ప్రచారం ఓకే.. పరనింద వద్దు.. రామ్ దేవ్ బాబాకు సుప్రీం చురకలు

అల్లోపతి, ఆయుర్వేదం, యూనాని ఇలా వైద్య విధానాలు వేరైనా అన్నిటి లక్ష్యం మాత్రం రోగికి స్వస్థత చేకూర్చడం, రోగాన్ని నియం చేయడమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఫలానా వైద్య విధానమే అత్యుత్తమమైదని ప్రచారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ, ప్రచారం పేరుతో మరో వైద్య విధానాన్ని దూషించడం, కించపరచడం ఎంత మాత్రం తగదు. ఇదే విషయాన్ని దేశ సర్వోన్నత న్యాయ స్థానం యోగాగురి బాబా రాందేవ్ కు సుతిమెత్తగానైనా స్పష్టంగా చెప్పింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్బంగా యోగాగురు బాబా రామ్ దేవ్ పై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. యోగా గురు బాబా రామ్ దేవ్ అల్లోపతి వైద్యులను నిందించడం తగదని చురకలు వేసింది. ఇప్పటికే యోగాకు ప్రాచుర్యం, ప్రజాదరణ రావడంలో బాబా రామ్ దేవ్ చేసిన కృషిని ప్రస్తావిస్తూ, అలాగే ఆయుర్వేదానికి కూడా ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు ప్రచారం చేసుకుంటే తప్పులేదనీ, అయితే ఆ పేరుతో అల్లోపతిని నిందించడం, దూషించడం, అల్లోపతి వైద్యులను కించపరచడం తగదని మందలించింది. కోవిడ్ సంక్షోభ సమయంలో రామ్ దేవ్ అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న పలువురు వైద్యులు మరణించారనీ, అల్లోపతి ఒక మూర్ఖ వైద్య విధానమనీ రామ్ దేవ్ అప్పట్లో వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఇలా ఉండగా మీరు అనుసరించే వైద్య విధానం అన్ని రోగాలు, రుగ్మతలూ నయం చేస్తుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా అని సుప్రీం కోర్టు రామ్ దేవ్ బాబాను ప్రశ్నించింది. మీ వైద్య విధానాన్ని ప్రచారం చేసుకోవడం వరకూ ఓకే కానీ ఇతర వైద్య విధానాలను దూషించడం తగదని పేర్కొంది.  

ముస్లిం మంత్రితో నీతిష్ ఆల‌య ప్ర‌వేశం.. మండిప‌డుతున్న బీజేపీ

అప‌లే దేశంలో రాజ‌కీయ‌ప‌రిస్థితులు అంతంత‌మాత్రంగా ఉన్నాయి. బీజేపీ నాయ‌క‌త్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం వీలు చిక్కిన‌పుడ‌ల్లా విప‌క్షాల మీద విరుచుకుప‌డ‌ట‌మో, ఈడీ, సిబిఐల‌ను ఉసిగొల్ప‌డ‌మో చేస్తోంది. ఈ స‌మ‌యంలో బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ గ‌య‌లోని విష్ణుప‌ధ్ ఆల‌యంలోకి ఒక ముస్లిం మంత్రితో క‌లిసి వెళ్లి మ‌రీ పూజ‌లు చేశారు. బీహార్‌లో బీజేపీకి ఝ‌ల‌క్ ఇచ్చిన నితీష్‌పై ప‌గ సాధిం చడానికి బీజేపీ ఎంత‌గానో ఎదురుచూస్తున్న త‌రుణంలో బీజేపీ కి ఈ విధంగా నీతిష్ దొరిక‌డంతో రాష్ట్రం లో రాజ‌కీయ దుమారం చెల‌రేగింది.   నితీష్ కుమార్‌ను తప్పుపడుతూ బీజే పీ విమర్శలు గుప్పించింది. గయలో మంగళవారం అధికార పర్యట నకు వెళ్లిన నితీ‌ష్ కుమార్ తనతో పాటు స‌మాచార‌, సాంకేతిక శాఖ మంత్రి మొహమ్మద్ ఇజ్రాయిల్ మన్సూరీని కూడా విష్ణుపద్ ఆలయ దర్శనానికి తీసుకువెళ్లారు. కలిసి పూజలు చేశారు. అనంతరం మన్సూరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో కలిసి విష్ణుపద్ ఆలయ గర్భగుడిలో పూజలు చేయడం తన అదృష్టం గా భావిస్తున్నానని చెప్పారు. కాగా, హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన నోటీసు విషయాన్ని తాము మన్సూరి దృష్టికి  తెచ్చామని, అయినప్పటికీ  ఆయన ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించారని  ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఒక కమిటీని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.  ఈ ఘనటపై హిందుత్వవాది, బీజేపీ ఎమ్మెల్యే థాకూర్ బచౌల్ మండిపడ్డారు. ఇది మతవిశ్వాసాలకు సం బంధించిన అంశమని అన్నారు. హిందూయేతరులకు ఆలయ ప్రవేశంపై నిషేధం ఉందని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన (మన్సూరి) దృష్టికి తీసుకువచ్చినప్పటికీ , ఆయన బేఖాతరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ విభాగం ప్రతినిధి నిఖిల్ ఆనంద్ మాట్లాడుతూ, హిందువుల మనో భావా లను నితీష్ గాయపరచిచారని, ఆలయ వ్యవస్థను అవమానించారని అన్నారు. స్థానిక పూజారుల ఆచరించే పద్దతులు, పురాతన మత సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం ద్వారా ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేసేందుకు నితీష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని, ప్రపంచవ్యాప్తంగా హిందూ విశ్వాసాలు, సనాతన ధర్మంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికీ నితీష్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలతో ముస్లింలను ప్రసన్నం చేసు కు నే ప్రయత్నాలు గర్హనీయమని అన్నారు.  కాగా, బీజేపీ నేతల వాదనను హిందుస్థాని అవామ్ మోర్చా (హెచ్ఏఎం) కొట్టిపారేసింది. బీజేపీ మత తత్వవాద వ్యాప్తి పూర్తిగా అభ్యంతరకరమని హెచ్ఏఎం జాతీయ ప్రతినిధి దినేష్ రిజ్వాన్ అన్నారు. సమాజంలో విషపూరిత వాతావరణాన్ని బీజేపీ నేతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వారి మతతత్వ ఎజెండా వ్యాప్తిని సాగనిచ్చేది లేదని చెప్పారు.

ఢిల్లీ మ‌ద్యం స్కామ్‌.. ఇద్ద‌రు అధికారులు స‌స్పెండ్‌

దేశంలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న ఢిల్లీ మ‌ద్యం స్కామ్‌లో కేంద్ర హోం శాఖ ఇద్ద‌రు అధికారుల‌ను స‌స్పెండ్ చేసింది. మాజీ ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ గోపీకృష్ణ‌ను, మాజీ ఎక్సైజ్  డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆనంద్ తివా రీనీ స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ స్కామ్‌లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ను ఏ1గా చేర్చింది. 120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చారు. సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లు ఈ ఎఫ్‌ఐఆర్‌‌లో ఉన్నాయి. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు, మాజీ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీ పేర్లు కూడా ఉన్నాయి.  ఇదిలా ఉండ‌గా, ఢిల్లీ మ‌ద్యంవిధానంపై దాఖ‌లైన కేసులో భాగంగా సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు నిర్వ‌హించింది. అలాగే ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర‌పాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల ఈ దాడులు జ‌రిగాయి.  గత ఏడాది నవంబర్‌లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు, విధా నపర లోపాలు జరిగాయ‌ని ప్ర‌చారం వెల్లువెత్తింది.  టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయా లు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదిక పై దర్యాప్తు చేప ట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇంఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్ర గురించి కూడా నివేదికలో ఉంది. దీంతో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.  తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి కూడా ఢిల్లీ మద్యం స్కామ్‌తో సంబంధాలున్నాయని కథనాలు వెలువ డుతున్నాయి. ఢిల్లీ మద్యం స్కామ్‌తో సంబంధం ఉందంటూ తనపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాపై పరువునష్టం దావా వేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే హెచ్చరించారు. 

మోడీ ఔనన్నా.. కాదన్నా విజయం నాదే.. సుబ్రహ్మణ్య స్వామి

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిది ఒక ప్రత్యేక ఒరవడి. ఆయనకు పార్టీలూ, ఆ పార్టీల విధానాలతో పెద్దగా సంబంధం ఉండదు. ఆయన అనుకున్నది అనుకున్నట్లు మాట్టాడేస్తారు. జనతా పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా మరో పార్టీ అయినా ఆయనకు పెద్ద తేడా ఉండదు. ప్రస్తుతం ఆయన తన కాన్సన్ట్రేషన్ అంతా  ప్రధాని మోడీపై పెట్టారు. ఆయన టార్గెట్ గా వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. తాజాగా సోమవారం ఆయన రామసేతు అంశాన్ని అడ్డుపెట్టుకుని మోడీపై సెటైర్లతో ట్వీట్ చేశారు. రామసేతు అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సంగతి విదితమే. రామసేతుపై సుప్రీం కోర్టు సోమవారం (ఆగస్టు 22) విచారణ చేపట్టింది. అందులో భాగంగా రామసేతు పురాతన వారసత్వ కట్టడమా? కాదా అన్నది తేల్చి చెప్పాలంటే దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలను ఆధారం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి మోడీపై చురకలు వేశారు. సుప్రీం ఆదేశాలతో రామసేతు విచారణ తుది దశకు వచ్చినట్లేనని పేర్కొన్న సుబ్రహ్మణ్య స్వామి ఇక కేంద్రం నోరు తెరవక తప్పదని అన్నారు. అంతే కాదు మోడీ ఔనన్నా.. కాదన్నా తానే గెలుస్తానని చమత్కరించారు.  మోడీ రామసేతు పురాతన వారసత్వ కట్టడమే అని అంగీకరిస్తే విజయం తనదనీ, అలా కాకుండా అది పురాతన వారసత్వ కట్టడం కాదని సుప్రీం కు తెలియజేస్తే 2024 ఎన్నికలలో మోడీ పరాజయం ఖాయమన్నారు. ఎలా చూసినా విజయం తనదేనని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.

ద్రావిడ్‌కి కోవిడ్‌... ఆసియా క‌ప్‌కి దూరం

ఆసియా కప్ 2022 పోటీలకు ముందు టీం ఇండియా జట్టు హెడ్ కోచ్రా హుల్ ద్రావిడ్  క‌రోనా బారిన పడ్డారు. ఆసియా కప్ పోటీలకు వెళ్లే ముందు క్రికెట్ జట్టు క్రీడాకారులు, ఇతర సభ్యులకు ముందస్తు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో రాహుల్ ద్రావిడ్ కు పాజిటివ్ అని మంగళవారం తేలింది. యునై టెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కరోనా నెగిటివ్ తో వచ్చిన రాహుల్ ద్రావిడ్ కు తాజా పరీక్షల్లో కొవిడ్ పాజి టివ్ అని తేలిందని బీసీసీఐ తెలిపింది. రాహుల్ ద్రావిడ్ బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, నెగిటివ్ రిపోర్టు వచ్చాక రాహుల్ ద్రావిడ్ టీంతో కలుస్తారని బీసీసీఐ పేర్కొంది. రాహుల్ ద్రావిడ్ సెలక్షన్ కమిటీలో ఉండటం వల్ల జింబాబ్వే సిరీస్ కు వెళ్లలేదు. కాగా కోవిడ్ అనేది కేవ‌లం ఫ్లూ వంటిదేన‌ని దీన్ని కార‌ణంగా చేసుకుని ద్రావిడ్‌ను టోర్నీకి దూరం చేయ డం ప‌ట్ల టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ ర‌వి శాస్త్రి మండిప‌డ్డాడు. ఆగ‌ష్టు 28 ఆదివారం దుబాయ్ లో ఆరంభం కానున్న టోర్నీ తొలి మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాక్‌తో త‌ల‌ప‌డుతుంది. కానీ డ్ర‌సింగ్ రూమ్‌లో ద్రావిడ్ లేనిలోటు తెలుస్తుంద‌ని శాస్త్రి అన్నారు.  కోవిడ్‌ను అంత సీరియ‌స్ గా తీసుకోవ‌డ‌మేమిట‌న్నారు. కోవిడ్ సంబంధించిన మందులు వాడితే స‌రి పోతుంద‌ని, అందుకు డాక్ట‌ర్లు స‌ల‌హాలు సూచ‌న‌లు ఎలాగూ ఉంటాయి. కానీ టోర్నీ మొత్తానికి ఆ కార‌ణం చెప్పి ద్రావిడ్‌ను దూరం చేయడం స‌బ‌బు కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అయితే ద్రావిడ్ యుఎఇ కి జ‌ట్టు తో పాటు వెళ్ల‌డానికి ముందు జ‌రిపిన ప‌రీక్ష‌ల్లో కోవిడ్ పాజిటివ్ వ‌చ్చిన కార‌ణంగానే ద్రావిడ్‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.  ఆసియా క‌ప్ టీ-20 టోర్నీలో శ్రీ‌లంక‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌, భార‌త్‌, పాకిస్తాన్ పాల్గొంటున్నాయి. వాస్త‌వానికి భార‌త్‌, పాకిస్తాన్ ల మ‌ధ్య ద్వైపాక్షిక టోర్నీలు ర‌ద్ద‌య్యాయి. కానీ ఇత‌ర టోర్నీల్లో పోటీప‌డుతూనే ఉన్నాయి. ఆసియాక‌ప్ తొలి మ్యాచ్‌లో శ్రీ‌లంక‌, ఆఫ్ఘ‌నిస్తాన్ త‌ల‌ప‌డ‌తాయి. అలాగే భార‌త్‌, పాక్ పోటీప‌డ‌తాయి. గ‌త ఏడాది దుబాయ్‌లో జ‌రిగిన టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లో భార‌త్ ప‌ది వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన సంగ‌తి తెలిసిందే. 

చిరంజీవి బర్త్ డే వేడుకల్లో కొడాలి నాని.. అందుకేనా?

రాజకీయ లబ్ధి కోసం పార్టీల నేతలు ఎప్పటికి ఏది అవసరమో అది నిస్సంకోచంగా చేసేస్తారనడంలో ఏమాత్రం అనుమానం ఉండక్కర్లేదు. నాలుగు ఓట్లు తమకు వస్తాయంటే.. ఎక్కడికైనా వెళ్లారు.. ఎవరితోనైనా కలిసిపోతారనేదానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అందుకేమే మినహాయింపు కాదని చెప్పుకోవచ్చు. కొద్ది నెలల క్రితం వరకూ బూతుల మంత్రిగా ప్రసిద్దుడైన కొడాలి నాని జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోయి కేవలం ఎమ్మెల్యేగా మిగిలారు. పదవి పోయినప్పటి నుంచీ మీడియాలో గానీ, పబ్లిక్ లో గానీ అంతగా కనిపించడం బాగా తగ్గించేశారు కొడాలి నాని. అయితే.. తాజాగా సెప్టెంబర్ 22 (సోమవారం)న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా గుడివాడలో ఆయన అభిమాన సంఘం నిర్వహించిన వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారు. ఆయన చిరంజీవి అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం రాజకీయ వర్గాలనే కాకుండా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చిరంజీవి బర్త్ డే వేడుకల్లో కొడాలి నాని పాల్గొనడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏముందనే సందేహం ఎవరికైనా కలగొచ్చు. అందుకు సమాధానం కూడా ఉంది. గతంలో ఏనాడూ కొడాలి నాని ఇలా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వేడుకల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. ఇప్పుడు మంత్రి పదవి పోయి, పబ్లిక్ లోనూ కొడాలి నాని అంతగా కనిపించకపోవడంతో జనానికి  ఆయన కాస్త దూరమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు కుటుంబానికి కొడాలి నాని వీర విధేయుడనే పేరు  ఉంది. ఆ క్రమంలోనే నాని జూనియర్ ఎన్టీఆర్ తో  స్నేహ సంబంధాలు కొనసాగిస్తారు. అలాంటి కొడాలి నాని ఈ సారి చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం గుడివాడలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.   చిరు వేడుకల్లో కొడాలి నాని పాల్గొనడం వెనుక రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహం ఏదో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ద్వారా గుడివాడ నియోజకవర్గంలో 30 వేలకు పైగానే ఉన్న కాపు సామాజికవర్గం  దృష్టిని ఆకర్షించడం, తద్వారా వారి ఓట్లకు గాలం వేయడం అనే  వ్యూహం మేరకే కొడాలి నాని చిరంజీవి అభిమానుల సంఘం నిర్వహించిన చిరు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారని అంటున్నారు. నిజానికి కొడాలి నానికి ఈసారి గుడివాడ నుంచి వైసీపీ టికెట్ వచ్చినా.. గెలవడం అంత సులువు కాదనే ఊహాగానాలు నియోజకవర్గంలో వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ముందు వరుసగా గుడివాడ నుంచి ఎన్నికవుతూ వచ్చిన కొడాలి నానికి ఈ సారి గెలుపు నల్లేరు మీద నడక కాదంటున్నారు. ఈ క్రమంలోనే కొడాలి నాని కాపు ఓట్లపై కన్నేశారంటున్నారు. గతంలో ఏనాడూ లేనిది ఈ సారి చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం వెనుక కొడాలి నాని రాజకీయ వ్యూహం ఇదే కావచ్చని అంటున్నారు. వాస్తవానికి ఏపీలో వైఎస్ జగన్ పాలనపైన, అభివృద్ధి జరగని తీరుపై  ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అదే ప్రభావం గుడివాడ నియోజకవర్గంలో కూడా ఉందంటున్నారు. దీంతో కొడాలి నానిలో ఓటమి భయం పట్టుకుందని, ఈసారి తాను గెలవాలంటే.. కాపుల ఓట్లను ఆకర్షించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే గుడివాడలో చిరంజీవి అభిమాన సంఘాల నేత తోట సాయి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారని చెబతున్నారు. అక్కడితో ఆగని కొడాలి.. తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే కథా నాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారని చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచింది. దాంతో పాటుగా భగవంతుని ఆశీస్సులతో చిరంజీవి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కూడా కొడాలి నాని ఆకాంక్షించడం విశేషం. మెగాస్టార్ గురించి కొడాలి నాని ఇంతలా పొగిడిన సందర్భం గతంలో ఎన్నడూ  లేదు, ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన దాఖలాలు కూడా లేవు.  ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న మెగా అభిమానుల మనసు దోచుకోవడం కోసమే నాని ఇలా చిరు అభిమానిగా అవతారం ఎత్తారని పరిశీలకులు అంటున్నారు.  అయితే.. చిరంజీవి చిన్న సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తరచుగా విమర్శలు చేసే కొడాలి నానికి కాపు సామాజికవర్గం ఓట్లు పడతాయా? మెగా ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తారా? అన్న ప్రశ్నలకు  పరిశీలకులు అనుమానమే అంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిని ఓడిస్తామని పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే సవాల్ చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 

బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్

ఘోషామహల్ ఎమ్మెల్యేపై బీజేపీ వేటు వేసింది. స్టాండప్ కమేడియన్ మునావర్ షోను హైదరాబాద్ లో నిర్వహించరాదంటూ ఆందోళనకు దిగిన రాజాసింగ్.. ఆ తరువాత విడుదల చేసిన ఒక వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వ్యాఖ్యలు ఉండటంతో హైదరాబాద్ లో ఆందోళనలు చెలరేగాయి. రాజా సింగ్ అరెస్టు డిమాండ్ చేస్తూ కమిషనర్ కర్యాలయాన్ని కూడా ముట్టడించారు. రాజా సింగ్ వ్యాఖ్యలు మతసామరస్యానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులనన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న బీజేపీ మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరించినందుకు రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరించినందకు పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరాదో పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.  అంతకు ముందు ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు సోమవారం ( ఆగస్టు 22) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజా సింగ్ వీడియో విడుదల చేసిన అనంతరం సోమవారం హైదరాబాద్ లో నిరసనలు వెల్లువెత్తాయి. ఏకంగా కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుటే నిరసనకారులు ఆందోళనకు దిగారు. అలాగే నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆందోళనలు జరిగాయి. రాజాసింగ్ తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. దీంతో పలు చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అదపులోనికి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ పై కేసు నమోదైంది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే కమేడియన్ మునావర్ ఫరూకీ హైదరాబాద్ లో స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తే తానూ కామెడీ వీడియోను విడుదల చేస్తానని రాజా సింగ్ హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే మునావర్ కామోడీ షోకు పోటీగా రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

రెండు అరెస్టులు... ర‌గులుతున్న విద్వేషాలు!  

క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు ఇటీవ‌లి రాజ‌కీయ‌ప‌రిస్థితులు అద్దంప‌డున్నాయి. తెలంగాణాలో రాజ కీయ ప‌రి స్థితుల్లో వేగంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు అందుక్కార‌ణం. ఇటీవ‌లి కాలంలో ఊహిం చ‌ని విధంగా టీఆర్ ఎస్, బీజేపీల మ‌ధ్య ర‌గులుతోన్న నిప్పు మ‌రింత రాజేసిన‌ట్ట‌యింది. అది మ‌రింత ర‌గులు కుని రెండు అరెస్టులు, రెండు పార్టీల మ‌ధ్య వైష‌మ్యాలు మ‌రింత‌గా పెంచాయి. బీజేపీ నేత‌లు రాజాసింగ్‌, బండి సంజ‌య్ అరెస్టులు ఇపుడు రెండు పార్టీల‌ను యుద్ధానికి మ‌రింత స‌న్న‌ధం చేశాయి.  హైద‌రాబాద్ పాత‌న‌గ‌రానికి చెందిన బీజేపీ నేత రాజాసింగ్‌ను మంగ‌ళ‌వారం (ఆగ‌ష్టు 23) అరెస్టు చేశారు. ఆయ‌న మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త గురించి కామెంట్ చేయ‌డం అందుక్కార‌ణం అన్నారు. గ‌తంలోనూ రాజా సింగ్ ఈ విధంగా ఒక మ‌తాన్ని ద్వేషిస్తూ చేసిన ప్ర‌సంగాలు బీజేపీనీ ఇబ్బందిపెట్టాయి. ఇది హైద‌రాబాద్ పాత న‌గ‌రంలో విద్వేషాల‌కు దారితీసే విధంగా ఉన్నాయి.  బీజేపీ నాయ‌కుల‌కు ఇలాంటి ర‌చ్చ చేయ‌డం ప‌రి పాటిగా మారింది. ఎన్నిక‌ల స‌మ‌యానికి ముందు, మ‌రేద‌యినా కీల‌క స‌మావేశాల‌కు ముందు త‌ప్పకుం డా ఏదో ర‌కంగా గొడ‌వ‌లు సృష్టించ‌డం వారికి వెన్న‌తో పెట్టిన విద్య‌గా మారింది.  కాగా రాజాసింగ్ ఆగ్రహాని కి కార‌ణం స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ హిందువులను, భార‌తీయ‌త‌ను అప హాస్యం చేసే విధంగా అత ని షోలు ఉంటున్నాయ‌ని రాజాసింగ్ ఆరోప‌ణ‌. వాటిని ఏవిధంగానూ కొన‌సాగిం చ‌రాద‌ని ఆయ‌న నినదిం చారు. అలాంటివారిని ప్రోత్స‌హించ‌డం హిందువుల‌ను కించ ప‌ర‌చడంతో స‌మాన‌మ‌ని భావించే మునా వ‌ర్ మీద బీజేపీ నేత మండిప‌డ్డారు. అయితే బీజేపీ నేత వ్య‌వ‌హ‌రించిన తీరువ‌ల్ల మ‌త‌విద్వేషాలు  రేగుతున్నాయ‌న్న ఆందోళ‌న ప‌ట్టుకుంది.  న‌గ‌రంలో రెండువ‌ర్గాల మ‌ధ్య విభేదాలు మ‌ళ్లీ త‌లెత్తి  గొడ‌వలు, విధ్వంసాల‌కు దారితీసే ప‌రిస్థితుల‌ను అణిచివేయ‌డానికే బీజేపీ నేత‌ను అరెస్టు చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణాలో  మ‌త‌సామ ర‌స్యం వెల్లివిరుస్తోంద‌ని, క‌లిసిమెల‌సి జీవిస్తున్నార‌న్నది అంద‌రికీ తెలిసిన స‌త్యం.  కాగా బీజేపీ నేత మాత్రం ప్ర‌మాద‌క‌ర‌ కామెంట్ల‌తో ఆ సహృత్ భావ వాతావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీసేలా చేస్తున్నార‌న్న విమర్శలు చాలాకాలం నుంచే ఉన్నాయి. బీజేపీవారికి కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ఉంది. క‌నుక పాలన‌లో, ఇత‌ర అంశాల్లోనూ అడ్డుకునే మార్గాల‌కే బీజేపీ ప్రాధాన్య‌త నిస్తోంద‌న్న‌ది  విమ‌ర్శ‌కుల మాట‌. గొడ‌వ‌లు సృష్టించ‌డం ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం నిరుప‌యోగం అన్న‌ది జాతీయ చిత్ర‌ప‌టం మీద ప్ర‌ద‌ర్శించ‌డం  బీజేపీ ఒక ఆన‌వాయితీగా పెట్టుకుంది. ఈ విబేదాలు సృష్టించే త‌త్వ‌మే ఇక్క‌డ ప్ర‌భుత్వంతో, మ‌రీ ముఖ్యంగా కేసీ ఆర్ తో  గొడ‌వ‌లు ముద‌ర‌డానికి ప‌రిస్థితులు దారి తీశాయి.   కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీసు లు అరెస్ట్ చేశారు. దీంతో జనగాంలో ఆయన పాదయాత్ర శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా పోలీసుల మోహరించి బండిని అరెస్టు చేశారు. బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రం గా ప్రతి ఘటించారు. పోలీసులు అటువైపు వచ్చేందుకు వీలు లేకుండా పక్కా వ్యూహాన్ని పన్నారు పార్టీ శ్రేణులు. ఆయన చుట్టూ భద్రతా వలయంగా కార్యకర్తలు ఏర్పడ్డారు. వాళ్లను పక్కకు లాగిపడేశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్‌ను తీసుకెళ్తున్నంత సేపు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియుకుండా పోయింది.  ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కవిత టార్గెట్‌గా బీజేపీ ఆగ ష్టు 22న‌ ఎదురు తాడి చేసింది. సాయంత్రానికి బీజేపీకి చెందిన మహిళా నేతలు... కవిత ఇంటి ముట్ట డి కి యత్నించారు. స్కాంలో ఇరుక్కున్న ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశా రు. వారిని అరెస్టు చేసిన పోలీసులు... వారిపై కేసులు పెట్టారు.  బీజేపీ శ్రేణులపై పెట్టిన కేసులపై భగ్గుమన్నారు బీజేపీ లీడర్లు. వెంటనే కేసులు ఉపసంహరించు కోవా ల్సిందేనంటూ పట్టుపట్టారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు నిరసనకలకు బీజేపీ రాష్ట్రాధ్య క్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. అంతే కాదు తమ శ్రేణులు, నేతలపై అక్రమ కేసులు పెడుతు న్నారంటూ తానే స్వయంగా దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు.  ప్రస్తుతం జనగామలో పాదయాత్రలో ఉన్న బండిసంజయ్‌ అక్కడే దీక్ష చేసేందుకు రెడీ అయ్యారు. కేసీ ఆర్‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్మ దీక్ష పేరుతో నిరసన చేపడుతున్నట్టు ప్రకటించారు. నల్లబ్యాడ్జీలు ధరించి అంతా జనగామలో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం వరకు దీక్ష చేసి మధ్యాహ్నం తర్వాత పాదయాత్ర కంటిన్యూ చేయాలని నిర్ణయించారు.  ధర్మ దీక్షకు కూర్చుంటున్న టైంలో జనగామ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసుల రంగప్రవేశంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అరెస్టు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణు లు వలయాలుగా ఏర్పడి... బండికి రక్షణ గోడలా నిలబడ్డారు. పోలీసులు అటువైపు రాకుండా జాగ్రత్త ప డ్డారు. వారందర్నీ పక్కకు నెట్టేస్తూ పోలీసులు బండిని అదుపులోకి తీసుకున్నారు. కానీ జీపులో ఆయ న్ని ఎక్కించుకొని అక్కడి నుంచి బయటపడేందుకు మాత్రం శ్రమ పడాల్సి వచ్చింది.  ఢిల్లీలో బ‌య‌ట‌ప‌డిన లిక్క‌ర్ స్కామ్‌లో కేసీఆర్ త‌న‌య క‌విత త‌దిత‌రుల పేర్లు బ‌య‌టికి రావ‌డంతో బీజే పీ నాయ‌కులు తెలంగాణాలో ఎక్క‌డిక‌క్క‌డ కేసీఆర్ వ్య‌తిరేకంగా  నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. ఊహిం చ‌ని విధంగా క‌విత‌, కేసీఆర్ కుటుంబ స‌భ్యులంతా కూడా దీనికి సంబంధించిన వ్య‌వ‌హారంలో భాగ‌స్తులే అన్న‌ది బ‌య‌ట‌ప‌డింది. ఆమె అక్క‌డి అధికారుల‌తో స‌మావేశం కావ‌డం సంబంధించిన స‌మాచారం వెలుగులోకి వ‌చ్చింది. దీనికి తోడు ఆమె ఇటీవ‌లి కాలంలో రాష్ట్రానికి సంబంధించిన ఏ కార్య‌క్ర‌మంలోనూ ఎక్క‌డా పాల్గొన్న దాఖ‌లాలు లేక‌పోవ‌డం కూడా గ‌మ‌నార్హం. పైగా కేసీఆర్ గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న వెన‌క కూడా క‌థ‌నాలు విన‌వ‌చ్చాయి.  పంజాబ్‌లో ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కాగా  ఆ  ఎన్నిక‌ల వ్య‌యం కేసీఆర్ ఏర్పాటు చేశార‌న్న వార్త ప్ర‌చారంలో ఉంది. దీన్ని గురించి రాష్ట్రంలో బీజేపీ మ‌రింతగా  టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం మీద ఉద్య‌మిస్తూండ‌డం కేసీఆర్‌కు మింగుడుప‌డ‌టం లేదు. ఈ కార‌ణంగానే బీజే పీ నేత‌లు ఎక్క‌డ ఏ కార్య్ర‌క‌మం నిర్వ‌హించుకుండా అడ్డుప‌డుతూ వ‌స్తున్నారు. ఈ క‌క్ష‌లో భాగంగానే ఈ క‌క్ష‌లో భాగంగానే  బండిసంజ‌య్‌ను అరెస్టు చేయ‌డం జ‌రిగింద‌న్న‌ది విమ‌ర్శ‌కుల మాట‌.  క‌క్ష సాధింపు చ‌ర్య‌లు ఒక‌రికి మించి మ‌రొక‌రు చేప‌ట్ట‌డం బీజేపీ, టీఆర్ ఎస్ ఈ విధంగా ప్ర‌జ‌ల‌కు తెలియ జేశారు. కేవ‌లం టీవీ టాక్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల్లో, పాద‌యాత్ర‌ల్లో భారీ విమ‌ర్శ‌లు చేసుకోవ‌ డంతో ఆగ‌క అరెస్టుల‌ప‌ర్వానికి తెర‌లేపింది టీఆర్ ఎస్‌. ఇది బీజేపీ ప‌ట్ల టీఆర్ ఎస్‌కి ర‌గులు తోన్న ఆగ్ర‌హానికి నిద ర్శ‌నం. 

కేసీఆర్.. కేటీఆర్ మధ్య ఎడం పెరిగిందా..?

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడు, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్  అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం తథ్యమనే వార్తలొచ్చాయి. ముహూర్తాలు ఖరారయ్యాయి. బహిరంగ వేదికల నుంచి మంత్రులు, తెరాస ముఖ్య నేతలు, అయన సమక్షంలోనే  కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. అయితే, అక్కడక్కడా వినిపిస్తున్నట్లుగా  కుటుంబ కలహాలు కారణమా,ఇంకేదైనా కారణమా, ఏమో కానీ, విఘ్నేశ్వరుని పెళ్లి ముహూర్తం లాగా, కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయి.  రామన్న పట్టాభిషేక ముహుర్తం ఇంతవరకు ముడిపడలేదు. అయితే ఇటీవలి కాలంలో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం లేదు. అందుకు కారణం కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే విషయంలో కేసీఆర్ ఎటూ తేల్చక పోవడమే అని అంటున్నారు. కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచీ ఆయన ఇప్పుడో అప్పుడో ముఖ్యమంత్రి కావడం ఖాయమని విస్తృతంగా ప్రచారం అయ్యింది. అయితే ఆ ముహూర్తం ఇంత వరకూ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలోనే తండ్రి తనకు సీఎంగా ప్రమోషన్ ఇచ్చే విషయంలో చేస్తున్న తాత్సారం పట్ల కేసీఆర్ ఒకింత ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందే సీఎంగా కేటీఆర్ పట్టాభిషిక్తుడు కావడం ఖాయమన్న రీతిలో పార్టీలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రచారం పూర్తిగా నిలిచిపోయింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వేసిన అడుగులను ఒక్కటొక్కటిగా వెనక్కు తీసుకునే పరిస్థితులు ఎదురవ్వడంతో ఆయన ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి టీఆర్ఎస్ ను అధికారంలోనికి తీసుకు రావడంపైనే దృష్టి సారించారు. దీంతో కేటీఆర్ కూడా నిర్వేదానికి గురయ్యారని అంటున్నారు. అందుకే ఇటీవల ఒక సందర్భంగా   మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆరే అని కేటీఆర్ స్వయంగా ప్రకటించారు.  ఈ కారణంగానే తండ్రి కొడుకుల మధ్య ఒకింత ఎడం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. అందకు తగ్గట్టుగానే తండ్రీ కొడుకులు ఇరువురూ ఒకే వేదికపై ఇటీవలి కాలంలో కనిపించిన దాఖలాలు లేవు. ఆఖరికి స్వాతంత్ర్య వజృత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన సమావేశానికి కూడా కేటీఆర్ కనిపించలేదు. కేటీఆర్ మొత్తంగా పార్టీ కార్యక్రమాలకూ, సభలూ సమావేశాలకూ దూరంగా ఉంటున్నారా అంటే అదేం లేదు. ఆయన ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. సభలు, సమావేశాలూ, ప్రారంభోత్సవాలలో చురుకుగా పాలుపంచుకుంటున్నారు. అయితే తండ్రితో మాత్రం వేదిక పంచుకోవడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు అసలు ఎదురుపడుతున్న దాఖలాలే లేవు. కేసీఆర్ పాల్గొంటున్న సభలలో కేబినెట్ సభ్యులందరూ పాల్గొంటున్నారు. ఒక్క కేటీఆర్ తప్ప. దీంతోనే పరిశీలకులు ఇరువురి మధ్యా ఏదో జరిగిందనీ, తండ్రీ కొడుకుల మధ్య ఎడం పెరిగిందనీ అంటున్నారు. అందుకు కేటీఆర్ సీఎం ఆకాంక్షకు కేసీఆర్ ఎప్పటికప్పుడు కళ్లెం వేయడమేనని విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటే.. కేసీఆర్ తనయ కవిత కూడా ఇటీవలి కాలంలో పెద్దగా పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నట్లు కనిపించడం లేదు. తనపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 22)న మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించారు. అలాగే బోనాల సందర్బంగా బంగారు బోనం సమర్పింస్తూ మీడియా ముందుకు వచ్చారు. చాలా వరకూ ఆమె పార్టీ కార్యక్రమాలకు, బహిరంగ సభలకూ దూరంగానే ఉంటున్నారు. ఇలా కుమారుడూ,కుమార్తె కూడా తండ్రితో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దీనిపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నప్పటికీ కుటుంబ కలహాలు కారణమని మాత్రం గట్టిగా వినిపిస్తున్నది. అది కూడా కేటీఆర్ సీఎం ఆకాంక్ష నెరెవేర్చే విషయంలో కేసీఆర్ చేస్తున్న తాత్సారమే కారణమని అంటున్నారు. అయితే ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది? కొద్ది రోజుల క్రితం వరకూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళతారని ఫ్రంట్ కాదంటే జాతీయ పార్టీ పెట్టేసి, ఢిల్లీ వెళ్లి పోతారని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్ కి అప్పగిస్తారని, అదనీ, ఇదనీ చాలా చర్చ జరిగింది. చాలా చాలా  ఉహాగానాలు వినిపించాయి. ఉహాగానాలు కూడా కాదు స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు జాతీయ ఆలోచనలను బహిరింగంగానే వినిపించారు.   మరోవంక  ఎక్కడా పెద్దగా ఖండనలు రాలేదు. తెరాస నాయకులు  ఎవరూ ఉహాగానాలను  కాదనలేదు. ఖండించలేదు. మరోవంక, అవును అది నిజమే అనే సంకేతాలు ఇస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ కూడా దూకుడు పెంచారు.   భాష మార్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవలసిన కీలక నిర్ణయాలు స్వయంగా అయనే తీసుకున్నారు. హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఎవరూ కేటీఆర్ సీఎం అన్న మాటే మాట్లాడటం లేదు. అసలా ప్రతిపాదనే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామమే కేసీఆర్ పట్ల కేటీఆర్ అలకబూనడానికి కారణమని విశ్లేషణలు వినవస్తున్నాయి.  

మళ్లీ తెరపైకి జగన్మాయ.. లేపాక్షి నాలెడ్జ్ భూముల స్వాహాకు క్విడ్ ప్రొకొ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తండి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే భారీ అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జగన్ సీఎం అయిన  తరువాత మరింత రెచ్చిపోయారనడానికి ఇప్పుడు వెల్లువెత్తుతున్న ఆరోపణలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇసుక, మద్యం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న జగన్ ఒన్లీ క్యాష్ లావాదేవీలను కొనసాగించడమే ఆయన అవినీతి తిమింగలంలా మారారనడానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ మద్యం విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ మంతా ఆన్ లైన్ లావాదేవీల వెంట పరుగులెడుతుంటే.. ఆఖరికి ఏపీ సర్కార్ బటన్ ద్వారా లబ్ధిదారులకు అందజేసే నగదు కూడా ఆన్ లైన్ ద్వారానే వెళుతుంటే ఒక్క మద్యం అమ్మకాలు మాత్రం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో నిర్వహించడమే ఆ విధానంలో అవినీతి ఏరులై పారుతోందనడానికి నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ ఒకెత్తు అయితే అనంతపురం లేపాక్షి భూముల విషయంలో వెల్లువెత్తుతున్న ఆరోపణలు మరొక ఎత్తు అని విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేర ఇందూ ప్రాజెక్ట్స్ కు ఎకరం 50 వేల రూపాయల చొప్పున వేల ఎకరాల కేటాయింపు జరిగింది. అయితే వాటిలో పరిశ్రమలు, ప్రాజెక్టుల ఏర్పాటు మాటే ఏత్తని ఇందూ ప్రాజెక్టులు ఆ భూములను తాకట్టు పెట్టి వేళ కోట్ల రూపాయల రుణాలను దండుకుంది. అలా దండుకున్న సొమ్ములో కొంత భాగం జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా మరలాయని సీబీఐ అప్పట్లో నమోదు చేసిన కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈడీ కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. దీంతో ఇందూ ప్రాజెక్ట్ చేతులెత్తేసింది. దీంతో బ్యాంకులు ఆ ప్రాజెక్టు దివాళా తీసిందని ప్రకటించేశాయి. దాంతో ఐదువందల కోట్ల రూపాయలకు ఇందు ఆస్తులను ఓ కంపెనీకి దారాదత్తం చేసేయడానికి బ్యాంకులు అంగీకరించేశాయి. అసలు బ్యాంకులు అందుకు ఎలా అంగీకరించాయో ఆర్థిక నిపుణులకు కూడా అర్ధం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఆ భూ కేటాయింపులను రద్దు చేసేసి చాలా కాలమైంది. ఆ భూములు ఇప్పుడు ఈడీ అధీనంలో ఉన్నాయి. అటువంటప్పుడు బ్యాంకులు ఆ భూములు తమ తనఖాలో ఉన్నాయంటూ.. ఏదో ఒక కంపెనీకి ఐదొందల కోట్ల రూపాయలకు అప్పనంగా అప్పగించేయడాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలి. కేటాయింపులు రద్దు చేశామని నోటీసులు పెట్టాలి.  అలా చేయడం లేదు.   ఇందు ప్రాజెక్ట్స్ భూములపై రూ. ఐదు వేల కోట్ల వరకూ అప్పులిచ్చిన బ్యాంకులు… దివాలా ప్రక్రియలో రూ. ఐదు వందల కోట్లిస్తే చాలని అంగీకరించడం వెనుక మతలబు ఏమిటి?  అలా కాకుండా ఆ భూములను వేలం వేస్తే ఇంకా ఎక్కువ సొమ్ము వస్తుంది కదా?  కానీ   బ్యాంకులు వేలం వేయకుండా.. రూ. ఐదువందల కోట్లిస్తామని వచ్చిన కంపెనీకే కట్టబెట్టడానికి సిద్ధమైపోవడం వెనుక ఉన్న జగన్మాయ ఏమిటి? ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ భూములను కొనుగోలు చేస్తున్న సంస్థలో జగన్ మేనమామ.. రవీంధ్రనాథ్ రెడ్డి కుమారుడు ఒక డైరక్టర్‌. ఈ కంపెనీకి డబ్బులు సమకూరుస్తోంది ఏపీలో పోర్టులు..సెజ్‌లు దక్కించుకున్న అరబిందో సంస్థ.   సో భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు ఎక్కడెక్కడ స్కామ్ లూ తిరిగి తిరిగి జగన్ అక్రమాస్తుల కుంభకోణం దగ్గరకే చేరుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ ఇందు ప్రాజెక్టు ఆస్తులను 500 కోట్ల రూపాయల అతి చౌక ధరకు అప్పనంగా తీసేసుకుంటున్న సంస్థ పేరు ఎర్తిన్ ప్రాజెక్టు. ఆ సంస్థ డైరెక్టర్ జగన్ మేనమామ కుమారుడు. ఎర్తిన్ కు నిధులు సమకూరుస్తున్నది ఏపీలో పోర్టులు సెజ్ లను దక్కించుకున్న అరబిందో సంస్థ. దీంతో  ఈ డీల్ మొత్తం క్విడ్ ప్రొకొ అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిస్తే వార్ వ‌న్‌సైడ్.. ర‌ఘురామ‌కృష్ణంరాజు

రాజ్యాధికారం చేజిక్కించుకోవ‌డానికి చాలాకాలం త‌ర్వాత పెద్ద చ‌ద‌రంగం ముందు కూచుని  ఇద్ద‌రు నాయ‌కులు ర‌ణ‌రంగం ఎలా న‌డ‌పాల‌న్న‌ది ఆలోచించారు. మ‌ర్నాడు ఇరువ‌ర్గాల సేన‌లు మ‌నం మ‌నం బ్ర‌ద‌ర్స్ మ‌న శ‌త్రువు మ‌న బాస్‌లు చెప్పేరుగా ఇక క‌త్తులు, క‌టార్లు సిద్ధం చేసుకోవ‌డ‌మే మ‌న ప‌ని అని యుద్ధానికి స‌మాయ‌త్త‌మ‌య్యారు. ఇది చాలా పాత‌కాలం యుద్ధ తంత్రంలో భాగంగా ఉండేది. ఇద్ద‌రి ఆలో చన‌లు క‌ల‌వాలేగాని అవ‌త‌లివాడు అధికారంలో ఉన్న పీఠం మీంచి అమాంతం కింద‌కు లాగేయ వ‌చ్చు. అందునా ప్ర‌జామోదం లేనివాడు, ప్రజాక‌ర్ష‌ణ కోల్పోయిన‌వాడ‌యితే మ‌రీ వీజీ. ఇపుడు ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప‌రిస్థితి దాదాపు ఇదే సీన్‌. రానున్న ఎన్నిక‌ల‌కు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సార‌ధ్యం లోని టీడీపీ, జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతులు క‌లిపే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని విశ్లేష‌కుల మాట‌. ఒక‌వేళ అదే జ‌రిగితే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ్యాను కి విద్యుత్ అంద‌క నిలిచిపోయే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌నే  అంటున్నారు. ఎన్నిక‌ల్లో వీరి క‌ల‌యిక ప్ర‌భావం అమితంగా ఉండే అవ‌కాశాలే ఉన్నాయ‌ని వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు అనడం గ‌మ‌నార్హం.  రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తే వార్ వన్  సైడేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తాను విస్తృత స్థాయి శాం పిల్స్ తో శాస్త్రీయంగా  జూన్, జులై మొదటి వారం వరకు నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి 93 స్థా నాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తేలిందన్నారు. ఇక నువ్వా నేనా అన్నట్టు ఉన్న స్థానాల లో సగం స్థానాలో విజయం సాధించిన, ఆ పార్టీకి 127 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వైయస్సా ర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గెలిచే స్థానాలు కేవలం 7 నుంచి 8 కాగా, మరో మూడు నుంచి నాలుగు స్థానా లలో విజయ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక నువ్వా నేనా అన్నట్లు ఉన్న 65 స్థానాలలో తమ పార్టీ ఒకవేళ 90% స్థానాలలో విజయం సాధించిన 73 సీట్లకే  పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.   టైమ్స్ నౌ, ఇండియా టీవీ, ఇండియా టుడే వంటి ఇంగ్లీష్ చానల్ నిర్వహించిన సర్వేను చూసి తొడలు చర్చుకుంటూ ఇలాగే ప్రవర్తిస్తే, పరిస్థితి మరింత అద్వానంగా దిగజారే ప్రమాదం ఉన్నదని హెచ్చరిం చారు . సోమవారం(ఆగ‌ష్టు 23) రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు  మీడియాతో మాట్లాడుతూ,  జిల్లాల వారీగా సర్వే పరిశీలిస్తే ప్రకాశం జిల్లాలో పోటాపోటీగా తెలుగుదేశం,  వైఎస్సార్  కాం గ్రెస్ పార్టీలు తలపడే అవకాశం ఉన్నదన్నారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ  స్థానా ల్లో ఏక పక్ష విజయం సాధించనున్నదని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం అధికంగా ఉన్న దన్న ఆయన, గుంటూరులోనూ విజయ అవకాశాలను పవన్ కళ్యాణ్ ప్రభావితం చేయగలరని  చె ప్పారు. టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే నువ్వా నేనా అన్నట్లు పోటీ  ఉన్న స్థానాలలో  ఆ రెండు  పార్టీల అభ్యర్థులు అవలీలగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు.    ఇటీవల టైమ్స్ నౌ, ఇండియా టీవీ, ఇండియా టుడే వంటి ఇంగ్లీష్ ఛానళ్ళు బుల్లి,  బుల్లి శాంపిల్స్ తో సర్వే నిర్వహించి తమ పార్టీకి 18 నుంచి 23 లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడం తో, తమ పార్టీ నేతలు 175 కు 175 అసెంబ్లీ స్థానాలలో గెలుస్తామని భావించి ఇంకా ఎక్కువ దారుణాలు చేయడం, సర్వే ఫలితాలను చూసి పనిచేయడం మానేస్తే పరిస్థితి మరింత అద్వానంగా ఉంటుందని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ముఖచిత్రం బాగాలేదని తెలి సిందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ప్రధానితో భేటీలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బకాయి నిధులు చెల్లించాలని కోరినట్లుగా, అలాగే 10 వేల కోట్ల రూపాయల అడ్వాన్స్ చెల్లిం చా లని అడిగినట్లుగా వివరించారని తెలిసిందన్నారు. కానీ ఏ మాత్రం క్రెడిబిలిటీ లేని వారికి పదివేల కోట్ల రూపాయలు అడ్వాన్సుగా ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక మెడికల్ కాలేజీల నిర్మాణానికి సహ కరించాలని ప్రధానిని  కోరినట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఎందుకంటే ఇప్పటికే శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీల నిర్మాణం పునాదుల దశలోనే ఉన్నాయని  గుర్తు చేశారు.  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తమ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ ఇంటిని ప్రభుత్వం అకారణంగా కూల్చివేస్తే పరామర్శించడానికి వెళ్తుండగా అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు పరామర్శకు వెళ్తుంటే... ప్రభుత్వం ఎందుకని అంత దడదడలాడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో పరామర్శల పేరిట ఊరూరు తిరిగిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు లోకేష్ తమ పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులను పెట్టి అడ్డగించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఏపీ పోలీసులు ఐపీసీ ని ఫాలో కాకుండా, వైసీపీని ఫాలో అవుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయని రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు.  లోకేష్ ను మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, ఏక వచనంతో సంబోధించడం,  మీడియాతో మాట్లాడుతుంటే అడ్డుకోవడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు వ్యతిరేకం కాదా? అం టూ రఘురామకృష్ణంరాజు నిలదీశారు. విశాఖలో చోటు చేసుకున్న సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని  ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న వారి అందరి విశ్వా సాలను కోల్పోయే విధంగా తమ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే, ఎన్నో అబ ద్ధాలు చెప్పి, తటస్థ ఓటర్లను మనం  ప్రభావితం చేయగలిగి ఉండేవారమా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నిం చారు.  మనస్సాక్షి లేని సాక్షి దినపత్రిక కోర్టులో జరిగిన వాదనలపై ఏమి రాస్తుందో చూడాలని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. తాను దాఖలు చేసిన పిటీషన్ కొట్టేసినట్లు గతంలో యాక్ ..ఛీ దినపత్రిక, అదే పేరు ఉన్న ఛానల్ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ స్థానానికి  అదనపు సమాచారాన్ని అందించేందుకు అవకాశం ఇవ్వాలని తాము కోరగా, కోర్టు అంగీక రిం చిందని, తాము వీడియో ఆధారాలతో కూడిన అదనపు సమాచారాన్ని అందజేశామని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

నో పాంట్స్ డే...ఇదో కొత్త ట్రెండ్‌!

చ‌లికాలం రాగానే స్వ‌ట్ట‌ర్లు, మ‌ఫ్ల‌ర్లు మార్కెట్‌లో వాటికి పెద్ద డిమాండ్‌. అవి లేకుండా బ‌య‌టికి పిల్ల‌ల్ని, పెద్ద‌వారిని అస్స‌లు పంపించ‌రు. చ‌లిగాలి అంత‌గా లేకుంటే మాత్రం  అమ్మాయిలు, అబ్బాయిలు టూ వీల‌ర్ల మీద తెగ తిరిగేస్తుంటారు. చ‌ల్లో చ‌లిగాలిలో అలా స‌ర‌దాగా గ‌డ‌ప‌డంలో ఏదో ఆనందం వారిది. కానీ   న్యూయార్క్‌లో మాత్రం యువ‌త చాలా కొత్త త‌ర‌హా ప్ర‌యాణాల‌కు నాంది ప‌లికారు.  మామూలుగానే కొత్త‌ర‌కం డ్ర‌స్‌లు వేస్తేనే వీల‌యినంత‌మంది వింత‌గా చూడ‌ట‌మో, కామెంట్ చేయ‌డ‌మో జ‌రుగుతుంది. ఆమ‌ధ్య వ‌ర‌కూ చొక్కాకు బొత్తాలు స‌రిగా పెట్టుకోకుండా ఉండ‌డం, క్రాఫ్‌లో స‌రికొత్త పోక‌డ లు పెద్ద ఫ్యాష‌న్‌గా మారింది. అమ్మాయిలు అబ్బాయిల్లా కేర్ లెస్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా  ఒక ఫ్యాష‌న్గా మారిపోయిన కాలంలో దుస్తులు ధ‌రించ‌డంలో మార్పులు, చేర్పులు పెద్ద లెక్క‌లోకి రావేమో!  కాలేజీ సెమిస్ట‌ర్ పూర్తి చేసిన ఆనంద‌మో, లేక ఇలా స‌ర‌దాగా ప్ర‌యాణించి జ‌నాన్ని ఆక‌ట్టుకోవాల‌న్న కొత్త ఆలోచ‌నో తెలీదుగాని అమ్మాయిలు, అబ్బాయిలూ పాంట్లు ధ‌రించ‌కుండా ప్ర‌యాణం చేసేసారు. స‌బ్ వే రైల్లోకి రాగానే ఒక్క‌రిద్ద‌రే అనుకున్నారు ప్ర‌యాణీకులు. ఏకంగా ఇర‌వ‌యి మంది అలా పాంట్లు లేకుండా కేవ‌లం చొక్కాలు, స్వ‌ట‌ర్లు, కోటులూ ధ‌రించి వ‌చ్చేశారు. ఇదేవిట్రా నాయ‌నా అని ఓ పెద్దాయ‌న అడిగితే  మా సెమిస్ట‌ర్ పూర్తి అయిన ఆనందంలో ఇలా స‌ర‌దాగా గ‌డ‌పాల‌ని అనుకున్నాం.. ఇందులో వేరే  ఆలోచ‌నేమీ లేదండీ.. అన్నాట్ట ఓ కుర్రాడు.  సెమిస్ట‌ర్ పూర్తి కావ‌డం అంటే అదేమ‌న్నా మ‌హాద్భుత‌మా?   చాలాకాలం త‌ర్వాత రైలెక్కిన ఆనందంలో పిల్ల‌లు చేసే గోల కంటే ఇలాంటి హడావుడి విద్యార్ధుల‌ను ఎవ‌రు  ఒప్పు కుంటారు. కానీ  ఆ ప్ర‌యాణీకు ల‌కు త‌ప్ప‌లేదు. వారు వెళ్లాల్సిన గ‌మ్యం చేరుకునేవర‌కూ  ఇలాంటివి చూసి త‌రించాల్సిందే మ‌రి!  కాగా ఇపుడు ఒక కొత్త భ‌యం ప‌ట్టుకుంది. అదేమంటే ఒక‌వేళ దీన్నే ఒక సంప్ర‌దాయంగా పాటిస్తే మాత్రం ప్ర‌మాద‌మే. నో పాంట్స్ డే అంటూ మొద‌లెడితే ఇక అన్ని దేశాల‌కూ విస్త‌రించ‌కా పోదు. అనుమాన‌మే మంటే, ఇప్ప‌టికే ఈ పిచ్చి కెన‌డా, ఫ్రాన్స్‌, స్వీడ‌న్‌, ఆస్ట్రేలియా, ఫిన్‌లాండ్‌, యుకేల‌కు పాకింద‌ని. 

వెంకటరెడ్డిపై చర్యలకు ఉపేక్ష ఎందుకు.. కాంగ్రెస్ అంత బలహీనమా?

మునుగోడు ఉప ఎన్నిక ఏ విధంగా చూసుకున్నా కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్యే. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పోలిస్తే మునుగోడు ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ కే ఎక్కువ కీలకం, ఎక్కువ అవసరం. ఎందుకంటే మునుగోడులో ఫలితం కాంగ్రెస్ కు ప్రతికూలంగా వస్తే... ఇంత కాలంగా శ్రేణులలో పెరుగుతూ వస్తున్న ఉత్సాహం నీరుగారిపోతుంది. ఆ ప్రభావం కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది. అంతటి కీలక ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ తన బలహీనతను వదులుకోవడంలో ఆమోదయోగ్యం కాని తాత్సారం ప్రదర్శిస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అధిష్ఠానం నిర్ణయం తీసుకోకుండా చేస్తున్న తాత్సారం వెరసి మునుగోడుపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన పార్టీ క్యాడర్ లో వ్యక్తమౌతోంది. వెంకటరెడ్డి సోదరులను ఇంత కాలం ఉపేక్షించడమే కాంగ్రెస్ చేసిన తప్పు అని, ఇప్పుడు కూడా వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోకపోతే మునుగోడుపై ఆశలు వదిలేసుకోవడమే మంచిదని క్యాడరే అంటున్నదంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ లో వ్యక్తులు కాదు.. పార్టీయే ముఖ్యం అని చెబుతుంటారు. అయినా మునుగోడు విషయానికి వచ్చే సరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధిక్కార స్వరాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు భరిస్తోందన్నది అర్ధం కావడం లేదని పరిశీలకులు సైతం అంటున్నారు. మునుగోడు కాంగ్రెస్ కు కంచుకోట అనడంలో సందేహం లేదు. అటువంటి కంచుకోటలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామాతో  ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ ఎమ్మెల్యే బీజేపీ పంచన చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మునుగోడులో పోటీ చేస్తున్నారు. అటువంటప్పుడు కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని రంగంలోనికి దింపి క్యాడర్ చెక్కు చెదరకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ ఆ పని చేయడం లేదు. టీపీసీసీ చీఫ్ కోమటిరెడ్డి సోదరుల విమర్శలను గట్టిగా తిప్పి కొట్టేందుకు అధిష్ఠానం వైపు చూడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అదే సమయంలో సోదరుడు పార్టీ వీడిన విషయాన్ని పక్కన పెట్టి టీపీసీసీ చీఫ్ పై విమర్శల వర్షం కురిపిస్తూ పార్టీకి నష్టం చేకూరుస్తున్న వెంకటరెడ్డిపై హై కమాండ్ చూసీ చూడనట్లు వదిలేసే వైఖరి అవలంబిస్తోంది. ఇదే అలుసుగా తీసుకుని వెంకటరెడ్డి రెచ్చిపోతున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేస్తున్న తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి పదవులు ఎలా ఇస్తారని అధిష్ఠానాన్నే నిలదీస్తూ టీపీసీసీ చీఫ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనతో కలిసి పని చేసే ప్రశక్తే లేదని ఖరాకండీగా చెప్పేశారు. మునుగోడుతో తనకు సంబంధం లేదనీ, అక్కడ ప్రచారానికి వెళ్లననీ తెగేసి చెప్పేశారు. అంతటితో ఆగకుండా పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జిపై ఆరోపనలు గుప్పించారు. ఆయనను తెలంగాణ నుంచి పంపేయాలనీ.. కమల్ నాథ్ నో.. లేదా అటువంటి మరో వ్యక్తినో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంతలా రెచ్చిపోతున్నా.. పార్టీ రాష్ట్ర చీఫ్ మాత్రం మేం కలిసే పని చేస్తామనీ, వెంకటరెడ్డి మునుగోడులో ప్రచారం చేస్తారనీ చెప్పుకుంటున్నారంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండా మునుగోడులో పార్టీ ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. కఠిన నిర్ణయాలకు వెరిస్తే పార్టీ మునుగోడులోనే కాకుండా ఆ తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పార్టీ క్యాడర్ ఆందోళనలో ఉంది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ మారినా.. కాంగ్రెస్ క్యాడర్ ఆయన ఆశించిన విధంగా రాజగోపాలరెడ్డి వెంట నడవలేదు. కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉంది. కొద్ది మంది అనుచరులు వినా ఎవరూ కమలం గూటికి చేరలేదు. ఏకంగా అమిత్ షా సభ పెట్టినా కూడా కాంగ్రెస్ నుంచి పెద్దగా వలసలు లేవు. అటువంటప్పుడు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి ఉప ఎన్నికకు క్యాడర్ ను కార్యోన్ముఖులను చేసేందుకు ఉపక్రమించాల్సిన కాంగ్రెస్ ఆయన సోదరుడి నోటికి కళ్లెం వేయడానికి కూడా జంకే పరిస్థితిలో ఉండటమేమిటని పరిశీలకులు అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పరాజయమే లక్ష్యమన్నట్లుగా తోస్తున్నదని.. పార్టీలో ఉంటూనే శల్యుడిలా పార్టీ పురోగమనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు సైతం అంటున్నారు. ఇప్పటికైనా ఆయన విమర్శలకుకళ్లెం వేసి.. మునుగోడులో ప్రచారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పరిశీలకులే కాదు.. పార్టీ కేడర్ సైతం అభిప్రాయపడుతోంది.    ప్రియాంకా గాంధీతో జరిగినసమావేశానికి కోమటిరెడ్డి గైర్హాజర్ కావడమే కాదు.. రేవంత్‌పై ఆరోపణలు చేశారు. సోనియాకు లేఖ రాశానంటూ దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఎయిర్ పోర్టుకే మీడియాను పిలిపించి మునుగోడుపై ప్రియాంకా గాంధీ మీటింగ్ కంటే ఎక్కువ హంగామా చేశారు.  అయినా రేవంత్ రెడ్డి కానీ సీనియర్లు కానీ.. ఆయన సమయాభావం వల్ల రాలేకపోయారని సమర్ధించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు ఆయన కాంగ్రెస్ లో ఉంటూ.. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి సోదరుడు రాజగోపాలరెడ్డి విజయానికి మార్గం సుగమం చేసేలా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డిని  ఇంకా బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూండటం ఆ పార్టీ కార్యకర్తల్లోనేఅసహనానికి కారణం అవుతోంది. రాజగోపాల్ రెడ్డి .. అన్న మాట జవదాటడు. అంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహంలో భాగంగానే జరుగుతోందని రాజకీయా పరిశీలకులు అంటున్నారు. సోదరులిరువురూ కలిసి కాంగ్రెస్ కు దెబ్బకొట్టే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తుంటే కాంగ్రెస్ ఇంకా మీనమేషాలు లెక్కించడమే  ఆ పార్టీ బలహీనత అంటున్నారు.

విద్యుత్ బ‌కాయిల‌పై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ హెచ్చ‌రిక‌

చుట్టంలాగా వ‌చ్చాడ‌ని చెప్పాల్సిన  నాలుగు మాట‌లు  చెప్ప‌కుండా ఎలా ఉంటారు. మ‌న‌వాడు మ‌న‌సు గాయ‌ప‌డుతుంది, ఇంటికి వెళ్లాక తీరిగ్గా చెబుతామంటే అదేమ‌న్నా చిన్న స‌మ‌స్యా.. అందుకే నిక్క‌చ్చిగా తేల్చి చెప్పారు, కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ సింగ్‌.  ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఈసారి గ‌ట్టిగానే మొట్టికాయ‌లు తినే వ‌చ్చార‌నాలి. ప్ర‌ధాని మోదీని క‌లిసి బొకే ఇచ్చి చిర్న‌వ్వులు చిందించినా, ఆ త‌ర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ మాత్రం సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీలు విద్యుత్ బ‌కాయిలు 75 రోజుల్లో చెల్లిం చా లని లేక‌పోతే విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోతాయని మంత్రి హెచ్చ‌రించారు.  సోమవారం (ఆగ‌ష్టు 22)ఢిల్లీలో ఆర్కేసింగ్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ భేటీ అయ్యారు. సుమారు అర్ధగంట పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. అనంతరం.. ఆర్కేసింగ్‌ విలేకరులతో మాట్లాడారు. విద్యుత్‌ రంగా నికి సబంధించిన పలు సమస్యలపై ఇద్దరం చర్చించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు రూ.6 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలు రావలసి ఉందని ఈ సమస్య తొందరగా పరిష్క రించేందుకు చొరవ చూపాలని జగన్‌ కోరారని తెలిపారు.  అయితే ప్రస్తుతం ఈ విషయం సొలిసిటర్‌ జనరల్‌ వద్ద ఉదందని, త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసు కుంటామని హామీ ఇచ్చారు. చట్ట ప్రకారం ఎవరు బకాయిలు  చెల్లించాలనే దానిని పరిష్కరిస్తామని కూడా చెప్పారు. పవర్‌ ఎక్స్చేంజీల్లో కొనుగోళ్ల బకాయిలపై సమాచారంలో పొరపాట్లు లేవని ఆర్కే సింగ్‌ స్పష్టం చేశారు. 

ఏపీ ప్రజల మొగ్గు తెలుగుదేశం వైపే.. రఘురామ

ఆంధ్రప్రదేశ్ ప్రజల మొగ్గు తెలుగుదేశం వైపేనని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజల మొగ్గు ఎటువైపు అన్న విషయంపై తాను సొంతంగా సర్వే చేయించినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఆ సర్వేలో జనం మొగ్గు తెలుగుదేశం వైపే ఉందని స్పష్టమైందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 90 పైగా స్థానాలలో విజయం సాధిస్తుందని ఆ సర్వే తేల్చిందన్నారు. జాతీయ మీడియాలో వచ్చిన సర్వేలు చూసి అంతా మాకే అనుకూలంగా ఉందని వైసీపీ భావిస్తే గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. తాను ఓ యాప్ ద్వారా సర్వే చేయించాననీ, ఆ సర్వేలో ఏపీ ప్రజలు తెలుగుదేశం పట్ల సానుకూలంగా ఉన్నారని తేలిందని రఘురామ కృష్ణం రాజు అన్నారు. అలాగే ఇటీవలి కాలంలో జనసేనకు కూడా ఆదరణ బాగా పెరిగిందన్నారు. ఎటొచ్చీ వైసీపీ పరిస్థితే నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారైందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏ వర్గమూ కూడా వైసీపీ పట్ల సానుకూలంగదా లేదని ఆయన పేర్కొన్నారు.  

జనగామలో బండి సంజయ్ అరెస్టు

ఢిల్లీ మద్యం స్కామ్ లో తెలంగాణ ప్రమేయం గురించిన వార్తలు వచ్చినప్పటి నుంచీ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. ఢిల్లీ మద్యం స్కాంలో టీఆర్ఎస్ అధినేత తనయ కవిత ప్రమేయం ఉందంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.   ఈ నేపథ్యంలోనే సోమవారం బీజేపీ కార్యకర్తలు కవిత నివాసం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. అనంతరం బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. కాగా బీజేపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా బండి సంజయ్ మంగళవారం ( ఆగస్టు 23)న జనగామలో దీక్ష చేయాలని బండి నిర్ణయించారు. ప్రస్తుతం బండి సంజయ్ పాదయాత్రలో ఉన్న సంగతి విదితమే. ఆ యాత్రలో భాగంగా జనగామలో దీక్ష కు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. దీంతో దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు సోమవారం ( ఆగస్టు 22) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజా సింగ్ వీడియో విడుదల చేసిన అనంతరం సోమవారం హైదరాబాద్ లో నిరసనలు వెల్లువెత్తాయి. ఏకంగా కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుటే నిరసనకారులు ఆందోళనకు దిగారు. అలాగే నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆందోళనలు జరిగాయి. రాజాసింగ్ తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. దీంతో పలు చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అదపులోనికి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ పై కేసు నమోదైంది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే కమేడియన్ మునావర్ ఫరూకీ హైదరాబాద్ లో స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తే తానూ కామెడీ వీడియోను విడుదల చేస్తానని రాజా సింగ్ హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే మునావర్ కామోడీ షోకు పోటీగా రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

నివేదిక‌ల తేదీల్లో తేడా తప్ప మ‌రేమీ లేదు.. ప‌ట్టాభి

అమెరికా చెబితేగాని మ‌న‌వాళ్లు దేన్ని న‌మ్మేట్టు లేరు. గోరంట్ల మాధ‌వ్ వీడియోకి సంబంధించి అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టాఫోర్డ్ నివేదిక‌కు, అంత‌కుముందు తాము విడుద‌ల చేసిన నివేదిక‌కు తేదీ త‌ప్ప మ‌రే తేడా లేద‌ని టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి అన్నారు. ఆయ‌న ఈ చిన్న విష‌యానికి సీఐడీ అధికారి సునీల్ కుమార్ తాము అమెరికా ల్యాబ్ నివేదిక‌లు మార్చేశామ‌ని, కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌ రించ‌డం అర్ధ‌ర‌హిత‌మ‌ని ప‌ట్టాభి అన్నారు. ఇదంతా గోరంట్ల‌ను కాపాడుకోవడానికి చేస్తున్న కుట్ర‌ల‌ని ప‌ట్టాభిరామం మీడియాతో అన్నారు.  అమెరికా ల్యాబ్ నివేదిక‌లో నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని అంటున్న‌వారు మ‌రి ఇపుడు ఆ నివేదిక‌ను బ‌హి ర్గ‌తం చేయాల‌ని ఆయ‌న స‌వాల్ చేశారు. వాస్త‌వానికి తాము  వీడిమో పంపిన తేదీని అందులో పేర్కొన లేద‌ని, దీన్ని ఐ ఫోన్‌కి చెందిన ఫేస్ టైమ్ వీడియో కాల్ అని నివేదిక‌లో ప్ర‌త్యేకంగా పేర్కొన్నార‌ని అన్నారు. చిత్ర‌మేమంటే తాము వీడియోను పంపిన తేదీని నివేదిక‌లో పేర్కొన‌లేద‌ని ప‌ట్టాభి ఆరో పించారు. అయితే అదేమంత పెద్ద ప‌ని కాదుగ‌నుక జిమ్ స్టాఫోర్డ్ సిబ్బంది ఆ మార్పులు చేసి పంపార‌న్నారు. అయి తే త‌న సిబ్బంది చేసినది తెలియ‌క స్టాఫోర్డ్ అస‌లా మార్పులు తాము చేయ‌లేద‌ని సీఐడీకి తెలియ‌జేశారు.  ఇక్క‌డ చిత్ర‌మేమంటే ఫేస్ టైం వీడియో కాల్ అన‌కుండా  వీడియో కాల్ అని ఉంటే నివేదిక సారాంశం మారిపోతుందా?  కానీ స్టాఫోర్డ్ మాత్రం తాను ఇచ్చిన నివేదిక‌లో ఎలాంటి మార్పుచేర్పులు లేవ‌నే అంటు న్నారు.  సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్‌కు అన్ని విష‌యాలు స్ప‌ష్టంగా తెలుసున‌ని, ఆయ‌న నిజా యితీగా ఉంటే తాము విడుద‌ల చేసిన కాపీని, త‌నకు అంది నివేదిక కాపీని విడుద‌ల చేసి తేడాని ఆయ‌నే వివ‌రిం చాల‌ని ప‌ట్టాభి కోరారు. కానీ అధికారి ఎందుకు వెన‌క‌డుతువేస్తున్నారో తెలియ‌ద‌ని విమ‌ర్శించారు.  బాధ్యత గల ఎంపీ ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తే నిజానిజాలు తేల్చడానికి ప్రభు త్వం ముందుకు రానప్పుడు,  ప్రధాన ప్రతిపక్షంగా తమ విధిని నిర్వర్తించామన్నారు. ఎంపీని కాపాడటానికి వైసీపీ దిగజారి ప్రవర్తించిందని విమర్శించారు.