బాసర ఐఐఐటి... నిత్యసమస్యల లోగిలి
posted on Aug 24, 2022 @ 10:50AM
బాసర ఐఐఐటి విద్యాసంస్థ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి. ఈ క్యాంపస్‌లో చదువుకోవాలని ఆంధ్రా మారుమూల ప్రాంతాల నుంచి కూడా వస్తూంటారు. చాలాకాలం ఎంతో ప్రశాంతంగా ఉన్న నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటి లో ఇటీవలి కాలంలో విద్యార్ధులు ఆందోళనలు చేపట్టడం గమనించాం. ఇక్కడ చాలా కాలం నుంచి అధ్యాపకులు సరిపడా లేరని, వైస్ ఛాన్సలర్ పోస్టు భర్తీ చేయాలని, హాస్టల్ భోజనం సరిగా ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్ని గురించి తెలంగాణా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంద ని విద్యార్ధులు తీవ్రస్థాయిలో ఆందోళ నలు చేపట్టారు. ఎట్టకేలకు ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విద్యార్ధుల నాయకులతో మాట్లాడి వారి సమస్యలు సామరస్యంగా పరిష్కరించడానికి అంగీకరిం చారు. అక్కడితో సమస్యలు తీరిపోయాయి, ఇక ప్రశాంతంగా ఉండవచ్చని విద్యార్ధులు భావించారు. కానీ ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఒక సమస్య తీరిన వెంటనే మరో సమస్య తలెత్తింది. ఈసారి మెస్ వ్యవహారం బయటపడింది. మెస్‌లో భోజనం సరిగా లేదంటూ చాలారోజులుగా విద్యార్ధులు ఫిర్యాదులు చేస్తూన్నారు. వార్డన్‌లు, ఇన్‌ఛార్జులు ఎవ్వరూ ఇన్నాళ్లూ అంతగా పట్టించుకోలేదు. కాగా ఇటీవల ఏకంగా విద్యార్ధులకు అల్పాహారంలో కప్పనే వడ్డించారు! టిఫిన్ క్రరీలో కప్ప రావడంతో విద్యార్ధులు భయంతో వణికారు. ఇది సోషల్ మీడియాలో ఓ విద్యార్థి పోస్టు చేశాడు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత ఆహారం వడ్డిం చారంటూ ఆందోళన చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉన్నత విద్య కోసం ఇళ్లు, కుటుంబాలను వదిలేసి ఇక్కడికొస్తే.. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యార్థులు నినాదాలు చేశారు.
కొద్దిరోజులుగా శాంతియుతంగా ఉన్న క్యాంపస్‌లో మంగళవారం(ఆగష్టు 23) తెల్లవారుజామున ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ పరిణామం విద్యార్థుల్లో ఆగ్రహజ్వాలకు కారణమైంది. క్యాంప్‌సలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందో ళన చేపట్టారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సీఐ వాహనా న్ని విద్యార్థులు ధ్వంసం చేశారు. మృతుడు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి తండాకు చెందిన 19 ఏళ్ల రాథోడ్ సురేశ్. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకు న్నాడంటూ సురేశ్ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని క్యాం పస్, పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సురేశ్ స్నేహితుల విచారణలో ఈ విషయం తెలిసిందని వెల్లడిం చాయి. సురేశ్ ఆర్జీ యూకేటీ ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ సివిల్ బ్యాచ్‌లో మొదటి సంవత్సరం విద్యార్తి. స్నేహితులతో ఎంతో కలుపుగోలుగా ఉండే సురేశ్ రెండ్రోజులుగా ముభావంగా ఉంటున్నాడు.
మంగళవారం ఉదయం కూడా స్నేహితులు పలకరించినా మాట్లాడకుండా హాస్టల్లోనే ఉండిపోయాడు. తరగతులకు వెళ్లలేదు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తరగతుల నుంచి స్నేహితులు హాస్టల్ గదికి చేరుకునే సరికి సురేశ్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులే సురేశ్‌ను వర్సిటీ ఆస్పత్రికి, అక్కడి నుంచి జిల్లాలోని భైంసా ఆస్పత్రికి తీసుకెళ్లారు అయితే అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు తెలిపారు. సురేశ్ విషయంలో వర్సిటీ అధికారులు స్పం దించలేదని.. అంబులెన్స్ అందుబాటులో ఉంటే బతికేవాడని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌లే ఇందుకు కారణం అని, వారికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్దకు విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకు దిగారు.
పోలీసులు అక్కడికి చేరుకొని నిలువరించేందుకు ప్రయత్నించగా వారితో విద్యార్థులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ముథో ల్ సీఐ వినోద్‌రెడ్డి కారు అద్దాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. సీఐని సైతం అక్కడి నుంచి తోసే సేం దుకు ప్రయత్నించారు. దీంతో వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులే వర్సిటీ నుంచి బయటకు రావడంతో.. విద్యార్థులు శాంతించారు.
కాగా, సురేశ్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం క్యాంపస్ నుంచి నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న సురేశ్ తల్లిదండ్రులు గంగాధర్, సరోజ తమ కొడుకు ఆత్మహత్యపై పలు అనుమానాలున్నాయని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రెండు రోజుల క్రితం పోలీసులు గంజా యి కేసు విషయమై వేధిస్తున్నారంటూ సురేశ్ ఫోన్‌లో తమతో చెప్పాడని తెలిపారు. పోలీసులు ఇబ్బందులకు గురి చేయడంవల్లే భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు నని అనుమానం వ్యక్తం చేశారు.
నిజాలు తేలే వరకూ పోస్టుమార్టం నిర్వహించేది లేదని పట్టుపట్టారు. చివరకు కొద్దిసేపు తర్వాత పోలీసు లు, అధికారుల హామీ మేరకు పోసుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా ట్రిపుల్ ఐటీ విద్యార్థి సురేశ్ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని తమ ప్రాథమిక విచా రణలో తేలిందని నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తులో అన్ని విష యాలు వెలుగు చూస్తాయని ఎస్పీ స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్న బాసర ఐఐఐటిలో సమస్యలకు అంతుండటం లేదన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల విద్య, భద్రతా వాతావరణాన్ని కాపాడేందుకు ఏ మా త్రం శద్ధ చూపడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. కేవలం పెద్ద సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతు న్న తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ఆసక్తి చూపుతోంది గాని, అసలు విద్యాసంస్థ కాల క్రమంలో ఇన్ని సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నది, వాటిని నిలువరించేందకు విద్యార్ధులకు ప్రశాం త విద్యాబోధనా అవకాశాలు కల్పించడానికి ప్రత్యేకించి తీసుకోవాల్సిన అంశాల మీద ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్ధులు, సంస్థ అధికారులు ఆశిస్తున్నారు.