అందరి వాడు వెంకయ్య..వీడ్కోలు సభలో మోడీ ప్రశంసలు

భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తిగా, రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా వెంక‌య్య‌నాయుడు ఎంతో స‌మర్ధ‌వంతంగా ప‌నిచేశార‌ని, పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భలూ అల్ల‌ర్లూ, గోల‌తో స‌భా కార్య‌క్ర‌మాలు నిలిచిపోవ‌డ‌మ‌న్న‌ది ప‌రిమితి మించితే అది స‌భా ఉల్లంఘన అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డార‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కు సోమ‌వారం వీడ్కోలు స‌భ‌లో ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఆయన వెంకయ్యను అందరివాడుగా అభివర్ణించారు. వెంక‌య్య‌నాయుడు త‌న హాస్య‌చ‌తుర‌త‌తో కూడిన ప్ర‌సంగాల‌తో అయిదేళ్ల ప‌ద‌వీ కాలంలో అంద‌రి హృద యాలూ గెలుచుకున్నార‌ని ప్ర‌ధాని ప్ర‌శంసించారు.  ఉప‌రాష్ట్ర‌ప‌తిగా  వెంక‌య్య‌నాయుడు ఐదేళ్ల‌ ప‌ద‌వీ కాలం ఈ నెల ప‌దో తేదీతో ముగియ‌నున్న‌ సంగతి విదితమే. ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంటులో సోమ‌వారం జరిగిన వీడ్కోలు సమావేశంలో  ప్ర‌ధాని మాట్లాడారు. ఆయ‌న రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా ఉన్న‌కాలంలో స‌భా కాలం  70 శాతం మించి నిరాటంకంగా సాగిందని ప్ర‌ధాని అన్నారు   ఆయన స‌భ‌ను  నిర్వహించిన ప‌ద్ధ‌తి, స‌భ్యుల ప‌ట్ల ప్ర‌ద‌ర్శిం చిన మ‌ర్యాద‌, ఆయ‌న అన్ని ప‌క్షాల నుంచి పొందిన గౌర‌వ‌మ‌ర్యాద‌లు మున్ముందు స‌భ‌ను నిర్వ‌హించే వారికి ఎంతో ఆద‌ర్శ‌ప్రాయంగా నిలుస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ ప్ర‌శంసించారు . ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించాలి, విప‌క్షాల విభేదించాలి, స‌భలో భారీ చ‌ర్చ‌లు జ‌ర‌గాలి ఈ సంప్ర‌దాయం కొన‌సాగాల‌ని రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా వెంకయ్య  ఆశించార‌న్నారు. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న‌కు భార‌తీయ భాష‌ల ప‌ట్ల ఉన్న మ‌క్కువ అన‌న్య సామాన్య‌మ‌న్నారు. స‌భ చైర్మ‌న్‌గా స‌భ‌లో చ‌ర్చ‌లు మాతృభాష‌లోనూ జ‌రిగేందుకు ఆయ‌న స‌భ్యుల‌ను ప్రోత్సహించడం కడు ప్రశంసనీయమని  మోదీ అన్నారు.

ప్ర‌ధాని ఆటోగ్రాఫ్ కోరుకున్న నిఖ‌త్‌

స్కూల్లోప్రొగ్రెస్ రిపోర్టు మీద నాన్న సంత‌కం ఇష్టం, పెద్ద‌య్యాక అధికారుల మెప్పు మ‌హాయిష్టం, పెద్ద పెద్ద పోటీల్లో గెలిచే క్రీడాకారుల‌కు ప‌త‌కాలంటే మ‌రీ యిష్టం, రాజ‌కీయ‌నాయ‌కుల‌కు సీఎం అంటే తెగ‌ని ప్రేమ‌. కానీ క్రీడాకారుల‌ను అభిమానించి, ఆద‌రించ‌డ‌మే కాకుండా, వారి ఓట‌మిలోనూ వారికి మ‌నోధైర్యం పెంచెలా ప్ర‌శంసించిన ప్ర‌ధాని మోడీ అంటే సూప‌ర్‌స్టార్ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌కు వీరాభిమానం మెండు. అందుకే ఆయ‌న ఆటోగ్రాఫ్ త‌ప్ప‌కండా తీసుకుంటాన‌ని నిఖ‌త్ అన్న‌ది.  అంత‌ర్జాతీయ పోటీల్లో మామూలుగా గెల‌వ‌డ‌మే క‌ష్టం. అలాంటిది ప‌త‌కం సాధించ‌డం మ‌రీ గొప్ప విష యం. అందులోనూ స్వ‌ర్ణ ప‌త‌కం సాధించ‌డమ‌నేది మ‌హాద్భుతం. అంత‌ర్జాతీయ పోటీల్లో పాల్గొనే  ఏ క్రీడాకారుల‌క‌యినా దేశ ప్ర‌జ‌లంతా మ‌ద్ద‌తునిస్తున్నార‌న్న భావ‌నే స‌గం బ‌లాన్నిస్తుంది. వారి శిక్ష‌ణ‌, అస లు పోటీ స‌మ‌యంలో మ‌నోధైర్యం, గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల అనేవి నిజానికి సెకండ‌రీ. దేశం కోసం వాళ్లు పోటీప‌డ‌తారేగాని వారి కోసం కాదు. ఇదే స‌హ‌జంగా క్రీడాకారులు,క్రీడాసంఘాలు గొప్ప నినాదంగా ప్ర‌చా రం చేస్తుంటారు. అది నూటికి నూరుపాళ్లూ నిజం. న‌మ్మితీరాల్సిందే. కాకుంటే కొన్న ప‌ర్యాయాలు ఓట‌మి ని చ‌విచూడాల్సి వ‌స్తుంది. అన్నిప‌ర్యాయాలు మ‌న‌వాళ్లే గెల‌వాల‌ని రూలు లేదు.   ఇదుగో ఇలాంట‌పుడే ఫ‌ర‌వాలేదు. మ‌రోసారి, మ‌రో పోటీలో గెలుస్తావ‌న్న ఒక్క మాట వేయి క‌న్నీళ్ల బాధ‌ని మ‌రిపిస్తుంది. కోచ్ ఎంత వెన్నుత‌ట్టి బెంగ‌ప‌డ‌కు, అదేమంత గొప్ప సంగ‌తి కాదు, త‌ర్వాత పోటీకి సిద్ధ‌ప‌డదామ‌నే అంటూ ప‌క్క‌నే ఉండి కొండంత ధైర్య‌మిస్తూంటారు. వారిదీ గొప్ప సేవే. కానీ ప్ర‌జ‌ల నుంచి, అధికారుల నుంచీ ఊరు నుంచీ వ‌చ్చే చిన్న ధైర్యాన్ని నూరిపోసే స‌మాచారం, ఎక్క‌డో ఉన్న‌క్రీడాకారుల‌కు మ‌నోధైర్యాన్ని కొండంత పెంచుతుంది, నీర‌సాన్ని, దిగుల్ని దూరం చేస్తుంది.  అదే నిఖిత్ విష‌యంలో ప్ర‌ధాని మోడీ చేశారు. అందుకే ప్రపంచ చాంపియన్‌, తెలుగు బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ కామన్వెల్త్‌ క్రీడల్లోస్వర్ణం సాధించాక మన ప్రధానమంత్రి నరేంద్రమోదీని  గుర్తు చేసుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల 50 కిలోల ఫైనల్లో నిఖత్ జరీన్‌ టైటిల్‌ ఫైట్‌లో 5-0తో కార్లీ మెక్‌నాల్‌ (నార్తర్న్‌ఐలాండ్‌)ను మట్టికరిపించింది. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించాక  తాను ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసి బాక్సింగ్ గ్లోవ్స్ పై ఆటోగ్రాఫ్తీ సుకుంటానని నిఖత్ జరీన్ సంతోషంగా చెప్పారు. తాను కామన్ వెల్త్ క్రీడల్లో పతకం గెలుస్తానని ప్రజలు ఊహించారని, తాను 5:0 అద్భుతమైన స్కోర్‌తో స్వర్ణం గెలిచానని చెప్పారు.‘‘నా దేశం కోసం స్వర్ణం గెలిచినందుకు నేను థ్రిల్‌గా ఉన్నాను. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల తర్వాత ఇది నా తదుపరి ప్రధాన పోటీ లోనూ స్వర్ణం గెలిచాను కాబట్టి చాలా సంతోషం గా ఉన్నానని నిఖత్ వ్యాఖ్యానించారు. స్వర్ణ పతక విజేత మాట్లాడుతూ జాతీయ గీతం ఆలపించినప్పుడు తాను భావోద్వేగానికి గురయ్యానని, రాబోయే ఈవెంట్‌లలో తాను దేశం గర్వపడేలా మంచి ప్రదర్శనను కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణలో బిజెపి మైండ్ గేమ్.. కేసీఆర్ గెలవరంటూ బండి జోస్యం

తెలంగాణలో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పనైపోయినట్లేనని విస్తృత ప్రచారంతో పాటు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం కేవలం 15 స్థానాలకే పరిమితమౌతుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పదే పదే చెబుతున్నారు. అంతే కాకుండా ఆ గెలిచే 15 మందిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండరని చెబుతూ టీఆర్ఎస్ క్యాడర్ లో ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా  వరుసగా రెండు ఉప ఎన్నకలలో టీఆర్ఎస్ పరాజయాన్ని గుర్తు చేస్తూ అధికార పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందనీ, అవినీతి కారణంగా త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమనీ చెబుతూ మైండ్ గేమ్ రాజకీయాలు నెరపుతోందని పరిశీలకులు అంటున్నారు.   పార్టీల వ్యవహారాలకన్నా, ప్రభుత్వ పనితీరుకన్నా.. ముఖ్యమంత్రిని, సిఎం కుటుంబాన్ని లక్ష్యాన్ని చేసుకుని  పదేపదే ఆరోపణలు చేయడం ద్వారా టీఆర్ఎస్ ను ప్రజలలో పలుచన చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.  బిజెపి చేస్తున్న లేదా ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఏ ఆరోపణపైనా ఇప్పటి వరకూ విచారణ ప్రారంభమైన దాఖలాలు లేవు.  ఆ, ఆరోపణల్లో  నిజానిజాల సంగతి పక్కన పెడితే ఆ ఆరోపణతో కమలనాథులు సాగిస్తున్న ప్రచారంపై జనాలలో చర్చ అయితే ప్రారంభమైంది. అలాగే తాజాగా చికోటి ప్రవీణ్ క్యాసినోల కేసులో టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు మంత్రులు, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులలో ఒకరికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుందన్న చర్చ ఒకటి తెలంగాణలో ప్రారంభమైందని టీఆర్ఎస్ శ్రేణులే అంగీకరిస్తున్నాయి.   మొత్తంగా బండి సంజయ్ తరచుగా చేస్తున్న ఓ నాలుగు ఆరోపణలపై మాత్రం తెలంగాణ వ్యాప్తంగా విస్తృత చర్చ అయితే జరుగుతోంది.   సిఎం కెసిఆర్ జైలుకెళ్ళడం ఖాయం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతి మయం. కెసిఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది. అన్నవే జనంలో విస్తృతంగా చర్చకు తెరతీసిన ఆరోపణలు. ఇప్పుడు బీజేపీ వాటిని మించి అన్నట్లుగా  తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే గెలుస్తుంది. ముఖ్యమంత్రి పరాజయం పాలు కావడం తథ్యం అంటూ మైండ్ గేమ్ కు తెరతీసింది.  ఈ మైండ్ గేమ్ కారణంగానే టీఆర్ఎస్ నుంచి ఇటీవలి వలసలు పెరిగాయంటున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లోని కొందరి చూపు బీజేపీ వైపు మళ్లడానికి కూడా ఈ మైండ్ గేమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత రెండు ఎన్నికలలో విజయం సాధించి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సహజంగానే ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దానికి తోడు ఆ పార్టీ ఇటీవల పీకే బృందం ద్వారా చేయించుకున్న సర్వేలను స్వయంగా కేసీఆర్ లీక్ చేసి సిట్టింగ్ లలో చాలా మందికి టికెట్లు అనుమానమే అనడంతో సిట్టింగులలో తమకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ రాదన్న అనుమానం బలపడటం కూడా పార్టీ నుంచి వలసలకు కారణమని పరిశీలకులు అంటున్నారు. పీకే సర్వేలు, బీజేపీ మైండ్ గేమ్ రెండూ కూడా టీఆర్ఎస్ లో ఒక విధమైన జంకుకు కారణమయ్యాయనీ, ప్రజలలో కూడా టీఆర్ఎస్ పని అయిపోయిందా అన్న అనుమాన బీజాలు నాటుకోవడానికి తోడ్పడ్డాయనీ అంటున్నారు. ఇక ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి సీఎంపై పోటీ చేసి గెలుస్తాను అని చేసిన ప్రకటన ఈ మైండ్ గేమ్ కు పరాకాష్ట అని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో సీఎం ను గజ్వేల్ కు ఫిక్స్ చేసే వ్యూహం ఉందనీ, గతంలోలా ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్త సుడిగాలి పర్యటనలను తగ్గించుకుని గజ్వేల్ కే అధిక సమయం కేటాయించాల్సిన అనివార్య పరిస్థితిని ఈటల తన సవాల్ ద్వారా కల్పించారని పరిశీలకులు అంటున్నారు.  దీనికి తోడు ఈటలను బీజేపీ అగ్రనాయకత్వం చేరికల కమిటీ చైర్మన్ గా నియమించడంతో గతంలో ఆయన టీఆర్ఎస్ లో ఉండగా సన్నిహితులుగా ఉన్న వారంతా బీజేపీలోకి టచ్ లోకి వచ్చారని పరిశీలకులు అంటున్నారు.  

మునుగోడులో ‘సర్వే’జనుల హడావుడి.. అభ్యర్థి, ప్రత్యర్థి తేలకుండానే హంగామా!

తెలంగాణలో అంతటా ఇప్పుడు మునుగోడు చర్చే. మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అని తేలిపోయింది. బీజేపీ అభ్యర్థిగా తాజా మాజీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఖరారయ్యారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? తెరాస తరఫున ఎవరు నిలబడతారు అన్న విషయంలో స్పష్టత లేదు. మునుగోడులో త్రిముఖ పోరు మాత్రం తథ్యం అనడంలో ఎలాంటి సందేహాలకూ తావులేకపోయినా.. అసలు అభ్యర్థులు ఎవరు? అన్నది తేలకుండానే గెలుపు ఓటములపై చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో  రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.   మునుగోడు ఉప ఎ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమిఫైనల్స్ గా రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. మునుగోడులో విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తిరుగుండదని బీజేపీ సహా కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కూడా భావిస్తున్నాయి. దీంతో తెలంగాణలో ప్రధాన పక్షాలైన మూడు పార్టీలూ కూడా మునుగోడుపై ప్రత్యేక దృష్టిసారించాయి. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు ఆయా పార్టీల అధినేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, టిఆర్ఎస్ లు సమర్ధ అభ్యర్థుల కోసం గాలిస్తున్నారు.  ఇవన్నీ ఒకెత్తు అయితే ఇప్పటి నుంచే మునుగోడులో సర్వేలు హడావుడి ప్రారంభమైంది. మునుగోడు ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుపొందుతుంది. ప్రజల మొగ్గు ఏ పార్టీ వైపు ఉంది అన్న అంశంపై ‘సర్వే’జనం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డే అన్నది ఇప్పటికే స్పష్టమైన నేపథ్యంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ల అభ్యర్థులు ఎవరన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆ రెండు పార్టీలూ కూడా టికెట్ ఆశావహుల వివరాలు సేకరిస్తూ వారిలో బలమైన అభ్యర్థి ఎవరన్న దానిపై అంచనాలు వేసుకుంటున్నాయి. ఇక సామాజికవర్గాల వారీగా కూడా నివేదికలు రూపొందిస్తున్నాయి. ఏ సమాజిక వర్గం వారికి టికెట్ ఇస్తే విజయావకాశాలు మెరుగౌతాయి అన్న దానిపై కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ లు అంతర్గతంగా సర్వేలు నిర్వహిస్తున్నాయని ఆయా పార్టీల శ్రేణులే చెబుతున్నాయి. మునుగోడులో నిలబెట్టే అభ్యర్థి పార్టీ బలంపైనే కాక పార్టీకి బలంగా ఉండాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఉన్నాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆ లక్ష్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకే ముందుగా మునుగో డు నియోజకవర్గంలో సామాజిక సమీకరణాల పరిశలన అనంతరమే అభ్యర్థికి ఖరారు చేయాలనే వ్యూహంలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. 

రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా.. అమోదం

ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ముందుగా చెప్పినట్లే సోమవారం ఉదయం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ని కలిసిన రాజగోపాల్‌ రెడ్డి తన రాజీనామా లేఖను అంద జేశారు. కోమటిరెడ్డి రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం అధికారి కంగా ప్రకటించింది. అనంతరం గవర్నర్ తమిళిసై ను కలిసేందుకు రాజగోపాల్ రెడ్డి అపా యింట్ మెంట్ కోరారు. కాగా రాజ‌గోపాల్ రెడ్డి త్వ‌ర‌లో బీజేపీలో చేర‌డానికి ముహూర్తం కూడా ఫిక్సై పోయిందని  తెలుస్తున్న‌ది. ఈ నెలాఖ‌రులో ఆయ‌న అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేర‌తారు.  2018 డిసెంబర్‌లో మునుగోడు ఎమ్మెల్యే గా రాగోపాల్ రెడ్డి గెలిచారు. కాగా  కేసీఆర్ పాల‌న‌లో తెలంగాణా అన్యాయమైపోయింద‌ని, తెలంగాణా త‌ల్లిని కాపాడుకోవ‌డానికే తాను కాంగ్రెస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాన‌ని రాజ్‌గోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణాలో కుటుంబ పాల‌నతో రాష్ట్రాభివృద్ధి కుంటుబ‌డింద‌ని, దీన్ని ఎదుర్కొని పాల‌క ప‌క్షాన్ని, ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే స‌త్తా తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి లేద‌ని రాజ గోపాల్ అన్నా రు. ఆయ‌న రాజీనామా చేయ‌డానికి ముందు మీడియాతో మాట్లాడుతూ మున‌గోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్న‌ట్టు చెప్పారు.  పార్టీ స‌భ్య‌త్వానికీ, మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికీ ఆయ‌న రాజీనామా చేశారు. ఆయ‌న్ను పార్టీ నుంచి తొల గించాలా వ‌ద్దా అన్న అంశం మీద ఢిల్లీలో పార్టీ హైక‌మాండ్‌తో పార్టీ నాయ‌కుల స‌మావేశానంత‌రం కోమ‌టిరెడ్డి రాజీనామా నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. అయితే బీజేపీలో ఎప్పుడు చేరుతున్నార‌న్న‌ది అప్పు డు చెప్పనప్పటికీ రాజీనామా అనంతరం ఆయనీ విషయంలో స్పష్టత ఇచ్చారు.  అమిత్ షా స‌మ‌క్షంలో ఆయన ఈ నెల చివరి వారంలో బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని ఆయన సన్నిహితులు, బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి.  పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ ఎస్ లోకి మారుతుండ‌డం విష‌యం లోనూ పార్టీ నాయకులు వారిని ఆపేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌డం ప‌ట్ల కూడా ఆయ‌న  ఇటీవ‌లే ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేగాక పార్టీ హైక‌మాండ్‌ను గ‌తంలో విమ‌ర్శించిన‌వారికే పార్టీలో కీల‌క ప‌ద‌వులు క‌ట్టిపెట్ట‌డం ప‌ట్ల కూడా రాజ గోపాల్ అసంతృప్తితో ఉన్నారు.  ఇదిలా ఉండ‌గా, సోషల్ మీడి యాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ తప్ప ఇంకే కనిపించడం లేదని మండిపడ్డారు. టీ ఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని విమ ర్శించారు. ఉప ఎన్నిక  వచ్చాక మునుగోడు గుర్తొచ్చిందన్నారు. యుద్ధంలో మునుగోడు ప్రజలు గెలుస్తా రని తెలిపారు. టీపీసీసీ చీప్ భాష విని సమాజం తలదించుకుందని, జైలుకెళ్లిన వ్యక్తులు మాట్లాడితే ప్రజలు నమ్మరని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

గోరంట్లా ఎంత పని చేశావయ్యా?.. వైసీపీలో అయోమయం.. పార్టీ పరువు గంగలో కలుస్తున్నా కిమ్మనని వైనం

గోరంట్ల మాధవ్ విషయంలో చర్య తీసుకోవడానికి వైసీపీ జంకుతోందన్న భావన అందరిలో రోజు రోజుకూ బలపడుతోంది. దీంతో వైసీపీ నైతికంగానూ, రాజకీయంగానూ కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. మాధవ్ అసభ్య వీడియో బయటపడి ఇన్ని రోజులైనా వైసీపీ ఆయన విషయంలో ఎలాంటి చర్యా తీసుకోకపోవడం అటుంచి వైసీపీ ఎంపీ మాధవ్ నిస్సిగ్గుగా పార్లమెంటులోని వైసీపీ కార్యాలయంలో జరిగే సమావేశాలకు హాజరౌతుండటం, ఫొటోలకు పోజులిస్తుండటం.. విసీపీ ఇమేజ్ ను మరింత దిగజారుస్తోంది.   వీడియో బయటపడిన గంటల తరువాత  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎంపీ మాధవ్  తప్పు చేస్తే చర్యలుంటాయనీ, ఆయన తప్పు చేసినట్లు రుజువు కావాలని మీడియా సమావేశంలో చెప్పారు. కానీ ఆ వీడియో మార్ఫింగా కాదా అన్నది  ఎలా నిర్ధారిస్తారు? ఆ వీడియోను ఇప్పటివరకూ ప్రభుత్వం పరంగా కానీ, పార్టీ  పరంగా ఏమైనా ఫోరెన్సిక్ లాబ్ కు పరీక్షకు పంపించారా?  ఎంపీ చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ ప్రాథమిక దర్యాప్తు చేపట్టందా? అన్నదానిపై స్పష్టత లేదు.  సాధారణంగా అధికార పార్టీ ప్రముఖులపై ఎవరైనా పోస్టులు పెడితే, క్షణం ఆలస్యం చేయకుండా వారిపై చర్యలు తీసుకునే సీఐడీ ఒక వేళ నిజంగా ఎంపీ మాధవ్ వీడియోను మార్ఫింగ్ చేసినట్టయితే, ఆ మార్ఫింగ్ వీడియో  సృష్టించిన వారిని ఇప్పటిదాకా చర్యలు తీసుకోకుండా ఉంటుందా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. సీఐడీ ఇప్పటి వరకూ స్పందించలేదంటే.. ఆ వీడియో మార్ఫింగ్ అయ్యే అవకాశమే లేదని సామాన్య జనం కూడా అభిప్రాయపడుతున్నారు. మరో వైపు మాధవ్ విషయంలో పార్టీ హై కమాండ్ అంటే జగన్ వెనుకాడటం పట్ల వైసీపీలోనే విమర్శలు వినవస్తున్నాయి.  రాజకీయపరమైన వివాదమయితే, దానిపై చర్యలకు సమయం తీసుకోవడంలో అర్థం ఉంటుంది కానీ, ఇలాంటి అనైతిక వ్యవహారాల విషయంలో కూడా  ఎటువంటి చర్యా తీసుకోకపోవడం వల్ల పార్టీ ఇమేజ్ దారుణంగా దెబ్బతింటుందని పార్టీలోని సీనియర్లు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మాధవ్ వ్యవహారం వల్ల మీడియా ముందుకు కూడా రాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని వారు అంటున్నారు. ఏదైనా విషయంపై మీడియాతో మాట్లాడదామన్నా తొలుత మాధవ్ విషయాన్ని పార్టీ సమర్ధిస్తోందా, సమర్ధించనట్లైతే చర్య ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్నలే ఎదురౌతున్నాయని వారు చెబుతున్నారు. అయితే మాధవ్ విషయంలో చర్యలు అన్న విషయంలో పార్టీలో ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఏ నిర్ణయమైనా జగనే తీసుకోవాలి. అసలు మాధవ్ విషయంలో జగన్ ఏం అనుకుంటున్నారు, చర్య విషయంలో ఆయన అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నకు జగన్ వినా మరెవరూ సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే జగన్ ఏం చేస్తారన్నది ఆయనతో సన్నిహితంగా మెలిగే వారికి కూడా ముందుగా తెలియదని పార్టీ వర్గాలే చెబుతుంటాయి. ఒక్క గోరంట్ల మాధవ్ విషయంలోనే కాదు.. ఏ విషయంలోనైనా సరే పార్టీలోని ముఖ్యులకు కూడా జగన్ ఒక నిర్ణయం తీసుకున్న తరువాతే తెలుస్తుంది. ఈ కారణంగానే అవసరం ఉన్నా లేకున్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే నేతలు కూడా ఇప్పుడు మీడియా అంటే మొహం చాటేస్తున్నారు.  ఇక విపక్షంపై విమర్శలు గుప్పించే రోజా వంటి మహిళా మంత్రులకు కూడా మాధవ్ వ్యవహారంతో నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందంగా నోరు మెదపడానికి కూడా ఇష్టపడటం లేదు.  మాధవ్ అంశంపై ఇప్పటికే తెలుగు మహిళా నేతలు,  నిత్యం వైసీపీని విమర్శలతో చెరిగేస్తున్నా, ఆ విమర్శలను ఖండించేందకు కూడా అవకాశం లేని నిస్సహాయ స్థితిలో వైసీపీ, ఆ పార్టీ నాయకులు ఉన్నారు.    రోజా మాత్రం ‘సీఎం విచారణ జరిపిస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో కాల్ మనీ వ్యవహారంలో మహిళలను వేధించలేదా?” అన్న అరిగిపోయిన రికార్డునే వినిపించాల్సి వచ్చిందే తప్ప, ఆ వీడియో మాధవ్ ది కాదని గట్టిగా చెప్పకపోవడాన్ని బట్టే, ఎంపీ వీడియో వ్యవహారం పార్టీని ఏ స్థాయిలో డిఫెన్స్ లో పడేసిందన్నది అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.మాధవ్ పై చర్యలు తీసుకోనున్నట్లుగా వైసీపీ నుంచి వచ్చిన లీకులు కూడా ఇప్పుడు చర్య విషయంలో జాప్యంతో బూమరాంగ్ అయ్యింది. మాధవ్ కు మద్దతుగా కుల సంఘాల ర్యాలీలు, వ్యతిరేకంగా అదే కులానికి చెందిన వారి విమర్శలు పార్టీని మరింత ఇరుకున పడేశాయి. ఇప్పుడు మాధవ్ పై చర్య తీసుకుంటే అనంతపురం జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గం పార్టీకి దూరమౌతుందన్న భయం, చర్య తీసుకోకుంటే.. మహిళా సమాజం మొత్తం వైసీపీని బహిష్కరిస్తుందన్న బెంగ జగన్ ను కుదిపేస్తోందని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నారు. గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో బయటపడిన వెంటనే నిర్ణయం తీసుకుని ఉంటే పార్టీకి ఇప్పుడీ సంకట స్థితి వచ్చి ఉండేది కాదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.    

తాగి డ్రైవ్ చేయొద్దు.. జైల్లో మ‌రీ చ‌లి!

పాఠం చ‌ద‌వ‌క‌పోతే టీచ‌ర్ కొడుతుంద‌ని భ‌య‌పెడ‌తారు, కాలేజీకి డుమ్మా కొడితే తండ్రికి చెబుతా నంటుంది త‌ల్లి, పిచ్చివేషాలేస్తే అమ్మ‌కి చెప్తానని బెదిరిస్తుంది అన్న‌ను చెల్లి. తాగి  డ్రైవ్ చేయ‌ద్దు ప్రాణ హాని. ఇవన్నీ చాలా స‌ర్వ‌సాధార‌ణ హెచ్చ‌రికలు, హెచ్చ‌రిక బోర్దులు. వీటికి కుర్రాళ్లు భ‌య‌పడ‌టం మానేసేరు. జైలు శిక్ష‌, జ‌రిమానాలు మామూలై పోయాయి. కానీ ఎవ్వ‌రూ అంత‌గా ప‌ట్టించుకోవ‌డ‌మూ లేదు. వేగంగా వెళ్ల‌డ‌మే గొప్ప ఆనందంగా దాదాపు వాహ‌న‌దారులంతా భావించ‌ డంతో ప్ర‌మాదాలు త‌ప్ప‌ డం లేదు. పోలీసులు, సంబంధిత అధికారులు ప్రక‌ట‌న‌లు చేస్తూనే ఉన్నారు, ఇది నిత్య‌ కృత్య‌మైంది.  ఇవ‌న్నీ భ‌రించలేకేనేమో కులు పోలీసులు చిత్ర‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. కులు ప్ర‌యాణం యువ‌ త‌కు మ‌హా యిష్టం. తాగినా తాగ‌కున్నా వేగంగా వెళ్ల‌డం అక్క‌డికి వెళ్లేవారికి స‌ర‌దా. తాగి డ్రైవ్ చేయ‌డం మ‌రీ ప్ర‌మాద‌క‌రం అంటున్నారు పోలీసులు. తాగి న‌డిపితే పోలీసులు వెంటాడి మ‌రీ ప‌ట్టుకుంటారు. అంతే కాదు అక్క‌డ జైల్లో ప‌డేస్తారు. ఎవ్వ‌రి మాటా విన‌రు. ఇది తాగి న‌డిపేవారిని శిక్షించ‌డంలో భాగం. కానీ చిత్ర‌మేమంటే అక్క‌డ మ‌రో హెచ్చ‌రికా పెట్టారు. తాగి డ్రైవ్ చేస్తే తిట్ట‌డం, కొట్టడం స‌రే, జైల్లో వేస్తారుట‌. అక్క‌డి జైళ్లులో వాతావ‌ర‌ణం చాలా చ‌లిగా ఉంటుంది. ఆ చ‌లికి త‌ట్టుకోలేరు.  అక్క‌డేమీ ఉండేందుకు దుప్ప‌ట్లు, ర‌గ్గులూ ఏమీ ఇవ్వ‌రు. తీసికెళ్లిన‌వారిని అలానే జైల్లో కూర్చోబెడ‌తారంతే.  కులు దారిలో పెద్ద హెచ్చ‌రిక బోర్డు పెట్టారు. ఇటుగా తాగి వెళితే జైలు పాల‌వుతారు, అక్క‌డ చ‌లికి త‌ట్టుకో లేరు. అంత‌కంటే తాగ‌కుండా ఉండి, నెమ్మ‌దిగా త‌క్కువ వేగంతో ప్ర‌యాణించండి. మీకు, మాకూ మంచి ది.. అనే హెచ్చ‌రిక‌తో! ఇలాంటిదేదో బావుంద‌ని ముంబై పోలీసులు కూడా ఇలాంటి హెచ్చ‌రిక‌ల‌ను పెద్ద హోర్డింగ్స్‌గా పెడ‌దామ‌నుకుంటున్నార‌ట‌! బావుందిగ‌దూ! అన్న‌ట్టు ఇలా అన్ని రాష్ట్రాల  పోలీసు అధికా రులూ న‌గ‌రాల్లోనూ సీరియ‌స్‌గా కేసులు పెడ‌తాము, భారీ జ‌రిమానా విధిస్తామ‌ని పెడితే బావుంటుంది. ఈ రోడ్ద ప్ర‌మాదాలు కాస్తంత త‌గ్గుతాయేమో! 

కామన్ వెల్త్ క్రీడలలో పాల్గొనేందుకు వెళ్లిన లంక క్రీడాకారులు మిస్సింగ్

కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంక క్రీడాకారులు అదృశ్యమయ్యారు. కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి 160 మంది  క్రీడాకారుల బృందం బర్మింగ్ హాం వెళ్లంది. అయితే ఆ బృందంలోని పది మంది క్రీడాకారులు అదృశ్యమయ్యారు. ఈ పది మంది పాల్గొనే ఈవెంట్లు పూర్తి కాగానే  తొమ్మిది మంది అథ్లెట్లు సహా ఒక మేనేజర్ అదృశ్య మయ్యారు. వీరు గత వారం రోజులుగా కనిపించడం లేదు.  ఈ విషయాన్ని శ్రీలంక క్రీడా అధికారి   వెల్లడించారు. క్రీడాకారుల అదృశ్యంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.    కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రీడాకారుల కోసం గాలించగా తొలుత అదృశ్యమైన ముగ్గురు.. జుడోకా చమీలా దిలాని, ఆమె మేనేజర్ అసేల డి సిల్వా, రెజ్లర్ షనిత చతురంగలను గుర్తించారు. అయితే వారు ముగ్గురూ కూడా స్థానిక చట్టాలను వారు ఉల్లంఘించలేదని పోలీసలు పేర్కొన్నారు. కనుక ఆ ముగ్గురిపై ఎలాంటి చర్యలూ తీసుకోబోవడం లేదని అన్నారు.  అయితే అదృశ్యమైన పది మందిలో ముగ్గురి ఆచూకీ మాత్రమే ఇప్పటి వరకూ లభించింది. మిగిలిన ఏడుగురి కోసమూ గాలిస్తున్నారు.

తెలంగాణలో పాగాకు..ఏపీలో బాబుతో మైత్రి.. బీజేపీ కొత్త స్కెచ్!

తెలంగాణలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కి చెక్ పెట్టి.. అధికారం చేజిక్కించుకునేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఆ క్రమంలో బాబును మోడీ స్వయంగా పలకరించి, ఆప్యాయంగా మాట్లాడారా? శత్రువుకు శ్రుతువు మిత్రుడు అనే లాజిక్‌ను తెరపైకి తీసుకు వచ్చి.. మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబుతో మంత్రాంగం నెరపేందుకు .. కమలం పార్టీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారా? అంటే.. రాజకీయ విశ్లేషకులు నుంచి అందుకు అవుననే సమాధానం వస్తోంది.  తాజాగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత ప్రదాని మోడీయే  స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించడమే కాకుండా పక్కకు తీసుకువెళ్లి కొద్ది సేపు ప్రత్యేకంగా ముచ్చటించారు.  ఇది సమావేశానికి హాజరైన ప్రముఖులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.  తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పరిణామం విస్తృత చర్చకు తెర తీసింది.  దాదాపు నాలుగేళ్ల తర్వాత.. వీరిద్దరు ఎదురుపడటం ఇదే ప్రథమం. ఉప్పు నిప్పులా ఉండే ఇరువురూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం.. ప్రత్యేకంగా ముచ్చటించుకోవడంపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు.  గతంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై అధికార ఫ్యాన్ పార్టీ నాయకులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అందుకు నిరసనగా చంద్రబాబు ఓ రోజు దీక్ష చేసి.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షాతో భేటీకి ప్రయత్నించారు. కానీ అప్పట్లో చంద్రబాబుకు ఇరువురూ కూడా అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన రెండు రోజులు వేచి చూసి .. ఆ తర్వాత వెనుదిరిగారు. ఆ తరువాత కూడా  చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా.. మోడీ, అమిత్ షాలను  కలిసే ప్రయత్నం  చేయలేదు.. అలాగే వారు కూడా చంద్రబాబును అంతగా పట్టించుకోనూ లేదు. కానీ ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం మద్దతు ప్రకటించడంతో   కమలనాధుల మనస్సును చంద్రబాబు మరోసారి గెలుచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉంటే.. ఆ అధికారాన్ని హస్త గతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ రాష్ట్రంలో నేరుగా బీజేపీ రాజకీయాలు చేయడానికి అట్టే సమయం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో గత టీడీపీ నాయకులంతా కారు పార్టీలో చేరి.. సీఎం కేసీఆర్‌కి కోటరీగా మారిపోయారు. కానీ తెలంగాణలో  సైకిల్ పార్టీ కేడర్ మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరకుండా.. కేసీపీ సిమెంట్‌తో కట్టిన నిర్మాణంలాగా చాలా స్ట్రాంగ్‌గా ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ క్యాడర్ బలంపైనే బీజేపీ ఆశలు పెంచుకుంటోంది. ఏపీలో చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. ఆ ప్రభావం తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ బీజేపీకి అండగా నిలిచేలా చేస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.  అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో   బీజేపీ తెలుగుదేశం క్యాడర్ అండతో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న వ్యూహంతో ఉందని పరిశీలకులు అంటున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో తెలుగుదేశంతో మైత్రి ఉంటే తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా కొన్ని జిల్లాలలో తెలుగుదేశం బలం తమకు తోడ్పడుతుందని కమలనాథులు భావిస్తున్నారని చెబుతున్నారు.  తెలంగాణలో కీసీఆర్ అధికారానికి వచ్చే ఎన్నికలలో చెక్ పెట్టాలంటే చంద్రబాబు అండ అవసరమని బీజేపీ గుర్తించిందని అంటున్నారు.నాలుగేళ్ల   తర్వాత చంద్రబాబుతో  మోడీ తనంత తానుగా మాట కలపడాన్ని చూస్తుంటే తెలంగాణలో పాగాకు స్కెచ్ లో భాగమేనని విశ్లేషిస్తున్నారు.

శిశిర్‌, దివ్యేందుల‌పై దీదీ ఆగ్ర‌హం

తండ్రి మాట త‌న‌యుడు వింటాడు. తండ్రి బాట‌లోనే త‌న‌యుడు వెళ్లాల‌నుకోవ‌డంలోనూ త‌ప్పు లేదు. తండ్రి ఒక‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌నుకున్న‌పుడు త‌న‌యుడు ప‌క్క‌నే ఉండి త‌నూ ఓకే అన‌కుండా ఎలా ఉం టాడు. అందులోనూ ఇద్ద‌రూ ఎంపీల‌యిన‌పుడు. ఈ తండ్రీ కొడుకుల స్వీయ నిర్ణ‌యం వారిద్ద‌రికి బావుం దేమోగాని వారిని ఎంపీలుగా చేసిన టీఎంసీ పార్టీ అధినేత‌కుమాత్రం స‌సెమిరా న‌చ్చ‌లేదంటే న‌చ్చ‌ లేదు. పార్టీలో ఉన్న‌పుడు పార్టీ నియ‌మాల‌కు క‌ట్టుబ‌డి ఉండాలి. పార్టీ అధినేత చెప్పిన మాటే శాస‌నం అవుతుంది. అదే వినాలి, అదే చేయాలి. లోక్‌సభలో తృణమూల్ పక్షనేత  శిశిర్ అధికారి, ఆయ‌న కుమారుడు దివ్యేందు అధికారి  కూడ‌బ‌లుక్కున్న‌ట్టుగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొన్నారు. వాస్త‌వానికి వారికి వారి అధినేత మ‌మ‌తా బెన‌ర్జీ ఆదేశాలేమీ లేవు. కానీ వారు ధైర్యం చేశారు. ప‌శ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత మ‌మ‌తా బెన‌ర్జీకి కోపంవ‌చ్చింది. పార్టీ అధినేత‌తో సంప్ర‌దించ‌కుం డానే ఓటింగ్‌లో పాల్గొన్నార‌ని తెలిసింది.  ఉపరాష్ట్రపతి ఎన్నికలతో తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేగింది. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినా ఇద్దరు ఎంపీలు ఓటు వేయడంపై ఆ పార్టీ అధిష్టానం కన్నెర్ర చేసింది. పార్టీ ఎంపీలిద్ద‌రికీ   ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడంపై షోకాజ్ నోటీసులు జారీచేసింది. వివరణ ఇవ్వాలంటూ లోక్‌సభ లో తృణమూల్ పక్ష నేత సుదీప్ బంధో పాధ్యాయ  ఆ ఇద్దరు ఎంపీలకు లేఖలు రాశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగ్‌దీప్ ధనకర్‌ ను ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్డీయే ప్రకటించడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని తృణమూల్ ముందే నిర్ణయించింది. తద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తృణమూల్‌కు పార్లమెంట్‌లో మొత్తం 35 మంది ఎంపీలున్నా రు. ఇందులో 23 మంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  సుదీప్ బంధోపాధ్యాయ రాసిన లేఖలు అందుకున్న శిశిర్ అధికారి పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత సువేందు అధికారి తండ్రి. శిశిర్ అధికారి పశ్చిమబెంగాల్ కాంతి నియోజకవర్గం నుంచి మూడు సార్లు టీఎంసీ ఎంపీగా గెలుపొందారు. ఆయన మరో కుమారుడు దిబ్యేందు అధికారి 2019లో తమ్లుక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. పశ్చిమబెంగాల్‌లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సువేందు అధికారి బీజేపీ లో చేరినా వీరు తృణమూల్‌‌కు రాజీనామా చేయలేదు. టీఎంసీ లోనే కొనసాగుతున్నారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో శిశిర్  దిబ్యేందు లు  ఓటుహక్కు విని యోగిం చుకోవడం పార్టీ ఆదేశాలను ధిక్కరించడమేనని తృణమూల్ అధిష్టానం కన్నెర్ర చేసింది.  కాగా వీరిపై లోక్‌సభ స్పీకర్‌కు ఇప్పటికే అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఆధారాలు కావాలంటూ దాట వేశారని సుదీప్ బంధోపాధ్యాయ ఆరోపించారు. లోక్‌సభ స్పీకర్ వీరిపై చర్యలు తీసుకోకున్నా పార్టీ తరపున కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి.  ఈ నెల ఆరున జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి జగదీప్‌ ధనకర్ 528 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి, యూపిఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. ధనకర్‌కు 346 ఓట్ల ఆధిక్యం లభించింది

