విదేశాలకు గాంధీ కుటుంబం.. ఎందుకంటే?
posted on Aug 24, 2022 @ 11:44AM
గాంధీ కుటుంబం మొత్తం విదేశాలకు పయనమై వెళుతున్నారు. సోనియాగాంధీ, ఆమెకు తోడుగా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ కూడా విదేశాలకు పయనమై వెళుతున్నారు. సోనియా గాంధీ హెల్త్ చెకప్ నిమిత్తం విదేశాలకు పయనమవ్వనున్నారనీ, ఆమెకు తోడుగా రాహుల్, ప్రియాంకలు కూడా వెళతారని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ తెలిపారు.
కాగా వచ్చే నెల 4న ఢిల్లీలో జరగనున్న మెహంగాయ్ పర్ హల్లా బోల్ ర్యాలీలో రాహుల్ పాల్గొంటారని చెప్పారు. అలాగే వచ్చే నెల 7 నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదల కానుంది.
ఈ పరిస్థితుల్లో సోనియా గాంధీ హెల్త్ చెకప్ కు విదేశాలకు వెళ్లనుండటం, ఆమెతో పాటు రాహుల్, ప్రియాంకలు కూడా తోడుగా వెళ్లనుండటంతో కాంగ్రెస్ లో అయోమయం నెలకొంది. ఒక వైపు సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన, మరో వైపు కీలక సమయంలో పార్టీ అగ్రనేతలు లేకపోతే ఎలా అన్న ఆందోళన కాంగ్రెస్ లో నెలకొంది. అయితే ఇప్పటి వరకూ గాంధీ కుటుంబం విదేశీ యానం ఎప్పుడు అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.