బాక్సింగ్ క్వార్టర్‌ఫైనల్లో జరీన్, హాకీలో ఘనాపై ఘనవిజయం
posted on Aug 1, 2022 6:28AM
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్‌గేమ్స్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. నిఖత్ జరీన్ మహిళల 50 కిలోల విభాగం లో క్వార్టర్‌ఫైనల్ చేరింది. రౌండ్ -16లో మొజాంబిక్ బాక్సర్ హెలెనా ఇస్మాయెల్ బగావోను నాకౌట్ చేసింది. నిఖత్ పదునైన పంచ్ లకు బదులివ్వడంలో ప్రత్యర్థి విఫలమవడంతో రెఫరీ బౌట్‌ను ఆపేసి జరీన్‌ను విజేతగా ప్రకటించాడు. కాగా, పురుషుల 63.5 కిలోల విభాగంలో శివ థాపా 1-4తో రీస్ లించ్ (స్కాట్లాండ్) చేతిలో ఓడిపోయాడు.
మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ క్వార్టర్స్‌లో భారత్ 3-0తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. మిక్స్‌డ్‌లో అశ్విని/సుమిత్ జోడీ, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ ప్రత్యర్థులను ఓడిండంతో భారత్ సెమీస్ చేరుకుంది.
ఇదే జోరు హాకీలోనూ భారత జట్లు ప్రదర్శిస్తున్నాయి. మహిళల పూల్-ఎలో భారత్ 3-1తో వేల్స్‌పై గెలిచింది. వందనా కటారి యా రెండు, గుర్జీత్ కౌర్ ఓ గోల్ చేశారు. భారత మహిళలకిది వరుసగా రెండో గెలుపు. మరోవైపు పురుషుల జట్టు 11-0తో ఘనా ను చిత్తు చిత్తుగా ఓడించింది.
ఇక టేబుల్ టెన్నిస్‌లో పురుషుల టీమ్ ఈవెంట్‌లో శరత్ కమల్ సారథ్యంలోని భారత జట్టు సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో 3-0తో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. ఇక మనికా బాత్రా నేతృత్వంలోని మహిళల బృందం క్వార్టర్స్‌లో 2-3తో మలేసియా చేతిలో ఓడిపో యింది. అలాగే, లాన్‌బౌల్‌లో పురుషుల పెయిర్స్ విభాగంలో భారత జోడీ దినేశ్ కుమార్/సునీల్ జోడీ 18-15తో ఇంగ్లండ్ జంటను ఓడించి క్వార్టర్స్ చేరింది. జోష్న, సౌరవ్‌మహిళల స్క్వాష్ సింగిల్స్‌లో జోష్న చినప్ప 3-1తో కేట్లిన్ వాట్స్ (న్యూజి లాండ్)పై, పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ ఘోశాల్ 3-0తో డేవిడ్ (కెనడా)పై గెలిచి స్క్వాష్ క్వార్టర్‌ఫైనల్ చేరుకున్నారు.
స్విమ్మింగ్ 50మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో శ్రీహరి నటరాజ్ సెమీ్‌సకు అర్హత సాధించాడు. కాగా, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో శ్రీహరి ఏడోస్థానంలో నిలిచాడు. అయితే జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్‌లో భారత అథ్లెట్లు విఫలమయ్యారు. పురుషుల ఆల్ రౌండ్ ఫైనల్స్‌లో యోగేశ్వర్ సింగ్ 15వ స్థానానికి, మహిళల ఆల్‌రౌండ్ ఫైనల్స్‌లో రుతుజ నటరాజ్ 17వ స్థానానికి పరిమితమై నిరాశపరిచారు. అలాగే సైక్లింగ్‌మిపురుషుల సైక్లింగ్ స్ర్పింట్ ఈవెంట్‌లో రొనాల్డో లైటోన్‌జామ్ ప్రీక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా సైక్లిస్ట్ మాథ్యూ గ్లాట్జెర్ చేతిలో ఓడాడు.