ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ... గులాబి అధికారానికి చెక్ పెట్టే స్కెచ్చేనా?

వచ్చే ఎన్నికల్లో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌ను గద్దె దింపి... అటు నుంచి అటే ఫామ్ హౌస్‌కు పంపి.. తెలంగాణలో అధికార పీఠాన్ని హస్తగతం చేసుకొనేందుకు మోదీ, అమిత్ షా ద్వయం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధం అన్న తీరులో కమలనాథులు వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అనూహ్య వ్యూహాలు పన్నుతున్నారు. అదిగో అందులో భాగమే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మునుగోడులో బహిరంగ సభకు హజరై ఆ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతోనూ, నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ తోనూ భేటీలు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణతో తెలుగేదేశం పార్టీలో నేతలు ఖాళీ అయిపోయారు కానీ, క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇంత కాలం ఆ క్యాడర్ ఏ పార్టీకి మద్దతుగా కదిలిన పరిస్థితి లేదు.  అదిగా ఆ క్యాడర్ అవును తెలుగు దేశం క్యాడర్ తమకు మద్దతు పలికేలా చేసుకోవడం అనే వ్యూహంతోనే అమిత్ షా మునుగోడు సభ అనంతరం రామోజీరావు, ఎన్టీఆర్ లతో వేరువేరుగా భేటీ కావడమని అంటున్నారు.  తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీతో కలబడి నిలబడి గెలవాలంటే...  తెలంగాణ తెలుగుదేశం క్యాడర్ అండ అవసరమని కమలనాథులు భావిస్తున్నారు. నేరుగా చంద్రబాబుతో ఆ విషయం మాట్లాడే కంటే.. ఎన్టీఆర్ ద్వరా అయితే ఆ పని సులువు అవుతుందని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫ్యన్ బేస్ కూడా తోడయ్యేలా కమలనాథులు వ్యూహం పన్నారని అంటున్నారు.  కోరినా జూనియర్ ఎన్టీఆర్ కమలం గూటికి చేరే అవకాశం లేదని బీజేపీ అగ్రనేతలకు బాగానే తెలుసు. అందుకే ఏపీలో తెలుగుదేశంకు కమలం అండ, తెలంగాణలో కమలానికి తెలుగుదేశం అండ అనే ఫార్ములాను తెరమీదకు తీసుకు వచ్చారంటున్నారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ తెలుగుదేశం సరథ్య బాధ్యతలు చేపట్టి బీజేపీతో మైత్రి కొనసాగించేలా. అందుకు ప్రతిగా ఏపీలో తెలుగుదేశంతో బీజేపీ మైత్రీ బంధం బలపడేలా ఒక ఒప్పందం ఖరారు చేసుకునే వ్యూహంలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా బేటీ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు.  అంతే కాకుండా తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రుల ఓట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి. వారంతా సాధారణంగా తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతారన్న అంచనాతో అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ నిర్వహించారని చెబుతున్నారు.

మునుగోడును ముంచెత్త‌నున్న నోట్లు!

చిన్న ఊరు దాన్ని ప‌ట్టించుకోలేదు  ఓ కోటీశ్వ‌రుడు.. ఫ‌లితంగా  ఆయ‌న రాజ్యాన్ని ఆ ఊరువాళ్లే  దెబ్బ తీశారు. . ఇదో సినిమా లో భాగం. కానీ మునుగోడు వ్య‌వ‌హారం వేరు.  కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ‌డం, బీజేపీ నీడ‌లోకి వెళ్ల‌డంతో మునుగోడు పై రాజ‌కీయ‌పార్టీల దృష్టి ప‌డింది. ఇక్క‌డ కావడానికి ఉప ఎన్నిక‌లే కానీ రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు దీన్ని సెమీస్‌గా భావించి మ‌రీ  కాం గ్రెస్‌, టీఆర్ ఎస్‌, బీజేపీలు పోటీకి సిద్ధ‌ప‌డుతున్నాయి. ఉప ఎన్నికేగా అనుకోలేదు. ఇది సాధిస్తేనే  పార్టీ ప్ర‌తిష్ట రెండింత‌ల‌వుతుంద‌ని టీఆర్ ఎస్‌, కేసీఆర్  మీద ఆగ్ర‌హంతో ఎలాగ‌యినా మునుగోడు సాధించా ల‌న్న ప‌ట్టుద‌ల‌తో బీజేపీ, ఏది ఏమ‌యినా మునుగోడు మ‌నం సాధించి తీరాల్సిందేనని  కాంగ్రెస్ కంక‌ణం క‌ట్టుకుంది. అయితే  ఈ మూడు పార్టీలూ ప్ర‌జ‌ల్ని పోనీ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి చేయాల్సిన అన్ని ప్ర‌యత్నాల మీద ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇందులో కీల‌క‌మైన‌ది ఓట‌ర్ల‌కు నోటు రుచి మ‌రింత చూప‌డం. ఎన్నిక‌లంటేనే ఖ‌ర్చుతో కూడిన ప‌ని. ఇటీవ‌లి కాలంలో మ‌రింత పెరిగింది. పార్టీ త‌ర‌ఫు నిల‌బెట్టే అభ్య‌ర్ధి మంచివాడా, స‌మ‌ర్దుడా అన్న‌ది అవ‌త‌ల పెడితే ఆయ‌న పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో ఎంత పెట్ట‌గ‌ల‌డు, ఓట్ల‌ను ఏమేర‌కు తూకానికి కొనేయ‌గ‌ల‌డ‌న్నదే ధ‌ర్మ‌సూత్రంగా అమ‌లుజ‌రుగుతోంది. అదే పంథాను అన్ని పార్టీల‌ వారూ అనుస‌రిస్తున్నారు. ఇది చాలాకాలం నుంచే ఉన్న ఎన్నిక‌ల సాంప్ర‌దా యం అంటున్నారు విశ్లేష‌కులు. దీనికి అడ్డుక‌ట్ట వేయ‌డం ఎవ‌రివ‌ల్లా కావ‌డం లేదు. పైగా ఖ‌ర్చుల‌తో కూడిన ఎన్నిక‌ల‌కు ఆ మాత్రం పెట్టాల్సి వ‌స్తుంద‌నే స‌మాధానాలే విన‌వ‌ల‌సి వ‌స్తుంది.  చిత్ర‌మేమంటే, అభ్య‌ర్ధులు ఖ‌ర్చు పెట్ట‌గ‌లిగిన‌వార‌యితేనే వారికి పార్టీ ప్రాధాన్య‌త‌నీయ‌డం. అస‌లా అవ కాశ‌మే లేని బీసీ నేత‌ల‌కు పార్టీలు కేవ‌లం ప్ర‌చారానికి ఉప‌యోగ‌ప‌డే సేన‌గానే చూస్తున్నాయి. మంచి అభ్య‌ర్ధి, జ‌నంలో ప‌లుకుబ‌డి ఉన్న‌ప్ప‌టికీ, కాస్తంత గెలుస్తాడ‌న్న న‌మ్మ‌కం పార్టీకి ఉన్న‌ప్ప‌టికీ, ఎదుటి పార్టీ అభ్య‌ర్ధి, ఆయ‌న త‌ర‌ఫున ఆర్ధిక మ‌ద్ద‌తునిచ్చేవారి స‌త్తా అన్నీలెక్క‌లోకి వ‌స్తుంటాయి క‌నుక బీసీ నేత ల‌కు పార్టీలు ధైర్యం చేసి టికెట్ ఇవ్వ‌డ‌మే లేదు.  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో సిట్టింగ్ స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి వచ్చింది. విజ‌యం సాధించేందుకు మునుగోడులో కోట్లు కుమ్మ‌రిం చేందుకు పార్టీ వెనుకాడ‌టం లేదు. ప‌రిస్థితులు ఎలా ఉన్నా, కేసీఆర్‌ను భంగ‌ప‌రిచేందుకే బీజేపీ నిర్ణ‌యించుకుంది. అందుకు మునుగోడు విజ‌యం స‌ద‌వ‌కాశంగా క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. క‌నుక ఖ‌ర్చుతో నిమిత్తం లేకుండా ప్ర‌చారాన్ని భారీగానే సాగించేందుకు సిద్ధ‌ప‌డింది బీజేపీ. ఎంత వ్య‌యం అవుతుంద‌నే  లెక్క‌ల కంటే ఎంత మెజారిటీ వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌కే ప్రాధాన్య‌త‌నీయ‌డం గ‌మ‌నార్హం.  కాగా, ఎలాగైనా మునుగోడు స్థానాన్ని దక్కించుకొని వచ్చే ఎన్నికల్లో ఆధిపత్యం తమదేనని రుజువు చేసు కునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఓడితే ముప్పు తప్పదని ఆ పార్టీ భావిస్తోంది. మునుగోడులో బీసీల ఓటింగ్ శాతం అధికంగా ఉన్న‌ప్ప‌టికీ ఉప ఎన్నిక‌లో గెల‌వ‌డం అవ‌స‌రం గ‌నుక ఎన్నిక‌ల ఖ‌ర్చు భ‌రాయించేవారికే టిక్కెట్ ఇవ్వ‌డానికి నిర్ణ‌యించుకుంది.  పార్టీ అభ్య‌ర్ధి కంటే ఈ ఉప ఎన్నిక‌లో ఖ‌ర్చుకు వెనుకాడకూడ‌ద‌న్న నిబంధ‌న పెట్టుకున్న‌ట్టే తోస్తుంది.   ప్రతిష్ఠాత్మకంగా ముందుకొచ్చిన మునుగోడు ఎన్నికల్లో భారీ ఖర్చుకు మూడు పార్టీలు తెరలేపాయి. బీజేపీకి లేని ఓటింగ్ శాతాన్ని తెచ్చుకునేందుకు రాజగోపాల్ రెడ్డి తన శక్తియుక్తులన్నింటినీ ధారపోయా ల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఒక ఎంపీపీతో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. వారికి భారీగానే ముడుపులు ముట్టజెప్పారని వైరివర్గాలు ఆరోపిస్తు న్నాయి. ఇంకా నేతల కొనుగోళ్లకు భారీ ఆఫర్ ఇస్తామని ఆశ చూపుతున్నారని ఆరోపణ లున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు, కొందరు ప్రజాప్రతినిధులు చేరారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు అడ్వాన్సులు ఇచ్చి అడ్డుకట్ట వేసే ప్రయ త్నం చేసిందని ప్రచారం. అంటే అధికార పార్టీ కూడా ముడుపుల మూట విప్పిందని గుసగుసలు. అంతర్గత కుమ్ములాటల కారణంగా, రేవంత్ రెడ్డికి కరోనా కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా సర్దుకోకున్నా ఓ అంచనాకు అయితే వచ్చిందని తెలిసింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే భారీ ఖర్చు కు వెనుకాడని నేతకే సీటు ఖరారు చేసే అవకాశముందని తెలిసింది. తమకే సీటు కేటాయించా లంటూ అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ లో మొదట బీసీ నేతలు రాగం అందుకున్నారు. ప్రస్తుతం  ఆ  రాగం నెమ్మదించింది. ఎందుకంటే భారీ ఖర్చు భరించలేరనే విషయం చర్చకు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అధి ష్ఠానమే ఖర్చు పెట్టుకుంటుందన్న ప్రచారం ఉన్నా అభ్యర్థి కూడా భారీగానే పెట్టుకోవాల్సి ఉందనే ఆలో చన ఉంది. అధిష్ఠానాల వద్దకు వెళ్లిన బీసీ నేతల ముందు ఎన్నికల ఖర్చు విషయం లేవనెత్తినట్లు తెలి సింది. ఎం తంటే సుమారు రూ.100 కోట్లు పెట్టగలరా అంటూ బీసీ నేతలను ఆయా పార్టీల అధి నేతలు ప్రశ్నించారని సమాచారం. నేతలు, ప్రజాప్రతినిధుల కొనుగోలు, ఓటర్లకు తాయిలాలు, మద్యం, సొంత పార్టీ ప్రచారం తదితర ఖర్చు లు కలుపుకొని అటూ ఇటుగా సుమారు రూ.100 కోట్లవుతుందని ఓ అంచనాకు వచ్చినట్లు భావిస్తున్నారు. అంత ఖర్చు తాము భరించలేమంటూ బీసీ నేతలు మెల్లిగా వెనక్కి తగ్గినట్లు విశ్లేషకులు అంటున్నారు. దీంతోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బీసీ నేతలకు అవకాశం సన్నగిల్లిందని అంటు న్నారు. దీన్నిబట్టి మూడు పార్టీలు కలిపి మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో సుమారు రూ.300  కోట్లకు పైగా ఖర్చు చేస్తాయన్న మాట. అధికార పార్టీకి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అదనంగా ప్రభుత్వ ఖర్చు ఉండటం వేరే విషయం. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశం లోనే కాస్ట్లీ ఎన్నిక కానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాయిలాల విషయానికి వస్తే పండుగే పండుగని ఎక్కువ మంది ఓటర్లు మురిసిపోతున్నారు.

రోహిత్‌.. పోలీసు.. సారీ, టీచ‌ర్‌!

పోలీసు పేరు విన‌గానే పిల్లలు భ‌య‌ప‌డ‌తారు. రోడ్డు మీద, బ‌స్టాండ్‌, రైల్వే ప్లాట్‌ఫారాల మీద‌ అడుక్కు నే పిల్ల‌లు మ‌రీ భ‌య‌ప‌డి పారిపోతారు. వారి జీవ‌నోపాధిని అడ్డుకుంటార‌ని, వార‌ని దొంగ‌లుగా జ‌మ‌క‌ట్టి జైల్లో వేస్తే త‌ల్లినో, తండ్రినో ఎలా పోషించ‌ డ‌మ‌న్న భ‌యాందోళ‌న ఎప్పుడూ ఉంటుంది. కానీ సికిం ద‌ర్‌పూర్ క‌ర‌ణ్ గ్రామంలో పిల్ల‌ల‌కు మాత్రం ఈ పోలీసాయ‌నంటే అపార‌మైన భ‌క్తి, గౌర‌వం. ఆయ‌న ఝాన్సీకి ట్రాన్స్ర్ ఫ‌ర్‌ మీద వెళుతున్నాడ‌ని తెలిసి గొల్లుమ‌న్నారు. అలాంటివాడు మ‌ళ్లీ దొర‌క‌డ‌ని. రోహిత్ కుమార్ యాద‌వ్ ప్ర‌భుత్వ రైల్వే పోలీసు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఉన్నావ్‌లో ఆయ‌న ఉద్యోగం. ఆయ‌న కేవ లం పోలీసు ఉద్యోగంతో స‌రిపెట్టుకోలేదు. రోజూ చాలామంది అనాథ‌పిల్ల‌లు రోడ్ల‌మీద‌, రైల్వేస్టేష‌న్ ద‌గ్గ‌రా అడుక్కుంటూ తిర‌గ‌డం చూసి వీళ్ల‌కి ఏద‌న్నా చేయాల‌ని త‌లిచాడు. వాళ్ల‌కి చ‌దువు నేర్పితే కాస్తంత‌యి నా జీవితంలో నిల‌బ‌డ‌తార‌న్న ఆలోచ‌న అమ‌లు చేయాల‌నుకున్నాడు. వెంట‌నే త‌ను ప‌నిచేసే రైల్వే స్టేష‌న్ ప‌క్క‌నే హ‌ర్ హాథ్‌మే క‌ల‌మ్ అనే పేరుతో చిన్న స్కూలు ఆరంభించాడు. అదీ త‌ర‌గ‌తి గదులు లేని స్కూలు. అంటే చెట్ల‌కింద‌నే పాఠాలు చెప్పేవాడు. మొద‌ట్లో ఒక్క‌రిద్ద‌రు నిజంగా ఆసక్తి  ఉన్న పిల్ల‌లే చేరారు. వారు వాళ్ల స్నేహితుల్ని లాక్కొచ్చార‌ట‌. దీనికి తోడు ఉచితంగా ఆయ‌న పాఠాలు చెబుతున్నాడ‌ని తెలిసి కొంత ఆస‌క్తీ చూపారు. పైగా చేతిలో బెత్తం లేని టీచ‌ర్ ని చూస్తే ఎవ‌రిక‌యినా ఓకే క‌దా! అలా విద్యా ర్ధుల సంఖ్య పెరిగి చాలాకాలం అలా చెట్ల‌కింద‌నే బోధించేవాడు ఈ పోలీసాయ‌న‌. త‌న డ్యూటీ కాగానే వెంట‌నే టీచ‌ర్‌గా మారి పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పేవాడు.  రోహిత్ చేస్తున్న ప‌ని ఆ గ్రామంలో పెద్ద‌ల‌కు ఎంతో న‌చ్చింది. పోలీసే కాదు ఇత‌నిలో మంచి టీచ‌ర్ కూడా ఉన్నాడ‌న్న‌ది గుర్తించారు. వారంతా మాట్లాడుకుని ఊళ్లో పంచాయితీ ఆఫీసే స్కూలుగా ఉప‌యోగించుకో మ‌ని అన్నారు. యాద‌వ్ ముందు కొంత సందేహించాడు. ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తూ  ఇలా  వీరి స‌హాయం తీసుకోవ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అని. కానీ త‌న పై అధికారుల‌కు అత‌ని సంగ‌తి తెలిసింది. ఫ‌ర్వాలేదు,  పిల్ల‌ల‌కు పాఠాలు చెప్ప‌డం గొప్ప వృత్తి క‌నుక అది కూడా చేయ‌మ‌ని ప్రోత్స‌హించారు. అంతే పోలీసాయ న విజృంభించి మ‌రింత  బాగా పాఠాలు చెబుతూ విద్యార్ధుల సంఖ్య‌ను పెంచగ‌లిగాడు. చాలామంది అనాథ పిల్ల‌ల‌కు అత‌నే గురువు, దైవంగా మారాడు. వారి ప్ర‌వ‌ర్త‌నలోనూ ఎంతో మార్పు రావ‌డం గ్రామ పెద్ద‌లూ గ‌మ‌నించారు. పోలీసాయ‌నా.. శ‌భాష్ అన్నారు.  రోహిత్ మాత్రం ఇదంతా త‌న తండ్రి వార‌స‌త్వ‌మ‌నే అంటాడు. రోహిత్ తండ్రి చంద్ర‌ప్ర‌కాష్ యాద‌వ్ కూడా  ఇటావా ద‌గ్గ‌ర ముద‌యినా గ్రామంలో 1986లో ఓపెన్ ఎయిర్ స్కూలు నిర్వ‌హించారు. ఆయ‌న రైతుల పిల్ల‌ల‌కు చ‌దువునేర్పుతుండేవారు. తండ్రివార‌స‌త్వంలో పెట్టిన స్కూలుకి వ‌చ్చే విద్యార్ధుల‌కు రోహిత్ యాద‌వ్ త‌న జీతంలో కొంత ఖ‌ర్చుచేసేవాడు. పిల్ల‌ల‌కు పుస్త‌కాలు, దుస్తులు కూడా ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. పిల్ల‌ల్ని ఎంతో బాగా చూసుకోవ‌డంతో అంద‌రూ ఆయ‌న్ను తండ్రిలా, అన్న‌లా భావించేవారు. జూలై 16న ఝాన్సీకి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాడు. దానికి సంబంధించి అధికారులు పంపిన ఆదేశాన్ని చూసి కొంత ఆనందించాడు, చాలా బాధ‌ప‌డ్డాడ‌ట‌! పిల్ల‌ల‌కూ ఈ సంగ‌తి తెలిసి ఎంతో బాధ ప‌డ్డారు. కానీ త‌ప్ప‌ని ప‌రిస్థితి. ముగ్గురు పిల్ల‌ల తండ్రి అయిన రోహిత్ త‌న జీవ‌నానికి త‌ప్ప‌ని స్థితిలో ఝాన్సీకి వెళుతున్నాన‌నే అన్నాడు. పిల్ల‌లు ఆనందించారు. 

జ‌కీర్ అన్న‌వి ఒప్ప‌యితే, నూపుర్‌వి త‌ప్పు ఎలా? ... రాజ్ ఠాక్రే

మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద కామెంట్లు చేసిన బీజేపీ బహిష్కృత నాయకురాలు నూపుర్‌ శర్మకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ ఠాక్రే మద్దతు ప్రకటించారు. మహమ్మద్‌ ప్రవక్తపై నూపుర్‌ చేసిన వ్యాఖ్యలనే.. గతంలో జకీర్‌ నాయక్‌ చేశాడని ఆయన గుర్తుచేశారు. జకీర్‌ నాయక్‌ చేస్తే తప్పుకానప్పుడు.. నూపుర్‌ది తప్పెలా అవుతుంద‌ని ఆయన ప్రశ్నించారు. జకీర్‌ నాయక్‌ను ఎవరూ క్షమా పణలు చెప్పాలని డిమాండ్‌ చేయలేదని పేర్కొన్నారు. ప్ర‌వ‌క్త‌మీద కామెంట్ చేసింద‌నే ఆరోప‌ణ‌తో ఆమెను పార్టీ నుంచి బీజేపీ స‌స్పెండ్ చేసేవ‌ర‌కూ వేధించారు. ఆమె పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్లు వెల్లువెత్తాయి. బిజెపి ప్ర‌భుత్వం ఆమెను ర‌క్షిస్తోంద‌ని ఒక వ‌ర్గంవారూ మండిప‌డ్డారు. యావ‌త్ దేశానికీ ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వెల్లువెత్తారు. అయితే గ‌తంలో జ‌కీర్ నాయ‌క్ చేసిన కామెంట్ల‌కు ఇటీవ‌ల నూప‌ర్ చేసిన కామెంట్ల‌కు పెద్ద‌గా తేడా ఏమీ లేద‌ని అప్పుడు జ‌కీర్ విష‌యంలో ఎవ్వ‌రూ నోరు విప్ప‌నపుడు నూపుర్ విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేయడం అర్ధ‌ర‌హిత‌మ‌ని రాజ్ ఠాక్రే అన్నారు. ఒకే అంశంలో ఇద్ద‌రికి వేరు వేరు తీర్పులు ఎలా చెప్ప‌గ‌ల్గు తార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.  అంతేగాక‌, గ‌తంలో ఏఐఎంఐఎం నాయ‌కుడు అక్బ‌రుద్దీన్ ఒవైసీ, ఆయ‌న సోద‌రుడు  హిందూదేవ‌త‌ల మీద వివాదాస్ప‌ద వ్యా ఖ్యలు చేశార‌ని అప్ప‌ట్లో ఆయ‌న్ను ఎవ్వ‌రూ దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు కోరాల‌ని డిమాండ్ చేయ‌క పోవ డం గురించి కూడా ఠాక్రే ప్ర‌స్తావించారు. ప్రభుత్వం ఆయ‌న్ను నిలువ‌రించ‌డానికి ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. 

ఆసుపత్రిలో అమితాబ్.. ఎందుకంటే?

బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాననీ, ఆరోగ్యం నిలకడగానే ఉందని  ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారన్న సంగతి తెలియగానే ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇలా ఉండగా అమితాబ్ కరోనా బారిన పడటం ఇది రెండో సారి. మొదటి సారి 2020లో అమితాబ్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన కుటుంబంలో కుమారుడు, కోడలు, మనవరాలు సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు.  అమితాబ్ ప్రస్తుతం  ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ 14వ సీజన్ షూటింగులో ఉన్నారు. అలాగే, ఆయన కీలక పాత్రలో నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్ తదితరులు నటిస్తున్నారు.  అలాగే, ‘గుడ్‌బై’, ‘ఊంచాయి’ సినిమాల్లోనూ అమితాబ్ నటిస్తున్నారు.  

భ‌య‌పెడుతున్న టొమాటో ఫ్లూ

దేశంలో కోవిడ్‌-19 భ‌యాందోళ‌న‌లు ఇంకా పూర్తిగా  తొల‌గిపోక‌ముందే టొమాటో ఫ్లూ భ‌య‌పెడుతోంది. ముఖ్యంగా ప‌దేళ్ల పిల్ల‌ల‌కు ఇది సోకుతోంద‌ని డాక్ట‌ర్లు అంటున్నారు. ఇప్ప‌టికే దేశంలో ప‌లు ప్రాంతాల్లో ప‌దేళ్ల‌లోపు పిల్ల‌లు వంద‌మందికి ఈ వ్యాధి సోకింద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.  ఈ ఫ్లూ వ్యాధి వల్ల పిల్లల, చేయి, పాదాలు, నోటి వద్ద వైవిధ్యంగా కనిపిస్తోంది. హర్యానా, కేరళ, కర్ణాటక , తమిళనాడు ఒడిశా రాష్ట్రాల్లో టొమాటో ఫ్లూ జ్వరాల కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్రం  రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.టొమాటో ఫ్లూ వ్యాధిపై కేంద్రం తాజాగా సలహా జారీ చేసింది. కేరళలోని  కొల్లం జిల్లా లో టొమాటో ఫ్లూ జ్వరం మొదటి కేసు బయటపడింది.  ఈ ఫ్లూ వ్యాధి లక్షణాలు , దుష్ప్రభావాల గురించి పిల్లలకు  అవగాహన కల్పించాలని కేంద్రం  సలహా ఇచ్చింది. టొమాటో ఫ్లూ జ్వరపీడితులకు అలసట, శరీర నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్పారు. టొమాటో ఫ్లూ వచ్చిన వారి నుంచి ఇతర పిల్లలకు లేదా పెద్దలకు ఫ్లూ వ్యాధి సంక్రమించకుండా నిరోధించడానికి ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. ఒడిశా రాష్ట్రంలో 26 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు.ఈ ఫ్లూ వచ్చిన పిల్లలను తాకవద్దని, పిల్లలు బొటనవేలిని చప్పరించే అలవాటును మానుకోవాలని వైద్యులు సూచించారు.జలుబుతో ముక్కు కారుతున్నపుడు, దగ్గినపుడు చేతిరుమాలును అడ్డం పెట్టుకోవాలని వైద్యులు చెప్పారు. వేడినీళ్లతో పిల్లలకు స్నానం చేయించడం, రోగనిరోధక శక్తిని పెంచేలా పోషకాహారం అందించాలని వైద్యులు కోరారు. వ్యాధిపీడితులకు తగినంత విశ్రాంతి, సరైన నిద్ర అవసరమని ఆరోగ్యశాఖ నిపుణులు సూచించారు.

విదేశాలకు గాంధీ కుటుంబం.. ఎందుకంటే?

గాంధీ కుటుంబం మొత్తం విదేశాలకు పయనమై వెళుతున్నారు. సోనియాగాంధీ, ఆమెకు తోడుగా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ కూడా విదేశాలకు పయనమై వెళుతున్నారు. సోనియా గాంధీ హెల్త్ చెకప్ నిమిత్తం విదేశాలకు పయనమవ్వనున్నారనీ, ఆమెకు తోడుగా రాహుల్, ప్రియాంకలు కూడా వెళతారని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ తెలిపారు. కాగా వచ్చే నెల 4న ఢిల్లీలో జరగనున్న మెహంగాయ్ పర్ హల్లా బోల్ ర్యాలీలో రాహుల్ పాల్గొంటారని చెప్పారు. అలాగే వచ్చే నెల 7 నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదల కానుంది. ఈ పరిస్థితుల్లో సోనియా గాంధీ హెల్త్ చెకప్ కు విదేశాలకు వెళ్లనుండటం, ఆమెతో పాటు రాహుల్, ప్రియాంకలు కూడా తోడుగా వెళ్లనుండటంతో కాంగ్రెస్ లో అయోమయం నెలకొంది.  ఒక వైపు సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన, మరో వైపు కీలక సమయంలో పార్టీ అగ్రనేతలు లేకపోతే ఎలా అన్న ఆందోళన కాంగ్రెస్ లో నెలకొంది. అయితే ఇప్పటి వరకూ గాంధీ కుటుంబం విదేశీ యానం ఎప్పుడు అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. 

వైసీపీ నిండా బిల్డప్ బాబాయ్ లే.. తాజాగా ఫొటో షూట్ తో హల్ చల్ చేసిన గుడివాడ అమర్నాథ్

వైసీపీ నాయకులు మంత్రుల వ్యవహార శైలి ఏదో టీవీ షోలో బిల్డప్ బాబాయ్ చేసే పెచ్చులను మించి పోతోందని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. రోజా తిరుమల స్వామి వారి దేవాలయంలో అనుచరులతో చేసిన హల్ చల్ మరువక ముందే రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫోటో షూట్ పేరిట చేసిన హంగామా ఇప్పుడు సమాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురౌతోంది. ఇటీవల ఆయన ఫొటో షూట్ పేరిట చేసిన హడావుడి నవ్వుల పాలు కావడమే కాకుండా విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. ఏదో ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమా తెరకెక్కుతోందా అన్నట్లుగా ఆ హంగామా సాగింది. ఇంతకీ ఆ హడావుడి అంతా మంత్రిగారు వివిధ పోజుల్లో ఫొటోలు దిగేందుకేనని ఆ తరువాత తేలింది. ఈ సందర్భంగా ఆయన పొటోలకు ఇచ్చిన పోజులు నేల విడిచి సాము చేసిన చందంగా ఉన్నాయని సెటైర్లు పేలుతున్నాయి.   మంత్రి గుడివాడ గుర్నాథ్ కు బిల్డప్ బాబాయ్ అన్న ట్యాగ్ కూడా తగిలించేశారు నెటిజన్లు. మరో వైపు మంత్రిగారు పోజులు పెడుతూ దిగిన పొటోలు విపక్షాలు సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి షేర్లు చేస్తున్నారు.   గుడివాడ అమర్‌నాథ్ మంత్రిగా రాష్ట్రానికి ఏమైనా పరిశ్రమలు కానీ.. పెట్టుబడులు కానీ తీసుకు వచ్చారా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే కానీ,   జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించేందుకు మాత్రం అపరాత్రి, అర్దరాత్రి అన్న తేడాలేకుండా ఎవర్ రెడీగా ఉంటారని మాత్రం పరిశీలకులు అంటుంటారు. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో  గుడివాడ అమర్నాథ్ కు పేరుకు ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా పదవి ఇచ్చారు కానీ ఆయనకు అప్పగించిన పని మాత్రం జనసేనానిపై విమర్శలు గుప్పించడానికేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అలాగే మంత్రి అంబటి రాంబాబుకు పేరుకు జల వనరుల శాఖ ఇచ్చినా.. ఆయనకు అప్పగించిన పని మాత్రం తెలుగుదేశం, చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికేనని అంటున్నారు. జగన్ తొలి కేబినెట్ లో ఇలా తిట్ల శాఖల మంత్రులుగా కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లు ఉండేవారనీ, ఇప్పుడు వారి స్థానాలను గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబులు బర్తీ చేశారని అంటున్నారు.     అలాగే నాటి మంత్రి అవంతి శ్రీనివాస్, ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు.. ఫోన్ కాల్ వ్యవహారం సైతం సోషల్ మీడియాలో గంట... అరగంట.. అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టి రచ్చ రచ్చ చేసి పారేశారు. ఇక థర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ, నటుడు పృద్దీరాజ్ సైతం ఎస్వీబీసీ చానల్ చైర్మన్‌గా బాద్యతలు చేపట్టి.. పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాకుండానే.. మహిళతో అసభ్యంగా పోన్ కాల్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి... ఉద్వాసనకు గురయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీలోని ప్రజా ప్రతినిధుల తీరుతెన్నులపై సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు ఎండగడుతున్నా.. వారు మాత్రం... తమ స్టైల్‌ ఇదే అన్నట్లుగా వ్యవహరించడంపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్ సంగతి అందరికి తెలిసిందే. దీంతో యాధా అధినేత.. తధా నాయకుడు అన్నట్లుగా ఉందని నెటిజన్లు(సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.)

హ‌ద్దు మీరుతున్న స‌రిహ‌ద్దు వివాదం

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన స‌మ‌యంలో అంతా బాగానేఉంటుంది. అన్న‌ద‌మ్ములుగానే భ‌విష్య‌త్తులో నూ కొన‌సాగుతాం అంటూ ఎన్నో అనుకున్నాం. కానీ  చీటికీ మాటికీ రాజ‌కీయ‌ప‌ర స‌మ‌స్య‌లు తలెత్తి రెం డు రాష్ట్రాల మ‌ధ్య ఏకంగా స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ల్ని పీక‌ల్లోతు తీసుకువ‌చ్చాయి.  తెలుగు రాష్ట్రాల మద్య సరి హద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.  నాగార్జున సాగర్ ప్రాజెక్ట్  వద్ద రెండు రాష్ట్రాల పోలీసుల మద్య వివాదం జరిగింది. ప్రాజెక్టుపైకి  ఏపీకి  చెందిన ఎస్ఐ వాహానాన్ని తెలం గాణ పోలీసులు అనుమ తించలేదు. దీంతో ఏపీ పరిధిలోకి వచ్చిన తెలంగాణ పోలీసు వాహనానికి ఏపీ పోలీసులు చలానా రాశారు. దీంతో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం ముదిరింది. చివరికి  ఈ పంచాయతీ పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు చేరింది. ఇరు పోలీసుల మధ్య రాజీ కుదిర్చే పనిలో పోలీసు పెద్దలు ఉన్నారు. గ‌తంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రేగింది. అది ఇరు రాష్ట్రాల అధికారులు హద్దు రాళ్లు పాతడం.. పీకేయడం దాకా వెళ్లింది. ఎప్పటికప్పుడు ఒక రాష్ట్రం అధికారులు రాళ్లు పాతడం.. నెంబర్లు వేయడం.. మరో రాష్ట్రానికి చెందిన అధికారులు పీకేయడం పరిపాటిగా మారింది. ఇది దాయా దులైన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న సరిహద్దు వివాదం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వా రావుపేట చెక్‌పోస్టు సమీపంలో ఈ వివాదం తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు సమీప ప్రాంత మైన అశ్వారావుపేట నుంచి అటు పశ్చిమగోదావరికి.. ఇటు తూర్పు గోదావరికి.. మరోవైపు తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు రహదార్లున్నాయి. సూర్యపేట- దేవరపల్లి జాతీయ రహదారి ఇక్కడి నుంచే వెళ్తుం టుంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్పష్టమైన  విభజన రేఖ ఉన్న ప్పటికీ అధికారుల వైఖరి వల్ల అప్పుడప్పుడూ ఇలాంటి సరిహద్దు తగాదాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా జీలుగుమిల్లి సమీపంలోని చెక్‌పోస్టు దగ్గరలో ఉన్న సరిహద్దు '0' కి.మీ రాయిని తీసి పడేసి.. అశ్వారావు పేట పట్టణం చివర్లో '0' కి.మీ గుర్తును చూపుతూ ఏపీ రోడ్లుభవనాల శాఖ అధికారులు రాయిని పాతారు. దీనిపై స్థానికుల ఫిర్యాదు మేరకు తెలంగాణ అధికా రులు తొలగించారు. దీంతో వివాదం మళ్లీ మొద లైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నపుడు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాంతం మొత్తం (పోలవరం ముంపు  ప్రాం తం మినహాయించి) తెలంగాణలోకి చేరిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సరిహద్దు అశ్వారావుపేటకు సమీపంలోని జీలుగుమిల్లివద్ద ఏర్పాటైంది. అక్కడే '0' కి.మీ రాయిని ఏర్పాటు చేశారు. ఆ సమీపంలోనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయశాఖ, ఎక్సైజ్‌, రవాణా, వాణిజ్య పన్నుల శాఖ, ఇంకా అటవీశాఖలతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకు న్నారు. ఈ ప్రాంతం గుండానే (సూర్యపేట- దేవరపల్లి) నేషనల్‌ హైవే 365బిబి వెళ్తూ ఉంది. ఇలా ఏర్పాటై దాదాపు ఏడేళ్లు కావస్తున్నా ఈ ప్రాంతంలో ఇప్పటికీ సరిహద్దుపై వివాదం రగులుతునే ఉంది. స్థానికంగా ఉండే కొందరు ఏపీలోనే ఉంటే బాగుంటుందన్న తమ ప్రయోజనాల కోసం అధికారులను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణ కూడా ఉంది. దీంతో అప్పుడప్పుడూ '0' కి.మీ రాయిని ఉన్నచోట నుంచి తీసి, అశ్వారావు పేటకు సమీపం లో అంటే దాదాపు 120 మీటర్లు పైగా జరిపి ఏర్పాటు చేశారు. దీంతో అప్పటికే అక్కడ నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఏపీలోకి వెళ్లిపోయినట్లయింది.

బాస‌ర ఐఐఐటి... నిత్య‌స‌మ‌స్య‌ల లోగిలి

బాస‌ర ఐఐఐటి విద్యాసంస్థ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్ర‌సిద్ధి. ఈ క్యాంప‌స్‌లో చ‌దువుకోవాల‌ని ఆంధ్రా మారుమూల ప్రాంతాల నుంచి కూడా వ‌స్తూంటారు. చాలాకాలం ఎంతో ప్ర‌శాంతంగా ఉన్న నిర్మ‌ల్ జిల్లా బాస‌ర ఐఐఐటి లో ఇటీవ‌లి కాలంలో విద్యార్ధులు ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌డం గ‌మ‌నించాం. ఇక్క‌డ చాలా కాలం నుంచి అధ్యాప‌కులు స‌రిప‌డా లేర‌ని, వైస్ ఛాన్స‌ల‌ర్ పోస్టు భ‌ర్తీ చేయాల‌ని, హాస్ట‌ల్ భోజ‌నం స‌రిగా ఉండ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీన్ని గురించి తెలంగాణా ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేస్తోంద ని విద్యార్ధులు తీవ్ర‌స్థాయిలో ఆందోళ నలు చేప‌ట్టారు. ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విద్యార్ధుల నాయ‌కుల‌తో మాట్లాడి వారి సమస్య‌లు సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించ‌డానికి అంగీక‌రిం చారు. అక్కడితో స‌మ‌స్య‌లు తీరిపోయాయి, ఇక ప్ర‌శాంతంగా ఉండ‌వ‌చ్చ‌ని విద్యార్ధులు భావించారు. కానీ ట్రిపుల్‌  ఐటీలో మళ్లీ టెన్షన్‌ వాతావరణం నెలకొంది.  ఒక స‌మ‌స్య తీరిన వెంట‌నే మ‌రో స‌మ‌స్య త‌లెత్తింది. ఈసారి మెస్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. మెస్‌లో భోజ‌నం స‌రిగా లేదంటూ చాలారోజులుగా విద్యార్ధులు ఫిర్యాదులు చేస్తూన్నారు. వార్డ‌న్‌లు, ఇన్‌ఛార్జులు ఎవ్వ‌రూ ఇన్నాళ్లూ అంత‌గా ప‌ట్టించుకోలేదు. కాగా ఇటీవ‌ల ఏకంగా విద్యార్ధుల‌కు అల్పాహారంలో క‌ప్ప‌నే వ‌డ్డించారు! టిఫిన్ క్ర‌రీలో క‌ప్ప రావ‌డంతో విద్యార్ధులు భ‌యంతో వ‌ణికారు.  ఇది సోషల్ మీడియాలో ఓ విద్యార్థి పోస్టు చేశాడు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత ఆహారం వడ్డిం చారంటూ ఆందోళన చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉన్నత విద్య కోసం ఇళ్లు, కుటుంబాలను వదిలేసి ఇక్కడికొస్తే.. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యార్థులు నినాదాలు చేశారు. కొద్దిరోజులుగా శాంతియుతంగా ఉన్న క్యాంప‌స్‌లో మంగళవారం(ఆగ‌ష్టు 23) తెల్లవారుజామున ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ పరిణామం విద్యార్థుల్లో ఆగ్రహజ్వాలకు కారణమైంది. క్యాంప్‌సలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందో ళన చేపట్టారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సీఐ వాహనా న్ని విద్యార్థులు ధ్వంసం చేశారు. మృతుడు నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి తండాకు చెందిన 19 ఏళ్ల రాథోడ్‌ సురేశ్‌. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకు న్నాడంటూ సురేశ్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని క్యాం పస్‌, పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సురేశ్‌ స్నేహితుల విచారణలో ఈ విషయం తెలిసిందని వెల్లడిం చాయి. సురేశ్‌ ఆర్జీ యూకేటీ ట్రిపుల్‌ ఐటీ లో ఇంజనీరింగ్‌ సివిల్‌ బ్యాచ్‌లో మొదటి సంవత్సరం విద్యార్తి. స్నేహితులతో ఎంతో కలుపుగోలుగా ఉండే సురేశ్‌ రెండ్రోజులుగా ముభావంగా ఉంటున్నాడు.  మంగళవారం ఉదయం కూడా స్నేహితులు పలకరించినా మాట్లాడకుండా హాస్టల్లోనే  ఉండిపోయాడు. తరగతులకు వెళ్లలేదు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తరగతుల నుంచి స్నేహితులు హాస్టల్‌ గదికి చేరుకునే సరికి సురేశ్‌ ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులే సురేశ్‌ను వర్సిటీ ఆస్పత్రికి, అక్కడి నుంచి జిల్లాలోని భైంసా ఆస్పత్రికి తీసుకెళ్లారు అయితే అప్పటికే అతడు మృతిచెందాడని  వైద్యులు తెలిపారు. సురేశ్‌ విషయంలో వర్సిటీ  అధికారులు  స్పం దించలేదని.. అంబులెన్స్‌ అందుబాటులో ఉంటే బతికేవాడని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీశ్‌లే ఇందుకు కారణం అని, వారికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ట్రిపుల్‌ ఐటీ ప్రధాన గేటు వద్దకు విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకు దిగారు.  పోలీసులు అక్కడికి చేరుకొని నిలువరించేందుకు ప్రయత్నించగా వారితో విద్యార్థులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ముథో ల్‌ సీఐ వినోద్‌రెడ్డి కారు అద్దాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. సీఐని సైతం అక్కడి నుంచి తోసే సేం దుకు ప్రయత్నించారు. దీంతో వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులే వర్సిటీ నుంచి బయటకు రావడంతో.. విద్యార్థులు శాంతించారు.  కాగా, సురేశ్‌ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం క్యాంపస్‌ నుంచి నిర్మల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న సురేశ్‌ తల్లిదండ్రులు గంగాధర్‌, సరోజ తమ కొడుకు ఆత్మహత్యపై పలు అనుమానాలున్నాయని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  రెండు రోజుల క్రితం పోలీసులు గంజా యి కేసు విషయమై వేధిస్తున్నారంటూ సురేశ్‌ ఫోన్‌లో తమతో చెప్పాడని తెలిపారు. పోలీసులు ఇబ్బందులకు గురి చేయడంవల్లే భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు నని అనుమానం వ్యక్తం చేశారు.    నిజాలు తేలే వరకూ పోస్టుమార్టం నిర్వహించేది లేదని పట్టుపట్టారు. చివరకు కొద్దిసేపు తర్వాత పోలీసు లు, అధికారుల హామీ మేరకు పోసుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి సురేశ్‌ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని తమ ప్రాథమిక విచా రణలో తేలిందని నిర్మల్‌ జిల్లా ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తులో అన్ని విష యాలు వెలుగు చూస్తాయని ఎస్పీ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్న బాస‌ర ఐఐఐటిలో స‌మ‌స్య‌ల‌కు అంతుండ‌టం లేద‌న్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.  రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్ధుల విద్య‌, భ‌ద్ర‌తా వాతావ‌ర‌ణాన్ని కాపాడేందుకు ఏ మా త్రం శ‌ద్ధ చూప‌డం లేద‌న్న విమ‌ర్శ‌లూ ఉన్నాయి. కేవ‌లం పెద్ద స‌మ‌స్య‌లు వ‌చ్చి ఇబ్బంది ప‌డుతు న్న త‌రుణంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆస‌క్తి చూపుతోంది గాని, అస‌లు విద్యాసంస్థ కాల క్ర‌మంలో ఇన్ని స‌మ‌స్య‌లు ఎందుకు ఎదుర్కొంటున్న‌ది, వాటిని నిలువ‌రించేంద‌కు విద్యార్ధుల‌కు ప్ర‌శాం త విద్యాబోధ‌నా అవ‌కాశాలు క‌ల్పించ‌డానికి ప్ర‌త్యేకించి తీసుకోవాల్సిన అంశాల మీద ఇక‌నైనా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని విద్యార్ధులు, సంస్థ అధికారులు ఆశిస్తున్నారు.

బండి పాదయాత్రను ఆపేసి టీఆర్ఎస్ సాధించేదేమిటి?

గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తీసుకువచ్చారన్నది సామెత. టీఆర్ఎస్ బండి సంజయ్ పాదయాత్ర విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆ సామెతనే గుర్తు చేస్తున్నది. బండి ప్రజా సంగ్రామ యాత్ర.. ఆ యాత్ర ఎప్పుడు ఎక్కడ జరుగుతోందో కూడా రాష్ట్రంలో జనం పట్టించుకోవడం లేదు. విడతల వారీగా బండి ప్రజా సంగ్రామ యాత్ర అంటూ నడుస్తున్నారు. ముగింపు సభ పేర పార్టీ అగ్రనాయకులను తీసుకువచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ యాత్రలో ఆయన చేస్తున్న విమర్శలు, ప్రసంగాలూ అన్నీ ఆవు కథనే చెబుతున్నాయి. కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ అవినీతి అన్న విమర్శలు తప్ప కొత్తదనం ఏమీ లేదు. రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు వినా మరెవరూ ఈ యాత్రను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బండి పాదయాత్ర వల్ల ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతోందంటూ యాత్రకు బ్రేక్ వేయడం ఎందుకో? దాని వెనక ఉన్న వ్యూహమేమిటో అర్ధం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు. అవసరం లేని ఆంక్షల వల్ల బీజేపీ గ్రాఫ్ పెరగడం వినా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు. పైగా బండి సంగ్రామ యాత్ర దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. మరో మూడు రోజులలో అంటే ఈ నెల 24న ముగుస్తున్నది. అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు యాత్రను నిలువరించి టీఆర్ఎస్ ఏం సాధిద్దామునుకుంటోందన్నది ఆ పార్టీ వ్యూహకర్తలే చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె తనయ పేరు ఉందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలపై నుంచి దృష్టి మరల్చడానికే బండి సంజయ్ యాత్రను నిలువరిస్తున్నారని భావించడానికి లేదు. ఎందుకంటే.. ఇప్పుడు సంజయ్ యాత్రను నిలువరించడానికి ఆ అంశంపై నుంచి ప్రజల దృష్టి మరల్చడానికేనని బీజేపీ ఆరోపణాస్త్రాలు సంధిస్తుంది. పైగా యాత్ర నిలువరించడానికి వ్యతిరేకంగా చేపట్టే ఆందోళనల్లో కూడా ప్రముఖంగా లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయాన్ని ప్రస్తావిస్తుందనడంలో సందేహం లేదు. యాత్ర సాగడం కంటే యాత్రను నిలువరించడం వల్లనే బీజేపీకి ఎక్కువ మైలేజ్ వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దానికి ఉదాహరణగా  పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన తరువాత ఇంత కాలంగా బండి ప్రజాసంగ్రామ యాత్రకు రాని కవరేజి మీడియాలో వచ్చింది. ఇప్పటి దాకా పెద్దగా యాత్రను పట్టించుకోని జనం కూడా యాత్ర ఎందుకు నిలిపేస్తున్నారన్న విషయంపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అన్నిటికీ మించి బండి పాదయాత్రకు అవరోధాలు కలిగించడంపై బీజేపీ అగ్రనేతలు సైతం స్పందించి ప్రకటనలు, ఖండనలు గుప్పిస్తున్నారు. దీంతో విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అన్నిటికీ మించి లిక్కర్ స్కాం లో కేసీఆర్ తనయ కవిత పేరు బయటకు రావడం వల్లనే బీజేపీపై టీఆర్ఎస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పట్టించుకోకుండా వదిలేస్తే ఏ ప్రచారం లేకుండా ఎప్పుడు మొదలైందో.. ఎప్పుడు ముగిసిందో తెలియకుండా పూర్తి కావలసిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పుడు ఆంక్షల వల్ల అందరికీ తెలిసింది. చర్చకు కేంద్రంగా మారింది. దీనివల్ల బీజేపీకి మైలేజి పెరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మునుగోడులో కమలానికి మూడో ప్లేసే..!

