంగా నివ‌సిస్తూనే ప్ర‌పంచ‌దేశాల్లో అనుచ‌రుల‌కు ఆదే శాలు పంపుతూ దాడుల‌ను నిర్వ‌హిస్తుండేవాడు. కాగా అత‌న్ని హ‌త‌మార్చ‌డంతో  న్యాయం  జ‌రిగిం ద‌ని బైడెన్ అన్నారు. కాగా ఈ డ్రోన్ దాడి స‌మ‌యంలో జ‌వ‌హ‌రి కుటుంబ స‌భ్యులు అదే భ‌వ‌నంలో ఉన్న‌ప్ప టికీ ఆయ‌న్నుమాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకుని దాడి జ‌రిగింద‌ని అమెరికా అధ్య‌క్షుడు ప్ర‌క‌టించారు. 

ఇల్లు కొనండి.. రెండుదేశాల్లో నివ‌సించండి!

ఫ్రిజ్ కొనండి.. ప్లాస్టిక్ బాటిల్ ఫ్రీ, ఐదు కిలోల కూర‌లు కొనండి.. పావు ప‌చ్చిమిర‌ప‌కాయ‌లు ఫ్రీ.. ఇలాంటి గిఫ్టులు మ‌న‌దేశంలో బ‌హుప్ర‌సిద్ధం. గృహిణుల‌కు ఇలా గాలం వేసి పెద్ద పెద్ద మాల్స్‌వారంతా వారిచేత ప‌ర్సులు ఖాళీచేయించ‌డం త‌ర‌చూ గ‌మ‌నిస్తూనే ఉంటాం. మార్కెటింగ్ ఓ పిచ్చి. అవ‌స‌రం ఉన్నా లేకు న్నా ఏదో ఒక వ‌స్తువు కొనాల‌న్న కొనుగోలుదారుని బ‌ల‌హీన‌తే వ్యాపారుల‌కు పెద్ద అసెట్ అనేది వ్యాపార స్తుల ఆదాయ సూత్రం. కానీ ఇల్లు కొనండి గొళ్లెం ఫ్రీ అన‌రుగాక అన‌రు. చిత్ర‌మేమంటే ఓ పెద్ద విల్లా కొంటే రెండు దేశాల్లో ఉండేందుకు వీలు క‌ల్పిస్తామ‌నే ప్ర‌క‌ట‌నా వ‌చ్చింది. ఇదెలా సాధ్యం?  అందులో ఏదో మ‌ర్మం ఉండ‌వ‌చ్చు.. బ‌హుశా ఆ విల్లాలో దెయ్యాలేమ‌న్నా ఉన్నాయేమోన‌ని మ‌నోళ్ల‌కి సాధార‌ణంగా వ‌చ్చే పెద్ద అనుమానం!  చిత్రంగానే ఉంది. ఒక విల్లా కొన‌డం ఆల‌స్యం వెంట‌నే రెండుదేశాల పౌర‌స‌త్వం ల‌భిస్తుందనేది  ఎలా న‌మ్మ‌డం అనే ప్ర‌శ్న కెన‌డా వాసుల‌కు రాదు. ఎందుకంటే, కెన‌డాకి చెందిన క్యూబెక్, అమెరికా వెర్మాంట్ మ‌ధ్య ఏడువేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలోని పెద్ద విల్లా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ఇది  కొన‌గ‌లిగితే ఆ రెండు దేశాల పౌర‌స‌త్వం ల‌భిస్తుంది. అంటే ఇటు కెన‌డా, అటు అమెరికా పౌర‌స‌త్వం! త‌మాషాగా ఉంది. రెండు ఇళ్ల మ‌ధ్య‌, రెండు అపార్ట్‌మెంట్ల  మ‌ధ్య  కాస్తంత స్థ‌లం క‌న‌ప‌డితే ఇటువారో, అటువారో క‌బ్జా చేయాల‌న్న ఆలోచ‌న‌తో రాత్రికి రాత్రి ఎవ‌రో  ఒక‌రు కొట్టేయాల‌నే ఆలోచిస్తారు.  స‌రే ఇంత‌కీ ఈ విల్లాకి ఆశ‌ప‌డితే మాత్రం వెంట‌నే మ‌న క‌రెన్సీలో అయితే జ‌స్ట్ 71 ల‌క్ష‌లు క‌ట్టాలి. ఈ  విల్లా ఓన‌ర్లు బ్రియాన్‌, జోవాన్ డుమోలిన్ దీన్ని న‌ల‌భ‌య్యేళ్ల క్రితం వార‌సత్వంగా పొందారు. ఇది స‌రిగ్గా స్టాన్స్ట‌డ్ రూ ప్రిన్సిప‌లె లో ఉంది. దీనికి ఒక‌వైపు కెన‌డా స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ ఏజెన్సీ, మ‌రో వేపు యు.ఎస్‌.కస్టమ్స్‌, బార్డ‌ర్ ప్రొటెక్ష‌న్ ద‌ళాలు రాత్రింబ‌వ‌ళ్లూ కాప‌లా కాస్తుంటారు. మ‌రో ఇబ్బందేమంటే ఈ విల్లాకి అన్ని వైపులా ఇష్టంవ‌చ్చిన‌ట్టు తిర‌గ‌డానికి అవ‌కాశం లేదు. కేవ‌లం ప‌రిమిత ప్రాంతంలోనే, ప‌రిమిత దారిలోనే తిర‌గాలి, వెళ్ల‌డం రావ‌డంచేయాలి. కాస్తంత నిర్ల‌క్ష్యం చేసినా రెండు దేశాల స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ విభాగం పోలీ సులూ జైల్లో వేస్తారు.  అయితే యు.ఎస్, కెన‌డా నుంచీ కూడా ఈ విల్లా చేర‌డానికి మార్గం ఉంది. అంతే కాదు విల్లా వెనుక వైపు గ‌తంలో ఒక మార్గం ఉండేది, దాన్ని యు.ఎస్ ఏజెంట్లు మూసేయించారు. ఇంత గంద‌ర‌గోళం విల్లాను ఎవ‌రు తీసుకుని ప్ర‌శాంతంగా ఉండ‌గ‌లరు? అందుకే కేవ‌లం ఫోటోల్లో పెట్టి  చూస్తూ ఆనందిస్తున్నారు. టెన్ష‌న్ ప‌డేకంటే టెంట్‌లో ఉండ‌డం మేలు క‌దా!