గోరంట్ల బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. కాకతీయ సేవాసమితి డిమాండ్

 చేసిన ఛండాలపు పని నుంచి కులం కార్డు అడ్డుపెట్టుకుని బయటపడదామనుకున్న గోరంట్ల మాధవ్ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. అంతే కాదు బూమరాంగ్ అయ్యాయి. గోరంట్ల మాధవ్ కులం కార్డు ఉపయోగించడాన్ని కాకతీయ సేవా సమితి చాలా తీవ్రంగా పరిగణించింది. గోరంట్ల మాధవ్  ప్రస్తావన తీసుకు వచ్చినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాకతీయ సేవా సమితి డిమాండ్ చేసింది. లేకుంటే చట్టపరంగా ముందుకు వెళతామని కాకతీయ సేవా సమితి కార్యదర్శి కనకమేడక శ్రీనివాస్ హెచ్చరించారు. చేసినదే ఛండాలపు పని దానికి కులం పేరుతో వెనకేసుకు వస్తామని భావిస్తే అది చాలా పొరపాటని అన్నారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేసిన ఆయన మాధవ్ కు వ్యతిరేకంగా తమ పోరు రాజకీయాలకు అతీతంగానే ఉంటుందని అన్నారు.  కులాన్ని అడ్డుపెట్టకుని రాజకీయ లబ్ధి పొందుదామన్న ప్రయత్నాలను తాము ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. కులాన్ని రాజకీయాలకు అపాదించడం తగదని కాకతీయ సేవాసమితి ప్రతినిథి గోపాలకృష్ణ అన్నారు. గోరంట్ల మాధవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న తమపై తెలుగుదేశం పార్టీకి వత్తాసుపలుకుతున్నామంటూ కొందరు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. గతంలో పలు మార్లు తాము తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునూ వ్యతిరేకించిన సందర్బాలను ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. 

ఏపీలోనూ ఉప ఎన్నిక.. వైసీపీ వ్యూహం

ఏపీలో వైసీపీకి గోరంట్ల మాధవ్ కారణంగా తీవ్ర డ్యామేజీ జరిగింది. పార్టీ వర్గాలే కాదు.. అధినాయకత్వం కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తోంది. దీనిపై మాధవ్ పై చర్య తీసుకోవాలని పార్టీ సీరియస్ గా ఆలోచిస్తోంది. వివరణ కోసం అమరావతి రావాలన్న అధిష్ఠానం ఆదేశాలను గోరంట్ల మాధవ్ ధిక్కరించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో మాధవ్ ను బుజ్జగించైనా సరే ఆయన చేత రాజీనామా చేయించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే విచారణ అంటూ మాధవ్ పై వేటు వేయకుండా జాప్యం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో కారణంగా పార్టీకి కలిగిన నష్టాన్ని నివారించడంతో పాటుగా ఇటీవలి కాలంలో వైసీపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి కూడా చెక్ పెట్టే విధంగా గోరంట్ల మాధవ్ చేత అనంతపురం ఎంపీ పదవికి రాజీనామా చేయించి, తద్వారా వచ్చే ఉప ఎన్నికలో పార్టీ టికెట్ ఆయనకే ఇచ్చి గెలిపించుకోవడం ద్వారా మాధవ్ కారణంగా పార్టీకి కలిగిన నష్టాన్ని పూడ్చుకోవాలనీ, అలాగే ప్రజావ్యతిరేకత అంటూ విపక్షాల ప్రచారానికి చెక్ పెట్టాలనీ జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ కారణంగానే మాధవ్ ను ఇంత వరకూ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. గోరంట్ల మాధవ్ చేత పార్టీకి కాకుండా ఎంపీ పదవికి రాజీనామా చేయించడం ద్వారా.. పార్టీ ఆయనను నమ్ముతోందని మాధవ్ లో విశ్వాసం కలిగించడమే కాకుండా.. ఆయనకే టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామన్న హామీ ఇవ్వడం ద్వారా మాధవ్ ధిక్కార ధోరణిలో వ్యవహరించకుండా నియంత్రించడానికి అవకాశం ఉంటుందన్నది జగన్ యోచనగా చెబుతున్నారు. అదీ కాకుండా మాధవ్ రాజీనామా వల్ల అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీకే విజయావకాశాలు ఉంటాయని జగన్ గట్టిగా భావిస్తున్నారు. అందుకే మాధవ్ చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించి.. తద్వారా వచ్చే ఉప ఎన్నికలో ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకుని విపక్షాలకు చెక్ పెట్టాలనీ, అదే విధంగా పార్టీకి ప్రజలలో ఆదరణ తగ్గలేదన్నది చాటాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

తెలుగు రాష్ట్రాలకు వాయు ‘గండం’

తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండానికి తోడు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితన ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం (ఆగస్టు8) నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  అల్పపీడనం ప్రభావంతో   కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంట  గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తాయనీ,  మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.   ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆగస్టు 10 వరకు ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు ప్రకటించారు. ఇక తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయిందని అధికారులు చెప్పారు

తెలంగాణ తేజం నిఖిత్ జరీన్ కు స్వర్ణ పతకం

కామన్ వెల్త్ గేమ్స్ లో తెలంగాణ తేజం నిఖిత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. మహిళల బాక్సింగ్ 50 కేజీల విభాగంలో ఆమె ఐర్లండ్ కు చెందిన కార్లీ మెక్ నౌల్ పై విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. కామన్ వెల్త్ గేమ్స్ లోబాక్సింగ్ లో భారత్ కు ఇది మూడో స్వర్ణం కాగా బాక్సింగ్ ఈ వెంట్లో భారత్ కు ఇప్పటి వరకూ మొత్తం ఆరు మెడల్స్ వచ్చాయి. ఆదివారం రోజే నీతూ ఘంఘాస్, అమిత్ పంగల్ స్వర్ణ పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.  మొత్తంగా ఈ కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు17 పసిడి పతకాలు.  12 సిల్వర్, 19 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. మొత్తంగా 48 పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.  ఇక జరీన్ నిఖిత్ విషయానికి వస్తే ఆమెకు  ఈ సీజన్‌లో ఇది నిఖత్ సాధించిన మూడో గోల్డ్ మెడల్.మేరీ కోమ్ తర్వాత బాక్సింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకెళ్తున్న క్రీడాకారిణిగా నిఖత్ జరీన్ నిలిచింది.  నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నిఖత్ జరీన్‌కు అభినందనలు తెలిపారు.

కోవిడ్‌ను ప్ర‌స్థావించిన చైనా క‌వి లీయూ

అనాదిగా న‌మ్మ‌కాలే రాజ్యం చేస్తున్నాయి. యుగాల నుంచీ త‌త్వ‌వేత్త‌లు, త‌ప‌స్సంప‌న్నుల మాటే దాదాపు రుజువ‌వుతూ వ‌స్తోంది. చాలాకాలం నుంచి మ‌నం వింటున్న‌ది బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానం. అందులో ఖ‌చ్చితంగా చెప్పిన‌వాటిలో కొన్ని వాస్త‌ వాలు ఉండ‌వ‌చ్చు. కొన్ని జ‌రిగే ఉండ‌వ‌చ్చు. కానీ జ‌ర‌గ‌డం గ‌మ‌నించాన‌వారు ప్ర‌చారం చేయ‌డంలో కాస్తంత భ‌క్తి ఆవేశంతో అతిగా ప్ర‌చారం చేసి భ‌య‌పెట్ట‌డం వ‌ల్ల క్ర‌మేపీ అలాంటివి న‌మ్మ‌డం ప్ర‌జ‌ల్లో త‌గ్గింది. వంద‌లు, వేల‌యేళ్ల క్రిత‌మే లోకంలో జ‌రిగేవి, జ‌ర‌గ‌బోయే చిత్ర‌విచిత్రాలు, ఘోరాల‌న్నీ కూడా చాలా కొద్దిమంది చెప్పారు, గ్రంథ‌స్తం కూడా చేశారు. అలా పుస్త‌క రూపంలో ఉన్న‌వి అంత‌గా ఇప్పుడు ల‌భించ‌డం లేదు. కానీ కాల‌క్ర‌మంలో సాహిత్యంలో అలాంటివి కూడా చోటు చేసు కున్నా యి. చాలామంది జ్ఞానులు, క‌వులు, ర‌చ‌యిత‌లు రాసిన వాటిలో ఆయా కాలాల చ‌రిత్ర‌, కొన్ని చిత్ర విచిత్ర అంశా ల‌నూ తెలుసుకుంటున్నాము. ఇటువంటి అంశాల్లో చైనీయులు లోకం దృష్టిని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు.  ఇపుడు ప్ర‌పంచ‌దేశాలన్నింటినీ ఒణికిస్తున్న‌ది కోవిడ్ మ‌హ‌మ్మారి గురించి చైనా క‌వి లీయూ ప్ర‌స్తావించార‌న్న‌ది ఇటీవ‌ల బ‌య‌టప‌డింది. ఆయ‌న రాసిన ఒక ప‌ద్యంలో దీన్ని గురించిన‌ది ఉంద‌ని తెలిసింది. ఆయ‌న రాసిన ఒక ప‌ద్యంలో ఎలుక , పంది సంవత్సరాల మధ్య భయంకరమైన విపత్తు జరుగుతుందని అంచనా వేయబడింది. చైనీస్ రాశిచక్ర సంవత్సరాల ప్రకారం ఎలుక, పంది  సంవత్సరాలు 2019, 2020 అయినందున ఈ అంచనా కరోనావైరస్ మహమ్మారి  మూలానికి సమానంగా ఉంటుంది. ముఖ్యంగా, 2019లో చైనీస్ న్యూ ఇయర్ ఫిబ్రవరి 5. ప్రతి చైనీస్ సంవత్సరానికి ఒక జంతువు ప్రతీక.  2019 పంది సంవత్సరం. 2020లో, చైనీస్ న్యూ ఇయర్ జనవరి 25న వచ్చింది పైగా అది ఎలుకల సంవత్స రాన్ని ప్రారంభించింది.  పద్యం ఇంకా ఇలా చెబుతుంది..డ్రాగన్ , పాము సంవత్సరాలలో అన్నీ గడిచిపోతాయి. డ్రాగన్, పాము  చైనీస్ రాశిచక్ర గుర్తు లు వరుసగా 2024, 2025 సంవత్సరాలు. లియు ఒక తావోయిస్ట్ మాస్టర్, దానికి తోడు బాగా తెలిసిన, గౌరవప్రదమైన ప్రధాన మంత్రి. కొంతమంది విమర్శకులు బోవెన్ కవితను వ్రాసినట్లు రుజువు లేదని పేర్కొన్నారు. తన పాలనలో విపత్తులను రక్షించడానికి రాజకీయ సాధనంగా ఉపయో గించుకున్న గుర్తు తెలియని చక్రవర్తి ఈ పద్యం రచించాడని చాలామంది నమ్ముతారు. చక్రవర్తి ఈ పద్యం చట్టబద్ధత ఇవ్వ డానికి బోవెన్ రాసినట్లు పేర్కొన్నాడు. అతని అంచనా నిజమవుతుందో లేదో కాలమే నిర్ణ యిస్తుంది.

నిరాశ‌ప‌ర‌చిన ఇస్రో ప్ర‌యోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు తప్పుడు కక్ష్యలోకి వెళ్ళాయి. ఇస్రో నూతన రాకెట్ మొదటిసారి ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. అయితే ఇవి వృత్తాకార కక్ష్యలోకి వెళ్ళవలసి ఉండగా, దీర్ఘవృత్తా కార కక్ష్యలోకి వెళ్ళాయి. దీంతో ఇవి ఇక పనికిరావు. ఈ ప్రయోగం లక్ష్యాలు నెరవేరలేదు.  ఇస్రో ఆదివారం ఇచ్చిన ట్వీట్లలో తెలిపిన వివరాల ప్రకారం, ఇస్రో  కొత్తగా అభివృద్ధిపరచిన చిన్న ఉపగ్రహ వాహక నౌక (ఎస్ ఎస్ ఎల్ వి) తొలి ప్రయాణం తుది దశలో డేటా నష్టాలకు గురైంది. 145 కేజీల బరువున్న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓ ఎస్-02)ను, ఎనిమిది కేజీల బరువున్న ఆజాదీశాట్‌ను ఎస్ఎస్ఎల్‌వీ మోసుకెళ్ళింది. చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షం లోకి దూసుకెళ్లేలా ఎస్ఎస్ఎల్‌వీ డి-1ను ఇస్రో చాలా ప్రత్యేకంగా రూపొందించింది. 34 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్‌.. ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్తుంది. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్‌–2ఎ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌తో పాటు.. దేశంలోని 75 జిల్లా పరిషత్‌ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యా ర్థినులు తయారు చేసిన ఆజాదీ శాట్‌ను కూడా ఇందులో  ప్రయోగించారు. శ్రీహరి కోట నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ఈ రెండు ఉపగ్రహాల ప్రయోగం జరిగింది. అనంతరం 738 సెకండ్లకు, 788 సెకండ్లకు ఇవి ఎస్ఎస్ఎల్‌వీ నుంచి వేరుపడటంతో మిషన్ కంట్రోల్‌ రూమ్‌లో నిశ్శబ్దం ఆవరించింది. శాస్త్రవేత్తలు సమస్య ను గుర్తించారు. ఓ సెన్సర్ వైఫల్యాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత చేపట్టిన పరిష్కార చర్య పక్కదారి పట్టింది. ఓ కమిటీ దీనిని విశ్లేషించి, తగిన సిఫారసులు చేస్తుంది. ఈ రెండు ఉపగ్రహాలు ఇక ఉపయోగకరం కాదని వెల్లడైంది. 

16 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌.. హాకీ కాంస్యం ప‌ట్టిన భార‌త్‌

కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీజట్టు అదర గొట్టింది. కాంస్య పతకం కోసం నేడు (ఆదివా రం) న్యూజి లాండ్‌ తో జరిగిన పోరులో 2-1తో విజయం సాధించి 16 ఏళ్ల నిరీక్ష ణకు తెరదించింది. ఆస్ట్రేలి యాతో శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో మ్యాచ్‌లో అంపైర్ వివాదాస్పద నిర్ణ యం కారణంగా ఫైనల్స్‌కు చేరుకోలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు నేడు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అభిమానుల మనసులు దోచుకుంది. గేమ్ మరి కాసేపట్లో ముగుస్తుందనుకున్న సమయంలో గోల్ చేసిన న్యూజి లాండ్ స్కోర్‌ను సమం చేసింది. దీంతో పెనాల్టీ షూటవుట్ తప్పలేదు. ఇందులో న్యూజిలాండ్ ఒకే ఒక్క గోల్ సాధించగా, భారత్ రెండు గోల్స్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌ హాకీలో భారత్‌కు ఇది మూడో పతకం కాగా, చివరి సారి  2006లో పతకం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పతకం సాధించి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.  భారత మహిళల హాకీ జట్టు షూటౌట్‌లో 2-1తో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌ను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది ఆదివారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తన ప్రాభ‌వాన్ని గొప్ప‌గానే ముగించింది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఎల్దోస్పాల్ , అబ్దుల్లా అబూబకర్ ద్వారా భారత్ చారిత్రాత్మక స్వర్ణం మరియు రజతాన్ని కూడా గెలుచుకుంది. భారత బాక్సర్లు నీతూ ఘంఘాస్ మరియు అమిత్ పంఘల్ వరుసగా మహిళల 48 కేజీలు, పురుషుల 51 కేజీలలో స్వర్ణాలు గెలుచుకు న్నారు, చివరి రోజు కూడా భార‌త్ ప‌త‌కాల ప‌రుగు కొనసాగింది.

బాబు సీఎం కావాల‌ని కృష్ణ సైకిల్ యాత్ర‌

మాయాబ‌జార్ చూడ్డానికి బండ్లు క‌ట్టుకుని థియేట‌ర్లకు వెళ్లారు, శ్రీ‌కృష్ణ‌తులాభారం చూడ్డానికి ఒకాయ‌న ఊరుగాని ఊళ్లో మూడు రోజులు ఉండిపోయాడు, స‌చిన్ సెంచ‌రీకోసం పూజ‌లు చేశారు, ధోనీ క‌ప్పుకొట్టాల‌ని దేవుళ్ల‌ని మొక్కుకున్నారు, చిరంజీవి సినిమా కోసం క‌టౌట్ల గొడ‌వ‌ల్లో ఆస్ప‌త్రిపాల‌య్యారు, టిడీపీ అధికారంలో వ‌చ్చింద‌ని ఒకాయ‌న వూరంతా స్వీట్లు పంచారు. అదుగో అంత‌టి వీరాభిమాని కృష్ణ త‌న అభిమాన నాయ‌కుడు నారా చంద్ర‌బాబు అధికారంలోకి రావాల‌ని సైకిల్ యాత్ర చేస్తూ హైద‌రాబాద్ చేరుకున్నాడు. ఇది న‌ర‌న‌రాల ఉన్న వీరాభిమానం. స్వ‌త‌హాగా వ‌చ్చినది, దీనిలో క‌ల్తీ ఉండ‌దు. అది చంద్ర‌న్న పాల‌న ప్ర‌భావం. ఇది ఇప్పుడు వీస్తున్న గాలి. అంద‌రూ తెలుగు దేశంపార్టీ అధికారంలోకి రావాల‌నే కోరుకుం టున్నారు. చంద్ర‌న్నపాల‌న‌లో మ‌ళ్లీ కాలం గ‌డ‌పాల‌నుకుంటున్నారు. జిల్లాల్లో అనేకానేక‌మంది  జ‌గ‌న్‌కు అవ‌కాశం ఇచ్చి పొర‌ పాటు చేశామ‌నే అనుకుంటున్నారు.  కరాచి కృష్ణ  అనే అభిమాని ప్రజా చైతన్య సైకిల్ యాత్ర పేరుతో ఈ యాత్ర చేపట్టారు. 26 జిల్లాల్లో చేపట్టిన ఈ యాత్ర ఆదివారం రావుల పాలెం చేరుకుంది. ఈ సందర్భంగా కృష్ణకు రావులపాలెం మండలం, టీడీపీ అధ్యక్షుడు గుత్తల రాంబాబు, అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు సతీష్ రాజు ఘనస్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో అవకతవకలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈసారి ప్రత్యేకంగా స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ను ప్రస్తావించారు. ఎటువంటి వివరాలు లేకుండా పిడి (వ్యక్తిగత డిపాజిట్) ఖాతా (ఎస్‌డిసి) నుండి రూ. 10, 895.67 కోట్లు (మూడు వేర్వేరు బిల్లుల ద్వారా) డ్రా చేసిన‌ట్టు పిఎజి ఎత్తి చూపింది. అన్ని ప‌థ‌కాల అమ‌ల్లోనూ తప్పిదాలతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొట్టికాయ‌లు వేయించుకుంది. రాజ‌ధాని విష‌యంలోనూ ప్ర‌జ‌ల ఆశ‌లు దెబ్బ‌తిన్నాయి. మూడు రాజ‌ధాను ల‌ని అంద‌ర్నీ సందిగ్ధంలో ప‌డేసి, చివ‌రికి అస‌లు హోదా కూడా రావ‌డం కూడా క‌ష్ట‌మ‌న్న‌ది కేంద్ర‌మే తేల్చేసింది. ప్ర‌జ‌ల్ని ఇంకా మ‌భ్య‌పెట్ట‌డానికి ఎంపీలు మాత్రం హోదా అవ‌కాశాలున్నాయ‌ని చె్పిస్తున్నారు. ఇవ‌న్నీ ప్ర‌జ‌లు గ‌మ‌నించి, విని విసిగెత్తారు. త‌మ పొర‌పాటు గ్ర‌హించి మ‌ళ్లీ చంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వాన్ని కోరుకుంటున్నారు.  కరాచి కృష్ణ సైకిల్ యాత్ర విజయవంతం కావాలని, 2024లో చంద్రబాబు సీఎం కావాలని రావుల పాలెం టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తాను చేస్తున్న సైకిల్ యాత్రకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోందని, ఎంతో మంది మహిళలు, తనలో స్ఫూర్తి నింపుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తన సైకిల్ యాత్ర ఆగదని, అంతవరకు తన ఇంటికి కూడా వెళ్లనని స్పష్టం చేశారు. జూన్ 29న మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు చేతుల మీదుగా ఈ యాత్ర ప్రారంభమైనట్లు కృష్ణ తెలిపారు.

టిఆర్ ఎస్‌కు ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రాజీనామా

తెలంగాణాలో సోద‌రుల‌కు ఏమ‌వుతున్న‌దో తెలీదు. మొన్న‌నే కాంగ్రెస్ నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యారు. కార‌ణాలు, లెక్క‌లు ఎలా ఉన్నా తాజాగా టీఆర్ ఎస్ నుంచి ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు బ‌య‌ట‌ప‌డ్డారు. ఆయ‌న పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఒకాయ‌నేమో మునుగోడు ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు కోస‌మే చేశాన‌న్నాడు. ఈయ‌నేమో త‌న‌కు అస‌లు పార్టీలో గుర్తింపేలేద‌న్న వేద‌నతోనే రాజీనామా చేశాన‌న్నారు. ప్ర‌జాసేవ‌కు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి టీఆర్ ఎస్‌లో నిస్వా ర్ధంగా ఇన్నాళ్లూ చేసిన సేవ‌కు క‌నీస గుర్తింపు కనీస గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండి ఏం లాభమని, సంస్కారం లేని నాయ కులకు ప్రజలే బుద్ధి చెప్తారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదని, వరంగల్ తూర్పు ప్రజలతో కలిసి ముందుకు నడుస్తానని ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు 7న రాజీనామా చేస్తానని ముందే చెప్పిన ప్రదీప్ రావు టీఆర్‌ఎస్‌ను నమ్ముకుంటే ఏమీ జ‌ర‌గ‌ద‌ని, అందుకే ఆ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ముందే స్పష్టం చేశారు. వరంగల్‌లో తన నివాసంలో ఇటీవ‌ల‌ ఆయన వరంగల్‌తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అనుచ రులతో సమవేశంలోనే త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చివరికి తనను నమ్ముకున్న కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టించే పరి స్థితులు వచ్చాయని, ఇంత జరుగుతున్నా అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని పేర్కొన్నారు.  ఉద్య‌మ‌స‌మ‌యంలో, త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కూ పార్టీని, అధిష్టానాన్నీ న‌మ్మ‌కున్నందుకు త‌న‌కు అవ‌మానాలే త‌ప్ప ఆద‌ర‌ణ లభించలేద‌ని ఇక ఆద‌రించే పార్టీలో చేరాల‌నుకుంటున్నామ‌ని ప్ర‌దీప్‌రావు అన్నారు. ప్రదీప్‌రావు టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు వార్తలు రావడంతో  ఆయ‌న్ను బుజ్జ‌గించేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ దూత‌లుగా  ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మెట్టు శ్రీనివాస్  ప్రదీప్ నివాసానికి వెళ్లి మాట్లాడారు. పార్టీ మారవద్దని బుజ్జగించే యత్నం చేశారు. అంతేకాకుండా, సీఎం కేసీ ఆర్ మాట్లాడించేందుకు ప్ర‌య‌త్నించినా ప్రదీప్ రావు మాట్లాడలేదని తెలి సింది. ప్రదీప్ రావు నుంచి ఎలాంటి సానుకూల స్పం దన రాకపోవడంతో సారయ్య, శ్రీనివాస్‌ వెనుదిరిగారు. చెప్పినట్టుగానే ఆగస్టు 7న ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామా చేశారు.