హద్దు మీరుతున్న సరిహద్దు వివాదం
posted on Aug 24, 2022 @ 11:21AM
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన సమయంలో అంతా బాగానేఉంటుంది. అన్నదమ్ములుగానే భవిష్యత్తులో నూ కొనసాగుతాం అంటూ ఎన్నో అనుకున్నాం. కానీ చీటికీ మాటికీ రాజకీయపర సమస్యలు తలెత్తి రెం డు రాష్ట్రాల మధ్య ఏకంగా సరిహద్దు సమస్యల్ని పీకల్లోతు తీసుకువచ్చాయి. తెలుగు రాష్ట్రాల మద్య సరి హద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద రెండు రాష్ట్రాల పోలీసుల మద్య వివాదం జరిగింది. ప్రాజెక్టుపైకి ఏపీకి చెందిన ఎస్ఐ వాహానాన్ని తెలం గాణ పోలీసులు అనుమ తించలేదు. దీంతో ఏపీ పరిధిలోకి వచ్చిన తెలంగాణ పోలీసు వాహనానికి ఏపీ పోలీసులు చలానా రాశారు. దీంతో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం ముదిరింది. చివరికి ఈ పంచాయతీ పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు చేరింది. ఇరు పోలీసుల మధ్య రాజీ కుదిర్చే పనిలో పోలీసు పెద్దలు ఉన్నారు.
గతంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రేగింది. అది ఇరు రాష్ట్రాల అధికారులు హద్దు రాళ్లు పాతడం.. పీకేయడం దాకా వెళ్లింది. ఎప్పటికప్పుడు ఒక రాష్ట్రం అధికారులు రాళ్లు పాతడం.. నెంబర్లు వేయడం.. మరో రాష్ట్రానికి చెందిన అధికారులు పీకేయడం పరిపాటిగా మారింది. ఇది దాయా దులైన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న సరిహద్దు వివాదం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వా రావుపేట చెక్‌పోస్టు సమీపంలో ఈ వివాదం తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు సమీప ప్రాంత మైన అశ్వారావుపేట నుంచి అటు పశ్చిమగోదావరికి.. ఇటు తూర్పు గోదావరికి.. మరోవైపు తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు రహదార్లున్నాయి. సూర్యపేట- దేవరపల్లి జాతీయ రహదారి ఇక్కడి నుంచే వెళ్తుం టుంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉన్న ప్పటికీ అధికారుల వైఖరి వల్ల అప్పుడప్పుడూ ఇలాంటి సరిహద్దు తగాదాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా జీలుగుమిల్లి సమీపంలోని చెక్‌పోస్టు దగ్గరలో ఉన్న సరిహద్దు '0' కి.మీ రాయిని తీసి పడేసి.. అశ్వారావు పేట పట్టణం చివర్లో '0' కి.మీ గుర్తును చూపుతూ ఏపీ రోడ్లుభవనాల శాఖ అధికారులు రాయిని పాతారు. దీనిపై స్థానికుల ఫిర్యాదు మేరకు తెలంగాణ అధికా రులు తొలగించారు. దీంతో వివాదం మళ్లీ మొద లైంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నపుడు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాంతం మొత్తం (పోలవరం ముంపు ప్రాం తం మినహాయించి) తెలంగాణలోకి చేరిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సరిహద్దు అశ్వారావుపేటకు సమీపంలోని జీలుగుమిల్లివద్ద ఏర్పాటైంది. అక్కడే '0' కి.మీ రాయిని ఏర్పాటు చేశారు. ఆ సమీపంలోనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయశాఖ, ఎక్సైజ్, రవాణా, వాణిజ్య పన్నుల శాఖ, ఇంకా అటవీశాఖలతో కూడిన ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకు న్నారు. ఈ ప్రాంతం గుండానే (సూర్యపేట- దేవరపల్లి) నేషనల్ హైవే 365బిబి వెళ్తూ ఉంది. ఇలా ఏర్పాటై దాదాపు ఏడేళ్లు కావస్తున్నా ఈ ప్రాంతంలో ఇప్పటికీ సరిహద్దుపై వివాదం రగులుతునే ఉంది.
స్థానికంగా ఉండే కొందరు ఏపీలోనే ఉంటే బాగుంటుందన్న తమ ప్రయోజనాల కోసం అధికారులను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణ కూడా ఉంది. దీంతో అప్పుడప్పుడూ '0' కి.మీ రాయిని ఉన్నచోట నుంచి తీసి, అశ్వారావు పేటకు సమీపం లో అంటే దాదాపు 120 మీటర్లు పైగా జరిపి ఏర్పాటు చేశారు. దీంతో అప్పటికే అక్కడ నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఏపీలోకి వెళ్లిపోయినట్లయింది.