జకీర్ అన్నవి ఒప్పయితే, నూపుర్‌వి తప్పు ఎలా? ... రాజ్ ఠాక్రే
posted on Aug 24, 2022 @ 12:22PM
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కామెంట్లు చేసిన బీజేపీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మద్దతు ప్రకటించారు. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ చేసిన వ్యాఖ్యలనే.. గతంలో జకీర్ నాయక్ చేశాడని ఆయన గుర్తుచేశారు. జకీర్ నాయక్ చేస్తే తప్పుకానప్పుడు.. నూపుర్‌ది తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. జకీర్ నాయక్‌ను ఎవరూ క్షమా పణలు చెప్పాలని డిమాండ్ చేయలేదని పేర్కొన్నారు.
ప్రవక్తమీద కామెంట్ చేసిందనే ఆరోపణతో ఆమెను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసేవరకూ వేధించారు. ఆమె పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. బిజెపి ప్రభుత్వం ఆమెను రక్షిస్తోందని ఒక వర్గంవారూ మండిపడ్డారు. యావత్ దేశానికీ ఆమె క్షమాపణలు చెప్పాలని వెల్లువెత్తారు. అయితే గతంలో జకీర్ నాయక్ చేసిన కామెంట్లకు ఇటీవల నూపర్ చేసిన కామెంట్లకు పెద్దగా తేడా ఏమీ లేదని అప్పుడు జకీర్ విషయంలో ఎవ్వరూ నోరు విప్పనపుడు నూపుర్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం అర్ధరహితమని రాజ్ ఠాక్రే అన్నారు. ఒకే అంశంలో ఇద్దరికి వేరు వేరు తీర్పులు ఎలా చెప్పగల్గు తారని ఆయన మండిపడ్డారు.
అంతేగాక, గతంలో ఏఐఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు హిందూదేవతల మీద వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారని అప్పట్లో ఆయన్ను ఎవ్వరూ దేశ ప్రజలకు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేయక పోవ డం గురించి కూడా ఠాక్రే ప్రస్తావించారు. ప్రభుత్వం ఆయన్ను నిలువరించడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.