మరో మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
posted on Aug 6, 2022 7:55AM
తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే భారీ వర్షాలతో తడిసి ముద్దైన తెలంగాణను మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 9 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కుండపోత వర్షాలు, మరి కొన్ని జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామా బాద్, ఖమ్మం, సూర్యాపేట, పెద్దపల్లి, ఉమ్మడి వరంగ్ జిల్లలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అలాగే అటు ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, సిద్ధిపేట, జనగాం, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది