పోస్టు కోవిడ్ ఎఫెక్ట్.. పిల్లలలో మానసిక వైకల్యం, పెద్దలలో డిప్రషన్!
posted on Aug 24, 2022 7:47AM
పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ మానసిక స్వస్థతపై తీవ్ర ప్రభావం చూపుతుందా? కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో డిప్రషన్, యాంగ్సైటీ, మానసిక వైకల్యం తదితర రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే పరిశోధకులు ఉన్నాయనే అంటున్నారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వృద్ధులు డిప్రషన్, యాంగ్సైటీకి గురయ్యే అవకాశాలు సాధారణ వృద్ధుల కంటే రెండింతలు ఎక్కువ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే కోవిడ్ బారిన పడి కోలుకున్న చిన్నారులలో మానసిక వైకల్య సమస్యలు అధికం అని వైద్య నిపుణులు అంటున్నారు.
దాదాపు 1.25 మిలియన్ రికార్డులను పరిశీలించి పరిశోధించిన అనంతరం సైంటిస్టులు పోస్టు కోవిడ్ ప్రభావ తీవ్రతపై ఒక నిర్ధారణకు వచ్చారు. పోస్టు కోవిడ్ ఎఫెక్ట్ పిల్లల్లో ఒక రకంగా, వృద్ధులలో మరో రకంగా బయటపడుతోందని వెల్లడించారు.
కోవిడ్ బారిన పడి, చికిత్స తర్వాల కోలుకున్న వారిపై ఈ పరిశోధనలు జరిగాయి. కరోనాకు గురి కావడానికి ముందు మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారిలో చికిత్స తరువాత మానసిక వైకల్యం తీవ్రత పెరిగిందని పరిశోధనల్లో తేలింది.
వివిధ దేశాల్లో మొత్తం కోవిడ్ సోకి, చికిత్సతో బయటపడిన 2.47 లక్షల మందిపై ఈ పరిశోధనలు జరిపామని శాస్త్ర వేత్తలు వెల్లడించారు. వృద్ధులలో డిప్రషన్, యాంగ్సైటీ సమస్యలు, పిల్లలలో మానసిక సమస్యలు వెలుగు చూసినట్లు తేల్చిన పరిశోధనలు, వయస్సు పైబడిన వారిలో పోస్టు కోవిడ్ సమస్యలలో కండరాల సమస్య కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.