సోనియా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరాఖరుకు కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. గత కొంతకాలంగా ఇదే విషయంగా సాగుతున్న చర్చ పక్కదారి పడుతున్న నేపధ్యంలో ఇంకా లేట్ చేస్తే ఇంకెన్నో లోగుట్లు బయటపడే ప్రమాదం ఉందని, సో ..ఇంకా జాగుచేయడం మంచిది కాదని రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. రాజగోపాల రెడ్డి రాజీనామా ఖరారైన నేపధ్యంలో మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక అనివార్యమవుతుంది. వచ్చే ఆరు నెలలో ఎప్పుడైనా ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ లోగా ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళితే తప్పించి, ఉప  ఎన్నిక జరిగి తీరుతుంది.   మరోవంక వచ్చే సంవత్సరం (2023) ద్వితీయార్ధంలో జరిగే శాసనసభ ఎన్నికల ముందు, జరిగే మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలక మలుపు అవుతుందని, పరిశీలకులు భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అధికార పార్టీ లెక్క తేల్చడంతో పాటుగా అనేక రాజకీయ భేతాళ ప్రశ్నలను సమాధానం ఇస్తుందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, తెరాసకు ప్రాధాన ప్రత్యర్ధి ఎవరో మునుగోడు తెల్చేస్తుంది.  అందుకే, మూడు ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తున్నాయి.యుద్ధానికి సిద్దమవుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే, రాజగోపాల రెడ్డి రాజీనామా  ప్రకటించిన కొద్ది సేపటికే తెర మీదకు వచ్చారు. అంతేకాదు, అప్పటికప్పుడు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ కన్వీనర్ గా ఎన్నికల కమిటీ ప్రకటించారు. అలాగే, ఎవరొచ్చినా, ఎవరు రాకున్నా, ఎన్నికల శంఖారావం  పూరిస్తున్నామని, ఆగష్టు 5 న మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అంతే కాకుండా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, కాంగ్రెస్ లో పుట్టిపెరిగిన వారికంటే, తనకే కాంగ్రెస్ పార్టీ పట్ల ఎక్కువ శ్రద్ధ ఉందని ప్రకటించుకునే ప్రయత్నం చేశారు. అలాగే,   సోనియా గాంధీ సెంటిమెంట్ ను తెరమీదకు తెచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీని విచారిస్తున్న సమయంలో రాజగోపాల రెడ్డి హోం మంత్రి అమిత్ షాతో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నారని, ఫైర్ అయ్యారు. అంతే కాకుండా, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తూ, సోనియా సెంటిమెంట్ నే ఎన్నికల అస్త్రం చేసుకున్నారనే అభిప్రాయం  కల్పించారు.  అయితే రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలో పనిచేయని సోనియా సెంటిమెంట్ ఇప్పుడు ఈ ఉపఎన్నికల్లో పనిచేస్తుందా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా వుంది. అంతే కాకుండా  గతంలో ఇదే సోనియా గాంధీని,  బజారు  భాషలో దూషించిన రేవంత్ రెడ్డి ఇప్పడు ఆమెను తెలంగాణ తల్లి అన్నా, ఇంకొకటి అన్నా, ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనేది ప్రధాన ప్రశ్నగా వుంది.  అయితే, మరో వంక మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్‌ స్థానం కావడంతో కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నికలో విజయం కీలకంగా మారిందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లాల్లో ఒకటి. పార్టీ కున్న ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు ఉమ్మడి నలోగొండ జిల్లా నుంచే ఎన్నికయ్యారు. ఇంకా అనేక మంది దిగ్గజ నేతలున్న జిల్లా నల్గొండ జిల్లా. అయినా  జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోదరుడు,ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డి ఇలా కాంగ్రెస్ దిగ్గజ నేతలు ఎవరికీ, ఎన్నికల కమిటీలో స్థానం కల్పించకపోవడం పట్ల జిల్లా నాయకులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.  నిజానికి జిల్లాకు రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులే కాకుండా, కేంద్ర నాయకులు కూడా రాజగోపాల రెడ్డి పార్టీ రాజీనామా చేయకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ,  రేవంత్ రెడ్డి, ఆయన వర్గానికి చెందిన నాయకులు మాత్రం, మొదటి నుంచి, రాజగోపాల రెడ్డి పార్టీ వదిలిపోతేనే మంచిందనే విధంగా వ్యవహరించారని అంటున్నారు. అందుకే, రాజగోపాల రెడ్డి రాజీనామా నిర్ణయం ప్రకటించిన వెంటనే రేవంత్ రెడ్డి పునరాలోచనకు అవకాశం లేకుండా రంగప్రవేశం చేశారు. నిజానికి గత వరం రోజులుగా సాగుతున్న రాజగోపాల రెడ్డి ఎపిసోడ్ లో రేవంత్ రెడ్డి ఎక్కడా ప్రత్యక్ష పాత్ర పోషించలేదు. కానీ, రాజగోపాల రెడ్డి రాజీనామా నిర్ణయం ప్రకటించిన వెంటనే మీడియా ముందుకొచ్చి ఆయనపై  తీవ్ర ఆరోపణలు చేశారని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా, పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి దూకుడు బ్రేకులు వేసే సమయం వచ్చిందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక విధగా రేవంత్ రెడ్డి పార్టీని హైజాక్ చేస్తున్నారనే అభిప్రాయం పార్టీ  సీనియర్ నాయకులు వ్యక్తపరుస్తున్నారు,ఈ పర్యవసాన ప్రభావం ఉపఎన్నికల పైనే కాకుండా, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై కూడా ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ను కూడా మునుగోడు డిసైడ్ చేస్తుందని అంటున్నారు.

పిల్లాడిలా ఉన్నాడ‌ని ఉద్యోగ నిరాక‌ర‌ణ‌!

అర్హ‌త‌ను అనుస‌రించి ఉద్యోగం.. స‌హ‌జంగా జ‌రుగుతుంది. కేవ‌లం సాంకేతిక విజ్ఞ‌నం వున్న‌వారికీ చ‌దువుతో సంబంధం లేకుండానే ఉద్యోగం ల‌భిస్తుంటుంది. అన్ని అర్హ‌త‌లూ ఉండి ఇంట‌ర్వ్యూల్లో విఫ‌ల మ‌య్యే వారూ ఉంటారు. కొంద‌రికి సంస్థ‌ల పెద్ద‌ల‌తో ప‌రిచ‌యాల‌తో ఉద్యోగాలు వ‌స్తూంటాయి. చిత్ర మేమంటే మావో షెంగ్ అనే 27 ఏళ్ల వ్య‌క్తికి మాత్రం ఉద్యోగం ఇవ్వ‌నంటున్నారు. కార‌ణం అత‌ను మ‌రీ 12 ఏళ్ల పిల్లాడి లా క‌నిపించ‌డ‌మేన‌ట‌! పైగా  కార్మిక చ‌ట్టాలు అంగీక‌రించ‌వ‌న్నార‌ట‌! కొంద‌రు వ‌య‌సును మించి క‌న‌ప‌డ‌తారు, మ‌రికొంద‌రి వ‌య‌సు అంత‌గా తెలీదు. కానీ మావోది మాత్రం నిజంగా దుర‌దృష్ట‌మే. ఎందుకంటే అత‌నికి ఉద్యోగం చాలా అవ‌స‌రం. అత‌ను చాలా ఉద్యోగ ప్ర‌య‌త్నా లు చేశాడు. ఏకంగా త‌న అవ‌స‌రాన్ని తెలియ‌జేస్తూ ఒక టిక్ టాక్ కూడా త‌యారు చేసి తెలిసిన వారి ద్వారా అనేక కంపెనీల‌కు పంపించాడు. కానీ అంద‌రూ ఆ టిక్ టాక్‌ను ఎవ‌రో పిల్లాడు స‌ర‌దాగా చేసి పం పించాడ‌ని రిలాక్స్ కోసం చూస్తూ న‌వ్వుకున్నార‌ట‌! పాపం మావో మాత్రం త‌న అభ్య‌ర్ధ‌న‌ను ఇలా అర్ధం చేసుకున్నార‌ని తెగ బాధ‌ప‌డ్డాడు. అమెరికాలో 15 ఏళ్ల వాడికీ ఏదో ఒక ఉద్యోగం ల‌భిస్తున్నపుడు చైనాలో అలాంటి అవ‌కాశం లేక‌పోవ‌డం దారుణ‌మ‌ని పసివాడు కాని ఈ కుర్రాడు కాస్తంత మండిప‌డ్డాడు. అయితే ఎలాగో ఒక కంపెనీవారు నిజంగానే వీడు పిల్లాడు కాదు కుర్రాడే అని న‌మ్మి ఉద్యోగం ఇచ్చిందిట‌. ఇక మావో పెళ్లి చేసుకుని తండ్రిని మ‌రింత బాగా చూసుకుంటాడ‌ని ప‌క్కింటివారంతా అనుకుంటున్నారు. 

ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు మహాప్రస్తానంలో ముగిశాయి. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె పెద్ద కుమార్తె బుధవారం ( ఆగస్టు 3) తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె రాక కోసమే రెండు రోజులుగా ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి అంత్యక్రియలకు కుటుంబ  సభ్యులు ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు  పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.   అలాగే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌, బ్రాహ్మణి, బాలకృష్ణ, ఎన్టీఆర్‌ కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి కళ్యాణ్‌రామ్‌ తదితరులు జూబ్లీహిల్స్‌లోని ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. అలాగే పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న పలువురు ప్రముఖులు తరలి వచ్చారు. మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి భౌతిక కాయానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నటుడు, ఉమామహేశ్వరి సోదరుడు నందమూరి బాలకృష్ణ పాడె మోశారు. ఉమామహేశ్వరి భర్త కంఠమనేని శ్రీనివాస ప్రసాద్ ఆమె చితికి నిప్పంటించారు.  

తిరుపతిలో పాల్ పర్యటన వినోదాత్మకం

కేఏ పాల్.. పరిచయం అక్కర్లేని పొలిటికల్ కమేడియన్. ఆయన ఎప్పుడు ఎక్కడ ప్రసంగించినా.. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నవ్వులు పూయడం ఖాయం. ఆయన విమర్శలను ఏ పార్టీ వారూ సీరియస్ గా తీసుకోరు. ఆయన విమర్శలకు ఎవరి నుంచీ ఖండనలు ఉండవు. ఏ పార్టీ వారూ స్పందించరు. అయినా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే విలేకరులు పరుగు పరుగున వాలిపోతారు. ఎలక్ట్రానిక్ మీడియా రెక్కలు గట్టుకుని వాలిపోతారు. పత్రికలలో ఆయన ప్రసంగాలకు స్పేస్ లేకపోవడమనే మాటే ఉండదు. టీవీలలో ఆయన ప్రసంగాల క్లిప్పింగ్స్ కు ఒకింత ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే జనం ఆయన ప్రసంగాలను అంత ఇష్టంతో వింటారు, చదువుతారు కనుక. మత ప్రబోధకుడి నుంచి రాజకీయ వేత్తగా మారిన తరువాత కేఏ పాల్ తన ప్రసంగాలలో కూడా రాజకీయ ప్రభోదాలే చేస్తారు. అలా ప్రబోధించడంలో ఆయనకు తన పర బేధం లేదు. ఆయన ఎవరినైతే, ఏ పార్టీనైతే విమర్శిస్తారో వారికీ , ఆ పార్టీలకూ కూడా సుద్దులు చెబుతారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అందరూ అంటే అన్ని పార్టీలూ తన వెనుకే నడిస్తేనా ఆ పార్టీలకు మనుగడ అని ఉద్భోదిస్తారు. తాజాగా తిరుపతి పర్యటనలో ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయంపై చాలా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్, చంద్రబాబులు ఓటమి ఖాయమని తేల్చేశారు. రెండు రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చేది తన ప్రజాశాంతి పార్టీయేనని తేల్చేశారు. తాను తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాననీ, ఏపీలో ఒక మహిళా నేతను సీఎంను చేస్తాననీ పాల్ చెప్పారు.  ఏపీలో జనసేనానికి అసలు ప్రజాభిమానమే లేదన్నారు. తనకున్న ప్రజా మద్దతుతో పోలిస్తే పవన్ కల్యాణ్ కు ఉన్న మద్దతు ఏపాటిదని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవాలంటే జగన్, చంద్రబాబు తమతమ పార్టీలను ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయడం బెటరని సలహా ఇచ్చారు. ఇక జాతీయ నేతలకూ ఆయన తన రాజకీయ ప్రబోధం చేశారు. తానిచ్చిన విలువైన సలహాలను పాటించకపోవడం వల్లే మోడీకి ప్రజా మద్దతు భారీగా తగ్గిపోయిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీ గద్దె దిగడం ఖాయమనీ జోస్యం చెప్పారు. పాల్ ఏం చేసినా, ఏం మాట్లాడినా ప్రచారానికి ఢోకా ఉండదు. అయినా ఆయన అదనపు ప్రచారం కోసం కొన్ని ఫీట్లు చేసి మరీ వినోదం పంచుతారు. తిరుపతి పర్యటనలో కూడా అదే చేశారు. ఆయన తన వాహనంలో పద్మావతి మహిళా యూనివర్సిటీలోకి దూసుకెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది వారిస్తున్నా ఆగలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు వచ్చి ఆయనను పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పాల్ మాత్రం కారులోనూ కూర్చుని తన సొంత వాహనంలోనే   పోలీసు స్టేషన్ కు వస్తానని భీష్మించారు. చివరకు పోలీసులు అతి బలవంతం మీద ఆయనను వర్సిటీ నుంచి బయటకు పంపేశారు. తరువాత తీరిగ్గా కేసు నమోదు చేశారనుకోండి. మొత్తం మీద పాల్ తిరుపతి పర్యటన అంతా వినోదాల జల్లు పంచుతూ సాగింది. 

అద‌ర‌గొట్టిన సూర్య .. 3వ వ‌న్డేలో భార‌త్ విజ‌యం

వెస్టిండీస్‌తో త‌ల‌ప‌డిన మూడ‌వ వ‌న్డేలో భార‌త్ ఓపెన‌ర్ సూర్య‌కుమార్ మెరుపువేగంతో అర్ధ‌సెంచ‌రీ చేయ‌డంతో, రిష‌బ్ స‌హ‌జ‌సిద్ధ బ్యాటింగ్ స‌త్తాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. సూర్య‌కుమార్ 8 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 44 బంతుల్లో 76, రిష‌బ్ 26 బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్స్‌తో 33 ప‌రుగులుచేసి నాటౌట్‌గా నిల‌ వ‌డం తో భార‌త్ 19 ఓవ‌ర్ల‌లోనే 3 వికెట్ల న‌ష్టానికి 165 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది.  విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.  ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73) అర్ధ సెంచ రీతో రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కు 2 వికెట్లు, హార్దిక్‌, అర్ష్‌దీప్‌ తలో వికెట్ పడ గొట్టారు. అనంతరం 165 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ సూర్యకుమార్  చెలరేగి త‌న బ్యాటింగ్ స‌త్తాను ప్ర‌ద‌ర్శించి  సునాయాస విజయాన్ని అందించాడు. మొదటి రెండు మ్యాచుల్లో నిరాశ పరిచిన సూర్య, ఈ మ్యాచ్‌లో మాత్రం విండీస్ బౌలర్లపై మొదటి నుంచే ధాటిగా ఆడాడు. వరుస బౌండరీ లతో హోరెత్తించాడు. కాగా  జట్టు స్కోర్ 135 పరుగుల వద్ద  వెనుదిరిగిన అప్పటికే భారత్‌ విజయం ఖాయ మైపోయింది. దీపక్‌ హుడా (10 నాటౌట్‌)తో కలిసి పంత్‌ మిగతా పని పూర్తి చేశాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. 