బీజేపీ ఎంత ప్రయత్నించినా, ఎన్ని గిమ్మిక్కులు చేసినా మునుగోడులో గెలిచే పరిస్థితి లేదని తాజా సర్వే తేల్చేసింది. గెలవడం అటుంచి ఆ పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి ఉంటుందని కూడా పేర్కొంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కంచుకోటలాంటి మునుగోడులో జెండా పాతాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డితో పాటు ఇంకా పలువురు కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరుతారని ఆ పార్టీ ఆశించింది. కానీ అది జరగలేదు. పైపెచ్చు కాంగ్రెస్ బలం మునుగోడులో రాజగోపాలరెడ్డి రాజీనామా తరువాత కూడా తగ్గలేదని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మునుగోడు పరిస్థితిపై ఒక రహస్య సర్వే చేయించినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సంబంధం లేకుండా అధిష్ఠానమే ఈ సర్వే చేయించిందని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఆ సర్వే ఫలితాన్ని ఇటీవల ప్రియాంకా గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమైన సందర్భంగా వెల్లడించినట్లు చెబుతున్నారు.  ఆ సర్వే ప్రకారం మునుగోడులో బీజేపీ చేస్తున్న హడావుడి అంతా పైపై ఆర్భాటమేనని తేలిపోయిందని చెబుతున్నారు. అయితే అంత మాత్రాన కాంగ్రెస్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే పరిస్థితి కూడా లేదని సర్వే తేల్చిందని అంటున్నారు. ఆ సర్వే ప్రకారం మునుగోడులో బీజేపీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చినా కాంగ్రెస్ కు కలిసి వచ్చేదేం  లేదనీ, ఆ పార్టీ రెండో స్థానానికి పరిమితమౌతుందని సర్వే ఫలితం వెల్లడించిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. మునుగోడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ స్థానంలో అధికార టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నది కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. అయితే టీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య తేడా చాలా స్వల్పమని, కొంచం గట్టిగా ప్రయత్నిస్తే కాంగ్రెస్ ఈ సీటు నిలబెట్టుకునే అవకాశం ఉందనీ, సర్వే ఫలితాన్ని విశ్లేషించిన కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీసీలు అత్యధికంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుక బీసీ అభ్యర్థిని నిలబెడితే ఆ తేడాను సునాయాసంగా అధిగమించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక వామపక్షాలు టీఆర్ఎస్ కు మద్దతు పలకడం ఆ పార్టీకి కలిసి వచ్చిందని అంటున్నారు. వామపక్షాలకు మునుగోడులో దాదాపు 15వేల ఓట్లు ఉన్నాయని, అయితే నేతలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించినంత మాత్రాన ఆ ఓటు గంపగుత్తగా టీఆర్ఎస్ కే పడుతుందన్న నమ్మకం లేదనీ కూడా కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. కనీసంలో కనీసం ఎనిమిది వేల ఓట్ల వరకూ కాంగ్రెస్ కు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మునుగోడులో బీజేపీకి క్యాడర్ లేకపోవడం, రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి కమలం గూటికి చేరినా.. ఆయన వెంట కాంగ్రెస్ క్యాడర్ వెళ్లకపోవడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా పార్టీ నాయకులు భావిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ సర్వేలోనే మునుగోడులో టీఆర్ఎస్ కే విజయావకాశాలు ఉన్నాయని తేలింది. అయితే రెండు పార్టీల మధ్యా తేడా అతి స్వల్పంగా ఉండటంతో సమష్టిగా కృషి చేస్తే సానుకూల ఫలితం ఉండే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.

పోస్టు కోవిడ్ ఎఫెక్ట్.. పిల్లలలో మానసిక వైకల్యం, పెద్దలలో డిప్రషన్!

పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ మానసిక స్వస్థతపై తీవ్ర ప్రభావం చూపుతుందా? కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో డిప్రషన్, యాంగ్సైటీ, మానసిక వైకల్యం తదితర రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే పరిశోధకులు ఉన్నాయనే అంటున్నారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వృద్ధులు డిప్రషన్, యాంగ్సైటీకి గురయ్యే అవకాశాలు సాధారణ వృద్ధుల కంటే రెండింతలు ఎక్కువ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే కోవిడ్ బారిన పడి కోలుకున్న చిన్నారులలో మానసిక వైకల్య సమస్యలు అధికం అని వైద్య నిపుణులు అంటున్నారు. దాదాపు 1.25 మిలియన్ రికార్డులను పరిశీలించి పరిశోధించిన అనంతరం సైంటిస్టులు పోస్టు కోవిడ్ ప్రభావ తీవ్రతపై ఒక నిర్ధారణకు వచ్చారు. పోస్టు కోవిడ్ ఎఫెక్ట్ పిల్లల్లో ఒక రకంగా, వృద్ధులలో మరో రకంగా బయటపడుతోందని వెల్లడించారు. కోవిడ్‌ బారిన పడి, చికిత్స తర్వాల కోలుకున్న వారిపై ఈ పరిశోధనలు జరిగాయి.  కరోనాకు గురి కావడానికి ముందు మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారిలో చికిత్స తరువాత మానసిక వైకల్యం   తీవ్రత పెరిగిందని పరిశోధనల్లో తేలింది.  వివిధ దేశాల్లో మొత్తం కోవిడ్‌ సోకి, చికిత్సతో బయటపడిన 2.47 లక్షల మందిపై ఈ పరిశోధనలు జరిపామని శాస్త్ర వేత్తలు వెల్లడించారు. వృద్ధులలో డిప్రషన్, యాంగ్సైటీ సమస్యలు, పిల్లలలో మానసిక సమస్యలు వెలుగు చూసినట్లు తేల్చిన పరిశోధనలు, వయస్సు పైబడిన వారిలో పోస్టు కోవిడ్ సమస్యలలో కండరాల సమస్య కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 

పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు.. బండి సంజయ్ యాత్రకు అనుమతి నిరాకరణ

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు జనగామ పోలీసలు బ్రేక్ వేశారు. జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని పేర్కొన్న పోలీసులు ఈ మేరకు బండి సంజయ్ కు నోటీసులు ఇచ్చారు. పాదయాత్ర పేరిట విద్వేష పూరిత వ్యాఖ్య చేస్తున్నారనీ, దీని వల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమౌతుందంటూ నోటీసులో పేర్కొన్నారు.ఈ మేరకు వర్ధన్నపేట ఏపీసీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి నోటీసు జారీ చేశారు. అలాగే  పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు నోటీసులను అందించారు.  ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి  సమీకరణ చేస్తున్నారనీ, రెచ్చగొట్టే ప్రకటనలతో   జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంటూ, తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని  హెచ్చరించారు.  కాగా పోలీసుల నోటీసుపై బీజేపీ మండిపడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. పోలీసుల అనుమతితోనే   మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నమని పేర్కొంది. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రశ్నించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వరకూ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అలాగే ఈ నెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అలాగే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోకుండా ప్రభుత్వానికి తగు సూచనలు ఇవ్వాల్సిందిగా బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైను కలిసి కోరారు. కాగా తన పాదయాత్రను అడ్డుకోవడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఎక్కడ యాత్రను ఆపారో అక్కడే మళ్లీ ప్రారంభిస్తానని ప్రకటించారు.  జనగామలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్‌లోని ఇంటి దగ్గర వదిలి పెట్టి గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి విదితమే,  కాగా, ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి బీజేపీ అత్యవసరంగా హౌజ్​ మోషన్​ పిటిసన్​ దాఖలు చేసింది. అయితే  హైకోర్టు ఈ పిటిషన్​ని తిరస్కరించి, లంచ్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేయాలని  సూచించింది.

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నవీడియోపై రాష్ట్రపతికి ఫిర్యాదు

 వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై రాష్ట్రపతికి ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా నేతల బృందం రాష్ట్రపతిని కలిసి డిమాండ్ చేసింది. ‘డిగ్నిటీ ఫర్ వుమెన్’ పేరుతో మహిళా నేతల బృందం  ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సహాయంతో రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్న మహిళా నేతలు రాష్ట్రపతితో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్, జాతీయ మహిళా కమిషన్‌కు విడివిడిగా ఫిర్యాదులు అందజేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని వారు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో మహిళలు భయాందోళనల మధ్య  జీవనం సాగిస్తున్నారని, గత మూడూళ్లలో మహిళలపై నేరాలు 21.45 శాతం పెరిగాయని వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం పేరు చెప్పి ప్రజల్ని తప్పుదోవపట్టిస్తోందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారే మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీ మంత్రి  అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ ఇలాంటి అసభ్యకర ప్రవర్తనతో అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. గోరంట్ల మాధవ్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదై అత్యాచారం, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జస్టిస్ వర్మ కమిషన్ నివేదికను అమలు చేయాలని రాష్ట్రపతిని కోరారు. గోరంట్ల మాధవ్ వీడియో క్లిప్‌ను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్నవారిని గ్రామ పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా నిషేధించాలని, ఆ మేరకు వర్మ కమిషన్ సిఫార్సులను కఠినంగా అమలు చేయాలని అభ్యర్థించారు. ఇప్పటికే ఎన్నికైన ప్రతినిధులు ఈ తరహా ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటే తక్షణమే వారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు అందరికీ లింగబేధం, లింగవివక్ష, లైంగిక వేధింపులు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ శిక్షణనివ్వాలని సూచించారు. – ఎవరైనా మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినా… లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడినా.. వెంటనే సూమోటోగా కేసులు నమోదు చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి సమన్లు జారీ చేసి విచారణ జరపాలని కోరారు.   వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ చెన్నుపాటి కీర్తి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత సుంకర పద్మశ్రీ , ఐద్వా ప్రతినిధి ఎస్. పుణ్యవతి, పి. రాణి , తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరుగనగరి, ఆ పార్టీ నేతలు ముల్పురి నాగ కళ్యాణి, అన్నాబత్తుని జయలక్ష్మితో పాటు ఏపీ స్టేట్ కుర్బ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ సంజీవరెడ్డి సవిత తదితరులు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.

అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. కారణమదేనా?

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అయిన అమిత్ షా హీరో జూనియర్ ఎన్టీఆర్ ల భేటీ తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించింది. వారి మధ్య భేటీ జరిగి రెండు రోజులు గడిచిపోయినా ఆ విషయంపై చర్చోప చర్చలు ఎడతెగకుండా సాగుతూనే ఉన్నాయి. ఎప్పుడో 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ ఆగ్రనేత ఆయనను స్వయంగా ఢిన్నర్ మీట్ కు ఆహ్వానించడం.. ఆ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఆయనను కలవడం తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. ఈ భేటీపై పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా బీజేపీలోకి ఆహ్వానించారనీ, తెలంగాణ తెలుగుదేశం బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారనీ.. ఇలా పలు రకాల చర్చలు తెరమీదకు వచ్చాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారైతే ఇరువురి మధ్యా రాజకీయ చర్చలే జరిగి ఉంటాయని చెప్పారు. బీజేపీ, వైసీపీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఎన్టీఆర్ తో భేటీపై అమిత్ షా ఒక ట్వీట్ చేస్తూ ఓ అద్భుత నటుడితో భేటీ ఎంతో సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు. ఇక బీజేపీ సీనియర్లు అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో ఆయనతో భేటీ కావాలని భావించారని, అందుకే ఆయన ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ భేటీ అయ్యారనీ చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా తెలుగు ఇండస్ట్రీలో మరో టాక్ జోరుగా వినిపిస్తున్నది.  తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. అందుకు సినిమాను కూడా బలమైన ఆయుధంగా వాడుకోవాలని భావిస్తోంది. అందుకే తెలంగాణ సాయుధ పోరాట యోధుల అణచివేతకు నిజాం నవాబు రజాకార్లను పంపిన సంఘటనలపై రజాకార్ ఫైల్స్ అనే సినిమాను తెరకెక్కించాలన్న యోచనలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఆ సినిమాకు ఇప్పటికే కథ సిద్ధమైందని కూడా అంటున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి, ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఆ కథను ప్రధాని మోడీకి వినిపించినట్లు కూడా చెబుతున్నారు. రజాకార్ ఫైల్స్ కథ వినడం కోసం ఐదు నిముషాల పాటు విజయేంద్ర ప్రసాద్ కు అప్పాయింట్ మెంట్ ఇచ్చిన మోడీ దానికి ఇరవై నిముషాలకు పెంచినట్లు కూడా చెబుతున్నారు. ఆ కథకు కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ అయితేనే సరిపోతారని విజయేంద్ర ప్రసాద్ భావించారనీ అదే విషయాన్ని మోడీతో చెబితే మోడీ అమిత్ షాతో ఒక సారి జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడాల్సిందిగా  చెప్పారనీ, ఆ పర్యవశానమే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ అని చెబుతున్నారు. రజాకార్ ఫైల్స్ సినిమా తెలంగాణలో బీజేపీ పలుకుబడి పెంచుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందని అంటున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్రకు సర్వత్రా ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ రాజాకార్ ఫైల్స్ సినిమాలో నటిస్తే కాశ్మీర్ ఫైల్స్ ను మించి ప్రజలను ఆకట్టుకుంటుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ రజాకార్ ఫైల్స్ ను సినిమాతో ఆపేయకుండా వెబ్ సిరీస్ కూడా తీయాలన్న భావనతో ఉన్నారనీ, రెంటిలోనూ జూనియర్ ఎన్టీఆరే ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందని  చెబుతున్నారు. అయితే ఈ వార్త ధృవపడాల్సి ఉంది. మొత్తం మీద అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ రాజకీయ, సినీ రంగాలలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అగ్రనేత అమిత్ షా‌తో జూనియర్ ఎన్టీఆర్‌ భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కొన్నేళ్లుగా సినిమాలు తప్ప మరో ప్రపంచమే తెలియని తారక్.. మళ్లీ రాజకీయాల వైపు వస్తున్నారా..? కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో యంగ్ టైగర్ భేటీ వెనక  ఆంతర్యమేంటి..? ట్రిపుల్ ఆర్ కోసమే అయితే.. రామ్ చరణ్ లేకుండా స్పెషల్ మీటింగ్ ఎందుకు..? కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవడం ఎక్కడలేని ప్రాధాన్యత సంతరించుకుంది. సినీ వర్గాల్లో కంటే.. రాజకీయంగా ఈ భేటీ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. బీజేపీ అగ్ర నేతతో తారక్‌కు పనేంటి..? అంత ప్రత్యేకంగా ఈ ఇద్దరూ కలవడానికి కారణమేంటంటూ ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది. ట్రిపుల్ ఆర్‌లో కొమరం భీమ్ పాత్ర నచ్చి.. అమిత్ షా ప్రశంసించారని తారక్ వర్గాలు చెప్తున్న మాట. అయితే ఈ భేటీ వెనుక పాలిటిక్స్ తప్ప మరొకటి లేదన్నది మరికొందరి అభిప్రాయం. భేటీ తర్వాత ఎలాంటి లీకులు రాకపోవడంతో నిజంగా వారిద్దరూ ఏ అంశాలపై చర్చించారన్న ఆసక్తి నెలకొంటోంది. తారక్, అమిత్ షా భేటీ వెనక మరో వార్త టాలీవుడ్ వర్గాల్లో బాగా వైరల్ అవుతుంది. ది కాశ్మీర్ ఫైల్స్ తరహాలోనే.. రజాకార్ ఫైల్స్ అనే సినిమా ఒకటి త్వరలోనే రాబోతుంది. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. బిజేపీ ప్రభుత్వ సపోర్ట్‌తోనే రజాకార్ ఫైల్స్ భారీ ఎత్తున తెరకెక్కబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇందులో తారక్‌ను నటింపచేయాలనేది పార్టీ ఎత్తుగడలా కనిపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. తారక్, అమిత్ షా మధ్య రాజకీయ చర్చకు తావేం లేదని.. కేవలం ఈ రజకార్ ఫైల్స్ సినిమా గురించి చర్చించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అటు రాజకీయం, ఇటు సినిమాలపై పూర్తి అవగాహన ఉన్న తారక్.. తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్తును అంచనా వేసుకునే నిర్ణయం తీసుకుంటారనే అతన్ని దగ్గర్నుంచి గమనించిన వాళ్ళకు అర్థమవుతుంది. మరి రజాకార్ ఫైల్స్ విషయంలో అమిత్ షా తారక మంత్రం ఎంతవరకు పని చేస్తుందనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న.

జింబాబ్వేలో మెరిసిన సంజూ, గిల్‌, ధ‌వ‌న్‌, ర‌జా

జింబాబ్వేతో టీమ్ ఇండియా త‌ల‌ప‌డిన వ‌న్డేసీరీస్‌ను ఎంతో గొప్ప‌గా ముగించింది. టీమ్ ఇండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ ఉన్న‌త‌స్థాయి ప్ర‌ద‌ర్శ‌న‌తో సీరీస్‌ను కైవ‌సం చేసుకోవ‌డంలో కుర్రాళ్లు త‌మ స‌త్తా చాటారు. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వేను 10 వికెట్ల తేడాతో ఓడిం చిన భారత జట్టు పూర్తి వృత్తిపరమైన ప్రవర్తనను ప్రదర్శించింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్ జింబాబ్వే ను 40.3 ఓవర్లలో 189 పరుగులకే పరిమితం చేసింది. బ్రాడ్లీ ఎవాన్స్ మరియు రిచర్డ్ నగరవ మధ్య తొమ్మిదో వికెట్‌కు 70 పరు గుల భాగస్వామ్యం లేకపోతే అది చాలా తక్కువగా ఉండేది. జింబాబ్వే తరఫున దీపక్ చాహర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ తలో మూడు వికెట్లు తీయగా, కెప్టెన్ రెగిస్ చకన్‌బవ్వ 35 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ లు రాణించలేకపోయారు. ముఖ్యంగా గిల్ త్వరగా స్కోర్ చేయడంతో మూడ్‌లో ఉన్నాడు, ధావన్ ఒకసారి వేగం త‌గ్గించి సాధారణంకంటే నెమ్మదిగా స్కోర్ చేసిన తర్వాత కూడా,  భారత్ గేమ్‌ను 30.5 ఓవర్లలో మాత్రమే ముగించేలా చూసు కున్నాడు. గిల్ 72 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, ధావన్ 113 బంతుల్లో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఇప్పుడు 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. 162 పరుగుల ఛేదన లో ఐదు వికెట్లు చేతిలో ఉండగా, 24.2 ఓవర్లు మిగిలి ఉండగానే రెండో గేమ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంజూ శాంసన్ 43 పరుగులతో భారత్‌లో అత్యధిక స్కోరు చేశాడు, అతను కూడా ఒక సిక్స్‌తో గేమ్‌ను ముగిం చాడు. అతనితో పాటు శిఖర్ ధావన్ (33), శుభ్‌మన్ గిల్ (33), దీపక్ హుడా (25) కూడా ఆరంభాన్నిచ్చారు. అయితే కేఎల్ రాహుల్ (1), ఇషాన్ కిషన్ (1) అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యారు. జింబాబ్వే కోసం, ఈసారి బంతితో మెరుగైన ప్రదర్శన కనబరిచారు వారి బౌల‌ర్లు. మొదటి గేమ్‌లో వికెట్‌లేకుండా పోయిన తర్వాత, తనకా చివాంగా, వికోరి న్యౌచి, ల్యూక్ జోంగ్వే వికెట్‌లు తీశారు.  సికందర్ రజా కూడా మొత్తం ఐదు వికెట్లు సాధించ డానికి ఒక వికెట్ తీశారు. బ్యాట్ తో అంద‌ర్నీ భారీ షాట్స్‌తో అద్భుతమైన 43 పరుగుల‌తో ఆక‌ట్టుకున్న‌సంజూ శాంస‌న్‌  వికెట్ కీప‌ర్‌గా  మూడు క్యాచ్‌లతో  సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు, అందులో ఒకటి అసాధారణమైన ఒన్ హ్యాండ్ క్యాచ్, చూసి తీరాల్సిందే. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల‌ను వ‌దులుకున్న జింబాబ్వే మూడ‌వ‌ది, చివ‌రి వ‌న్డే మ్యాచ్‌లో మాత్రం విజృంభించింది.  జింబాబ్వే 290 పరుగుల ఛేదనను అత్యద్భుత సెంచరీతో భార‌త్ బౌల‌ర్ల‌ను ఆడుకున్న‌ సికందర్ రజా భారత్‌కు తీవ్ర భయాన్ని కలిగించాడు. అయితే, అతను 49వ ఓవర్‌లో 115 పరుగుల వద్ద వెనుదిరిగాడు.  ఆ తర్వాత ఆతిథ్య జట్టు బౌలింగ్‌లో లేదా 276 పరుగులు చేసింది. భారత్ తరఫున అవేష్ ఖాన్ 3/66, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీసుకున్నాడు - అన్నింటికంటే ముఖ్యమైన రజా వికెట్ తీయ‌డం. మొదటి రెండు గేమ్‌ల్లో టీమ్ ఇండియాకు ప‌రిస్థితులు కొంత అనుకూలించాయి.  అయితే జింబాబ్వే మూడవ, చివరి మ్యాచ్‌లో మాత్రం పర్యాటకులకు చుక్క‌లు చూపిం చింద‌నే అనాలి.  అయితే, 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆతిథ్య జట్టు 169/7కు కుప్ప కూలిన తర్వాత మరో భారీ ఓటమిని చవిచూసింది. అయితే, సికందర్ రజా,  బ్రాడ్ ఎవాన్స్ ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు జోడించి ఛేజింగ్‌ను పునరుద్ధరించారు. రజా 115 పరుగులు చేయగా, ఎవాన్స్ కీలకమైన 28 పరుగులు చేశాడు. 49వ ఓవర్‌లో రజా ఔట్ అయ్యే ముందు ఇవాన్స్ అవేష్ చేతిలో ఎల్‌బిడబ్ల్యూ ట్రాప్ అయ్యాడు, భారత్ థ్రిల్లింగ్ విజయాన్ని పూర్తి చేసింది. మొత్తానికి ఈ టూర్ శుభ‌మ‌న్ గిల్‌, సంజూ శాంస‌న్‌, దీప‌క్ హుడా వంటి యువ స్టార్స్ టీమ్ ఇండియాకు ఎంత అవ‌స‌ర‌మ‌న్న‌ది మ‌రోసారి రుజువు చేసింది.

వైసీపీలో  అస‌మ్మ‌తి అగ్గి రాజేస్తున్న ఇన్‌ఛార్జ్‌ల  మార్పు !

రాష్ట్రంలో రాజ‌కీయ‌ప‌రిస్థితులు ఊహించ‌ని విధంగా వేగంగా మారిపోతున్నాయి. సీఎం జ‌గ‌న్ ఏ క్ష‌ణం ఎలాంటి నిర్ణ‌యంతో భ‌య‌పెడ‌తారోన‌న్న భీతి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లోనూ ఉంది. ప‌థ‌కాల అమ‌లు, పాల‌నా ప‌ర నిర్ణ‌యాల మీద ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కు పాల‌న అనే అంశాల గురించి ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న కోరి ఇప్ప‌టికే వైసీపీ తీవ్ర‌వ్య‌తిరేక‌త‌ను గ్ర‌హించింది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు పేరుతో మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ ల్లోకి త‌రిమి సాధించింది కేవ‌లం అవ‌మానాల భార‌మే. ఈ త‌రుణంలో వైసీపీ అద‌న‌పు ఇన్‌ఛార్జుల నియా మ‌కం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే గుంటూరుజిల్లా తాటి కొండ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదును నియమించడంతో ఎమ్మెల్యే శ్రీదేవి అగ్గిలం పై గుగ్గిలమవు తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా మరికొన్ని నియోజకవర్గాల్లో అదనపు ఇన్​చార్జు లను నియమించడం, మార్పులు చేయడం పై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. దీంతో ఎవరి సీటుకు ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన ఆయా నియోజకర్గాల ఎమ్మెల్యేలు, ఇన్​చార్జుల్లో నెలకొంది. ఇప్పటిదాకా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో తలమునకలవుతున్న ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులను మార్చడం వల్ల ప్రయోజనం ఉంటుందని సీఎం జగన్​ భావిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మార్పులతో కొంత ప్రయోజనం ఉండొచ్చు. అసలు ప్రభుత్వం పైనే వ్యతిరేకత ఉంటే ఈ మార్పులు మరింత నష్టానికి దారి తీసే అవకాశముంది. ఈపాటికే ఎన్నికల మూడ్​లోకి వెళ్లిన వైసీపీ నేతల్లో మార్పులపై గుబులు రేగుతోంది. సీఎం వైఎస్​ జగన్​ మొత్తం 175 నియోజకవర్గాల్లో అనేక సర్వేలు చేయించారు. ఐ ప్యాక్​ టీంతోపాటు ఢిల్లీకి చెందిన మరో సంస్థతోనూ ఈ సర్వేలు నిర్వహించినట్లు సమాచారం. వాళ్లు ఇచ్చిన నివేదికలను బట్టి మొత్తం 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు ఉండొచ్చని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అలాగే 12 మంది ఎంపీలను కూడా మార్చే అవకాశముంది. కొందర్ని ఎమ్మెల్యేలుగా పోటీకి దింపడం.. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం అదనపు ఇన్​చార్జులను నియమించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతకీ  58 నియోజకవర్గాలు ఏవంటే.. గుంటూరు జిల్లాలో తెనాలి, మంగళగిరి, పొన్నూరు, తాటికొండ ఉన్నాయి. బాపట్ల జిల్లాలో బాపట్లతోపాటు వేమూరు, సంతనూతలపాడు, పర్చూరు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి, చిలకలూరిపేట, ప్రకాశం జిల్లాలో కొండపి, మార్కాపురం, యర్రగొండపాలెం, నెల్లూరు జిల్లాలో కావలి, ఉదయగిరి, కోవూరు, కందుకూరు, తిరుపతి జిల్లాలో వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి నియో జకవర్గాలున్నట్లు  సమాచారం. ఇంకా ఉత్తరాంధ్ర నుంచి కృష్ణాజిల్లా వరకు చూస్తే ఎచ్చెర్ల, కురుపాం, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, బొబ్బిలి, ఎస్​ కోట, గజపతినగరం, వైజాగ్ ఈస్ట్​, వైజాగ్​ సౌత్​, పాయకరావుపేట, నర్సీ పట్నం, అరకు, గాజు వాక, పిఠాపురం, పాడేరు, జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజమండ్రి అర్బన్​, రూరల్​, కాకి నాడ రూరల్​, రంపచోడవరం, పాలకొల్లు, ఉంగుటూరు, ఏలూరు, పెనమలూరు, విజయవాడ వెస్ట్​; మైలవరం, కైకలూరు, అవని గడ్డ ఉన్నాయి. రాయలసీమలో పూతలపట్టు, పలమనేరు, శింగనమలై, పత్తికొండ, హిందూపురం, పుటపర్తి, అనంత పురం, కల్యాణదుర్గం, నందికొట్కూరు, మైదుకూరు నియోజకవర్గాలున్నాయి. 12 ఎంపీ నియోజవర్గాల్లోని పార్టీ ఎంపీలు, ఇన్​చార్జులను  కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది. అందులో హిందూపురం, అనంత పురం, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, నర్సాపురం, అమలాపురం, అనకాపల్లి, విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం ఉన్నాయి.

ప్రచారం ఓకే.. పరనింద వద్దు.. రామ్ దేవ్ బాబాకు సుప్రీం చురకలు

అల్లోపతి, ఆయుర్వేదం, యూనాని ఇలా వైద్య విధానాలు వేరైనా అన్నిటి లక్ష్యం మాత్రం రోగికి స్వస్థత చేకూర్చడం, రోగాన్ని నియం చేయడమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఫలానా వైద్య విధానమే అత్యుత్తమమైదని ప్రచారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ, ప్రచారం పేరుతో మరో వైద్య విధానాన్ని దూషించడం, కించపరచడం ఎంత మాత్రం తగదు. ఇదే విషయాన్ని దేశ సర్వోన్నత న్యాయ స్థానం యోగాగురి బాబా రాందేవ్ కు సుతిమెత్తగానైనా స్పష్టంగా చెప్పింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్బంగా యోగాగురు బాబా రామ్ దేవ్ పై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. యోగా గురు బాబా రామ్ దేవ్ అల్లోపతి వైద్యులను నిందించడం తగదని చురకలు వేసింది. ఇప్పటికే యోగాకు ప్రాచుర్యం, ప్రజాదరణ రావడంలో బాబా రామ్ దేవ్ చేసిన కృషిని ప్రస్తావిస్తూ, అలాగే ఆయుర్వేదానికి కూడా ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు ప్రచారం చేసుకుంటే తప్పులేదనీ, అయితే ఆ పేరుతో అల్లోపతిని నిందించడం, దూషించడం, అల్లోపతి వైద్యులను కించపరచడం తగదని మందలించింది. కోవిడ్ సంక్షోభ సమయంలో రామ్ దేవ్ అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న పలువురు వైద్యులు మరణించారనీ, అల్లోపతి ఒక మూర్ఖ వైద్య విధానమనీ రామ్ దేవ్ అప్పట్లో వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఇలా ఉండగా మీరు అనుసరించే వైద్య విధానం అన్ని రోగాలు, రుగ్మతలూ నయం చేస్తుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా అని సుప్రీం కోర్టు రామ్ దేవ్ బాబాను ప్రశ్నించింది. మీ వైద్య విధానాన్ని ప్రచారం చేసుకోవడం వరకూ ఓకే కానీ ఇతర వైద్య విధానాలను దూషించడం తగదని పేర్కొంది.