ఆశకూ అంతుండాలి జగన్
posted on Aug 6, 2022 @ 11:27AM
మంచి నాయకునికి ప్రజలు నీరాజనాలు పలుకుతారు. మంచి ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఉండాలనే కోరు కుంటారు. ప్రజలకు కావలసింది వారి సంక్షేమ కార్యక్రమాలు, ఆపదల్లో ఆపన్నహస్తం తప్ప మరేమీ అక్క ర్లేదు. వాటి విషయంలో నమ్మకం కలిగించినవారు, పథకాల అమలు సక్రమంగా అమలు చేస్తూ ప్రజల ఆరోగ్య, సంక్షేమానికి నిరంతరం కృషి చేసే నాయకులు, ప్రభుత్వాలనే మళ్లీ గెలిపించాలనే అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఇందుకు పూర్తి భిన్నంగా మారింది. పాలనా కాలం సగం దాటిన తర్వాత ప్రజలు విసిగెత్తారు. ఏ మాత్రం మళ్లీ ఈ ప్రభుత్వమే ఉండాలని కోరు కోవడం లేదు. కానీ సీఎం జగన్ మాత్రం మరో ముప్పయ్యేళ్లు అధికారంలో ఉండగలమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైసీసీ కార్య కర్తలతో ఆయన సమావేశమ య్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల్లో 95 శాతం నెరవేర్చినందునే గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లగలుగతున్నామని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో చరిత్రను తిరగరాద్దామనీ పార్టీ వర్గాలను ఉత్సాహపరుస్తున్నారు.
కానీ, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. అధికారంలోకి వచ్చే వరకూ ఇచ్చిన హామీలు, ప్రదర్శించిన నమ్మకాన్ని ఆ తర్వాత అంతా నీరుగార్చారు. మొదట ఆవేశపడిన వారంతా క్రమేపీ అన్నీ తామే అనే భావనలో పడి అన్ని రంగాల్లోనూ విఫలమై మూడేళ్లు లాగించేశారు. ఇక మిగిలిన కాలంలో ఎంత పట్టుద లతో పనిచేయాలనుకున్నా ఎన్ని మాటలు చెప్పినా ప్రజల ముందు నిలవలేని స్థితిలోకి ప్రభుత్వం పడి పోయింది. కేవలం రాజకీయాలు చేయడానికి, ప్రతిపక్షాన్ని, నాయకులను అవమానించడం, వేధించ డం తప్ప చేసిందేమీ లేదన్నది ప్రజలు గమనించారు. ప్రకటించిన పథకాల అమలులో లోపాలు, జాప్యా లతో చేయదగ్గ పనులు కూడా చేయలేక చచ్చుబడింది వైసీపీ సర్కార్. పరిస్థితులు చేజారి పోయాయని మంత్రివర్గంలో తీసుకున్న మార్పుల వల్లా పెద్దగా ప్రయోజనమేమీ లేకపోయింది. ఇక కాలం ముగియ నుండగా ఇపుడు ప్రజల వద్దకు మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి తమ పాలన ఎలా ఉంది, మీరంతా బాగు న్నారా, అన్నీ అందుతున్నాయా, పథకాల ఫలాలు అందుకుంటున్నారా వంటి ప్రశ్నా పత్రాలతో అన్ని నియోజకవర్గాల్లోనూ తిరుగుతూన్నారు. గడప గడపకు అనే పేరుతో వీరంతా వెళ్లిన ప్రతీ ప్రాంతంలోనూ ప్రజలు తీవ్ర అసంతృప్తి, తీవ్ర నిరసనా వ్యక్తం చేస్తున్నారేగాని ఏ ఒక్క ప్రాంతం లోనూ మీ పాలన బాగుం ది, మరింత కాలం ఉండాలని ఏ ఒక్కరూ అన్నపాపాన పోలేదు. దీన్ని బట్టే ప్రభుత్వం ఏ స్థాయికి పడి పోయిందనేది అంచనా వేయవచ్చు.
ఇటీవలి భారీ వర్షాలు, గోదావరి వరదల ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో వారికి చేయవలసిన సహాయం ప్రభుత్వం అంతగా చేయలేద న్నది సమాచారం. ప్రభుత్వం కల్పించు కుని చేసింది చాలా తక్కువ. ఇంతటి అవమానాలు ఎదు ర్కొనలేక, సీఎంకి ఉన్నపరిస్థితులు వివరించి ప్రజలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు, మంత్రులు నానా అవస్థా పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ తమకు ప్రజల నుంచి మంచి మద్దతు ఉందని అనుకోవడమే అమాయకత్వం అని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల మనసుపై వ్యతిరేక ముద్ర వేసింది తప్ప వారి అభిమానాన్ని చూరగొనలేదు. ఇంత దారుణమైన పాలనను ఎన్న డూ చూడలేదన్న మాట ప్రజల నుంచే వినపడు తోంది. ఈ పరిస్థితుల్లో జగన్ ఇప్పటికీ తమ ప్రభుత్వం మరో ముప్పయి యేళ్లు అధికారంలో ఉంటుందని చెప్పడం హాస్యాస్పదం.