ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వక తప్పదు. తాజాగా ఆయన తన అస్తుల వివరాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. ప్రధాని మోడీ పేరిట స్థిరాస్థులేవీ లేవు. ఆయన ఆస్తులన్నీ బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. ఆయన వెబ్ సైట్లో పొందుపరిచిన  వివరాల మేరకు మోడీ పేర ఉన్న మొత్తం ఆస్తుల విలువ 2.23 కోట్ల రూపాయలు. గాంధీనగర్ లో గతంలో మోడీ పేర కొంతభూమి ఉండేది.దానికి ఆయన దానం చేసి మరో ముగ్గురితో కలిసి యాజమాన్య హక్కలు పంచుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆ భూమికి యజమానిని కాదనీ, తన భాగాన్ని కూడా విరాళంగా ఇచ్చేశాననీ తెలిపారు. ఇక మోడీ చేతి లో ఉన్న నగరదు 35వేల 250 రూపాయలు. ఇక పోస్టాఫీసులో తీసుకున్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ల విలువ  రూ.9,05,105లు, ఇంకా లక్షా 89 వేల రూపాయలు విలువ చేసు బీమా పాలసీ మోడీ పేరుపై ఉన్నాయి. ఇవి కాకుండా ఆయనకు లక్షా 73 వేల రూపాయలు విలువ చేసే నాలుగు ఉంగరాలు ఉన్నాయి. మోడీ వెబ్ సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఆయన పేరు మీద ఎలాంటి వాహనం లేదు. 

బరితెగించిన వైసీపీ.. మీడియా సమావేశంలో ఉన్న అనితకు బెదరింపు కాల్

 వైసీపీ బరితెగించేసింది. ఒక సమావేశంలో  మాట్లాడుతుండగానే  తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు అనితకు బెదరింపు కాల్ వచ్చింది.మంగళవారం (ఆగస్టు 9)న  విజయవాడలో  మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి అనిత హాజరయ్యారు. ఈ సమావేశం జరుగుతుండగానే అనితకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఎత్తిన అనితకు గోరంట్ల మాధవ్ విషయంలో ఎక్కువ మాట్లాడవద్దంటూ బెదరింపులు ఎదురయ్యాయి. దీంతో ఆమె కూడా తాను వాస్తవాలనే చెబుతున్నానని సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా  ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఆ బెదరింపులను అందరికీ వినిపించారు. తనకు 9848075369 నంబర్ నుంచి కాల్ వచ్చింది. ట్రూకాల్ ఆధారంగా ఆ వ్యక్తి పేరు జి. మద్దిలేటి అన తెలిసిందన్నారు. ఆ వ్యక్తి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గురించి ఎక్కువగా మాట్లాడవద్దంటూ బెదరించాడు. అంతే కాకుండా మాధవ్ నిప్పు అని వ్యాఖ్యానించాడు. ఇష్టారీతిగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. కాగా ఒక సమావేశంలో ఉండగానే తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు అనితకు బెదరింపు కాల్ రావడం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు.   వంగలపూడి అనిత  సమావేశంలో ఉండగా, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంలో స్పందించవద్దంటూ ఓ వైసీపీ నేత ఫోనులో ఆమెను బెదిరించాడని చంద్రబాబు ఆరోపించారు. వాళ్ల ఎంపీ చేసిన తప్పుడు పనిని కప్పిపుచ్చడానికి వైసీపీ పెద్దలు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో దీనిని బట్టే అర్థమవుతోందని పేర్కొన్నారు. వారెంతగా బరితెగించారో బెదరింపు ఫోన్ కాల్ ను బట్టి అవగతమౌతుందని చంద్రబాాబు అన్నారు. ప్రభుత్వ దారుణాలపై, వైసీపీ నేతల అకృత్యాలపై మాట్లాడకూడదంటూ బెదరించడం హక్కులను హరించడమేనని ఆయన అన్నారు. అనితకు బెదరింపు కాల్ ను తాము ఖండిస్తున్నామనీ, ఒక మహిళా నేతకే ఇలా బెదరింపులు వస్తున్నాయంటే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలని అన్నారు. దీనిపై పోలీసులు చర్య తీసుకోరా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ రెడ్డి ఆదేశాలు వచ్చేంతవరకు అన్నింటినీ చూస్తూ కూర్చోవడమే పోలీసుల పని అన్నట్టుగా తయారైందని విమర్శించారు.

ఇపుడు వీస్తున్న గాలి.. దేశ‌భ‌క్తి !

అధికారం చేజిక్కించుకోవ‌డానికి పోటీ ప‌డే రాజ‌కీయ పార్టీలు హ‌ఠాత్తుగా దేశ భ‌క్తి లో ఎవ‌రు గొప్ప అనేది తేల్చుకోవ‌డంలో ప‌డ్డాయి. కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం అనేక సందర్భాల్లో వారిదే అస‌లు సిస‌లు దేశ‌భ‌క్తి అంటూ ప్ర‌క‌టించ‌డం ప‌రిపాటిగా మారింది.  దేశభ‌క్తి దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఉంటుంద‌ని బీజేపీ వారు ఒక్క‌రే దేశ‌భ‌క్తులుగా భావించ‌డం, కాషాయంలో మునిగితేల‌డం, ప్ర‌జ‌లంద‌రినీ అదే రంగులో ప్ర‌యాణిం చేలా ఉత్తేజితుల‌ను చేయ‌డానికి క‌స‌ర‌త్తులు చేయ‌డం మాత్రం దేశ‌భ‌క్తి కాద‌న్న‌ది విప‌క్షాల మాట‌.  కాలం మారినా, రాజ‌కీయాలు మారినా, సిద్ధాంతాల ప‌రంగా ఒక‌రికి  ఒక‌రు ప‌డ‌క‌పోయినా  దేశ‌మంత‌టా అంద‌రూ గౌర‌వించేది మ‌హాత్మాగాంధీనే. ఎందుకంటే ఆయ‌న మ‌హాత్ముడు గ‌నుక‌. కాంగ్రెస్ అంటే బొత్తిగా ప‌డ‌ని టీఆర్ ఎస్ కూడా ఇపుడు కాంగ్రెస్ మాయ‌లో ప‌డింద‌నే అనుమానాలూ వ‌స్తున్నాయి. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ  తెలంగాణా రాష్ట్ర‌మంత‌టా ఎంపిక చేసిన 522  సినిమా థియేట‌ర్ల‌లో  గాంధీ సినిమా ప్ర‌ద‌ర్శన‌కు టీ ఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ  సినిమా ఆగ‌ష్టు తొమ్మిది నుంచి 22వ తేదీ వ‌ర‌కూ ప్ర‌ద‌ర్శిస్తారు. ప్ర‌తీరోజు ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి మ‌ధ్యాహ్నం 1.15 నిమిషాల వ‌ర‌కూ ప్ర‌ద‌ర్శిస్తారు.  బెన్ కింగ్‌స్టే గాంధీగా న‌టించిన అట‌న్‌బొరో చిత్రం ఇది. దేశ‌మంత‌టా బ్ర‌హ్మాండంగా  కాబోయినా  చాలా మందిని ఆక‌ట్టుకుంది ఈ  చిత్రం. ముఖ్యంగా బెన్ కింగ్‌స్లే  గాంధీ పాత్ర‌లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేశాడు. ఆయ‌న  కోస‌మే సినిమాకి జ‌నం వెళ్లారు.  అయితే ఈ చిత్రం బ్రిటీష‌ర్లు దేశానికి మ‌హామేలు చేశార‌న్న ప్ర‌స్థా వ‌న మ‌ళ్లీ తెలియ జేయ‌డమే ప్ర‌ధానంగా ఈ చిత్రం వ్య‌క్తం చేసింద‌నేది  చాలామంది విమ‌ర్శ‌కుల మాట‌.  కేంద్రంలో స్వాతంత్య్ర‌దినోత్స‌వ వ‌జ్రోత్స‌వాల‌ను నిర్వ‌హించే స‌మ‌యంలోనే ఇక్క‌డ తెలంగాణాలోనూ కేసీఆర్ అందుకు పోటీగా నిర్వ‌హించ‌డం త‌న దేశ‌భ‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌మే అయింది. బీజేపీ ప‌ట్ల త‌న విము ఖత‌ను మ‌రింత  స్ప‌ష్టం చేయ‌డానికే కాంగ్రెస్ కు మ‌ద్ద‌తుగా మునుగోడు లో అభ్య‌ర్ధిని నిల‌బెట్ట‌డం లేదు.  రాష్ట్ర అవ‌స‌రాలాను, అభ్య‌ర్ధ‌న‌ల‌ను బొత్తిగా ప‌ట్టించుకోని కేంద్రం మాట విన‌క్క‌ర్లేద‌న్న ధోర‌ణినే టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం వ్యక్తం చేస్తోంది. టీఆర్ ఎస్ నాయ‌కులు, మంత్రులు అవ‌కాశం దొరికిన వేదిక‌ల మీద మోదీ ప్ర‌భుత్వం మీద‌, బీజేపీ పార్టీ మీద విరుచుకుప‌డుతున్నారు. దేశ భక్తి అంటే కేవ‌లం బీజెపీ ఓవ‌రాక్ష‌న్‌తో వ్య‌వ‌హ‌రించ‌డ‌మేకాద‌ని దేశ‌భ‌క్తి త‌మ‌కూ ఉంద‌ని టీఆర్ ఎస్ ప్ర‌క‌టించ‌డానికే ఇపుడు రాష్ట్రంలో గాంధీ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు పూనుకుంది. 

బీహార్ సీఎం రాజీనామా.. కుప్పకూలిన ఎన్డీయే సర్కార్

బీహార్ లో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలింది. ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో బీజేపీ-జూడీయూ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అంద జేశారు.  ఇక జేడీయూ, ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ నితీష్ కుమార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. రాష్ట్రంలో జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా నితీష్ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. మళ్లీ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  నితీష్ కుమార్ రాజీనామాతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చినట్లైంది.  కాగా గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన రాజ్‌భవన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందంటూ జేడీయూ  లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభ్యులు చెప్పారనీ,  వారి నిర్ణయం మేరకే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పారు.  భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. రాజీనామా చేసిన అనంతరం నితీష్ రాజ్ భవన్ నుంచి  నేరుగా మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసానికి బయలుదేరి వెళ్లారు.  దారి పొడవునా ఆయనకు ఆర్జేడీ-జేడీయూ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు   స్వాగతం పలికారు. రెండు పార్టీలకు చెందిన జెండాలను పట్టుకుని హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. రబ్రీ దేవి నివాసంలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌తో నితీష్ కుమార్ భేటీ అయ్యారు.   ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై చర్చించారు.  ఇలా ఉండగా మంగళవారం నాడే ( ఆగస్టు9) నితీష్ కుమార్ మరోసారి గవర్నర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఆర్జీడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారని చెబుతున్నారు. రాజీనామాకు ముందే నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఫోన్‌లో సంభాషించారు. పొత్తు విషయాన్ని నిర్ధారించుకున్నారు. పొత్తు ఖరారైన తరువాతే నితీష్ కుమార్ రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. ఎన్డీఏ నుంచి బయటికి వస్తే తాము మద్దతు ఇస్తామంటూ ఆర్జేడీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి విదితమే. . బీజేపీయేతర ప్రభుత్వం గనక ఏర్పాటైతే తాము బేషరతుగా మద్దతు ఇస్తామని బీహార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజిత్ శర్మ సైతం తెలిపారు.  

మంత్రి రోజా.. ఓ బెంజి కారు.. పలు వివాదాలు!

మంత్రి రోజా కొత్త బెంజి కారు ఇప్పుడు రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లకు వేదిక అయ్యింది. ముచ్చటపడి కుమారుడికి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం రోజా కొన్న బెంజి కారు ఆమెకు ఇప్పుడు కొత్త తలనొప్పులు తీసుకువచ్చింది.  ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు పెట్టింది పేరైన రోజా ఇప్పుడు కోటిన్నర బెంజ్ కారు విషయంలో విమర్శకులకే కాదు సొంత పార్టీలోని ప్రత్యర్థులకు సైతం వివరణ ఇచ్చుకోవలసిన దుస్థితిలో పడ్డారు. కోటీ యాభై లక్షల రూపాయలు పెట్టి రోజా కొన్న కొత్త మెర్సిడీస్ బెంజ్ కారు.. ఆమెను మరోసారి వివాదాల సుడిగుండంలోకి లాగింది.   బెంజ్ కారును కొనడాన్ని ఏకి పారేస్తూ మంత్రిగా రోజా ‘సంపాదన’ చూస్తుంటే కలెక్షన్ క్వీన్ రోజా అనాల్సి వస్తుందని తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తోంది. అయితే తెలుగుదేశం విమర్శలను రోజా కొట్టి పారేస్తున్నారు. నేనేమిటి.. నా లెవెల్ ఏమిటి? అంటూ విమర్శకులను దనుమాడేస్తున్నారు. అయితే ఆమె 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ కు ఇప్పుడు ఆమె కొన్న కారు ఖరీదుకు పొంతన ఎక్కడుందని తెలుగుదేశం వాళ్లే కాదు, నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు. అఫిడవిట్ లో రోజా తన పేరు మీద  రూ.7,38,38,430 ఆస్తి ఉందని అందులో   స్థిరాస్తి రూ.4,64,20,669.. చరాస్తి రూ. 2,74,17,761 ఉందని పేర్కొన్నారు. ఇక అప్పులు  .49,85,026లుగా రోజా తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.   భర్త సెల్వమణి పేరుతో ఎలాంటి స్థిరాస్తి లేదని.. చరాస్తి రూ.58,02,953.. అప్పులు రూ.22,00,000 ఉన్నట్లు చూపించారు. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: 58,80,000 కాగా   కుమార్తె అనూష, కుమారుడు కృష్ణ కౌశిక్‌ పేరుతో   రూ.50,56,191 డిపాజిట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. అయితే ఆమె జబర్దస్త షోల్లో కానీ, ఇతరత్రా స్పెషల్ షోలలో కానీ.. ఒక్క సినిమా తీసి ఎంతగా నష్టపోయానో... అప్పుల పాలయ్యానో కన్నీటితో వివరించి.. ఆ అప్పలు తీర్చడానికి ఎంత కష్టపడ్డానో చెబుతూ ఉంటారు. అటు వంటి రోజా కుమారుడికి గిఫ్ట్ గా మెర్సిడీస్ బెంజ్ కారు అదీ కోటీ యాభై లక్షలు పెట్టి ఎలా కొనగలుగుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం నిలదీస్తోంది. అయితే ఈ ప్రశ్నలను, నిలదీతలనూ ఖండిస్తూ రోజా చెబుతున్న సమాధానం మాత్రం పొంతన లేకుండా ఉంది. మెర్సిడీస్ బెంజ్ కారు కొనడానికి ముందే ఆమె వద్ద ఏడు కార్లు ఉన్నాయి. అవి మహీంద్రా, ఫోర్డ్‌ ఇండీవర్‌, చావర్‌లెట్‌, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్‌, హూండా స్ల్పెండర్‌, మహీంద్రా స్కార్పియో ఉన్నాయన్నారు. ఈ కార్ల విలువ రూ.1,08,16,564 ఉంటుందని కూడా రోజా అఫిడవిట్ లో పొందు పరిచారు. అటువంటప్పుడు  స్థిరాస్థులను కదపకుండా.. అప్పు చేయకుండా కోటీ 50లక్షల రూపాయలు వెచ్చించి అంత ఖరీదైన కారును కుమారుడికి గిఫ్ట్ ఇవ్వడం కోసం ఎలా వెచ్చించారన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నకు రోజా పొంతన లేని సమాధానం ఇస్తుండటంతో.. కలెక్షన్ క్వీన్ రోజా అంటూ తెలుగుదేశం సెటైర్లు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. ఇక ఖరీదైన బెంజి కారు విషయంలో విమర్శల కన్నా సొంత పార్టీలో కూడా అనుమానాలు పొడ సూపడమే రోజాకు పెద్ద ఇబ్బందిగా తయారైందని అంటున్నారు. అందుకే ఆమె ముందుగా విమర్శలకు సమాధానం చెప్పడం కంటే తాను బెంజ్ కారు కొనుక్కోవడం వెనుక ‘అమాత్య’ సంపాదన ఏదీ లేదని సహచర మంత్రి పెద్ది రెడ్డికి వివరణ ఇచ్చుకున్నారని చెబుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే.. సినిమా నటిగా, ఆ తరువాత జబర్దస్త్ వంటి కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన ఆమె బెంజ్ కారు కొనుక్కోవడం పెద్ద విషయంగా రచ్చ అవ్వడానికి ఆమె తన ఆస్తులు, అప్పుల గురించి, తాను ఎదుర్కొన్న ఆర్థిక కష్టాల గురించీ అవకాశం వచ్చిన ప్రతి సారీ కన్నీటితో ఇచ్చిన వివరణలే కారణమని చెప్పవచ్చు. అదీ కాక గతంలో జనసేనాని ఖరీదైన కారు కొనుగోలు చేసిన సందర్బంలో ఆమె  చేసిన విమర్శలు కూడా కారణమే. నాడు ఆమె చేసిన విమర్శలే ఇప్పుడు బూమరాంగై ఆమెకు తగులుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా బెంజ్ కారు విషయంలో ఆమెపై వస్తున్న విమర్శలకు వస్తున్న స్పందన ఆమె వివరణ కు రావడం లేదు. అసలు జనం ఆమె వివరణలను పట్టించుకోవడమే లేదు. పర్యాటక మంత్రిగా బెంజ్ కారు ఆమెకు ‘రిషికొండ’ గిఫ్ట్ అన్న విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా మంత్రి పదవి చేపట్టిన తొలి రోజు నుంచే ఆమె క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసేశారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అత్యాచారాలను నియంత్రించడంలో రాష్ట్ర సర్కార్ విఫలం అన్న విమర్శలు వెల్లువెత్తిన సందర్బంగా ఇంత రాష్ట్రంలో ఓ రెండు రేపులు రేపులా అని రోజా చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఒక మంత్రికి కోటిన్నర ముడుపులు ఓ ముడుపులా అని రోజా భావిస్తున్నారని   నెటిజన్లు ఆమె సంపాదనపై సెటైర్లు వేస్తున్నారు. రోజాకు తెలిసినట్లుగా సమయం విలువ మరెవరికీ తెలియదనీ, అందుకే మంత్రి పదవి రాగానే   కలెక్షన్లు ప్రారంభించేశారనీ కూడా విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. ఇక అధికారం ఉండేదే రెండేళ్లు.. ఇప్పుడు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే తరువాత పరిస్థితి ఏమిటో, మరో సారి అధికారం దక్కుతుందో దక్కదో అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా రోజా వ్యవహరిస్తున్నారని సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.

నీతిష్ బ‌లం తేజ‌స్వీయాద‌వ్‌!

సైద్ధాంతిక సారూప్య‌త లేని పొత్త‌లు దీర్ఘ‌కాలం మ‌న్న‌వు. ఇదే బీహార్‌లో బీజెపీ ఎదుర‌యిన అనుభ‌వం.  ఇన్నాళ్ల బీజేపీ పొత్తును కాదు పొమ్మ న్నారు బీహార్ ముఖ్య‌మంత్రి నీతిష్. 2017లో లాలూ అవి నీతిని ఎత్తిచూపుతూ సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగి, బీజేపీతో జతకట్టిన జేడీయూ 2020 ఎన్నికల్లో లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా బరిలోకి దిగింది. ఎన్డీయే కూటమికి మెజారిటీ స్థానాలు వచ్చినా, జేడీయూగా మాత్రం బారీగా నష్టపోయి కేవలం 43 సీట్లకు పరిమితమైన‌ప్ప‌టికీ  బీజేపీ మాత్రం నీతిష్‌నే ముఖ్య మంత్రిని చేసింది. కానీ ప‌రిస్థితులు ఇపుడు ఊహించ‌ని మ‌లుపు తిరిగాయి.  జేడీయు ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో మంగ‌ళ‌వా రం(ఆగ‌ష్టు 9) స‌మావేశ‌మ‌యిన నీతిష్ బీజెపీ క‌టీఫ్ చెప్ప‌డా నికి నిర్ణ‌యించుకు న్నారు. బీహార్ గ‌వ‌ర్న‌ర్ చౌహాన్‌తో స‌మావేశం కావ‌డం ఒక్క‌టే మిగిలింది. కాగా బీహార్ అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఉన్న లాలూ యాద‌వ్ జెడీ యు కూడా స‌మావేశ‌మై బీహార్ రాజ‌కీయ ప‌రిణామాల గురించి చ‌ర్చించింది. బీజెపీతో తెగ‌తెంపులు చేసుకోనున్న నీతిష్‌తో చేతులు క‌లిపేందుకు ఆస‌క్తి ప్ర‌క టించింది. ఈ స‌మావేశంలో కాంగ్రెస్ నాయ‌కులు కూడా పాల్గొని త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ కూడా నీతిష్‌నే ముఖ్య‌మంత్రిగా ఆశిస్తున్న‌ది.  ఇదిలా ఉండ‌గా, అటు బీజేపీ కూడా  గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి బీహార్‌లో మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల మీద కూలంక‌షంగా చ‌ర్చించేందుకు స‌మాయ‌త్త‌మ‌ యింది.  ఇటీవ‌ల తేజ‌స్వి యాద‌వ్‌తో దోస్తానా ధైర్యంతోనే నీతిష్ కుమార్ బీజేపీతో క‌టీఫ్ అన్నారు. బీహార్‌లో క‌లిసి మ‌రోసారి ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధ‌ప‌డిన బీజెపీకి నీతిష్ ఊహించ‌ని షాక్ ఇచ్చారు. 2015 నుండి 2017 వరకు, వారి పార్టీలు ,కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములుగా  ఉన్నాయి. ఆ తర్వాత నితీష్‌ కుమార్‌ దాని ని విరమించుకున్నారు. ఆ తర్వాత నితీష్ కుమార్ బిజెపితో తిరిగి కలిశారు. కానీ  పైన పేర్కొన్న కాలం మినహా వారికి దీర్ఘకాల భాగస్వామ్యం ఉంది. బిజెపితో వ్యవహారాలు అకస్మాత్తుగా బ్రేక్ పాయింట్‌కి చేరుకున్నాయి కానీ తేజస్వి యాదవ్‌తో తెరవెనుక కుట్రలు ఈ కేసుల ద్వారా ఉద హరించబడ్డాయి. మే లో తేజ‌స్వీయాద‌వ్ త‌న నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకి వెళ్లిన నీతిష్ ఆయ‌న‌తో క‌లిసి కొంత స‌మ‌యం గడిపారు. ఇఫ్తార్ అనేది ఉప‌వాస దీక్ష ముగించ‌డాన్నిసూచిస్తుంది. బీహార్ ముఖ్య‌ మంత్రి 72 ఏళ్ల నీతిష్ కేవ‌లం ఆ విందులో పాల్గొన‌డానికే వెళ్లారు. కానీ ఆ త‌ర్వాత 32 ఏళ్ల యువ నాయ‌కుడు కూడా నీతిష్ నివాసానికి వెళ్లారు. ఆ త‌ర్వాతనే తేజ‌స్వి తండ్రి మాజీ ముఖ్య‌మంత్రి లాలూ యాద‌వ్ మీద అవినీతి కేసు కొత్త‌గా మోపారు. దీనిపై జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ పార్టీ త‌ర‌ఫున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మరో అవినీతి కేసులో బెయిల్‌ పొంది ఆసుపత్రిలో ఉన్న 74 ఏళ్ల లాలూ యాదవ్‌ పై కేంద్రం తీసుకున్న చర్య ప‌ట్ల వారు మౌనం వహించడాన్ని అంగీకరించలేదు.   ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల ముగింపు స‌మ‌యంలో తేజ‌స్వీ యాద‌వ్‌, ఆయ‌న ఎమ్మెల్యేలు నీతిష్ కుమార్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డానికి వెను కాడారు. లాలూ యాద‌వ్  తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్న‌పుడు జులైలో ఢిల్లీకి వెళ్ల‌వ‌ల‌సివ‌చ్చి న‌పుడు, ఆయ‌న ప్ర‌యాణం, ఇత‌ర వ‌స‌తుల బాధ్య‌త‌లు నీతిష్ భుజాన వేసుకున్నారు. గ‌త‌వారం ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై తేజ‌స్వీ యాద‌వ్ పార్టీ భారీ నినాదాల‌తో  రోడ్ల మీదకి వ‌చ్చిన‌పుడు వారికి త‌గిన ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌తో ప్ర‌ధాన ర‌హ‌దారుల్లోనే వెళ్లడం  నీతిష్ మ‌ద్ద‌తు తోనే జ‌రిగింది. అలాగే కుల గ‌ణ‌న చేప‌ట్ట‌వ‌ద్ద‌ని కేంద్రం చెప్పిన‌ప్ప‌టికీ, నీతిష్ కుమార్ మే నెల్లో అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ బీహార్‌లో కుల గ‌ణ‌న చేప‌ట్టారు. ఇందుకు తేజ‌స్వీ యాద‌వ్ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం  నీతిష్‌కు కొండంత ధైర్యాన్నిచ్చింది. 

కాసినో.. అదో మాయాలోకం!

ఒక పెద్ద హాలు, కళ్లు జిగేల్ మనే లైటింగ్,  మధ్యలో పెద్ద గ్రీన్ కలర్ టేబుల్.. దానిపై రకరకాల రంగుల్లో కాయిన్స్, కార్డులు... టేబుల్ చుట్టూ మనుషులు... ఒక చేతిలో గ్లాసు... మరొక చేతిలో కాలుతున్న సిగరెట్.. ఇంత‌లో ఎంట్రీ ఇస్తాడు ఆరు అడుగుల పైచిలుకు ఎత్తున్న వ్య‌క్తి, చురుక‌యిన చూపుల‌వాడు, మ‌హా తెలివిమంతుడు.. జేమ్స్బాండ్‌.. ఒక్క‌సారి అంతా ప‌రికించి చూసి టేబుల్ ద‌గ్గ‌రికి వెళ‌తాడు..వెనకి మేడ మీది గ‌ది ర‌హ‌స్య ద్వారం నుంచి ఒంటిక‌న్ను విల‌న్ అంతా గ‌మ‌నిస్తూంటాడు.. ఇది తెర‌మీద కాసినో దృశ్యం. ఆడ‌తారు, పాడ‌తారు, తాగుతారు, ఆన‌క కొట్టుకు ఛ‌స్తారు. సినిమా అయిపోతుంది.. కానీ ఆ కాసినో సీన్ మాత్రం ప్రేక్ష‌కుల మ‌దిలో చాలాకాలం ప్రింట‌యిపోతుంది. మ‌రి ఇంతే రిచ్‌గా రియ‌ల్ లైఫ్ లో క్యాసినో సెట‌ప్ ఉంటుందా అంటే ఔన‌నే అనాలి. తెలుగువారికి కాసినో ర‌హ‌స్యాల‌న్నీ తెలిపింది  ఇటీవ‌లి చీకోటి భాగోతం! క్యాసినో అంటే డబ్బు కోసం ఆటలు ఆడే ఒక ప్లేస్. ఇక్కడ ప్రధానంగా జరిగేది గ్యాంబ్లింగ్. కాసా(ఇల్లు) అనే ఇటాలియన్ పదం నుంచి వచ్చిందే క్యాసినో. ల‌క్ష‌ల బెట్టింగ్‌తో ఆడే ఆట అంతా కూడా అదృష్టం మీద‌నే ఆధాప‌డుతుంది. మీ ఊళ్లో చాలా తెలివిగా చెస్ బోర్డు ఆడిన‌దానికి దీనికి అస్స‌లు పొంత‌నే ఉం డ‌దు. పెద్ద‌పెద్ద ప్లేయ‌ర్లు కూడా ఇక్క‌డ బోల్తాప‌డే అవ‌కాశాలే ఎక్కువ‌.. అలా చేస్తారు, అందుకు ఏర్పాట్లూ ఉంటాయి... వెర‌సి ఇదో గాంబ్లింగ్ డెన్‌! క్యాసినోలలో అలాగే రెస్టారెంట్, బార్, కచేరీలు, డ్యాన్స్ షోలు వంటి ఇతర వినోదాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. బెట్టింగ్, లాటరీ గేమ్స్ ఆడే మెషీన్లు కూడా ఉంటాయ్. పోకర్బ్  జాక్ పాట్‌,  బాక్రా, క్రాప్, తీన్‌పత్తి, అందర్ బాహర్ అనేవి ప్రధానమైన ఆటలు. కొందరు డబ్బులు సంపాదించడానికైతే మరికొందరు వినోదం కోసం క్యాసినోలకు వెళ్తుంటారు. ఇంకొం దరికి అదొక అలవాటు కూడా. క్యాసినోలకు వచ్చే వారిని అలరించడానికి పాట కచేరీలు, పోల్ డ్యాన్స్, డ్యాన్స్ షో లూ  ఉంటాయి. అన్నిరకాల మద్యం అందుబాటులో ఉంటుంది. మొత్తానికి క్యాసినోలో ఆటలు ఆడొచ్చు.. తినొచ్చు, తాగొచ్చు... మ్యూజిక్, డ్యాన్స్ షోలు చూసి ఆనందిం చొచ్చు... అలసిపోతే మసాజ్ చేయించుకుంటూ రిలాక్స్ కావొచ్చు. హోటళ్లు, నైట్ క్లబ్బులు, రెస్టారెంట్లు, స్పాలు, రిసార్టులు, షాపింగ్ సెంటర్లు ఈ క్యాసినోలకు కేంద్రాల‌వుతున్నాయి. ఈవెంట్స్, వేడుకలు, ఉత్సవాల్లో కూడా క్యాసినోలను టెంపరరీగా నిర్వహిస్తుంటారు. కోట్ల‌లో సుల‌భంగా సంపాదించేందుకు, కాసింత ఆనందంగా జీవితాన్ని కొన్నాళ్లు గ‌డ‌ప‌డానికి  భార‌తీయు లు చాలామంది విదేశీ ప‌ర్య‌ట‌న‌ల పేరుతో క్యాసినో అట్రాక్ష‌న్‌తోనే వెళుతున్నారు.  చికోటి ప్రవీణ్ వంటి వారు ప్రత్యేకంగా విమానాలు నడుపుతున్నారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా క్యాసినోలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉందని అర్థం చేసుకోవచ్చు. మకావు, సింగపూర్, లాస్ వెగాస్, మాంటే కార్లో వంటి ప్రాంతాలకు ఎక్కువగా భారతీయులు క్యాసినోల కోసం వెళ్తుంటారు. నిజానికి విదేశాల‌కే ప్ర‌త్యేకించి అందుకోసం వెళ్ల‌న‌వ‌స‌రం లేదు. ఈ ఆధునిక కాలంలో మ‌న దేశంలోనూ క్యాసినోలు గోవా, సిక్కిం, డామన్ డయ్యూలలో  ఉన్నాయి. గోవాకి రిలాక్సింగ్ కోసం వెళుతున్నామ‌నే వారిలో చాల‌మంది ఈ రిలాక్సింగ్ కూడా ఆశించే వెళుతున్న‌ట్టు స‌మాచారం.  కానీ,  చ‌ట్ట‌విరుద్ధంగనుక ఇక్క‌డి  గ్యాంబ్లింగ్ ఆటల్లో బెట్టింగ్ ఉండ‌దు.  బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిషేధించాయి. కాబట్టి క్యాసినో లను పెట్టడం అనేది ప్రస్తుతానికి ఇక్కడ సాధ్యం కాదు.  గోవాలో 21 ఏళ్లు నిండిన వారే క్యాసినో గేమ్స్ ఆడ టానికి అర్హులు. సిక్కింలో 18 ఏళ్లు నిండిన వారిని అనుమతిస్తారు అందువల్లే బెట్టింగ్ గేమ్స్ ఆడాలనుకు నే తెలుగు వాళ్లు గోవా లేదా నేపాల్, శ్రీలంక వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే ఆదాయం పెంచుకునేందుకు విశాఖపట్నంలో ఫ్లోటింగ్ క్యాసినోలకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తున్నట్లుగా గతంలో మీడియా పేర్కొన్న‌ది. ఇండియాలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనేవి రాష్ట్ర జాబితాలో ఉంటాయి. వాటిని అనుమతించాలా? లేక నిషేధించాలా?  అనేది రాష్ట్రాలే  నిర్ణయి స్తాయి.. భారత్‌లో గ్యాంబ్లింగ్  రెండు ర‌కాలు.. 'గేమ్ ఆఫ్ చాన్స్', 'గేమ్ ఆఫ్ స్కిల్స్‌. మొద‌టిది అదృష్టం మీద ఆధారపడి ఆడే ఆటలు ఈ కేటగిరిలోకి వస్తాయి. ఈ ఆటలు ఆడాలంటే స్కిల్ పెద్దగా అవసరం లేదు. ఫలితం పూర్తిగా చాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక రెండ‌వ‌ది..ఈ ఆటలు ఆడాలంటే నైపుణ్యం కావాలి. వీటిని ఆడేవాళ్లకు ఒక వ్యూహం అంటూ ఉంటుంది. ప్లేయర్స్‌కు లాజికల్ థింకింగ్, ఎనలిటిక్ స్కిల్స్ వంటివి కావాలి. కాగా, భారత్‌లో చాలా వరకు రాష్ట్రాలు, స్కిల్ ఆధారంగా నడిచే ఆటలను అను మతిస్తున్నాయి. అదృష్టం మీద ఆధారపడి ఉండే ఆటలను నిషేధిస్తున్నాయి.  ఆట‌ల విష‌యంలోనూ రాష్ట్రాల మ‌ధ్య వ్య‌త్యాసం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రమ్మీని నిషేధించారు. కానీ తమిళనాడులో అది లీగల్. ఇలా ఒకే ఆట విషయంలోనూ రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు కనిపిస్తు న్నాయి. 2012లో మద్రాస్ హైకోర్టు గ్యాంబ్లింగ్ ఆటగా పరిగణిస్తూ ఆన్‌లైన్ రమ్మీని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సంబంధిత కంపెనీలు సుప్రీం కోర్టులో సవాలు చేశాయి. చివరకు రమ్మీని 'గేమ్ ఆఫ్ స్కిల్'గా పరిగణిస్తూ ఆ నిషేధాన్ని ఎత్తి వేసింది సుప్రీం కోర్టు. పోకర్ విషయంలోనూ ఇదే వివాదం ఉంది. దీన్ని 'గేమ్ ఆఫ్ స్కిల్'‌గా చూడాలని కొందరు 'గేమ్ ఆఫ్ చాన్స్‌'గా చూడాలని మరికొందరు వాదిస్తున్నారు. ఇంత‌టీ రంగుల జిగేల్ లోకంల్లోకి అలా తీసికెళ్లి వారికి జీవితంలో రుచిచూడ‌కూడ‌ని మ‌త్తెక్కించి వారు తెలుసుకునేలోగా పాప‌ర్ల‌ను చేయ‌డంలో ఆరితేరిన గ‌జ ఆట‌గాడు చీకోటి.  కోట్ల‌తో వ్యాపారం చేసేడు, కోటీశ్వ‌రుల‌కు గ‌తిలేకుండా చేసేడు, చివ‌రికి బంగారుప‌ళ్లెం, వెండి స్పూను దూర‌మై  పోలీసుల‌కు చిక్కాడు. అంత‌టి ఘ‌నుడికి ఇప్పుడు ప్రాణ‌భీతి నిజంగానే చంపేస్తోంది. త‌న‌కు ప్రాణ భ‌యం ఉంద‌ని కోర్టు కీ విన్న‌వించుకున్నాడు.  చ‌ట్ట‌వ్య‌తిరేక ప‌నులు చేసిన‌వాడు ఎంత‌టి కాసినో కింగ్ అయినా దొర‌క‌ నంత‌ వ‌ర‌కే, దొరికితే జేబుదొంగ లా ఒణిపోవాల్సిందే!

ఏ1 గారి పార్టీలో ఏ సర్టిఫికెట్ ఎంపీ!

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం సోషల్ మీడియాను పట్టి కుదిపేస్తోంది. ఇంత ఛండాలంగా, సిగ్గు లేకుండా వ్యవహరించిన మాధవ్ ను ఇంకా పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ప్రతిపక్ష  నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే.. ఇలా న్యూడ్ వీడియోతో దొరికిపోయిన మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా వైసీపీ అధినేత ఎందుకు తాత్సారం చేస్తున్నారని, తాత్సారం వెనుక కారణం ఏమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. బరితెగించి మరీ ఇంతలా దరిద్రపుగొట్టు న్యూడ్ వీడియో చేసిన గోరంట్ల మాధవ్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు. మాధవ్ తోనే సరిపెట్టకుండా వైసీపీ అధినేత ను, ఆ పార్టీ నేతలు రోజా తదితరులపై కూడా అదే స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ‘అరె ఏంట్రా ఇది.. మాధవా.. నువ్వు పోలీసు స్టార్ వే అనుకున్నా.. పోర్న్ స్టార్ వా..? నీ ఏజేంటి.. నీ గేజేంటి..?.. ఎంత A1 గారి పార్టీలో ఉంటే మాత్రం A సర్టిఫికెట్ వీడియో కాల్సా..’ అంటూ ఓ నెటిజన్ ఒక రేంజ్ లో ఏసుకున్నాడు. గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కాల్ పై మంత్రి రోజా మాట్లాడాలి.. దిశ చట్టం అన్నారు.. గన్ కంటే ముందే జగన్ అని పేలారు.. ఏవమ్మా.. రోజా.. ఏంటీ ఎంపీ పరిస్థితి.. కవరేజ్ ఏమైనా మొదలుపెట్టావా లేదా..??’ అంటూ మరో నెటిజన్ ఎద్దేవా చేశారు. ఆ అశ్లీల వీడియోను ఎంపీ మాధవ్ భార్యకి, ఆయన కూతురుకి, కోడలికి ఎంపీ బంధువుల్లో ఉన్న ఆడవాళ్లు అందరికీ చూపించి పండగ చేసుకోమని చెప్పండి’ అంటూ ఇంకో నెటిజన్ విరుచుకుపడ్డారు. ‘ఇప్పుడు వాడిని అంటే గోరంట్ల మాధవ్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తారా, చేయరా?’ అంటూ మరో నెటిజన్ వైసీపీ అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. ‘పోర్స్ స్టార్ ఎంపీ.. ‘ఛీ రెడ్డి’ దగ్గరకు ఓసారి పోయి వస్తే బాగుండునేమో.. ఆలోచించు మాధవా’ అంటూ ఇంకో నెటిజన్ ఎద్దేవా చేశారు. ‘గోరింట పూచింది.. కొమ్మా లేకుండా’ ఒకప్పటి పాట అయితే.. ‘గోరంట్ల దొరికాడు బట్టలు లేకుండా’ అనేది వైరల్ అవుతున్న ఇప్పటి పాట అంటూ మరో నెటిజన్ తూర్పారపట్టారు. మన దేశంలో మన ఇష్టప్రకారం జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఆ హక్కుతోనే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇలానే ఉంటాడు. బజారులో ఇలాగే తిరుగుతాడు.. ఆయన ఇష్టం. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఎవరూ విమర్శలు చేయకండి.. చెప్పులతో సత్కరించాల్సిందే’ అంటూ ఇంకో నెటిజన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇంకా నయం.. గుడ్డలు విప్పి తిరగలేదు అంటూ మరో నెటిజన్ భయాందోళన వ్యక్తం చేశారు. ‘పరువా.. పాడా.. 16 నెలలు చిప్పకూడు మెక్కినోడిని బెయిలిచ్చి.. కోర్టు వాయిదాలను ఎగ్గొట్టమని సీఎంగా చేసిన నేరం కంటే ఇది పెద్ద నేరం కాద’ని ఇంకో నెటిజన్ జగన్ నేరం కంటే పెద్దదేమీ కాదంటూ ముక్తాయించారు. గోరంట్ల మాధవ్ మొదటి నుండీ చెడ్డోడే. అయితే.. అతను ఎంపీ పదవి చేపట్టినప్పటి నుంచి ఈ విషయాలను ఎందుకు దాచిపెట్టారో వివరించాలి’ అని మరో నెటిజన్ నిలదీశాడు. వైసీపీలో మంచి అర్హత గోరంట్ల మాధవ్ పొందాడు కాబట్టి.. మాధవన్నకు ఒక ఏడాది సీఎంగా ఎన్నుకోవాలనే ఆలోచనలో వైసీపీ వారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు కుదరకపోతే 2024లో అయినా సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని వైసీపీ వారు అంతర్గత సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది’ అంటూ నెటిజన్ దుమ్ము దులిపేశారు. ‘మాధవ్ మీద ఉన్న రేప్ కేస్, మర్డర్ కేస్ గురించి చెప్పలేదేం.. 2012 అఫిడవిట్ లో కూడా ఆ విషయం ఉంది.. కొంచెం తెలుసుకోండి’ అంటూ మరో నెటిజన్ వివరించారు. ‘వైసీపీలో అంతా వెధవలే.. బుద్ధీ.. జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా.. ఇలాంటి వారికి ఎంపీ టికెట్ ఇస్తారా?’ అంటూ ఇంకో నెటిజన్ నిప్పులు చెరిగారు. గోరంట్ల మాధవ్ లో ఇలాంటి పనికిమాలిన అర్హతలు ఉన్నాయి కాబట్టే వైసీపీ అధినేత మెచ్చి మరీ తమ పార్టీ ఎంటీ టికెట్ ఇచ్చారంటూ మరో నెటిజన్ ఎద్దేవా చేశారు. మాధవ్ వ్యవహారం ఇంత బహిరంగం అయింది కదా.. అసలిప్పుడు పార్లమెంట్ స్పందన ఏమిటి?.. తమకేం సంబంధం లేదంటూ పార్లమెంట్ లోకి యధావిధిగా రానిస్తారా? లేక సభ నుంచి బహిష్కరిస్తారా?.. రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉందంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. ‘ఇటువంటి వాళ్లకు జగన్ వెతికి మరీ టికెట్ ఇస్తాడు.. వెధవ పార్టీకి వెధవలే కావాలి’ అని మరొకరు తూర్పాపట్టారు. ‘మనోడి ట్రాక్ మామూలుగా లేదు.. అయినా ఏం పర్వాలేదు. పక్కన జగన్ ఉన్నారు. ఏం పీకలేరు’ అంటూ ఇంకో నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులంటే జలగన్నకు ఇష్టం. అందుకేనేమో సీనియర్లను పక్కనపెట్టి మాధవ్ కు ఎంపీ టికెట్ ఇచ్చారు అంటూ మరో నెటిజన్ విమర్శించారు. వైసీపీ నాయకులంతా ఇలాంటి వారే కాబట్టి ఎవరూ ఖండించకపోగా ఏమీ తప్పు జరగలేదన్నట్టుగా మాట్లాడుతున్నారంటూ ఇంకొకరు వ్యాఖ్యలు పెట్టారు. మొత్తానికి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కారణంగా ఆ పార్టీ అధినేతపైనా, ఆ పార్టీ నేతలపైనా నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెట్టి కబడ్డీ ఆడేస్తున్నారు.