జగన్ హయాంలో విశాఖ‌ పట్నం విషాద‌ప‌ట్నం అయిపోయింది..నారా లోకేష్‌

స‌ముద్ర తీరాన  ప్ర‌శాంత నగరం విశాఖపట్నం జగన్ హయాంలో  విషాద‌ప‌ట్నంగా మారిపోయింద‌ని టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌లే రెండు ప‌ర్యాయాలు గ్యాస్ లీకేజ్ సంఘ‌ట‌న‌లు జ‌రిగినా ప్ర‌భు త్వం ఎలాంటి  జాగ్ర‌త్త‌లు తీసుకోలేద‌ని,  ప్ర‌జ‌ల ప్రాణాలంటే జగన్ కు లెక్క‌లేకుండా పోయింద‌ని విమర్శించారు.   భూక‌బ్జాలు, దౌర్జ‌న్యాల‌తో పాటు విష‌ ర‌సాయనాల లీకుల‌తోనూ విశాఖ ప్ర‌జ‌లు ప్రాణ‌భీతితో బతకాల్సిన పరిస్థితిని జగన్ సర్కార్ కల్పించిందని విమర్శించారు. ఎల్జీపామ‌ర్స్, సాయినాథ్ ఫార్మా విషాదం ఇంకా మ‌ర‌వ‌క ముందే అచ్యు తాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో మూడో సారి విష‌వాయువులు లీక్ కావ‌డం మ‌హిళ‌లు తీవ్ర అస్వ‌స్థత‌కు గురి కావ‌డం ఆందోళ‌న‌క‌లిగించింద‌ని అన్నారు. ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల ప్రాణాల‌ కంటే క‌మీష‌న్ల మీదే ఆస‌క్తి ఉంద‌ని టీడీపీ నేత మండిప‌డ్డారు. చ‌నిపోయాక న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించ‌డం కంటే వారి ప్రాణాల‌ను కాపా డేందుకు ముందు జాగ్ర‌త్త‌ల మీద ప్ర‌భుత్వం దృష్టిపెట్ట‌లేక‌పోవ‌డ‌ం దురదృష్ట‌మన్నారు.  ఎల్జీ పాలీమ‌ర్స్ మ‌ర‌ణ‌మృదంగం, సాయినార్ ఫార్మా విషాదం మ‌రువ‌క‌ముందే, అచ్యుతాపురం  సెజ్‌ సీడ్స్ కంపెనీలో   విష‌వాయువులు లీకై వంద‌ల‌ మంది మ‌హిళ‌లు తీవ్ర అస్వ‌స్థ‌త‌కి  గురికావ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగించిందన్నారు. ఉపాధి కోసం వ‌చ్చిన మ‌హిళల‌ ప్రాణాలు పోయినా ఫ‌ర్వా లేదు... క‌మీష‌న్ల  పైనే వైసీపీ దృష్టి ఉంద‌ని ఆయ‌న‌ మండి పడ్డారు. చ‌నిపోయాక  ప‌రిహారం ఇవ్వ‌డం గాకుండా వాళ్లు బ‌తికేలా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయన సూచించారు.   ఇదిలా ఉండ‌గా, అనకాపల్లి బ్రాండిక్స్‌లో రసాయన వాయువు లీక్‌తో అస్వస్థతకు గురైన మహిళలకు వేగంగా వైద్యం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. రెండు మాసాల వ్యవధిలో మూడు పర్యాయాలు రసాయనాలు లీక్ అయ్యాయన్నారు. ప్రభుత్వం తోలు మందంగా వ్యవహ రిస్తోందని ఆయన విమర్శించారు. పరిశ్రమల పై ప్రభుత్వం పర్యవేక్షణ విరమించుకుందా? అని ప్రశ్నిం చారు. కార్మికులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ సోమువీర్రాజు విసుర్లు విసిరారు. స్థానిక కార్యకర్తలు కార్మికులకు అండగా ఉండాలని సూచించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి అత్యవసర ప్రకటన విడుదల చేశారు.  విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకైన ఘటనలో 50 మంది   మ‌హిళా ఉద్యోగులు అస్వ‌స్థ త‌కు గు‌రయ్యారు. గ్యాస్ ను పీల్చిన వారంతా వాంతులు, విరేచ‌నాలు చేసుకుని స్పృహ త‌ప్పి ప‌డిపో యారు. ప‌రిస్థితిని గ‌మ‌నించిన కంపెనీ యాజ‌మాన్యం అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని ఆసుపత్రులకు తర లించింది. మంగళవారం అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్‌ అపెరిల్‌ సిటీ పరిధిలోని క్వాంటామ్ సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అవ్వడంతో ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  దీంతో అధికారులు కంపెనీ ని మూసేశారు. ఇటీవలే కొన్ని షరతులతో కంపెనీని తెరుచుకోవచ్చని పొల్యూషన్ బోర్డు అధికారులు అనుమతి ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే మరోసారి గ్యాస్ లీక్ కావడం కలకలం రేపింది. గ్యాస్ లీక్ సంఘటన జరిగిన సమయంలో దాదాపు 200 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వారిలో 50 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఖ్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అంటు న్నారు. 

కాంగ్రెస్ లో మునుగోడు టెన్షన్!

మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డిని బుజ్జగించి ఆయన రాజీనామా చేయకుండా నిలవరించాలన్న కాంగ్రెస్ యత్నాలు విఫలమయ్యాయి. కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ బుజ్జగింపులను బేఖాతరు చేసి రాజీనామా చేసేశారు. ఇక మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అని తేలిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే మునుగోడు.. ఆ మాటకొస్తే నల్గొండ జిల్లా మొత్తం కాంగ్రెస్ కు కంచుకోట వంటిది. అటువంటిది ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అనే సరికి కాంగ్రెస్ ఉలిక్కి పడుతోంది. ఇక్కడ ఫలితం అటూ ఇటూ అయితే.. రాష్ట్రంలో ఇంత కాలంగా పెంచుకుంటూ వస్తున్న బలం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కంటున్న కలలూ అన్నీ దూది పింజల్లా తేలిపోతాయి. అందుకే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డిని రాజీనామా చేయకుండా నిలువరించాలని విశ్వ ప్రయత్నం చేసింది ఆ పార్టీ. ఆఖరికి ఒక ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు ఏకంగా పార్టీ అధిష్ఠానమే రంగంలోనికి దిగింది.అయినా ఫలితం లేకుండా పోయింది అది వేరే విషయం. అదే సమయంలో బీజేపీ కూడా మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి, అక్కడ ఉప ఎన్నిక కోసం నానా తాపత్రేయపడింది. ముచ్చటగా మూడో సారి రాష్ట్రంలో ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించి, ఆ పార్టీకి కొద్దో గొప్పో మిగిలిన ఆత్మ విశ్వాసాన్ని పోగొట్టాలన్నది ఆ పార్టీ వ్యూహం. అందుకే ఏకంగా బీజేపీ అగ్ర నేతల్లో ఒకరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే మునుగోడు ఉప ఎన్నిక ఆపార్టీకి ఏ మంత  సంతోషం కలిగించే అంశం కాదు. అది ఎలాగూ టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాదు కనుక వాస్తవానికి అక్కడ ఉప  ఎన్నిక జరిగి టీఆర్ఎస్ పరాజయం పాలైనా ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి అలా సరిపెట్టుకునేందుకు వీలు లేని విధంగా ఉంది. ఇప్పటికే తెరాస విపక్షాల నుంచి ముప్పేట విమర్శల దాడి ఎదుర్కొంటోంది. దానికి తోడు పార్టీలోనూ అంతర్గత విభేదాలు పార్టీని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మునుగోడు ఉప ఎన్నికలో పరాజయం పాలైతే వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి కష్టాలు, ఇబ్బందులు తప్పవు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంటే  మొత్తంగా బీజేపీ తప్ప  మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కోరుకోలేదు. అంతగా ఉత్సాహ పడుతున్న బీజేపీకి కూడా మునుగోడు ఉప ఎన్నికలో విజయం నల్లేరు మీద బండి నడక ఏమీ కాదనే చెప్పాలి. ఏది ఏమైనా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మూడు పార్టీలకూ కూడా మునుగోడు ఉప ఎన్నికలో విజయం చాలా కీలకం. అయతే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కు మాత్రంఈ ఉప ఎన్నికలో విజయం జవన్మరణ సమస్య వంటిది. మునుగోడు బై ఎలక్షన్ లో కాంగ్రెస్ కు పరాజయం ఎదురైతే మాత్రం వచ్చే ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఆశలకు ఆ పార్టీ నీళ్లొదిలేసుకోవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉపఎన్నికను యమ  సీరియస్‌గా తీసుకుంది. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి అలా రాజీనామా ప్రకటన చేయగానే కాంగ్రెస్ క్షణం ఆలస్యం చేయకుండా మునుగోడు ఉపఎన్నికల కమిటీని నియమిస్తూ ప్రకటన చేసింది. సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కన్వీనర్‌గా ఆరుగురు సభ్యులతో మునుగోడు ఉప ఎన్నిక కమిటీని ఏర్పాటు చేశారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి, బలరాంనాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్,   అనిల్ కుమార్‌లను సభ్యులుగా నియమించారు. మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం వంటి వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుంది. రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పూర్తయిన వెంటనే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు… తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్‌తో సమావేశం అయ్యారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడి పోతారన్న సమాచారం పక్కాగా ఉండంతో ముందుగానే తదుపరి ఏం చేయాలన్నదానిపై వ్యూహాలు సిద్దం చేసుకుని రెడీగా ఉన్నారు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలా రాజీనామా చేయగానే ఇలా ఉపఎన్నికల సన్నాహాలు మొదలెట్టేశారు.  శుక్రవారం (ఆగస్టు 5) మునుగోడులో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం ద్వారా పార్టీ క్యాడర్ ఎవరూ రాజగోపాల్ రెడ్డితో వెళ్లకుండా కట్టడి చేయడానికి వ్యూహాలు రచించారు.

నైరాశ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు

ఇదో విచిత్ర‌ కాలం.. ఏ పార్టీలో ఎవ‌రు ఎంత‌ కాలం ఉంటార‌న్న‌ది చెప్ప‌డ‌మూ క‌ష్ట‌మైపోతోంది. ప్ర‌తీవారు ఏదో సాధించ‌గ‌ల‌న‌ని పార్టీలో చేర‌డం, తాము ఆశించిన ప‌ద‌వి రాక‌పోతే మ‌రో పార్టీతో చెలిమి చేసి అందు లోకి మారిపోవ‌డం అనాదిగా జ‌రుగుతోంది. ఇప్పుడు మ‌రీ నాయ‌క‌త్వాన్ని గౌర‌వించే స్థితి కూడా పోయింది. నాయకుని నుంచి మ‌ద్ద‌తు, అనుకూల సంకేతాలు లేకుంటే నాయ‌కుడిని కూడా తీవ్రంగా వ్య‌తిరేకించి మ‌రీ వెళిపోతున్నారు. ఇందుకు ఏ పార్టీవారూ మిన‌హాయింపు కాదు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార పార్టీ వైసీపీలో అధినేత పట్ల వ్యతిరేకత.. ఎమ్మెల్యేలలో  నైరాశ్యం పెంచుతోంది. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు దాటినా ప్ర‌జ‌ల ప్రజా వ్యతిరేకతే తప్ప ప్రజాభిమానాన్ని చూరగొనని పార్టీ తీరుతో ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. పార్టీ వ్య‌వ‌హారాలు, ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో   ప్ర‌జ‌ల నుంచి తీవ్ర స్థాయిలో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఏ ప్రాంతంలోనూ ఎమ్మెల్యేలు ధైర్యంగా ప్ర‌జ‌ల్ని క‌లిసే ప‌రిస్థితి లేదు. ఈమ‌ధ్య గ‌డ‌ప గ‌డ‌ప‌కూ అనే కార్య‌క్ర‌మం ఆరం భించి ప్ర‌జ‌ల చెంత‌కు వెళ్లి పార్టీ ప్రజలకు చేసిన మేలు చెప్పుకుందామనుకున్న పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలేమీ లేదని ప్రజా నిరసనలతో అర్ధమౌతోంది. ఈ ప‌రిస్థితుల్లో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలలో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన పెరిగింది. వారిలో నైరాశ్యం గూడుకట్టుకుంది. అందుకు తాజాగా   ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వ్యాఖ్యలే నిదర్శనం.  పార్టీలేదు గాడిద గుడ్డూ లేదు.. ఎవ‌రు ఏ పార్టీలో ఉంటారో ఎవ‌ర‌కి తెలుసు? అన్న ఆయన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. తాను వైసీపీలోనే ఉంటానన్న న‌మ్మ‌కం లేద‌ని చిట్టిబాబు కుండ బద్దలు కొట్టేశారు.  పార్టీప‌రంగా, ప్ర‌భుత్వం ప‌రంగానూ ప్ర‌జ‌ల నుంచి, అభిమానుల నుంచి ఉన్న అభిమానం ఆవిరైపోవడమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్ర‌భుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యాలు తప్ప సాధించిందేమీ లేకపోవడమే ఇందుకు కారణమని వివరిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో పార్టీని పట్టుకుని అంటకాగితే  వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజయం అసాధ్యమని మెజారిటీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని అంటున్నారు.  

వైసీపీ రోత రాజకీయం.. ఉమా మహేశ్వరి మరణాన్నీ వదలని వైనం

మహాకవి శ్రీశ్రీ కాదేదీ కవితకనర్హం అన్నారు. కానీ జగన్ నాయకత్వంలోని వైసీపీ మాత్రం కాదేదీ రాజకీయానికి అనర్హం అంటున్నది. సమయం, సందర్బం లేకుండా రొచ్చు రాజకీయాలతో రచ్చ చేయాలని ప్రయత్నిస్తోంది. ఒక కుటుంబం విషాదంలో ఉన్న సమయంలో కూడా రోత రాజకీయ క్రీడకు తెరలేపి పరువు పోగొట్టుకుంది. సామాన్య జనం సైతం ఛీత్కరించేలా వ్యవహరించింది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణం విషయంలోనూ వైసీపీ రాజకీయం చేయడానికే మొగ్గు చూపింది. ఒక పక్క ఉమామహేశ్వరి మరణంతో ఎన్టీఆర్ కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉండగా.. వైసీపీ మాత్రం ఉమామహేశ్వరి మరణాన్నిరాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించి అభాసుపాలైంది. పరువును గంగలో కలిపేసుకుంది. ఉమామహేశ్వరికి కానీ, ఆమె భర్తకు కానీ, ఆమె పిల్లలకు కానీ రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేదు. అనారోగ్యం, మానసిక ఒత్తిడి తదితర సమస్యలతో ఉమామహేశ్వరి  బలవనర్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద సమయంలో వైసీపీ రాజకీయ క్రీడకు తెగబడింది. సంబంధం లేని ఆరోపణలతో ఆ కుటుంబం మరింత బాధపడేలా చేయడానికి  ప్రయత్నించింది. వైసీపీ నాయకుడు, ఏపీ అటవీ కార్పొరేషన్ చైర్మన్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తెలుగుదేశం జాతీయ కార్యదర్శి, ఉమామహేశ్వరి అక్క కుమారుడు లోకేష్ తో వాగ్వాదం కారణంగానే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారంటూ ట్వీట్ చేశారు. ఆ వాగ్వాదానికి కారణం ఓ భూమి విషయంలో తగాదానే కారణమని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. వాస్తవానికి గుర్రం పాటి తన ట్వీట్ లో పొందు పరిచిన సర్వే నంబర్లతో భూమే లేదని తేలిపోయింది. పలువురు నెటిజన్లు అంతర్జాలంలో వెతికి మరీ ఆ ఆధారాలు బయటపెట్టారు. దీంతో గుర్రంపాటి విమర్శ, ఆరోపణ బూమరాంగ్ అయ్యింది. గుర్రం పాటి విమర్శలపై, ఆరోపణలపై వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. పలువురు అయితే నేరుగా గుర్రంపాటికే నేరుగా ఇదా రాజకీయానికి సమయం అంటూ ట్వీట్ చేసి చీవాట్లు పెట్టారు.

భార‌త్‌కు చేజారిన బాడ్మంట‌న్ స్వ‌ర్ణం

కామన్వెల్త్ గేమ్స్ 2022 మిక్స్‌డ్ గ్రూప్ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఒలింపిక్ విజేత పీవీ సింధూతో కూడిన భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్స్‌లో మలేషియాపై 3-1 తేడాతో ఓడిపోయింది. ఎంతో పోటాపోటీగా జ‌రిగిన  బ్యాడ్మింట‌న్ భార‌త్ స్టార్లు చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి మ‌లేషియా ప్లేయ‌ర్ల‌తో ఎంతో పోటీత‌త్వంతో ఆడినప్ప‌టికీ మ‌లేషియా కొంత ఆధిప‌త్యం చెలాయించింది.  రెండో మ్యాచ్‌లో మాత్రి భార‌త్ సూప‌ర్‌స్టార్ పి.వి.సింధు జిన్ వీ గోహ్‌తో త‌ల‌ప‌డింది. తొలి గేమ్‌లోనే సింధూ దూకుడుగా ఆడి ప్ర‌త్య‌ర్ధిని ఖంగారెత్తించి 22-20 ఆధిక్య‌త సాధించింది. కాగా మ‌రో స్టార్ కిడాంబి శ్రీ‌కాంత్ ఊహించ‌నివిధంగా మ‌లేషియా స్టార్ ఎన్జీ యోంగ్‌పై మొద‌టి గేమ్‌లోనే ఓడిపోయి నిరాశ‌ప‌రి చాడు. 21-19, 6-21, 21-16 తేడాతో ఈ మ్యాచ్ మ‌లేషియన్ విజ‌యం సాధించాడు.  త‌ర్వాతి మ‌లేషియా  జోడీ రెండో గేమ్‌ను 21-17తో గెలిచి 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

మరో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన రాష్ట్రం మరో నాలుగు రోజుల పాటు వరుణ ప్రతాపాన్ని చవి చూడాల్సి వస్తుంది. గత కొన్ని రోజులుగా దాదాపుగా ప్రతి రోజూ హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తేస్తూనే ఉంది. దానికి తోడు మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావంతో బుధ, గురు, శుక్ర వారాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.  ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. బుధ‌వారం ఆది‌లా‌బాద్‌, నిర్మల్‌, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, రాజన్న సిరి‌సిల్ల, సంగా‌రెడ్డి, మెదక్‌, కామా‌రెడ్డి జిల్లాల్లో  భారీ వర్షాలు కురు‌స్తా‌యని తెలి‌పింది.

ఏపీ రుణపరిమితి లక్ష్మణ రేఖ దాటేసింది.. రాజ్యసభలో నిర్మలా సీతారామన్ వెల్లడి

ఏపీ రుణపరిమితి లక్ష్మణ రేఖను దాటేసింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అడ్డగోలుగా అప్పులు చేసి వాటిని బడ్జెట్ లో చూపకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అందుకే కార్పొరేషన్లు స్పెషల్ పర్పస్ వెహికిల్, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జగన్ సర్కార్ చేసిన అప్పులన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే కేంద్రం పరిగణించింది. ఈ విషయాన్ని గత మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభ సాక్షిగా కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ఈ మేరకు బదులిచ్చారు.  2020 నుంచి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేందుకు రూ. 65,489.36 కోట్లకు పైగా గ్యారెంటీలు ఇచ్చిందన్నారు. ఇందులో 2020-21లో రూ.46,719.42 కోట్లు, 21-22లో రూ.18,770.54 కోట్లకు గ్యారెంటీలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ సమాచారాన్ని రాష్ట్రప్రభుత్వమే ఈ ఏడాది ఏప్రిల్‌ 27న కేంద్రానికి ఓ లేఖ ద్వారా తెలియజేసిందని నిర్మలా సీతారామన్ వివరించారు. అలాగే 1920-21లో వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.22,549.5 కోట్లు, 21-22లో రూ.6.287.7 కోట్లు అప్పులు తెచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 293(3) అధికరణ ప్రకారం 22-23లో కూడా అప్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిందని వెల్లడించారు.  ఇక వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డిఅడిగిన మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ బదులిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ది కార్పొరేషన్‌ (ఏపీఎస్డీసీ) సహా పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సాధారణ నికర రుణ పరిమితిని ఉల్లంఘించి రుణాలు చేసినట్లు  చెప్పారు. వాణిజ్యపరమైన లాభ నష్టాలను, రుణాలను చెల్లించగల ఆదాయ సామర్థ్యాన్ని, నిధులు ఎక్కడకు మళ్లిస్తున్నారో గమనించకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు బ్యాంకులు రుణాలివ్వడాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కూడా తప్పు పట్టిన విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు రుణాలు, అడ్వాన్సులు మంజూరు చేసేటప్పుడు ఆర్‌బీఐ ఆదేశాలను పాటించాలని బ్యాంకులను నిర్దేశించినట్లు తెలిపారు.  

విజయసాయి రెడ్డి కేంద్రాన్ని విమర్శించారు.. కారణమదేనా?

విజయసాయిరెడ్డికి కేంద్రంపై కోపం వచ్చింది. మోడీ సర్కార్ రాష్ట్రాలను ముంచేస్తోందని విమర్శించారు. కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్న విషయం ఆయనకు ఇప్పుడు తెలిసింది. అంతే రాజ్యసభ సాక్షిగా కేంద్రంపై విమర్శల వర్షం కురిపించేశారు. కేంద్రం రాష్ట్రాలను దోపిడీ చేస్తోందని దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఇంతలా పెంచేస్తే పేద, మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారని నిలదీశారు. ద్రవ్యోల్బణం అరికట్టడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఇంత చేసినా ఆయన రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటిని వేటినీ ప్రస్తావించలేదు. విశాఖ రైల్వే జోన్ కానీ, పోలవరం బకాయిల గురించి కానీ, విశాఖ ఉక్కు ప్రైవైటైజేషన్ ఆపాలని కానీ, ఆఖరికి కడప ఉక్కు కర్మాగారం గురించి కానీ ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. జనరల్ గా కేంద్రం రాష్ట్రాలను అన్యాయం చేస్తోందని ఓ ప్రసంగం దంచేశారు. అందులో కేంద్రం రాష్ట్రాలను దోచేస్తోందని విమర్శలు గుప్పించారు. ఇంత కాలంగా కేంద్రం తిట్టినట్టు చేస్తే వైసీపీ సర్కార్ కనీసం ఏడ్చినట్లు కూడా చేయలేదు. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రంపై విమర్శలు గుప్పించినట్లు చేశారు. కేంద్రం పట్టించుకోనట్లు చేస్తుంది అంతే అని పరిశీలకులు అంటున్నారు.  సెస్, సర్ చార్జీల్లో రాష్ట్రానికి ఇవ్వడం లేదనీ,   పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వడం లేదనీ అన్నారు.   ఏడేళ్లలో ఏపీ 46వేల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడి ఆర్థిక సంక్షోభం అంచున నిలిచిన నేపథ్యంలో తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నమే విజయసాయి రాజ్యసభలో కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చెత్తపై పన్ను కేంద్రం వేసిందా అని పరిశీలకులు నిలదీస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా చేసిన అప్పుల కారణంగా ఇకపై అప్పులు పట్టిని దుస్థితిలో ప్రజల దృష్టి మరల్చి గట్టెక్కాలన్న ఉద్దేశంతోనే విజయసాయి కేంద్రంపై విమర్శలు గుప్పించారని అంటున్నారు.  

అచ్చుతాపురం సెజ్ లో విషవాయువు లీక్.. 50 మందకి అస్వస్థత

విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 50 మంది దాకా మ‌హిళా ఉద్యోగులు అస్వ‌స్థ‌త‌కు గు‌రయ్యారు. గ్యాస్ ను పీల్చిన వారంతా వాంతులు, విరేచ‌నాలు చేసుకుని స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. ప‌రిస్థితిని గ‌మ‌నించిన కంపెనీ యాజ‌మాన్యం అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని ఆసుపత్రులకు తరలించింది. మంగళవారం అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్‌ అపెరిల్‌ సిటీ పరిధిలోని క్వాంటామ్ సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అవ్వడంతో ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  దీంతో అధికారులు కంపెనీని మూసేశారు. ఇటీవలే కొన్ని షరతులతో కంపెనీని తెరుచుకోవచ్చని పొల్యూషన్ బోర్డు అధికారులు అనుమతి ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే మరోసారి గ్యాస్ లీక్ కావడం కలకలం రేపింది. గ్యాస్ లీక్ సంఘటన జరిగిన సమయంలో దాదాపు 200 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వారిలో 50 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఖ్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాగా గ్యాస్ లీకేజీ కారణంగా అస్వస్థతకు గురైన వారంతా మహిళా కార్మికులే. గ్యాస్ ఘాటుకు ఎక్కడి వారక్కడే కుప్పకూలిపోయారని చెబుతున్నారు. అస్వస్థతకు గురైన వారిని అచ్యుతాపురం, యలమంచిలి ఆసుపత్రులకు తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. గత జూన్ నెలలో కూడా ఈ కంపెనీ నుంచి రెండు సార్లు విషయావులు లీకయ్యాయని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ లీకేజీ సంఘటనపై మంత్రి అమర్నాథ్ అధికారుల నుంచి  వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని   ఆదేశించారు మంత్రి  

అఖిలమ్మ పంచాయతీ

ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మళ్లీ వార్తల్లో నిలిచారు. భూమా అఖిల ప్రియ, ఆమె సోదరి భూమా మోనికపై వీరి సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అందుకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. గతంలో జిల్లా కోర్టులో తన అక్కలపై వేసిన కేసు నిలబడకపోవడంతో సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మంచిరేవుల్లో సర్వే నెంబర్ 190, 192/ఏ, 192/బీలలో భూమా నాగిరెడ్డి భార్య భూమా శోభానాగిరెడ్డి పేరు మీద వెయ్యి గజాల స్థలం ఉంది.   ఆమె 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ఆమె భర్త భూమా నాగిరెడ్డి రెండు కోట్ల రూపాయిలకు ఆ స్థలం విక్రయించినట్లు తెలుస్తోంది.   స్థలం విక్రయించే క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూమా నాగిరెడ్డి, ఆయన ఇద్దరు కుమార్తెలు అఖిల ప్రియ, మౌనిక సంతకాలు చేయగా, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి వేలు ముద్ర వేసినట్లు సమాచారం.   అయితే   స్థలం విక్రయించిన సమయంలో తన వయస్సు 17 సంవత్సరాలని.. అప్పుడు తాను మైనర్ అని.. ఇది చెల్లదని.. తనకు ఆ స్థలంలో వాటా వస్తుందంటూ జగత్ విఖ్యాత రెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. ఆ క్రమంలో   స్థలాన్ని కోనుగోలు చేసిన అయిదుగు వ్యక్తులతోపాటు తన ఇద్దరు అక్కలపై  కోర్టులో కేసు వేశాడు. ఆ కోర్టు వీరి వాదనలు విని ఈ కేసును కోట్టేసింది. దీంతో జగన్ విఖ్యాత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. మరోవైపు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలదీ సుధీర్ఘ రాజకీయం జీవితం.. తల్లి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన భూమా అఖిల ప్రియ  ఆ తర్వాత ఆళ్లగడ్డ నుంచి వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం తండ్రి నాగిరెడ్డితో కలిసి.. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతలో ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో, అఖిల ప్రియకు చంద్రబాబు కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా చోటు కల్పించారు. అలా మంత్రి అయిన అఖిల ప్రియ.. ఆ తర్వాత.. అంటే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అఖిల ప్రియ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. తన తండ్రి నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి సుపారీ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే హైదరాబాద్ నగరంలో ఓ స్థల వివాదంలో సీఎం కేసీఆర్ సమీప బంధువు కిడ్నాప్ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఆమె జైలుకు  వెళ్లి, ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆమె తాత ఎస్వీ సుబ్బారెడ్డి, మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి  గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుతం ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంత మంది ఉన్నా.. భూమా అఖిల ప్రియ ఫ్యామిలీలో.. ఇలాంటి వివాదాలు చుట్టుముట్టడం పట్ల భూమా వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు భూమా నాగిరెడ్డి, భూమా శోభ నాగిరెడ్డిల దంపతులు ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా ఉంది... నేడు ఎలా ఉందని ఓ చర్చ   ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జోరుగా నడుస్తోంది.

ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు డుమ్మా?

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరౌతారా అన్నది ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరంగా మారింది. ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చే జరుగుతోంది. మెజారిటీ అభిప్రాయం మాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మీటింగ్ కు డుమ్మా కొడతారనే అంటున్నారు. అందుకు ఇరువురికీ వారి వారి కారణాలున్నాయంటున్నారు. ఇంతకీ విషయమేమిటంటే ఈ నెల 6న హస్తినలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశం జరగ నుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొడతారని తెరాస శ్రేణులే చెబుతున్నాయి. గత కొంత కాలంగా కేసీఆర్ ప్రధాని మోడీతో భేటీ అయ్యింది లేదు. ఆయనపై తీవ్ర స్థాయి విమర్శలతో విరుచుకుపడుతున్న కేసీఆర్.. ప్రొటో కాల్ ప్రకారం మోడీకి స్వాగతం పలకాల్సిన సందర్భాలలో కూడా మొహం చాటేశారు. మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన హైదరాబాద్ లో ఉండి కూడా మోడీకి స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వెళ్లలేదు. కనుక ఆహ్వానం వచ్చిందని ఆయన మోడీ అధ్యక్షతన జరిగే ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ మీటింగ్ కు వెళ్లతారని ఎవరూ భావించడం లేదు. ఇక జగన్ విషయానికి వస్తే ఆయన సాధారణంగా కేంద్రం నుంచి వచ్చిన ప్రతి ఆహ్వానాన్నీ మన్నిస్తారు. అయితే ఈ సారి ఆయన ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ భేటీకి డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కారణం ఆ సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరౌతుండటమే కారణమని చెబుతున్నారు. ఔను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కేంద్రం నుంచి చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మేరకు చంద్ర బాబు ఈ నెల 6న ఢిల్లీ వెళ్ల నున్నారు. ఆ కారణంగానే ఈ సమావేశానికి జగన్ డుమ్మా కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్   రాజకీయ ప్రత్యర్థులందరినీ వ్యక్తగత శత్రువులుగానే భావిస్తారనీ, ఆ కారణంగానే తనపై విమర్శలు చేస్తున్న సొంత పార్టీ ఎంపీ రఘురామ రాజు భీమవరం లో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హజరు కాకుండా అడ్డుకున్నారని చెబుతారు. తనను వ్యతిరేకించే వారికి ఎదురుపడటాన్ని కూడా జగన్ సహించరని చెబుతారు. అందుకే విపక్ష నేత చంద్రబాబు హాజరౌతున్న ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి జగన్ డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఆ సమావేశానికి హాజరౌతే జగన్ చంద్రబాబుతో కలిసి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరో తేదీన ఢిల్లీ వెళ్లబోతున్నారు. “అజాదీ కా అమృత్ మహోత్సవ్” జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి హాజరవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.  రాజకీయాన్ని రాజకీయంగానే చూసే చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.కానీ రాజకీయాన్ని కూడా వ్యక్తిగత శత్రుత్వ స్థాయికి పెంచుకునే జగన్‌కు మాత్రం ఈ భే్టీ ఇబ్బందికరమే.అందుకే ఆయన డుమ్మా కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి పై హ‌త్యాయ‌త్నం?.. కల్లెడ సర్పంచ్ భర్త అరెస్ట్

తెలంగాణా ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిపై హ‌త్య‌కు కుట్ర జ‌రిగింద‌న్న వార్త‌ల‌పై ఆర్మూర్ క‌ల్లెడ గ్రామ స‌ర్పంచ్ లావ‌ణ్య స్పందించారు. ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డితో త‌మ‌కు గొడ‌వ జ‌రిగింద‌న్న మాట వాస్త‌వ‌మేన‌ని, అప్ప‌టి నుంచీ ఆయ‌న మాపై క‌క్ష పెంచుకున్నార‌ని ఆమె అన్నారు. క‌ల్లెడ‌లో తాము చేసిన అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి రూ18 ల‌క్ష‌ల బిల్లులు రాకుండా ఆయ‌న అడ్డుకున్నా ర‌ని ఆమె ఆరోపించారు. దీన్ని గురించి ప్ర‌శ్నించ‌డం వ‌ల్ల‌నే త‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  దీన్ని గురించి ఎమ్మెల్యే, క‌లెక్ట‌ర్ నూ క‌ల‌వ‌డానికి అనేక పర్యాయాలు ప్ర‌య‌త్నించాన‌ని అన్నారు. కాగా త‌న భ‌ర్త ప్ర‌సాద్ గౌడ్ ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి వెళ్లార‌ని, అయితే ఆయ‌న వ‌ద్ద ఎలాంటి మార‌ణాయుధాలు లేవ‌ని అన్నారు. ఎమ్మెల్యేపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌నేది అవాస్త‌వ‌మ‌ని, త‌న భ‌ర్త తుపాకీ, క‌త్తి వంటివి తీసికెళ్లారని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆమె అన్నారు.  ఇదిలా ఉండ‌గా బంజారా హిల్స్ రోడ్డు నెం.12లో ఉన్న జీవ‌న్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఎమ్మ‌ల్యేపై హ‌త్యకు కుట్ర కోణంలో విచార‌ణ చేసారు. అక్క‌డ సీసీ ఫుటేజ్ ఆధారంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. బంజారా హిల్స్ పోలీసులు ప్ర‌సాద్ గౌడ్‌ను అరెస్టు చేసి విచార‌ణ చేస్తున్నారు.  ఆర్నూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమాన స్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తి ఆర్మూర్‌కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా గుర్తించారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో కక్ష పెంచుకున్న భర్త.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరగుతుండడంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద కత్తి, ఒక పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు.