ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం

మధ్య ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి ఘోరక్ పూర్ వెళుతున్న బస్సు మధ్య ప్రదేశ్ లోని సుహాగి పహారీ వద్ద శనివారం (అక్టోబర్22) తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్ లోని తమ స్వగ్రామానికి వెళుతున్న కూలీలు ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన 20 మందిని ప్రయాగ్ రాజ్ ఆసుపత్రికి తరలించారు. బాధితులందరూ యూపీకి చెందిన కూలీలేనని, దీపావళి పండుగ కోసం స్వగ్రామం వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు అందాల్సి ఉంది. 

కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య: షర్మిల

ఏపీ సీఎం జగన్ అరాచకాలను రాష్ట్ర ప్రజలే కాదు.. సోంత కుటుంబీకులు కూడా భరించ లేకపోతున్నారు. ఇప్పటికే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అన్న సీఎంగా ఉన్న రాష్ట్రంలో తన తండి హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదంటూ వేరే రాష్ట్రానికి మార్చాలని సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక సొంత చెల్లి, తల్లి కూడా జగన్ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని ఆయనకు దూరంగా పొరుగు రాష్ట్రం తెలంగాణలో గడుపుతున్న సంగతి విదితమే.  అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని దూరంగా ఉంటున్న షర్మిల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంలో జరిగిన దారుణ ఘటన బాబాయ్ వివేకా హత్యేనని చెప్పారు. ఆయనను హత్య చేసిన వారెవరో తెలియాలనీ, వారికి శిక్ష పడాలనీ అన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాగ్ కు ఫిర్యాదు చేసేందుకు హస్తిన వెళ్లిన షర్మిల అక్కడ విలేకరులతో మాట్లాడారు. కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందని, అది వాస్తవమని ఆమె కుండబద్దలు కొట్టారు. వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అడుగడుగునా దర్యాప్తును అడ్డుకుంటున్నారనీ అన్న షర్మిల తన సోదరి సునీతకు న్యాయం జరగాలని పేర్కొన్నారు.  వివేకానంద రెడ్డిని హత్య కేసులో నిందితులకు శిక్షపడేలా ఆయన కుమార్తె షర్మిల న్యాయపోరాటం చేస్తున్న సంగతి విదితమే. ఈ హత్య కేసు దర్యాప్తు ఏపీలో అయితే నిష్పాక్షికంగా జరగదన్న ఆమె అభిప్రాయంతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏకీభవించడం.. సుప్రీం కోర్టుకు కూడా అదే నివేదించడం తెలిసిందే. ఏపీలో వివేకా హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని సుప్రీం కోర్టు సైతం వ్యాఖ్యానించిన నేపథ్యంలో షర్మిల కడప ఎంపీ సీటు కోసమే తన బాబాయ్ హత్య జరిగిందని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా సంచలనం సృష్టించాయి.   ఇప్పటికే సీబీఐ కడప ఎంపీగా తనకు టికెట్‌ ఇవ్వకపోతే... షర్మిలకు లేదా విజయలక్ష్మికి మాత్రమే ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ను వివేకా కోరారని... ఈ నేపథ్యంలోనే వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఈ హత్య చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది.  వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ ప్రమేయంపై అనుమానాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు షర్మిల సూటిగా సమాధానం ఇచ్చారు. కడప ఎంపీ టికెట్ కోసమే తన బాబాయ్ హత్య జరిగిందన్నది వాస్తవమని కుండ బద్దలు కొట్టారు. తమ  కుటుంబంలో జరిగిన ఘోరం తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య అన్న షర్మిల సునీతకు న్యాయం జరగాలి. మా చిన్నాన్నను   ఘోరంగా హత్య చేశారో వారి పేర్లు బయటికి రావాలి. శిక్ష పడాలి. దీన్ని ఎవరూ అడ్డుకోడానికి వీల్లేదని చెప్పారు. 2019 ఎన్నికల ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  ఆయన సొంత నివాసంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తొలుత ఆయనది సహజమరణమని, గుండెపోటుతో మరణించారనీ పేర్కొన్న జగన్.. ఆ తరువాత ఆయన హత్య వెనుక అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఉన్నారని ఆరోపణలు గుప్పించిన సంగతి విదితమే. విపక్ష నేతగా వివేకా హత్య కేసు సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసిన జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు. అయితే వివేకా కుమార్తె సునీత మాత్రం తన తండ్రిని దారుణంగా హత్య చేసిన వారికి శిక్ష పడాల్సిందే నంటూ సీబీఐ దర్యాప్తును కోరారు. ఇప్పుడు ఏపీలో హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదనీ, వేరే రాష్ట్రానికి మార్చాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. సునీత వాదనతో కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏకీభవించింది. కేసు విచారణ వేరే రాష్ట్రానికి మార్చాలని కోరింది. సుప్రీం కూడా అంగీకరించింది.  

రెచ్చిపోయిన ఐర్లాండ్  స్ట‌ర్లింగ్‌...వెస్టిండీస్ ఇంటికి!

వెస్టిండీస్‌.. రెండుప‌ర్యాయాలు టీ20 ప్ర‌పంచ ఛాంపియ‌న్‌. కానీ ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఆరంభ‌మైన ఛాంపియ‌న్‌షిప్ అర్హ‌త కూడా సాధించ‌లేక ఇంటిదారి ప‌ట్టింది! శుక్ర‌వారం అర్హ‌త పోటీలో చిన్న జ‌ట్టు ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోవ‌డం క‌నీ వినీ ఎరుగ‌నిది. పాల్ స్ట‌ర్లింగ్ కేవ‌లం 48 బంతుల్లో 66 ప‌రుగులు చేయ‌డ‌మే కాదు 3వేల ప‌రుగులు అధిగ‌మించి టీ20 మ్యాచ్‌ల్లో అత్య‌ధిక స్కోర్ చేసిన ఆరుగురు ఘ‌నుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఊహించ‌ని విధంగా చిన్న జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్ ఏకంగా ఆరాన్ ఫించ్‌, డేవిడ్ వార్న‌ర్ వాటి సూప‌ర్‌స్టార్స్ చెంత చేరి హేమా హేమీ జ‌ట్ల‌కు త‌న స‌త్తా తెలియ‌జేశాడు. ఈ ప‌ర్యాయం గ్రూప్ స్థాయిలో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు ఓడిపోయి, వెస్టిండీస్ ఛాంపియ‌న్‌షిప్ నుంచి బ‌య‌ట‌ప‌డింది.  పాల్ స్ట‌ర్లింగ్  పెద్ద‌గా క్రికెట్ చ‌ర్చ‌ల్లో వినిపించ‌ని ప్లేయ‌ర్‌, కానీ ఈ ఏడాది ఆరంభంనుంచి ఆడిన ప్ర‌తీ టీ20 మ్యాచ్‌లోనూ క‌నీసం అర్ధ‌సెంచ‌రీ చేసి త‌న క్రికెట్ ప్ర‌త్య‌ర్ధుల‌ను ఖంగారుపెట్ట‌డానికి సిద్ధ‌ప‌డ్డాడు. గ‌త ప్ర‌పంచ‌క‌ప్ పోటీల తొలిరౌండ్‌లోనే చిత్రంగా స్ట‌ర్లింగ్ వైఫ‌ల్యం కార‌ణంగానే ఐర్లాండ్ జ‌ట్టు వెనుదిర‌గ‌వ‌ల‌సి వ‌చ్చింది. 32 ఏళ్ల స్ట‌ర్లింగ్ వెస్టిండీస్ బౌల‌ర్ల‌ను ఉతికారేసాడు అనొచ్చు. వాళ్లు ఇత‌ని మీద ఏమాత్రం ప్ర‌భావంచూప‌లేదు. ప‌వ‌ర్‌ప్లేలో మ‌రీ రెచ్చిపోయి వెస్టిండీస్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. అత‌ని ఆట‌లో ఎంతో ఏకాగ్ర‌త‌, చెప్పుకోద‌గ్గ షాట్ సెల‌క్ష‌న్‌తో అంద‌ర్నీ ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాడు. లోక్రాన్ ట‌క్క‌ర్‌తో క‌లిసి 146 ప‌రుగుల ల‌క్ష్యా న్ని ఇంకా రెండు ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే అధిగ‌మించేట్టు చేశాడు. ఇలాంటి ఎంతో ఒత్తిడితో కూడుకున్న ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లో జ‌ట్టు విజ‌యానికి కీల‌క‌పాత్ర వ‌హించ‌డంలో పాల్ త‌న బ్యాటింగ్ స‌త్తాని, సూప‌ర్ టెక్నిక్‌నీ ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌పంచ‌క‌ప్‌కి రావ‌డా నికి ముందు ఐర్లాండ్ ఆడిన 12 టీ20 మ్యాచ్‌ల్లో 9 ఓడిపోయింది.  అయినా ఎంతో అద్బుతంగా ఆడి వెస్టిండీస్ వంటి జ‌ట్టును టోర్నీ నుంచి బ‌య‌టికి పంపిన ఘ‌న‌త సంపాదించుకుంది. ప‌రుగుల వ‌ర‌ద‌తో స్ట‌ర్లింగ్ అంద‌రి మ‌న‌సు ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ, అత‌నితో పాటు జార్జ్ డ‌క్రెల్‌, క‌ర్టిస్ కాంఫ‌ర్ కూడా అద్భుతంగా స్కాట్లాండ్‌తో త‌ల‌ప‌డిన మ్యాచ్‌లో ఆడారు. లక్ష్య‌సాధ‌న‌లో తొలి స్థాయిలోనే బ‌ల్బెరిన్ కేవ‌లం 23 బంతుల్లో 37 ప‌రుగులు సాధించ‌డంలో విండీస్ బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టాడు. అత‌ని ధాటికి విండీస్ ఫీల్డింగ్ లోపాలు స్ప‌ష్ట‌మ‌య్యాయి. కాగా లెగ్‌స్పిన్న‌ర్ గారెత్ డిలానే 16 ప‌రుగులిచ్చి 3 వికెట్లు తీయ‌డంలో అద్భుత బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చూపాడు. విండీస్ బ్యాట‌ర్లు అత‌ని ధాటికి ఇన్నింగ్స్ నిల‌బెట్టుకునేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది.  వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో బ్రాండాన్ కింగ్ అద్బుతంగా ఆడాడు. 48 బంతుల్లో వేగంగా 62 ప‌రుగులు తీయ‌డంలో త‌న బ్యాటింగ్ స‌త్తా ప్ర‌క‌టించాడు. అత‌న్ని నిలువ‌రించ‌డానికి ఐర్లాండ్ తంటాలు ప‌డింద‌నాలి. మొత్తానికి ఐర్లాండ్ శుక్ర‌వారం మ్యాచ్‌లో అన్ని విధాలా బ్ర‌హ్మాండంగా ఆడి ఎంతో అనుభ‌వం ఉన్న వెస్టిండీస్‌కు ఛాంపియ‌న్‌షిప్ లో కొన‌సాగే అవ‌కాశాలు లేకుండా చేసింది. 

నాన్న పులి.. జ‌గ‌న్‌ పిల్లి... లోకేష్‌

పులి, పిల్లి.. వేరు వేరు వేట తీరు జంతువులు. ఎంతోధైర్యంగా వేటాడ‌ట‌మే కాదు అంద‌రిని చెప్పుచేతల్లో నూ పెట్టుకుంటూ అవ‌స‌ర‌మ‌యిన‌పుడు దాడుల‌కు వెనుకాడ‌క వేగంగా వ్యూహాత్య‌కంగానూ వెళ్లేవారిని పులి లాంటోడ్రా అంటారు.. ఎవ్వ‌రూ చూడ‌ని స‌మ‌యంలో విర్ర‌వీగుతూ త‌నంత‌టివాడు లేడ‌నుకుని వ్య‌వ‌హ రిస్తూ ఒక్క‌రి ద్ద‌రు ఎదురు ప‌డ‌గానే తోక‌ముడుచుకుని ఇంట్లోనే ర‌హ‌స్యంగా సంచ‌రించేవాడిని పిల్లి అనే అంటారు. పులి చంద్ర‌బాబు, పిల్లిగా జీవిస్తున్న‌ది మాత్రం జ‌గ‌న్‌!  టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ అనంత‌రం  పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి, రాష్ట్రాన్ని ప‌రుల చేతుల్లోకి పోకుండా చేయ‌డానికి స‌మ‌స్త భారాన్ని మోసి రాజ‌కీయ చ‌తుర‌త‌తో అధికారంలోకి తెచ్చి త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శిస్తూ గొప్ప మార్గ‌ద‌ర్శ‌కునిగా నిలిచిన వాడు చంద్ర‌బాబు. ఆయ‌న టీడీపీని అధికారంలోకి తీసుకు రావ‌డ‌మే కాకుండా మంచిపాల‌నాద‌క్షునిగా అంద‌రి మ‌న్న‌న‌లూ పొంద‌డం గ‌మ‌నార్హం. ప‌డ‌నివారు, రాజ కీయాల్లో ఎద‌గ‌లేనివారు అనేకానేకులు  ఆయ‌న్ను వెన్నుపోటుదారుడు అదే ఆయన అస్త్రంగా ప్ర‌యో గించి అధికారంలోకి వ‌చ్చార‌న్న అప‌వాదులు మొన్నీ మ‌ధ్య వ‌ర‌కూ భ‌రిస్తూనే వచ్చారు. కానీ  అప్ప‌టి ఆగ‌స్టు సంక్షోభంలో పార్టీని చంద్ర‌బాబు  క‌నుక  నాయకత్వం వ‌హించి ముంద‌డుగు వేయ‌కుంటే ఇప్ప‌టి ప్ర‌గ‌తి అసాధ్య‌మ‌న్న‌ది క్ర‌మేపీ ప్ర‌జ‌లు, రాజీయ నాయ కులు గుర్తించారు. అధికారం కేవ‌లం త‌న పార్టీ కోసమే కాకుండా రాష్ట్ర ప్ర‌గ‌తిని ల‌క్ష్యంగా పెట్టుకుని పాల‌న సాగించారు. టెక్నాల‌జీకీ పెద్ద పీట వేస్తూ అప్ప‌టి స‌మైక్యాంధ్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌ని  టెక్ కేంద్రంగా రూపుదిద్ద‌డంలో ఆయ‌న కృషి అన‌న్య సామాన్య‌మ‌ని ఇప్ప‌టికీ వేనోళ్ల కీర్తిస్తున్నారు. అనేక రాజ‌కీయ మ‌లుపులు, తిరుగుబాట్లు త‌ట్టుకుంటూ పాల‌నాప‌రంగా గొప్ప వ్యూహ‌క‌ర్త‌గా, విజ‌న‌రీగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్నారు చంద్ర‌ బాబు. విదేశీ సంస్థ‌లు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం, నిరుద్యోగుల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించ‌డం, బ‌డుగు వ‌ర్గాల‌ను ఆదుకోవ‌డంలో చేసిన కృషిని దేశం గుర్తించింది. ఆయ‌న క్ర‌మేపీ జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రంతిప్పే స్థాయికి ఎద‌గ‌డంలో ప్ర‌త్య‌ర్ధుల‌ను, శ‌త్రువుల‌ను పులిలానే వేటాడా ర‌ని అంటారు.  ఎవ‌రు ఎన్ని వ్య‌తిరేక ప్ర‌చాచాలు చేసిని, ఏమ‌న్నా పట్టించుకోకుండా  త‌న సామ‌ర్ధ్యంతో కేంద్రంలోనూ అంతే గౌర‌వ మ‌ర్యాద‌లు అందుకున్నారు. ఎన్‌డీఏలో కీల‌క‌పాత్ర వ‌హించ‌డంతో పాటు దేశ రాజ‌కీయాల్లో ఆయ‌న రాజ‌కీయ ముద్ర‌ను వేయ‌డంలో ఇత‌ర జాతీయ పార్టీల వారూ ఆయ‌న‌తో చేతులు క‌లిపేందుకు ఆస‌క్తి చూపారు. కానీ ప‌రిస్థితులు ఒకేలా ఉండ‌వు. అంత‌టి వ్యూహ‌క‌ర్త‌, దూర‌దృష్టి ఉన్న నాయ‌కుడూ అధికారం కోల్పోయారు. అయినా మొక్క‌వోని ధైర్య‌సాహ‌సాల‌తో పార్టీని మాత్రం ప‌టిష్టంగా రాష్ట్రంలో విస్త రించేలా నాయ‌కుని ల‌క్ష‌ణాలు మ‌రింత ప్ర‌ద‌ర్శించి మ‌ళ్లీ రాజ‌కీయరంగంలో త‌న ముద్ర‌ను వేశారు. రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు అవ‌స‌రం ఎంతో ఉంద‌న్న అభిప్రాయాలు అన్ని వ‌ర్గాల నుంచి విన‌వ‌చ్చా యి.  రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఆయ‌న అధికారాన్ని అంతా ఆశి స్తున్నారు. ఆయ‌న శ‌క్తి సామ‌ర్ధ్యాలు అవ‌స‌ర‌ మ‌న్న‌ది ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. పార్టీ అభిమానులు, నాయ‌కులు మ‌ళ్లీ ఉద్య‌మించారు. అధి కారంలోకి వ‌చ్చేం దుకు ఇక ఆట్టే స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.  వైఎస్సార్  మ‌హానేత అని ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు అందుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న కుమారునిగా వై.ఎస్‌.జ‌గ‌న్ అంతా ప్ర‌జ‌ల మ‌న‌సులో నిల‌వ‌లేక‌పోయారు. ప్ర‌జాద‌ర‌ణ లేని నాయ‌కుడు ఆట్టేకాలం మ‌న‌లేడు. అధి కారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొత్త గా కొమ్ములొచ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించి తోచిన విధంగా వ్య‌వ‌హ‌రిం చ‌డం ప్ర‌జ‌లు గ‌మ‌నించారు. అధికారంలోకి రావ‌డానికి చేసిన పాద‌యాత్ర‌, ఇచ్చిన భారీ హామీల‌న్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయి కేవ‌లం పేర్లు, ప్ర‌చారం మాత్ర‌మే మిగిలింది. చేప‌ట్టిన ప్ర‌తీ కార్య‌క్ర‌మం ప్ర‌జాద‌ర‌ణ పొందిన‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ, అదంతా కేవ‌లం భ్ర‌మ అనేది త్వ‌ర‌లోనే తేట‌తెల్ల‌మ‌యింది. అధికారం లోకి వ‌చ్చి మూడేళ్లు గ‌డిచిపోయినా ఇప్ప‌టికీ ప్ర‌జాద‌ర‌ణ పొంద‌క‌పోగా వారి నుంచి ఛీత్కారం ఎదుర్కొం టున్న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ రికార్డుల్లోకి ఎక్కారు. అన‌తికాలంలో ఉన్న‌త ప‌ద‌వికి మ‌రింత ప్ర‌తిష్ట తీసు కురావ‌ల‌సిన యువ నాయ‌కుడు అధోగ‌తికి దిగ‌జార‌డం ప్ర‌జ‌లు, తోటి నాయ‌కులు గ‌మ‌నిస్తున్నారు.  కేవ లం ప్ర‌తిప‌క్షాల మీద విరుచుకుప‌డ‌టం, అవ‌మానించ‌డం త‌ప్ప ప్ర‌త్యేకించి చేసిన‌దేమీ క‌న‌ప‌డ‌దు. దీనికి తోడు ఎమ్మెల్యేలు, మంత్రులూ అంద‌రూ నాయ‌కునికి మ‌ర్యాద‌స్తుల‌మ‌న్న సీన్ చూపించి క్ర‌మేపీ త‌మ నిజరూప ద‌ర్శ‌నం చేయించారు. చాలామటుకు ఎవ్వ‌రూ మామూలు మ‌నుషులు ఉప‌యోగించ‌ని భాష‌లో మాట్లాడ‌డం, ఎదుటివారిని విమ‌ర్శించ‌డం, తిట్ట‌డంలో డాక్ట‌రేట్లు పుచ్చుకున్న తీరే ప్ర‌ద‌ర్శించ డం చూస్తున్నాం. ఇది క‌నీ వినీ ఎరుగ‌ని కాలం అంటున్నారంతా. స‌ద్విమ‌ర్శ అనేది నాయ‌కులు, మంత్రులు మ‌ర్చిపోయారు. ఎవ‌రికివారే...అన్న నానుడిని మంత్రులు రుజువుచేస్తున్నారు. చాలా స్వేచ్ఛగా కామెంట్లు చేసేస్తున్నారు. ముఖ్య‌మంత్రితో క‌నీసం అవ‌గాహ‌న లేన‌ట్టుగానే క‌న‌ప‌డుతున్నారు. దేనికి కామెంట్లు చేస్తున్న‌దీ తెలీని స్థితిలో ఉన్నారు. క్ర‌మేపీ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది పాల‌నా .. ఇత‌న్ని ముఖ్య‌మంత్రి అనాలా.. అని ప్ర‌శ్నిస్తున్నారు.  గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ ప్ర‌భుత్వం అంటూ మూడే ళ్ల పాల‌న త‌ర్వాత ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు వెళుతోన్న మంత్రు లు, ఎమ్మెల్యేలను ప్ర‌జ‌లు తిట్టిపోస్తు న్నారు. క్ర‌మేపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల ముందుకు మంత్రు ల‌ను త‌రుముతూ తాను మాత్రం ప్యా లెస్‌కే ప‌రిమిత‌మ‌యి లోప‌ల్లోప‌లే దాక్కున్న పిల్లిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ యువ‌నేత నారా లోకేష్ అన‌డం స‌రిగ్గా స‌రిపోతుంది. జ‌గ‌న్‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. బ‌య‌టికి వ‌స్తే ఏంద‌న్నా జ‌గ‌న‌న్నా అని నిల‌దీస్తార‌న్న భ‌యం తినేస్తోంది. మంత్రుల‌ను చూడ్డానికి కూడా ఇష్ట‌ప‌డ‌టం లేదు. వేసిన అన్ని లెక్కలు, లెక్క‌ల మాస్ట‌ర్లంతా జ‌గ‌న‌న్నా ఈసారి మూటా ముల్లూ స‌ద్దుకోమనే అనేశారు. పార్టీ వ‌ర్గాలు దాదా పు చేతులెత్తేశాయి. మంత్రులు భ‌యం భ‌యంగానే ఉంటున్నారు. 2024 ఆట్టే దూరం లేదు. అప్ప‌టి వ‌ర‌కూ పీఠాన్ని ప‌ట్టుకుని చిన్న‌చిన్న ప‌నులు చేసుకుంటూ, సెల్ఫీలు దిగు తూ ఉండాల్సిందే త‌ప్ప గ‌ట్టి గా మ‌ళ్లీ నిల‌దొక్కుకునే య‌త్నాలు ఏమీ చేయ‌ల‌ని స్థితికి దిగ‌జారారు. పిల్లి గోడ దాటుతుంది. దాట డం చూస్తే దాక్కుంటుంది.  జగన్మోహన్‌రెడ్డి ప్యాలెస్‌ పిల్లి. పిల్లి ఎప్పుడూ దాక్కుంటూ తిరుగుతుంది. పులిలా బయట తిరగదు. ఆయ న పొరపాటున బయటకు వస్తే షాపులు, ఇళ్లు మూసివేయిస్తారు. ఎవరూ లేకున్నా బయటకు వచ్చి చేతు లు ఊపుకుంటూ వెళతాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు.  అవును  జగన్‌ పిరికి వాడు. ఆయన ఏం చేయలేడు. దాక్కునే  ఉంటాడు. ఉండే కొద్దీ దానికి వెచ్చ‌గా బాగానే ఉంద‌నుకుని, అలానే ఉండిపోతాడు.  జ‌గ‌న్ కూడా అదే భావ‌న‌లో ప‌డిపోయాడా?  రాజ‌కీయ విశ్లేష‌కులు కావ‌చ్చ‌నే అంటున్నారు. 

బీజేపీ నుంచి స్వామిగౌడ్, దాసోజు జంప్.. కారెక్కిన నేతలు

భూమి గుండ్రంగా ఉంది అని చెప్పడానికి కోపర్నికస్ ప్రతిపాదనల దాకా వెళ్లక్కర్లేదు రాజకీయ నాయకుల విన్యాసాలను చూస్తే సరిపోతుంది. తిరిగి తిరిగి ఎక్కడ బయలుదేరారో అక్కడే చేరుతున్న రాజకీయ నేతలు తమ చర్యల ద్వారా భూమి గుండ్రంగానే ఉంటుందని నిరూపించేస్తున్నారు. తాజాగా తెలంగాణలో శుక్రవారం (అక్టోబర్ 21) చోటు చేసుకున్న రెండు పరిణామాలను గమనిస్తే రాజకీయ నాయకులు స్థిరంగా ఉండరనీ పార్టీలు మారుతూ మారుతూ తిరిగి తాము ఏ పార్టీలో అయితే మొదట తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో అక్కడికే వచ్చి చేరుతారనీ తేటతెల్లమౌతుంది.  శుక్రవారం ఇద్దరు నాయకులు బీజేపీకి రాజీనామా చేసి తెరాస తీర్థం పుచ్చుకున్నారు   వారు తొలుత ఏ పార్టీతో అయితే ప్రజాజీవితంలోకి వచ్చారో తిరిగి తిరిగి  అదే పార్టీ గూటికి చేరుకున్నారు. హోం కమింగ్ అన్నమాట. వారిరువురూ ఎవరో కాదు.. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జేఏపీ కన్వీనర్ గా పని చేసి, రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణ శాసన మండలికి తొలి చైర్మన్ గా పని చేసిన స్వామి గౌడ్, మరొకరు దాసోజు శ్రవణ్ కుమార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దాసోజు శ్రవణ్.. అప్పట్లో చిరంజీవి సమైక్యాంధ్ర తమ పార్టీ విధానం అని ప్రకటించడంతో విభేదించి తెరాస గూటికి చేరారు. అయితే 2014 ఎన్నికలలో తెరాస ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ ఆయనకు గత ఎన్నికలలో ఖైరతాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. అయితే ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలైనా.. ఆయన విద్వత్తును, వాగ్ధాటిని గుర్తించి  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిథి హోదా ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత పెద్దగా గుర్తింపు ఇవ్వడం లేదని భావించిన దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. అలా చేరి నిండా రెండు నెలలు పూర్తయ్యిందో లేదో.. బీజేపీకి గుడ్ బై చెప్పి తెరాస తీర్థం పుచ్చుకున్నారు.  తిరిగి తిరిగి సొంత గూటికి చేరిన వీరిరువురికీ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కండువాలు కప్పి గులాబీ పార్టీ సాదరంగా ఆహ్వానం పలికింది. ఇరువురూ కూడా కమలానికి గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరిన సందర్బంగా ఇంత కాలం తాము ఉన్న బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరువురూ కూడా దాదాపుగా తెలంగాణ ఆకాంక్షల మేరకు బీజేపీ పని చేయడం లేదనే విమర్శించారు. గతంలో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే సమయంలో కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ ఆంకాంక్షల మేరకు టీఆర్ఎస్ పని చేయడం లేదు కనుకనే గులాబీ గూటిని వీడి కమలం నీడకు వెళుతున్నామన్నారు. స్వామి గౌడ్ అయితే 2020లో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇప్పటి వరకూ అదే పార్టీలో కొనసాగారు. శ్రవణ్ కుమార్ మాత్రం తన జంపింగ్ టాలెంట్ ను కేవలం రెండు నెలల్లోనే ప్రదర్శించారు. బీజేపీలో బీసీలకు స్థానం లేదనీ, అంతే కాకుండా సొమ్ము వెదజల్లి మునుగోడు ఉప ఎన్నికలో గెలవడం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు జుగుప్సాకరంగా ఉన్నాయనీ పేర్కొన్నారు. ఇక పరిశీలకులు వీరి చేరికలపై తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా బీజేపీని వీడి ప్రముఖ నేతలు కారెక్కారనీ.. కానీ ఆ రెండు ఉప ఎన్నికలలోనూ కారు టైర్ పంక్చరైందనీ, బీజేపీ విజయం సాధించిందనీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇరువురి నేతలూ మునుగోడు ఉప ఎన్నిక ముంగిట కారెక్కుతున్నారనీ.. మరి దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితమే రిపిట్ అవుతుందా అంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక ముంగిట బీజేపీ నుంచి ఇరువురు నేతలు టీఆర్ఎస్ గూటికి చేరడం కమలం పార్టీకి ఎదురుదెబ్బగానే పరిశీలకులు చెబుతున్నారు.  కాగా బూర నర్సయ్య గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో తెరాస అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వీరిరువురికీ ఫోన్ చేసి మరీ తెరాసలోకి ఆహ్వానించారని చెబుతున్నారు. అలాగే రానున్న రోజులలో కూడా మరింత మంది బీజేపీ నుంచి తెరాస గూటికి చేరేలా ఆపరేషన్ ఆకర్ష్ కు కేసీఆర్ తెరలేపారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

బూమ్రా లేడ‌ని  కంగారొద్దు.. ట్రస్  45 రోజుల‌కే దిగిపోయింది!

బ్రిట‌న్ ప్ర‌ధాని లిజ్ ట్ర‌స్ న‌ల‌భ‌యి ఐదు రోజుల అధికారం త‌ర్వాత త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇది బ్రిటీష్ చ‌రిత్ర‌లో చెప్పుకోద‌గ్గ సంఘ‌ట‌న. భార‌త్ మాజీ క్రికెట‌ర్ వాసిమ్ జాఫ‌ర్ దీన్ని గురించి ట్వీట్ లో స‌ర‌దా కామెంట్ చేశాడు. ఇపుడు ఇది ఎంతోమందిని ఆక‌ట్టుకుంటోంది. ఊహించ‌నివిధంగా  అన్నీ వేగంగా జ‌రిగిపోతున్న స‌మ‌యంలో టీమ్ ఇండియా పెద్ద‌గా కంగారుప‌డ‌న‌వ‌స‌రంలేద‌న్నాడు. భార‌త్ జ‌ట్టుకు సూప‌ర్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బూమ్రా  గాయాల కార‌ణంగా భార‌త్ జ‌ట్టుకు ఎంపిక కాలేదు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో ఆరంభ‌మ‌యిన టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌కు వెళ్లిన జ‌ట్టులో బూమ్రా లేడ‌ని క్రికెట్ పండితులు, అభిమానులతో పాటు బీసీసీఐ కూడా విచారం వ్య‌క్తం చేసింది. బూమ్రా ఈ టోర్నీలో త‌ప్ప‌కుండా ఉండా ల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఆసీస్ పిచ్‌ల మీద అత‌ను విరుచుకుప‌డితే ప్ర‌త్య‌ర్థుల‌ను వొణికించి భార‌త్‌కు క‌చ్చితంగా విజ‌యాన్ని అందించ‌గ‌ల‌డ‌న్న అభిప్రాయాలే అంత‌టా విన‌ప‌డుతున్నాయి.  ఆస్ట్రేలియాలో ప్రారంభ‌మ‌యిన టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ పోటీల మీద విశ్లేష‌ణ చేస్తూ ఇంగ్లండ్‌కు ప్ర‌ధాని లేరు గ‌నుక‌  150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయ‌గ‌ల పేస‌ర్ భార‌త్‌కు అక్క‌ర్లేదని జాఫ‌ర్ కామెంట్ చేశాడు. పాకిస్తా న్‌కు మంచి ఫినిష‌ర్ అవ‌స‌రం లేద‌ని, న్యూజిలాండ్‌కు ఆస్ట్రేలియాలో మంచి రికార్డు లేద‌ని, శ్రీ‌లంక జ‌ట్టులో అనుభ‌వ‌జ్ఞులు లేర‌ని,  ట్ర‌స్ 45 రోజుల‌కే ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేసింది గ‌నుక ఇంగ్లాండ్‌కి ప్ర‌ధాని లేర‌ని వ‌సీం జాఫ‌ర్ ట్వీట్ చేశాడు. అంతా ఊహించిన‌దానికంటే విరుద్ధంగా జ‌రిగి పోతున్నాయి, భార‌త్ కంగారుప‌డ‌న‌వ‌స‌రం లేద‌న్నాడు.  ఈరోజుల్లో ఊహించ‌ని సంఘ‌ట‌న‌లే ఎక్కువ జ‌ర‌గ‌డం గ‌మ‌నిస్తున్నామ‌నేది ట్ర‌స్ రాజీనామా రుజువు చేసిం ది. 47 ఏళ్ల ట్ర‌స్ కేవ‌లం 45 రోజుల‌కే ప‌ద‌వి వ‌దిలేశారు. అంత‌కుముందే జూలైలో బోరిస్ జాన్స‌న్ అనేక వివా దాల్లో చిక్కుకుని ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి దిగిపోయారు. ఆ ప‌ద‌విలోకి రావ‌డినికి లిజ్ భార‌త సంత‌త‌కి చెందిన రిషీ సునాక్ నుంచి గ‌ట్టి పోటీనే ఎదుర్కొన్నారు.

పీ.కే.వి  పిల్ల చేష్ట‌లు... నీతిష్ కుమార్‌

తాను రాజ‌కీయ విశ్లేష‌కుడిన‌ని, వ్యూహ‌క‌ర్త‌న‌ని భారీ ప్ర‌చారం చేసుకుంటూ దేశంలో అన్ని పార్టీల ద‌శ దిశా మార్చ‌గ‌ల వ్యూహ‌క‌ర్త‌న‌ని భారీ ప్ర‌చారం చేసుకుంటున్న ప్ర‌శాంత్ కిషోర్ బీహార్ విష‌యంలో ఏమీ చేయ లేకపోయాడని పైగా అంతే అగౌర‌వంగా నీతిష్ కుమార్ కి దూర‌మ‌య్యాడనే ప్ర‌చారం ఉంది. ఆయ‌న‌కు ఎంతో స్వేచ్ఛ‌గా మాట్లాడేస్తుంటార‌ని, వాటిని అంతా లెక్క‌లోకి తీసుకోవాల‌న్నట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తుంటార‌న్న ప్ర‌చారం ఉంది. కానీ ఆయ‌న్ను పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని నీతిష్ అన‌డం గ‌మ‌నార్హం.  త‌న‌కు బీజేపీతో ర‌హ‌స్య‌సంబంధాలు ఉన్నాయ‌ని  రాజ‌కీయ విశ్లేష‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ ఆరోపించ‌ డాన్ని బీహార్ ముఖ్య‌మంత్రి నీతిష్ కుమార్ త‌ప్పికొట్టారు. కిషోర్ యువ‌కుడు, అత‌ను త‌న‌కు తోచిన‌ట్టు ఏదో ఒక‌టి ఏదో ఒక‌టి మాట్లాడేస్తుంటాడ‌ని అన్నారు. శుక్ర‌వారం నీతిష్ మీడియాతో మాట్లాడుతూ, ప్ర‌శాంత్ కిషోర్ త‌న ప‌బ్లిసీటీ కోసం ఏద‌యినా మాట్లాడేస్తుం టాడ‌ని, అత‌న్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, అస‌లు అత‌ని గురించి త‌న వ‌ద్ద ప్ర‌స్తావించ‌వ‌ద్ద‌ని అన్నారు. అత‌ను చిన్న‌వాడ‌యినా ఎంతో మ‌ర్యాదిచ్చాన‌ని,  కానీ అత‌ను అగౌర‌వంగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిన‌దే న‌న్నారు.  బీజేపీతో విడిపోయిన త‌ర్వాత నీతిష్ కుమార్ ఆర్జేడీ తేజ‌స్వినీ యాద‌వ్‌తో మ‌ళ్లీ జ‌త‌క‌ట్టార‌ని పీకే వ్యాఖ్యా నించారు. 2017లో ఆర్జేడిని ముంచే బీజేపీతో చేతులు క‌లిపార‌ని విమ‌ర్శించారు.  బీజేపీకి వ్య‌తిరేకంగా జాతీయ పార్టీల‌ను ఒక‌టి చేసే య‌త్నం చేస్తున్న‌ట్టు క‌న‌ప‌డిన్ప‌టికీ, రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్‌ప‌ర్స‌న్ హ‌రి వంశ్ మ‌ద్ద‌తుతో  బీహార్ ముఖ్య‌మంత్రి మ‌రో వంక బీజేపీతో సంబంధాలు కొన‌సాగించార‌ని పీకే  ఆరో పిం చారు. నీతిష్ తీరును ప్ర‌జ‌లు గుర్తుపెట్టుకోవాల‌ని నీతిష్‌ అవ‌స‌రార్ధం స్నేహాలు చేస్తుంటార‌ని రాజ కీయ వ్యూహ‌క‌ర్త  బీహార్‌యాత్ర‌లో అన్నారు. నీతిష్ 17 ఏళ్ల పాల‌న‌లో 14 సంవ‌త్స‌ర‌లు బీజేపీ మ‌ద్ద‌తుతోనే సాగింద‌ని విమ‌ర్శించారు.  కాగా, నీతిష్ కుమార్ జెడీయూ కి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌ని, అర్ధంలేని విమ‌ర్శ‌ల‌కు పాల్ప‌డుతున్న కారణంగానూ ప్ర‌శాంత్ కిషోర్‌ను 2020 జ‌వ‌రిలోనే నీతిష్ వ‌దిలించుకున్నారు. 

పాదయాత్ర సజావుగా సాగాలి..అందుకు పోలీసులదే బాధ్యత.. హైకోర్టు తీర్పు

ఏపీలో ఇప్పుడు పొలిటికల్ సిట్యువేషన్ క్రిటికల్ గా ఉంది. అమరావతి వర్సెస్ మూడు రాజధానులపై పొలిటికల్ మ్యాచ్ హోరోహోరీగా సాగుతోంది. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజా మద్దతు ఉండగా.. వైసీపీ మూడు రాజధానుల పోరాటానికి అధికారులు దాసోహమంటూ అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తడమే తన విధి అని భావిస్తున్నారు. అమరావతి రైతులది స్వచ్ఛంద పోరాటం అయితే  మూడు రాజధానుల ఐకాస పేరుతో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమం. ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి అమరావతి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలో జగన్ సర్కారు ఉంది. అయితే ప్రజా మద్దతుతో అమరావతి రైతులు తమ పాదయాత్రను దిగ్విజయంగా సాగిస్తున్నారు. కానీ దారిపొడవునా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ముళ్లు, రాళ్లూ రప్పలు, నీళ్ల సీసాలు దాడులు, అల్లరిమూకల దుర్భాషలను తట్టుకొని ముందుకు సాగుతున్నారు. అయితే తాము తలపెట్టిన మహా ఉద్యమం.. చివరి గమ్యానికి చేరుకునే సమయానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తున్న అమరావతి రైతులు మరోసారి న్యాయస్థానాన్నిఆశ్రయించారు. రైతులపాదయాత్రకు అడ్డంకులపై హైకోర్టు సీరియస్ అయ్యింది.  ప్రస్తుతం అమరావతి రైతు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. కొద్దిరోజుల్లో విశాఖలో అడుగు పెట్టనుంది. విశాఖ క్యాపిటల్ రాజధాని వద్దంటూ చేపడుతున్న అమరావతి రైతులకు విశాఖపట్నంలో అడుగుపెట్టే హక్కు లేదంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరికలుజారీ చేస్తున్నారు. పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకూ వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలోనే మహాపాదయాత్ర విశాఖ చేరుకునే సరికి శాంతి భద్రతల సమస్య సృష్టించైనా యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తున్నదన్న అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. దీంతో అమరావతి పరిరక్షణ సమితి, రైతులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు రైతులకు ఎటువంటి అవాంతరాలూ లేకుండా పోటీగా ఇతరులెవరూ నిరసన తెలపకుండా పోలీసులే చర్యలు తీసుకోవాలని విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.   మహాపాదయాత్రను అడ్డుకుంటున్నారంటూదాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం రెండు రోజుల పాటు విచారించిన హైకోర్టు పాదయాత్ర సజావుగా సాగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కోర్టు ముందు వివరాలు ఉంచాలని గురువారం న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టుకు ఇరుపక్షాలు వివరాలను సమర్పించాయి.  ఇరువైపుల వాదనలు, వారు సమర్పించిన వివరాలను పరిశీలించిన న్యాయస్థానం శుక్రవారం (అక్టోబర్ 21) తీర్పు వెలువరించింది. పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని.. మద్దతు తెలిపేవారు రోడ్డుకు ఇరువైపుల ఉండి సంఘీభావం తెలపాలని పేర్కొంది. గతంలో పాదయాత్రలో పాల్గొనేందుకు ఏయే వాహనాలకు అనుమతి ఉందో ఆ వాహనాలు  మాత్రమే పాదయాత్రలో ఉండాలని పేర్కొంది. ఇక రైతుల పాదయాత్ర సజావుగా జరిగేలా, వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులే చర్యలు తీసుకోవాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.  

కాంగ్రెస్ ను ఓడించండి.. రేవంత్ ను సాగనంపండి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియోలీక్

తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ టీపీసీసీ చీఫ్ ఎందుకు కన్నీటి పర్యంతమయ్యారో అర్ధమైపోయింది. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటమి కోసం పార్టీలోని సీనియర్లే గుట్టుగా పని చేస్తున్నారన్నది తేటతెల్లమైపోయింది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి పార్టీలోనే కొందరు గట్టిగా పని చేస్తున్నారనడానికి ఆధారం వెలుగులోకి వచ్చింది. మునుగోడులో కాంగ్రెస్ పరాజయ భారాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ పై మోపి.. ఆయనను ఆ పదవి నుంచి దించేయడానికి తెరవెనుక కుట్ర ఓ ఆడియో లీక్ ద్వారా బహిర్గతమైంది.  మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడి గెలుపు కోసం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారా అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. స్టార్ క్యాంపెయినర్ అయి ఉండి కూడా మునుగోడులో ప్రచారానికి రానని ప్రకటించడం. నియోజకవర్గంలో అడుగుపెట్టనని శపథం చేయడమే కాకుండా.. చీటికీ మాటికీ టీపీసీసీ చీఫ్ రేంవత్ రెడ్డి పై విమర్శలు గుప్పించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ స్టాబింగ్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగీ లీక్ అయిన ఒక ఆడియో ఆ అనుమానాలన్నీ వాస్తవమేనని నిర్ధారించాయి. మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డికి ఓటేసి గెలిపించాలంటూ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాట్లాడిన ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే.. ఆటోమేటిగ్గా తానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానంటూ ఆయన ఫోన్ లో మాట్లాడిన మాటల తాలూకూ ఆడియో లీక్ అయ్యింది. ఒక సారి తాను టీపీసీసీ అధ్యక్షుడినైతే రాష్ట్రమంతా పాదయాత్ర చేసైనా సరే కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తానని ఆయన చెప్పడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపించింది. అంతే కాదు.. పార్టీలను పట్టించుకోకుండా తన సోదరుడు రాజగోపాల రెడ్డికి ఓటేయండి.. ఏమైనా ఉంటే నేను చూసుకుంటానంటూ రాజగోపాలరెడ్డి అనడం ఆ ఆడియోలో వినిపిస్తోంది.  

మ‌గాళ్ల‌కేనా.. మాకూ పైస‌లెక్కువియ్యండి!

పెళ్లి ప‌నుల‌కు పిలిపించుకున్న‌వారికి కావ‌ల‌సిన‌వ‌న్నీ స‌మ‌కూర్చాల్సిందే..అద‌నంగా కొంత డ‌బ్బులు, మందు అన్నీను. లేక‌పోతే వాళ్లు స‌రిగా ప‌నిచేయ‌రు, ఇత‌ర‌ల్నీ చేయ‌నీయ‌రు. అస‌లు ప‌ని కంటే వీరిని క‌నిపెట్టుకోవ‌డం పెద్ద ప‌ని అవుతుంది పెళ్లివారికి. ఇపుడు మునుగోడులో రాజ‌కీయ‌పార్టీల వారి ప‌రిస్థితి కొంత ఇలానే ఉంది. చిన్న‌చిన్న ప‌నులు చేయ‌డానికి పెట్టుకున్న రోజూవారి కూలీలు కాస్తంత ఎక్కువ పైస‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అందునా మ‌హిళ‌లు. మ‌గ‌వారితో స‌మానంగా మాకూ ఇవ్వా ల‌ని అంటున్నారు.  అస‌లే ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో,  అభ్య‌ర్ధికి భారీప్ర‌చారం చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఇంటింటికీ తిర‌గ‌డం లో బిజీ అయిన లోక‌ల్ నాయ‌కుల‌కు ఇపుడు రోజూవారీ ప‌నులు చేస్తున్న ప‌నివారితో త‌ల‌నొప్పులు మొద‌లయ్యాయి. మునుగోడులో అక్క‌డి ప‌నివారికి రోజూ కూలీతో పాటు లిక్క‌ర్‌, చిక‌న్ బిర్యానీ త‌ప్ప‌కుండా ఇస్తున్నారు. రోడ్‌షోలు, మిని స‌మావేశాలు, ఇంటింటికీ ప్ర‌చారంలో స‌హాయం చేస్తున్న‌ వారికి ఇదంతా బాగా సాగుతోంది. కానీ ఇదే ప‌నులు చేస్తున్న మ‌హిళ‌ల విష‌యంలో అద‌నంగా ఏమీ ఇవ్వ‌డంలేద‌ని వారు తిరగబ‌డుతున్నారు. వారికి మంచి తిండి పెట్టించాల‌ని, లిక్క‌ర్‌తో పాటు అద‌ నంగా పైస‌లు  ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఏమి చేసినా, ఏమి డిమాండ్ చేసినా నాలుగు డ‌బ్బులు సంపాదించుకునే స‌మ యం ఇదేన‌న్న‌ది వారికి తెలియ‌క కాదు. కానీ వారిని నిర్ల‌క్ష్యం చేస్తున్న ప్రాంతీయ నాయ‌కుల‌కు అది తెలిసేలా చేస్తున్నారు రోజూవారి స‌హాయ‌కులు. ముఖ్యంగా 50, 60 వ‌య‌ సులో ఉన్న‌వారంతా పార్టీలు, నాయ కుల‌తో తేడా లేకుండా వారితో ఎవ‌రు ప‌నిచేయించు కుంటున్నా గ‌ట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం త‌గ్గినా అక్క‌డి పార్టీ ఇన్‌ఛార్జిల‌తో వాద‌న‌కూ దిగుతున్నారు.  మ‌గాళ్ల‌కేమో పైస‌లిప‌స్తున్న‌రు, మందూ పోయిస్తున్న‌రుగ‌దా..మాకు క‌నీసం ఇచ్చే పైస‌ల‌న్నా జ‌ర ఎక్క‌వ ఇయ్యాలిగ.. అని ప‌క్క గ్రామాల నుంచి ఇక్క‌డ ప‌నుల‌కు వ‌స్తున్న మ‌హిళలు మునుగోడులు రాజ‌కీయ పార్టీల ఇన్‌ఛార్జ్‌ల‌ను క‌ద‌ల‌నీయ‌డం లేదు.  మునుగోడులో ల‌క్ష‌కు పైగా మ‌హిళ‌ల ఓట‌ర్లున్న కార‌ణంగా ఈ ప‌ర్యాయం వారిని ఆక‌ట్టుకోవ‌డానికి స్వ యం స‌హాయ‌క గ్రూప్‌ల‌ను కూడా రాజ‌కీయ‌పార్టీలు వినియోగించుకుంటున్నాయి. ప్ర‌ధాన పార్టీలు మును గోడులో పెద్ద పెద్ద స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తు, ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి రోజూవారీ కూలీ చెల్లిస్తూ ఎంద‌రో స‌హాయ‌కుల‌ను ఉపయోగించుకుంటున్నాయి.

విశాఖ రామానాయుడు స్టూడియోను బెదరించి రాయించేసుకున్నారా?

ఆ స్టూడియో ఇప్పుడు రామానాయుడు కుమారుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అధీనంలో లేదా? అంటే తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  అయ్యన్నపాత్రుడు ఔననే అంటున్నారు.  ఆ స్టూడియోపై సీఎం జగన్ సతీమణి భారతి కన్నుపడిందనీ, వెంటనే దానిని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైందనీ అన్నారు.   గతంలో కూడా విశాఖలోని రామానాయుడు స్టూడియో ను స్వాధీనం చేసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రక్రియ ఏమయిందో కూడా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు చేతులు మారిపోయిందని అయ్యన్నపాత్రుడు చెబుతున్నారు. దగ్గుబాటి సురేష్ బాబును పిలిపించుకుని మరీ బెదరించి కాగితాలపై సంతకాలకు చేయించుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తాను ఈ విషయంలో దగ్బుబాటి సురేష్ బాబుతో మాట్లాడాననీ, బెదిరిస్తున్నారు. ఏం చేయమంటారు అందుకే సంతకాలు పెట్టేశానని ఆయన తనకు చెప్పారని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన  ఈ విషయాలను ఏదో ప్రైవేటు సంభాషణలో చెప్పలేదు. మీడియా ముఖంగానే చెప్పారు. విశాఖలో జనసేనాని పర్యటన సందర్భంగా జరిగిన గొడవకు సంబంధించి అరెస్టయిన జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన జైలు వద్దకు వచ్చారు. జనసేన కార్యకర్తలను కలిసేందుకు ముందు అనుమతి ఇచ్చిన జైలు అధికారులు ఆ తరువాత అనుమతి లేదు పొమ్మన్నారనీ అయ్యన్నపాత్రుడు చెప్పారు. జైలు వద్ద విలేకరులతో మాట్లాడిన ఆయన రామానాయుడు స్టూడియో కబ్జా గురించి చెప్పారు.  అలాగే విశాఖలో భూ కబ్జాల గురించి కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

పవన్ కు జగన్ భయపడుతున్నారా?.. తెలుగుదేశంతో జనసేన పొత్తు సంకేతాలతో గాభరా పడుతున్నారా?

జగన్ లో పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధమౌతున్నారన్న భయంతో ఏపీ సీఎం జగన్ వణికి పోతున్నారా?.. అందుకే ఎంత పెద్ద సమస్య ప్రభుత్వాన్ని కుదిపేసేంతగా ప్రకంపనలు సృష్టించినా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని జగన్.. పన్నెత్తి సమస్యల గురించి ప్రస్తావని సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలో  పార్టీ క్యాడర్ సమావేశంలో చేసిన ప్రసంగంపై స్పందించారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి పార్టీ పరువును, ప్రభుత్వ పరువునూ కూడా మూసీ నదిలో కలిపేసిన సందర్భంలో కూడా పన్నెత్తి మాట్లాడని జగన్ పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించి.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించడంపై స్పందించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అయినా తెలుగుదేశం, జనసేనల మధ్య అవగాహన కుదిరితే.. వచ్చే ఎన్నికలలో వైసీపీ కథ ముగిసిపోతుందని బయపడుతుండటం వల్లనే జగన్ పవన్ వ్యాఖ్యలపై ఎదురుదాడికి తానే స్వయంగా పూనుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ మంగళగిరి సమావేశంలో ప్రదర్శించిన ఆవేశం, వైసీపీ నేతలపై చేసిన విమర్శల వర్షం వైసీపీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని జగన్ భావిస్తున్నారనీ, అందుకే వాటిని తిప్పికొట్టడానికి తానే స్వయంగా రంగంలోకి దిగారని అంటున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన వీరావేశం రాష్ట్ర రాజ కీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు. ఇంత కాలం వైసీపీ నేతల నోటి దురుసుకు భయపడో.. వారంత అసహ్యంగా మాట్లాడటం మర్యాద కాదనో ఇతర పార్టీలన్నీ ఒకింత మౌనంగానే ఉన్నాయి. ఎప్పుడైతే పవన్ వైసీపీవి ప్రేలాపనలంటూ.. ఇష్టారీతిగా నోరు పారేసుకుంటే తాను అదే స్థాయిలో విరుచుకుపడతానని హెచ్చరించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక వైసీపీ వారి దుర్బాషలను మౌనంగా సహించే పరిస్థితి ఉండదని అన్ని పార్టీల వారూ ప్రతి విమర్శలకు పదును పెడతారని జగన్ కు అర్ధమైపోయింది. అందుకే పవన్ పై తన మంత్రుల చేత ఎదురు దాడి చేయించి ఊరుకుంటే సరిపోదని భావించి సీఎం జగనే తన నోటికి పని చెబుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైకాపా నేతల భాషతో పోలిస్తే పవన్ మాటల్లో అభ్యంతర పెట్టవలసినంత బూతు లేదు. కానీ ఎందువల్లనో ఆ మాటలు జగన్ మనసుకు అవి ములు కులుగా గుచ్చుకొన్నాయి. పవన్ చెప్పు చూపింది తనకే అన్నంత ఆగ్రహం రగిలింది ఆయనలో. దానితో ఇక మంత్రులు, ఎమ్మెల్యేలతో పని లేదు, నేరుగా తానే రంగంలోకి దిగి, లెక్క తేల్చేస్తానని శపథం పట్టాడు. సాధారణంగా ఎంత పెద్ద రాజకీయ రగడ జరిగినా ఇల్లు వదలి బయటకు రావడం, విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం జగన్ నైజం కాదు. అనుచరులు చెలరేగిపోతుంటే తాను చిద్విలాసంగా నవ్వులు చిందించడం ఆయన తీరు. అసెంబ్లీలో వైసీపీ నేతల దుర్భాషలు చేసిన సందర్భంగానూ, పలు సందర్భాలలో కొడాని నాని, అనీల్ కుమార్ యాదవ్ వంటి వారు నోరేసుకుని విపక్ష నేతపై ఇష్టాను సారంగా చెలరేగిన సందర్భంలోనూ, అలాగే హస్తిన మద్యం కుంభకోణంలో తన సతీమణిపై ఆరోపణలు వచ్చిన సందర్బంలో కూడా జగన్ పన్నెత్తి మాట్లాడలేదు. నోరెత్తి  స్పందించలేదు. ఏదైనా అనుచరగణమే చూసుకోవాలన్న విధానాన్ని ఇంత కాలం అనుసరిస్తూ వచ్చారు. కానీ పవన్ విషయంలో మాత్రం ఆయనలో ఆ నిగ్రహం మటుమాయమైపోయింది. రాబోయే ఎన్నికలకు సన్నాహాలు చేసుకొంటున్న తనకు పవన్ కంట్లో నలుసు వలె మారారని ఆయన భావిస్తున్నారు. అన్నిటికీ మించి పవన్ వెనుక, ఆయన సమాజీక వర్గం సమీకరణ జరిగితే ఇక రాజకీయంగా వైసీపీకి నూకలు చెల్లినట్లే అవుతుందని జగన్ భావిస్తున్నారనీ, అందుకే ఆయనలో ఈ ఆగ్రహం, ఆవేశం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన, బీజేపీ కలిసి సాగితే జగన్ కు ఏం నష్టం ఉండదు. ఎటూ బీజేపీ పెద్దల ఆశీర్వాదం ఉంది కనుక జనసేన, బీజేపీల మైత్రి వల్ల అంతిమంగా తనకే లబ్ధి చేకూరుతుందన్నది జగన్ భావన. అయితే ఎప్పుడైతే జనసేన, తెలుగుదేశం దగ్గర అవుతున్నాయన్న సంకేతాలు కనిపించాయో జగన్ లో గాభరా మొదలైందనీ, ఓటమి భయం పట్టుకుందనీ విశ్లేషకులు అంటున్నారు. అందుకే జగన్ స్వయంగా నోరు చేసుకుని జనసేన అధినేత పైనా, ఆ పార్టీ తెలుగుదేశంతో జట్టు కట్టడంపైనా విమర్శల బాణాలు సంధించారంటున్నారు. ఆ రెండు పార్టీల కలయికను అడ్డుకోవడమే ఏకైక అజెండాగా ఇక జగన్ కార్యాచరణ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. 

మ్యాచ్ తో స‌మానంగా నెట్స్‌లో టీమ్ ఇండియా ప్రాక్టీస్‌

ఆస్ట్రేలియాలో ఆరంభ‌మ‌యిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో 23వ తేదీన భార‌త్ త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. భార‌త్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పాక్ పేస‌ర్ల‌ను ధీటుగా ఎదుర్కొన‌డానికి అంతే సీరియ‌స్‌గా పేసర్లతో  ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ప‌ర్యాయం పాక్ పై భారీ స్కోర్ చేయ‌డం పెద్ద ల‌క్ష్యంగా టీమ్ ఇండియా పెట్టుకుంది. ఏమాత్రం త‌గ్గేదేలే అన్న స్థాయిలో పాక్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపాల‌న్న ప‌ట్టుద‌ల‌తో భార‌త్ సూప‌ర్ స్టార్లు శ‌ర్మ‌, కింగ్ కోహ్లీ, రాహుల్ సిద్ధ‌ప‌డ్డార‌నే అనాలి. ఇటీవ‌లి సిరీస్‌ల్లో కింగ్ త‌న పాత ఫామ్‌లోకి తిరిగిరావ‌డం అర్ధ‌సెంచ‌రీలు చేయ‌డం జ‌ట్టుకు ఈ ప‌ర్యాయం కొండంత ధైర్యా న్నిస్తోంది. దీనికి తోడు ఇటీవ‌ల జ‌ట్టుకు మిడిల్ ఆర్డ‌ర్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ నిల‌క‌డ‌గా ఆడుతూ మంచి న‌మ్మ‌కం క‌లిగిం చాడు. కాగా, పాక్ పేస‌ర్లు అఫ్రిది, హ‌రిస్ రావుఫ్‌, న‌సీమ్ షా వ‌లె అంతే వేగంతో కుడి, ఎడ‌మచేతి వౌలింగ్ టెక్నిక్‌ను ధీటుగా ఎదుర్కొన‌డానికి, స్వింగ్‌ను అంతే స్థాయిలో ఎదు ర్కొని ప‌రుగులు రాబ‌ట్టేందుకు శుక్ర‌వారం నెట్స్‌లో రోహిత్ అంతే స్థాయిలో భార‌త్ నెట్ బౌల‌ర్ల‌తో ప్రాక్టీస్ చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే పాక్ స్టార్ పేస‌ర్ అఫ్రిదీకి మోకాటి గాయం కార‌ణంగా ఆడ‌టం లేద‌న్న వార్త భార‌త్‌కు కొంత ఆనంద‌దాయ‌క మ‌నే చెప్పాలి. అత‌ను ఊహించిన‌దానికంటే గొప్ప స్వింగ్ బౌల‌ర్‌గా అవ‌త‌రించాడ‌ని ప్ర‌పంచ‌క్రికెట్ పండితుల మాట‌. అది వాస్త‌వ‌మేన‌న్న‌ది ఇటీవ‌లి పాక్  ఆడిన సిరీస్‌లలో బ‌య‌ట‌ప‌డింది. అంతెందుకు గ‌త ఏడాది పాక్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించ‌డానికి ప్ర‌ధాన అస్త్రంగా అఫ్రిదీయే ఉప‌యోగ‌ప‌డ్డాడు.  ఆ మ్యాచ్ లో కెప్టెన్ శ‌ర్మ‌, కె.ఎల్ రాహుల్ వికెట్ల‌ను అత‌నే తీశాడు. ఈ ప‌ర్యాయం మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలి, వ్యూహాల గురించి జ‌ట్టు హెడ్ కోచ్ ద్రావిడ్‌తో కెప్టెన్ శ‌ర్మ చ‌ర్చించాడు. నెట్స్‌లో చాలా స‌మ‌యం గ‌డుపు తూ ఎంతో ప్రాక్టీస్ చేస్తున్న దినేష్ కార్తిక్ కంటే రిష‌బ్‌పంత్‌కు పాక్‌తో త‌ల‌ప‌డే తొలి మ్యాచ్‌లో అవ‌కా శాలు న్నాయ‌ని తెలుస్తోంది. అలాగే, ఇప్ప‌టికే గాయం కార‌ణంగా టోర్నీకి దూర‌మ‌యిన పేస‌ర్ బూమ్రా స్థానంలోకి వ‌చ్చిన ష‌మ్మీ నెట్స్‌లో ఎంతో శ్ర‌మిస్తున్నాడు. ఆసీస్‌తో త‌ల‌ప‌డిన వామ‌ప్ మ్యాచ్‌లో అనూ హ్యంగా చివ‌రి ఓవ‌ర్ వేసి 11ప‌రుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం నెట్స్‌లో బ్యాట‌ర్ల‌కు శార్దూల్ ఠాకూర్‌, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌లు బౌలింగ్ చేసి ఎంతో స‌హ‌క‌రిం చారు. వీరిద్ద‌రూ ప్ర‌స్తు తం ప్లేయింగ్ లెవెన్‌లో లేక‌పోయినా అవ‌స‌ర‌మైన క్ష‌ణంలో రంగంలోకి దిగ‌డానికి సిద్ద‌ప‌డుతున్నారు.  రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని భార‌త్ జ‌ట్టులో కె.ఎల్.రాహుల్‌, కోహ్లీ, సూర్య‌కుమార్‌, దీప‌క్‌హుడా, రిష‌బ్ పంత్‌, దినేష్ కార్తీక్‌, హార్దిక్ పాండ్యా, ఆర్‌.అశ్విన్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, భువ‌నేశ్వ‌ర్ కుమా ర్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, అర్ష‌దీప్‌, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఉన్నారు. 

కన్నీటి పర్యంతమైన రేవంత్.. మునుగోడు ఫలితం అర్ధమైపోయిందా?

కాంగ్రెస్ లో ఏదైనా జరగొచ్చు.. ఏమీ జరగకనూ పోవచ్చు. ప్రజాదరణ ఉన్న నాయకులను సొంత పార్టీ వాళ్లే కాళ్లు పట్టి కిందకు లాగేస్తారు. అందుకే అంటారు కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులెవరూ ఓడించాల్సిన అవసరం లేదు..ఆ పార్టీయే తన ఓటమిని లిఖించుకుంటుంది అని. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి అందరికీ తెలిసిందే. ఒక నాడు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధకారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రతి పక్ష హోదాకు పాకులాడాల్సిన పరిస్థితిని దిగజారిపోయింది. కేవలం రెండంటే రెండు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. మళ్లీ ఎన్నికలలో ఆ రాష్ట్రాలలోనైనా అధికారం నిలుపుకుంటుందా? అంటే ఆ పార్టీలో ఎవరూ ఆత్మవిశ్వాసంతో ఔనని చెప్పలేని పరిస్థితి. అటువంటి కాంగ్రెస్ అనూహ్యంగా తెలంగాణలో పుంజుకుంది. తెరాస, బీజేపీలతో దీటుగా తలపడి రాష్ట్రంలో అధికారంపై ఆశలు పెంచుకునే స్థాయికి ఎదిగింది. తెలంగాణలో నిర్వీర్యమై పోయిన కాంగ్రెస్ మళ్లీ పుంజుకుందంటే అందుకు కారణంఏమిటంటే.. ఎవరైనా ఠక్కున చెప్పే జవాబు రేవంత్ రెడ్డి అనే. అటువంటి రేవంత్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక ముందు కన్నీటి పర్యంతమయ్యారు. వాస్తవానికి రాజకీయ ప్రత్యర్థులపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేసే రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ప్రత్యర్థి పార్టీలతో కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులతో పోరాటానికే అధిక సమయం వెచ్చించాల్సిన పరిస్థితులలో పడ్డారు. ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో యువత నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగే పార్టీ సీనియర్లలో ఆయన పట్ల అసూయ పెంచిందని పరిశీలకులు అంటున్నారు.  రేవంత్ పార్టీని ప్రజలలోకి తీసుకువెళుతుంటే.. పార్టీకి రాష్ట్రంలో ఆదరణ పెరుగుతుంటే.. ఆ క్రెడిట్ రేవంత్ కు దక్కకుండా చేయడానికి పార్టీలో సీనియర్లుగా చెప్పుకునే నేతలు పన్నుతున్న కుట్రలు, సృష్టిస్తున్న అవాంతరాలను ఎదుర్కొనడంలో ఆయన విసిగిపోయారా అన్న అనుమానం కలుగుతోంది. అయితే పరిశీలకులు మాత్రం రేవంత్ కు మునుగోడు ఫలితం అర్ధమైపోయిందనీ, ఆయనను దెబ్బతీయడానికి పార్టీలోనే కుట్ర జరుగుతోందని.. దాని ఫలితమే రేవంత్ తాజా ఆవేదన అని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి ఇక తేరుకోలేకుండా పాతేసేందుకు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీతో కలిసి కుట్ర చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఇక అదే సమయంలో పీసీపీ అధ్యక్ష పదవి తనను వరించినందుకు పార్టీలోని కొందరు కక్ష కట్టి తనను ఒంటరి వాడిని చేశారని ఆవేదనా వ్యక్తం చేశారు. తనను అభిమానించే వారికీ, పార్టీ క్యాడర్ కు తన ఆవేదన తెలియజేస్తున్నన్న రేవంత్.. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఇక కేసీఆర్ అన్ని రోజులు హస్తినలో మకాం వేసి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేందుకు కేసీఆర్ బీజేపీ నుంచి సుపారీ తీసుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర ఫలితమే మునుగోడు ఉప ఎన్నిక అని రేవంత్ అభివర్ణించారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని  ఓడించి రేవంత్ రెడ్డిని పిసీసీ నుండి తొలగించాలని భారీ కుట్ర జరుగుతోందని రేవంత్ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ కుట్రలో కాంగ్రెస్ లోని కొందరు నాయకులకు కూడా భాగస్వామ్యం ఉందని రేవంత్ అన్నారు. 

న‌డ్డాకు స‌మాధి...ఫ్లోరోసిస్ బాధితుల ప‌నా?

ఆగ్ర‌హం, వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌డం కూడా ఇటీవ‌లి కాలంలో అర్ధ‌ర‌హితంగా, చాలా దారుణంగా మారిం ద‌న‌డానికి ఉదాహ‌ర‌ణే  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గుర్తుతెలియని వ్యక్తులు సమాధి కట్టడం. అయితే ఈ చ‌ర్య వెనుక రాజ‌కీయ కార‌ణాల కంటే ఆ ప్రాంతం లో ఫ్లోరోసిస్ బాధితులు త‌మ స‌మ‌స్య‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసింద‌ని, బీజేపీ హామీని నిల‌బెట్టుకోలేద‌న్న ఆక్రోశ‌మే ఆక్రోశ‌మే ప్ర‌ధాన కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  అయితే దీనిపై  కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.    యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం శివారు జాతీయ రహదారి పక్కన ఫ్లోరైడ్‌ పరిశోధనా కేంద్రానికి కేటాయించిన స్థలంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఫ్లోరైడ్‌ పరిశో ధనా కేంద్రాన్ని పశ్చిమ బెంగాల్‌కు తరలించడానికి నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానా లు న్నాయి. ఫ్లోరైడ్‌ కేంద్రానికి కేటాయించిన స్థలానికి వెళ్లే దారిలో మట్టితో సమాధి కట్టారు. దానిపై జేపీ నడ్డా ఫ్లెక్సీ పెట్టారు. అక్కడే ‘రీజినల్‌ ఫ్లోరైడ్‌ మిటిగేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌’ పేరుతో బ్యానర్‌ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం సమాధిని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీ సులు అక్కడికి చేరుకొని సమాధిని తొలగించారు. దీనిపై మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.  కాగా , రాష్ట్రంలోని 1,041 ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు కేంద్రం 2017లో రూ.700కోట్లు, అంతకుముందు ఏడా ది నీతి ఆయోగ్‌ ద్వారా రూ.95కోట్లు ఇచ్చిందని  కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వివరించారు. ఒక సీఎం ఒక గ్రామానికి ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉండటం ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్ప డుతున్నారని, తెలంగాణను కల్వకుంట్ల మాఫియా రాజ్యంగా మారుస్తున్నారని  ఆయ‌న మండి పడ్డారు.  2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా 2016 ఫిబ్రవరి 9న మర్రిగూడ మండలంలో పర్యటించారు. పరిశోధన కేంద్రం నిర్మాణం నత్తనడకన సాగుతుం డటంపై ఫ్లోరోసిస్‌ బాధితులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. అయితే, పరిశోధన కేంద్రం పనులు ప్రారంభం కాక పోగా దానిని పశ్చిమ బెంగాల్‌కు తరలిస్తూ అప్పటి కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. దీనిని నిరసిస్తూ బాధితులు ఆందోళనలు చేసినా ఫలితం లేదు. అప్పటి నుంచి ఈ భూమి నేష నల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ పేరుతో నిరుపయోగంగా ఉంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికతో పరిశోధన కేంద్రం మళ్లీ తెరపైకి వచ్చింది. 

ఈ స్నేహం తెగ‌ని బంధం!

లోకంలో స్నేహాలు చిత్రంగా ఉంటాయి. మ‌నిషికి జంతువుల‌కి, మ‌నిషికి ప‌క్షుల‌కీనూ! వాటి విశ్వాసం, స్నేహం పోని తెంచ‌లేని సంబంధాలు అర్ధంకావు. వాటి మ‌న‌సులో మాట చెప్ప‌లేవు..స్నేహం చేస్తున్న వారికే తెలియాలి. ప‌క్షులు మాట్లాడ‌తాయంటారు.. ఎలా? అన్న‌ది ఆ స్నేహితులే చెప్ప‌గ‌ల్గుతారు. రోజూ గింజ‌లు తిన‌డానికి వ‌చ్చే పావురం ఒక్క‌రోజు రాకుంటే పెద్దాయ‌న ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు, మంచినీళ్లు తాగ‌డానికీ ఆలోచిస్తాడు..అరే ఇది ఇవాళింకా రాలేదే అనుకుంటాడు! అదీ అంతే కిటికీ ఊచ‌ల‌కు ఊగు తూ .. ఈ ముస‌లాయ‌న ఇంకా క‌న‌ప‌డ‌లేదే అనీ అనుకుంటుంది..హాస్యం కాదు.. వారి స్నేహంలో అదో అందం.. చూసి తీరాలంతే! త‌నకే దిక్కులేదు ఇదొక‌టి నా వెంటే ప‌డుతోందనుకోలేదు చిన్న కుక్క‌పిల్ల‌తో బిచ్చ‌గాడు. కానీ మ‌ధ్యా న్నం అయ్యేస‌రికి క‌నీసం ఒక ముద్ద దానికీ పెట్ట‌డంతో వ‌ద‌ల్లేదు. ఆ బిచ్చ‌గాడు చ‌నిపోతే చొక్కాతో ప‌ట్టి లాగి కాస్తంత నీడ‌గా ఉన్న బ‌స్టాప్‌లో ప‌డేసి వీడి సంగ‌తి చూడ‌మ‌ని రోడ్డున‌పోయేవారికి మొరిగి మొరిగి మ‌రీ చెప్పింది. . అదీ విశ్వాసం. త‌ర్వాత అదీ రెండేళ్ల‌కి యాక్సిడెంట్‌లో చ‌నిపోయింది, స‌రిగ్గా దానికి అన్నం పెట్టిన వాడు చ‌నిపోయిన చోటే!  మ‌నం తినేట‌పుడు రెండు గింజ‌లు ప‌డేస్తే ప‌క్షులూ అదే స‌మ‌యానికి ప‌నిగ‌ట్టుకుని వ‌స్తూంటాయి. అదేదో న‌గ‌రంలో ప‌క్షుల రాజా అనేవాడుండేవాడు. అత‌ని పేరు ఎవ్వ‌రికీ తెలీదు. పావురాల‌న్నీ మ‌ధ్యాన్నానికి అత‌ని ద‌గ్గ‌రి వ‌చ్చి చేరతాయి. త‌ల‌మీద డాన్స్ చేస్తాయి. అత‌ను గ‌ట్టిగా న‌వ్వుకుంటాడు. జేబులోంచి ప‌ది గింజ‌లు విసిరితే అవి తినేసి వాటిప‌ళాన అవి ఎగిరిపోతాయి.. అత‌ను తృప్తిగా న‌వ్వుకుంటాడు. ఇది చిత్రంగా ఉండ‌వ‌చ్చు. కానీ అదో స్నేహ‌బంధం..త్వ‌ర‌గా అంద‌రికీ అర్ధం కాదు.  శ్రీ‌లంక బ‌ట్టిక‌లోవాలో ఒక వ్య‌క్తి  ఒక కొండ‌ముచ్చుకి రోజూ కాస్తంత తిండి పెట్టేవాడు. వారి స్నేహం కుది రి దింది. రోజూ తిండి పెట్టేవాడు. అత‌ను ఈమ‌ధ్య‌నే మ‌ర‌ణించాడు. ఆ రోజు  అత‌ని బంధువులు, తెలిసిన వారూ ఎంతో బాధ‌ప‌డ్డారు, శ‌వం ఇంటిముందు పెట్టారు. అంత‌లో ఒక్క ఉదుటున వ‌చ్చింది అత‌ని స్నేహితురాలు పెద్ద కొండ‌ముచ్చు. ఎంతో బాధ‌ప‌డుతూ చేత్తో గుండెల మీద కొడుతూ లేప‌డానికి ప్ర‌య త్నించ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇలాంటివి అరుదే.. కానీ ఆ బంధం అంత‌టితో తెగిపోదు. 

ఇక బీజేపీవారి రాజ‌సూయం!  

రాజసూయం అంటే ప్రాచీన భారతదేశపు రాజులు తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడానికి చేసే ఒక వైదిక క్రతువు. రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో ఈ యాగాన్ని నిర్వహిస్తారు. మహాభారతంలో ధర్మ రాజు రాజసూయ యాగం చేసినట్లు ప్రముఖంగా ప్రస్తావించబడి ఉంది. ఈ యాగం చివరలో ధర్మ రాజు శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇవ్వబోగా అందరూ అంగీకరించినా శిశుపాలుడు అంగీకరించక, కృష్ణుణ్ణి తులనాడతాడు. శ్రీకృష్ణుడు అతని నూరు తప్పులు క్షమించి తర్వాత తన సుదర్శన చక్రంతో సంహరి స్తాడు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో రాజకీయ రాజసూయ యాగం చేస్తామని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్‌ ప్రకటించారు. తమ పార్టీ ముఖ్యులతో కలిసి కేంద్రం పథకాలు, అభివృద్ధిని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. ఉప ఎన్నిక తర్వాత బీజేపీలో చేరి కలు వెల్లు వలా ఉంటాయని చెప్పారు. తెలంగాణలో సంక్షేమ పథకాల స్ఫూర్తి ప్రదాత ఎవరో త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా తెలంగాణాలో కేసీఆర్‌ను శిశుపాలునిగా భావించి వారి పాల‌న లోపాల‌ను ఫుల్ సౌండ్‌లో మైకుల్లో మ‌ళ్లీ మ‌రో మ‌రోసారి  ప్ర‌జ‌ల చెవులు చిల్లులు ప‌డేలా వినిపించి టీఆర్ ఎస్‌ను గ‌ద్దె  దించేయ మ‌ని యుద్ధానికి ఓట‌ర్ల‌ను స‌మాయ‌త్తం చేస్తుందిట‌. మును గోడు భారీ మెజారిటీతో గెలిచి ప్ర‌ధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ‌యాన్ని కానుక‌గా ఇవ్వ‌డానికి బీజేపీ శ్రేణులు ఇలా సిద్ధ‌మ‌వుతున్నార‌నే అనుకోవాలేమో! ముందుముఖ్యంగా,  మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ సమస్య లేదంటున్న మంత్రి హరీశ్‌, అక్కడ ఫ్లోరోసిస్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ఎందుకు అడుగుతున్నారో చెప్పాలని  బూర డిమాండ్‌ చేశారు. బీజేపీలో చేరాక గురువారం తొలిసారిగా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బూర.. మీడియాతో మాట్లా డారు. ఉద్యమ వ్యతిరేకులు, పక్క రాష్ట్రం నాయకులకు టీఆర్‌ఎస్‌ అడ్డాగా మారిందని విమర్శించారు. ప్రగతి భవన్‌లోకి వెళ్లాలంటే ప్రజలకు వీసా దొరకట్లేదని అన్నారు. ఉమ్మడి ఏపీలో కంటే కఠినమైన నిర్బంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు.  సినిమాల్లో ఒకప్పుడు సిల్క్‌ స్మిత పాపులర్‌. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డిని చూస్తే అదే అభిపాయ్రం కలుగుతోంది. లింగభేదం ఒక్కటే తేడా  అని అన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పై 2014 ఎన్నికల ముందు కేసీఆర్‌ చూపించిన సినిమా దృశ్యాలను మరిచిపోలేకపోతున్నానని నర్సయ్య తెలిపారు.

 బ్రెస్ట్ క్యాన్సర్ ..సుర‌క్షితం సర్జరీ

వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ౩౦ సంవత్సరాల లోపు స్త్రీలకు క్యాన్సర్ రావడం అరుదు. 4౦ ఎళ్ళలోపు స్త్రీలకు 217 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుందని  5౦ఏళ్ల‌ వయస్సు ఉన్న వారికి 5౦ మందిలో ఒకరికి వస్తుంద‌ని నిపుణులు పేర్కొన్నారు. సాధారణంగా  స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రిస్క్ ఫ్యాక్టర్ అధికంగా ఉంటాయి. సామాజికంగా ఆర్ధికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, వృత్తి వ్యాపారాలు చేసే స్త్రీలు, అవివాహితులు, పిల్లలు కలగని వారు,  వక్షోజంలో అసాధారణ లక్షణాలు కలవారు. నన్స్, ఆలస్యంగా పిల్లలు కలిగిన స్త్రీలకు వ‌చ్చే అవ‌కా శాలున్నాయి. ప్రసవ సమయంలో పాలు ఉత్పత్తి కాని స్త్రీలు. బిడ్డలకు పాలు ఇవ్వని స్త్రీలు, 12 ఏళ్ల లోపే రసజ్వల అయిన వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కొవ్వుపదార్ధాలు అధికంగా తినే స్థూల కాయం గల స్త్రీలు, దీర్ఘకాలం పాటు హార్మోన్లతో కూడుకున్న గర్భనిరోధక మాత్రలు వాడిన స్త్రీలు ఈ క్యాన్స ర్ బారిన పడచ్చు. దీనికి వ‌య‌సుతో నిమిత్తం లేదు.  స‌ర్జ‌రీ విష‌యానికి వ‌స్తే,  బ్రెస్ట్ క్యాన్సర్ కు శ‌స్త్ర‌చికిత్స ద్వారా బ్రెస్ట్ లోపల ఉన్న కణితను తొలగించ డం కాని అవసరమని భావించే బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించడం  చేస్తారు. కణితి 2 సెంటిమీటర్ల నుండి 5 సెం.మీ మధ్య ఉంటె కణితిని మాత్రమే తొలగించడం లేక బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించే మాసేక్టమి  శస్త్ర చికిత్చ చేస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్ మూడవాదశ లో బ్రెస్ట్ మొత్తాన్ని తొల గించడం తోపాటుగా శరీరం మొత్తం మీద పనిచేసే విధంగా హార్మోనల్ థెర‌పీ లేదా రెండిటినీ చేస్తారు. హార్మోనల్ వాడేందుకు వీలుకాని రోగులకు కీమో థెర‌పీ మాత్రమే వాడడం కుదురుతుంది. క్యాన్సరు ఎముకలలోకి వ్యాపిస్తే రేడియేషన్ వల్ల ప్ర‌యోజ న‌మేమంటే, నొప్పి వల్ల ఎముకలు విరిగి తే నొప్పికి విముక్తి క‌లిగించ‌వ‌చ్చు. సామాన్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మ‌ళ్లీ వచ్చేఅవకశాం ఉంది ట్యూమర్ హార్మోన్ కు స్పందిస్తుంది. ఇన్ని శస్త్ర చికిత్చలు జరిగిన తరువాత కూడా లాభం లేదనిపిస్తే చివరగా ఈ క్యాన్సర్ తో  పోరాడుతున్న వారు బ్రెస్ట్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ కు వెళ్ళడం సముచితమని ప్లాస్టిక్ సర్జన్లు సూచిస్తున్నారు. గుర్గావ్ కు చెందిన డాక్టర్ ఆదిత్య అగర్వాల్ మాట్లాడుతూ భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలాలో ఇంకా ఒక్క శాతం మాత్రమే బ్రెస్ట్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ పునర్నిర్మాణం గురించి అటు విద్యావంతులు  నిరక్షారస్యులకు బ్రెస్ట్ పునర్నిర్మాణం రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ గురించి చాలామందికి తెలియదు. కనీసం ఈ అంశం గురించి  అందరి ముందూ మాట్లాదేన్దేందుకు సిగ్గుపడుతున్నారు. వారివారి వివాహా సంబంధాలు దేబ్బతింటా ఏమో అన్న అనుమానం భయం వారిని వెంటాడుతూ ఉందవచ్చని డాక్టర్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. బ్రెస్ట్‌ క్యాన్సర్ తో పోరాడుతున్న సామాజికంగా,శారీరకంగా కొనసాగడం కష్టంగా మారుతుంది కారణం బ్రెస్ట్ పునర్నిర్మాణ సర్జరీపై అవగాహన లేకపోవడమే దీనిని పోస్ట్ మాస్టెక్టమి అంటే వక్షోజాలను తొలగిం చడం పునర్న్రిర్మాణం చేయడం మాత్రమే అని ఈ అంశంపై పెద్దేత్తున సదస్సు జరగడం ఇదే తోలి సారికవడం విశేషం. కింగ్ జార్జెస్ వైద్యక‌ళాశాల‌లో జరిగిన రెండురోజుల సదస్సులో 2౦ కి పైగా ప్లాస్టిక్ సర్జన్లు పాల్గొన్నారని  బ్రెస్ట్‌కాన్స‌ర్‌పై అంకాల‌జిస్టులు మాత్రమే పరిష్క రించగలరని పేర్కొన్నారు. వక్షో జాల పునర్ని ర్మాణం వల్ల రెండురకాల్ లాభాలు ఉంటాయని అగర్వాల్ అన్నారు. 

పాదయాత్రను అడ్డుకునేందుకు ధ్వంసరచనకు వైసీపీ వ్యూహం?

అమరావతే  రాజధాని అంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాయాత్రకు ప్రమాదం పొంచి ఉందా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. మహా పాదయాత్ర మరి కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు అధికార వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసిందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే సీఎం  జగన్, మూడు రాజధానులంటూ ప్రకటించేశారు. దీంతో విశాఖపట్నం మరి కొద్ది రోజుల్లో కార్యనిర్వాహక రాజధానిగా మారనుందని.. ఇక్కడి నుంచి సీఎం జగన్ పాలన చేయనున్నారంటూ.. ఆ పార్టీలోని కీలక నేతలు వరుస ప్రకటనలు చేసేస్తున్నారు.   ఈ నేపథ్యంలో రైతుల పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన వెంటనే.. శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే.. విశాఖలో కార్యనిర్వహాక రాజధాని ఏర్పాటు చేయాలంటూ అధికార పార్టీ చేపట్టిన విశాఖ గర్జన కు ప్రజల నుంచి స్పందన కరవవ్వడం అమరావతి నుంచి అరసవల్లికి రైతులు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తోందని పరిశీలకులు అంటున్నారు. రైతుల మహాపాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టడం, మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు పట్టించుకోకపోవడాన్ని గమనిస్తున్న  తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలు రైతుల మహాపాదయాత్ర విజయవంతంగా అరసవల్లి చేరుకుంటే..  మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలనే   డిమాండ్  మరింత బలంగా తెరమీదకు వస్తుందని భావిస్తున్నారు.  అదే జరిగితే  ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారుతుందన్న ఆందోళనా వారిలో వ్యక్తమౌతోంది. అందుకే అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు కల్పించాలని పార్టీ క్యాడర్ కు స్పష్టమైన సూచనలిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే రాజమండ్రిలో ఎంపీ భరత్ ఆధ్వర్యంలో దాడి జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల మహాపాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశించడంతోనే అలజడులు సృష్టించైనా ఆ యాత్రను అడ్డుకోవాలని విస్పష్టమైన ఆదేశాలను పార్టీ శ్రేణులకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందినట్లు చెబుతున్నారు.   ఇప్పటికే పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు విశాఖ, రాజమండ్రి, కాకినాడలో నిర్వహించారు.. మరికొన్ని చోట్ల నిర్వహించేందుకు సన్నాహాలు  చేస్తున్నారు. అలాగే రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ భారీ ఫ్లెక్సీలు సైతం రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. ఇక ఈ పాదయాత్రలో పాల్గొన్న వారంతా పెయిడ్ అర్టిస్టులు, రియల్టర్లు, చంద్రబాబు బినామీలంటూ అధికార పార్టీ గుప్పిస్తున్న విమర్శల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే విశాఖ రాజధాని కోసం వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాల డ్రామాకు సైతం తెరతీశారు. అయితే ఆ డ్రామా ఒక్క రోజులోనే తుస్సుమంది. ఇక విశాఖ గర్జన కోసం ఏర్పాటైన ఉత్తరాంధ్ర జేఏసీ గర్జన వైఫల్యం తరువాత ఏమైందో ఎవరికీ తెలియదు.   ఇలా ఉండగా అమరావతే ఏకైక రాజధాని అంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు అధికార వైసీపీ మినమా అన్ని రాజకీయ పార్టీలూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.  ఈ నేపథ్యంలోనే వైసీపీలో అసహనం పెచ్చరిల్లి ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీసీ గూండాలు ఉత్తరాంధ్రలో కోనసీమలోలా విధ్వంసానికి తెగబడే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు అయితే.. వైసీపీ విధ్వంసయత్నాలకు రాజమండ్రిలో మహాపాదయాత్రపై జరిగిన దాడి ఒక శాంపిలా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా విధ్వంస రచనకు అధికార పార్టీ వ్యూహాలు, ప్రణాళికలు రూపొందిస్తున్నదన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.