జ‌గ‌న్‌కు భ‌జంత్రీలు వైసీపీ మంత్రులు..చింత‌మ‌నేని

ప్ర‌జాప్ర‌తినిధులుగా ప్ర‌జ‌ల ఇబ్బందులు తెలుసుకుని ప‌రిష్క‌రించ‌డానికి స్వేచ్ఛ ఉండాలి. అలాంటి స్వేచ్ఛ‌లేన‌పుడు మంత్రిమండ‌లిలో ఉండి ప్ర‌యోజ‌న‌మేమిట‌ని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింత మ‌నేని ప్ర‌భాక‌ర్ అన్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రుల‌కు ఏమాత్రం స్వేచ్ఛా లేద‌ని, వారికి ఏ సంద‌ర్భంలోనూ త‌మ అభ‌ప్రాయాల‌ను స్వంతంగా చెప్ప‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని ఆయ‌న వ్యాఖ్యా నించారు. కేవ‌లం వారంత ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి రాసిచ్చిన మాట‌ల‌ను చెప్ప‌డానికే త‌ప్ప స్వ‌యంగా మాట్లాడ‌డానికి అవ‌కాశం లేకుండా పోయింద‌ని చింత‌మ‌నేని ఘాటుగా విమ‌ర్శించారు.  మంత్రులు కేవ‌లం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెప్పిన దాన్ని అమ‌లు చేయ‌డం, ఆయ‌న మాట‌ల‌కు చ‌ప్ప‌ట్లు కొడుతూ భ‌జ‌న చేయ‌డం త‌ప్ప వారంత‌ట వారుగా ఎలాంటి సూచ‌న‌లు స‌ల‌హాలివ్వ‌లేని స్థితిలో ఉండ టం శోచ‌నీయ‌మ‌న్నారు. కేవ‌లం స‌జ్జ‌ల మాటే వారు మంత్రించిన‌ట్టు చెప్ప‌డం జ‌రుగుతోంద‌ని చింత మ‌నేని అన్నారు.  దీనికి తోడు వైసీపీ మంత్రులుగాని, ఎమ్మెల్యేలుగాని ఎక్క‌డా  ప్ర‌జాక్షేత్రంలో కాన‌ రార‌ని ఎద్దేవా చేశారు. ద‌ళితుల‌ను ఆదుకుంటున్నాం, వారికి ప‌ద‌వులిచ్చి వారిని గౌర‌విస్తున్నామ‌ని డంబాలు ప‌లకడం త‌ప్ప నిజానికి వారికి ఎలాంటి అధికార‌మూ ఇవ్వ‌లేద‌ని అన్నారు. పైరుకు వారికి ప‌ద‌వులి చ్చిన‌ప్ప‌టికీ పెత్త‌నం మాత్రం వేరే వారు చెలాయిస్తున్నార‌ని చింత‌మ‌నేని మండిప‌డ్డారు. ద‌ళితుల‌ను ఇంత‌కంటే ఎవ్వ‌రూ త‌క్కువ చూడ‌ర‌ని అన్నారు.  గోరంట్ల ఎపిసోడ్ గురించి ప్ర‌స్తావిస్తూ, ఎంపీ చేసిన ప‌నిని క‌ప్పిపుచ్చుకోవ‌డానికి అది త‌మ ఎంపీ ప‌నికాద‌ని, మార్ఫింగ్ చేశార‌ని వేరేవాళ్ల‌మీద నేరం నెట్టే ప్ర‌య‌త్నాలు చేయ‌డం దారుణ‌మ‌ని చింత‌ మ‌నేని విమర్శించారు. దీనికి తోడు అస‌లా ఎపిసోడ్‌పై హోంమంత్రి ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌క‌ పోవ‌ డాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. 

సంగారెడ్డి జైల్లో మ‌లేషియా టూరిస్టులు!  

బ‌డి సెల‌వ‌లివ్వ‌గానే అమ్మ‌మ్మ ద‌గ్గ‌రికి వెళ్ల‌డం పిల్ల‌లంద‌రికీ స‌ర‌దా. గ్రామంలో సెల‌వ‌లు స్వేచ్ఛ‌గా గ‌డిపేయ‌చ్చ‌ని, కుర్రాళ్ల‌కి కులూ మ‌నాలీ పిచ్చీ ఉండ‌వ‌చ్చు. అస‌లా మాట‌కి వ‌స్తే వేరే ప్రాంతాలు సంద ర్శించాల‌నుకునేవారికి దేశంలో ఎక్క‌డికైనా వెళుతూంటారు. కానీ చిత్రంగా ఈ విదేశీయులు ఇద్ద‌రూ ఏకం గా తెలంగాణా వ‌చ్చి ప‌నిగ‌ట్టుకుని  జైల్లో రెండు రోజులు గ‌డిపారు. ఇదేమి ఆనందం. ఆనంద‌మే అదో చిత్రమైన అనుభూతి! ఇద్ద‌రూ టూరిస్టులే.. దొంగ‌లు కారు.   ప్ర‌తీ దేశం, ప్ర‌తీ ప్రాంతం టూరిస్టుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో దూకుడుగానే ఉంటాయి. అనేక ప్రాంతాల‌ను అంద‌రికీ ఆక‌ట్టుకునే విధంగా మారుస్తుంటారు. పాత‌కాలం క‌ట్ట‌డాలు, భ‌వంతులు, హోట‌ళ్ల‌తో స‌హా అన్నీ టూరిజం శాఖ బ్ర‌హ్మాండంగా త‌యారుచేసి దేశ‌, విదేశీ టూరిస్టుల నుంచి మెప్పు పొంద‌డానికి పెద్ద దండ‌ల‌తోనే గ‌మ్మంలో ఎదురుచూస్తుంటారు.   కానీ ఇటీవ‌ల తెలంగాణాకు ఇద్దరు టూరిస్టులు కౌలాలం పూర్ నుంచి వ‌చ్చారు. నిగ్ ఇన్ ఊ, అత‌ని స్నేహితురాలు ఒంగ్ బూన్ టెక్‌. వీళ్లిద్ద‌రూ భార‌త్‌లో పురాత‌న క‌ట్ట‌డాలు ప్ర‌దేశాలు సంద‌ర్శించాల‌ను కుని ఎంతో ప్లాన్ చేసుకుని మ‌రీ వ‌చ్చారు. కానీ వారిని సంగారెడ్డి జైలే ఎక్కువ ఆక‌ట్టుకుంది! కానీ ఇదేమీ పిచ్చి వెర్రీ కాదు కావాల‌నే జైలుకి వెళ్లారు. తెలంగాణా ప‌ర్యావ‌ర‌ణ శాఖ  ఒక చిత్ర‌మైన  కార్య‌క్ర‌మం చేప ట్టింది. దాని పేరు.. ఫీల్ ద జైల్‌!  ఇందులో భాగంగా ఎవ‌ర‌యినా స‌రే 24 గంట‌ల‌పాటు సంగారెడ్డి జైల్లో గ‌డ‌ప‌వ‌చ్చు. అంటే అస‌లు జైల్లో వాతావ‌ర‌ణం ఎలా ఉంటుంది, జైల్లో ఉన్న‌వారిని ఎలా చూస్తారు, అక్క‌డ  దోషుల‌కు ఎలాంటి వ‌స‌తులు క‌ల్పిస్తారు ఇలాటివ‌న్నీ తెలుసుకోను వీలుంటుంది. పైగా అతి పురాత‌న మైన క‌ట్ట‌డం క‌నుక స‌హ‌జంగానే ప‌ర్యాట‌కులు ఆస‌క్తి చూపుతున్నారు.  మ‌లేషియా నుంచి వ‌చ్చిన ఈ ఇద్ద‌రు టూరిస్టుల‌కు అదే ఆస‌క్తిక‌రంగా అనిపించింది. సంగారెడ్డి జైలు 1796 ఎ.డి లో ప్ర‌ధాని మొద‌టి సాలార్‌జంగ్ స‌మ‌యంలో నిర్మించారు. అంటే 220 సంవ‌త్స‌రాల క్రితంది. కేవ‌లం గోల్కొండ‌, చార్మినార్ లే కాకుండా ఇలాంటి పురాత‌న క‌ట్ట‌డాలు కూడా ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. సాధార‌ణంగా జైలు అన‌గానే భ‌యప‌డ‌తాం. కానీ దీన్ని జైలులా కాకుండా ప‌ర్యాట‌క ప్ర‌దేశం, క‌ట్ట‌డంలా భావిస్తే స‌రి. మ‌లేషియా జంట రూ.500 చెల్లించి రెండు రోజులు  సంగారెడ్డి జైల్లో గ‌డిపారు. అక్క‌డి భోజ‌నం, వ‌స‌తి వారికి ఎంతో న‌చ్చింది.

తాడేపల్లి ప్యాలెస్ కు ఇక టూలెట్ బోర్డే.. అచ్చం నాయకుడు సెటైర్లు

తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెంనాయుడు వైసీపీపై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. భవిష్యత్ ఆ పార్టీ నేతల కళ్ల ముందు కనిపిస్తుండటంతో వణికి పోతున్నారని దుయ్యబట్టారు. మంగళవారం ( ఆగస్టు 9) విలేకరులతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు హస్తిన వెళితేనే వైసీసీ నేతలు వణికిపోతున్నారని, భయంతో వారికి చెమటలు పట్టేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆజాదీ కా అమృతోత్సవ్ కమిటీ సమావేశానికి వెళ్లిన చంద్రబాబుతో మోడీ కొద్దిసేపు ముచ్చటించినందుకే వైసీపీ అగ్రనాయకత్వం కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లు భయపడిపోతున్నారెందుకని ప్రశ్నించారు. వైసీపీ భయం, వణుకు చూస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ త్వరలో ఖాళీ అయిపోవడం ఖాయమని పిస్తోందని, ఇక టూలెట్ బోర్డు రెడీ చేసుకోవడమే తరువాయి అని అనిపిస్తోందని సెటైర్లు వేశారు. ప్రస్తుతం వైసీపీలో తడబాటును, వణుకును, భయాన్నీ చూస్తుంటే ఆ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అవగతమౌతోందన్నారు. వైసీపీకి అప్పులు చేయడం, విమర్శకులపై అక్రమ కేసులు బనాయించడం, అసభ్యంగా అడ్డంగా దొరికిపోయిన తమ పార్టీ వారిని కాపాడుకోవడం ఎలా అన్న అంశాలపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ లా అక్రమ కేసుల మాఫీ కోసం హస్తిన పర్యటనకు వెళ్లలేదనీ, కేంద్రం బాబు విజన్ ను గుర్తించి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానిస్తేనే వెళ్లారనీ, అక్కడ మోడీతో ఆయన తనంత తానుగా భేటీ కాలేదనీ, ప్రధానే స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించి మరీ ప్రత్యేకంగా సమావేశమయ్యారనీ గుర్తు చేశారు. ఒక నాయకుడిగా చంద్రబాబుకు ఉన్న గుర్తింపు అది అని అచ్చెన్నాయుడు చెప్పారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా దూరద్రుష్టితో చంద్రబాబు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాన్ని చేపడితే.. అహంకారం, అజ్ణానంతో దానికి నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ కాదా అని ప్రశ్నించారు. తన అజ్ణానంతో అమరావతిని నిర్వీర్యం చేసి ఇప్పుడు కోర్టులు మొట్టికాయలు వేస్తుంటే.. ఏం చేయాలో తెలియక రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి మరింత అభాసుపాలయ్యారని విమర్శించారు.  దేశభక్తికి సంబంధించిన అంశాలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించిన అచ్చెన్న.. జనం వైసీపీని తరిమికొట్టే రోజెంతో దూరంలో లేదన్నారు.

