తెలంగాణ బీజేపీలో బండి వర్సెస్ ఈటల
posted on Aug 1, 2022 @ 10:22AM
అంతా బాగుందని చెప్పుకుంటేన్న తెలంగాణ బీజేపీలో సంక్షోభం ముందురు తోంది. పార్టీ టాప్ నేతల అభినందనలు అందుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండికి రాష్ట్రంలో మాత్రం గట్టి పోటీ ఎదురౌతోంది. అసమ్మతి అంతకంతకూ ముదురుతోంది. ఈటల రూపంలో బండికి సవాల్ ఎదురౌతున్నది. తనకు తిరుగే లేదని బావిస్తున్న బండి సంయయ్ కు ఆటల రూపంలో బలమైన సవాల్ ఎదురౌతున్నది. ఈటల వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తూ రాష్ట్ర పార్టీలో బండి సంజయ్ కు దీటుగా నిలుస్తున్నారు.
కేసీఆర్ కు రాష్ట్రంలో దీటైన నాయకుడు తానేనని చాటుకునే దిశగా ఈటల పావులు కదుపుతున్నారు. ఈటల రాజేందర్ నేరుగా టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే సవాల్ విసురుతూ, బీజేపీ అనుమతిస్తే గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడిస్తానని ప్రకటించారు. ఇది ఒక రకంగా ఒకే దేబ్బకు రెండు పిట్టలను గురి పెట్టినట్లుగా అయ్యింది. ఈటల లక్ష్యం కూడా అదే నని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ తో పోటీకి సై అంటూ సవాల్ విసరడం ద్వారా రాష్ట్ర బీజేపీలో బండికి పెను సవాల్ విసిరారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును గజ్వేల్ కే పరిమితం చేసేలా చెక్ పెట్టారు. వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన గజ్వేల్ లో ఈ సారి కేసీఆర్ కు ఈటల రూపంలో గట్టి సవాల్ ఎదురు కాక తప్పదన్న భావనను ప్రజలలో కల్పించడం ద్వారా బీజేపీలో ఈటల ఒక్క సారిగా స్టార్ నాయకుడిగా ఎదిగిపోయారని పరిశీలకులు అంటున్నారు. గజ్వేల్ లో కేసీఆర్ కు తానే ప్రత్యర్థినని ఈటల స్వయంగా ప్రకటించుకోవడం,
ఆ టెంపోను అలాగే కొనసాగేలా వరుస సవాళ్లతో రెచ్చిపోవడంతో ఇంత కాలం బండి చుట్టూ తిరిగిన బీజేపీ శ్రేణులు ఇప్పుడు ఈటల వైపు ఆసక్తిగా చూసేలా చేసుకున్నారు. ఇది బండిని డిఫెన్స్ లో పడేసి తప్పులో అడుగు వేయించిందని కూడా అంటున్నారు. అందుకే ఈటల గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించడాన్ని బండి ఖండించారంటున్నారు. బీజేపీలో ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకోవడం కూడదని, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకోవాలని బండి అనడం ద్వారా ఈటల తనకు పోటీ అని తాను భావిస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లైంది. అంతే కాకుండా ఈటల దూకుడును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని పార్టీ శ్రేణులే బండి విషయంలో అనుకుంటున్నారు, బీజేపీలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకుంటే కుదరదు అని చెప్పడం ద్వారా బండి ఈటలను టార్గెట్ చేసి రాష్ట్ర బీజేపీలో ఆధిపత్య పోరు ఉందని చాటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. .
పార్టీలో ప్రాధాన్యం దక్కపోవడంతో ఈటల అసంతృప్తితో ఉన్నారని తెలిసి ఇటీవల హైకమాండ్ఆయనను పిలిచి మాట్లాడటమే కాకుండా చేరికల కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చింది. అయితే పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఉండటంతో చేరికల కమిటీ పని ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కు అన్నట్లుగా తయారైంది. ఈటల ద్వారా చేరితే బండి వల్ల ఇబ్బందులు ఎదురౌతాయనీ, బండి సమక్షంలో పార్టీ తీర్ఘం పుచ్చుకుంటే చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల ఆగ్రహానికి గురి కావలసి ఉంటుందని బీజేపీలో చేరుదామని భావిస్తున్న వారు ఊగిసలాటలో పడ్డారు. మొత్తం మీద చేరికలు టీఆర్ఎస్ నుంచే అధికంగా ఉంటాయని భావిస్తున్న తరుణంలో చేరే వారందరూ ఈటల ద్వారా చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సుదీర్ఘ కాలం ఆ పార్టీలో ఉన్న ఈటలకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలందరితో సత్సంబధాలు ఉన్నాయి.
ఒక ఎమోషనల్ బాండింగ్ కూడా వారితో ఉంది. తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేసిన కారణంగా ఏర్పడి బాండింగ్ అది. ఈ నేపథ్యంలోనే బండికి చేరికల కమిటీ బాధ్యతలు హైకమాండ్ అప్పగించడంతో బండి ఉలిక్కిపడ్డారని అంటున్నారు. అందుకే గజ్వేల్ విషయంలో ఈటల కేసీఆర్ ను సవాల్ చేయడాన్ని పరోక్షంగానైనా ఖండించి పార్టీలో గ్రూపులు ఉన్నాయన్న విషయాన్ని చాటారని పరిశీలకులు భావిస్తున్నారు.