ఇది ముమ్మాటికీ బీజేపీ కుట్రే .. కాంగ్రెస్
posted on Jul 31, 2022 @ 3:13PM
ఒకరిని అవమానపర్చడానికి పెద్దగా వ్యూహాలేమీ పన్నక్కర్లేదు, ఒకరి అధికారం దెబ్బతీయడానికి అవసరం. ఒకరిని అధికార పీఠం నుంచి దించడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు చేయవలసివస్తుంది. ఇది ప్రస్తుత రాజకీయ నీతి. ఇదే బీజేపీ అనుసరిస్తోందన్న అభిప్రాయాలే దేశమంతా వ్యక్తమవుతున్నాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుతంత్రా లతోనే ఆ ప్రభుత్వం పరువు బజారుకీడ్చి ఆనక పనికి రాదని గోడమీద రాయించి ఎన్నికలు పెట్టించి అధికారంలోకి రావాలన్న చెత్త ఆలోచన బీజేపీవారి సొంతమని రాజకీయ విశ్లేషకుల మాట. జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు నోట్ల కట్టలతో దొరికిపోయారన్నది కూడా అటువంటి కుట్రలో భాగమేనని జార్ఖండ్ కాంగ్రెస్ నాయకులు నమ్ముతు న్నారు. కాగా, జార్ఖండ్లోని జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.
గిరిజనులకు బహుమతులు కొనడానికి వెళ్ళారని ఓ ఎమ్మెల్యేల సోదరుడు చెప్తున్నారు. ఈ మొత్తం సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని టీఎంసీ డిమాండ్ చేస్తోంది. టీఎంసీఈ ఎమ్మెల్యేలకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత శశి పంజా డిమాండ్ చేశారు. జార్ఖండ్ లోని జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేయడం కోసం బేరసారాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతు న్న సమ యంలో ఈ నగదు పట్టుబడిందని టీఎంసీ ఓ ట్వీట్‌లో పేర్కొంది.
పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు జార్ఖండ్ ఎమ్మెల్యేలు - ఇర్ఫాన్ అన్సారీ (జమ్‌తారా), రాజేశ్ కచ్చప్ (ఖిజ్రి), నామన్ బిక్సల్ కొంగరి ( కొలెబిర) - ప్రయాణిస్తున్న కారులో భారీగా నగదు ఉందని సమాచారం అందింది. వెంట నే అప్రమత్తమైన పోలీసులు హౌరా జిల్లాలోని 16వ నెంబరు జాతీయ రహదారిపై రాణిహటి వద్ద తనిఖీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున నగదు కనిపించడంతో, ఆ నగదును స్వాధీనం చేసుకుని, ముగ్గుర్నీ అరెస్టు చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంతో ఆ పార్టీ ఘాటుగా స్పందించింది. జార్ఖండ్‌లోని జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వా న్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించింది. ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రభుత్వాలను కూల్చేందుకు అస్సాం ప్రధాన కార్యక్షేత్రంగా మారిం దనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. 15 రోజులపాటు నాటకీయ పరిణామాల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కూలి పోయిందన్నారు. జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర జరుగుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. మహా రాష్ట్రలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శివసేన, ఎన్‌సీపీ నేతలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. చివరికి శివసేనలో చీలిక వచ్చి, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి
డబ్బుతో పట్టు బడిన ఎమ్మెల్యేల విషయంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు మాట్లాడటం సమంజసం కాదన్నారు. కానీ దేశంలో పరిస్థితిని చూసి నపుడు, పట్టుబడిన ఈ ఎమ్మెల్యేలే ఈ విషయాన్ని బాగా వివరించగలరని చెప్పారు. అయితే ఈ సంఘటన చాలా బాధాకరమని తెలిపారు. తమ పార్టీ అధిష్ఠానానికి ఓ నివేదికను సమర్పిస్తామని చెప్పారు. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్ట బోమని తెలిపారు. జార్ఖండ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు టిర్కే మీడియాతో మాట్లాడుతూ, తమది కాని ప్రభుత్వాన్ని అస్థిర పరచడం బీజేపీ స్వభావమని ఆరోపించారు. అదే ప్రయత్నం ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా జరుగు తోందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడానికే ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చిందన్నారు.
గిరిజనులకు బహుమతు లిచ్చేందుకే ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ సోదరుడు ఇమ్రాన్ మాట్లాడుతూ, తన సోదరుడిని అక్రమంగా ఇరికించేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతి సంవత్సరం గిరిజనులకు బహుమతులు ఇస్తూ ఉంటా మని, అదే విధంగా ఈ సంవత్సరం కూడా కోల్‌కతా బడా బజార్‌కు వెళ్ళారని చెప్పారు. బడా బజార్‌లో చీరలు కొని, గిరిజనులకు పంపిణీ చేయడం తన సోదరునికి అలవాటని చెప్పారు. వీరివద్ద పట్టుబడిన సొమ్ము రూ.కోట్లలో ఏమీ లేదన్నారు. తాను ఉదయం నుంచి వారిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని, తనకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు.