ఇంత చెత్త అంపైరింగ్ క్రికెట్‌లోనే సాధ్యం..సెహ్‌వాగ్‌ 

ప్ర‌స్తుతం బ‌ర్మింగ్ హామ్‌లో జ‌రుగుతున్న కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో అంపైరింగ్ లోపాల ప‌ట్ల భార‌త మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్‌వాగ్‌ మండిప‌డ్డాడు. గేమ్స్‌లో మ‌హిళ‌ల హాకీ సెమీస్‌లో ఆసీస్-భార‌త్ మ్యాచ్ లో అంపైర్లు ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రించార‌ని సెహ్‌వాగ్ ఆరోపించాడు. ఇటువంటివి స‌హ‌జంగా క్రికెట్‌లోనే జ‌రుగుతుంటాయి. కానీ ఇపుడు హాకీలో కూడా చూస్తున్నాను  అని అన్నాడు. ఇటువంటి ప‌క్ష‌పాతంతో కూడిన అంపైరింగ్ త‌ర‌చూ ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌ల్లోని పూర్వం ఎక్కువ‌గా జ‌రుగుతుండేవని వ్యాఖ్యానించాడు.  మ‌హిళ‌ల హాకీ సెమీస్‌లో ఆసీస్ చేతిలో భార‌త్ ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్ ఇపుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. షూటౌట్ ఆరంభంలోనే గ‌డియారం లోపంతో ఆసీస్ ప్లేయ‌ర్‌ను ముందు పిలిచారు. కానీ ఆంబ్రోసియా మ‌లోన్ గోల్ చేయ‌లేక‌పోయింది. కానీ గ‌డియారం త‌ప్పుస‌మ‌యం చేపింది గ‌నుక ఆమెను మ‌ళ్లీ అంపైర్ పిలిచాడు. ఒక‌సారి ఆమె చేసిన ప్ర‌య‌త్నం విఫ‌ల‌మ‌యింది. కానీ అధికారులు ఆమెను రెండోప‌ర్యాయం పిల‌వ‌డానికి అనుమ‌తించారు. ఈసారి ఆమె గోల్ చేసింది.  ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ మొద‌టి షాట్ మిస్ అయింది, కానీ అంపైర్ క్లాక్ స్టార్ట్‌కాలేద‌ని ప్ర‌క‌టించారు. ఇటు వంటి చెత్త అంపైరింగ్ సాధార‌ణంగా క్రికెట్‌లోనే జ‌రిగేది, అదీ ఆసీస్ జ‌ట్టు సూప‌ర్ జ‌ట్టుగా ఎదిగే వ‌ర‌కూ జ‌రిగాయ‌ని సెహ్‌వాగ్ గుర్తుచేశాడు. ఇటువంటి చెత్త గేమ్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికీ మ‌న‌వాళ్లు బ్ర‌హ్మాండంగా ఆడార‌ని భార‌త మ‌హిళా హాకీ టీమ్‌కు సెహ్‌వాగ్ ప్ర‌శంసించాడు.  కాగా ఈ సంఘ‌ట‌న గురించి భార‌త హాకీ మాజీ కెప్టెన్ వీరేన్ ర‌స్కినా స్పందిస్తూ, దీనిపై భార‌త్ హాకీ స‌మాఖ్య తీవ్రంగా స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. అదేమీ అండ‌ర్‌-10  స్కూలు మ్యాచ్ కాదు, ఇలా  జ‌ర‌గ‌డం ఈ ఏడాది రెండో ప‌ర్యాయం అని అన్నాడు. 

త‌లాక్ అని మూడుసార్లు అంటే విడాకులు కాదు.. హైకోర్టు

ఇక నుంచి త‌లాక్ చెప్పి వివాహ‌బంధాన్ని వ‌దిలించుకోవ‌డం కుద‌ర‌దు. తలాక్ అంటూ మూడు ప‌ర్యా యాలు అన‌గానే విడాకులు ఇచ్చిన‌ట్టు కాద‌ని  ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ముస్లిం చ‌ట్టం ప్ర‌కారం నోటి మాటగా మూడుప‌ర్యాయాలు తలాక్ చెప్ప‌డం చెల్లుబాటు కాదు. త‌లాక్‌నామా గా రాసుకున్న‌దానికి గుర్తిం పు ఉండ‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అస‌లు అలాటి వివాహ‌ర‌ద్దు వ్య‌వ‌హారం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని స‌యా రా బాను కేసులో సుప్రీం కోర్టు  తీర్పును ఈ సంద‌ర్భంగా కోర్టు గుర్తుచేసింది.   భార్యాభ‌ర్త‌ల త‌ర‌ఫు పెద్ద‌ల స‌మ‌క్షంలో వీల‌యినంత‌వ‌ర‌కూ స‌యోధ్య కుదిర్చేందుకు ప్ర‌య‌త్నించాలి. అది కుద‌ర‌న‌పుడు ముస్లించ‌ట్టంలో పేర్కొన్న విధంగా స‌రైన కార‌ణాలతో మూడు వేర్వేరు సంద‌ర్భాల్లో త‌లాక్ చెప్పాలన్నది స్ప‌ష్టంచేసింది. కానీ ప్ర‌స్తుత కేసులో మ‌ధ్య‌వ‌ర్తులుగా ఇద్ద‌రు వ్య‌క్తులు భ‌ర్త త‌ర‌ఫు వారే ఉన్నారుగాని  భార్య త‌ర‌ఫువారెవ‌రూ లేరన్న‌ది కోర్టు ప్ర‌స్తావించింది. త‌లాక్ చెప్ప‌డానికి ముస్లిం చ‌ట్టా న్ని అనుస‌రించి ఎలాంటి ఆధారాలు లేవ‌ని తెలిపింది.  ఇదిలా ఉండ‌గా, త‌ల‌క్‌నామాను పోస్టు ద్వారా పంపిస్తే ఆమె తిర‌స్క‌రించింద‌న్న‌దానికి త‌గిన సాక్ష్యాల‌ను కోర్టు ముందు ఉంచ‌లేద‌ని  కోర్టు పేర్కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఆమెకు ఇచ్చిన విడాకులు చెల్లుబాటు కావ ని, భార్య‌గానే ఆమెను గుర్తించాల్సి ఉంటుంద‌ని తేల్చింది.  భర్తనుంచి దూరంగా ఉంటున్న మహిళ భరణం పొందేందుకు అర్హురాలని దిగువకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. సీఆర్పీసీ సెక్షన్‌ 125 ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ జీవితాంతం(మళ్లీ పెళ్లి చేసుకోనంతవరకు) భరణం పొందేందుకు అర్హురాలని స్పష్టం చేసింది. 2006లో గుంటూరు రివిజన్‌ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. పిటిషనర్‌తో పాటు కుమారుడికి భరణం చెల్లించాలంటూ ట్రయల్‌ కోర్టు(పొన్నూరు) తీర్పును సమర్ధిం చింది. 

క్యాసినో కేసులో వంశీకి ఈడీ నోటీసులు.. తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డికి కూడా

చీకోటి ప్రవీణ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. క్యాసినోల నర్వాహకులు చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ ఆయన ద్వారా రాబట్టిన సమాచారంతో పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చీకోటి ప్రవీణ్ పలువురు రాజకీయ నేతలతో జరిపిన వాట్సాప్ చాటింగ్ ను ఈడీ గుర్తించింది.  ఇప్పటికే ఈ కేసులో చీకోటి ప్రవీన్ అతడి సహచరుడు దాసరి మాధవరెడ్డి నివాసాలలో ఈడీ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించిన సంగతి విదితమే.చీకోటి ప్రవీణ్ కేసులో ప్రవీణ్ తోపాటు మరో ఏజెంట్ దాసరి మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ బృందాలు పలు సాంకేతిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి. చీకోటి ప్రవీణ్ విచారణలో బయటపెట్టిన వివరాల ఆధారంగా ఈడీ పలువురు ప్రజా ప్రతినిథులకు నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారిలో  ఒకరు వల్లభనేని వంశీ కాగా మరొకరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అని తెలిసింది. ఇక మిగిలిన వారిలో తెలంగాణ మంత్రులు శ్రీనివాసగౌడ్, చామకూర మల్లారెడ్డి ఉన్నారని తెలిసింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కుటుంబానికి అత్యంత సన్నిహితులు మరొకరికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. వీరిని సోమవారం విచారణకు హాజరు కావల్సిందిగా ఈడీ ఆ నోటీసులలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన క్యాసినే కేసులో చీకోటి ప్రవీణ్ ను ప్రశ్నించిన ఈడీ అతడి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. అలాగే ప్రవీణ్, మరి కొందరి బ్యాంకు లావాదేవీలను సైతం పరిశీలించి కీలక ఆధారాలను సేకరించింది. దాదాపు పాతిక కోట్ల రూపాయలకు పైగా అనుమానాస్పద లావాదేవీలను ఈడీ గుర్తించినట్లు చెబుతున్నారు. ఆ నగదు ఎక్కడ నుంచి ఎలా వచ్చింది? ఎలా ట్రాన్స్ ఫర్ చేశారు తదితర అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, తెలంగాణ మంత్రులు శ్రీనివాసగౌడ్, చామకూర మల్లారెడ్డితో పాటు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులలో ఒకరికి నోటీసులు జారీ చేసింది.  వచ్చే రెండు మూడు రోజులలో వీరిని ఈడీ విచారించనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

7ఏళ్ల పిల్ల‌.. 15 ఏళ్ల అమ్మాయిగా తిరిగొచ్చింది!

ఆట‌కి వెళ్లిన పిల్లాడు తిరిగివ‌చ్చాడు, ఆఫీసుకి వెళ్లిన నాన్న తిరిగివ‌చ్చాడు, ప‌క్కింటి పిల్ల‌దీ కాలేజీ నుంచి వ‌చ్చేసింది, పూజా గౌడ్ మాత్రం తిరిగి రాలేదు. త‌ల్లికి ఆతృత‌తో పాటు భ‌యంప‌ట్టుకుంది. ఎవ‌ర‌న్నా కిడ్నాప్ చేశారా? చంపేసారా? అని భ‌యంతో భ‌ర్త‌ను తీసుకుని పోలీస్ స్టేష‌న్‌కి ప‌రుగు తీసింది ఏడుస్తూ. ముంబైలో 2013 జ‌న‌వ‌రి 22వ తేదీన డిఎన్ న‌గ‌ర్ ప్రాంతంలో ఈ సీన్ అక్క‌డివారికి ఇంకా గుర్తే. పోలీసుల రికార్డుల్లో ఆ పిల్ల పేరు మిస్సింగ్ గ‌ర్ల్ 166!  చిత్రంగా 166 పిల్ల ప‌ద‌హారేళ్ల అమ్మాయిగా 2015లో తిరిగి త‌ల్లి వ‌ద్ద‌కు వ‌చ్చింది! యావ‌త్ డిఎన్‌న‌గ‌ర్ వాసులూ ఆశ్చ‌ర్య‌పోయారు.. ఇదెలా సాధ్య‌మ‌ని. ఇన్నాళ్లూ ఎటెళ్లిపోయావే పిల్లా అని అడ‌గ‌ని అమ్మ‌ల‌క్క‌లు లేరు.  బ‌డికి వెళ్లిన పిల్ల‌లు, చాక్లెట్ల‌కోసం బ‌య‌టికి వ‌చ్చిన పిల్ల‌లు ఇలా చాలామంది క‌నిపించ‌కుండా పోయారు. అదో పెద్ద మిస్ట‌రీగా మారింది. వారిలో కొద్దిమందే పోలీసుల‌కు దొరికారు. మిగ‌తా వారు చ‌ని పోయి ఉంటార న్న న‌మ్మ‌కంతో కేసును ద‌ర్యాప్తు చేయ‌డంకూడా మానేశారు. పూజా విష‌యంలోనూ దాదాపు అదే ఆలోచ న‌లో ఉన్నారు. అప్ప‌టి ఈ కేసుల‌కు సంబంధించిన ఇన్‌ఛార్జ్  ఏ ఎస్ ఐ రాజేంద్ర భోంస్లే అయితే పూజా త‌ల్లి దండ్రుల‌కు ఆశ‌లు వ‌దులుకోమ‌నే చెప్పారు. ఆయ‌నా వెతికి వెతికి వేసారి అదే నిర్ధారించు కున్నారు. కానీ ఆయ‌న రిటైర‌యిన త‌ర్వాత పూజా ఎక్క‌డో బ‌తికే ఉంద‌న్న అనుమానం రానే వ‌చ్చింది. ఏదో ఒక‌రోజు ఆమె త‌న త‌ల్లిదండ్రుల‌ను చేరుకుంటుంద‌ని అంటూం డేవారు. ఇప్ప‌టికీ ఆ పిల్ల స్కూలు ఫోటో త‌న ప‌ర్సులో పెట్టుకునే ఉన్నారు. ముంబైకి వ‌చ్చిన‌పుడ‌ల్లా ఈ కేసు సంగ‌తి విచారిస్తూండేవార‌ట‌.  ఆరోజు పూజ త‌న అన్న రోహిత్‌తోపాటు స్కూలుకి వెళ్లింది. వాళ్ల అమ్మ‌మ్మ ఇచ్చిన పాకెట్ మ‌నీ కోసం అక్క‌డ ఇద్ద‌రూ గొడ‌వ‌ప‌డ్డారు. రోహిత్‌కి కోపం వ‌చ్చి దూరంగా ఎటో వెళిపోయాడు. ఆ స‌మ‌యంలో అటుగా వ‌చ్చిన హారీ డిసౌజా, అత‌ని భార్య సోనీ  ఈ  పిల్ల‌ని చూశారు. డి సౌజా ఎల‌క్ట్రీషియ‌న్‌.   పిల్ల‌కి  ఐస్ క్రీమ్ కొనిచ్చి మ‌రి ఏమి  చెప్పి మాయ చేశారో తెలీదు గాని పూజా స్కూలు గేటు లోప‌లికి వెళ్లే లోప‌లే ఆమెను తీసికెళిపోయారు. వారికి సంతానం లేదు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో, వారు ఆమెను ఎలా పెంచార‌న్న‌దీ ఎవ‌రికీ తెలీదు. పోలీసుల‌కీ తెలీదు. మ‌రి ఆమె 15 ఏళ్ల అమ్మాయిలా  ఇంటికి ఎలా చేరింద‌నేది ఇప్ప‌టికీ మిస్ట‌రీయే. పిల్ల ఇంటికి వ‌చ్చేసింద‌న్న ఆనందంలో ఆ ప్ర‌శ్న‌ల‌కు త‌ల్లిదం డ్రులు, చుట్టుప‌క్క‌ల‌వారూ పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదు.

ఇన్నాళ్లూ నిద్ర‌పోతున్నారా?.. జ‌వ‌హ‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచీ రాజ‌ధాని విష‌యం న‌లుగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ ఇద‌మిద్ధం తేల‌డం లేదు. దీనికి తోడు తాజాగా అస‌లు రాజ‌ధాని అంశం రాష్ట్ర ప‌రిధిలోనిది కాద‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అన‌డం ప‌ట్ల విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఇప్పుడు రాజ ధాని ఏర్పాటు విష‌యంలో రాష్ట్రానికి అధికారం లేద‌న్న సంగ‌తిప‌ట్ల వైసీపీ ఎం.సీ విజ‌య‌సాయి రెడ్డి ఇప్పుడు గ్ర‌హించ‌డం ప‌ట్ల సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కే.రామ‌కృష్ణ మండిప‌డ్డారు. ఇన్ని రోజులు ఆయ‌న నిద్ర‌పోతు న్నారా అని విమ‌ర్శించారు.  అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంటుంద‌ని గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ అది కార్య రూపం లోకి రాలేదు. రాజ‌ధానిగా అమ‌రావ‌తిని అభివృద్ధికి చేయ‌వ‌ల‌సిన అన్ని ప్ర‌య‌త్నాలు చంద్ర బాబు ప్ర‌భుత్వం చేసింది. రాజ‌ధాని ఎలా ఉండాలి, ఎలా నిర్మించాల‌న్న‌దీ దూర దృష్టితో ఆలోచించి విదేశీ సంస్థ‌ల‌తో దాని రూపురేఖ‌లు త‌యారుచేయించారు. కానీ ఆల‌స్యం అమృతం విషంలా నిర్మాణ కార్యక్ర‌మాలు జ‌ర‌గ‌నే లేదు. ఇంత‌లో ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చింది. ప్ర‌త్యేక హోదాతో పాటు రాజ‌ధాని అం శాన్ని కూడా తేలుస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు ఎంతో హామీనిచ్చారు. ప్ర‌జ‌లు ఎంత‌గానో ఆశించిన‌ప్ప‌టికీ ఏదీ చేయలేక‌పోగా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లూ పోగొట్టుకున్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందీ క‌ల‌గ‌కుండా అన్నీ స‌వ్యంగా చేస్తామ‌ని అన్న జ‌గ‌న్ స‌ర్కార్ అమ‌రావ‌తితో పాటు మ‌రో రెండు ప‌ట్ట‌ణాల‌ను కూడా రాజ‌ధానులుగా అభివృద్ధి చేయ‌డానికి పూనుకున్నారు. పాల‌నాప‌ర‌మైన వెసులు బాటు కోసం  ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న ప్ర‌చారం చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా, ఇన్నిరోజుల తర్వాత.. ఏపీలో మూడు రాజధానుల విషయంలో రాష్ట్రాలకు పూర్తి అధి కారం ఇవ్వాలని రాజ్యాంగ సవరణ కోరుతూ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్ దాఖలు చేయట మేమి ట‌ని టీడీపీనేత జ‌వ‌హ‌ర్  ప్రశ్నించారు. అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే అమరా వతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టా లని డిమాండ్ చేశారు. 

ఆర్థిక అభద్రతలో ఏపీ ఉద్యోగులు.. మరో ఉద్యమానికి రెడీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు ఆర్థిక అభద్రతతో సతమతమౌతున్నారా? ప్రభుత్వ తీరుతో విసిగిపోయి మరో ఉద్యమానికి సిద్ధమౌతున్నారా? డీఏలు ఇవ్వకుండా, దాచుకున్న సొమ్ము సైతం తీసుకునే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారా? ప్రభుత్వం వారి తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని భావిస్తున్నారా? అంటే ఉద్యోగ సంఘాల నాయకుడు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఔననే అంటున్నారు. ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనీ, స్వయంగా సీఎం ఇచ్చిన హామీలు కూడా నెరవేరడం లేదని, అందుకే మరో ఉద్యమం తప్పని పరిస్థితే కనిపిస్తోందని బొప్పరాజు చెప్పారు. ఆందోళనకు ఉద్యోగుల నుంచే తమపై ఒత్తిడి వస్తోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఉదాశీనంగా ఉంటే సమస్యల పరిష్కారం సాధ్యం కాదనీ, వెంటనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సిందేనని జిల్లాల ఉద్యోగ సంఘాలు నుంచి తమపై తీవ్ర ఒత్తిడి వస్తోందని ఆయన వెల్లడించారు. జీపీఎఫ్, ఎపీ జీఎల్ఐ మెడికల్ రీయింబర్స్ మెంట్, సరెండర్ లీవులకు సంబంధించి వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వివరించారు.   ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వటానికి కిందటి మార్చి నెల గడువుగా పెట్టారని.. అయినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదనీ అన్నారు. వీటిపై సీఎం  జగన్ స్వయంగా స్పందిస్తూ జూలై ఆఖరు నాటికి ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అతీగతీ లేదని అన్నారు. దీంతో   కుటుంబాల్లో పెళ్లిళ్లు వైద్య ఖర్చులు పిల్లలకు ఉన్నత విద్య కోసం డబ్బులు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బొప్పరాజు అన్నారు. ఇప్పటి వరకూ ఈ బాపతు దాదాపు 3వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని అన్నారు. అలాగే రూ.7000 కోట్ల డీఏ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించలేదంటున్నారు.  అలాగే ఉద్యోగులకు పీఆర్సీ అరియర్స్పై ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెబుతున్నారు. తక్షణమే పీఆర్సీ అరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 

వైసీపీ నేతలు ఇక బరితెగించనున్నారా?

గోరంట్ల మాధవ్ వ్యవహారంలో వైసీపీ హైకమాండ్ ఎటువంటి చర్యా తీసుకోకపోవడంతో వైసీసీ నేతలు ఇక బరితెగించనున్నారా? అంటే విపక్షాలు ఔననే అంటున్నాయి. విపక్షంలో కూర్చుంటే వైసీపీ నేతలకు ఇక తమ విశృఖలత్వానికి అవకాశం ఉండదన్న యోచనలో పార్టీ అధికారంలో ఉండగానే తమ విశ్వరూపం చూపించేయాలన్న ఆత్రుత వారిలో పెరిగిపోతోందని అంటున్నారు. చిన్నా చితకా నేతల వ్యవహారాలు అటుంచితే పార్టీలో కీలక పదవులలో ఉన్న వారి అసభ్య, అనుచిత వర్తనను నియంత్రించలేని వైసీపీ అధినేత తీరును అలుసుగా తీసుకున ఇక పార్టీలో ఇలాంటి విశృంఖలత పెరిగిపోయే అవకాశాలే ఎక్కువ అని పరిశీలకులు కూడా అంటున్నారు. వైసీపీలో ఏం చేసినా చెల్లిపోతుందన్న భావన శ్రేణుల్లో ఎక్కువయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండగా అంబటి ఒక మహిళలో అసభ్యంగా మాట్లాడిన నాడే ఆయనపై చర్య తీసుకుని ఉండి ఉంటే ఆ తరువాత మంత్రి అవంతి శ్రీనివాస్.. ఇప్పుడు గోరంట్ల మాధవ్ లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి ఉండే వారు కాదని అంటున్నారు. సభ్యత, సంస్కారం, నైతికత వంటి వాటి పట్ల పార్టీ హైకమాండ్ కు పెద్దగా పట్టింపు లేకపోవడం వల్లే పార్టీలో ఇటువంటి ధోరణి ప్రబలుతోందని అంటున్నారు. ఇక ప్రతి విషయంలోనూ ఎదురుదాడే మంత్రంగా భావించే వైసీపీ ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయంలో పార్టీ పరువు పోయిందని పెద్దగా బాధపడటం లేదనీ, ఇలానే విపక్షం పరువు తీయడం ఎలా అన్న యోచనే చేస్తుందని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఎవరో ఒకరు, ఏదో ఒక తప్పు చేసిన ఆధారం దొరక్కపోదా అని విపక్ష నేతల వ్యవహారాలపై నిఘా పెట్టిందనీ, వారి కార్యకలాపాలను జల్లెడ పడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాధవ్ విషయంలో చర్య తీసుకోకపోవడం అటుంచి.. పార్టీ సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో పడిపోయిన మాట మాత్రం వాస్తవమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో విపక్షాల విమర్శలను నోరేసుకు పడిపోయి ఖండించేసే అంబటి వంటి వారు మాట్లాడడానికి కూడా సాహసించకపోవడం, మాజీ మంత్రులు, అవకాశం ఉన్నా లేకున్నా విపక్ష నేతలపై బూతుల పంచాంగంతో విరుచుకుపడిపోయే కొడాలి నాని వంటి వారు మౌనముద్ర వహించడమే గోరంట్ల విషయంలో వైసీపీ ఎంత డిఫెన్స్ లో పడిందో అవగతమౌతోందని అంటున్నారు. ఇంతగా పరువు బజారున పడినా గోరంట్లపై ఈగ కూడా వాలకుండా పార్టీ వ్యవహరిస్తోందంటే.. గోరంట్లపై చర్య తీసుకుంటే ఇంకెన్ని బాగోతాలు బయటపడతాయో అన్న భయమే కారణమని చెబుతున్నారు.  

ఉమా మహేశ్వరిది ఆత్మహత్యే.. తేల్చిన పోస్టుమార్టం నివేదిక

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరిది ఆత్మహత్యే.  ఈ విషయాన్ని పోస్టుమార్టం నివేదిక విస్పష్టంగా తేల్చేసింది. దీంతో ఇన్ని రోజులుగా వైసీసీ సోషల్ మీడియా ఆమె మరణం విషయంలో చేసిన హంగామా, శవ రాజకీయాలకు చెక్ పడింది. ఒక కుటుంబం, అదీ తెలుగువారు ఇలవేల్పుగా భావించే ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో ఉన్న సమయంలో వైసీపీ ఆడిన వికృత రాజకీయ క్రీడపై ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ పార్టీ ఎంపీ చేసిన వరుస ట్వీట్ల పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే గోరంట్ల మాధవ్ అసభ్య వీడియోపై విజయసాయి నోరుమెదపరెందుకని నిలదీతస్తున్నారు. ఇక ఉమామహేశ్వరి పోస్టు మార్టం విషయానికి వస్తే మెడకు ఉరి గట్టిగా బిగుసుకోవడం వల్ల స్వర పేటిక విరిగి ఆమె మరణించారు. అగస్టు 1న ఉమామహేశ్వరి తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించిన సంగతి తెలిసిందే. పోస్టుమార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తీవ్రమైన మానసిక ఒత్తడి, అనారోగ్యం కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరిది ఆత్మహత్యే అని తేలడంతో ప్రజలు, తెలుగుదేశం వర్గాలు వైసీపీపైనా, ఆమె మరణం విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఆశ‌కూ అంతుండాలి జ‌గ‌న్‌

మంచి నాయ‌కునికి ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌లుకుతారు. మంచి ప్ర‌భుత్వాన్ని ఎప్పుడూ ఉండాల‌నే కోరు కుంటారు. ప్ర‌జ‌ల‌కు కావ‌ల‌సింది వారి సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ఆప‌ద‌ల్లో ఆప‌న్న‌హ‌స్తం త‌ప్ప మ‌రేమీ అక్క ర్లేదు. వాటి విష‌యంలో న‌మ్మ‌కం క‌లిగించిన‌వారు, ప‌థ‌కాల అమ‌లు స‌క్ర‌మంగా అమ‌లు చేస్తూ ప్ర‌జ‌ల ఆరోగ్య‌, సంక్షేమానికి నిరంత‌రం కృషి చేసే నాయ‌కులు, ప్ర‌భుత్వాల‌నే మ‌ళ్లీ గెలిపించాల‌నే అనుకుంటారు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  వైసీపీ ప్ర‌భుత్వం ఇందుకు పూర్తి భిన్నంగా మారింది. పాల‌నా కాలం స‌గం దాటిన త‌ర్వాత ప్ర‌జ‌లు విసిగెత్తారు. ఏ మాత్రం మ‌ళ్లీ ఈ ప్ర‌భుత్వమే ఉండాల‌ని కోరు కోవ‌డం లేదు. కానీ సీఎం జ‌గ‌న్ మాత్రం మ‌రో ముప్ప‌య్యేళ్లు అధికారంలో ఉండ‌గ‌ల‌మ‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.  శుక్రవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైసీసీ కార్య కర్తలతో ఆయన సమావేశమ య్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల్లో 95 శాతం నెరవేర్చినందునే  గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లగలుగతున్నామని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో చరిత్రను తిరగరాద్దామనీ పార్టీ వ‌ర్గాల‌ను ఉత్సాహ‌ప‌రుస్తున్నారు. కానీ, వాస్త‌వం అందుకు భిన్నంగా ఉంది. అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కూ ఇచ్చిన హామీలు, ప్ర‌ద‌ర్శించిన న‌మ్మ‌కాన్ని ఆ త‌ర్వాత అంతా నీరుగార్చారు. మొద‌ట ఆవేశ‌ప‌డిన వారంతా క్ర‌మేపీ అన్నీ తామే అనే భావ‌న‌లో ప‌డి అన్ని రంగాల్లోనూ విఫ‌ల‌మై మూడేళ్లు లాగించేశారు. ఇక మిగిలిన కాలంలో  ఎంత ప‌ట్టుద ల‌తో ప‌నిచేయాల‌నుకున్నా ఎన్ని మాట‌లు చెప్పినా ప్ర‌జ‌ల ముందు నిల‌వ‌లేని స్థితిలోకి ప్ర‌భుత్వం ప‌డి పోయింది. కేవ‌లం రాజ‌కీయాలు చేయ‌డానికి, ప్ర‌తిప‌క్షాన్ని, నాయ‌కుల‌ను అవ‌మానించ‌డం, వేధించ డం త‌ప్ప చేసిందేమీ లేద‌న్న‌ది ప్ర‌జ‌లు గ‌మ‌నించారు. ప్ర‌క‌టించిన ప‌థ‌కాల అమ‌లులో లోపాలు, జాప్యా ల‌తో చేయ‌ద‌గ్గ ప‌నులు కూడా చేయ‌లేక చ‌చ్చుబ‌డింది వైసీపీ స‌ర్కార్‌.  పరిస్థితులు చేజారి పోయాయ‌ని మంత్రివ‌ర్గంలో తీసుకున్న మార్పుల వ‌ల్లా పెద్ద‌గా ప్ర‌యోజ‌న‌మేమీ లేక‌పోయింది. ఇక కాలం ముగియ నుండ‌గా ఇపుడు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి త‌మ పాల‌న ఎలా ఉంది, మీరంతా బాగు న్నారా, అన్నీ అందుతున్నాయా, ప‌థ‌కాల ఫ‌లాలు అందుకుంటున్నారా వంటి ప్ర‌శ్నా ప‌త్రాల‌తో  అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తిరుగుతూన్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు అనే పేరుతో వీరంతా వెళ్లిన ప్ర‌తీ ప్రాంతంలోనూ ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తి, తీవ్ర నిర‌స‌నా వ్యక్తం చేస్తున్నారేగాని ఏ ఒక్క ప్రాంతం లోనూ మీ పాల‌న బాగుం ది, మ‌రింత కాలం ఉండాల‌ని ఏ ఒక్క‌రూ అన్న‌పాపాన పోలేదు. దీన్ని బ‌ట్టే ప్ర‌భుత్వం ఏ స్థాయికి ప‌డి పోయింద‌నేది అంచ‌నా వేయ‌వ‌చ్చు. ఇటీవ‌లి భారీ వ‌ర్షాలు, గోదావ‌రి వ‌ర‌దల ధాటికి దెబ్బ‌తిన్న ప్రాంతాల్లో వారికి చేయ‌వ‌ల‌సిన స‌హాయం ప్ర‌భుత్వం అంత‌గా చేయ‌లేద‌ న్నది స‌మాచారం. ప్ర‌భుత్వం క‌ల్పించు కుని చేసింది చాలా త‌క్కువ‌. ఇంత‌టి అవ‌మానాలు ఎదు ర్కొన‌లేక‌, సీఎంకి ఉన్న‌ప‌రిస్థితులు వివ‌రించి ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక ఎమ్మెల్యేలు, మంత్రులు నానా అవ‌స్థా ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఇప్ప‌టికీ త‌మ‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి మ‌ద్ద‌తు ఉంద‌ని అనుకోవ‌డ‌మే అమాయ‌క‌త్వం అని విశ్లేష‌కులు అంటున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల మ‌న‌సుపై వ్య‌తిరేక ముద్ర వేసింది త‌ప్ప వారి అభిమానాన్ని చూర‌గొన‌లేదు. ఇంత దారుణ‌మైన పాల‌న‌ను ఎన్న‌ డూ చూడ‌లేద‌న్న మాట ప్ర‌జ‌ల నుంచే విన‌ప‌డు తోంది. ఈ ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ఇప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వం మ‌రో ముప్ప‌యి యేళ్లు అధికారంలో ఉంటుంద‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దం. 

రేవంత్ కే కాంగ్రెస్ హై కమాండ్ మద్దతు.. కోమటి రెడ్డి ఎపిసోడ్ తో స్పష్టమైన సంకేతాలు!

తెలంగాణ కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కు లాగుతున్న సీనియర్లను వదిలించుకోవాలనుకుంటోందా? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఆయన అడుగులన్నీ ఆ దారిలోనే ఉన్నాయా? అందుకు పార్టీ హై కమాండ్ పూర్తిగా మద్దతు ఇస్తోందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే సమాధానం వస్తోంది. అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నిజమైన త్యాగం చేసినది కాంగ్రెస్ పార్టీయే అని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర విభజనకు సై అంటే ఏపీలో పార్టీ ఉనికి కూడా ఉండదన్న హెచ్చరికలను పెడచెవిన పెట్టి మరీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఐదేళ్ల ఆకాంక్షను నెరవేర్చారని ఇంత కాలం పార్టీ శ్రేణులు, నేతలూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఆ త్యాగానికి ఫలితం మాత్రం కాంగ్రెస్ కు దక్కలేదు. ఇందుకు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల వైఖరే కారణమని పార్టీ హై కమాండ్ భావిస్తోంది. పార్టీ శ్రేయస్సు కంటే సొంత ప్రయోజనాల పరిరక్షణే ముఖ్యంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లు వ్యవహరించిన తీరు కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారైందని అధిష్ఠానం భావిస్తున్నది. క్షేత్ర స్థాయిలో క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ వారికి సరైన దిశా నిర్దేశం చేయగలిగే స్థితిలో రాష్ట్ర నాయకత్వం లేదన్న నిర్ధారణకు వచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పంచన చేరినా రేవంత్ లోని ఫైర్ ను గుర్తించి ఆయనకు పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించింది. అది నచ్చని నేతలు ఎంత యాగీ చేసినా అధిష్థానం పట్టించుకోలేదు. అలిగిన కొందరు సీనియర్లు పార్టీ వీడేందుకు సిద్ధపడినా లెక్క చేయలేదు. అంతే కాకుండా రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ లో క్షేత్ర స్థాయి నుంచీ ఒక కొత్త జోష్ కనిపిస్తోందని హై కమాండ్ భావిస్తోంది. అందుకే కొమటి రెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా ప్రకటన చేసినప్పుడు బుజ్జగింపు ప్రయత్నాలు చేసినట్లు కనిపించినా సీరియస్ గా ఆయనను నిలువరించడానికి పార్టీ హై కమాండ్ ప్రయత్నించలేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. గత ఏడాది కాలంగా రాజగోపాల రెడ్డి పార్టీ వీడుతానంటూ సంకేతాలు ఇచ్చినా, ఆయనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నాలేవీ జరగలేదు. పార్టీ హై కమాండ్ సూచనల మేరకే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాకూర్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బెదరింపులను పట్టించుకోలేదనీ, కనీసం ఆయనను పిలిచి మాట్లాడేందుకు కూడా ప్రయత్నించలేదనీ అంటున్నాయి. ఇప్పుడు ఒక కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా అదే దారిలో ఉన్నా.. హై కమాండ్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని అంటున్నారు. ఆయన వ్యవహారం రాష్ట్రంలోనే తేల్చుకోవాలని రేవంత్ రెడ్డికి హై కమాండ్ స్పష్టమైన సూచనలు ఇచ్చిందని చెబుతున్నారు. రేవంత్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చి తద్వారా తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మంచి ఫలితాలు రాబట్టాలన్నదే అధిష్థానం యోచనగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ పార్టీ సీనియర్లకు ఇచ్చిన అవకాశాలను వారు వృధా చేసుకున్నారన్న భావన కూడా హైకమాండ్ లో ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నమాట. అందుకే రేవంత్ కు పగ్గాలు ఇచ్చిన తరువాత పార్టీలో కనిపిస్తున్న జోష్ పట్ల హై కమాండ్ సంతృప్తిగా ఉందనీ, రేవంత్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆయన పని ఆయన చేసుకుంటూ పోయే అవకాశం ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని హై కమాండ్ భావిస్తున్నదని చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి అందిన సూచనల మేరకే రేవంత్ పార్టీ సీనియర్లు తనపై చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. కోమటి రెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకి రాజీనామా చేసే వరకూ ఆయన తనపై చేసిన విమర్శలకు స్పందించకుండా సంయమనం పాటించిన రేవంత్ ఒక సారి రాజగోపాల్ రెడ్డి రాజీమానా చేయగానే ఆయన సొంత నియోజకవర్గంలోనే విమర్శలు గుప్పించారు. రాజగోపాలరెడ్డిని కాంగ్రెస్ ద్రోహిగా అభివర్ణించారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని చెప్పిన రాజగోపాలరెడ్డి మాటలను తీవ్రంగా ఖండించి అదే నీ ఉద్దేశమైతే రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫునుంచే పోటీ చేసి ఉండాల్సిందిగా అని నిలదీశారు. రేవంత్ కింద పని చేయాలా అన్న ప్రశ్నకు అమిత్ షా పక్కన నిలబడి ఫొటోలు దిగగలిగినప్పుడు నా పక్కన నిలుచోడానికి ఇబ్బందేమిటని నిలదీశారు? ఆ ప్రశ్న ద్వారా అటు కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డినే కాక ఇటు కోమటి రెడ్డి వెంకట రెడ్డిని కూడా ఇరుకున పెట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక రేవంత్ ముఖం చూడనని శపథం చేసిన సంగతి తెలిసిందే. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ తరువాత రేవంత్ స్పీడ్ పెంచారు. వెంకటరెడ్డికి ఏ మాత్రం సరిపడని చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకున్నారు. ఆయన పార్టీనీ కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. ఇక పార్టీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే కనీసం పార్టీ నుంచి ఎవరూ స్పందించలేదు. దీనిని బట్టే రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ కు ఎదురేలేని పరిస్థితి నెలకొందని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఇదంతా పార్టీ హై కమాండ్ కు తెలిసే జరుగుతోందనీ, మరింత మంది రేవంత్ ను వ్యతిరేకించి పార్టీ వీడినా హై కమాండ్ పట్టించుకునే పరిస్థితి లేదనీ, రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలన పూర్తిగా రేవంత్ కు కట్టబెట్టి హై కమాండ్ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురమ్మని ఆదేశించిందనీ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కోమటి రెడ్డి ఎపిసోడ్ తో పార్టీలో అందరికీ ఈ మేరకు సంకేతాలు అందినట్టేనని కూడా అంటున్నారు. 

పోటీలు పడి మరీ తెలుగుదేశాన్ని ప్రశంసిస్తున్న ఏపీ బీజేపీ నేతలు

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇంత వరకూ వైసీపీ, బీజేపీల మధ్య ఉన్న రహస్య మైత్రి విచ్ఛిన్నమయ్యిందన్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఏపీ సర్కార్ తప్పులను పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెల్లడించడంతో వైసీపీ నేతలలో అసహనం వ్యక్తమౌతోంది. దాంతో గత మూడేళ్లుగా బీజేపీ రాష్ట్రానికి చేసింది శూన్యమంటూ ఎదురు విమర్శలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇంత కాలం వైసీపీ విధానాలను పన్నెత్తి విమర్శించని రాష్ట్ర బీజేపీ ఇప్పుడు వైసీపీని ఏ మాత్రం స్పేర్ చేయడం లేదు. ఇంత కాలం వైసీపీ తప్పులన్నిటినీ సమర్ధిస్తూ వాటికి కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు తెలుగుదేశం పార్టీనే వేలెత్తి చూపేవారు. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతి విషయంలో బీజేపీ యూ టర్న్ తీసుకుంది. ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి అంటూ అమరావతి మద్దతుగా పాదయాత్ర కూడా చేపట్టింది. ఆ పాదయాత్రలో బీజేపీ నేతలు అనూహ్యంగా తెలుగుదేశంపైనా, ఆ పార్టీ అధినేతపైనా ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో అవకాశం ఉన్నా లేకపోయినా చంద్రబాబును విమర్శించడమే తన విధానం అన్నట్లుగా వ్యవహరించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తెలుగుదేశం అధినేతపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు దార్శనికుడని కితాబిచ్చారు. చంద్రబాబు దార్శనికుడు కనుకనే కేంద్రం రాజధానికి నిధులు ఇచ్చిందని వీర్రాజు అన్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని చంద్రబాబును, తెలుగుదేశంను పొగడ్తలలో ముంచెత్తడంతో వైసీపీ గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర నేతలపై విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ బీజేపీ కాదనీ ఏపీ బాబు జనతా పార్టీ అని ఎద్దేవా చేయడానికి ప్రయత్నిస్తోంది. మోడీ మాటెత్తడానికే ఇంత కాలం భయపడిన వైసీపీ నేతలు ఇప్పుడు నేరుగా మోడీపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. కేంద్రంలో మోడీ పాలన కంటే ఏపీలో జగన్ పాలన బేషుగ్గా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అయితే ఈ మార్పు బీజేపీ, వైసీపీల పరస్పర విమర్శలు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ( ఆగస్టు6) అజాదీ కా అమృత్ మహోత్సవ కమిటీ భేటీలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లిన చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి ఎంతగా సహకరించినా జగన్ తన పాలనా వైఫల్యంతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారనీ, ఇంకా ఆ పార్టీకీ, ప్రభుత్వానికి అండగా నిలుస్తే తమ ఉనికికే ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు తమ పార్టీ పెద్దలకు చెప్పడం వల్లనే బీజేపీ వైఖరిలో, అలాగే కేంద్రం వైఖరిలో వైసీపీ పట్ల మార్పు కనిపించిందని పరిశీలకలు అంటున్నారు. అదే సమయంలో తాము ఎంతగా ఒదిగి ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాలను కూడా పట్టించుకోకుండా కేంద్రం అడుగులకు మడుగులొత్తినా ఫలితం లేకపోయిందన్న భావన వైసీపీలో ఏర్పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య అగాధం నెమ్మదిగా పూడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు పొత్తులు, మిత్రులూ అంటూ కలగలసిపోకపోయినా.. ఇరు పార్టీల మధ్యా గతానికి భిన్నంగా సత్సంబంధాలు ఉంటాయన్న అభిప్రాయం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఇప్పటికే బీజేపీ, జనసేనలు మిత్రలు. గతంలో ఒక సారి పవన్ కల్యాణ్ రాష్ట్రంలో మరోసారి వైసీపీ గెలవకుండా చూసేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పిన సంగతిని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్న పరిశీలకులు.. ఆయన ఆ దిశగా చేసిన ప్రయత్నాలు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్న సంకేతాలు కనిపించడానికి కారణమై ఉండొచ్చునని అంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో అన్ని రాజకీయ శక్తులూ వైసీపీ దుష్ట పాలనకు వ్యతిరేకంగా ఐక్యమౌతున్న సంకేతాలైతే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయంటున్నారు.  

హుటాహుటిన హస్తినకు బండి.. కారణమేమిటంటే..?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ప్రజా సంగ్రామయాత్రలో ఉన్న ఆయన అకస్మాత్తుగా పాదయాత్రకు విరామం ప్రకటించి మరీ హస్తినకేగడానికి గల కారణమేమిటనే విషయంలో ఒకింత సందిగ్ధత ఏర్పడినా ఆయన ఉప రాష్ట్రపతి ఎన్నికలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఢిల్లీకి బయలుదేరారని పార్టీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. ఢిల్లీ  పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారు. తన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా మునుగోడులు ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు బండి సంజయ్ పార్టీ జాతీయ అధ్యక్షడు నడ్డా, హోంమంత్రి అమిత్ షాలను ఆహ్వినించే అవకాశం ఉంది. ఈ నెల 21న బండి సంజయ్ తన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగించనున్నారు. ఆ సందర్భంగా మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీకీ, మునుగోడు శాసన సభ సభ్యత్వానికి కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ముగుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. కమలంగూటికి చేరి మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, మునుగోడులో పార్టీ విజయావకాశాలపై బండి సంజయ్ నడ్డా, అమిత్ షాలకు వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మరి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలకు అవకాశం ఉదనే అంచనాల నేపథ్యంలో బండి సంజయ్ హస్తిన యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. 

మ‌మ‌త‌, మోడీ స‌మావేశం.. సంగ‌తేమిటో?

మమతా బెనర్జీ గత సంవత్సరం బిజెపితో గొడవ కారణంగా దాటవేసిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీని కూడా కలుస్తారు. గతంలో వారి మ‌ధ్య అంత సఖ్య‌త లేదు, కానీ ఇప్పుడు ఆమెలో  ఈ మార్పు దేనికో? అనే ప్ర‌శ్న అంద‌రిలోనూ త‌లెత్తుతుంది.  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చినప్పుడల్లా, ఆమె దృష్టి సాధార ణంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి వ్యతిరేక శక్తులను ప్రేరేపించడం, 2024లో భారతదేశం ఓటు వేసినప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యా మ్నాయంగా తనను తాను ప్రదర్శించుకోవడం పైనే ఉంటుంది. గురువారం, టిఎంసీ బాస్ నాలుగు రోజుల పర్యటన కోసం దేశ రాజధానికి వచ్చారు, ఊహించినట్లుగానే, పార్లమెంట్ ప్రస్తుత స‌మావేశాలు, 2024 లోక్‌సభ ఎన్ని కల కోసం ఆమె పార్టీ వ్యూహాన్ని చర్చించడానికి ఆమె పార్టీ ఎంపీలను కలిశారు. అలాగే, ఆమె ప‌లు ప్రతి పక్ష పార్టీల నేతలను క‌లిశారు. అలాగే, శుక్రవారం, సీఎం బెనర్జీ మర్యాదపూర్వక భేటీలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశ మయ్యారు. ఒక వంక నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేడిని ఎదుర్కొంటున్న తమ అధి నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంటే, మ‌రో వంక‌  రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రధాని మోడీని కలిసేరు. అలాగే, ద్రవ్యోల్బణం, ప్రత్యర్థి పార్టీలకు వ్యతి రేకంగా కేంద్ర ఏజెన్సీ లను దుర్వినియోగం చేయడం వంటి సమస్యలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతు న్నాయి. దీంతో పార్లమెంటు ప్రస్తుత సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. మోడీ-మమత ముఖా ముఖి  సమావేశం అయితే, అది జరిగితే, బెనర్జీ ఇటీవలి కాలంలో ప్రధానిపై ఆమె దాడులను పెంచారు, ఆయనను అభద్రత, పదవి నుండి తొలగించాల్సిన వ్యక్తి అని పిలిచారు. ఇద్దరు నాయకులు ముఖా ముఖిగా వచ్చిన అనేక సందర్భాలు ఫెడరలిజం, ఇతర సమస్యలపై వివాదాన్ని రేకెత్తించాయి. జనవరి 2021లో, కోల్‌కతాలో జరిగిన నేతాజీ జన్మదినో త్సవ కార్యక్రమంలో సీఎం బెనర్జీ , పీఎం మోడీ వేదికను పంచుకున్నారు, అయితే జై శ్రీరామ్ నినాదాలు లేవనెత్తిన తర్వాత ఆమె మాట్లాడటానికి నిరాకరించారు. మార్చి 2021లో, మ‌మ‌త‌ ఢిల్లీ లో ప్ర‌ధాని మోడీని కలుసుకున్నారు, సరిహద్దు రాష్ట్రాల్లో బిఎస్ ఎఫ్‌ విస్తర ణపై అభ్యంతరం వ్యక్తం చేశారు, సమాఖ్య నిర్మాణానికి భంగం కలిగించవద్దని కోరారు. మే 2021లో, పశ్చిమ బెంగాల్‌లో తుఫాను ప్రభావాన్ని అంచనా వేయడానికి పిలిచిన సమావేశానికి పీఎం మోడీ 30 నిమిషాలు వేచి ఉండేలా చేసినందుకు సిఎం బెనర్జీపై పలువురు కేంద్ర మంత్రులు ట్విట్టర్‌లో దాడి చేశారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీని సీఎం, ప్రధాన కార్యదర్శి కూడా స్వీకరించలేదు. గతంలో కూడా, నిశ్చితార్థాలను ఉటంకిస్తూ కోల్‌కతా విమానాశ్రయంలో సిఎం ప్రధానిని స్వీకరించలేదు. డిసెంబర్ లో, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో జరిపిన వర్చువల్ మీటింగ్‌లో తాను మాట్లాడేందుకు అనుమతిం చలేదని పశ్చిమ బెంగాల్ సీఎం ఆరోపించారు. అనంతరం కేంద్రంతో సమావేశాన్ని ఆమె బహిష్కరించా రు. 2022 ఏప్రిల్ లో, సిఎం బెనర్జీ తన టైట్ షెడ్యూల్ కారణంగా ప్రధాని మోడీతో ప్రతిపాదించిన సమావే శాన్ని పిఎంఓ తిరస్కరించిందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ప్రధానమంత్రి మోడీ, సిఎం బెనర్జీ మధ్య ఒకరితో ఒకరు సమావేశం జరగకపోయినా, ఆగస్టు 7 న ఆయన అధ్యక్షతన జరిగే నీతి ఆయో గ్ సమావేశంలో ఆమె అతనిని కలవవలసి ఉంది. ముఖ్యంగా, బీజేపీతో రాజ కీయ వైరం కారణంగా ఆమె గతేడాది నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉన్నారు.  జనవరి 2021లో, కోల్‌కతాలో జరిగిన నేతాజీ జన్మదినోత్సవ కార్యక్రమంలో సీఎం బెనర్జీ , పీఎం మోడీ వేదికను పంచుకున్నారు, అయితే జై శ్రీ రామ్ నినాదాలు లేవనెత్తిన తర్వాత ఆమె మాట్లాడటానికి నిరా కరించారు. మార్చి 2021లో, బెనర్జీ ఢిల్లీలో మోడీని కలిసి స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో బిఎస్ ఎఫ్‌ విస్తరణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మే 2021లో, పశ్చిమ బెంగాల్‌లో యాస్ తుఫాను ప్రభావాన్ని అంచనా వేయడానికి పిలిచిన సమావేశానికి  పీఎం మోడీ 30 నిమిషాలు వేచి ఉండేలా చేసినందుకు  సిఎం బెనర్జీపై పలువురు కేంద్ర మంత్రులు ట్విట్టర్‌లో దాడి చేశారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీని సీఎం, ప్రధాన కార్యదర్శి కూడా స్వీకరించలేదు. గతంలో కూడా, నిశ్చితార్థాలను ఉటంకిస్తూ కోల్‌కతా విమానా శ్రయంలో సిఎం ప్రధానిని స్వీకరించలేదు. డిసెంబర్ 2021లో, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో జరిపిన వర్చువల్ మీటింగ్‌లో తనను మాట్లాడేందుకు అనుమతించలేదని పశ్చిమ బెంగాల్ సీఎం ఆరోపించారు. అనంతరం కేంద్రం తో సమావేశాన్ని ఆమె బహిష్కరించారు.  2022 ఏప్రిల్‌లో, సిఎం బెనర్జీ తన టైట్ షెడ్యూల్ కారణంగా ప్రధాని మోడీతో ప్రతిపాదించిన సమావేశాన్ని పిఎంఓ తిరస్కరిం చిందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ప్రధానమంత్రి మోడీ, సిఎం బెనర్జీ మధ్య ఒకరితో ఒకరు సమావేశం జరగకపోయినా, ఆగస్టు 7 న ఆయన అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆమె అతనిని కలవవలసి ఉంది. ముఖ్యంగా, బీజేపీతో రాజకీయ వైరం కారణంగా ఆమె గతేడాది నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉన్నారు. రాబోయే సమా వేశాలకు కారణాలు ఈ విధంగా ఉండవచ్చు. బెంగాల్‌లోని పాఠశాల ఉద్యోగాల కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో అప్పటి మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన తర్వాత ఆమె పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంక్షోభంతో పోరాడుతున్నప్పుడు సిఎం బెనర్జీ ఢిల్లీలో ఉన్నారు. ఆమె అతనిని మరియు ఆమె విద్యా మంత్రి పరేష్ అధికారిని కూడా తొలగించింది. కానీ కేంద్ర సంస్థల చర్యలు రాష్ట్రా నికి, కేంద్రానికి మధ్య హాట్ బటన్ సమస్యగా మిగిలిపోయాయి. ప్రధానమంత్రి మోడీతో ఆమె మునుపటి సమావేశాలలో, సిఎం బెనర్జీ పశ్చిమ బెంగాల్ టిఎంసి నాయ కులకు వ్యతిరేకంగా ఈడీ, సిబిఐ  వంటి కేంద్ర సంస్థల దుర్వినియోగం అంశాన్ని లేవనెత్తారు. ఇదిలా ఉండ‌గా, గత నెలలో, నటుడు, బిజెపి నాయకుడు మిథున్ చక్రవర్తి 38 టీఎంసీ నాయకులు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. సిఎం బెనర్జీ పార్టీలో ఎటువంటి అసమ్మతిని ఖండించి నప్పటికీ, ఆమె క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు వెళ్ళ వలసి వచ్చింది, మాజీ బిజెపి నాయకుడు బాబుల్ సుప్రియోను మంత్రిని చేసింది, అయితే ఆమె కష్టాలు ముగియలేదని ఆంత‌రంగిక వ‌ర్గాలు  చెబుతు న్నాయి, ఇది అవగాహన గురించి చర్చకు దారితీసింది. ప్రస్తుత ఊహాగానాలకు కొంత సందర్భం ఏమి టంటే, మహా రాష్ట్ర (శివసేన విడిపోయి, బిజెపి ప్రతిపక్ష స్థానాలను విడిచిపెట్టి రాష్ట్ర ప్రభుత్వంలో చేరడం) తర్వాత, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వంతు వచ్చింది అని బిజెపి నాయకుడు సువేందు అధికారి ఇటీవల వ్యాఖ్యా నించారు.  ఈ అంశాలు చర్చకు వస్తాయా లేదా ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిరిందా లేదా అనే దానిపై అధికారిక సమాచారం లేనప్ప టికీ,  ట్విట్టర్ అటువంటి చర్చలతో రగిలిపోయింది. శుక్రవారం, బిజెపి సిద్ధాంతకర్త , మాజీ గవర్నర్ తథాగత రాయ్ పిఎం మోడీని అతని కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు, కోల్‌కతా ఒక సెట్టింగ్  గురించి భయపడుతోంది, అంటే మోడీజీ, మమత మధ్య రహస్య అవగాహన, దీని ద్వారా తృణమూల్, లేదా దొంగలు భాజపా కార్యకర్తలను హతమార్చిన వారికి స్కాట్‌ లేకుండా పోతుంది. అటు వంటి సెట్టింగ్  ఉండ‌దని దయచేసి మమ్మల్ని ఒప్పించండి. తథాగత రాయ్ 2021లో పశ్చిమ బెంగాల్‌లో ఎన్ని కల అనంతర హింసను ప్రస్తావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్ కూడా సిఎం బెనర్జీ పిఎం మోడీతో తన సమావేశాలను ఒక సెట్టింగ్ తయారు చేయబడింది అనే సందేశాన్ని పంపుతున్నారని ఆరోపించారు. కేంద్రం ఈ విషయాన్ని గుర్తించాలని, దాని జోలికి పోవద్దని అన్నారు.

ఎవరేమనుకుంటే నాకేం.. ఇదే జగన్ పర్కార్ తీరు

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న ధోరణిలో వైసీసీ సర్కార్ వ్యవహరిస్తున్నది. పార్టీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కిమ్మనకుండా, ఆరోపణలకు గురైన వారిపై చర్యలు తీసుకోకుండా వైసీపీ సర్కార్ ప్రజలకు ఏం చెబుదామనుకుంటోంది. గోరంట్ల మాధవ్ వ్యవహారమే తీసుకుంటే.. ఆయన దిక్కుమాలిన చర్య వల్ల పార్టీ పరువే కాదు.. రాష్ట్రం పరువు, పార్లమెంటు పరువూ కూడా గంగలో కలిసిపోయింది. చర్యలు తీసుకుని కొంతలో కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్న ఇంగితం కూడా వైసీపీలో కనిపించడం లేదు. ఆయన న్యూడ్ కాల్ వ్యవహారం వెలుగులోనికి వచ్చిన రోజు మాత్రం కఠిన చర్యలు అంటూ మీడియా ముందుకు వచ్చిన మాట్లాడిన సజ్జల ఆ తరువాత నోరెత్తడం మానేశారు. పార్టీ అధినేత, సీఎం జగన్ సరేసరి, ఆయన తరఫున ప్రభుత్వ సలహాదారు సజ్జల జగన్ చాలా సీరియస్ ఉన్నారన్న ఓ మాట చెప్పేసి ఊరుకున్నారు. అంతే గోరంట్ల మాధవ్ విషయాన్ని ఆ పార్టీ నేతలెవరూ ప్రస్తావించడానికే ఇష్టపడటం లేదు. ఇది వ్యూహాత్మకమేననీ, జనం ఈ విషయాన్ని మర్చిపోయేవరకూ మిన్నకుండటమే మేలని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని ఈ వైఖరితో తేలిపోయింది. ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరౌతున్నారు. పార్టీ పరంగా జరిగే సమావేశాలలోనూ పాల్గొంటున్నారు.   అంత అసహ్యంగా వీడియోలో బుక్కైన గోరంట్ల మాధవ్ పై రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు చెందిన వారూ విమర్శలు గుప్పిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా వైసీపీ పట్టించుకోవడం లేదు. కనీసం పార్టీలో ఉన్న మహిళా నేతలకు కూడా మాట్లాడటం లేదు. ఇప్పుడు వైసీపీ దృష్టి అంతా మాధవ్ వ్యవహారం నుంచి ప్రజలు, మీడియా దృష్టిని మరల్చడమెలా అన్న దానిపైనే ఉందని పరిశీలకులు అంటున్నారు. గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లపై ఇటువంటి ఆరోపణలకు వచ్చినప్పుడు కూడా వైసీపీ ఇదే వ్యూహాన్ని అనుసరించిందని గుర్తు చేస్తున్నారు.   అంబటి, అవంతి విషయంలో అయినా ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయంలో అయినా ప్రజలు ఏదో అనుకుంటారని .. వైసీపీ హైకమాండ్ ఎప్పుడూ ఆలోచించలేదు.  ఇప్పుడు హిందూపురం ఎంపీ విషయంలోనే వైసీపీ అదే పంధాను అనుసరిస్తున్నది.  జనం ఏమనుకుంటారు, పార్టీ పరువు ఏమౌతుంది అన్న ఆలోచనే వైసీపీ దరికి చేరనీయదనీ, అధికారంలో ఉన్నాం కనుక ఏం చేసినా చెల్లిపోతుంది, ఎవరైనా నిలదీస్తే చేతిలో పోలీసులు ఉన్నారు.. కేసులు పెట్టి వేధించేయవచ్చన్నదే వైసీపీ ఆలోచనాధోరణిగా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన చిత్తూరు జిల్లా విద్యార్థిపై కేసు నమోదు చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.   

వైసీపీ సర్కార్ అసహనానికి పరాకాష్ట.. చంద్రబాబు

రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలపైనా కేసులు నమోదు చేసే స్థాయికి జగన్ ప్రభుత్వ అసహనం చేరుకుందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు బనాయిస్తూ వైసీపీ జనం నోళ్లు నొక్కాలని ప్రయత్నిస్తోందని మండి పడ్డారు. చిత్తూరు జిల్లా వేపనపల్లిలో ఎమ్మెల్యేను నిలదీసిన విద్యార్థిపై కేసు బనాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థిపై కేసు నమోదు చేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. విద్యార్థి జస్వంత్, అతడికి మద్దతుగా నిలిచిన వారిపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. పోలీసుల తీరు దారుణంగా ఉందని,  వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. డీజీపీ ఈ  వ్యవహారంపై దృష్టి సారించాలన్నారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక జగన్ సర్కార్ తీవ్ర అసహనానికి గురౌతోందని, ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్ సర్కార్ ఇక విద్యార్థుల జీవితాలను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం వైసీపీ సర్కార్ తీరును విమర్శిస్తోందనీ చంద్రబాబు అన్నారు.   వైసీపీ ఎమ్మెల్యేలను, నాయకులను ప్ర‌జ‌లు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారనీ, ఇలా నిలదీస్తున్న వారందరిపైనా కేసులు పెట్టుకుంటూ పోతే రాష్ట్రంలోని ఐదు కోట్ల మందిపైనా కేసులు నమోదు చేయాలని, వారందరినీ అరెస్టు చేయాలంటే రాష్ట్రంలోని జైళ్లు చాలవని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రశ్నించిన వారిని కేసులతో వేధించడం మాని.. పాలనపై దృష్టి సారించాలనీ, సమస్యల పరిష్కారినికి ముందుకు రావాలని చంద్రబాబు జగన్ సర్కార్ కు హితవు చెప్పారు.

మరో మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే భారీ వర్షాలతో తడిసి ముద్దైన తెలంగాణను మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 9 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కుండపోత వర్షాలు, మరి కొన్ని జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామా బాద్, ఖమ్మం, సూర్యాపేట, పెద్దపల్లి, ఉమ్మడి వరంగ్ జిల్లలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.   అలాగే  అటు ఆదిలాబాద్‌, కొమురం భీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, సిద్ధిపేట, జనగాం, వికారాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు  ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది 

భారత రెజ్లర్ల పసిడి పతకాల పంట.. ఒకే రోజు మూడు స్వర్ణాలు

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత రెజ్లర్లు సత్తా చాటారు ఒకే రోజు మూడు స్వర్ణాలను ఒడిసి పట్టారు. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత రెజ్లర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, దీపక్ పూనియాలు స్వర్ణ పతకాలు సాధించారు. దీంతో ఒకే రోజు మూడు స్వర్ణాలు భారత్ ఖాతాలోకి చేరాయి. దీంతో ఇప్పటి వరకూ ఈ కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ స్వర్ణాల సంఖ్య 9కి చేరింది. మొత్తం పతకాల సంఖ్య పాతికకు చేరంది. ముందుగా భజరంగ్ పూనియా,తర్వాత సాక్షి మాలిక్ ఆ తర్వాత దీపక్ పునియా పసిడి పట్టు పట్టారు. ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 86కేజీల విభాగంలో పాకిస్తాన్ ఆటగాడు ఇనామ్ పై ఫైనల్లో 3-0 తేడాతో గెలుపొంది స్వర్ణం సాధించాడు దీపక్ పునియా.    రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మాలిక్  62 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో కెనడాకు చెందిన అనా గొడినెజ్‌పై  విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక భజరంగ్ పూనియా 65 కేసీల విభాగంలో కేనడాకు చెందిన లాచలాన్ మెకనీల్ ను ఓడించి కనక పతకాన్ని దక్కించుకున్నాడు. స్వర్ణాలు సాధించిన ముగ్గురు భారత రెజ్లర్లనూ ప్రధాని మోడీ అభినందించారు. భారత కీర్తి పతాకను రెపరెపలాడించారంటూ ట్వీట్ చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డిఫెన్స్ లో పడేసిన రేవంత్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తనపై ఏక కాలంలో విమర్శల దాడి చేయడాన్ని రేవంత్ తిప్పికొట్టిన తీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డినిక డిఫెన్స్ లో పడేసింది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామాకు ఆయన ఒక్కో సారి ఒక్కో కారణం చెప్పినా చివరకు తేల్చిందేమిటంటే మొదటి నుంచీ కాంగ్రెస్ లో ఉన్న తమను కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వక్తికి పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టడమేమిటి? ఆ వ్యక్తి ఆదేశాల మేరకు మేం పని చేయడమిటన్న దుగ్ధే కారణమని. అదే రాజగోపాలరెడ్డి పార్టీ మారడానికి కారణమని రాజగోపాలరెడ్డి తేల్చేశారు. తన తమ్ముడు పార్టీ మారడంతో తనకు సంబంధం లేదని ఒక వైపు చెబుతూనే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు కారణం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలాగే వెంకటరెడ్డి కూడా రేవంత్ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం. రేవంత్ వైఖరి, వ్యవహార శైలి వల్లే తాను పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పుకోవడానికి అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే రాజగోపాలరెడ్డిపై రేవంత్ విమర్శలను తనకు ఆపాదించుకుని వెంటకరెడ్డి తన విమర్శలకు పదును పెట్టారని చెబుతున్నారు. మరో వైపు వెంకటరెడ్డి తమతో టచ్ లో ఉన్నట్లు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ప్రకటించినా దానిని ఖండించకుడా వెంకటరెడ్డి రేవంత్ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం, వరద నష్టం పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ఇవన్నీ వెంకటరెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునే దిశగా అడుగుతు వేస్తున్నారనడానికి సంకేతాలేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి స్పందన వ్యూహాత్మకంగా ఉందని చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తాను ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదనీ, తన విమర్శల దాడి అంతా పార్టీ మారిన కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డిపైనేనని రేవంత్ రెడ్డి విస్పష్టంగా చెప్పారు. పైగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వేరు.. వెంకటరెడ్డి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుడని చెప్పన రేవంత్ రెడ్డి రాజగోపాల రెడ్డిని మాత్రం కాంగ్రెస్ ద్రోహి అని పునరుద్ఘాటించడం ద్వారా వెంకటరెడ్డికి చెక్ పెట్టారు.రేవంత్ వివరణతో ఇక వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిపై విమర్శల దాడి చేసినా అవి బూమరాంగ్ అయ్యే పరిస్ధితి కల్పించారు. రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి.. తాను పార్టీకి దూరం కావడానికి ఆయనేనని చూపాలన్న వెంకటరెడ్డికి ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే కాంగ్రెస్ లో క్షేత్ర స్థాయిలో పార్టీ సీనియర్ల తీరు పట్ల ఒకింత అసంతృప్తి ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తరువాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోందనీ, తెరాసకు దీటుగా కాంగ్రెస్ నిలబడుతోందని క్షేత్ర స్థాయిలో బలపడిందని శ్రేణులు నమ్ముతున్నారు.   ఈ పరిస్థితుల్లో రేవంత్ విస్పష్ట వివరణ తరువాత కూడా కోమటి రెడ్డి తన విమర్శల దాడి కొనసాగిస్తే కార్యకర్తల దృష్టిలో పలుచన అయ్యే పరిస్థితి ఉంది.  మొత్తం మీద కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి పార్టీని వీడినా అందుకు కారణం రేవంత్ అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ ఆయన అలా చెప్పినా ఎవరూ నమ్మే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.

తెలంగాణా స్వాధీన దిశ‌గా బిజెపి

తెలంగాణాలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఎలాగ‌యినా గ‌ద్దె దించేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో బీజేపీ వ్యూహాలు ర‌చిస్తోంది. బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, వీరాభిమానులు ఎవ్వ‌రూ కుదురుగా లేరు. అంద‌రూ టీఆర్ ఎస్ ప‌నిప‌ట్టేందుకే త‌ల‌మున‌క‌లై ఉన్నారు. ఇది 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల త‌ర్వాత  మ‌రింత పెరిగింద‌నాలి. బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలో వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ, ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మై వారిని పార్టీ వైపు తిరిగేలా చేయ‌డంలో ముందుకు సాగుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు అయ్యేదాకా కాస్తంత నెమ్మ‌దిగా ఉన్న క‌మ‌ల‌నాథులు ఆ ఫ‌లితాల‌తో దూకుడు పెంచారు. అస‌లు తెలంగాణాలో టీఆర్ ఎస్‌కు ట‌గ్గాఫ‌ర్‌గా ఉన్న‌ది గ‌ట్టి పోటీనివ్వ‌గ‌లిగిన పార్టీ త‌మ‌దేన‌ని బీజేపీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. విశేష‌మేమంటే, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైన‌  బీజేపీ ఇపుడు గ్రామీణ ప్రాంతాల‌పైనా దృష్టి సారించ‌డం. బీజేపీ అంటేనే ధ‌నికులు, ప‌ట్ట‌ణ‌వాసుల‌ను ఆక‌ట్టుకునే పార్టీ అంటూ టీఆర్ ఎస్ చేసిన కామెంట్ల‌కు విరుద్దంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని విస్త‌రించాల‌న్న ల‌క్ష్యంతో బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప‌నిచేస్తున్నారు.  సంజయ్ పాదయాత్ర చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో  ప్రభుత్వ వ్యతిరేక వర్గం బీజేపీ వైపు చూసింది. ఫలితంగా కొన్నిచోట్ల ప్రజలు సంజయ్ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ప్రజల స్పందన, సంజయ్ పాదయాత్రతో జోష్ మీదున్న బీజేపీ క్యాడర్  అమిత్ షా ఎంట్రీతో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తెలంగాణాలో పాగా వేయాల‌న్న ల‌క్ష్యంతో టార్గెట్ తెలంగాణా కార్య‌క్ర‌మం ఆరంభ‌మ‌య్యాక‌, బండి సంజ‌య్‌, తెలంగాణా బీజేపీ నాయ‌కుల‌కు కేంద్రం మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ప్ర‌జాసంగ్రామ యాత్ర రెండో విడ‌త ముగింపు స‌భ‌కు అమిత్ షా రావ‌డం ఇక్క‌డి పార్టీ వ‌ర్గాల్లో ఉత్సాహాన్ని రెండింత‌లు చేసింది. అంతేగాక ఖ‌మ్మంలో బీజేపీ కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య‌కీ కేంద్ర బీజేపీ నాయ‌క‌త్వం స్పందించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఏదో విధంగా ఇక్క‌డి నాయ‌కుల‌తో కేంద్రం ట‌చ్‌లో ఉండ‌డం ప్ర‌జ‌ల‌కు పార్టీ ప‌ట్టుద‌ల‌ను, తెలంగాణా ప‌ట్ల అభిమానాన్ని తెలియ‌జేసిన‌ట్ల‌వుతోంది. ఈ విధంగా ప‌టిష్ట ప్లాన్‌తో తెలంగాణా ప్ర‌జ‌ల‌కు బీజేపీ ప‌ట్ల  న‌మ్మ‌కం క‌లిగేలా చేయ‌డంలో స‌ఫ‌ల‌మ‌వుతున్నారు.  ఇటీవల భాగ్యనగరంలో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావే శాలతోనూ రాష్ట్ర బీజేపీకి తాము అండగా ఉన్నామని మోదీ, అమిత్ షా   సంకేతం ఇచ్చారు. ప్ర‌స్తుతం తెలంగాణాలో మునుగోడు రాజ‌కీయ ప‌రిణామాల‌కు కేంద్ర బిందువ‌యింది. కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ పార్టీలు ఎలాగ‌యినా మునుగోడును కైవ‌సం చేసుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో పావులు క‌దుపుతున్నాయి. ఇక్క‌డ ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కులు, కాంగ్రెస్ సీనియ‌ర్లు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, ఆయ‌న సోద‌రుడు రాజ‌గోపాల్ రెడ్డి రాజ‌కీయాల‌ను బాగా వేడెక్కించారు. త‌మ్ముడు ఇప్ప‌టికే పార్టీకి గుడ్ బై చెప్పి అతి త్వ‌ర‌లో బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అన్న‌గారూ దాదాపు అదే బాట వేపు మొగ్గు చూపుతున్నార‌న్న వార్త‌లే విన‌ప‌డుతున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప‌ట్ల వెంక‌ట రెడ్డి కినుక వ‌హించారు. రేవంత్ తీరు ఆయ‌న‌కు బొత్తిగా గిట్ట‌డం లేదు. మీడియాతో మాట్లాడుతూ అస‌లాయ‌న్న చూడ‌నైనా చూడ‌ద‌ల్చుకోలేద‌ని అన్నారు. మ‌రోవంక టీఆర్ ఎస్ మునుగోడును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని కాంగ్రెస్‌లో పోరుతో మారు తున్న ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలం చేసుకోవాల‌ని వ్యూహ‌ర‌చ‌న చేస్తోంది. ఇదిలా ఉండ‌గా 21వ తేదీన కేంద్ర హోం మంత్రి  అమిత్ షా తెలంగాణా ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న ఈ ప‌ర్య‌ట‌న వెనుక మునుగోడు చిత్రానికి ఒక ముగింపు ఇవ్వాల‌ని నిర్ధారణ‌కు వ‌చ్చి ఉండ‌వ‌చ్చ‌ని విశ్లేష‌కుల మాట‌.  ఈ కార‌ణంగా  రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఎక్కడా తగ్గకుండా.. టీఆర్ఎస్ పార్టీపై దూకుడు పెంచుతున్నారు. కేంద్ర నాయకత్వ తమకు అండగా ఉంద‌న్న ధీమాతో బీజేపీలో చేరాలని ప్ర‌జ‌ల‌కు సంకేతాలు ఇస్తున్నారు. ప్రజలకు, నేతలకు నమ్మకం కలిగించే బీజేపీ వ్యూహాన్ని ఊహించిన‌దానికంటే ఎక్కువ‌గానే  ఇక్క‌డి బీజేపీ నాయ‌కులు అమ‌లుచేస్తున్నారు.