ఇక ఈ వేలం దేనికి?
posted on Jul 31, 2022 @ 5:03PM
నిత్యం భజనచేసే అసమదీయులకే వీరతాళ్లు వేయాలంటాడు ఓ సినిమా లో సన్నగా పొడవుగా ఉండే మాంత్రి కుడు. తమనే మనసులో పెట్టుకుని ఎల్లవేళా, ప్రతీరోజు దేవుడిలా భావిం చేవారికే అన్ని ఏర్పాట్లూ చూడాలి. లేకపోతే పని అయిపోతుంది. అనాది గా రాజకీ యా ల్లో వస్తున్న సదాచా రం ఇదే. తన వారికి విస్తర్లలో వడ్డించ డం తెలియని వరెవరు? ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి అలా కొన సాగాలంటే మనోళ్లనుకున్నవారిని సం తృప్తి పరచాలి గదా..అదే జరిగింది ఏపీలో బార్ల ఈ వేలం. దాదాపు అన్ని బార్లు వైసీపీ నేతల అనుచరులకే దక్కిందని బహిరంగంగానే చెప్పుకుంటున్నారని సమాచారం.
ఈ-వేలంలో రెండురోజు అంతా ముందస్తు రాజీల మార్గాన్నే అనుసరించారని అందుకు ఎమ్మెల్యేల బెదిరింపులతోనే అన్నీ సాగాయని, ఆరోపణలు వస్తున్నాయి. మద్యం వ్యాపారులు సిండికేట్‌లుగా మారారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ-వేలం లో ధర పెరగకుండా వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకున్నారు. కోస్తాలోని 6 జిల్లాల్లో 500 బార్లకు ఈ-వేలం వేశారు.
నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, కాకినాడ, అమలాపురంలో ఒక అవగాహన ప్రకారం జరిగిందని చెబుతున్నా రు. ప్రకాశం జిల్లా దర్శిలో మద్యం షాపు రూ.1.47 కోట్లు పలికింది. ఇదే జిల్లాలోని అద్దంకిలో రూ.1.37 కోట్లకు టెండర్ పాడా రు. మార్కా పురంలో రూ.1.17 కోట్లు, చీమకుర్తిలో రూ.1.7 కోట్లకు వేలం పాడారు. వైసీపీ ఎమ్మెల్యేల బెదిరింపులతో వ్యాపా రులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు ఆదాయం తగ్గింది. ప్రధాన నగరాల్లో వైసీపీ నేతల అనుచరులకే బార్ల టెండర్లు ఇచ్చారు. సాధ్యంకాని ప్రాంతాల్లో భాగస్వామ్యం ఇవ్వాలని బెదిరించినట్లు సమాచారం.