ఆసియా క‌ప్‌కు  బుమ్రా దూరం

టీమ్ ఇండియాకి బౌలింగ్ ప్ర‌ధాన అస్త్రం జ‌స్ప్రీత్ బుమ్రా. వ‌న్డేలైనా, టీ-20లైనా అత‌ను త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. అంత‌గా బౌలింగ్ విభాగం అత‌ని మీద ఆధార‌ప‌డింద‌నే అనాలి. అయితే ఎవ్వ‌రూ ఆట్టే కాలం వ‌రుస సిరీస్‌ల్లో అంతే అద్భుతంగా రాణించ‌లేరు. చిన్న‌పాటి ఆరోగ్య స‌మ‌స్య‌లూ త‌లెత్తుతాయి. ముఖ్యం పేస‌ర్ల‌కు ఇలాంటి ఇబ్బంది వ‌స్తుంది. బుమ్రా కూడా ప్ర‌స్తుతం వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతు న్నాడు. ఈ కార‌ణంగానే ఆసియా క‌ప్ పోటీల‌కు జ‌ట్టులోకి ఎంపిక కాలేదు. ఇప్పుడు వాస్త‌వానికి  ఈ టోర్నీలో కీల‌క‌పాత్ర వ‌హించాల్సింది.  కానీ శారీర‌కంగా ఫిట్నెస్ దృష్ట్యా అత‌నికి విశ్రాంతినీయ‌డ‌మే మేల‌ని బిసిసిఐ భావించింది. అత‌న్ని జ‌ట్టులోకి తీసుకుని మ‌రింత ఇబ్బంది పెట్ట‌డం మంచిది కాద‌ని బిసిసిఐ భావి స్తోంది. విశ్రాంతి అనంత‌రం అత‌ను ఇక టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లోనే టీమ్ ఇండియాలోకి రావ‌చ్చు. బుమ్రా చివరిగా ఇంగ్లండ్‌పైవన్డే సిరీస్ ఆడాడు.  విశ్రాంతి దృష్ట్యా వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌లో ఆడించ లేదు. బుమ్రాకు ఇలాంటి స‌మ‌స్య  గ‌తంలోనూ త‌లెత్తి కొంత‌కాలం జ‌ట్టుకు దూరంగా ఉన్న సంగ‌తి తెలి సిందే. అయితే స్వదేశంలో కీలకమైన ఆస్ట్రేలి యా, దక్షిణాఫ్రికాపై సిరీస్‌ల నేపథ్యంలో  ఫిట్‌గా ఉం చేందుకుగానూ  బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ అందుబాటులో ఉండ‌మ‌ని  బుమ్రాను కోర‌వ చ్చు. అవకాశాలున్నాయి. కొన్నేళ్లక్రితం కూడా బుమ్రా ఇదే తరహా సమస్యతో బాధపడ్డాడు. ఎక్కువకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.  ఇదిలా ఉండ‌గా,  టీ20 వరల్డ్ కప్‌కు ముందు కీలకమైన ఆసియా టీ20 కప్‌లో ఆడబోయే భారత జట్టుకు  బీసీసీఐ సోమవారం ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులోకి పునరాగ మనం చేసిన కేఎల్ రాహుల్ వైస్‌కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక కొంత విశ్రాంతి తర్వాత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ జట్టులో తిరిగి  చోటు దక్కించుకున్నాడు. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ఆరంభమవనుంది.

వీఆర్వోలు రెవెన్యూ ఉద్యోగులే.. హైకోర్టు స్పష్టీకరణ

తెలంగాణ సర్కార్ కు హై కోర్టులో చుక్కెదురైంది. వీఆర్వోలను ఇతర ప్రభుత్వ శాఖలలో సర్దు బాటు చేస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆ జీవోను అమలు చేయవద్దంటూ నిలిపివేసింది.  రాష్ట్రంలో వీఆర్వోలు ఇక ఎంత మాత్రం రెవెన్యూ శాఖలో ఉద్యోగులు కాదంటూ ప్రభుత్వం వారిని వేరు వేరు శాఖలకు సరెండర్ చేసింది. ఈ మేరకు ఇప్పటికే పలువురు వీఆర్వోలు ఆయా శాఖలలో విధులలో చేరిపోయారు. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ ను విచారించిన హైకోర్టు జీవో అమలును నిలిపివేస్తూ స్టే ఆర్డర్ ఇచ్చింది. జీవోలోని కొన్ని అంశాలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఇప్పటి వరకూ వేరే వేరే శాఖలలో విధులు స్వీకరించిన ఉద్యోగులంతా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతారని హైకోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.  

ఏపీ రాజకీయాలలో మోడీ, బాబు భేటీ ప్రకంపనలు.. వైసీపీలో వణుకు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశానికి హాజరైన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడితో మోడీ ప్రత్యేకంగా ముచ్చటించడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయిపోయింది. మోడీ స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి ఆప్యాయంగా పలక రించడమే కాకుండా ఆయనను కొంచం పక్కకు తీసుకువెళ్లి విడిగా కొద్ది సేపు ముచ్చటించడంతో ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలంటూ పెద్ద ఎత్తున చర్చకు తెర లేచిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు ప్రధాని మోడీ ఏపీ సీఎం జగన్ తో లంచ్ చేసినా ఆ విషయానికి మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.  రోజులు గడిచినా కూడా మోడీ, చంద్రబాబు ఆత్మీయ సమావేశమే రాజకీయంగా ప్రాధాన్యతలలో నిలిచింది. అదే సమయంలో జగన్ పార్టీ కూడా బాబుతో మోడీ సమావేశానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. వారి భేటీ ప్రాధాన్యతను తగ్గించడానికి పడరాని పాట్లు పడటం వైకాపాలో ఆ భేటీ వణుకు పుట్టించిందనడానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా సోమవారం (ఆగస్టు 8)న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ చంద్రబాబు, మోడీ ప్రత్యేక సమావేశం గురించి ప్రస్తావించి విమర్శలు చేయడం కూడా ఏపీలో విస్తృత చర్చకు దారి తీసింది. రెండు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ముచ్చటించుకుంటే వైసీపీకి వణుకెందుకన్న ప్రశ్న సామాజిక మాధ్యమంలో తెగ హల్ చల్ చేస్తున్నది. నాలుగేళ్లకు పైగా ఎడమొఖం పెడమొఖం అన్న రీతిలో ఉన్న తెలుగుదేశం, బీజేపీల మధ్య ఇటీవల ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతోందన్న అంచనాల నడుమ..వాటికి బలం చేకూరేలా మోడీ, చంద్రబాబు కొద్ది సేపే అయినా ముచ్చటించుకోవడం సహజంగానే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ వైసీపీ తెలుగుదేశం, బీజేపీల మధ్య ఆ పాటి దగ్గరతనం ఏర్పడటం కూడా సహించలేకపోతోందనడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మోడీ చంద్రబాబు ల తాజా భేటి పై విమర్శలు గుప్పించడమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విమర్శలతో సరిపెట్టకుండా ఈ భేటీ ముఖ్య ఉద్దేశం ఏమిటో కూడా సజ్జల చెప్పేయడం కూడా తెలుగుదేశం, బీజేపీలు దగ్గర కావడం ఎంతగా బయపెడుతోందనడానికి నిదర్శనమని అంటున్నారు. సజ్జల అభిప్రాయం ప్రకారం బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల కంటే కూడా తెలంగాణ రాజకీయాలపై ప్రస్తుతం ఎక్కువ ఫోకస్ పెడుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ని గద్దె దింపి బిజెపి పార్టీని అధికారంలోకి ఎక్కించడానికి తమ వంతు సహాయాన్ని తాము చేస్తామని చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో బిజెపి కి మద్దతు పలికాడని, మొత్తానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి కలిసి 2024 లో ఏపీ లో పోటీ చేయడానికి ప్రాతిపదికను చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారని సజ్జల చెప్పారు.  ఎవరూ ప్రశ్నించకుండానే మోడీ, చంద్రబాబుల బేటీ ఉద్దేశాన్ని, భేటీలో వారి మధ్య జరిగిన సంభాషణను తాను పక్కనుండి విన్నట్లుగా సజ్జల మీడియా సమావేశంలో చెప్పేశారు. అదే సమయంలో తన మాటలకు తానే తన భుజాలు తడుముకుని వారిరువురి మధ్యా సమావేశం వైసీపీని ఏం భయపెట్టడం లేదన్న వివరణ కూడా ఇచ్చేశారు.  గతంలో వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ ప్రకటించడం, ఇప్పుడు మోడీ స్వయంగా చంద్రబాబుకు దగ్గర కావడానికి ఒక అడుగు ముందుకు వేయడం చూస్తుంటే.. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ సమీకరణాలు కొత్త రూపు దాల్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు చంద్రబాబు పేరు ఎత్తితేనే ఒంటికాలి తో లేచే సోము వీర్రాజు సైతం తన బాణీ మార్చి చంద్రబాబు విజినరీ అంటూ తాజాగా పొగడ్తలు గుప్పించడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్న రోజుల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

క‌మ్ముకొస్తున్న యుద్ధ‌మేఘాలు.. ఒణికిపోతున్న  తైవాన్‌

రెండిళ్ల మ‌ధ్య ఓ యింటిని బెదిరించి ఖాళీచేయించాల‌న్న గొడ‌వ‌లా ఉంది అమెరికా, చైనా గోల‌. తైవాన్ ప్ర‌జ‌లు అస‌లు చైనానే ఇష్ట‌ప‌డ‌టం లేదు. చైనాలో క‌లిసేందుకు వారు స‌సెమిరా అంగీక‌రించ‌డం లేదు. కానీ చైనా మాత్రం తైవాన్ అనాదిగా మాదేన‌ని దాని మీద స‌ర్వ‌హ‌క్కులూ మావేన‌న్న‌ట్టుగా వ్య‌వ‌ హ‌రిస్తోంది. ఇక అంత‌ర్జాతీయ పెద్ద‌న్న అమెరికా మాత్రం బుల్లి తైవాన్‌కు అండ‌గా మేమున్నామ‌ని చైనాను హెచ్చరిస్తోంది. ఇటీవ‌ల ఏకంగా త‌మ చ‌ట్ట‌స‌భ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ ని  తైవాన్ ప‌ర్య‌ట‌న‌కు పంపించింది.  ఇన్నాళ్లూ త‌న‌దేన‌ని అనుకున్న‌ది వేరొక‌రు ఆక్ర‌మించేందుకు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తే ఎవ‌రు మాత్రం మిన్న‌కుంటారు. చైనా ప‌రిస్థితి అదే. నాన్సీ ప‌ర్య‌ట‌న ప‌ట్ల చైనా ఆగ్ర‌హించింది. చైనా విష‌యంలో క‌ల‌గ జేసుకోవ‌ద్ద‌ని అమెరికాకు చిన్న హెచ్చ‌రికా చేసింది. అయితే చైనాకు యుద్దానికి త‌ల‌ప‌డే  అంత సీన్ లేదు, కేవ‌లం గోల చేయ‌డ‌మేన‌ని అమెరికా అన్న‌ది. కానీ తైవాన్ జ‌ల‌సంధి చుట్టూ చైనా సైనిక ప‌టా లంత దిగ్బంధ‌నం చేసింది. ఇపుడు తైవాన్ జోలికి ఎవ‌రు వ‌చ్చినా త‌మ‌తో త‌ల‌ప‌డాల్సిందేన‌ని యుద్ధ వాతావ‌ర‌ణ‌మే చైనా సృష్టించింది. కానీ చెప్ప‌కుండా త‌మ ఇంటి చుట్టూ కంచె వేస్తే య‌జ‌మానికి కోపం వ‌చ్చిన‌ట్టు తైవాన్ కూడా చైనా వ్య‌వ‌హారం ప‌ట్ల మండిప‌డుతోంది. చైనా త‌మ‌ను త‌మ భూభాగంలోనిదే న‌ని అనుకుంటోందే గాని వాస్త‌వానికి వారికి త‌మ‌కూ సంబంధం లేద‌న్న‌ది తైవాన్ వాద‌న‌.  తైవాన్ ను అడ్డుపెట్టుకుని అమెరికా మ‌ళ్లీ ప్ర‌పంచ‌దేశాల‌కు త‌మ ఆధిప‌త్యాన్ని రుజువు చేయ‌డాని ప్ర‌య త్నిస్తోంది. చైనాకు తన యుద్ధ కౌశలం ఎటు వంటిదో చూపించేం దుకే అమెరికా ఈ వారారంభంలో అఫ్ఘ‌నిస్తాన్ లో  అల్‌ఖైదా అధినేత జవహరి తలదాచుకున్న స్థావరంపై మిసైల్‌ దాడిచేసి ఆతడిని మట్టు బెట్టిన సంగ‌తి భారీగా ప్ర‌చారం చేసు కుంటోంది. తాము ప్ర‌పంచంలో ఏ మూల‌క‌యినా వెళ్ల‌గ‌ల మ‌న్న ధీమా వ్య‌క్తం చేసింది.  కానీ త‌మ శ‌క్తినేమీ త‌క్కువ వేయ‌ద్ద‌ని  తైవాన్ జ‌ల‌సంధి స‌మీపంలో ని దేశాలూ  బాంబుల మోతలతో, మిసైళ్ళ శబ్దాలతో హోరెత్తి పోతున్నాయి. చైనాది కేవ‌లం తాటాకుల శ‌బ్దం త‌ప్ప వాస్త వానికి యుద్ధం చేసే స‌త్తా చైనాకు లేద‌ని అమెరికా ర‌క్ష‌ణ నిపుణుల స‌మాచారం.  ఇదిలా ఉండ‌గా,  తైవాన్‌ పొరుగుదేశాల అభ్యర్ధన మేరకు అమెరికా రంగంలోకి దిగింది. తైవాన్‌ని ఒంటరి చేయాలనుకుంటే చైనా పొరబడినట్టేనని అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసీ హెచ్చరించారు.  తైవాన్‌కు అంతర్జాతీయం గా అన్ని దేశాల వారూ రాకపోకలు సాగించేందుకు స్వాతంత్య్రం ఉందనీ, దానిని ఎవరూ అడ్డగించలేరని ఆమె చైనాని దృష్టిలో ఉంచుకుని హెచ్చరించారు. చైనా చర్యలు తైవాన్ నూ, దాని పొరుగు దేశాలనూ భయపెట్టే రీతిలో ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటో నీ బ్లింకన్‌ వ్యాఖ్యానించారు. చైనా తన ధోరణిని మార్చు కోకపోతే తదుపరి చర్యలకు తమ దేశం వెనుకాడ బోదని బ్లింకన్‌ హెచ్చరించారు.  తైవాన్‌ ఎల్ల కాలం తమ దేశంపై ఆధారపడి ఉండాలని చైనా కోరు కుంటోంది. ఒకప్పుడు చైనా మీద ఆధారపడినా తైవాన్‌ ఇప్పుడు అనేక విషయాల్లో చైనాను మించి పోతుండ‌ట‌మే చైనాకు మింగుడు ప‌డ‌టం లేదు.  మ‌రోవంక హాంకాంగ్‌ విషయంలోనూ చైనా ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నది.ఈ రెండూ తమ అంతర్భాగాలేన‌ని, తమ ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాలని చైనా ఆకాంక్షిస్తున్నది. అందుకే చైనా వైఖరిని ప్రపంచంలోని పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.  రష్యాది కూడా  ఇదే తంతు. ఉక్రె యిన్ ఒక నాడు  సోవియట్‌ రష్యాలో అంతర్భాగమైన మాట నిజమే కావచ్చు, కానీ, సోవియట్‌ యూనియన్‌ కకా వికలైన తర్వాత అజర్‌బైజా న్‌ వంటి ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా మనుగడ సాగి స్తున్నప్పుడు ఉక్రె యిన్‌ని తొక్కి పట్టాలన్న ఆధిపత్య ధోరణిని రష్యా ప్రదర్శిస్తున్నట్టే, తైవాన్‌ని తొక్కి పట్టి ఉంచాలని చైనా చూస్తోంది. తైవాన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థలో చేరకుండా  చైనా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లో చేరలేకపోవడం వల్ల తమ దేశం కరోనా సమయంలో ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్‌లు, మందులను తెప్పించు కోలేకపోయిందని తైవాన్‌ అధ్యక్షురాలు త్సై లింగ్‌ వెన్‌ అన్నారు. 

సుప్రీం కోర్టుకు అమరావతి రైతులు

అమరావతి రైతులు తమ పోరాటాన్ని సుప్రీం కోర్టు వరకూ తీసుకువెళ్లారు. హైకోర్టు తీర్పును ధిక్కరించి ఏపీ సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ అమరావతి రైతులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చినా ఏపీ సర్కార్ ఖాతరు చేయడం లేదనీ, కోర్టు తీర్పు మేరకు పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందనీ వారా పిటిషన్ లో పేర్కొన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ అమరావతి చేసిన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ప్రభుత్వ నిర్వాకం పట్ల ఆగ్రహావేశాలు వెల్లువెత్తేలా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత హైకోర్టు తన తీర్పులో ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టింది. అమరావతి రైతుల పక్షానే న్యాయం ఉందని విస్పష్ట తీర్పు ఇచ్చింది. హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కు వెళతామని ఏపీ సర్కార్ లీకులు ఇచ్చినప్పటికీ ఆ దిశగా ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పైపెచ్చు కోర్టు తీర్పు మేరకు పనులు చేయకుండా ధిక్కార ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రభుత్వ తీరు వల్ల వందల కోట్ల రూపాయల సంపద నాశనం అవుతోందని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులతో గత ప్రభుత్వం పలు హామీలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుంది. పైసా నష్ట పరిహారం కోరకుండా రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను వైకాపా సర్కార్ నిలువునా ముంచేసింది. గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులను చేయలేదు సరికదా, రైతులకు కనీసం కౌలు కూడా ఇవ్వకుండా తాత్సారం చేసింది. దానికి తోడు రాజధానిని పట్టించుకోకుండా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరతీసింది. దీనిని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చారిత్రాత్మక ఆందోళన చేపట్టారు. న్యాయపోరాటంలో విజయం సాధించారు. గత ప్రభుత్వ ఒప్పందం ప్రకారం రైతుల కు ప్రయోజనాలు చేకూర్చాల్సిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది. అమరావతిని నిర్మించాల్సిందేనని తన తీర్పులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు తరువాత కూడా జగన్ సర్కార్ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెబుతో అమరావతిని నిర్లక్ష్యం చేస్తోంది.దీనిని సవాల్ చేస్తూ అమరావతి రైతులు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.

గోరంట్ల వ్యవహారం సీరియస్ కాదా సజ్జలా?.. అది ప్రైవేటు వ్యవహారమా సలహాదారూ!

లోకం చీద‌రించుకునే ప‌ని చేసిన‌వాడిని పంచ‌న‌బెట్టుకుని అబ్బే మావాడు కాదు అదంతా మార్షింగ్ వ్య‌వ హారమ‌ని  అడ్డంగా వాదించ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం. ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ స‌ల‌హా దారు, వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట కూడా అలానే వుంది. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ లీల‌లు  వీడియోలో అంద‌రూ చూసి ప్ర‌శ్నిస్తుంటే ఇదేమీ సీరియ‌స్ సంగతి కాద‌ని ఆయ‌న అన‌డం విడ్డూరం. పైగా అది క‌ల్పిత వ్య‌వ‌హార‌మ‌ని అస‌లు అందులో ఉన్న‌ది గోరంట్లేన‌ని నిరూ పించాల్సిన బాధ్య‌త ఆరోపించ‌న‌వారిమీద‌నే ఉంద‌ని స‌జ్జ‌ల సెల‌విచ్చారు. త‌న వారిని కాపాడు కోవ‌డానికి ఎంత చెత్త ప‌న‌యినా పెద్ద‌గా ప‌ట్టించుకోన‌క్క‌ర్లేద‌న్న‌పుడు ఎప్పుడో జ‌రిగిన రేవంత్ రెడ్డి వ్య‌వ హారం తెర మీద‌కి  ఎందుకు తీసుకువ‌చ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. తాడేప‌ల్లి వైసీపీ కార్యాల‌యంలో స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడుతూ, గోరంట్ల‌ది నాలుగ్గోడ‌ల మ‌ధ్యది, ప్రైవే టు వ్య‌వ‌హారమ‌ని పోలీసులు ఇంకా ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని అంద‌రూ నోరు పారేసుకోవ‌డం స‌బ‌బు కాద‌న్నా రు. వీడియోలో మార్ఫింగ్ జ‌రిగింద‌ని, అది తాను కాద‌ని గోరంట్లే అంటున్న‌పుడు దాన్ని గురించి రుజువు చేయాల్సింది ఆరోపించిన‌వారి బాధ్య‌త‌గా స‌జ్జ‌ల పేర్కొన‌డం మ‌రీ విడ్డూరం. త‌మ ఎంపీ అడ్డంగా దొరికి పోవడంతో స‌జ్జ‌ల 2015 నాటి సంగ‌తి ప్ర‌స్థావించి అస‌లు సంగ‌తి తెర‌మ‌రుగు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విశ్లేష‌కుల మాట‌.   గోరంట్ల వీడియోపై విచార‌ణ‌లో మార్ఫింగ్ కాద‌ని తేలితే  త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, తొంద‌రే ముంద‌ని  తాపీగా ఇప్పుడు చెబుతున్నారు. ఇపుడు ప్ర‌జ‌లు, విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తుండ‌డంతో వైసీపీ నేత‌లు త‌మ త‌ప్పు క‌ప్పిపుచ్చుకోవ‌డానికి, ఎంపీని ర‌క్షించుకునే మార్గాన్ని అనుస‌రించ‌డంతో విప‌క్షాల మీద ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తూ కాల‌యాప‌న చేయ‌డానికి పూనుకున్నార‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు.  దీనికి తోడు వైసీపీ మ‌హిళా నేత‌లు కూడా గోరంట్ల వీడియో అంశాన్ని తేలిగ్గానే తీసుకున్న‌ట్టు క‌న‌ప‌డు తోంది. వాస్త‌వాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంద‌ని, పోలీసు ద‌ర్యాప్తు త‌ర్వాత‌నే వీడియో అస‌లా, న‌కిలీ అన్న‌ది బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ఇటీవ‌ల  వైసీపీ మ‌హిళా నేత‌లు అన్నారు.  అయితే పార్టీ ప్రతిష్ట‌ను దెబ్బ తీసే సంఘ‌ట‌న జ‌రిగిన‌పుడు దాన్ని గురించి పార్టీ ప‌రంగా చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లు తీసుకోకుండా గోరంట్ల వంటి వారిని వెన‌కేసుకు రావ‌డం పార్టీ ప‌రిస్థితిని, చర్యలకు భయపడుతున్న దుస్థితిని తెలియజేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక.. నేతల దూకుడుకు.. కేసీఆర్ బ్రేక్ .. అందుకేనా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా చేశారు. క్షణాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆయన రాజీనామాను ఆమోదించారు. రాజగోపాల రెడ్డి పేరు పక్కన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీలతో పాటుగా మాజీ ఎమ్మెల్యే.. కూడా వచ్చిచేరింది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరడం కూడా ఖరారైపోయింది. ఆగష్టు 21 న రాజగోపాల రెడ్డి  ఖద్దరు విడిచి కాషాయం కట్టేందుకు సిద్దమయ్యారు. అందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపధ్యంలో ఆయన రాజకీయ జీవితం కొత్త మలుపు తీసుకుంటోందని అనుకోవచ్చును. గతాన్ని గాంధీ భవన్ (కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం)కు అప్పగించి, ఆ ఎదురుగా అడుగుల దూరంలో ఉన్న డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ రాష్ట్ర కార్యాలయం) నుంచి కొత్త నడక ప్రారంభమవుతుంది. ఒక విధంగా ఆయన రాజకీయ జీవితంలో మరో అధ్యాయం మొదలవుతోంది.  అదలా ఉంటే, రాజగోపాల రెడ్డి రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదిస్తారా, జాగు చేస్తారా, అనే అనుమనాలు కూడా తీరిపోయాయి. రాజగోపాల రెడ్డి ఇలా రాజీనామా లేఖ ఇచ్చిన వెంటంటే స్పీకర్ పోచారం అలా  అక్కడిక్కడే ఆమోదం తెలిపారు. ముద్ర పడిపోయింది. సో.. ఇక మునుగోడు సీటు ఖాళీ అయింది. ఉపఎన్నిక అనివార్యం అనే విషయంలో స్పష్టత వచ్చింది. అయితే ఎప్పుడు.. కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్‌, డిసెంబర్‌లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకు, ఆగుతుందా, ఆనవాయితీకి భిన్నంగా వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు వెంటనే ఉప ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తుందా అలాగే రాష్ట్ర ప్రభుత్వం  ఏకంగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోతుందా? ఇటు కేసీఆర్, అటు అమిత్ షా వ్యూహాలు, ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి, వంటి ప్రశ్నలు, సందేహాలు కొన్ని ఇంకా అలాగే ఉన్నా, రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక వేడి అయితే మొదలైపోయింది.  గత ఎనిమిది సంవత్సరాలుగా అధికార తెరాస ఉపఎన్నికలకు ఒక ప్రత్యేక వ్యూహం (టెంప్లేట్) అమలు చేస్తోంది. ఉపఎన్నిక జరిగే నియోజకవర్గంలో ప్రతి ఓటరును ఇంటి అల్లుడిలా చూసుకుంటూ వస్తోంది. నియోజక వర్గం ప్రజలు అడిగినవి, అడగనవి, అడిగినా అంతవరకు పట్టించుకోని పనులన్నీ చకచకా కానిస్తోంది. ఇతర నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంటింటికీ వెళ్లి, ఇంటిల్లిపాది యోగాక్షేమాలు తెలుసు కుని, ఇంట్లో ఉన్న ఓట్ల లెక్కన కవర్లు చేతిలో పెట్టి వచ్చారు. ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు నుంచి తాగినోడికి తాగినంత తిన్నోనికి తిన్నంత అన్న విధంగా, ఇంట్లో పొయ్యి రాజేయవలసిన అవసరం లేకుండా ప్రజల అవసరాలన్నీ అధికార పార్టీ,  శ్రీ సర్కార్ వారు, గౌరవ ప్రజా ప్రతినిధులు, పెద్దలు చూసుకున్నారు. హుజూర్ నగర్ నుంచి హుజురాబాద్ వరకు అదే పద్దతి కొనసాగింది. హుజురాబాద్ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. దేశ చరిత్రలో ‘అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక’ గా హుజురాబాద్ చరిత్రను సృష్టించింది.   నిజానికి రాజగోపాల రెడ్డి, రాజీనామాకు ఇది కూడా ఒక కారణంగా ఆయన చెప్పు కుంటున్నారు. ఉప ఎన్నిక వస్తే నిధులొస్తాయి,దళిత బంధు వంటి పథకాలు అమలవుతాయి, పనులవుతాయి, పెన్షన్లు, రేషన్ కార్డులు వస్తాయి,అందుకే, నియోజక వర్గం ప్రజలకు మేలుకోరి రాజీనామా చేస్తున్నానని ప్రకటించు కున్నారు. సరే ఆయన మాటలు నమ్మినోళ్లు నమ్ముతారు లేనోళ్ళు లేదనుకోండి, అది వేరే విషయం.  అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక, హుజురాబాద్ నవ్వుల పాలైన ఫార్ములానే ముగోడులో ఫాలో అవుతారా? వరసగా మూడవ (హ్యాట్రిక్) ఓటమి నుంచి తప్పించుకునేందుకు కొత్త వ్యూహం అమలు చేస్తారా? అంటే, గత అనుభవాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాన్ని మార్చుకునే అవకాశం లేక పోలేదని అంటున్నారు. అంతే కాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే పార్టీ నాయకులకు ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజగోపాల రెడ్డి రాజీనామా కారణంగా మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైన నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్  సోమవారం (ఆగస్టు 8) హైదరాబాద్ లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభ వేడుడుకల అనతరం, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర జిల్లా నేతలతో సమావేశమైనట్లు సమాచారం . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉపఎన్నికకు సన్నద్ధం కావాలని ఆదేశిస్తూనే,  మునుగోడు ఉప ఎన్నికపై అనవసరంగా హైరానా పడద్దు అనే సూచన కూడా చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా  తిపక్ష పార్టీలు అయోమయంలో ఉన్నారు. వారు తీసుకున్న గోతిలో వారే పడతారు. మన పని మనం మెల్లిగా చేసుకుంటూ పోదాం  అంటూ నాయకుల దూకుడుకు బ్రేకులు వేసినట్లు తెసుస్తోంది. అంతకంటే ముఖ్యంగా రాజగోపాల రెడ్డి రాజీనామాతో ప్రోటోకాల్ సమస్యలు తొలిగి పోయినా కారణంగా ఇక నియోజక వర్గంలో పందారం కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ప్రారంభిద్దామని కొందరు నాయకులు సూచించినా ... ముఖ్యమంత్రి,  తొందర వద్దు  .. నింపాదిగా ఆలోచిద్దాం, మరో రెండు మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికల వ్యూహం, కార్యాచరణ ఖరారు చేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. అంటే, ఒకటికి రెండు సార్లు విఫలమైనా ఫార్ములాను మళ్ళీ అమలు చేసి మళ్లీ నవ్వులపాలు కాకూడదని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లుగా ఉందని, తెరాస ముఖ్యనేత ఒకరు చెప్పారు. మరోవంక, మంత్రి కేటీఆర్ కూడా, ‘మునుగోడు’ మరో ఉప ఎన్నిక,అంతకు మించి ప్రత్యేకత ఏమీ లేదని తేల్చేశారు. అంటే, ఓడినా, హుజురాబాద్ లో లా కాకుండా కాసింత హుందాగా ఓడిపోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెస్లుస్తోంది. అదీగాకా, హుజురాబాద్ లో లాగా కోట్లు కుమ్మరిస్తే జనం అందుకు కారణమా అయిన రాజగోపాల రెడ్డికి కృతజ్ఞతను చూపుతారనే కారణంతో పాటుగా జీతాలకే దిక్కులేని పరిస్థితి హుజురాబాద్ స్థాయిలో ప్రభుత్వ ఖజానా నుంచి కాసులు కుమ్మరించడం కుదిరే పని కాదని, ఆ పోలిక తేవడం వలన నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి, భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, ముఖ్యమంత్రి ఆచి తూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు.

మాధవ్ కు వైసీపీ మహిళా నేతల మద్దతు..సిగ్గు సిగ్గు

ఒక మహిళతో అసభ్యంగా వీడియో కాల్ లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన గోరంట్ల మాధవ్ కు వైసీపీ మహిళా నేతలు మద్దతుగా మాట్లాడటం పై జనం ఆశ్చర్య పోతున్నారు. మహిళా నేతలు అయి ఉండీ.. ఇక అసభ్య వీడియోలో అడ్డంగా దొరికి పోయిన ఎంపీకి మద్దతుగా నిలవడంపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాలన్నీ మాధవ్ వ్యవహారంపై మండి పడుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం పట్ల నిరసన వ్యక్తమౌతోంది. గతంలో ఎన్ని జరగలేదు.. అయినా ఆ వీడియో నిజమో, మార్ఫింగో తేలకుండా మాధవ్ ను తప్పుపట్టడం ఏమిటని మంత్రి రోజా ప్రశ్నిస్తున్నారు. పైపెచ్చు తెలుగుదేశం హయాంలో ఇంత కంటే ఎక్కువే జరిగాయిగా అంటూ.. మాధవ్ చేసిన ఛండాలాన్ని రోజా సమర్థించడాన్ని మహిళా సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మూడురోజు పాటు సైలెంట్‌గా ఉండి.. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ నిజమో..కాదో తేల్చిచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఓ లేఖరాసి సైలెంట్ అయిపోయారు. ఇక మిగిలిన వారంతా మీడియా కంటపడకుండా ఉండేందుకు చాలా వరకూ ఇంటికే పరిమితమైపోయారు.  ఆ వీడియో వ్యవహారం మరుగున పడే వరకూ సైలంట్ గా ఉండాలన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ ఈ రచ్చ సద్దుమణిగే వరకూ అసలు మాట్లాడకుండా ఉండటమే మేలని భావిస్తున్నారనిపించేలా వ్యవహరిస్తున్నారు.  పార్టీ ఎంపీ మాధవ్ వ్యవహరించిన తీరు  పార్టీ ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతోందని మోజారిటీ వైసీసీ నేతలు అంటున్నారు. అటువంటి ఎంపీని వెనుకేసుకురావడం ఎంత మాత్రం సరికాదని వారు మొత్తుకుంటున్నారు.